independance celebrations
-
‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శాండ్ ఆర్ట్ మాధ్యమంలో చంద్రయాన్-3ని తీర్చిదిద్ది దేశప్రజలకు వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శాండ్ ఆర్ట్‌లో నిపుణుడైన విద్యార్థి అజయ్ త్రివర్ణాలతో కూడిన చంద్రయాన్-3ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ మన దేశం ఏనాడో స్వాతంత్ర్యం సాధించిందని, అయితే ఇప్పుడు చంద్రయాన్-3 పూర్తి స్థాయిలో సఫలమైతే మనదేశంలో ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన స్వతంత్ర్య దేశంగా రూపొందుతుందన్నారు. ఇస్రో ఇటీవలే చంద్రయాన్-3ని చంద్రుని నాల్గవ కక్ష్యలోకి పంపింది. ప్రస్తుతం చంద్రయాన్ దాదాపు 150 కి.మీ x 177 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ఇస్రో ఆగస్టు 14న ఉదయం 12 గంటల ప్రాంతంలో చంద్రయాన్-3లోని థ్రస్టర్లను ఆన్ చేసింది. దాదాపు 18 నిమిషాల పాటు ఇంజన్ ఆన్ చేశారు. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని మొదటి కక్ష్యలోకి చేరుకుంది. ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. -
స్వాతంత్ర దినోత్సవం రోజు వైఎస్సార్ అదిరిపోయే ప్రసంగం
-
నెరవేరని ఆకాంక్షలు.. ఆగని ఆక్రోశం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో పేదల ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఇంకా మనకు కనబడుతున్నాయి. బడుగు వర్గాల ప్రజల ఆక్రోశం ఇంకా వినిపిస్తూనే ఉంది. అనేక వర్గాల ప్రజల్లో తమకు స్వాతంత్య్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్న ఆవేదన ఉంది. వీటన్నింటినీ విస్మరించి దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుశ్చితమైన కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు.. అర్థమైన తర్వాత కూడా అర్ధం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు..’ అని ఆయన పేర్కొన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్నైతే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో.. ఆ సమాజం గొప్పగా పురోగమిస్తుందని స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రకృతి, ఖనిజ సంపదలు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి యువశక్తి, మానవ సంపత్తి కలిగి ఉన్న మన దేశం పురోగమించాల్సినంతగా పురోగమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు, తెలియనివారికి విస్తృతంగా తెలియపర్చాలన్న సదుద్దేశంతో 15 రోజుల పాటు ఈ విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నామని తెలిపారు. కరోనా లాంటి విష వాయువులు వస్తూపోతూ ఉంటాయి ‘సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ..ఈ ముగింపు ఉత్సవాలను 15 ఆగస్టుకు ముందు, తర్వాత కూడా జరపాలనుకుని, చాలా గొప్పగా జరుపుకున్నాం. ఈ ప్రయత్నమంతా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విష వాయువులు (దేశంలోని వర్తమాన రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ) వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్య్రపు ఉజ్వలత్వం, 75 ఏళ్లుగా జరుగుతున్న విషయాలను మరొక్కమారు సింహావలోకనం చేసుకుని, ముందుకు పురోగమించాల్సిన పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం యువకులకు, మేధావులకు, ఆలోచనపరులకు, ప్రజలందరికీ ఉంది..’ అని సీఎం అన్నారు మహాత్ముడి గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి ‘విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, ఆహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అలాంటి దేశంలో మహాత్మాగాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పోషించిన ఉజ్వలమైన పాత్రగురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు, ప్రాణ, ఆస్తి త్యాగాలు, ఎన్నో బలిదానాలు జరిగితే వచ్చింది. స్వేచ్ఛా భారతంలో మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నం. ఎందరో మహానీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ శిరస్సు వంచి జోహార్లు, ఘనమైన నివాళి అర్పిస్తున్నా. స్ఫూర్తి రగిల్చేలా..చర్చ చెలరేగేలా.. ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని కులం.. మతం.. జాతి అనే భేదం లేకుండా, పేద.. ధనిక తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరిపైనా ఉంది. అటువంటి స్ఫూర్తి రగిల్చేందుకే రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. చెట్లు నాటడం, ఆటలు, వ్యాసరచన పోటీలు..