Jagananna Colonies
-
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్, సొంతింటి కల నెరవేర్చారు: లబ్దిదారులు
-
సొంత ఇంటి కల సాకారం
-
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
గృహ యజ్ఞం మెగా డ్రైవ్
తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్ నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది. అడ్వాన్స్ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్‌లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా డిసెంబర్ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్ డ్రైవ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్మెంట్, లెంటల్, రూఫ్ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. డ్రైవ్‌పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్ చేసి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలంటీర్ల కీలక పాత్ర గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్‌లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది. నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
-
Fact Check: పేదల ఇళ్లపై ఇవేం రాతలు!?
సాక్షి, అమరావతి: రామోజీరావుకు కథలంటే భలే ఇష్టం.. కట్టుకథలు, కాకమ్మ కథలంటే ఇంకా ఇష్టం.. ప్రభుత్వంపై బురద జల్లేవి అయితే లొట్టలు వేసుకునేంతగా మరీ ఇష్టం. ఎందుకంటే.. ఆయనకో రోగం ఉంది. దాని పేరు కడుపుమంట. ఇలాంటి కట్టుకథలు, కాకమ్మ కథలు, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే స్టోరీలే ఆ బాధ నుంచి ఆయనకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. అది తగ్గిపోగానే మళ్లీ కడుపు రగులుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే.. మరో కల్పిత కథనం. ఇది రామోజీకి నిత్యకృత్యం. కానీ, ఈ మధ్య ఈ రోగం ముదురుతోంది. తన పార్ట్నర్ జైలు నుంచి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఆయన వెర్రెక్కిపోతున్నారు. ఫలితంగా ఆయన కట్టుకథల శృతి మించుతోంది. ఎంతలా అంటే.. ‘నవరత్నాలు పేదలందరీ ఇళ్లు’ పథకంలో శరవేగంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తుంటే వాటిని చూసి ఓర్వలేనంత. పైగా.. పేదలు సంతోషంగా సొంతిళ్లలోకి వెళ్తుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సాధారణంగా.. ఎక్కడైనా లేఔట్లలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేసిన తర్వాతే శాశ్వత డ్రెయిన్లు, రోడ్లు వేస్తారు. ఎందుకంటే.. వాటిని ముందే నిర్మిస్తే ఇళ్ల నిర్మాణంలో భాగంగా లేఔట్లలో లారీలు, ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ధ్వంసమవుతాయి కాబట్టి. ఇది ఒక్క జగనన్న కాలనీల్లోనే కాదు.. ఏ ప్రైవేటు వెంచర్‌లోనైనా ఇలానే చేస్తారు. కానీ, ఈ చిన్న లాజిక్‌ను రామోజీ మిస్ అయ్యారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈనాడు శనివారం ‘జగనన్నా.. ఇవేం కాలనీలు’ అంటూ పెడబొబ్బలు పెట్టింది. పేదల ఇళ్లతో ఏర్పడ్డ కాలనీల స్థితిగతులపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ఆపసోపాలు పడింది. పెత్తందారీ ముసుగులో కలియుగ రాక్షసులు.. టీడీపీ, రామోజీరావు పెత్తందారుల ముసుగులో చెలామణీ అవుతున్న కలియుగ రాక్షసులు. అందుకే నిత్యం పేదలకు ఇళ్ల స్థలాల మహాయజ్ఞాన్ని భగ్నం చేసే కుట్ర చేస్తూనే ఉన్నారు. కోర్టుల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు వేయించి విశాఖతో పాటు ఎక్కడా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా చాలాకాలం అడ్డుకున్నారు. అమరావతిలో అయితే మరింత పేట్రేగిపోయి.. పేదలకు ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నీచంగా రాతలు రాశారు. వీటన్నింటినీ ఛేదించుకుంటూ జగన్ సర్కార్ పేదల సొంతింటి కలలో భాగంగా ఇళ్ల పట్టాలను అందించింది. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా ఆర్థిక చేయూతనిస్తోంది. మూడు ఆప్షన్లు ద్వారా అక్కచెల్లెమ్మలను సొంతింటి యజమానులను చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అత్యంత పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. పైగా ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రభుత్వం సామాజిక న్యాయానికి బాటలు వేసింది. పట్టాలు అందుకున్న వారిలో 20 శాతం ఎస్సీలు, ఆరు శాతం ఎస్టీలు, 54 శాతం బీసీలు, 21 శాతం ఇతరులున్నారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకున్నా జన్మభూమి కమిటీలు పేదలకు ఆశ చూపించి వారి రెక్కల కష్టాన్ని దోచుకున్నాయి. కానీ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మను లేఅవుట్ దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ స్వయంగా వారికి కేటాయించిన పట్టాభూమిని చూపించి, వారికి పట్టా పత్రాలు అందించడం జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మార్కెట్ ధరలకన్నా తక్కువకు నిర్మాణ సామాగ్రి ఇక ప్రతి లబ్ధిదారుడికి 4.5 మెట్రిక్ టన్నుల సిమెంట్, 0.48 మెట్రిక్ టన్నుల స్టీలు మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. తలుపులు, కిటికీ ఫ్రేములు, షట్టర్లు, ఎలక్ట్రిక్, శానిటరీ సామాన్లు కింద 12 రకాల గృహ వస్తువులను కూడా తక్కువ రేటుకే ఇస్తోంది. కాలనీల్లోనే తాత్కాలిక గోడౌన్లను ఏర్పాటుచేసి మరీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. వీటన్నింటి కోసం ఒక్కో ఇంటికి రూ.40వేల వరకు అదనపు సాయంతో పాటు, మహిళలకు పావలా వడ్డీకే రూ.35వేల రుణాన్ని అందించి, మిగిలిగిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ ఇంటి నిర్మాణానికి చేదోడుగా నిలుస్తోంది. అలాగే, 20 టన్నుల చొప్పున ఉచితంగా ఇసుకును సమకూరుస్తోంది. దీనివిలువ రూ.15వేల వరకు ఉంటుంది. మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును జమచేస్తూ పారదర్శకతను పాటిస్తోంది. ఇలా.. మొత్తం మీద యూనిట్‌కు రూ.1.80 లక్షలు కట్టుకోడానికి.. పావలా వడ్డీ కింద రూ.35వేలు.. మార్కెట్ ధరల కన్నా నిర్మాణ సామగ్రిని తక్కువకు సరఫరా చేయడం ద్వారా మరో రూ.55వేలు చొప్పున వెరసి ప్రతీ లబ్ధిదారునికి రూ.2.70లక్షల చొప్పున ప్రభుత్వం లబ్ధిచేకూరుస్తోంది. నిన్నటి వరకు అలా.. నేడు ఇలా.. రామోజీరావు ‘అసత్యాల బకాసురుడు’. ఈనాడులో ఎన్ని అసత్యాలు రాస్తే ఆయన కడుపు అంతగా నిండుతుంది. నిన్నమొన్నటి వరకు అసలు ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు తెలియడం లేదన్నారు. ఇళ్ల నిర్మాణం ముందుకు సాగట్లేదన్నా రు.కాలనీ లన్నీమునిగిపోతున్నాయన్నారు. అసలు ఇళ్లు కడతారా? అని చెవికోసిన మేకలా అరిచారు. ఇప్పుడేమో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే.. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కట్టిందని, తద్వారా కాలనీలు ఏర్పడ్డాయని, అందులో లబ్ధిదారులు ఉంటున్నారని ఈనాడు ద్వారా పరోక్షంగా అంగీకరించారు. ఈనెల 12న నిర్మాణాలు పూర్తిచేసుకున్న 7,43,396 ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. మరో 14,42,425 ఇళ్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. తొందర్లోనే వీటిని కూడా ప్రారంభిస్తారు. ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని సహించలేని టీడీపీ, దుష్టచతుష్టయం కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ రోత రాతలు ప్రారంభించాయి. వాస్తవానికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంటే.. తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుదీకరణ, ఇంటర్నెట్, ఆర్చెస్, సోక్పిట్స్ ఏర్పాట కోసం రూ.35,859 కోట్లతో కార్యాచరణను రూపొందించింది. ఇందులో శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. లేఔట్లలో ముందుగా కనీస అవసరాల కింద.. కరెంటు, తాగునీరు, సోక్పిట్స్, రోడ్ల కోసం కనీసంగా రూ.4,800 కోట్లు ఖర్చుచేసింది. పేదలకు రూ.1.5 లక్షల కోట్ల ఆస్తి.. రాష్ట్రంలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 31లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చారు. మహిళా సాధికారతలో భాగంగా వారికి ఆర్థిక భరోసా ఉండాలనే ధ్యేయంతో