india cricket
-
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
నేటి నుంచి భారత దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలు
బెంగళూరు: భారత జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రారంభానికి రెండు వారాల ముందుగానే 2024–2025 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు తెర లేవనుంది. ఇందులో భాగంగా గురువారం దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘బి’ జట్టు... అనంతపురంలో నిర్వహించనున్న మరో మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టుతో భారత ‘డి’ జట్టు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా మరో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... ఈ టోరీ్నలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. భారత కెపె్టన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినివ్వగా... మిగిలిన యువ ఆటగాళ్లందరూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రిషభ్ పంత్... చాన్నాళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడనున్నాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న శుభ్‌మన్ గిల్ భారత ‘ఎ’ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ భారత్ ‘బి’ నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీని జాతీయ సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఉవి్వళ్లూరుతున్నారు. మిడిలార్డర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుండగా... సిరాజ్ అనారోగ్యంతో టోరీ్నకి దూరమయ్యాడు. బుమ్రా కూడా అందుబాటులో లేకపోవడంతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేసర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కడం ఖాయమే. దీంతో ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, విద్వత్ కావేరప్ప, విజయ్ కుమార్, హర్షిత్ రాణాలపై సెలెక్టర్లు దృష్టి సారించనున్నారు. స్పిన్ విభాగంలో సత్తా చాటేందుకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సాయికిశోర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్ సిద్ధంగా ఉన్నారు. ఇషాన్ కిషన్ అవుట్ దేశవాళీ టోర్నీల్లో ఆడని కారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆడటం లేదు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఇషాన్... భారత ‘డి’ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతపురం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో భారత్ ‘సి’తో భారత్ ‘డి’ ఆడుతుంది. దీంతో గురువారం ప్రారంభం కానున్న పోరులో భారత్ ‘డి’ తరఫున ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు కూడా తొలి రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇషాన్ స్థానంలో సంజూ సామ్సన్ను జట్టులోకి తీసుకున్నారు.జట్లు భారత్ ‘ఎ’: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుశ్ కొటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శాశ్వత్. భారత్ ‘బి’: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ సాధిస్తేనే), వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, యశ్ దయాల్, ముకేశ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్, మోహిత్ అవస్తి, జగదీశన్. భారత్ ‘సి’: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పొరెల్, ఇంద్రజీత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, విజయ్‌కుమార్, అన్షుల్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, అర్యాన్ జుయల్, సందీప్ వారియర్. భారత్ ‘డి’: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడె, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్, రికీ భుయ్, సారాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్, ఆకాశ్ సేన్ గుప్తా, శ్రీకర్ భరత్, సౌరభ్ కుమార్. -