ఇలాంటివన్నీ ఎందుకు? ఏ సందర్భంలో జరుపుకుంటున్నాం? అని గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో చర్చ చెలరేగాలని, తద్వారా ప్రతి ఇంట్లో స్వాతంత్య్రం గురించి, ఆనాటి త్యాగాల గురించి స్ఫురణకు తెచ్చే సన్నివేశాలు రావాలని.. ఈ విధంగా 15 రోజుల పాటు కార్యక్రమాల్ని పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు... ‘సామూహిక జాతీయ గీతాలపన, పిల్లలకు గాంధీ సినిమాను ప్రదర్శించడం నాకు అన్నింటి కంటే బాగా నచ్చిన రెండు ఉదాత్తమైన విషయాలు. సుమారు కోటి మంది ప్రజలు జాతీయ గీతాన్ని ఏకకాలంలో ఆలపించడం రాష్ట్రానికే గర్వకారణం. మన జాతీయ స్ఫూర్తికి, భావానికి అది అద్దం పట్టింది. మహాత్ముడు విశ్వమానవుడు. అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఆయన గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు. కానీ ఆయన అంతటి మహాత్ముడు మరో 1000 ఏళ్లలో ఈ నేల మీద జన్మించడని ఐక్యరాజ్య సమితి ఘంటాపథంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసు. మనం ఏ దేశానికి వెళ్లినా గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చామని చాలా దేశాల ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అనేక దేశాలు గాంధీ లైబ్రరీలు నిర్వహించడం, ఆయన జీవిత విశేషాలు తెలియజేయడం, విగ్రహాలు ఏర్పాటు చేయడం మన దేశానికి గర్వకారణం. గాంధీ మార్గంలో పురోగమించేందుకు ఆలోచన చేయాలి గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారంటే అందులో 10 శాతం మంది ఆయన్నుంచి స్ఫూర్తి పొందినా, ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారని బలంగా నమ్ముతున్నా. భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించాలో మనమందరం ఆలోచన చేయాలి. గాంధీ బాటలోనే, ఆయన సూచించిన ఆహింసా సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు కేశవరావు కమిటీ సభ్యులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
'75ఏళ్ల స్వాతంత్య్రం.. భారతీయులుగా గర్విస్తున్నాం'
యావత్ భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను వైభవంగా జరుపుకుంటోంది. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుందామంటున్నారు మన సినీ స్టార్స్. చిరంజీవి, రామ్‌చరణ్, సల్మాన్ ఖాన్, షారుక్ ్ఖాన్, మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, సుష్మితా సేన్ సహా పలువురు సెలబ్రిటీలు స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టులను మీరూ చూసేయండి. Happy 75th Independence Day . Deep respect to the sacrifices made by our freedom fighters . Vande Maataram 🇮🇳 pic.twitter.com/SEFUEK8z5h — Allu Arjun (@alluarjun) August 15, 2022 One nation.. One emotion.. One identity! Celebrating 75 years of Independence! 🇮🇳#ProudIndian #HarGharTiranga @AmritMahotsav pic.twitter.com/BN5OOtWHj2 — Mahesh Babu (@urstrulyMahesh) August 15, 2022 యావన్మంది భారతీయులకు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !! నా ఇంటి ముందు గర్వంగా రెప రెప లాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. #HarGharTiranga #HappyIndependenceDay #IndiaAt75 #AmritMahotsav pic.twitter.com/hQYoeog2IU — Chiranjeevi Konidela (@KChiruTweets) August 15, 2022 Wishing everyone a Happy Independence Day! 🇮🇳 Let us take a moment to thank all the freedom fighters who fought for us to enjoy the fruits of freedom. 🙏 Makes me super proud to see the Har Ghar Tiranga initiative spreading far and wide.#HarGharTiranga #IndiaAt75 — Ram Charan (@AlwaysRamCharan) August 15, 2022 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Wishing everyone a Happy Independence Day. Jai Hind.🇮🇳 — Jr NTR (@tarak9999) August 15, 2022 Our Tiranga, Our Pride🇮🇳 Happy 75th Independence Day to all my lovely Indians!#LakshmiManchu #IndependenceDayIndia #AazadiKaAmritMahotsav #75thIndependenceDay #India #Indian #Flag #Salute #HarGharTiranga #IncredibleIndia #Tricolor #ProundIndian pic.twitter.com/iQ2VS26TZZ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) August 15, 2022 ಪಸರಿಸಲಿ ವಿಶ್ವಕ್ಕೆಲ್ಲಾ ಭಾರತದ ತ್ರಿವರ್ಣ ಧ್ವಜದ ಹಿರಿಮೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಭಾರತೀಯ ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳುವ 'ಜೈ ಹಿಂದ್' 🇮🇳 ಎಲ್ಲರಿಗೂ 76 ನೇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಮೃತ ಮಹೋತ್ಸವದ ಶುಭಾಶಯಗಳು. pic.twitter.com/2G11h19CKA — Yash (@TheNameIsYash) August 15, 2022 The Happiness that comes from FREEDOM is immeasurable. This #IndependenceDay put your freedom to right use & exercise your duties righteously. Jai Hind 🇮🇳 #IndiaAt75 🫡 pic.twitter.com/5pgMyyaqlR — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 15, 2022 View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) HAPPY INDEPENDENCE DAY!! To all my dear friends🙏 #IndependenceDay2022 pic.twitter.com/TGLalCcK4v — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 15, 2022 View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా ఫైర్
