indrani mukerjea
-
ఓటీటీలో దూసుకెళ్తున్న కాంట్రవర్సీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రం స్ట్రీమింగ్ కావడానికి ముందు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఓ వెబ్ సిరీస్ మాత్రం రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. దాదాపు 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ వెబ్ సిరీస్‌లో ఏంటంతా ప్రత్యేకత? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీసులు తీస్తోంది. అలా షీనా బోరా హత్య కేసు ఆధారంగా తీసిందే 'బరీడ్ ట్రూత్: ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'. స్ట్రీమింగ్ కావడానికి ముందే కోర్టు, కేసుల వరకు వెళ్లిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 29న ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. రిలీజైన రోజు నుంచే ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్‌కు ఇప్పటివరకు 2.2 మిలియన్ వ్యూస్, 6.9 మిలియన్ వాచ్ హవర్స్‌కి పైగా సొంతం చేసుకుంది. అలానే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-7లో ఉంది. దాదాపు 18కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే నిజ జీవితంలో జరిగిన హత్య తాలుకూ కథతో తీసిన సిరీస్ కావడంతోనే ఈ రేంజ్ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీరు చూడకపోతే ట్రై చేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భ్రమయుగం' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఎన్నో మలుపులు.. మరెన్నో చీకటి కోణాలు
అది దేశ వాణిజ్య నగరం ముంబై. 2012లో బయటపడ్డ ఓ నేరం.. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. దాదాపు పదేళ్లకు పైనే దాని గురించి మాట్లాడుకునేలా చేసింది. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని సొంత బిడ్డను ఓ కన్నతల్లే పొట్టనబెట్టుకున్న కేసది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ వాస్తవ గాథ.. ఇప్పుడు డాక్యు-సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీకి మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరుంది. షీనా అంటే ప్రాణం అన్నట్లుగా ఇంద్రాణి ఉండేది. అలాంటిది పోలీసులు ఆమె వైపు మళ్లుతారని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికే అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నాడనే అభియోగాలతో ఆమె డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. అతనిచ్చిన సమాచారమే.. మొత్తం కేసునే మలుపు తిప్పింది. ♦ఇంద్రాణీ ముఖర్జీ.. మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. ♦అప్పటికే వయసుకొచ్చిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. ఆ సమయంలోనే షీనా తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందుకు రెండో భర్త సంజీవ్ ఖన్నా సహకారం కోరింది. ♦రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించాడట. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ♦దీంతో పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి.. కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ♦1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలతో పాటు కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది. కన్న కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్.. నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యాం రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. ట్విస్టుల పర్వం సాగిందిలా.. ♦April 24, 2012: షీనా బోరా ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఆమె ఉద్యోగానికే రాజీనామా చేసిందని ఒకవైపు మీడియా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిందని కుటుంబం ప్రకటించింది. అప్పటికి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ♦May 23, 2012: నెలరోజుల తర్వాత.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.. ఆపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది. ♦August 2015: మూడేళ్ల తర్వాత.. కూతురిని చంపిందనే అభియోగాలపై ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ అయ్యింది. ఆ మరుసటిరోజే కోల్‌కతాలో ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ♦August 2015: ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ముగ్గురు నిందితుల్ని క్రైమ్ సీన్ రీక్రియేన్ చేశారు. దర్యాప్తులో డ్రైవర్ శ్యామ్ షీనాను హత్య చేసి.. మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నాడు. ఇంద్రాణితో పాటు సంజీవ్ ఖన్నా కూడా ఇందులో భాగం అయ్యారని చెప్పాడు. ♦September 2015: షీనా బోరా కేసులో ఇది ఊహించని మలుపు. షీనా బోరా అసలు తండ్రిని తానేనంటూ కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ దాస్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత.. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముగ్గురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ♦November 2015: షీనా బోరా హత్య కేసులో.. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. ♦2016: ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత పీటర్ పేరును కూడా చేర్చారు. రాహుల్‌తో రిలేషన్షిప్ కారణంగానే.. ఇంద్రాణీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సీబీఐ అందులో పేర్కొంది. ♦January-February 2017: కోర్టు విచారణ ప్రారంభం. షీనా బోరాను చంపేందుకు కుట్ర.. ఎత్తుకెళ్లి చంపడం.. ఆధారాలను నాశనం చేసే కుట్ర.. తప్పుడు సమాచారం ఇవ్వడం.. లాంటి అభియోగాలపై వాదప్రతివాదనలు మొదలయ్యాయి. ♦October 2019: ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు విడాకులు మంజూరు చేసిన ముంబై ఫ్యామిలీ కోర్టు ♦March 2020: పీటర్ ముఖర్జియాకు బెయిల్ ♦July 2021: బెయిల్ కోరుతూ నాలుగు పిటిషన్లు దాఖలు చేస్తే.. అన్నింటిని సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది ♦August 2021: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు ప్రకటించుకున్న సీబీఐ ♦February 10, 2022: సుప్రీం కోర్టుకు చేరిన ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ అభ్యర్థన ♦February 18, 2022: సీబీఐతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సుప్రీం నోటీసులు ♦March 25, 2022: ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ను తిరస్కరించాలని సీబీఐ వాదన ♦May 18, 2022: ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైల్లో గడపడంతో సుప్రీం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పలేదు.. మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటూ ఆరేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఇంద్రాణి(50)కి 2022లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ ఇవ్వడమే సబబుగా భావించింది. సుప్రీం ఊరట ఇచ్చాక.. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందామెకు. దీంతో.. మే 20, 2022 శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంద్రాణి చెప్పిన తొలి మాట. ‘ఒక కుటుంబంలోని చీకటి రహస్యం..యావత్ దేశాన్ని కుదిపేసిన సంచలన కుంభకోణం’ .. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సందర్భంగా.. మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్ బెంచ్.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. -
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
షీనా బోరా మర్డర్ కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు..
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేదిగా ఉండడం వల్లే షీనా బోరా హత్య కేసు.. దేశంలో అంతగా సంచలనం సృష్టించించింది. మూడేళ్ల తర్వాత హత్యోదంతం వెలుగులోకి వస్తే.. కేసులో ప్రధాన నిందితురాలిగా జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరున్న ఇంద్రాణీ.. సొంత కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించారు. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. అయితే సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి... కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యామ్రాయ్కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. చదవండి: పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్‌తో షీనా సన్నిహితంగా ఉండడం వల్లే.. -
అందరినీ క్షమించేస్తున్నా: ఇంద్రాణి ముఖర్జీ