ఆ క్రికెట్ బెట్టింగ్ యాప్‌తో వారికి ఎలాంటి సంబంధం లేదు: డాబర్ గ్రూప్
క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో తమకు ఎటువంటి పాత్ర లేదని డాబర్ గ్రూప్‌నకు చెందిన బర్మన్ కుటుంబం స్పష్టం చేసింది. ఇటీవల మహదేవ్ క్రికెట్ బెట్టింగ్‌యాప్‌తో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లు వినిపించాయి. దాంతో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమచారం. అయితే వివాదంపై డాబర్గ్రూప్ స్పందించింది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌ను తాము కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం కోసం కావాలనే ఈ ఫిర్యాదు నమోదుచేశారని పేర్కొంది. నవంబరు 7న నమోదైనట్లు చెబుతున్న ఆ ఎఫ్ఐఆర్లో యాప్ ప్రమోటరు మహదేవ్‌తో పాటు 32 మందిపై ఫిర్యాదు చేసినట్లు ఉంది. అందులో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లున్నాయి. ఎఫ్ఐఆర్లో మోహిత్, గౌరవ్‌లకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. వారెవరూ మోహిత్, గౌరవ్‌లకు తెలియదని గ్రూప్ సభ్యులు తెలిపారు. బర్మన్ కుటుంబానికి రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 21.24 శాతం వాటా ఉంది. అయితే ఆ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న సమయంలో ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి బర్మన్స్ గ్రూప్ రెలిగేర్‌కు రూ.2,200 కోట్ల ఒపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. కానీ, ఓపెన్ ఆఫర్ చేయడానికి ఆ గ్రూప్‌నకు అర్హత లేదంటూ రెలిగేర్ స్వతంత్ర డైరెక్టర్లు నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ, ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థలు సూచించిన అన్ని అర్హతలూ తమకున్నాయని బర్మన్స్ పేర్కొన్నారు. అదే సమయంలో 2018 నుంచి రెలిగేర్ ఛైర్పర్సన్ రశ్మీ సలూజా పారితోషికం రూ.150 కోట్లకు పెరగడంపైనా బర్మన్స్ ప్రశ్నలు లేవనెత్తగా.. సలూజా వాటిని తోసిపుచ్చారు. ఓపెన్ ఆఫర్ విషయాన్ని అనధికారికంగా సలూజాకు తెలియపరచిన తదుపరి రోజే సలూజా తన షేర్లను విక్రయించడంపైనా బర్మన్స్ ఆరోపణలు చేశారు. -
టీ 20 వరల్డ్ కప్ గెలిచేది ఆ మూడు జట్లే...
-
భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్
దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది. -
కోహ్లి నిర్ణయం సరైందే
-
టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ
-
ధోని జెర్సీ సైజు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటపైనే కాకుండా... పెరుగుతున్న వయసు కారణంగా అతని ఫిట్‌నెస్‌పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ధోని తాను మరింత ఫిట్‌గా మారినట్లు చెప్పుకొచ్చాడు. టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకునేందుకు శ్రమించాను. ఇప్పటి వరకు గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడిని. ఇప్పుడు అది ఔకు మారింది. ఇకపై దీనిని కొనసాగిస్తా’ అని అతను అన్నాడు. ఇదే తరహాలో స్పందించిన కెప్టెన్ కోహ్లి తాను చాలా కాలంగా ఔ వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు. 2008 అండర్–19 ప్రపంచ కప్‌లో తాను అడగకుండానే ‘18’ నంబర్ జెర్సీ ఇచ్చారని... వరల్డ్ కప్ గెలుచుకోవడంతో పాటు తర్వాతా కలిసి రావడంతో అదే నంబర్‌ను కొనసాగించాను తప్ప ప్రత్యేక కారణమేదీ లేదని కోహ్లి వెల్లడించాడు. మరిన్ని ప్రత్యేకతలతో... భారత క్రికెట్ జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. శుక్రవారం దీని ఆవిష్కరణ జరిగింది. నేటినుంచి జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. గతంలోలాగే రీసైకిల్డ్ మెటీరియల్‌తో ‘నైకీ’ దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు’ ఇకపై కాలర్ లోపలి వైపు కనిపిస్తాయి. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్ కప్ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ చేసిన స్కోర్లు దానిపై ముద్రించారు. అంతే కాకుండా ఆ మూడు ఫైనల్స్ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి (అక్షాంశాలు–రేఖాంశాలు) కూడా దీనిపై ముద్రించడం మరో విశేషం. కార్యక్రమంలో కోహ్లి, ధోనిలతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్, జెమీమా... టెస్టు ఆటగాళ్లు రహానే, పృథ్వీ షా కూడా పాల్గొన్నారు. -
'సుందర'కాండ
బ్యాట్స్‌మెన్ విరుచుకుపడతారన్న భయం లేదు తానొక ఆఫ్ స్పిన్నర్‌నన్న బెరుకు లేదు పరుగులు భారీగా ఇస్తానేమోనన్న ఆందోళన లేదు పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నానన్న ఒత్తిడి లేదు ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే...! అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ)ను చేసింది నిదహస్ ట్రోఫీలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిపింది అతడే వాషింగ్టన్ సుందర్! సాక్షి క్రీడా విభాగం :టి20 మ్యాచ్‌లంటేనే తీవ్ర ఒత్తిడితో కూడుకున్నవి. ఒక్క ఓవర్‌తో ఫలితం తారుమారయ్యేవి. పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కనిపించే చోట, ఏమాత్రం లైన్ తప్పినా బౌలర్లకు మిగిలేది చేదు అనుభవమే. ఇక పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలంటే ప్రతిభ కంటే... ఎదురుదాడిని తట్టుకునే మానసిక దృఢత్వం ముఖ్యం. ప్రత్యర్థి జట్లలో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉంటే ఆఫ్ స్పిన్నర్‌కు మరింత పరీక్ష ఎదురైనట్లే. కానీ, 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ వీటన్నింటినీ అధిగమించి విజయవంతమయ్యాడు. మిగతా ప్రధాన బౌలర్లు తమ కోటా పూర్తి చేయడానికే నానా కష్టాలు పడుతుంటే సుందర్ మాత్రం అటు పరుగుల కట్టడి, ఇటు వికెట్లూ తీస్తూ అలవోకగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకే టోర్నీలో ‘ఎంవీపీ’గా నిలిచాడు. అనూహ్యంగానే.. నిదహస్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సమీకరణాల ప్రకారం చూస్తే వాషింగ్టన్కు తుది జట్టులో చోటు కొంత అనుమానంగానే ఉండేది. అయితే, తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న అతడు ఏకంగా పవర్ ప్లేలో బౌలింగ్‌కు దిగి చక్కటి గణాంకాలతో మెప్పించాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లకూ కొనసాగించక తప్పలేదు. ఈ నమ్మకాన్ని సుందర్ ఎక్కడా కోల్పోలేదు. టోర్నీలో ప్రధాన పేసర్లు శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్‌తో పాటు విజయ్ శంకర్ కూడా ఓవర్‌కు పది పరుగులిచ్చిన సందర్భాలున్నాయి. చహల్ సైతం ఓసారి గాడితప్పాడు. కానీ ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో ప్రారంభ ఓవర్లు వేసిన సుందర్ ఎకానమీ 5.7 మాత్రమే. దీన్నిబట్టి అతడెంత కట్టుదిట్టంగా బంతులేశాడో తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియా దర్జాగా ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ‘ముని వేళ్ల’ మాయాజాలం ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో టాప్ 15 బౌలర్లలో ఏడుగురు మణికట్టు (లెగ్) స్పిన్నర్లే. బ్యాట్స్‌మెన్‌ను వైవిధ్యం, ఊహాతీత బంతులతో అవుట్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ... సుందర్ ఆఫ్ స్పిన్నర్. అతడి మాయాజాలం అంతా మునివేళ్ల మీదనే ఉంటుంది. బ్యాట్స్‌మన్ భారీ షాట్‌కు యత్నిస్తున్నాడని పసిగట్టి వెంటనే బంతి వేగం తగ్గించి, లైన్‌ను మార్చేస్తాడు. నిదహస్లో పూర్తిగా ఇదే పద్ధతి పాటించి వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికైతే భవిష్యత్ ఆఫ్ స్పిన్ ఆశాకిరణంగా సుందరే కనిపిస్తున్నాడు. దీనిని అతడెంత మేరకు నిలుపుకొంటాడో చూద్దాం. అవసరమైనవాడే... సీనియర్ అశ్విన్‌ను టెస్టులకే పరిమితం చేశారు. మరోవైపు చహల్ లెగ్ స్పిన్నర్ కాగా, కుల్దీప్ ఎడమ చేతివాటం చైనామన్ బౌలర్. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు ప్రస్తుతం ఒక ఆఫ్ స్పిన్నర్ అవసరం చాలా ఉంది. దీనిప్రకారం వన్డేలు, టి20ల్లో సుందర్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ కావడం, హిట్టింగూ చేయగలగడం ఇతడికి ఉన్న మరో సానుకూలాంశం. అసలు తాను క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది కూడా బ్యాట్స్‌మన్‌గానే. ఈ నేపథ్యంలో లోయరార్డర్లో ఉపయుక్తంగానూ మారగలడు. ముందుంది అసలు కాలం కెరీర్ ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినా ప్రత్యర్థులు చదివేశాక ఒక్కసారిగా తెరమరుగైన వారిని గతంలో చూశాం. తాను కూడా అలా కాకుండా ఉండాలంటే సుందర్ ఎప్పటికప్పుడు మెరుగుపడాలి. ఈ దిశగా ఐపీఎల్ అతడికి మంచి అవకాశం. ఎందుకంటే సుందర్ ఈసారి విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడనున్నాడు. జట్టు కోచ్ కివీస్ దిగ్గజ స్పిన్నర్ వెటోరీ. ఆధునిక తరం కోచ్‌గా వెటోరీకి పేరుంది. ఆటగాడిగా మెరుగుపడేందుకు ఇంతకుమించిన చాన్స్ ఉండదు. కాబట్టి దీనిని రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. పవర్ ప్లేలో బౌలింగ్ సవాలు లాంటిది. దీనిని గెలిస్తే చాలా సంతృప్తి దక్కుతుంది. క్రికెట్ ఆడేది ఇలాంటివాటి కోసమే కదా? బౌలింగ్ సందర్భంగా నన్ను నేను బ్యాట్స్‌మన్‌గానే భావించుకుంటా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో, ఎక్కడకు కొట్టబోతున్నాడో పసిగడతా. ఆరు బంతుల్లో కనీసం ఫోర్ లేదా సిక్స్ కొట్టాలని చూసే బ్యాట్స్‌మన్ తీరును అర్ధం చేసుకోవడం ముఖ్యం. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌లు రవిశాస్త్రి, భరత్ అరుణ్ చాలా పోత్స్రహించారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో మునివేళ్ల స్పిన్నర్లూ ప్రభావం చూపగలరు – వాషింగ్టన్ సుందర్ -
పట్టు కొనసాగిస్తే చాలు...
-
తొలి టీ20లో భారత్ ఘనవిజయం
-
నా శరీరాన్ని కోస్తే రక్తమే వస్తుంది!
కోల్‌కతా: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో నిరంతరాయంగా ఆడుతున్నాడు. జట్టులో సభ్యులు మారుతున్నా ఒక్క కోహ్లి మాత్రం ఎక్కడా విరామం తీసుకోవడం లేదు. సరిగ్గా చెప్పాలంటే 2016 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి ఎదుర్కొన్నన్ని బంతులు (4803) ఎవరూ ఎదుర్కోలేదు! అయితే ఇప్పుడు కోహ్లి కూడా తనకు విశ్రాంతి కావాలని భావిస్తున్నాడు. శ్రీలంకతో చివరి టెస్టు నుంచి అతనికి విరామం ఇవ్వవచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో కోహ్లి స్పందించాడు. ‘ఎందుకు వద్దు? కచ్చితంగా నాకు కూడా విశ్రాంతి కావాల్సిందే. నా శరీరానికి ఎప్పుడు విశ్రాంతి కావాలని అనిపిస్తే అప్పుడు అడుగుతాను. నేనేమీ యంత్రాన్ని కాను. మీరు నా శరీరాన్ని కోసి రక్తం వస్తుందా లేదా చూసుకోవచ్చు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. అయితే ‘పనిభారం’ ఎక్కువ కావడం అనే విషయం సాధారణ జనాలకు స్పష్టంగా అర్థం కాదని, అది తెలియకుండా విశ్రాంతి ఎందుకని ప్రశ్నిస్తుంటారని కోహ్లి విమర్శించాడు. ‘సాధారణంగా ఒక ఆటగాడు ఏడాదిలో 40 మ్యాచ్‌లు ఆడతాడు. అయితే తుది జట్టులోని 11 మందిపై ఒకే రకమైన భారం