Sonia Gandhi.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రకటనలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం.. రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారత బలగాలు చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడాన్ని కాంగ్రెస్ అంగీరించదన్నారు. ఈ సందర్భంగానే మోదీ అనుసరిస్తున్న ఫాసిస్టు ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. కాగా, కర్నాటకలో బీజేపీ హర్ ఘర్ తిరంగాలో భాగంగా నెహ్రును తొలగించడంపై మండిపడ్డారు. దేశంలో గత సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. Sonia Gandhi targets PM Modi, says- Government trying to defame Gandhi, Nehru Sonia Gandhi targets PM Narendra Modi government trying to defame Gandhi Nehru Independence Day https://t.co/fDjaRZvqB0 — The Google (@thegoogle93) August 15, 2022 “గత 75 సంవత్సరాలుగా, అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. భారతదేశ దార్శనిక నాయకులు స్వేచ్ఛా, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థకు పునాదులు వేశారు. వారు బలమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థల కోసం నిబంధనలను సూచించారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుందని’’ సోనియా వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. -
మహాత్ముడికే కళంకమా?.. చిల్లర వేషాలు ఆపాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘విశ్వమానవుడు అని ప్రపంచం కీర్తిస్తున్న జాతిపిత మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యలు వింటున్నాం. దురదృష్టకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిదికాదు. కోటానుకోట్ల మంది గాంధీజీ ఫొటోను నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశం ఇది. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు. అలాంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా ఏకీకృతంగా, ఏకోన్ముఖంగా, ఏకకంఠంతో ఖండించాలి. మహాత్ముని కీర్తి మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రయత్నించాలి. మహాత్ముడు ఎన్నటికీ మహాత్ముడిగానే ఉంటడు. చిల్లరమల్లర శక్తులు చేసే ప్రయత్నాలు ఏనాటికీ నెరవేరవు. ఆకలి, పేదరికం ఉన్నంత వరకు ఆక్రందనలు, అలజడులు ఉంటాయి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఒక్కరూ ఖండించాలని, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... త్యాగధనులకు నివాళులు... నేను గాంధేయవాదిని అని గర్వంగా చెప్పుకొనే వాళ్లు కోటాను కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర ఓ అధికారి మహాత్మునికి గుడి కట్టించాడు. ఇండియా నుంచి వచ్చామని చెబితే విదేశీయులు గాంధీ దేశం నుంచా? అని అడిగినప్పుడు గర్వపడ్డ చరిత్ర మనది. అలాంటి మహాత్మునికి ఏమాత్రం కళంకం వచ్చినా సహించరాదు. 1947 ఆగస్టు 15 నుంచి 1975 మే 16 వరకు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి 584 సంస్థానాలను, స్వతంత్ర దేశాలను విలీనం చేస్తే ప్రస్తుత భారతదేశం రూపుదాల్చింది. ఈ కూర్పు కోసం ఎందరో మహానుభావులు, ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని చూశాం. ఎంతమందిమైనా చస్తం కాని మా స్వేచ్ఛ వాయువులు పీల్చేంత వరకు జెండా దించబోమని అనేక మంది భరతమాత బిడ్డలు, భగత్‌సింగ్ లాంటి త్యాగధనులు అసువులు బాసారు. వారందరికీ తెలంగాణ తరఫున నివాళులు. అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా... కొన్ని ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి బాధ పడాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి తరిమికొట్టిన గడ్డ మనది. ప్రశాంత, సస్యశ్యామల భారతదేశాన్ని చీల్చడానికి జరుగుతున్న చిల్లరమల్లర ప్రయత్నాలను ఏకకంఠంతో ఖండించాలి. స్వాతంత్య్ర స్ఫూర్తిని, జరుగుతున్న అభివృద్ధిని ద్విగుణీకృతం చేసే దిశగా ముందుకు పోవాలె. తెలంగాణ నుంచి అవసరమైతే జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి సమాయత్తం కావాలె. ఉప్పు సత్యాగ్రహంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వాళ్లు చాలా మంది పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలి. సిపాయిల తిరుగుబాటు విఫలమైనా పోరు ఆగలేదు భారత స్వాతంత్య్రం సుమారు ఒకటిన్నర శతాబ్దంపాటు కొనసాగిన పోరాటం. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా వాళ్లతో రాజ్యానికి సహకరించే సగం మంది కలిసినప్పుడే విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి. కానీ భారత స్వతంత్ర సమరంలోని 1857 సిపాయిల తిరుగుబాటు వంటి ఉజ్వల ఘట్టం తర్వాత కూడా ఆనాటి బ్రిటిష్ వలసరాజ్యం కూలిపోలేదు. మరింతగా ఉద్యమాన్ని అణచివేసింది. అయినా ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఎనాడూ నిరాశ చెందలెదు. వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. మహాత్మాగాంధీ నడుంకట్టడంతో దేశం ఆయన వెంట నడిచింది. అద్భుతంగా వజ్రోత్సవ వేడుకలు జరగాలి మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడలా గ్రామగ్రామాన అద్భుతంగా జరగాలి. ఎన్ని త్యాగాలతో, పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకూ తెలిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. కొత్త తరానికి స్వతంత్ర భారత పోరాటాల గురించి తెలియజేయాలి. గాంధీజీ సినిమాను 560 స్క్రీన్లలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేశాం. ఎక్కడివారు అక్కడే ఉండి సామూహిక జాతీయ గీతాలాపనను రాష్ట్రమంతా ఏకకాలంలో నిర్వహిస్తాం. పేదరికాన్ని నిర్మూలిస్తేనే శాంతి.. దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం లభిస్తుంది. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయిలో నెరవేరలేదు. దళిత సమాజం మాకు జరగవలసినంత జరగలేదని ఆక్రోశిస్తుంది. ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు, పేదలు అసంతృప్తితో ఉన్నారు. సాయుధ పోరాటాలు వచ్చినయ్. స్వాతంత్ర్యం రాకముందే 1940లో తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దారీ వ్యతిరేక పోరాటం జరిగింది. అది కొంత చైతన్యాన్ని తెచ్చింది. ఆ తర్వాత నక్సలిజంతోపాటు అనేక పోరాటాలు వచ్చాయి. వాటన్నింటినీ అధిగమించాలంటే సంకుచిత భావాలను పక్కనబెట్టి విశాల దృక్పథంతో ఆర్తులు, అన్నార్థులు, పేదలందరి సౌభాగ్యం కోసం కంకణబద్ధులై సాగాలి. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతిఒక్కరిలో కలగాలి. తెలంగాణ వచ్చాక పునర్నిర్మాణంలో ఎంతగానో కష్టపడుతున్నాం. ఎనిమిదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో సాధించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఫరిడవిల్లుతున్నాయి. 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. విశ్వమానవుడు మహాత్మా గాంధీ.. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా భారత పర్యటనలో భాగంగా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ‘గాంధీజీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ం అని ఆయన పేర్కొనడంతో అప్పుడు ఎంపీగా ఉన్న ఎంతో గర్వపడ్డాను. అలాగే ఐన్‌స్టీన్, నెల్సన్ మండేలా గాంధీజీ వ్యక్తిత్వాన్ని ఎంతగానో కొనియాడారు. అటువంటి జాతికి వారసులం మనందరం. యువతకు స్వాతంత్ర్యం విలువ తెలపాలి క్విట్ ఇండియా సంస్మరణ సందర్భంగా కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరంలో భాగంగా డూ ఆర్ డై నినాదంతో 1942 ఆగస్టు 8న గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నాటి మహనీయులకు నివాళులరి్పంచారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉందన్నారు. అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యకలాపాలు సోమవారం హెచ్ఐసీసీలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా కళాకారులు నిర్వహించిన నృత్య, సంగీత ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఆసక్తిగా తిలకించి కళాకారులను అభినందించారు. లేజర్ షోలు, ఫ్యూజన్ డ్యాన్స్‌లు సభికుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ కార్యక్రమాలకు ముందు పోలీసులు గౌరవ వందనంతో ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. గాంధీ విగ్రహానికి, భరతమాత చిత్రపటానికి కేసీఆర్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన 2,500 మందికిపైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి -
జమ్ము కశ్మీర్లో భారత వైమానిక దళ విన్యాసం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్స వద్ద భారత వైమాని దళం(ఐఏఎఫ్) 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఎయిర్ షో (వైమానిక విన్యాసం) నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఈ వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది.ఈ విన్యాసాల కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ‘మీ కలలకు రెక్కలు ఇవ్వండి’ అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ భారత వైమానిక చరిత్ర, ప్రాముఖ్యతను యువతకు తెలియజేసే విధంగా ఉంది. చదవండి: (ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో..) భారత వైమానిక దళం పట్ల యువత ఆసక్తి కలిగించడంతోపాటు జాతీయభావం పట్ల స్ఫూర్తి కలిగించడమే ఉద్దేశ్యంగా ఈ 'ఎయిర్ షో'ను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రదర్శనలో రకరకాల వైమానిక విన్యాసాల తోపాటు స్కై డైవింగ్ కూడా నిర్వహించారు. (చదవండి: జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్) -