ముంబై: ఒకప్పటి మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చింది. కూతురు షీనాబోరా హత్యకేసులో జైలుకు వెళ్లిన ఆమె.. బెయిల్‌పై శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ఆమెను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాత్రం నవ్వుతూ.. అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు. ఈ కేసులో ఇంద్రాణిని ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేశారా? అని ప్రశ్న ఎదురుకాగా.. నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నా. అంతే అని బదులిచ్చారు. ఇక కూతురు(షీనా బోరా) బతికే ఉందా?.. ఆ వాదనను సమర్థిస్తారా? అనే ప్రశ్నను దాటవేశారామె. ‘‘ఈ కేసు గురించి ఇప్పడేం మాట్లాడలేను. జీవితాన్ని పలు దృకోణాల్లో చూడడం ఇప్పుడే నేర్చుకున్నా. దారిలో ఎందరినో కలుసుకున్నా. ఇదొక ప్రయాణం. ఓపికగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పింది యాభై ఏళ్ల ఇంద్రాణి ముఖర్జీ. బయటకు వెళ్లాక ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. జైళ్లో ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంతే. ఎలాంటి ఆలోచనలు లేవు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం మళ్లీ వచ్చింది. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని నమ్ముతున్నా. సంతోషం తప్ప.. వేరే ఏ భావోద్వేగం లేదు నాలో. త్వరలో ఓ బుక్ రాయాలనుకుంటున్నా. కానీ, అది జైలు జీవితం గురించి మాత్రం కాదు అని చెప్పారామె. చదవండి: ఇంద్రాణి ముఖర్జీ పతనం ఎలా అయ్యిందంటే.. -
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం లేదని, బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రొహ్తగి పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా లేనందున బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసులో ఆరున్నరేళ్లుగా ఇంద్రాణి జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మంది సాక్షుల విచారణ కూడా పూర్తి కాలేదు. చాలాకాలం గా జైల్లో ఉన్నందున బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏమిటీ కేసు...? ఇంద్రాణి ముఖర్జీకి ఆమె మొదటి భర్తతో పుట్టిన కుమార్తె షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే మూడేళ్ల వరకు ఆ విషయమే బయటకు రాలేదు. ఇంద్రాణి తన మొదటి భర్తతో విడిపోయాక సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులిచ్చి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. ఆమె కనిపించకపోతే అమెరికా వెళ్లిపోయిందని ఇంద్రాణి అందరినీ నమ్మబలు కుతూ వచ్చింది. అయితే మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా తల్లే కుమార్తెను చంపిన విషయం తేలింది. కారులో ప్రయాణిస్తుండగా షీనా బోరాకు ఊపిరాడ నివ్వకుండా చేసి తల్లి ఇంద్రాణియే చంపితే, ఆమెకు భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ సహకరించినట్టుగా తేలింది. దీంతో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ని 2015లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య సంతానమైన రాహుల్ ముఖర్జీతో షీనా ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య అఫైర్‌ని ఉందని తెలిసి తట్టుకోలేక ఇంద్రాణి కన్నకూతురని చూడకుండా పథకం ప్రకారం హత్య చేసిందని విచారణలో తేలింది. మరోవైపు జైల్లో ఉండగానే పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. 2019లో వారికి విడాకులు మంజూరయ్యాయి. చదవండి: గుజరాత్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా -
ఆమె బతికే ఉంది.. నమ్మరా?! మరో ట్విస్టు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. చనిపోయిందని భావిస్తున్న తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ (జనవరి 24, సోమవారం) ముంబైలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఒక రాతపూర్వక దరఖాస్తును లాయర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఈ దరఖాస్తు కాపీని సీబీఐకి అందజేసిన కోర్టు. ఫిబ్రవరి 4వ తేదీన తన ప్రతిస్పందన ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. (షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్) ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది. తాను రాసిన లేఖపై సీబీఐ ఎలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవాలని ఇంద్రాణి కోర్టును కోరింది. దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు తాపే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. అంతేకాదు బోరా ఖచ్చితంగా బతికే ఉంది అనేందుకు తన వద్ద బలమైన కారణం ఉందని తెలిపింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఇంద్రాణి తనకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది కాగా తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరిన సంగతి తెలిసిందే. -
షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తన కూతురు షీనా బతికే ఉందని ఈ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ సీబీఐని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని ఇంద్రాణి డిమాండ్ చేయంటా హాట్ టాపిక్‌గా నిలిచింది. తన కూతురు షీనా బోరా బతికే ఉందని ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులోని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరింది. దీంతో ఈ లేఖపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఇంద్రాణి నేరుగా సీబీఐకి లేఖ రాశారని, ఈ లేఖలో ఆమె ఏమి ప్రస్తావించారో తనకు తెలియదని అన్నారు. దీనిపై సమాచారం సేకరిస్తానని చెప్పారు. కాగా షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె. ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలు షీనా, మిఖాయిల్‌లను గౌహతిలో వదిలి ముంబైకి వెళ్లి అక్కడ మీడియా బారన్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఇంద్రాణి షీనాను తన సోదరిగా పీటర్‌కు పరిచయం చేసింది. అనూహ్యంగా 2012లో షీనా అదృశ్యమైంది. దాదాపు మూడేళ్ల తరువాత కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఇంద్రాణి ముఖర్జీని 2015లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మూడు ఛార్జిషీట్లు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అలాగే ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జీను నిందితులుగా పేర్కొంది. డబ్బు, ఇల్లు కోసం షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తుపాకీ పట్టుబడటం, అతని వాంగ్మూలం ఆధారంగా ఇంద్రాణి షీనాను హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకోగా, పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. ఈ కేసులో గత నెలలో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఇంద్రాణి ముఖర్జీయా సహా 40 మంది ఖైదీలకు కోవిడ్
ముంబై: కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విస్తరిస్తోంది. చిన్న, పెద్ద, బీద, ధనిక తేడాలేం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా జైల్లోకి కూడా ఎంటరయ్యింది మహమ్మారి. 38 మంది ఖైదీలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ ఘటన కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై బైకుల్లా జైలులో 38 ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో షీనా బోరా హత్య కేసు నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జీయా కూడా ఉన్నారు. జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక నగరంలోని పరం శాతిధాం వృద్ధాశ్రమంలో 58 మందికి కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఇక మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 58,924 కోవిడ్ కేసులు నమోదవ్వగా.. 351 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మూడు లక్షలకు చేరువవ్వగా.. 2,023 మంది మరణించారు. చదవండి: మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా? -
సంచలన ‘ఆత్మకథ’
కీలక స్థానాల్లో పనిచేసి పదవులనుంచి తప్పుకున్న వారు రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. వారు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంచలనాత్మకమైన ఘటనలు జరిగుంటే ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు రాసిన ఆత్మకథలు చెప్పుకోదగ్గ వివాదం రేపాయి. ఇందులో సంజయ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. కనుక ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పేరిట వెలు వరించిన గ్రంథం అందరిలోనూ ఆసక్తి కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ముంబై నగరం ఒకప్పుడు మాఫియా డాన్ల అడ్డా. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, సినీ నటుల్ని బెదిరించి డబ్బులు గుంజడం, మాట విననివారిని కిడ్నాప్ చేయడం, నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు అక్కడ నిత్యకృత్యం. 