International Hockey Federation
-
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో భారత హాకీ స్టార్లు
భారత దిగ్గజం, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్ఐహెచ్ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు. ఎవరు ఏ కేటగిరీలో అంటే?కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్‌తో పాటు గోల్‌కీపర్ శ్రీజేశ్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు బ్రింక్‌మన్, జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), ముల్లర్ (జర్మనీ), వాలెస్ (ఇంగ్లండ్) నామినేట్య్యాడు.ఇక.. ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం పీఆర్ శ్రీజేశ్, పిర్మన్ బ్లాక్ (నెదర్లాండ్స్), కాల్జడో (స్పెయిన్), డేన్బర్గ్ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు. ఎఫ్ఐహెచ్ నియమించిన నిపుణుల ప్యానెల్ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్లో పలువురు ప్లేయర్లు, కోచ్‌లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. విజేతల్ని ఎంపిక చేస్తారిలా!ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్, నేషన్స్ కప్ హాకీ, ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్ చేసింది. ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్‌లో పోల్ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్‌లో భారత్ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ తాజాగా ఆసియా చాంపియన్స్‌లో భారత్‌కు టైటిల్ అందించిన జోష్‌లో ఉన్నాడు.చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
నాలుగో ర్యాంక్‌లో భారత పురుషుల హాకీ జట్టు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పడిపోయింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గి భారత జట్టు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. మరోవైపు భారత మహిళల జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు విఫలమై పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. -
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నీ: భారత్‌కు కఠిన సవాలు
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్‌తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. -
FIH Player of the Year: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
Narinder Batra: మూడు పదవుల నుంచి అవుట్
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. -
భారత మహిళల పోరు షురూ
ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్): మహిళల ప్రపంచకప్ హాకీలో భారత్ పోరాటం నేడు మొదలవుతోంది. ఆదివారం జరిగే తమ పూల్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో మన జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇంగ్లండ్ దూరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతికారం తీర్చుకోవాలనే లక్ష్యంతో సవిత సేన బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్‌లోనే కాదు... ప్రపంచకప్‌లోనూ మన అమ్మాయిల అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానమే! ప్రారంభ ప్రపంచకప్ (1974)లోనే కాంస్య పతకం కోసం పోరాడిన భారత్ మళ్లీ ఎప్పుడూ పతకం బరిలో నిలువనే లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సీజన్లో మేటి జట్లయిన బెల్జియం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన సవిత సేన ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సీనియర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గాయంతో అందుబాటులో లేకపోయినప్పటికీ... అనుభవజ్ఞురాలైన సవిత జట్టును చక్కగా నడిపిస్తోంది. వైస్ కెప్టెన్ దీప్ గ్రేస్, గుర్జీత్ కౌర్, ఉదిత, నిక్కీ ప్రధాన్‌లు నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలి దెబ్బ కొట్టేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. -
FIH Hockey 5s: హాకీ ఫైవ్స్ విజేత భారత్
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో (ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ఆడతారు) భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. పోలాండ్ జట్టుతో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 6–4 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంజయ్, గురీందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా... ధమి బాబీ సింగ్, రాహీల్ మొహమ్మద్ రెండేసి గోల్స్ సాధించారు. Congratulations to the Indian Men's Hockey Team for winning Gold in the all-new format of Hockey at the Hero FIH Hockey 5s Lausanne 2022. 🏆 Once again, the Indian Men's Team has made India proud! 🇮🇳 pic.twitter.com/SZ6ixzKd55 — Hockey India (@TheHockeyIndia) June 5, 2022 This is the one that counts! Counting down the final moments to the Hero FIH #Hockey5s men's finals! Will it be @TheHockeyIndia or @hockey_poland to take the crown? Match begins at 18:30 CEST! Who are you supporting? 📲 Download the @watchdothockey app to stream the match live. pic.twitter.com/A1Ljb3h5vS — International Hockey Federation (@FIH_Hockey) June 5, 2022 -
భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీ జూన్ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది. -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది. -
జుగ్రాజ్ హ్యాట్రిక్
పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున రెండో మ్యాచ్ ఆడుతున్న ‘డ్రాగ్ ఫ్లికర్’ జుగ్రాజ్ సింగ్ మూడు గోల్స్‌తో (4వ, 6వ, 23వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించాడు. గుర్సాహిబ్జిత్ సింగ్ (24వ, 36వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ, 58వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ ని.లో), అభిషేక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మంగళవారం ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5–0తో నెగ్గిన సంగతి విదితమే. -
హాకీలో కొత్త నిబంధన అమల్లోకి..
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) హాకీలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకునే సందర్భంలో ఆటగాళ్లు ఫేస్గేర్(హెల్మెట్లు) ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే బంతి 23 మీటర్ల దూరం దాటిన తర్వాత ఆటగాళ్లు ఫేస్‌గేర్‌ను తప్పనిసరిగా తొలగించాలని రూల్‌లో పేర్కొంది. అంతకుముందు పెనాల్టీ కార్నర్లను డిఫెండ్ చేసే ఆటగాళ్ళు బంతి ఫ్లిక్ అయిన వెంటనే సర్కిల్ లోపలే ఫేస్‌గేర్‌ను తీసేయాల్సి ఉండేది. తాజాగా హాకీ నిబంధనలోని రూల్ 4.2 ప్రకారం నిబంధనను సవరించినట్లు హాకీ ఫెడరేషన్ సంఘం ట్విటర్లో పేర్కొంది. కాగా డిసెంబర్ 2021లో భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ హాకీ మెన్స్ వరల్డ్‌కప్‌లో పెనాల్టీ కార్నర్ రూల్‌లో ఆటగాళ్లకు ఫేస్‌గేర్‌ను ట్రయల్‌గా అమలు చేశారు. దీనిపై హాకీ కోచ్‌లు, క్రీడాకారులు, ఇతర అధికారుల నుంచి మంచి ప్రయత్నమంటూ విశేష స్పందన రావడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఈ నిబంధనను కొనసాగిస్తూ తాజాగా అమల్లోకి తెచ్చింది. -
భారత హాకీ క్రీడాకారులకు అంతర్జాతీయ పురస్కారాలు
Harmanpreet Singh, Gurjit Kaur Win FIH Awards: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డ్స్ 2020-21లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పురుషులు, మహిళల విభాగాల్లో నలుగురు క్రీడాకారులు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీరితో డ్రాగ్ ఫ్లికర్స్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు "ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను గెలుచుకోగా.. పీఆర్ శ్రీజేష్, సవితా పునియాలు "ఉత్తమ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను దక్కించుకున్నారు. కాగా, భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అబ్బురపడే ప్రదర్శనతో అలరించిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు 41 సంవత్సరాల ఒలింపిక్ పతకాల కరువుకు తెరదించుతూ.. జర్మనీపై 5-4 గోల్స్‌తో విజయం సాధించి కాంస్య పతకం నెగ్గింది. మహిళల జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు
లుసానే: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్పష్టం చేసింది. ఈమేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం. తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్ఐహెచ్ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్ఐహెచ్ తెలిపింది. -
నరీందర్ బత్రా పదవీకాలం పొడిగింపు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్ నరీందర్ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 28న జరగాల్సిన ఎఫ్ఐహెచ్ వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్ఐహెచ్ శనివారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్ఐహెచ్ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది. -
ఎఫ్ఐహెచ్ అవార్డు రేసులో మన్‌ప్రీత్
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్ చేశారు. భారత సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉండగా... వివేక్ ప్రసాద్, లాల్రెమ్సియామి వరుసగా పురుషుల, మహిళల ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు బరిలో ఉన్నారు. 27 ఏళ్ల మన్‌ప్రీత్ భారత్ తరఫున 242 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోనే భారత జట్టు ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రష్యాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 19 ఏళ్ల వివేక్ ప్రసాద్ గత ఏడాది యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 19 ఏళ్ల లాల్రెమ్సియామి ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళల జట్టులో సభ్యురాలిగా ఉంది. జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు. -
భారత్ రెండో విజయం
హిరోషిమా (జపాన్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెం ట్లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం ఉరుగ్వేపై ప్రదర్శించిన జోరును పోలాండ్‌పైనా చూపింది. ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో 5–0తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (28వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జ్యోతి (21వ నిమిషంలో), వందనా కటారియా (26వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో రష్యా 6–0తో మెక్సికోపై, చిలీ 3–1తో జపాన్‌పై, ఉరుగ్వే 4–0తో ఫిజీపై గెలుపొందాయి. భారత్ గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌ను మంగళవారం ఫిజీతో ఆడనుంది. -
భారత్ గర్జన
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్‌పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్‌ను దక్కించుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్‌తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత్ రెండో విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శుక్రవారం భారత్ 3–1తో పోలాండ్‌పై గెలుపొందింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (21వ, 26వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డ్రాగ్ ఫ్లిక్కర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (36వ ని.) ఒక గోల్ చేశాడు. పోలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మాతెజ్ హల్బోజ్ (25వ ని.) సాధించాడు. శుక్రవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ 3–1తో మెక్సికోపై, రష్యా 12–1తో ఉజ్బెకిస్తాన్‌పై విజయం సాధించాయి. సోమవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. -
ఫేవరెట్‌గా బరిలోకి భారత్
భువనేశ్వర్: ఆసియా క్రీడల ద్వారా నేరుగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ రెండో అవకాశం కోసం సంసిద్ధమైంది. నేడు మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో టీమిండియా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పూల్ ‘ఎ’లో భారత్, పోలాండ్, రష్యా, ఉజ్బెకిస్తాన్... పూల్ ‘బి’లో జపాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికాలకు చోటు కల్పించారు. గురువారం తొలి మ్యాచ్‌లో రష్యాతో భారత్ ఆడుతుంది. అనంతరం 7న పోలాండ్‌తో, 10న ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరిన రెండు జట్లు అక్టోబర్–నవంబర్లలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న భారత్ సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కొత్త కోచ్ గ్రాహమ్ రీడ్ పర్యవేక్షణలో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా తమ స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు. -
ఎఫ్ఐహెచ్ ఫైనల్స్‌కు రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ అమ్మా యి, గోల్‌కీపర్ ఎతిమరపు రజని ఎంపికైంది. రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. జపాన్‌లోని హిరోషిమాలో వచ్చే నెల 15 నుంచి జరుగుతుంది. -
రూ. 2 కోట్ల 71 లక్షలు జరిమానా చెల్లించండి
కరాచీ: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్)పై మరో పిడుగు పడింది. ప్రో లీగ్ టోర్నమెంట్‌కు జాతీయ జట్టును పంపకుండా పాకిస్తాన్ హాకీ సమాఖ్య నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) భారీ జరిమానా విధించింది. జూన్ 20లోగా లక్షా 70 వేల యూరోలు (పాక్ కరెన్సీలో రూ. 2 కోట్ల 71 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో దానికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై స్పందించిన పీహెచ్ఎఫ్ అంత భారీ జరిమానాను చెల్లించలేమని పేర్కొంది. జరిమానా తగ్గించడంతో పాటు విడతల వారీగా చెల్లించే వెసులుబాటు కల్పించాలని ప్రపంచ సమాఖ్యకు విజ్ఞప్తి చేసినట్లు పాకిస్తాన్ సమాఖ్య కార్యదర్శి షాబాజ్ అహ్మద్ తెలిపారు. -
శ్రీజేశ్కు నిరాశ
చండీగఢ్: భారత హాకీ జట్టు కెప్టెన్ గోల్‌కీపర్ శ్రీజేశ్.. రైజింగ్ స్టార్ హర్మన్ ప్రీత్ సింగ్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల ప్రకటనలో నిరాశే ఎదురైంది. వీరిద్దరు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నా అవార్డులను మాత్రం అందుకోలేకపోయారు. గురువారం ఎఫ్ఐహెచ్, హాకీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో భారత ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. బెల్జియంకెప్టెన్ జాన్ జాన్ న్ ( పురుషుల విభాగం), నెదర్లాండ్‌కి చెందిన నవోమి వాన్ (మహిళా విభాగం) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచారు. పురుషుల విభాగం లో ఉత్తమ గోల్ కీపర్‌గా డేవిడ్ హార్తే( ఐర్లాండ్), రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్‌గా ఆర్థర్ వాన్ డోరెన్ ( బెల్జియం) పతకాలు సాధించగా.. మహిళల విభాగంలో ఉత్తమ గోల్ కీపర్‌గా మాడీ హించ్(గ్రేట్ బ్రిటన్ ), రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్‌గా మారియా గ్రాన్నెటో(అర్జెంటీనా) అవారు్డలు గెలిచారు. -
హెచ్ఐ అధ్యక్షురాలిగా కోషి
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) నూతన అధ్యక్షురాలిగా మరియమ్మ కోషి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరీందర్ బాత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎంపికవడంతో... ఆయ న స్థానంలో కోషిని అధ్యక్షురాలిగా ఎంచుకున్నారు. అలాగే హాకీ ఇండియా లీగ్ చైర్మన్ బాధ్యతలను హెచ్ఐ సెక్రటరీ ముస్తాక్ అహ్మద్‌కు అప్పగించారు. -
నరీందర్ బాత్రా అరుదైన ఘనత
• అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక • ఈ ఘనత సాధించిన తొలి యూరోపేతర వ్యక్తి దుబాయ్: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా ఆయన భారీ ఆధిక్యంతో ఎన్నికయ్యారు. 45వ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్‌లో శనివారం ఈ పదవి కోసం ఓటింగ్ జరిగింది. ఇందులో బాత్రాకు మద్దతుగా 68 ఓట్లు దక్కారుు. ఆయన ప్రత్యర్థులు డేవిడ్ బల్బిర్నీ (ఐర్లాండ్)కి 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలియా)కు 13 ఓట్లు మాత్రమే వచ్చారుు. దీంతో 12వ ఎఫ్ఐహెచ్ చీఫ్‌గా ఎన్నికై న బాత్రా ఈ పదవి చేపట్టిన తొలి ఆసియా వ్యక్తిగానే కాకుండా తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. యూరోపేతర దేశాల నుంచి ఎఫ్‌ఐహెచ్‌కు అధ్యక్షుడు ఎన్నికవడం ఇదే తొలిసారి. మొత్తం 118 ఓట్లలో 110 మాత్రమే నమోదుకాగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. ఆసియా హాకీ సమాఖ్య అధికారిక అభ్యర్థిగా నామినేట్ అరుున 59 ఏళ్ల బాత్రాకు ఆసియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా దేశాల నుంచి అధిక మద్దతు లభించింది. 2008 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న లియాండ్రో నెగ్రే (స్పెరుున్) నుంచి బాత్రా వెంటనే బాధ్యతలు తీసుకుంటారు. నాలుగేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈనేపథ్యంలో ఆయన హాకీ ఇండియా అధ్యక్ష పదవిని త్యజించాల్సి ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిన సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరిగింది. ప్రతీ జాతీయ సంఘానికి చెందిన ప్రతినిధికి ట్యాబ్లెట్‌తో పాటు పాస్వర్డ్ కేటారుుంచగా తమకు ఇష్టమైన అభ్యర్థిని వారు ఎన్నుకున్నారు. ఈ ఫలితాలను అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న లియాండ్రో నెగ్రే వెల్లడించారు. బాత్రా విజయంతో ప్రపంచ హాకీపై గుత్తాధిపత్యం యూరప్ నుంచి ఆసియాకు మారినట్టరుు్యంది. 2014 అక్టోబర్‌లో హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికై న బాత్రా.. ఎఫ్ఐహెచ్ అత్యున్నత పదవి కోసం గత కొన్ని వారాలుగా అనుబంధ దేశాలకు చెందిన సంఘాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన హాకీ ఈవెంట్స్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ చురుగ్గా ఉండేవారు. దీంతో సహజంగానే అందరి మొగ్గు బాత్రా వైపు నెలకొంది. హాకీ అభివృద్ధికి విశేష కృషి 1957, ఏప్రిల్ 18న జన్మించిన నరీందర్ బాత్రా ప్రముఖ పారిశ్రామిక వేత్త. 2009లో తొలిసారిగా ఆయన హెచ్‌ఐలో కోశాధికారిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి చురుకై న ఆఫీస్ బేరర్‌గా అందరి దృష్టిలో పడ్డారు. దీంతో ఏడాది అనంతరం ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. అనంతరం దేశంలో హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. హాకీ అభివృద్ధిపై అంకితభావంతో ముందుకెళ్లి గత ఆరేళ్లలో హాకీ ఆదాయాన్ని 5 లక్షల డాలర్ల నుంచి కోటీ 41 వేల డాలర్లకు పెంచారు. ఐపీఎల్ తరహాలోనే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు రూపకల్పన చేసి ఆటగాళ్లతో పాటు హెచ్ఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. అలాగే 2014 నుంచి హెచ్ఐ అధ్యక్షుడిగా ఉన్న బాత్రా పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌ను భారత్‌కు రప్పించారు. ‘హాకీని విశ్వవ్యాప్తం చేస్తా’ ‘ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవి నాకు దక్కిన గొప్ప గౌరవం. హాకీని అమితంగా ఇష్టపడే నేను ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ ఎంత వరకు చేరింది.. ఎంత ఆర్జించింది అనే లెక్కలపైనే నడుస్తోంది. హాకీకున్న హద్దులను చెరిపేసి మరింత విస్తరించడంపైనే నేను దృష్టి పెడతా. అప్పుడు ఈ ఆటను 10, 12 దేశాలకే పరిమితం కాకుండా విస్తరించవచ్చు. అమెరికా, చైనా, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నారుు. అలాగే ఈ క్రీడకు కూడా ఈ మూడు దేశాలు మంచి మార్కెట్‌గా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఇక్కడ హాకీని పాపులర్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందవచ్చు’ - అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా -
ఎఫ్ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవి రేసులో హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లీండ్రో నెగ్రె పదవీకాలం నవంబరులో ముగియనుంది. నవంబరు 12న దుబాయ్‌లో జరిగే ఎఫ్ఐహెచ్ సమావేశంలో కొత్త అధ్యక్షుడితోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎనుకుంటారు. అధ్యక్ష పదవి కోసం నరీందర్ బాత్రా (భారత్), కెన్ రీడ్ (ఆస్ట్రేలియా), డేవిడ్ బాల్బిర్నీ (ఐర్లాండ్)లను ఆయా దేశాల సమాఖ్యలు నామినేట్ చేశారుు.