పలు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్‌లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
75 వారాలు 75 ప్రాంతాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్రం తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులను స్మరించుకుని నివాళులు అర్పించాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైందని చెప్పారు. దేశ పురోగమనంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని పేర్కొన్నారు. 2021 మార్చి 12 నుంచి ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సభ్యులుగా సాధారణ పరిపాలన, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యా శాఖల కార్యదర్శులు, పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు, సభ్యకార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఉంటారని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. 75 ప్రాంతాల్లో ఎత్తయిన జాతీయ జెండాలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్‌లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, రాష్ట్రవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ భావాలను పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి పాల్గొన్నారు. ఉత్సవాల ప్రాధాన్యత, విధివిధానాలు, లక్ష్యాలను ప్రధాని వివరించారు. రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. మార్చి 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్‌లో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, వరంగల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు జాతీయ జెండావిష్కరణ, పోలీసు కవాతు తదితర దేశభక్తి కార్యక్రమాలు ఉంటాయని సీఎం తెలిపారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. -
ప్రధాని మోదీకి కేపీ శర్మ ఓలి ఫోన్
న్యూఢిల్లీ/ఖాట్మండూ: నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడాల్సిన తీరుపై ఇరు దేశాధినేతలు చర్చించారు. నేపాల్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్నేహ హస్తం అందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) అయితే గత కొన్ని రోజులుగా సరిహద్దుల విషయంలో నెలకొన్న వివాదం గురించి మాత్రం ఏవిధమైన చర్చ జరగలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల నేపాల్ అనుచిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్‌లో కలుపుతూ కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కొత్త మ్యాపులు విడుదల చేసింది. అంతేగాక దీనిని ఐరాసకు పంపించేందుకు సిద్ధమైంది. ఇక చైనాతో చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆ దేశ ప్రధాని ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత తొలిసారిగా ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేయడం గమనార్హం.(చైనా పేరెత్తడానికి భయమెందుకు?) భారత ప్రజలకు శుభాకాంక్షలు: చైనా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘భారత ప్రభుత్వం, ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రాచీన నాగరికత గల రెండు గొప్ప దేశాలైన చైనా, భారత్ పరస్పరం సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ శాంతి, అభివృద్ధి సాధించాలి’’అని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. కాగా గల్వాన్ ఘటనలో చైనా ఎంతమాత్రం బాధ్యత వహించబోదని సన్ వెడాంగ్ ఇటీవలి తన ఆర్టికల్‌లో పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. Congratulations to the Indian government & people on #IndependenceDay2020. Wish #China & #India, two great nations with ancient civilization prosper together in peace and develop with closer partnership. — Sun Weidong (@China_Amb_India) August 15, 2020 -
దేశ సరిహద్దుల్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