2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడి 173మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఘటన వీటన్నిటినీ తలదన్నింది. కన్నకూతురు షీనా బోరాను పథకం ప్రకారం రప్పించి, తన భర్తతో కలిసి ఆమెను పొట్టనబెట్టుకున్న ఇంద్రాణి ముఖర్జీ ఉదంతం కూడా అక్కడిదే. ఇలాంటి మహానగరంలోని పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ప్రత్యేకించి పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాకేష్ ఆత్మ కథ రాశారంటే ఆసక్తి అత్యంత సహజం. పైగా రాకేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా వున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత తన భర్త మరణానికి రాకేష్ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ కంట్రోల్ రూం ఇన్చార్జిగా వున్న రాకేష్ సరిగా మార్గదర్శకత్వం చేయనందువల్లే అశోక్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారని ఒక పుస్తకంలో ఆమె చెప్పారు. అప్పట్లో రాకేష్ ఈ ఆరో పణలు కొట్టి పారేసినా తాజాగా ఆ ఎపిసోడ్ గురించి ఈ పుస్తకంలో ఏం రాసి వుంటారన్నది చూడా ల్సివుంది. అలాగే రాకేష్‌ను పదవీ విరమణకు చాలా ముందుగానే పోలీస్ కమిషనర్ పదవినుంచి తప్పించడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతోపాటు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఆయన కలవడం పెను వివాదమైంది. ఇంత నేపథ్యంవున్న రాకేష్ పుస్తకం రాశారంటే చదవకుండా ఎలావుంటారు? అయితే ఈ ఆత్మకథలో ఇతరత్రా అంశాలకంటే ఉగ్రవాది కసబ్ గురించి ఆయన చెప్పిన అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దాని చుట్టూ వివాదం రాజేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రయత్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేలు రెండూ కసబ్ పేరును దినేశ్ చౌధరి అని మార్చి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, అతనితో కాషాయ రంగు తాడు కట్టించి, మారణాయుధాలిచ్చి ఉగ్రవాద దాడులకు పంపాయని రాకేష్ తెలిపారు. పీయూష్ గోయెల్ అభ్యంతరమల్లా ఈ సంగతి ఇన్నాళ్లూ ఎందుకు దాచివుంచారన్నదే. అందుకాయన రాకేష్‌తోపాటు అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నది గోయెల్ అనుమానం. వాస్తవానికి ఈ సమాచారం కొత్తదేమీ కాదు. ఆ దాడి జరిగిన మరుసటి రోజునుంచే ఉగ్రవాదుల గురించి, వారి పన్నాగాల గురించి పుంఖానుపుంఖాలుగా కథ నాలు వెలువడ్డాయి. కసబ్‌ను ప్రశ్నించే క్రమంలో వెల్లడైన అంశాలన్నీ మీడియాలో అప్పట్లోనే ప్రము ఖంగా వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద హైదరాబాద్, బెంగళూరు కళాశాలల్లో చదువుకుంటున్నట్టు దొంగ గుర్తింపు కార్డులుండటం, వాటిపై హిందువుల పేర్లు వుండటం పాత కథే. ఉగ్రవాద దాడులకు పథక రచన చేసింది ఐఎస్ఐ కనుక, దాడులు చేసేది భారత్‌లో కనుక తమ సంగతి బయట పడకుండా వుండటం కోసం, దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు, అయోమయం సృష్టిం చేందుకు ఇదంతా చేసివుంటారని సులభంగానే గ్రహించవచ్చు. ఇలాంటివి బయటపడినప్పుడు వెల్లడించడానికి ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకుంటుంది? రాకేష్ మారియా కూడా దాన్ని తొలి సారి బయటపెడుతున్నట్టు ప్రకటించలేదు. కసబ్‌ను తానే స్వయంగా ప్రశ్నించారు గనుక, దర్యా ప్తును పక్కదోవ పట్టించే పన్నాగంతో ఐఎస్ఐ ఏమేం చేసిందో చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కసబ్‌ను సజీవంగా పట్టుకున్న కానిస్టేబుల్ గురించి కూడా రాకేష్ ప్రస్తావించారు. కసబ్ సజీవంగా పట్టుబడకపోయివుంటే పాకి స్తాన్ కుట్రను రుజువు చేయడం కష్టమయ్యేది. దేశంలో అంతక్రితమూ, ఆ తర్వాత అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నిటిలో పాకిస్తాన్ ప్రమేయం వున్న సంగతి తెలుస్తూనే వున్నా అందుకు అవసరమైన పక్కా సాక్ష్యాలివ్వడం సాధ్యపడలేదు. ముంబై మహానగరం ఆర్థిక రాజధాని కనుక ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే నగర పోలీసులు వారిని మట్టు బెడతారని పాకిస్తాన్ ఊహించింది. కానీ పాక్ అంచనాలకు భిన్నంగా అనుకోకుండా కసబ్ పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు తాము ఇష్టపడే నేతలు లేదా సెలబ్రిటీలు రాసిన ఆత్మకథల కోసం జనం ఆసక్తి కనబరిచేవారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది వుంటుందన్న భావనే అందుకు కారణం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పదవీకాలంలో వివాదాస్పదులుగా పేరు తెచ్చుకున్నవారు రాసినా, ఆత్మకథల్లో వివాదాల ప్రస్తావనవున్నా వాటికి పఠితలు అధికంగానే వుంటున్నారు. ఈ పుస్తకంలో రాకేష్ తన తదనంతరం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ జావేద్, మరో పోలీస్ అధికారి దేవేన్ భారతిల గురించి చేసిన ప్రస్తావనలు ఇప్పుడు ముంబై పోలీసుల్లో కాక పుట్టిస్తున్నాయి. తన గురించి వున్నవీ లేనివీ రాశారని జావేద్ అంటున్నారు. ఏదేమైనా మారియా పుస్తకం విడుదలైన రోజే కావలసినంత వివాదం రేపింది. -
వైద్యం అందకపోతే చచ్చిపోతాను!
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్‌గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. -
‘చిదంబరాన్ని అరెస్టు చేయడం సంతోషంగా ఉంది’
ముంబై: ఐఎన్ఎక్స్ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై ఇంద్రాణీ ముఖర్జీ స్పందించారు. అనూహ్యంగా ఐఎన్ఎక్స్ కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జీ గురువారం ముంబై కోర్టు వెలుపల మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్ అవటం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐన్‌ఎక్స్ మీడియా సంస్థను స్థాపించిన ఇంద్రాణి ముఖర్జీ ఆమె భర్త పీటర్ కేసులో అప్రూవర్లుగా మారడంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. భారీ హైడ్రామాల మధ్య గత గురువారం చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో ఉన్న చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, 2017లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు దారి తీసింది. విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కోరినట్టుగా ఇంద్రాణీ ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ముందు పేర్కొన్నారు. ఆ సంవత్సరంలో ఐఎన్ఎక్స్ సంస్థకు రూ.305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు. షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ చెబితే.. తప్పక అలా చేశా!
ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు. తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు. 2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఐసీయూలో ఇంద్రాణీ ముఖర్జియా..పలు అనుమానాలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నఇంద్రాణీ ముఖర్జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కుమార్తె హత్య కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెను అపస్మారక స్థితిలో అసుపత్రికి తరలించడం చర్చనీయాంశమైంది. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఇంద్రాణీని జైలు అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కి తరలించారు. ప్రసుత్తం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రాణీపై విష ప్రయోగం జరిగిందా లేక డ్రగ్ మోతాదు ఎక్కువైందా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జేజే హాస్పిటల్ డీన్ ఎస్డీ నానంద్కర్ వెల్లడించారు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో ఇంద్రాణీ ముఖర్జియా ఆకస్మిక అనారోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోముఖర్జీని కలవటానికి ప్రయత్నించిన ఆమె వ్యక్తిగత న్యాయవాది గుంజన్ మంగళను వైద్యులు అనుమతించలేదు. ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కూడా నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జీతో కలిసి సొంత కూతుర్ని హతమార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి
ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, జైలు అధికారులుగానీ, ఆస్పత్రి వర్గాలుగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. -
‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్ చేయండి’
న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్‌కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్ అయిపోయాయి'' అని తెలిపారు. 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్రూమ్ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా హౌజ్‌కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్ ముఖర్జీని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
చిక్కుల్లో చిదంబరం: బుక్ చేసిన ఇంద్రాణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. బుధవారం చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్నిచెన్నైలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయమని కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్టుగా వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు. అలాగే కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్వాయిస్లను ఐఎన్ఎక్స్ మీడియా సీబీఐకి అందించింది. వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి. మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి తెలిపినట్టు సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా బుధవారం అరెస్ట్ చేసిన కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించడానికి వీలుగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కార్తీకి కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు కార్తీ చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
కార్తీ చిదంబరం అరెస్టు
-
కార్తీ చిదంబరం అరెస్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్ నుంచి భారత్‌కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపర్చాలంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కార్తీని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏదీ లేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాటి ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా కలిశామని అప్పటి ఐఎన్ఎక్స్ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సీబీఐ, ఈడీల విచారణలో వెల్లడించడం సంచలనం రేపుతోంది. విచారణకు సహకరించడం లేదనే.. విచారణకు సహకరించకపోవడం వల్లనే కార్తీని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే, ఆయన పలుమార్లు విదేశాలకు వెళ్తుండటంతో అక్కడి బ్యాంకుల్లోని సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందంది. విచారణకు హాజరవకుండా పూర్తిగా విదేశాల్లోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఉందని, అందువల్లనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను కార్తీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. గతంలోనే ఎన్నోసార్లు సీబీఐ, ఈడీలు కార్తిని విచారించాయనీ, ఇప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరవ్వడానికే ఆయన భారత్ వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆయన అరెస్టుకు సరైన కారణాలే లేవన్నారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు 2006లో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై కూడా సీబీఐ విచారిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కేసులో కార్తీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. రాజకీయ కక్షతోనే.. రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కార్తీని అరెస్టు చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్డీయే హయాంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందంది. కాంగ్రెస్ ప్రజలకు నిజాలు చెప్పడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బీభత్సంగా మాటలను వాడే ప్రధాని మోదీ.. గత 10 రోజుల్లో బీజేపీ హయంలో రూ. 30 వేల కోట్ల కుంభకోణాలు బయటపడినా నోరు తెరవడం లేదన్నారు. ‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ప్రభుత్వం ఏం చేయదు. కేసు విచారణకు హాజరయ్యేందుకు విదేశం నుంచి తిరిగొచ్చిన కార్తీని అరెస్టు చేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రభుత్వ జోక్యం లేదు.. కార్తీ చిదంబరం కేసులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, ఉండదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చట్టం ప్రకారమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనీ ఆయన తప్పు చేశారో లేదో ఆధారాలే చెబుతాయని పేర్కొన్నారు. కేసు విచారణకు రాకముందే.. సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులతో తనను, తన కుటుంబ సభ్యలను తరచూ వేధిస్తున్నాయని, తమ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ చిదంబరం గతవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు తమపై ‘అక్రమ విచారణలు’ జరపకుండా అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ ఇంకా విచారణకు కూడా రాకముందే కార్తిని సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. మార్చి 1న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలనీ, లేదా కనీసం విచారణను కొద్దికాలం వాయిదా వేయాలంటూ కార్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. గతవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కార్తి తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్ కూడా ‘మీరు కార్తీని అరెస్టు చేయాలని అనుకుంటున్నారా?’ అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించడం గమనార్హం. ఏమిటీ ఐఎన్ఎక్స్ కేసు? ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2007 మార్చిలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. కూతురి హత్యకేసులో నిందితులుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల చేతుల్లో అప్పట్లో ఈ కంపెనీ ఉండేది. తమ కంపెనీలోకి 46 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించాలంటూ వారు.. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల అనంతరం ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియాలో 46 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చింది. అయితే అప్పటికే 26 శాతం ఎఫ్‌డీఐలు ఐఎన్ఎక్స్లో ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖర్జీలు ఎఫ్ఐపీబీ వద్ద దాచిపెట్టారు. పరిమితికి మించి రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. ఈ అవకతవకలను ఆదాయ పన్ను శాఖ గుర్తించి, ఆర్థిక శాఖను సైతం అప్రమత్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ సూచన మేరకు గతేడాది మే 15న సీబీఐ తొలి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో తమకు పలు ఆధారాలు లభించాయని ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి. తండ్రి మద్దతుతోనే.. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతుల విషయంలో జరిగిన ఉల్లంఘనలను సరిచేసేందుకు కార్తీ తమ నుంచి పది లక్షల డాలర్లు తీసుకున్నట్లు ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ ఇటీవల సీబీఐ విచారణలో బయటపెట్టారు. అందుకు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి పీ చిదంబరం సహకరిస్తారని కార్తీ చెప్పాడని వారు వెల్లడించారు. ‘కార్తీ కోరిన 10 లక్షల డాలర్లలో 7 లక్షల డాలర్లను(రూ.3.10 కోట్లు) కార్తీకి విదేశాల్లోని ఆయన అనుబంధ సంస్థల ద్వారా అందించాం’ అని ముఖర్జీలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. ‘ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అక్రమంగా పొందాం. ఆ పెట్టుబడులను క్రమబద్ధీకరించేందుకు కార్తీని సంప్రదించాం. అనంతరం ఆయనకు చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్), దాని అనుబంధ సంస్థలకు 7 లక్షల డాలర్లు(రూ. 3.10 కోట్లు) అందజేశాం. ఆ తరువాత మా ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల అంశానికి లైన్ క్లియరైంది’ అని ఇంద్రాణి, పీటర్లు వెల్లడించినట్లుగా తన దర్యాప్తు నివేదికల్లో సీబీఐ, ఈడీ తెలిపాయి. అనుమతులివ్వవద్దంటూ ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. చిదంబరంను అరెస్టు చేసే అవకాశం సీబీఐ, ఈడీల విచారణలో మరో విషయాన్ని కూడా పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు బయటపెట్టారు. అక్రమ లావాదేవీలను క్రమబద్ధం చేసుకునే క్రమంలో భాగంగా తాము అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంను నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశామని వెల్లడించారు. ‘నా కుమారుడి వ్యాపారాలకు సహకరించండి. అందుకు విదేశీ నిధులందజేయండి’ అని చిదంబరం తమను కోరారని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. ఆ తరువాత తాము ఢిల్లీలోని పార్క్ హయత్ హోటల్లో కార్తీని కలిశామని, తమ పని చేసేందుకు ఆయన 10 లక్షల డాలర్లు కోరారని దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీ – ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్వాపరాలు 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి 2007లో రూ.305 కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతించటంలో అవకతవకలు జరిగాయనీ, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 జూన్ 16: కేంద్ర హోం శాఖలోని ది ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఆర్వో), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్లు కార్తీపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. 2017 ఆగస్టు 10: లుకౌట్ సర్క్యులర్‌పై మద్రాస్ హైకోర్టు స్టే. వారెంట్లు లేనందున లుకౌట్ నోటీసు చెల్లదని తీర్పు. 2017 ఆగస్టు 14: మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2017 ఆగస్టు 18: ఆగస్టు 23న సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా కార్తీకి సుప్రీంకోర్టు ఆదేశం. 2017 ఆగస్టు 23: సీబీఐ కోర్టులో హాజరైన కార్తీ 2017 సెప్టెంబర్ 11: కార్తీకి విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న 25 ఆస్తుల వివరాలను, లావాదేవీలను సీబీఐ సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2017 సెప్టెంబర్ 22: విదేశాల్లో బ్యాంకు అకౌంట్లను కార్తీ మూసివేస్తున్నందున దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017 అక్టోబర్ 9: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన కుమార్తెను చేర్పించేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కార్తీ పిటిషన్ వేశారు. అక్కడ ఏ బ్యాంకుకూ వెళ్లబోనని అందులో పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను, తన కుమారుడిని వేధిస్తోందంటూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017 డిసెంబర్ 8: ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో సీబీఐ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కార్తీ. 2018 జనవరి 31: తనతోపాటు మరికొందరిపై ఉన్న రెండు లుకౌట్ నోటీసులపై కార్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచింది. 2018 ఫిబ్రవరి 16: దేశ, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టటంలో సహకరించారంటూ కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్భాస్కరరామన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2018 ఫిబ్రవరి 24: సీబీఐ దర్యాప్తుతో తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనీ, వెంటనే నిలిపివేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ వేశారు. -
ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా, 2012 ఏప్రిల్ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
'పూడ్చి పెట్టకముందు.. పెట్టిన తర్వాత ఫోన్ చేసింది'
సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్ చేసినట్లు ఆమె డ్రైవర్ ఈ కేసులో అప్రూవర్ అయిన శ్యామ్వర్ రాయ్ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్ శ్యామ్వర్రాయ్తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్వర్ రాయ్ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్వర్ రాయ్ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు. -
‘ఆ ఆరుగురిపై చర్యలెందుకు లేవు?’
చెన్నై: విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గత 2006లో ముంబైలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను పారిశ్రామికవేత్త పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు నిర్వహించారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు కార్తీ చట్టవిరుద్ధంగా ఐఎన్ఎక్స్ సంస్థకు అనుమతి ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సదరు సంస్థ నుంచి కార్తీ చిదంబరం లంచాలు తీసుకున్నట్లు, ఆ సంస్థను పరోక్షంగా తన కట్టడిలో ఉంచుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. గత మే నెలలో దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ ముంబై, ఢిల్లీలోగల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఇలా వుండగా శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్తీ చిదంబరంను వెతుకుతున్న నేరస్థునిగా ప్రకటించడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ఎం.దురైసామి ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు ఏడవ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే, ఈ విషయంతో సంబంధం ఉన్న ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై మాత్రం చర్యలెందుకు తీసుకోలేదని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు.