Horse Trading
-
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటంపై కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి -
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు
బంజారాహిల్స్: ఇంటీరియర్ వర్క్ చేయించుకొని తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు కోరె నందుకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన డాగా శ్రీనివాస్ కుమార్.. ఇంటీరియర్, ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిలింనగర్లో ఫిల్మీ జంక్షన్‌లోని డక్కన్ కిచెన్‌లో ఇంటీరియర్ వర్క్ కోసం శ్రీనివాస్‌తో నందు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది మేలో ఫ్యాబ్రికేషన్, సివిల్ వర్క్ పూర్తి చేసి రూ.27 లక్షల బిల్లు అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చిన నందు మిగతా మొత్తాన్ని త్వరలో ఇస్తానని చెప్పాడు. తర్వాత మిగతా రూ.17 లక్షలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడమే కాకుండా ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
సిట్‌కు జవాబులు చెప్పకుండా ఏడ్చేసిన ప్రతాప్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని 41–ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అంబర్‌పేటకు చెందిన న్యాయ వాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్, నిందితుడు నందుకుమార్ భార్య చిత్రలేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్‌కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్లను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాసించలేదని, మెసేజ్‌లు చేయ లేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసు లు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా జవాబు చెప్పకుండా దాటే శారు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా లాభం లేకపోవటంతో శనివారం కూడా విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఆయన్ను ఆదేశించారు. సోమవారం మరోసారి రండి..: నందు భార్య చిత్రలేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. ఆయా మెసేజ్‌లలో ఏ సమాచా రం ఉందని? ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి, వారెవరు? ఎందుకొచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురించి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటంతో, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరిగి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. హైకోర్టు ఆదేశించినా శ్రీనివాస్ గైర్హాజరు: శుక్రవారం సిట్ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను ఈ కేసులో ఏ–7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్! -
రామచంద్ర భారతి, నందులతో ‘రఘురామ’ చెట్టపట్టాల్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు.. ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ! జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి -
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ). పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు. ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు -
ఫామ్‌హౌజ్ వ్యవహారం.. ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్
సాక్షి, బెంగళూరు: తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకున్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు’’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిన్న(గురువారం) సాయంత్రం ప్రెస్మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీపై ఆగ్రహం.. ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ప్రసంగంతో పాటు మీడియాకు సమర్పించిన వీడియోలను కూడా ప్రకాష్ రాజ్ ట్యాగ్, పోస్ట్ చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా చేధించడం.. ఆపై కేసు నమోదు విచారణ.. కోర్టుకు చేరిన వ్యవహారం, తదనంతర పరిణామాలు.. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. Shameless Brokers from Delhi..killing democracy ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾರಿಕೊಂಡವರು.. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನೇ ಹಾರಾಜಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.. #LotusLeaks #justasking pic.twitter.com/w516YyTpoI — Prakash Raj (@prakashraaj) November 4, 2022 -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన మరో బెంచ్ ఈ మేరకు కీలక తీర్పును వెల్లడించింది. రిట్ పిటిషన్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులుగా ఉన్న ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల(నవంబర్) 4వ తేదీ వరకు గడువు విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు కేసులో విచారణ వాయిదా వేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. దర్యాప్తుపై స్టే విధించింది. అయితే అంతకుముందు హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ఆధారంగా.. రిమాండ్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని.. లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని సైబరాబాద్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏసీబీ కోర్టుకు వీళ్లను తరలించినట్లు తెలుస్తోంది. రెండు ధర్మాసనాలు వేర్వేరు తీర్పులివ్వడం.. ఒక బెంచ్ రిమాండ్‌కు తీసుకోవాలని ఆదేశిస్తే.. మరో బెంచ్ విచారణ వాయిదా వేయాలని ఆదేశించడం.. ఈలోపే సైబరాబాద్ పోలీసుల దూకుడుతో ఏం జరగనుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఈడీ ఆఫీస్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు! -
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని కోరింది. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్లో బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురిచేసే క్రమంలో భారీ ఆపరేషన్‌ను చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పిటిషనర్ పేర్కొనగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దర్యాప్తు ముమ్మరం మరోవైపు ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ కేసులో.. దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఫాంహౌజ్ లో క్లూస్ టీం తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ సీఐల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరన్న కోణంలో దర్యాప్తును సాగిస్తున్నారు. ఇప్పటికే ఆడియో, వీడియో సహా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
కేజ్రీవాల్ కీలక ప్రకటన.. బలపరీక్షకు సై
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలమైందని రుజువు చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఈమేరకు వ్యాఖ్యానించారు. ఒక్కక్కరికి రూ.20కోట్లు ఇచ్చి మొత్తం 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆపరేషన్ లోటస్ గురించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ అనుకున్నట్లు జరగలేదని, ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా ప్రలోభానికి లొంగలేదని కేజ్రీవాల్ అన్నారు. అది రుజువు చేసేందుకే విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం కాస్తా ఆపరేషన్ బురద అయిందని సైటెర్లు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి మొత్తం 277మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెళ్లారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వారికి ఒక్కొక్కొకరి రూ.20కోట్లు ఇచ్చి ఉంటే మొత్తం రూ.5,500 కోట్లు అవుతుందని లెక్కగట్టారు. సామాన్యుల డబ్బును ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే వాడటం వల్లే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సీరియల్ కిల్లర్‌లా వరుస ఖూనీలు చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెడుతూనే ఉంటుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులన్నీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేలను చీల్చాలని చూశారని, కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పారు. చదవండి: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్ -
హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం
జైపూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్రం పేరిట దుండగులు ఓ మహిళను మోసం చేశారు. సల్మాన్ గుర్రం అమ్ముతామని చెప్పి ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. డబ్బులిచ్చాక గుర్రాన్ని ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి దాదాపు పది నెలలైనా పట్టించుకోవడం లేదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళ సంతోశ్ భాటికి గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఆమె ఆసక్తిని గమనించిన ముగ్గురు మోసగాళ్లు ఆమెను సంప్రదించారు. హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన ఒక గుర్రం అమ్మకానికి ఉందని.. అది మీకు అమ్మి పెడతామని ఆమెను నమ్మించారు. ఈ సందర్భంగా ఆమెను నమ్మించేందుకు సల్మాన్‌కు చెందిన కొన్ని గుర్రాలను తాము గతంలో విక్రయించినట్లు చెప్పారు. దీంతోపాటు సల్మాన్ ఖాన్ గుర్రాలతో కలిసి దిగిన ఫొటోలు చూపించి ఆమెను నమ్మించారు. దీంతో ఆ గుర్రం కొనేందుకు ఆమె అంగీకరించింది. చర్చల అనంతరం చివరకు రూ.12 లక్షలకు గుర్రం ఇస్తామని మోసగాళ్లు చెప్పారు. ఇప్పుడు తక్కువకు కొని తర్వాత నీవు అధిక మొత్తానికి విక్రయించుకోవచ్చని అత్యాశపెట్టారు. వారి మాటలను నమ్మి బుట్టలో పడిన ఆమె రూ.11 లక్షల నగదు, రూ.లక్ష చెక్ ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకుని వెళ్లిన ముగ్గురు ఎంతకీ గుర్రాన్ని తీసుకొచ్చి ఆమెకు ఇవ్వలేదు. వారిని సంప్రదించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. 2020 ఆగస్టులో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నెలలైనా తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. సమగ్రంగా, పారదర్శకంగా తన కేసును దర్యాప్తు చేయాలని కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. రాజస్థాన్ హైకోర్టు ఆమె పిటిషన్‌ను గురువారం విచారణ చేసింది. సంబంధిత పోలీస్ అధికారికి ఈ కేసు గురించి తెలపాలని, ఆ అధికారి చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. -
వసుంధరా రాజెపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు
జైపూర్ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని పాలక కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేల బేరసారాల వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజె పాత్ర ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ నేత సంజయ్ జైన్ ఎనిమిది నెలల కిందట తనను కలిసి వసుంధర రాజెతో పాటు ఇతరులను సంప్రదించాల్సిందిగా కోరాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా పేర్కొన్నారు. జైన్‌తో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా గహ్లోత్ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నించారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సంజయ్ జైన్ చాలాకాలంగా ఇదే పనిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సంజయ్ జైన్‌ను రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధర రాజే సాయపడుతున్నారని బీజేపీ మిత్రపక్షం నుంచి ఆరోపణలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, వసుంధర రాజే తనకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని రాష్ర్టీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ ట్వీట్ చేశారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికర్, నగౌర్లకు చెందిన జాట్ ఎమ్మెల్యేలందరికీ వసుంధరా రాజే సూచిస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా రాజస్తాన్‌లో పాలక కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభంలోకి బీజేపీ నేతలను ఎందుకు లాగుతున్నారని ఈ విమర్శలపై వసుంధర రాజే మండిపడ్డారు. ఇక తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై పైలట్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పైలట్‌ను తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. చదవండి : పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్.. -
యడ్యూరప్ప అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు
-
కాంగ్రెస్ టూ బీజేపీ వయా మంత్రి పదవి
గాంధీనగర్ : కున్వర్జి బవాలియా గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, జాస్దాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే. కాంగ్రెస్ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇది మంగళవారం ఉదయం నాటి పరిస్థితి. కానీ మంగళవారం మధ్యాహ్నం నాటికి కున్వర్జి బవాలియా మంత్రి. కానీ కాంగ్రెస్ తరపున కాదు బీజేపీ నుంచి. ఇది ప్రస్తుతం దేశంలో పార్టీ ఫిరాయింపుదారుల వైభోగం. గెలుపొక పార్టీది.. పదవొక పార్టీది అన్నట్లు తయారయ్యింది ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి. బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే బవాలియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తాను కోరిన పదవి ఇవ్వకపోవడం ఆయన పార్టీ మారటానికి కారణం. సీనియర్ అయిన తనను కాదని పరేష్ ధనానికి ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వడంతో ఆయన కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బవాలియాను చేర్చుకోవడానికి బీజేపీకి బలమైన కారణమే ఉంది. బవాలియా సౌరాష్ట్రకు చెందిన వ్యక్తి మాత్రమే కాక ఓబీసీలోని కోలీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కూడా. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోలీ పటేల్ సామాజిక వర్గానికి అధ్యక్షుడిగానూ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సౌరాష్ట్రలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాక రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో బవాలియాకు మంత్రి పదవి ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఈ విషయం గురించి గుజరాత్ పీసీసీ ప్రెసిడెంట్ అమిత్ చవ్దా మాట్లాడుతూ.. ‘బవాలియా లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లడం దురదృష్టకరం. ఆయన గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరపున. ఆయనను కాంగ్రెస్ పార్టీ చాలా గౌరవిస్తుంది. కానీ కేవలం మంత్రి పదవి కోసమే బీజేపీలో చేరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీకే కాక సౌరాష్ట్ర ప్రజలకు కూడా బవాలియా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపాని మంగళవారం ఇజ్రాయేల్ పర్యటన ముగించుకుని వచ్చే సమయానికే బవాలియా బీజేపీలో చేరడం కాకతాళీయం కాదు. ఇదంతా ముందునుంచి అనుకునే అమలు చేశారు. మంత్రి పదవులను ఎరగా చూపి కాంగ్రెస్ నాయకులను బీజేపీ తనవైపు ఆకర్షిస్తుంది. కానీ ఇది ఆ పార్టీకే మంచిది కాద’ని హెచ్చరించారు. -
పార్టీ ఫిరాయిస్తే రూ.40 కోట్లు
సాక్షి, రొంపిచెర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సునీల్‌కుమార్ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. -
మోదీ పిడికిట్లో ఎమ్మెల్యేలు..!
సాక్షి, బెంగళూరు : ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. బలనిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజులు సమయం ఇచ్చారు. కానీ రేపో-ఎల్లుండో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. మెజారిటీ నిరూపించుకుంటామని సీఎం యడ్యూరప్ప అంటున్నారు. బలపరీక్షలో బీజేపీ గెలువడం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా.. బీజేపీకి అంతసీన్ లేదని, యడ్యూరప్ప ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చట అవుతుందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పేర్కొంటున్నారు. తమకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీంతో బలనిరూపణ సందర్భంగా ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరగబోయే బలపరీక్ష చుట్టూ ఆసక్తి నెలకొంది. హెచ్డీ కుమారస్వామి బలపరీక్ష, ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ పిడికిలిలో బందీ అయ్యాడని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ తెలిపారు. విధానసౌధ వద్ద కాంగ్రెస్-జేడీఎస్ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ అయిన ముగ్గురు హైదరాబాద్ కర్ణాటక ఎమ్మెల్యేల్లో ఆనంద్‌సింగ్ ఒకరు. ఆయనతోపాటు నాగేంద్ర, రాజశేఖర పాటిల్ బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష భేటీకి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే బీజేపీకి ఆకర్షితుడయ్యాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయయ్య మాట్లాడుతూ.. మొత్తం 118మంది ఎమ్మెల్యేలు (కాంగ్రెస్-జేడీఎస్ కలుపుకొని) తమ వద్ద ఉన్నారని, తమకు తగినంత మెజారిటీ లేదనే ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలంతా వందశాతం తమ వెంటే ఉన్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం స్వల్పకాలంలోనే కూలిపోతోందని అన్నారు. మెజారిటీ తమకే ఉందని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ మా ఎమ్మెల్యేలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు! ఇక ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో మోదీ ప్రభుత్వ తీరుపై జేడీఎస్ నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని విమర్శించారు. ‘వారు ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీలో నాకు వ్యతిరేకంగా కేసు ఉంది. ఆ కేసును తిరగదోడి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. క్షమించండి.. నా ప్రయోజనాలు నేను కాపాడుకోవాలి’అని ఆనంద్ సింగ్ చెప్పినట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకు చెప్పారు. ఇదీ బీజేపీ నేతల తీరు’ అని కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ బీజేపీ గూటికి చేరినట్టు భావిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ నేతలు
సాలూరు (విజయనగరం) : తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
కర్ణాటకలో 'స్టింగ్ ఆపరేషన్' కలకలం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు సహకరించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు రూ. కోట్లకు ఆశపడుతున్నట్లు ఒక టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవచ్చు. కానీ మూడో అభ్యర్థిని రంగంలోకి దించింది. రెండ్రోజుల ముందు ఒక టీవీ చానల్ ప్రతినిధులు జేడీఎస్ ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖూబా, జి.టి.దేవేగౌడ, కర్ణాటక జనతా పార్టీ ఎమ్మెల్యే బి.ఆర్.పాటిల్‌ను కలవగా.. వారు ఒక్కో ఓటుకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన దృశ్యాలు బయటపడ్డాయి. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బేరసారాలు సాగించినట్టు రహస్య వీడియాలో ఉంది. కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్, కేసీ రామమూర్తి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జేడీ(ఎస్) తరపున బీఎస్ ఫరూఖ్ నామినేషన్లు దాఖలు చేశారు. 225 స్థానాలున్న కర్ణాటకలో అసెంబ్లీలో కాంగ్రెస్ కు 123, జేడీ(ఎస్)కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఓట్లు పోను రామమూర్తికి మరో 12 ఓట్లు అవసరం. మరోవైపు జేడీ(ఎస్)కు చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ఉల్లఘించి రామమూర్తికి ఓటు వేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 11న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. -
'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన మంత్రిని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు. 'కాంగ్రెస్ రాజకీయ బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
సీఎంపై స్టింగ్ ఆపరేషన్.. బయటికొచ్చిన సీడీ
ఉత్తరాఖండ్ రాజకీయాలు మంచి ఆసక్తికరంగా మారాయి. అక్కడి ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారు. తనకు మద్దతిస్తే డబ్బులిస్తానని రావత్ మభ్యపెట్టారని అన్నారు. మార్చి 23వ తేదీన ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారని, ఇందులో ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడారని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేల ఆరోపణలను ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోసిపుచ్చారు. వాళ్ల ఆరోపణలలో వాస్తవం లేదని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ కూడా అన్నారు. -
'అది ట్యాపింగ్ కాదు.. వాయిస్ మాత్రం బాబుదే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపులు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసినవి కావని, అయితే స్టీఫెన్ సన్తో ఉన్న ఫోన్ సంభాషణలోని వాయిస్ మాత్రం చంద్రబాబునాయుడిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంకా మరిన్ని తప్పులు చేయోద్దని సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, కేసీఆర్ ఫిరాయింపులతో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ ఆదిపత్యం కోసం రెండు రాష్ట్రాల మధ్య అగాధం సృష్టిస్తున్నారని చెప్పారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని అన్నారు. కేసీఆర్ వాటిని త్వరగా పూర్తి చేయాలని, వాటికి ఏపీ మంత్రులు అడ్డుపడాలని చూడటం సరికాదని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో రూపొందినవేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై తుదిదశకు చేరిన ప్రాజెక్టులను కేసీఆర్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే
న్యూఢిల్లీ: వాయిస్ రికార్డుల్లో ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలేనని, ఇదేదో తాను ఊరికే చెప్పడంలేదని టీడీపీతో పాతికేళ్ల అనుభవం ఉండి చెప్తున్న మాటలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సెబాస్టియన్, స్టీఫెన్ సన్తో మాట్లాడింది తానో కాదో చెప్పకుండా చంద్రబాబు దబాయించడం సిగ్గుమాలిన పని అని చెప్పారు. ఏపీ సీఎంతోపాటు తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని అన్నారు. గత ఏడాదిగా తమ పాలనే ఒక్క ఆంధ్రులపై కూడా దాడి జరగలేదని, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణలను కూల్చివేతలో తెలంగాణకు చెందిన వారి ఇళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. -
చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు
-
మేం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయలేదు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తదితరుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖయ్యుం ఖాన్ ఖండించారు. తెలంగాణ ఏసీబీ పూర్తి వృత్తి నిబద్ధత కలిగిన దర్యాప్తు సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా పూర్తిగా చట్టం, నియమనిబంధనలకు లోబడి దర్యాప్తు చేస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ముఖ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వార్తాపత్రికలు, చానళ్లల్లో వస్తున్న వార్తలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఆ పార్టీ ‘బాస్’ నేతృత్వంలో జరిగిన భారీ కుట్రను తెలంగాణ ఏసీబీ చేదించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అదే విధంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై తెలంగాణ ఏసీబీ స్పందిస్తూ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేయడం గమనార్హం. ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ ఫిర్యాదు అనంతరం ఆయన ఫోన్‌పై ఏసీబీ నిఘా వుంచగా, ఆయనకు చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతల ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేసిన విషయం బయటపడిందని తెలుస్తోంది.