పంద్రాగస్టు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, హైదరాబాద్ : నేడు భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పంద్రాగస్టు అనగానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పండగే.. ఎక్కడ చూసిన మువ్వనెల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తోంది. భారతీయుల గుండెల్లో దేశభక్తి పరవళ్లు తొక్కుతోంది. నా దేశానికి ఏ హాని జరగకుండా కాపాడుకుంటామని.. మాతృభూమికి ఆపద వస్తే రక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామనే ధృడ సంకల్పం ప్రతి భారతీయునిలో కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరగుతాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ఎస్జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. (స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం) ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ రోజుఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనున్నారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడ జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలకు దాదాపు 30 వేల మంది పాల్గొనేవారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు కానున్నారు. ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలాగే దేశంలోని అన్ని చోట్లా నేడు పంద్రాగస్టు వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదగా నిర్వహిస్తున్నారు. జెండా ఆవిష్కరణ వేడుకలకు కొద్ది మంది మాత్రమే పాల్గొననున్నారు. నేడు పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉదయం 10.15 గంటలకు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట స్వాతంత్ర్య సంబురాలు జరుపుకోవాల్సిన నిబంధనలను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► ప్రతి చోట భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ► ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే.. ► ప్రతి చోట శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ► వేడుకల్లో పాల్గొనే వారికి 50 మందికి మించరాదు. ► 20 నిమిషాల్లో వేడుకను పూర్తి చేయాలి. ► సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదు. -
స్వాతంత్ర్య వేడుకలకు కరోనా వారియర్స్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో అత్యవసర సేవలందించిన కరోనా వారియర్స్‌ని ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ర్ట రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలను నిర్వహించాలని పేర్కొంది. కరోనా దృష్ట్యా భారీ స్థాయిలో జనం వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను కోరింది. స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించే మార్చ్ఫాస్ట్కు పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్సీసీ దళాలు మాస్క్ ధరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. -
సమరయోధుల పురిటిగడ్డ నాగుల్లంక
సాక్షి, పి.గన్నవరం : స్వాతంత్య్ర సంగ్రామంలో పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. 22 మంది పోరాట యోధులను స్వాతంత్య్ర ఉద్యమానికి అందించిన ఘనత ఈ గ్రామానికి దక్కుతుంది. నాగుల్లంకకు చెందిన ఉద్యమకారులు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర వహించి చరిత్రలో నిలిచారు. వీరిలో పలువురు జైలుశిక్ష కూడా అనుభవించారు. దీంతో పలువురికి నాటి ప్రభుత్వాలు తామ్రపత్రాలను అందించాయి. స్వాతంత్య్ర పోరాటంలో వీరి త్యాగానికి చిహ్నంగా 2002లో అప్పటి ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా నాగుల్లంకలో ‘స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపాన్ని’ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆరుమిల్లి వెంకటరత్నం, ఆరుమిల్లి విశ్వేశ్వరర రావు, ఆరుమిల్లి సుబ్బారావు, అడబాల నర్శింహ మూర్తి, గ్రంధి సూరన్న, ఆరుమిల్లి చౌదరి, ఆరుమిల్లి తాతయ్య, బద్దే ప్రకాశ రావు, గ్రంధి శ్రీరామ మూర్తి, గ్రంధి మూలాస్వామి, గ్రంధి సత్యం, కడలి పద్దయ్య, శ్రీఘాకోళపు వీరరాఘవులు, వలవల వీరన్న, మద్దా పెరుమాళ్లస్వామి, చిట్టినీడి మంగయ్య నాయుడు, ఆరుమిల్లి వెంకన్న, మీనపల్లి వెంకటరత్నం, చెన్ను ముత్యం, ఆకుల రఘుపతి, అద్దేపల్లి నర్సింహ మూర్తి, గద్దే లచ్చన్న పేర్లను ఈ స్థూపంపై చెక్కించారు. అప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15న ఈ స్థూపం వద్ద గ్రామస్తులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఉద్యమకారులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. -
జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవాన్ని స్వీకరించిన అనంతరం జెండానుఎగరేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి, అమరవీరులకు నివాళి అర్పించారు. కాగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఎగరవేయడం ఇది ఆరోసారి. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు ప్రత్యేక దుస్తులు ధరించి విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్, స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!