ఉండదు. కొందరు మాత్రమే 45 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే మరికొందరు 30 ఓవర్లు బౌలింగ్ చేస్తారు. ఆటగాళ్లందరూ ఒకే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడినా... వారు క్రీజ్‌లో గడిపిన సమయం, చేసిన పరుగులు, ఎదుర్కొన్న ఓవర్లు, పరిస్థితులు తదితర అంశాలు ప్రభావం చూపుతాయి. క్రీజ్‌లో ఎక్కువ సేపు ఉండే పుజారాకు, వచ్చీ రాగానే ధనాధన్ షాట్లు కొట్టిపోయే ఆటగాడికి మధ్య తేడా ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పనిభారం ఎంతనేది ఒక నిర్ణయానికి రావచ్చు’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోకుండా మూడు ఫార్మాట్లలో ఒకే తరహా ప్రదర్శనను, అంతే తీవ్రతను కొనసాగించడం మానవమాత్రులకు అసాధ్యమని కోహ్లి తేల్చి చెప్పాడు. భారత్, శ్రీలంక మధ్య తరచుగా మ్యాచ్‌లు జరగడం అభిమానుల్లో ఆసక్తి తగ్గిస్తుందని అంగీకరించిన కోహ్లి... దీనికి ప్రత్యామ్నాయం చూడకుంటే ఫ్యాన్స్ ఆటకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అయితే నేను ఫలానా మ్యాచ్ ఆడననో, క్రీజ్‌లోకి వెళ్లాక బ్యాటింగ్ చేయబుద్ధి కావడం లేదనో చెప్పే అవకాశం క్రికెటర్లకు ఉండదని కోహ్లి స్పష్టం చేశాడు. -
నేనే విశ్రాంతి అడిగా: హార్దిక్ పాండ్యా
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. వంద శాతం ఫిట్‌గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విరామ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు 24 ఏళ్ల పాండ్యా వెల్లడించాడు. శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు జట్టులోకి ఎంపిక చేసి కూడా సెలక్టర్లు ఆ తర్వాత విశ్రాంతి పేరుతో పాండ్యాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది. -
భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిషేదించాలి: పాక్
లాహోర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనంతరం కొందరు ఆకతాయిలు రాయి విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్నే ఆసరాగా తీసుకుంటూ.. పాక్ అభిమానులు ట్విట్టర్ వేదికగా భారత్‌పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిచడానికి వీలు లేదు. అక్కడ ఆటగాళ్లకు భద్రత కరువైంది. భారత్‌లో ఉగ్రవాద చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఐసీసీ వెంటనే భారత్‌లో క్రికెట్‌పై నిషేదం విధించాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక వరల్డ్ ఎకానమీ ఫోరం సంస్థ చేసిన సర్వేలో పర్యాటక దేశాల్లో ప్రపంచంలోనే నాలుగో ప్రమాదకరమైన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. అలాంటి దేశం భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించొద్దని, అక్కడ ఆటగాళ్లకు భద్రత లేదని అంటోందా అని భారత అభిమానులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లపై పాక్‌లో ఉగ్రదాడి జరగడంతో ఐసీసీ ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాక్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ తీవ్రంగా శ్రమిస్తుస్తోంది. ఈ మధ్యే ప్రపంచ ఎలెవన్ జట్టు పాక్‌లో పర్యటించి టీ20 సిరీస్ ఆడింది. Alhamdullilah. Thanks to Allah . Pakistan is safe country. India is behind in all terrorists activities — Adil Raza 🇵🇰 (@AdilRaza1991) 10 October 2017 And then they say #Pakistan is not a safe place. I can assure you @AaronFinch5 that Pakistan is ever safer than #India. We are a peaceful & cricket loving nation We want our cricket back And we will do InshaAllah #HopeNotOut https://t.co/1wgI4oV3Us — HAMAS \o/ (@HamasulGhani) 11 October 2017 -
చిన్నప్పటి నుంచి నేనింతే!
ఇండోర్: గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా అలవోకగా బంతిని గాల్లోంచి బౌండరీ దాటిస్తున్నాడు. అయితే ఇదేమీ తనకు కొత్త కాదని, సిక్సర్లు కొట్టే సామర్థ్యం తనకు చిన్నప్పటినుంచి ఉందని పాండ్యా చెప్పాడు. పాకిస్తాన్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తనలోని ఈ సత్తా బయటపడిందనే విషయాన్ని తాను అంగీకరించనని అతను అన్నాడు. ‘పాక్‌తో మ్యాచ్ తర్వాతే నా ఆట మారిందని ఎవరైనా భావిస్తే దానికి నేను అభ్యంతర పెట్టను. అంతకంటే ముందు ఐపీఎల్లో కూడా నేను చాలా బాగా ఆడాను. ఈ ఏడాది ఐపీఎల్లో విఫలం కావడంతో తీవ్రంగా శ్రమించి ఫామ్‌లోకి వచ్చాను. గతంలో కూడా నేను భారీ సిక్సర్లు కొట్టేవాడిని. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఆడుతుండటం తప్ప అందులో తేడా ఏమీ లేదు. సరిగ్గా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి కూడా భారీ సిక్సర్లు బాదే అలవాటు నాకుంది’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగడాన్ని సవాల్‌గా తీసుకోవడంకంటే దానిని ఒక మంచి అవకాశంగా భావించానన్న హార్దిక్... కెరీర్లో తొలిసారి ఎక్కువ బంతులు (72) ఆడే అవకాశం రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. -
కోహ్లీ గురించి గంగూలీ ఏమన్నాడంటే..
కోల్‌కతా: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. తన ఫేవరేట్ కెప్టెన్లలో విరాట్ ఒకడని దాదా అన్నాడు. 'విరాట్ దూకుడైన క్రికెటర్. అతను తక్కువ కెరీర్లోనే దేశంకోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. టీమిండియాను గెలిపించాలనే తపన, పోరాట స్ఫూర్తి, అంకితభావం కోహ్లీలో కనిపిస్తాయి. భారత కెప్టెన్‌గా లేదా బ్యాటింగ్‌కు వెళ్లేటపుడు అతని ముఖం చూస్తే సాధించాలన్న తపన కనిపిస్తుంది. ఇప్పుడు దేశానికి అతని అవసరముంది. భారత క్రికెట్‌కు అతను గొప్ప బలం' అని దాదా చెప్పాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియానే ఫేవరేటని గంగూలీ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్ దాదాపుగా అజేయమైన జట్టని, న్యూజిలాండ్ సహా ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పాడు. -
అచ్చం నాలాగే షాట్లు కొట్టాడు: ధోనీ
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎంఎస్ ధోనీ' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుట్.. తెరపై మహీలా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ధోనీలా నటించడం, బ్యాటింగ్ చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ముఖ్యంగా ధోనీ మార్క్ హెలికాప్టర్ షాట్లను తెరమీద అద్బుతంగా పండించాడట. సుశాంత్ బ్యాటింగ్ స్కిల్స్ చూసి ధోనీ ఆశ్చర్యపోయాడు. తన పాత్రలో సుశాంత్ బాగా నటించాడని ధోనీ కితాబిచ్చాడు. ఈ సినిమా వచ్చే నెల 30న విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్ విడులైంది. 'ఈ సినిమా కోసం సుశాంత్ కష్టపడి పనిచేశాడు. తొమ్మిదినెలలకుపైగా రోజూ మూడుగంటలకు పైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నాలాగే షాట్లు కొట్టాడు' అని ధోనీ చెప్పాడు. మైదానంలో గెలుపోటములకు అతీతంగా వ్యవహరించే 'మిస్టర్ కూల్' ధోనీలా తెరపై కనిపించేందుకు సుశాంత్ బాగా సాధన చేశాడు. ధోనీలా నడవడం, మాట్లాడటం కోసం చాలా ప్రాక్టీస్ చేశాడు. -
ఆ కమిటీ ఎక్కడ?
సరిగ్గా ఆరు నెలల క్రితం... భారత క్రికెట్లో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆట అభివృద్ధి, జట్టు విజయాల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల రూపంలో ముగ్గురు దిగ్గజాలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఈ కమిటీ గురించి ఎక్కడా వార్త లేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కొత్త కమిటీల్లో అసలు ఈ కమిటీ పేరు కూడా లేకపోవడం గమనార్హం. * కనిపించని బీసీసీఐ సలహా కమిటీ * తాజా జాబితాల్లోనూ లేని త్రిమూర్తుల పేర్లు సాక్షి క్రీడావిభాగం: ‘స్వదేశంలో భారత జట్టు బాగాఆడుతున్నా... విదేశాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నందున వారికి దిశానిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులు అవసరం...’ సరిగ్గా ఇవే మాటలతో బీసీసీఐ త్రిసభ్య సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి బోర్డు అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి ఠాకూర్ కలిసి చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. జూన్ 1న ఈ కమిటీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత అదే నెల ఆరో తేదీన కోల్‌కతాలో సచిన్, లక్ష్మణ్, గంగూలీ సమావేశమయ్యారు. అంతే... ఆ తర్వాత ఈ ముగ్గురూ కలిసి కూర్చున్నది లేదు. దాల్మియా మరణానంతరం గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికవడం, లక్ష్మణ్ కామెంటరీతో బిజీగా మారడం, సచిన్ రకరకాల వ్యాపకాలతో ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో ఈ ముగ్గురూ కలవలేదు. ఈ లోగా బీసీసీఐలోనూ రకరకాల పరిణామాలు జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పగ్గాలు అందుకోగానే అన్ని కమిటీలను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కమిటీల్లో మెంబర్ల సంఖ్యను తగ్గించి మార్పు చేర్పులతో కొత్త కమిటీలను ప్రకటించి వీటిని బీసీసీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో త్రిమూర్తులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఊసే లేదు. వారికైనా తెలుసా? అసలు ప్రస్తుతం ఈ కమిటీ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే బీసీసీఐ జాబితాలో ఎందుకు చూపించలేదు..? లేకపోతే ఆ విషయం సచిన్, లక్ష్మణ్, గంగూలీలకు తెలిపారా? ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం బీసీసీఐ అధికారుల్లో చాలామందికి అసలు ఈ కమిటీ గురించే తెలియదు. ‘ఈ కమిటీ ఉందని నేను అనుకోవడం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. మరోవైపు క్రికెటర్లు దీని గురించి బాహాటంగా ఏమీ చెప్పకపోయినా... వారి సన్నిహితులు మాత్రం ‘ఈ కమిటీ ఉందో లేదో క్రికెటర్లకు తెలియదు’ అని చెబుతున్నారు. అంటే బోర్డు నుంచి వీరికి ఎలాంటి సమాచారం లేదనేది స్పష్టం. ఎందుకు ఏర్పాటు చేశారంటే... జూన్ ఆరో తేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు కార్యాచరణ గురించి మాట్లాడారు. విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగుపడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంతర్జాతీయ క్రికెట్లో షెడ్యూల్ బిజీగా మారినందున... మూడు ఫార్మాట్లను సీనియర్లు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దేశంలో మౌళిక సదుపాయాల పెంపునకు ఏం చర్యలు తీసుకోవాలి..? దేశంలో జూనియర్ క్రికెట్ స్థాయిలోనే నాణ్యతను ఎలా పెంచాలి?... ఇలా కొన్ని అంశాలపై ఈ ముగ్గురూ బీసీసీఐకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉండాలి. అయితే ఆ తర్వాత బోర్డు వీరికి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం జూలై నెలాఖరులో వీరు సమావేశం కావలసి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ద్రవిడ్‌కు ముందే తెలుసేమో..! బీసీసీఐ ఏర్పాటు చేసే కమిటీలు, బీసీసీఐ వ్యవహారశైలి గురించి అందరిలోకీ ద్రవిడ్‌కే ఎక్కువ ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఆనాడు నలుగురు క్రికెటర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామంటే తను తిరస్కరించాడు. కమిటీల పట్ల తనకు ఆసక్తి లేదని, జూనియర్ జట్లకు కోచ్‌గా పని చేస్తాననే ప్రతిపాదనతో వచ్చాడు. కాబట్టి తను ఇప్పటికీ తన బాధ్యతలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అండర్-19 జట్టుకు కోచ్‌గా శ్రీలంకలో ఉన్నాడు. నిజానికి బోర్డు ఈ కమిటీని నిర్లక్ష్యం చేయడం ఈ దిగ్గజాలను అవమానించడమే. ఇప్పటికైనా బీసీసీఐ మేలుకొని ఈ కమిటీ విషయంలో ఓ నిర్దిష్ట ప్రకటన చేస్తే మంచిది. -
'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు'
హైదరాబాద్: భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మంచి భవిష్యత్ ఉందని మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అన్నాడు. అయితే క్రికెట్ పాలనాధికారిగా స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువమంది ఎదురవుతారని శ్రీనాథ్ హెచ్చరించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీని నియమించే అవకాశముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీనాథ్ పైవిధంగా స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు, క్యాచ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్‌గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
కొలంబో టెస్టుకు వర్షం ఆటంకం
కొలంబో: భారత్, శ్రీలంక చివరి, మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ 15 ఓవర్లలో 50/2 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. పుజారా (19), విరాట్ కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఆటను నిలిపివేశారు. మూడో టెస్టుల సిరీస్‌లో భాగంగా కొలంబోలో జరుగున్న ఈ మ్యాచ్‌లో లంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన వెంటనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2), రహానె (8) వెంటవెంటనే అవుటయ్యారు. ప్రసాద్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డవగా.. ప్రదీప్ ఓవర్లో రహానె వికెట్ల ముందు దొరికిపోయాడు. -
బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
కొలంబో: భారత్‌తో చివరి, మూడో టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడో టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా, లంక 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో లంక గెలవగా, రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు మూడో టెస్టు కీలకం. -
టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు 306 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ రోజు మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు అమిత్ మిశ్రా 4, ఇషాంత్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. లంక ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మాథ్యూస్, తిరుమన్నె నాలుగో వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్‌తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామం తర్వాత లంక మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయింది. -
టీమిండియాకు ఆధిక్యం దక్కేనా..?
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు శ్రమిస్తోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ విరామానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో మూడు వికెట్లున్నాయి. లంక ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో భారత్ బౌలర్లు ఎంత శ్రమించినా ఈ జోడీని విడదీయలేకపోయారు. లంచ్ తర్వాత భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్‌తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామానికి ముబారక్, హెరాత్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు.. ఉమేష్, బిన్నీ, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లు వీలైనంత త్వరగా లంక టెయిలెండర్లను తొలగిస్తే అంత ఆధిక్యం వస్తుంది. -
లంక టాపార్డర్‌ను తిప్పేశారు..
గాలె: తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్ బౌలింగ్‌తో లంక టాపార్డర్ ను తిప్పేశారు. ఈ మ్యాచ్‌పై భారత్ పూర్తిగా పట్టుబిగించగా.. శ్రీలంక ఎదురీదుతోంది. లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఇంకా 84 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి. 5/2 ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో జోరు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. లంచ్ సమయానికి 108/5 స్కోరు చేసింది. సంగక్కర 40, మాథ్యూస్ 39 పరుగులు చేశారు. చాందిమల్, తిరుమన్నె క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ అరోన్ ఓ వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో లంక 183, భారత్ 375 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే మూడో రోజే భారీ విజయంతో ఆట ముగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. -
లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవన్‌తో భారత్ మూడ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ తొలి రెండు రోజులూ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన టీమిండియా.. మూడో రోజు జోరు తగ్గింది. శనివారం 411 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓ దశలో లంక 154/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. కౌశల్ సిల్వా (83 నాటౌట్), తరంగ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 112/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 180 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారత్ 351, లంక 121 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.