అక్కచెల్లెమ్మల పేరుతోనే వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మరో విశేషం. అంతేకాదు.. వీటిల్లో సుమారు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తద్వారా 17వేలకు పైగా కొత్త కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2.5 లక్షల మొదలు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉండటం గమనార్హం. ఈ లెక్కన చూస్తే పేదలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అక్షరాల రూ.1.5 లక్షల కోట్లు. రాష్ట్రంలో ఇదంతా జరుగుతుందని 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు, ఆయన రాజగురువు రామోజీ కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వాళ్లకు పేదలంటే గిట్టదు. ఇన్నేళ్లలో తన పార్ట్నర్ చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వకపోయినా ఈనాడులో ఏనాడు ప్రశ్నించలేదు. బడుగు జీవులు ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేదు. అలాంటిది తమ కళ్లెదుటే పేదోడు సంతోషంగా ఉండటం, వారి జీవన ప్రమాణాలు పెరగడం చూసి ఆయన వెర్రెక్కిపోతున్నారు. -
సామాజిక సంబంధాలు బలపడేలా జగనన్న కాలనీలు
మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం.. :::జగనన్న కాలనీలోని ఓ మహిళా లబ్ధిదారు దేశంలో దాదాపుగా పల్లెటూళ్లలో దళితులుండే కాలనీలన్నీ ఊరికి ఓ చివరలో ఉంటాయి. అయితే వివిధ స్కీమ్‌ల పేరిట.. ఎస్సీల కోసం ఊరి బయటే ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం.. సామాజిక సంబంధాల్లో మార్పునకు మార్గాన్ని ఏర్పరుస్తోంది. ఇటీవల కాకినాడ సామర్లకోటలో స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన జగనన్న కాలనీలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పరిశీలించి ఒక కథనం ఇచ్చింది. సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి కూడా. అయితే.. ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు. తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు. జగనన్న కాలనీలు మాత్రం వేరు.. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు. కానీ, గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా.. అలాంటి పనులు చేయట్లేదు. కానీ, జగనన్న కాలనీలు మాత్రం వేరు పరిస్థితులకు వేదికైంది. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి జగనన్నకాలనీకి చెందిన గుండుగోలు అరుణ అంటున్నారు. గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వ ఉద్దేశం.. నిరుపేదలకు ఇళ్లు అందించడం. ఆ ఒక్క అర్హతతోనే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి కూడా. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే అభిప్రాయం మేధావుల తరఫు నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్‌లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్‌తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్‌కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్‌ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
మా సొంత ఇంటి కలను నిజం చేసినందుకు జగనన్నకు ధన్యవాదాలు
-
వెంకటాచలంలో అట్టహాసంగా జగనన్న ఇళ్ల ప్రారంభం
-
ఒకే రోజు 5 లక్షల కుటుంబాలకు ఇళ్లు “జగనే మా ఇంటి దేవుడు..”
-
సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలపై, పేదలమీద బాబుకు ఏమాత్రం ప్రేమ లేదని దుయ్యబట్టారు. నెలరోజులు వరుసగా రాష్ట్రంలో ఉన్నారా? జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించాడా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వాళ్లెవవరికి ఇక్కడ సొంతిల్లు లేదు చంద్రబాబు, లోకేష్, ఆయన బావమరది బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంతిల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఆయన దత్తపుత్రిడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. ప్యాకేజీ స్టార్‌కు ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని అన్నారు. ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై ఉన్న గౌరవమంటూ చురుకలంటించారు. చదవండి: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్ ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే ‘వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్. షూటింగ్ గ్యాప్‌లలో రాష్ట్రానికి వస్తుంటాడు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి రాజకీయాలు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడెందుకు చేయలేకపోయారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు. ప్రతి నెల 1వ తారీకే ఇంటింటికి పెన్షన్లు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం దిశ యాప్‌తో మహిళలకు అండగా నిలిచాం. ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 రోగాలకుపైగా విస్తరించాం. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. 2.07 లక్షల ఉద్యోగాల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. చంద్రబాబు పేరు చెబితే గుర్చొచ్చేది స్కాంలే. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తొస్తుంది.’ అంటూ చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. -
రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్ -
సీఎం జగన్ కు లబ్దిదారుల కృతజ్ఞతలు
-
రాష్ట్రంలో గృహ నిర్మాణం యజ్ఞం చేపట్టిన సీఎం వైఎస్ జగన్
-
12న సామర్లకోటకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పేదల గూడు.. ఇదిగో చూడు
కర్నూలు: పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో రూ.1.80 లక్షలను ఇస్తోంది. డబ్బులు లేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా రూ. 35 వేలు రుణం ఇప్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను రాయితీపై అందజేస్తోంది. అంతే కాకుండా కాలనీల్లో విద్యుత్, రోడ్లు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కలి్పస్తోంది. దీంతో లబి్ధదారులు రెట్టింపు ఉత్సాహంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని పేదల ఇళ్లు ఇవీ.. -
తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సుమారు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, పదిహేను లక్షల మందికి తొలి విడతగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికి సుమారు నాలుగున్నర లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇది ప్రతిపక్ష తెలుగుదేశంకు ఇబ్బందికరమైన విషయమే. తన హయాంలో పేదలు ఎవరికి ఇలా ఇళ్ల జాగాలు అందచేయలేదు. కాని జగన్ భారీ స్థాయిలో స్థలాలు ఇవ్వడంతో పేద వర్గాలలో విపరీతమైన ఆదరణ చూరగొంటున్నారు. దానిని దెబ్బతీయడానికి టిడిపి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. అందులో భాగంగా జగనన్న కాలనీలు నీట మునక అంటూ బానర్ కథనాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అనేక వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని రాస్తున్నాయి. గతంలో ఇలా రాయాలంటే సిగ్గు పడే పరిస్థితి ఉండేది. ఒకరిపై ఒకరికి పోటీ ఉండేది. కాని ఇప్పుడు ఈ వర్గం మీడియా లక్ష్యం ఒకటే కాబట్టి అంతా కలిసిపోయి జగన్‌పై అక్రమ యుద్దం చేస్తున్నారు. ఈనాడు, జ్యోతివారికి ఇలా కాలనీలు మునిగిపోవడం ఎంతో సంతోషకరమైన వార్త అన్నమాట. వర్షాలు భారీగా కురిసినప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల నీటి ముంపునకు గురి కావచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత ఆ ముంపు అంతటిని తొలగించి, అక్కడ నివాసం ఉండేవారికి సదుపాయాలు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిన పనే. గత టీడీపీ ప్రభుత్వం అసలు ఇళ్ల స్థలాలే ఇవ్వలేదు కనుక వారికి ఆ ఇబ్బంది లేదు. కాని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలందరికి ఇళ్లు ఉండాలన్న సదుద్దేశంతో ఇన్ని లక్షల ఇళ్లు ఇవ్వడం వీరికి జీర్ణం కావడం లేదు. అంతే వర్షం పడితే చాలు.. ఈనాడు, జ్యోతి రాబందుల మాదిరి ఆ కాలనీవద్దకు వాలిపోయి.. ఇంకేముంది అవి మునిగిపోయాయి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ వార్తలు రాస్తున్నాయి. ఆ కాలనీలు నివాస యోగ్యంగా ఉండవని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మీడియా వేసిన ఫోటోలు గమనిస్తే అక్కడ అన్ని సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు అర్ధం అవుతుంది. ఉదాహరణకు కాకినాడ వద్ద ఒక లే అవుట్ ఫోటో ప్రచురించారు. దానిని చూస్తే కరెంటు స్తంభాలు వేసి తీగలు కూడా లాగి విద్యుత్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు లే అవుట్ లో పునాదులు లేచాయి. రోడ్ల నిర్మాణం సాగుతోంది. ఇదంతా చూసి టీడీపీ మీడియాకు కన్ను కుట్టింది. దానిని ఎలాగైనా చెడగొట్టాలని అనుకుని, వర్షం నీటిని సాకుగా తీసుకుని వారి మనసులో ఉన్న విషం అంతా కక్కేశారు. ఎక్కడైనా లే అవుట్లలో నీరు వస్తే రాయడం తప్పు కాదు. కాని అవుట్ ప్రపోర్షన్ లో అంటే జర్నలిజం ప్రమాణాలను పాటించకుండా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే యత్నం చేయడమే ఛండాలంగా ఉంది. రామోజీరావు మాదిరి కొండ మీద అంతా పాలెస్ లను కట్టుకోలేరు కదా! వారికి చిన్న గూడు ఏర్పడుతుంటే ఎందుకంత కడుపు మంట. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే అనేక కాలనీలు వర్షాలవల్ల నీట మునిగాయి. ప్రజలు నానా పాట్లు పనడుతున్నారు. వరంగల్, ములుగు వంటి జిల్లాలలో గ్రామీణ జీవనం చిన్నాభిన్నం అయింది. ఖమ్మంలో ఇళ్లలోకి నీరు వచ్చి మొత్తం విలువైన వస్తువులన్నీ పాడయ్యాయి. రామోజీకి దమ్ముంటే అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే అని రాయగలరా? నిజానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా బాధితులను ఆదుకునే యత్నం చేస్తుంది. కాని ఈనాడు వంటి ఎల్లోమీడియా తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వార్తలు రాస్తున్నదని చెప్పడానికే ఈ విషయం ప్రస్తావించవలసి వస్తోంది. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ఏపీలో లే అవుట్లలో మెరక చేసిన పనులు కూడా జగన్ వందిమాగధులే చేపట్టారని పచ్చి అబద్దాలు రాయడానికి కూడా ఈనాడు షేమ్ ఫీల్ కావడం లేదు. అవన్ని చిన్న, చిన్న కాంట్రాక్టర్లు చేస్తుంటారు. వారికి కూడా రాజకీయాలు అంటగట్టి చెత్త వార్తలు రాస్తున్నారు. ఇంతకీ వారి బాధ ఏమిటి? జగనన్న కాలనీలు నివాసయోగ్యం కావని చెప్పడమే వారి లక్ష్యం అన్నమాట. వారు చెప్పేదాని ప్రకారం హైదరాబాద్ లోని మునిగిపోయిన కాలనీలవారు అక్కడ నివాసం ఉండవద్దని చెబుతోందా? ఆ మాట ఈనాడు అనగలదా? కొన్ని కాలనీలు వారం రోజులపాటు నీట మునిగే ఉన్నాయి. వాటన్నిటికి కేసీఆర్‌నే బాధ్యుడిగా ఈనాడు రాస్తుందా? ఈ మీడియాకు ఏపీ అంటే ఎందుకు ఇంత కక్ష అంటే తమ మార్గదర్శి సంస్థలో జరుగుతున్న నల్లధనం లావాదేవీలను జగన్ ప్రభుత్వం బయటపెడుతుందా అన్న కోపంతో ఇలా చేస్తున్నారు. జగనన్న కాలనీలలో పరిస్థితి ఇలా ఉందని రాసినవారు రాజధాని గ్రామాలు ఎన్నిసార్లు నీట మునిగింది. చివరికి హైకోర్టుకు వెళ్లే రహదారి కూడా నీటి ముంపునకు గురైతే ఎన్నడైనా వార్తలు ఇచ్చారు. పేదల ఇళ్లపై విషం చిమ్మేవారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నోరు మెదపరు. అసలు అమరావతి గ్రామాలు లోతట్టు ప్రాంతమని, కృష్ణానది కన్నా తక్కువ మట్టం లో ఉన్నాయని నిపుణులు చెబితే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా అంతా ఎలా బుకాయించింది తెలుసు. కొండవీటి వాగు ముంపు నీటిని తోడి కృష్ణానదిలో కలపడానికి ప్రత్యేక స్కీమును కూడా చేపట్టారు. అయినా అది గొప్ప విషయమే. అమరావతి అధ్బుత ప్రదేశం అని భజన చేస్తారు. ఎక్కడైనా సమస్యలు ఉండవచ్చు.వాటిని ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళతాయి. విజయవాడలో నిత్యం కృష్ణానది వరదలకు గురయ్యే కృష్ణలంక ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ భారీ రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత జగన్ ది. ఆ విషయం ఏనాడైనా ఈ ఎల్లో మీడియా రాసిందా? ఈ మధ్య విస్సన్నపేట గ్రామం లో ఒక స్కూలు బడిలో వర్షం కురుస్తోందని చెబుతూ కొందరు విద్యార్ధులు గొడుగులు వేసుకుని కూర్చున్నట్లు ఫోటో తీసి పత్రికలలో మొదటి పేజీలలో ప్రముఖంగా వేశారు. తీరా చూస్తే అవన్ని కల్పిత ఫోటోలని తేలింది. పాడైపోయిన ఒక బిల్డింగ్ లో నీరుకారుతున్న చోట కొందరు స్టూడెంట్స్‌ను కూర్చోబెట్టి గొడుగులు పట్టించి ఫోటోలు తీసి ప్రజలను మోసం చేయడానికి కూడా ఈ ఎల్లో మీడియా బరితెగించింది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం వేలాది స్కూళ్లను వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి బాగు చేస్తుంటే, దానిని చూడలేక అసూయతో ఇలాంటి దారుణమైన, నీచమైన కథనాలు ఇస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే స్థానికంగా వార్త ఇవ్వవచ్చు. లేదా లోపలి పేజీలలో ఇవ్వవచ్చు. అదే సమయంలో ఆ బిల్డింగ్ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందా? మరి చంద్రబాబు పాలన టైమ్‌లో బ్రహ్మాండంగా ఉందా? అన్నది రాయాలి కదా? ప్రభుత్వం చక్కగా మార్పులు చేస్తున్న స్కూళ్ల గురించి ఎన్నడైనా ఒక్క ముక్క రాశారా? వాటిని రాయని జర్నలిస్టులకు ఈ వార్తలు రాసే నైతిక హక్కు ఉంటుందా? పోనీ అది కూడా సమతుల్యంగా రాయడం లేదంటే ఏమని అనుకోవాలి. వారు ఆత్మవంచన చేసుకుని అయినా ఉండాలి. లేదా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారన్న విమర్శలకు సిద్దపడైనా ఉండాలి. ఆ మీడియా యాజమాన్యాలు తెలుగుదేశంతో కుమ్మక్కు అయ్యాయి కనుక, ఆ సంస్థలలో పనిచేసే జర్నలిస్టులకు ఇదొక అగ్నిపరీక్షగా మారుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ జర్నలిస్టులకు ఇలాంటి విషమ పరీక్ష తప్పదు. వారికే కాదు.. ఏపీ ప్రజలకు ఈ పీడ పోవాలంటే వచ్చే ఎన్నికలవరకు ఆగక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పేదలకు శరవేగంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
-
‘టిడ్కో ఇళ్లపై ఓ వర్గం మీడియా విషప్రచారం’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఊళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా, టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ నేతలు టీడ్కో గృహాలు తమవని సెల్ఫీ చాలెంజ్‌లు చేస్లున్నారని, టిడ్కో ఇళ్లను సీఎం జగన్ సమూలంగా సంస్కరించారన్నారు. ‘70 వేల టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేశాం.ఆనాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో..ఇప్పుడు వారే ఉన్నారు.పేదలకు తమ సొంత ఇంటి కల వాస్తవానికి చాల దూరంగా ఉంటుంది.సొంత ఇళ్ళు ఉన్నప్పుడు సమాజంలో చాల గౌరవం ఉంటుంది.అన్ని సముదాయాలతో పేదల ఇంటి కలను సిఎం జగన్ సాకారం చేశారు.లబ్ధిదారుల చెలించాల్సిన సొమ్మును సగానికే తగ్గిండం తో పాటుగా ..రూపాయికే సొంతింటిన అప్పగించిన ఘనతవ సిఎం జగన్‌ది.గత పాలకులు ఓట్ల రాజకీయం చేశారు.30 లక్షల ఇళ్ళ పట్టాల ఇవ్వడం ప్రపంచ రికార్డ్’ అని పేర్కొన్నారు. -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా 68 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం
అమరావతి: విద్యుత్ పంపిణ సంస్థలు పంపిణీ నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇపిడిసిఎల్ పరిధిలో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలి. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఇపిడిసిఎల్ లోనూ ఆన్లైన్ లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలి. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలి. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. ఈదరు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు. గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యంను మెరుగుపరుచుకుంటే, సబ్ స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ లైన్ల నిర్మాణంను కూడా ప్రణాళికాయుతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, జెన్కో ఎండి కెవిఎన్ చక్రథర్ బాబు, ఇపిడిసిఎల్ సిఎండి పృథ్వితేజ్ తదితరులు హాజరయ్యారు. -
బిగ్ క్వశ్చన్: గూడులేని నిరుపేదల జీవితాల్లో సొంతింటి వెలుగులు