సాక్షి, మెదక్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ కలెక్టరెట్లో రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్ మెహదిరట్టాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉంటారని, అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశమన్నారు. పాఠశాల, కళాశాలస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, వ్యవసాయదారులు, ఇతర రంగాలలో పనిచేసేవారు, శాస్త్రీయ అవగాహన కలిగిన ఎవరైనా తమ ఆలోచనలను, ఆవిష్కరణలకు సంబంధించిన వీడియో, ఐదు వ్యాక్యాలు, పంపేటువంటి వ్యక్తి పేరు, ఇతర వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపించాలన్నారు. అలా పంపినవారిలో తెలంగాణా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు ఎంపిక చేసినవారు ఆగస్టు 15న జరిగే ప్రదర్శనలో ప్రదర్శించవచ్చని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారికి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8328599157 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. -
ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ
పుట్టపర్తి అర్బన్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి మిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. కర్ణాటక, మలయాలీ,హిందూస్థానీ సంగీతంతో భక్తులను మంత్రముగ్దుల్ని చేశారు. జగదోద్ధారణ, చందన చర్చిత, దేశ్ హమారా యా దేశ్ హమారా, తదితర స్వాతంత్య్ర దేశ భక్తుల జీవిత గాథలతో ముడిపడిన పాటలు ఆలపించారు. సత్యసాయి మహా సమాధిని అందంగా అలంకరించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు మహాసమాధి దర్శనం తర్వాత సంగీత కచేరీ నిర్వహించారు. -
మీ త్యాగం వృథా కానివ్వం!
అనంతపురం: తెల్లదొరల పాలన నుంచి దేశాన్ని విముక్తి కలిగించి స్వాతంత్య్రం సిద్ధించేందుకు పోరాటాలు చేసి అమరులైన సమరయోధుల త్యాగం వృథా కానివ్వకూడదని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరల దౌర్జన్యాలను ఎండగట్టి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుల త్యాగాలాను ఎప్పటికీ మరువలేమన్నారు. గాంధీజీ మార్గం, నెహ్రూ ఆలోచనలు, సుభాష్ చంద్రబోష్ పౌరుషంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు అసువులు బాసారన్నారు. తెల్లదొరల పాలన నుంచి మనల్ని విముక్తుల్ని చేశారన్నారు. అవినీతి, అక్రమాలను అరికట్టాల్సిన ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటం బాధాకరమన్నారు. గాంధీ చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నాటి త్యాగధనుల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, నాయకులు సుబ్బరాయుడు, సాదిక్, కుమ్మర ఓబులేసు, ముక్తియార్, కార్పొరేటర్ జానకి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, శ్రీదేవి, కొండమ్మ, అంకిరెడ్డి ప్రమీల, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల బాటలో నడుద్దాం
అనంతపురం : స్వాతంత్య్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహనీయుల బాటలో నడుద్దామని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ఎం మోహన్‌రెడ్డి, గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, ప్రధానకార్యదర్శులు గోపాల్‌మోహన్, మదన్‌మోహన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, లింగారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, సాంస్కృతిక విభాగాల జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు, రామకృష్ణ, రిలాక్స్ నాగరాజు, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి యూపీ నాగిరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా, సేవాదల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలనరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి శివారెడ్డి, బీసీ, సేవాదల్, మహిళ, మైనార్టీ విభాగాల నగర అధ్యక్షులు కసనూరు శీనా, వాయల శీనా, శ్రీదేవి, అంజద్‌ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవి, జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా పంద్రాగస్టు వేడుకలు
మూడు గంటల్లో కార్యక్రమం పూర్తి ఉదయం 7.30లోగా స్టేడియంలోకి రావాలి 9 గంటలకు సీఎంచే జాతీయ జెండా ఆవిష్కరణ 10 వేల మందికి ఏర్పాట్లు : కలెక్టర్ శశిధర్ వెల్లడి అనంతపురం సెంట్రల్ : స్వాతంత్య్ర వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశిధర్ తెలిపారు. శుక్రవారం ఆయన డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో రాష్ట్రస్థాయి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రస్థాయి వేడుకలు కావడంతో తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్తు దేశం మన జిల్లావైపు చూస్తోందన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నెల 15న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్టేడియంలోకి కేవలం పాస్ తీసుకున్న వారికి మాత్రమే అవకాశముంటుందని తెలిపారు. వీఐపీలు, వీవీఐపీలు కాకుండా రెండు వేల మంది సామాన్య ప్రజానీకానికి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. అనంతపురం ఆర్డీఓ మలోల వద్ద వెయ్యి పాసులు, కార్పొరేషన్ కమిషనర్ వద్ద 500 పాస్‌లు, అనంతపురం డీఎస్పీ వద్ద 500 పాస్‌లు ఉంచినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు సదరు అధికారులను సంప్రదించాలన్నారు. ఉదయం 7.30 గంటలకే స్టేడియంలోకి చేరుకోవాలని, అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 వరకూ కదిలేందుకు వీలుండదని, కావున ప్రజలు అల్పాహారం స్వీకరించి రావాలని సూచించారు. వేడుకల్లో 10 బృందాలు కవాతులో పాల్గొంటాయని తెలిపారు. ఐదు బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి సీఎం చేతుల మీదుగా అవార్డులు అందిస్తామన్నారు. సీఎం ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు. ఎవరు ఎలా రావాలంటే.. : ఏ1 పాస్‌లు తీసుకున్న వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు పీటీసీ ప్రధాన ద్వారం గుండా, ఏ2 పాస్‌లు తీసుకున్న అధికారులు, మీడియా ప్రతినిధులు గేట్ 2 ద్వారా, ఏ3 పాస్‌లు తీసుకున్న వారు గేట్ 3 ద్వారా, జనరల్ పాస్‌లు తీసుకున్న వారు బీ3 గేట్ ద్వారా రావాల్సి ఉంటుందని వివరించారు. పటిష్ట బందోబస్తు : ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నగరం మొత్తం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. మొత్తం 6 పార్కింగ్ స్థలాలు, 8 ఎంట్రీ పాయింట్లు, 4 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. నగరంలో అన్ని లాడ్జీలను, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో పీటీసీ ప్రిన్సిపల్ వెంకటరామిరెడ్డి, జేసీ లక్ష్మీకాంతం, ఆర్డీఓ మలోలా తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా స్యాతంత్య్ర వేడుకలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ పతాకావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మైదానంలో వీఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబం«ధించిన నివేదికలను శాఖల వారీగా సీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోదులు, న్యాయశాఖ అధికారులకు ఆహ్వానించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం కస్తూర్బా కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలో తిక్కన, పొట్టిశ్రీరాములు మహానుభావుల చరిత్రలతో కుడిన ప్రదర్శనలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యావసర వైద్యశిబిరాలు అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను అకట్టుకునే విధంగా సిద్ధం చేయాలని తెలిపారు. అధికారులు, ఉద్యోగులందరు హాజరుకాలన్నారు. వివిధ శాఖల రుణాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి, సీపీఓ పీబీకే మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, ఐటిడీఏ పీఓ కమలకుమారి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. -
'కోట'లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
గోల్కొండ: పంద్రాగస్టు పతాకావిష్కరణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటకు రానున్న దృష్ట్యా సెక్యూరిటీ విభాగం అధికారులు కోటలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ నర్సింహ పతాకావిష్కరణ వేదిక స్థలాన్ని, దాని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేదిక ఎదురుగా వీఐపీ, వీవీఐపీల కోసం సీట్లు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిల్లో సీఎం కేసీఆర్.. గోల్కొండ కోటకు హెలికాప్టర్లో రావాలనుకుంటే హెలిప్యాడ్‌కు అనువైన స్థలాలపై కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పోలీసుల ఆధీనంలో గోల్కొండ
హైదరాబాద్: రానున్న స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగురవేసే గోల్కొండ కోటను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కదలికలపై సమాచారం ఉన్న కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి. అదే విధంగా అమెరికా నిఘా సంస్థలు కూడా భారత్‌పై ఐఎస్ఐఎస్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగుర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఫిర్యాదుకు అనుమతి లభించింది. దీంతో పోలీసులు కోట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసులు, రాష్ట్ర నిఘా వర్గాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
విశాఖలో పంద్రాగస్టు ఉత్సవాలు
హైదరాబాద్: ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో పంద్రాగస్టు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ యువరాజ్ ఏర్పాట్ల విషయంలో సాధారణ పరిపాలనశాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు పరేడ్ ఏర్పాట్లను రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా పర్యవేక్షణ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా సమాచార శాఖ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. రూట్ మ్యాప్‌తో పాటు కార్లు పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను హోంశాఖ చూడాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. పాఠశాల విద్యా శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలకు తీసుకువచ్చే విద్యార్ధులకు బస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ శకటాల ప్రదర్శనలకు అన్ని శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు.