Ichapuram
-
విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..
-
ఇచ్చాపురం జనసంద్రం..
-
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
-
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
-
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
పిరియా విజయ పల్లె నిద్ర
-
సీఎం జగన్ ను కాపీ కొట్టిన చంద్రబాబు.. కానీ గెలుపు మాదే
-
మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..
-
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. రెండురోజుల కిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. చదవండి: శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్ -
గంజాయి గుట్టురట్టు
ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): ఇచ్ఛాపురం పోలీసు లు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. కోటి విలువైన గంజాయి రవాణాను అడ్డుకుని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బొగ్గు మాటున గంజాయిని ఉంచి తీసుకెళ్లిపోదామనుకున్న వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. ఇచ్ఛాపురం పాత జాతీయ రహదారిలో సోమవారం 1050 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ అమిత్ బర్దార్ సోమవా రం తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం మధ్య బొగ్గును జార్ఖండ్‌లోని రాంఛీకి తీసుకెళ్లే హెచ్ఆర్ 63సి 9751 నంబర్ గల లారీ సో మవారం జాతీయ రహదారి గుండా బయల్దేరింది. బొగ్గుతో పాటు 210 ప్యాకెట్ల గంజాయిని ఈ లారీలోనే ఉంచి రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అందుకు పాత జాతీయ రహదారిని మార్గంగా ఎంచుకున్నారు. అయితే దీనిపై ఇచ్ఛాపురం పోలీసులకు లీ లగా సమాచారం అందడంతో వా రు బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే దారిలో బొగ్గు లారీ కూడా రావడంతో ఆపి బండిని నిశితంగా పరిశీ లించారు. దీంతో లారీలోని 210 ప్యాకెట్లలో గల 1050 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాలో ఏడుగురు ఉ న్నట్లు పోలీసులు గుర్తించారు. వీ రిలో స్థానికుల పాత్ర కూడా ఉంద ని సమాచారం. లారీని పట్టుకున్న సమయంలో లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇంకొకరు పరారైపోయారు. మిగిలిన ముగ్గురిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి విలువ కోటి ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. గంజాయిని పట్టుకున్న పట్టణ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇందులో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరా మిరెడ్డి, సీఐ ఎం.వినోద్‌బాబు, పట్టణ, రూరల్ ఎస్ఐలు వి.సత్యనారాయణ, బి.హైమావతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలి కోసం మాస్టర్ ప్లాన్.. ఆన్లైన్లో బొమ్మ తుపాకీ కొని
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణంలో బొమ్మ తుపాకీ చూపించి నగలు ఎత్తుకుపోయిన కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో ఈ చోరీ వెనుక ఉన్న ‘లవ్ స్టోరీ’ బయటపడింది. ప్రియురాలికి బహుమ తి ఇవ్వడానికే యువకుడు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసి ఖాకీలు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్ బర్దార్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాయగడ జిల్లా చలకంబ గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ కద్రక ఒడిశాలోనే పదో తరగతి వరకు చదివాడు. అనంతరం భీమవరంలోని రొయ్యల ట్యాంకుల వద్ద, విశాఖపట్నంలోని ఒక హోటల్లో వెయిటర్‌గా పనిచేశాడు. 2020 డిసెంబర్ నెలలో తన చిన్నాన్నకు చికిత్స జరుగుతున్న సమ యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కోవిడ్ కాలంలో ఉపాధి కోల్పోయి ఇంటిలోనే ఉండిపోయాడు. అయితే ప్రియురాలి మెప్పు పొందడం కోసం బంగారు గొలుసు ఇద్దామనుకున్నాడు. చేయడానికి పనులు లేకపోవడంతో చోరీ చేసి బహుమతి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు బొమ్మ తుపాకీ చూపించి వ్యాపారిని బెదిరించి నగలు ఎత్తుకెళ్లాడు కూడా. కానీ పోలీసుల ముందు అతడి ఎత్తులు చెల్లలేదు. ఇలా దొరికిపోయాడు.. దొంగతనం చేద్దామని ప్లాన్ వేసిన సూరజ్‌కుమార్ రూ. 2వేలతో బొమ్మ పిస్టల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా డు. 9వ తేదీన ఇచ్ఛాపురంలో జీకే జుయలరీ షాపు ను ఎంచుకుని తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాపు ఓనర్ ఒంటరిగా ఉండడంతో కస్టమర్ లాగా లోపల కు వెళ్లాడు. వివిధ డిజైన్లతో మూడు బంగారు గొలుసుల ను ఓనర్ చూపించగా.. వాటిని ఫొటో తీసి తన లవర్‌కు పంపించాడు. ఆ సమ యంలో దుకాణానికి ఎవరూ రా కపోవడం గమనించి పిస్టల్ తీసి ఓనర్ ను బెదిరించి దాదాపు రెండు తులాల బరు వు గల మూడు గొలుసులు తీసుకుని పారిపోయా డు. దీనిపై ఆ షాపు ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ కానిస్టేబుల్, మరికొందరు నిందితుడిని వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బొమ్మ పిస్టల్ కిందపడిపోయింది. తర్వాత నిందితుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గొలుసులతో సహా పోలీసులకు దొరికిపోయాడు. అతడిని ఇచ్ఛాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎస్పీ సూచించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరచిన సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ బషీర్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఒక ఊరు.. మూడు పంచాయతీలు!
ఇచ్ఛాపురం రూరల్: ‘ఒక గ్రామం.. ఒక పంచాయతీ..’ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం.. రెండు మండలాల్లో, మూడు పంచాయతీల్లో విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామంలో సుమారు 700కు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోనే ఉన్న ఈదుపురం పంచాయతీలో తిప్పనపుట్టుగ గ్రామ పరిధి కొంత విస్తరించి ఉంది. అక్కడ 718 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం డి.గొనపపుట్టుగ పంచాయతీ పరిధిలో.. తిప్పనపుట్టుగకు చెందిన కొన్ని వీధులుండగా, అక్కడ 134 మంది ఓటర్లున్నారు. అలాగే ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో కూడా తిప్పనపుట్టుగకు చెందిన 25 మంది ఓటర్లున్నారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారైనప్పటికీ.. వేరు వేరు పంచాయతీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సన్యాసిపుట్టుగది అదే తీరు.. ఇచ్ఛాపురం, కవిటి మండలాల పరిధిలో ఉన్న సన్యాసిపుట్టుగ గ్రామానిదీ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ గ్రామంలో సుమారు 1,600 మంది వరకు ఓటర్లున్నారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ పరిధిలో కూడా సన్యాసిపుట్టుగకు చెందిన కొంత భాగముంది. అందులో 740 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలో సన్యాసిపుట్టుగకు చెందిన మరికొంత భాగముంది. అందులో 850 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఊళ్లో రెండు మండలాలు! గుర్ల(చీపురుపల్లి): చూడ్డానికి ఒకే ఊరులా ఉన్నా రెండు వేర్వేరు పంచాయతీలున్నాయి. అంతేకాదు వేర్వేరు మండలాలు కూడా. విజయనగరం జిల్లాలోని లవిడాం, వెంకటపాత్రునిరేగ గ్రామాలు చూడ్డానికి ఒకే గ్రామంలా ఉంటాయి. అసలవి రెండు గ్రామాలంటే కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చినవారు అస్సలు నమ్మలేరు. గుర్ల మండలం, గరివిడి మండలాల పరిధిలో ఆ రెండు గ్రామాలున్నాయి. వీటి మధ్య ఓ రహదారి ఉంది. పంచాయతీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలసి ఉంటారు. అయితే చాన్నాళ్ల కిందట ఒకే ఊరిగా ఉండగా, చిన్న గొడవ కారణంగా రెండుగా విడిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. లవిడాంలో 280 ఇళ్లు.. 734 మంది ఓటర్లు, వెంకటపాత్రునిరేగలో 320 ఇళ్లు.. 930 మంది ఓటర్లున్నారు. -
నిజమేన్రా.. ఆడి మత్తులో పడిపోనాను
అలో... ఒరే బీమా.. యినిపిత్తందా.. నేన్రా ఎంకటేశులు మామను. మీయమ్మ దెగ్గిర నంబరు తీసుకుని కొట్టాన్రా.. మీ అయ్య అంజిగాడు ఎలచ్చన్లలో పోటీ సేత్తాడట.. ఓరయ్యా నువ్వే వచ్చి సెప్పాల్రా ఆడికి.. అంటూ ఎంకటేశు నోకియా ఫోన్ పగిలిపోయేలా చెప్పిన మాటలకు మరునాడే భీముడు ఊళ్లో దిగిపోయాడు.. ఆ ఊళ్లో ఎప్పుడూ ఏకగ్రీవమే.. ఇప్పుడు సర్పంచ్ పదవికి ఒకరు పోటీ చేస్తున్నారని తెలియడం.. అది కూడా తన తండ్రేనని అర్థం కావడం భీముడి రాకకు కారణం. భీముడు ఇంటికి వచ్చేటప్పటికి ఆంజనేయులుగా మారిపోయిన అంజి తరమాను చారు, కర్రపెండలం కూరేసుకుని కుమ్ముతున్నాడు.. ఒంటిపై ఖద్దరు చొక్కా జిగేల్‌మంటోంది.. సంతకం రాదు గానీ జేబులో ఖరీదైన పెన్నొకటి కనిపిస్తోంది.. అది చూడగానే అర్థమైపోయింది భీముడికి ఈ అగాయిత్యపు ఆలోచన తన తండ్రిది కాదని.. కొడుకు, బామ్మర్ది కలిసి అంజిగాడి ఎదురుగా బాసింపట్టేసుక్కూర్చున్నారు.. భార్య పాపమ్మ మాత్రం పెద్ద హీరోల సినిమాల్లో పని మనిషిలా వంట గది దాటి బయటకు రాలేదు.. మాటలు మొదలయ్యాయి.. మామా అల్లుళ్లను చూడగానే అంజి చాలాసేపటికి మైకు దొరికిన యాంకర్లా మొదలెట్టేశాడు.. అంజి : ఒరే.. మీరొందుకొచ్చారో నాకు తెలుసున్రా. మామా అల్లుల్లు కలిపి ఉరెట్టుకున్నా.. నేను దిగుతానంటే... దిగుతానంతే.. భీముడు: అదికాదయ్యా.. ఊరంతా ఎప్పుడూ ఒకే మాట కదా.. నువ్వే ఇలాగ సేత్తే ఎలాగ.. ఎంక: బావా.. మొన్నటి వరకు బాగున్నావు కదా.. యిప్పుడెందుకీ ఉతపాతం ఆలోసనొచ్చింది నీకు. అంజి : మీకు సమాదానం సెప్పడమేట్రా.. నేను దిగి తీరుతానంతే.. భీముడు: మాసం కిందట నాతో ఫోన్‌తో మాట్లాడినప్పుడు.. నువ్వీ ఊసే ఎత్తనేదు.. యిప్పుడేటైంది.. ఎంక: మాసం కిందటంతావేట్రా.. పది రోజులు ముందు బావా నేను గొప్పులు తవ్వడానికెల్లినప్పుడు.. ఎలచ్చన్లొత్తన్నాయి బావా.. అంటే యిప్పుడెందుకొత్తన్నాయి.. అన్నాడు. ఇంతలోపే ఏటైపోనాదో.. అంజి : అన్నాన్రా.. ఇంకో వంద అంటాన్రా.. నా ఇట్టంరా. ఏమిరా నేను సర్పంచ్ కాకూడదా.. అంజి గాడిగానే ఉండిపోవాలా.. ఆంజనేయులు గారూ అనిపించుకోకూడదా.. ఎంక : అబ్బా.. సర్పంచ్ అవుతావా.. ఏది ఈ కాగితం మీద సర్పంచ్ అని రాసి సూపించు. తర్వాత పెసిడెంటు అవుదువు గానీ.. అంజి : నా రాతే మారిపోతుంతే.. ఇంకా రాయడమెందుకు రా.. భీముడు: రాత మారిపోవడమేటి.. ఏటి మాటాడతన్నావు.. అసలు ఈ మాటలు నీవి కావే.. అంజి : కన్న తండ్రి బాగుపడుతుంతే సూడలేని కొడుకుని నిన్నే సూత్తన్నాన్రా దొంగ నా ... భీముడు: నీ బాగు తర్వాత.. ఊరి బాగు మాటేటి.. వాసన్న మంచోడు.. సదువుకున్నోడు.. అందరికీ దగ్గరైనోడు.. ఆ మనిషికి యతిరేకంగా నీవు పోటీకి దిగడమేటి.. అంజి : వాసుగాడితోటి నాకేం తగువు నేదు.. పెజాసామ్యంలో ఎవుడైనా పోటీకి దిగొచ్చు.. నేను దిగుతున్నాను.. అంతే.. ఎంక: అబ్బనాయినా పెజాసామ్యమా.. బావా పెద్ద పెద్ద మాటలొత్తన్నాయి.. ఎక్కడ నేర్సావు.. అంజి : ఒకే నీకు లాగ నాకేటీ రాదనుకున్నావేట్రా.. నీకు మీయప్పకు ఉప్పెంతయ్యాల..కారమెంతయ్యాల తప్ప ఇంకేం తెలుసున్రా.. ఎంక: ఓసోస్.. మూడురోజుల కిందట మెరకీదోడితో రాత్రి నీ నేస్తరికం సూసాను బావా..ఒరే అల్లుడు ఆ మెరకీదోడి మాటలే మీ అయ్య నోటి నుంచొత్తన్నాయిరా.. యిప్పుడు గుర్తొచ్చింది నాకు.. భీముడు: అదా కదా.. అయ్యా.. మెరకీదోడి మాయలో పడ్డావా.. సెప్తానిను.. ఏకగీవమైతే ఊరికి డబ్బులొత్తాయి.. నాలుగు మంచి పనులు సేసుకోవచ్చు.. ఆ పనులు జరిగితే వాసన్నకు పేరొత్తాది కదా.. దాన్ని సెడగొట్టడానికి నిన్ను వాడుకుంతన్నారు.. అంజి : నాకన్నీ యెరుకేరా.. నేను దిగుతానంతే.. భీముడు: అయ్యా.. ఐదు సంవచ్చరాల కిందట రాజి మామ గుర్తున్నాడా నీకు.. మెరకీదోడి తోనే తిరిగేవోడు.. డబ్బాశ సూపించి, మందు పోసి ఎలచ్చన్లలో దిగాలని రెచ్చగొట్టాడు.. తర్వాత ఏమైందో తెలుసును కద నీకు.. ఊరోల మాట యినలేదని రాజి మామను అందరూ స్సీ.. అన్నారు. ఆ తర్వాత మెరకీదోడు రాజిమామను పట్టించుకున్నాడా.. లేదే.. అయ్యా.. ఇది ఆల్ల రాజకీయం. తుపాకీ మన బుజం మీద పెడతారు. తూటా ఆలు పేలుత్తారు.. పాపం ఆల్లది.. సిచ్చ మనకి.. అంజి : (అంతా అర్థమైనట్టుంది) నిజమేన్రా.. నాకూ డబ్బులిచ్చాడు.. ఎంక: బుడ్డీల సంగతి సెప్పు.. అంజి : యిచ్చాడ్లేరా.. నాలుగిత్తే మూడైపోనాయి.. ఒక్కటే ఉంది.. భీముడు: సరే అయిందేదో అయిపోనాది.. నామినేసన్ ఏత్తే ఎనక్కు తీస్కో.. ఊరు బాగుంతే మనమూ బాగుంతాం కదరయ్యా.. అంజి : ఖద్దరు చొక్కా తీసేస్తూ.. నిజమేన్రా.. ఆడి మత్తులో పడిపోనాను.. మీరిద్దరూ మత్తు దింపేనారు కదా.. నేనూ దిగిపోతాన్లే.. అంటూ ఒప్పుకునే సరికి.. తలుపు వెనకే ఉండి అంతా వింటున్న మెరకీదోడు.. మరో బకరా గాడి కోసం ఊరి మీద పడ్డాడు. – ఇచ్ఛాపురం రూరల్ సెల్ఫీ దిగితే ఓటు రద్దు సీతంపేట: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ దిగడం ఫ్యాషనైపోయింది. ఇదే అలవాటుతో పొరపాటుగా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగితే వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఎం) మేరకు ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయరాదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17(ఎ) మేరకు ఆ ఓటును రద్దు చేస్తారు. నోటా ఉందండోయ్.. ఎల్.ఎన్.పేట: ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో పోటీలో నిలిచిన వ్యక్తులు ఓటర్లకు నచ్చకపోయినా, వా రిపై ఓటర్లకు పూర్తి విశ్వాసం లేకపోయినా వారికి వ్యతి రేకంగా ఓట్లు వేసేందుకు నోటా గుర్తును అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు సార్వత్రిక (సాధారణ) ఎన్నికల్లో మాత్రమే అమలవుతున్న నోటా గుర్తు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ(స్థానిక) ఎన్నికల్లోనూ అమలు చేసేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు చే స్తున్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన తర్వాత వచ్చే బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తుకు చోటు లభిస్తుంది. నోటా గుర్తు బ్యాలెట్ పేపర్లలో కిందన ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల మెజార్టీ చాలా తక్కువగా ఉంటుంది. వార్డుల్లోను పోటీ పడుతున్న వ్యక్తులకు కొన్ని చోట్ల 200 కంటే తక్కువ ఓట్లే ఉంటాయి. ఈ క్రమంలో నోటాకు పడే ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై అధిక ప్రభావం చూపిస్తుంది. -
వి'హంగామా'.. ఎక్కడమ్మా!
పర్యాటకులను అమితంగా ఆకర్షించే విదేశీ విహంగాలు నెలరోజుల ముందే సొంతగూటికి పయనమయ్యాయి. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు పయనమై వెళ్లిపోతున్నాయి. ఈ హఠాత్పరిణామం తేలుకుంచి వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు తెలిసినంత వరకు ఇలా ఏ ఏడాదీ జరగలేదని, నెల రోజుల ముందుగానే సైబీరియా పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత స్వదేశాలకు వెళ్లే సైబీరియా పక్షులు ఈ ఏడాది నెల రోజుల ముందే పుట్టింటికి పయనమైపోయాయి. జిల్లాలో తేలినీలాపురం తర్వాత సైబీరియన్ పక్షులు విడిది చేసేది ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలోనే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చిన విదేశీ విహంగాలు సంక్రాంతి రాకముందే ఒక్కసారిగా వెళ్లిపోయాయి. కార్తీకమాసం తర్వాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులకు ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో గ్రామస్తులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న పక్షులు.. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వచ్చిన ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్య (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని పిలుస్తుంటారు. వందల కొద్దీ ఇక్కడికి వచ్చిన పక్షులు గ్రామంలోనే ఊర చెరువు, గ్రామదేవత ఆలయం వద్ద ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పొదుగుతాయి. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఆరు నెలలు పాటు పిల్లలతో గడిపి అవి ఎగిరేంత బలం రాగానే జనవరి నెల మధ్య నుంచి తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. ఈసారి ఏమైందో.. ఈ ఏడాది ఒక్కసారిగా పక్షులు మాయమైపోయాయి. తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగానే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం స్థానికులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించడం ఈ ప్రాంత రైతులకు అలవాటు. అలాంటిది పక్షులు హఠాత్తుగా మాయం కావడం శుభకరం కాదంటున్నారు. ఈ పక్షులు పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా ఈ గ్రామస్తులు భావిస్తుంటారు. నివాసానికి అనువుగా లేనందునే.. పక్షులు వెళ్లిపోవడానికి ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే, పక్షులు గుడ్లు పెట్టేందుకు సరైన చెట్లు లేకపోవడం మరోకారణమని స్థానికులు భావిస్తున్నారు. గతంలో వరుసగా వచ్చిన తుఫాన్ల ధాటికి చెట్లు నేలకొరగడంతో కొత్త మొక్కలు నాటేందుకు స్థలం లేకపోవడంతో అటవీశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే వాగులు, వంకలు నిండి పక్షులకు ఆహారంగా వరిచేలల్లో నత్తలు, పురుగులు, చేపలు, కప్పలు తింటూ జీవిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అవి ఉండేందుకు అనువైన వాతావరణం లేని కారణంగా వేగంగా స్వదేశాలకు పయనమైపోయాయని స్థానికులు చెబుతున్నారు. అపురూపంగా చూసుకున్నాం ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు. అపురూపంగా చూసుకుంటాం. ఈ ఏడాది పక్షులకు వాతావరణం అంతగా అనుకూలంగా లేకుండాపోయింది. మోస్తరు వర్షాలు కురవకపోవడంతో అంతంత మాత్రంగా పంటలు పండటం, పక్షులకు ఆహారమైన పురుగులు, కీటకాలు లేకపోవడంతోనే పక్షులు నెల రోజులు ముందుగా వెళ్లిపోయాయి. – దక్కత నూకయ్యరెడ్డి, గ్రామపెద్ద, తేలుకుంచి మొక్కలు నాటించలేదు.. అటవీశాఖ అధికారులు ఏడాదికోమారు గ్రామంలో సమావేశం పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్పా పక్షులను పర్యవేక్షించే చర్యలు చేపట్టడం లేదు. స్థానిక ఎమ్మేల్యే బెందాళం అశోక్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నా పక్షులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొక్కలు నాటించలేకపోయారు. – పాల ధర్మరాజురెడ్డి, యువజన సభ్యుడు, తేలుకుంచి -
గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి
సాక్షి,ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఉన్న ఏనుగుల గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. అయితే తల్లి ఏనుగు మాత్రం కోపంగా వెనక్కి తిరిగి వచ్చింది. దీంతో ఆ యువకులు పరుగులు తీశారు. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..) -
ఒక్క ‘టీ’ పడితే అంతా సెట్ అయిపోతుంది!
పుస్తకం తీస్తే కళ్లు మూసుకుపోతున్నాయి.. ఓ టీ పడితే అంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే బద్దకం వీడడం లేదు. కడుపు టీ కోరుతోంది మరి. శీతాకాలపు వేకువలకు టీ జత కలిస్తే ఆ మ్యాజిక్కే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం పూట టీ కప్పు చేసే మాయాజాలం ఆస్వాదిస్తే గానీ అర్థం కాదు. అందుకే టీ తిరుగులేనిది. శ్రీమంతుడి ఇంటిలో వెండి కప్పులో తాగినా, పేదవాడు గ్లాసులో పోసి ఇచ్చినా రుచి మాత్రం అమోఘమే. ఫైవ్ స్టార్ హొటల్ అయినా, రోడ్డు పక్క బడ్డీ కొట్టు అయినా దాని ‘టీ’వే వేరు. అందుకే టీ అందరికీ ఇష్టమైనది. చక్కెర ఒంటికి పడదు, అల్లం వేసుకో.. పాలు అంతగా నచ్చవు.. లెమన్ టీ మీ కోసమే. గొంతు బాగోలేదా.. పెప్పర్ టీ రెడీ.. ఒకటి నచ్చకపోతే పది వెరై‘టీ’లు ఉన్నాయి. అందుకే టీ ఎదురులేనిది. – శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం రూరల్, రాజాం ఎందరికో ఉపాధి.. జిల్లాలో టీ షాపుల సంఖ్య ఎంతో తెలుసా..? దాదాపు 3600. అంటే ఇన్ని వేల కుటుంబాలకు టీ ఆధారంగా నిలుస్తోంది. వెనుకబడిన జిల్లాగా ముద్ర పడిన సిక్కోలులో చాలా గ్రామాల్లో కుటుంబాలు ఈ టీ షాపులపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడంటే ఇంట్లో టీ చేసుకోవడం అలవాటైంది గానీ.. ఒకప్పుడు ఊళ్లలో టీ షాపుల ముందు పొద్దున్నే గ్లాసులు పట్టుకుని పార్సిల్ కోసం గంటల తరబడి వేచి ఉండేవారు. రానురాను షాపుల నుంచి టీ ఇంటికి తీసుకెళ్లే అలవాటు మారిపోయినా.. ఆఫీసులు, దుకాణాలకు పట్టుకువెళ్లే కొత్త పద్ధతి మొదలైంది. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు, పరిశ్రమలు, షాపింగ్ మాళ్లు కొత్తగా ఏర్పాటు కావడంతో అక్కడకే టీ తీసుకువెళ్లి విక్రయించే పద్ధతులు చాలా మందికి లాభిస్తున్నాయి. ఆహా ఏమి రుచి.. మారుతున్న కాలంతో పాటు టీ రుచుల్లో కూ డా తేడాలు వస్తున్నాయి. ఒకప్పుడు చాలా కొద్ది రకాల టీలు మాత్రమే లభించేవి. కానీ యువత కూడా ఈ టీ బిజినెస్‌లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా దీని రూపురేఖలు మారిపోయాయి. అల్లం టీ, లెమన్ టీ, పెప్పర్ టీ, బాదం టీ అంటూ ఊరూరా కొత్త కొత్త షాపులు పుట్టుకువచ్చాయి. సంప్రదాయ టీ దుకాణాల్లో మాత్రం అలవాటైన టీ ఘుమఘుమలు అలాగే ఉన్నాయి. వయసులో పెద్ద వారు తమకు అలవాటైన దుకాణాల్లో టీలను ఆస్వాదిస్తుంటే.. యువత మాత్రం కొత్తగా ఏర్పాటైన షాపుల్లో విభిన్న రుచులను టేస్ట్ చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఆరోగ్య ప్రదాయిని.. ఓ పద్ధతి ప్రకారం తాగితే టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాయ్ తాగడం ద్వారా మానసిక ఉత్తేజం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి. గ్రీన్, లెమన్, హీనీ, బ్లాక్, అల్లం, బెల్లం, మసాలా, బాదం టీలు ఈ ఆరోగ్య ప్రదా యిని జాబితాలో అగ్రశ్రేణిలో ఉంటాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. టీకీ ఓ టైముంది.. రోజూ ఉదయాన్నే పరగడుపున కొందరు టీ తాగుతుంటారు. కానీ అది మంచిది కాదని వైద్యుల సూచన. టీలో ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటా యి. వాటిలో చాలా వరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పరగడుపున టీ తాగడం అసిడిటీని పెంచుతుంది. భోజనానికి ముందుగా టీ తాగడం కూడా సరైన పద్ధతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాలు మొదలుకొని గంట వరకు టీ తాగడం సరికాదు. వెంటనే తాగితే జీర్ణమైన భోజనంలోని శక్తి ఒంటికి పట్టదు. టీతో ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్యులు. అందుకే టీ తాగే వేళలను నిర్దిష్టంగా చూసుకుంటే రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు. పెరిగిన ధరలు.. ‘టీ’ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఇప్పుడిప్పుడు మాత్రం ధరలు పెరుగుతున్నాయి. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. ప్రస్తుతం చాయ్ రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. టీ ధరలు పెరిగినా ఆదరణ మాత్రం తగ్గలేదు. కూలీనాలీ చేసే సామాన్యులు సైతం దినచర్యను చాయ్‌తోనే మొదలుపెడతారు. చాయ్ తయారు చేయడానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తు వుల ధరలు పెరగడం వల్ల ఇప్పుడు చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీ æకొట్టు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అర్ధ రూపాయి నుంచి అమ్ముతున్నా.. నేను ఐదేళ్ల ప్రాయం నుంచి టీ చేయ డం నేర్చుకున్నాను. 30 ఏళ్ల నుంచి టీ కొట్టును పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతం ఇదే వృత్తి మాకు జీవనోపాధి. అర్ధ రూపాయి నుంచి టీ నేటికి ఐదు రూపాయల వరకు పెరిగింది. – తెలుకల బొనమాళి, టీ కొట్టు యజమాని, ఈదుపురం ఒత్తిడి నుంచి ఉపశమనం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చాయ్ తాగడం తప్పనిసరి. స్నేహితులు కలిసినా, సహోద్యోగులు కలసినా తప్పని సరిగా చాయ్ ఆఫర్ చేస్తా. ముఖ్యంగా ఇచ్ఛాపురంలో దొరి కే చాయ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. – వి.శ్రీనివాసరావు, ఉద్యోగి, గృహనిర్మాణశాఖ టీ మంచిదే.. టీ చాలా మంచిదే. ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పరిమితంగా తాగడం అల వాటు చేసుకోవాలి. షుగర్ పేషెంట్లు షుగర్ లెస్ టీ తాగాలి. – డాక్టర్ మహంతి చంద్రశేఖర్‌నాయుడు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్, రాజాం ఒక్క టీ కొడితే.. నేను ఇప్పటివరకూ వెయ్యికి పైగా కవితలు, రచనలు చేశాను. నా రచనలు, కవితల సమయాల్లో చిన్న టీ తాగితే చాలు అదో తృప్తి. ఒక్కో దఫా టీ తాగి కూర్చుని తెల్లపేపరు తీశానంటే ఎన్నో కొత్త అక్షరాలు, కొత్త పదాలు వచ్చి చేరుతాయి. దటీజ్ టీ మహత్యం. – కుదమ తిరుమలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రాజాం. అతిగా వద్దు.. రిలాక్స్ కోసమంటూ టీని అతిగా తాగినా అనర్థాలు వస్తాయి. చాయ్‌కి బానిస కావద్దు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగ డం ద్వారా బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. గ్రీన్ టీ తాగడం మంచిదే కాని, ఏదైనా ఎక్కువగా తీసుకోకుండా మోతాదులో తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఉలాల శేషు యాదవ్, ఎండీ, మహాలక్ష్మి నర్సింగ్ హోమ్, ఇచ్ఛాపురం -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
సాక్షి, అమరావతి: దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా, చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అద్వితీయమైన రీతిలో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించి మే 30వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. పాదయాత్ర స్ఫూర్తితో 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే నా కసి.. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. భయపడే ప్రసక్తే లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి.. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి’ అని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ► అక్కడి నుంచి అశేష జనవాహిని నడుమ దిక్కులు పిక్కటిల్లేలా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా ముందుకు కదిలారు. అశేష జనవాహినితో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కిటకిటలాడాయి. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, తుదకు అది 14 నెలల పాటు సాగింది. యాత్రకు అడ్డంకులు సృష్టించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చూసినా, సాధ్యం కాలేదు. ► వినమ్రంగా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూనే.. వారంలో ఆరు రోజులు యాత్రను కొనసాగించారు. పండుగలు, పబ్బాలను ప్రజల మధ్యనే గుడారాల్లో జరుపుకున్నారు. జగన్‌ను కలిసేందుకు రైతులు, నిరుపేద ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నేతలు తరలి వచ్చి, సమస్యలు విన్నవించారు. వారి ఆంకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ► 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. -
షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం
సాక్షి, ఇచ్ఛాపురం: కుటిల రాజకీయాలు జఠిల సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఒంటరిని చేసి వేధిస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్న కు అండగా, కుటుంబానికి తోడుగా, పార్టీకి ఓ ధైర్యంగా ఓ అతివ అడుగులు వేశారు. తండ్రి చూపిన బాటలో రాష్ట్రమంతా కలియదిరిగారు. అన్న పెట్టిన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి తన నడకతోనే ఇంధనం నింపారు. ఆమే వైఎస్ షర్మిల. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. చెల్లెమ్మలకు అండగా ఉండే అన్నల కథలు అందరికీ తెలిసినవే. కానీ అన్నకు బలంగా నిలిచిన చెల్లెలి కథ ఆమెది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అది మొదలు ఆయనపై కుట్రలు మొదలైపోయాయి. ఒక్కడినే చేసి అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధాన దాడు లు చేయడం మొదలుపెట్టాయి. అలాంటి దుర్మార్గ, దుశ్చర్యలకు నిరసనగా అన్నకు తోడుగా నిలిచి జగనన్న విడిచిన బాణంగా ప్రజల మధ్య నడిచి నాయకులకు భరోసా కలిగించింది వైఎస్ షర్మిల. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్న వదిలిన బాణంలా అన్ని గ్రామాలు కలియదిరిగారు. 2012 అక్టోబర్ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. షర్మిలమ్మతో కలసి పాదయాత్ర చేస్తున్న ధర్మాన కృష్ణదాస్(ఫైల్) నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు. ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిలమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం ఒక మహిళ వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడమనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్ షరి్మలమ్మ అప్పడు పాదయాత్ర ద్వారా నాటి న విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయి లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిలమ్మ, వైఎస్ జగన్ అందరూ ఇచ్ఛాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్ఛాపురానికి విడదీయలేని అనుబంధం ఉంది. – పిరియా సాయిరాజ్, డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం చే,తుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్న ట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా, స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రా వడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
పాఠశాలకు ప్రేమతో..!
సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని ఆచరణలోనికి తీసుకురాలేని పరిస్థితి. కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తీసుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారిలో ఇచ్ఛాపురం వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్వరరావు ఒకరు. ఈయనతో పాటు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడటం, సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడటం చూసి చలించిపోయారు. అదనపు గదులను నిర్మించాలని గతేడాది ఆగస్టులో సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా అప్పటి కలెక్టర్ కె.ధనంజయ్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందారు. ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలను 1903లో శ్రీసురంగి రాజావంశీలయులు నిర్మించారు. ప్రస్తుతం గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 1358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు ఇదే పాఠశాలో 1985లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బడి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కోటీ 50 లక్షల రూపాయంతో 10 అదనపు భవనాలు నిర్మించారు. ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
చాలా.. ఇంకా కావాలా?
సాక్షి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న ఈ ఘోరం చూస్తే టీడీపీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అధికారులు డమ్మీలైపోయారు. నేతలే లబ్ధిదారుల ఎంపిక చేసేశారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాత్ర గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు అనర్హమైనవని తేలాయంటే ఇక ఆ నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం అర్బన్, కవిటి, కంచిలి, సోంపేటలో ఎంత మేర అక్రమాలు జరిగాయో పరిశీలించాలి. ఇంకా దారుణమేంటంటే వితంతువులు కానప్పటికీ వితంతు పింఛన్లు పొందుతున్న వారు 232మంది ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం కానప్పటికీ మత్స్యకార పింఛన్లు ఇద్దరు పొందారు. వృద్ధాప్యంలో లేకపోయినప్పటికీ ఒకరు వృద్ధాప్య పింఛను పొందుతున్నారు. దీన్నిబట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అక్రమాల దందా ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతుంది. ముందే చెప్పిన సాక్షి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది. భూములను ఆక్రమించారు. ఇసుక దోపిడీకి పాల్పడ్డా రు. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఔట్ సోర్సింగ్, పౌష్టికాహారం పోస్టులను అమ్ముకున్నారు. గత ఐదేళ్లుగా ఇలా అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారు. ఇందులో ఎవరి హస్తమేంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. అన్నింటికన్నా భర్తలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కోటాలో పింఛన్లు మంజూరు చేసిన ఘనత ఇక్కడి టీడీపీ నేతలకు దక్కింది. వితంతువులు కాకపోయినప్పటికీ వితంతు పింఛ న్లు మంజూరు చేయించిన ఘనాపాటీలు ఇక్కడున్నారు. ఇదే విషయంపై గతనెల 20వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మో ఇచ్ఛాపురం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. నియోజకవర్గంలో జరిగిన ఒంట రి మహిళ పింఛన్ల బాగోతాన్ని ఈ కథనం బట్టబయలు చేసింది. అధికారుల విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. ఎవరా ఘనుడు? భర్తలున్న వారికి ఒంటరి మహిళ పింఛన్లు, వితంతువులు కాని వారికి వితంతు పింఛన్లు మంజూరు చేయించిన ఘనుడు ఎవరో అక్కడి టీడీపీ నేతలే చెప్పాలి. నియోజకవర్గంలో రింగ్ మాస్టర్‌గా పేరొందిన కీలక ప్రజాప్రతినిధి ఇందులో ప్రధాన భూమిక వహించారు. ఎంత దారుణమంటే భర్తలను తహసీల్దార్ కార్యాలయాలకు తీసుకొచ్చి ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించిన ఘనత అక్కడి టీడీపీ నేతలకు దక్కింది. చెప్పాలంటే అధికారుల చేత గత ప్రభుత్వంలో తప్పలు చేయించారు. దీనిబట్టి టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు ఎంపిక చేశారన్నది స్పష్టమైంది. జిల్లావ్యాప్తంగా పరిస్థితేంటి? ఒక్క ఇచ్ఛాపురం మండలంలోనే 1490 ఒంటరి మహిళ పింఛన్లు, 232 వితంతు పింఛన్లు అక్రమమని తేలాయంటే నియోజకవర్గంలోని మిగతా మండలాలు, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఇంకెన్ని ఉంటాయో చూడాల్సిన అవసరముంది. ఇచ్ఛాపురం మండలాన్ని శాంపిల్‌గా తీసుకుంటే జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయన్నదానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి. చేసింది తప్పు... ఆపై అధికారులపై ధ్వజం ఇచ్ఛాపురం మండలంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అక్కడి టీడీపీ నేతలు అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి రెండు పింఛన్లకు సంబంధించి తేడాలొస్తే వాటిని సాకుగా చూపించి అధికారులను బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. చేసింది తప్పు ఆపై ఎదురుదాడి చేస్తున్నారు. గత ఐదేళ్లు చేసిన ఘన కార్యాలు బయటపడుతుంటే తట్టుకోలేక అక్కసుతో అధికారులను లక్ష్యంగా చేసుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. -
అమ్మో.. ఇచ్ఛాపురం!
ఇచ్ఛాపురంలో అంతమంది ఒంటరి మహిళలా... ఎక్కడా లేని విధంగా ఒక్క నియోజకవర్గంలోనే 3681 ఒంటరి మహిళ పింఛన్లా? అంతమంది భర్తలు భార్యలను విడిచి పెట్టేశారా? జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనిది ఇక్కడే ఎందుకీ పరిస్థితి? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడేదో జరిగిందని మల్లగుల్లాలు పడుతున్నారు. వాటి సంగతేంటో చూడాలని... విచారణ జరిపి వాస్తవాలేంటో తెలుసుకోవాలని... అక్కడ జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలని నిఘా పెట్టారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వృద్ధాప్య పింఛన్‌కు ఎంపిక కాలేదా? వితంతు పింఛను వర్తించదా? వికలాంగ పింఛన్‌కు అర్హత పొందలేదా? అయితే ఒంటరి మహిళ పింఛను కింద తోసేయండి. మేము చూసుకుంటాం... తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రం ఇప్పిస్తాం అని చెప్పి గత ప్రభుత్వంలో అధికారుల చేత తప్పులు చేయించేశారు. భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరుచేసేశారు. టీడీపీ హయాంలో అర్హతల కన్న సిఫార్సులే కొలమానంగా పింఛన్లు మంజూరు చేయడంతో అనర్హులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఒంటరి మహిళ పింఛన్ల కింద అక్రమాలు జరిగాయి. దీనివెనక అక్కడి ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై ఒత్తిడి చేసి అనర్హులకు సైతం ఒంటరి మహిళలు పింఛన్లు మంజూరు చేయించినట్టుగా ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా 3 వేలకు పైగా అనర్హులు ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి సామాజిక పింఛన్ల ఎంపికలో సిఫార్సులే ప్రామాణికమయ్యాయి. 2004కు ముందు.. ఉన్న పింఛనుదారులు చనిపోతేనే కొత్తగా పింఛన్ మంజూరు చేసేశారు. దీంతో కొత్తగా పింఛన్ పొందే వారి సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉండేది. ఇక 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అర్హతలు పక్కన పెట్టి జన్మభూమి కమిటీ సిఫార్సులున్నవారికే పింఛన్లు ఇచ్చేవారు. వయస్సు మార్పులతోనూ, వికలాంగ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతోనూ, భర్తలున్న వారికి సైతం వితంతు పింఛన్లు, చివరికి భర్తలు విడిచిపెట్టారని చెప్పి ఒంటరి మహిళ పింఛన్లను మంజూరు చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. ఈ విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి అర్హులకు చుక్కలు చూపించిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేతల సిఫార్సులే అర్హతగా తీసుకున్నారే తప్ప వాస్తవ పరిస్థితులను పరిశీలనలోకి తీసుకోలేదు. వాస్తవంగా భర్తలు విడిచి పెట్టిన మహిళలకు పింఛన్లు మంజూరు కాలేదు గాని భర్తలున్న వారికి మాత్రం ఒంటరి మహిళ కింద పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒంటరి మహిళ కింద అడ్డగోలుగా పింఛన్లు మంజూరు చేసేశారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యికిలోపే ఒంటరి మహిళ పింఛన్లు ఉన్నాయి. టెక్కలిలో 1099 పింఛన్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గం విషయానికొస్తే ఏకంగా 3681 పింఛన్లు ఒంటరి మహిళ కేటగిరీలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,724 ఒంటరి మహిళ పింఛన్లు ఉంటే ఒక్క ఇచ్ఛాపురంలోనే 3681 పింఛన్లు ఉండటమేంటని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఒక్క నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా అర్హత లేనివారికి ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేశారని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇదే విషయమై జిల్లా అధికారులు అక్కడి అధికారులను వివరణ కోరేసరికి ఏం చేస్తాం... ఒత్తిడి అలాంటిదని చెప్పుకొచ్చినట్టు సమాచారం. భర్తతో వచ్చి ఒంటరి మహిళ కింద ధ్రువీకరణ పత్రాలు పొందినట్టుగా తెలుస్తోంది. అలాగే మిగతా నియోజకవర్గాల నుంచి ఒంటరి మహిళ పింఛన్లపై ఫిర్యాదులొస్తున్నాయి. కళ్ల ముందు భర్తలు కనబడుతున్నా... వారికెలా ఒంటరి మహిళ కింద పింఛన్లు ఇచ్చారని గ్రామాల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు జిల్లాలో ఒంటరి మహిళ పింఛన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ జరుపుతున్నాం. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఆధారంగా అర్హులా.. అనర్హులా? అన్న దానిపై విచారణ జరుపుతున్నాం. అక్రమాలు జరిగినట్టు తేలితే రద్దు చేస్తాం. – కళ్యాణ చక్రవర్తి, డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
చలనమే..సంచలనమై!
అడుగులు కదపలేని స్థితి నుంచి ఆయన గురించి గర్వంగా అడిగి తెలుసుకునే స్థాయికి ఎదిగారాయన. కాళ్లలో చలనం లేని స్థితి నుంచి సంచలనం సృష్టించేంత ఎత్తులో నిలబడ్డారాయన. చంద్రబోస్ ఒక పాటలో చెప్పినట్టు పిడికిలి బిగించి చేతిరాత మార్చుకున్నారు. చెమట్లు చిందించి నుదుటి గీత రాసుకున్నారు. అంతులేని పట్టుదలతో ఆదర్శప్రాయంగా మారారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే వాక్యానికి రుజువుగా నిలిచారు. ఇచ్ఛాపురంలో పుట్టి తెలంగాణకు ఆటలో ప్రాతినిథ్యం వహించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన తులసయ్య గురించి సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం కుగ్రామం తులసిగాం గ్రామానికి చెందిన పండూరు జోగయ్య, దాలమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన తులసయ్య 18 నెలల వరకు అందరి పిల్లల్లానే ఉండేవాడు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. విధి వక్రీకరించింది. జ్వరం బారిన పడిన తులసయ్యకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే బీద కుటుంబం, ఆపై కొడుక్కి పెద్ద కష్టం రావడంతో వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. తులసయ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ధర్మపురం ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తొలి విజయాన్ని అందుకున్నారు. తోటి స్నేహితులు, అన్నదమ్ముల సాయంతో ఇచ్ఛాపురం జ్ఙానభారతిలో ఇంటర్, శ్రీకాకుళంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్య చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ తనవారి గురించి ఆలోచించి హైదరాబాద్‌లో ఓ చానెల్లో వెబ్ రిపోర్టర్‌గా చేరాడు. అనుకోని అవకాశం.. పాఠశాలలో తోటి స్నేహితులతో క్రీడలపై ఆసక్తిని కనబర్చే తులసయ్యకు అనుకోని అవకాశం ముంగిట చేరింది. ఓ రోజు తులసయ్య ఆఫీసుకు వెళ్తుండగా అదే దారిలో చంద్రశేఖర్ అనే దివ్యాంగుడు పరిచయమయ్యాడు. తాను వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆటగాడినని, ఆసక్తి ఉంటే తనతో రమ్మంటూ ఆహ్వానం పలికాడు. ఆటలపై మక్కువ ఉన్న తులసయ్య తన సత్తాను నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించాడు. తెలంగాణా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పద్మతో పాటు కోచ్ సొహయిల్ ఖాన్లు తులసయ్యలో ఉన్న ప్రతిభను గుర్తించారు. సుమారు నెలన్నర రోజుల పాటు శిక్షణ పొందిన తులసయ్య అనతి కాలంలోనే వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు చెన్నై ఈరోడ్‌లో జరిగిన 5వ జాతీయ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 24 నుండి 29 వరకు చంఢీఘర్ రాష్ట్రం మొహాలీలో జరిగిన 6వ జాతీయ వీల్ చైర్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్లో పాల్గొని మళ్లీ నాల్గో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తులసయ్య ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికై బహుమతులు కైవసం చేసుకున్నాడు. మొక్కవోని దీక్షతో కష్టబడితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు తులసయ్య. ప్రభుత్వం ప్రోత్సహిస్తే... నాకు ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్, అథ్లెటిక్స్ కూడా ఆడుతాను. కానీ నాకు అంత ఖరీదైన వీల్‌చైర్ లేదు. ఈ ఏడాది డిసెంబర్లో దివ్యాంగులకు రంజీ క్రికెట్ పోటీలు ఉన్నాయి. అందులో ఆడి సత్తా నిరూపించుకోవాలని ఉంది. ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని క్రీడల్లో రాణించాలని ఉంది. ప్రస్తుతం నేను తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను. అవకాశం వస్తే శ్రీకాకుళం జిల్లాలో నా పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని ఉంది. – పి.తులసయ్య, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు -
మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య
సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : నేస్తాలు వచ్చేశాయి. మేఘాల పల్లకిపై ఉద్దానం వాకిటకు సంతానోత్పత్తి కోసం వేంచేశాయి. ఆడబిడ్డ పురుటి కోసం ఇంటికి వచ్చినంత సంబరంగా స్థానికులు ఈ పక్షి నేస్తాలను ఆహ్వానిస్తున్నారు. రెక్కల చప్పుడుతో చినుకులను వెంట తీసుకువచ్చే విహంగాల సంరక్షణ తమ బాధ్యతని చెబుతుంటారు. ఎక్కడో సుదూర తీరాన ఉన్న సైబీరియా నుంచి ఎగురుకుంటూ ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి వరకు ప్రయాణం చేసిన విహంగాలకు ఇక్కడ రెక్కలు విరిగిన వృక్షాలే స్వాగతమిచ్చాయి. గత ఏడాది వరకు తమ చేతులారా ఆహ్వానించిన వృక్ష రాజాలు నేడు మోడువారిన కాండాలనే పక్షి నేస్తాలకు ఆవాసాలుగా మలచనున్నాయి. పక్షుల సందడితో తేలుకుంచి పులకించిపోతోంది. కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడుతుంది. సుమారు 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి. ఆడపడుచుల్లా విదేశీ పక్షులు శతాబ్దాల నుంచి వలస వచ్చే విదేశీ విహం గాలపై ఈ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. వాటితో విడదీయరాని అనుబంధం ఈ గ్రామస్తులతో పెనవేసుకుంది. రావాల్సిన సమయంలో పక్షులు గ్రామాని కి చేరకపోతే ఇక్కడ ప్రజలు ఆందోళన పడతారు. ఏటా జూన్ మాసంలో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మ కం. వీటి రాకతోను తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయ ని గ్రామంలో ఉండే వృద్ధులు చెబుతుంటారు. తాము కూర్చున్న చోట, పక్కలో పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎలాంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారి నుంచి గ్రామస్తులమే రక్షిస్తుం టామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తారు. పక్షుల ప్రత్యేకతలు ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్ నెలలో సైబీరియా నుంచి వస్తున్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు) అంటారు. వీటి శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని అంటారు. పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తారుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా ఈసుకుంటాయి. ఆరు నెలలు పాటు త మ పిల్లలతో గడిపిన పక్షులు పక్షి పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరి నెలల్లో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. సంరక్షణ గాలికి పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో గాయాలపాలైన పక్షులకు ప్రథమ చికిత్స అందించిన అధికారులు అనంతరం వాటిని సంరక్షించాలన్న సంగతిని మరిచారు. గ్రామంలో చెట్లు పెంచా ల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ప్రత్యమ్నయంగా పక్షులు గూళ్లు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇనుప టవర్ పంజరాలు అక్కరకు రాకుండా పోయాయి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మూడేళ్ల కిందట పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. విహంగాలకు విడిది లేదు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విహంగాలకు తేలు కుంచిలో విడిది లేని పరిస్థితి నెలకొంది. వరుస తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరిగాయి. అంతే కాకుండా గత తిత్లీ తుఫాన్‌కు వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టా యి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు ఉండేందుకు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగుల బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.