jagananna sampoorna gruha hakku scheme
-
జగనన్న సురక్షకు సర్వం సిద్ధం
సాలూరు: తన పాలనలో పార్టీల కతీతంగా, అర్హతే ప్రామాణింగా, అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చారిత్రక నిర్ణయానికి తెరతీశారు. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు. కార్యక్రమం విధివిధానాలు ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యుటేషన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేషన్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు. ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. కార్యాచరణ ఇలా ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లు ఒక టీమ్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీ/మరో టీమ్‌గా ఏర్పాటవుతారు. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అర్హులెవరైనా ఏవైనా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పథకాలు పొందలేకపోతే వారిని గుర్తించి పథకాలు అందేలా చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రధాన సర్టిఫికెట్లు సత్వరమే ప్రజలకు అందించనున్నాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి -
రాబోయే రెండేళ్లలో మరో 23 లక్షల ఇళ్లు
తాడేపల్లిగూడెం రూరల్(ప.గో. జిల్లా): కొత్తగా పెళ్లయిన పేదలకు 90 రోజుల స్కీంలో ఇళ్ళ పట్టాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన నివాసం వద్ద పెదతాడేపల్లి గ్రామానికి చెందిన 24మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, నిర్మాణాలు చేపట్టారన్నారు. రాబోయే రెండేళ్ళల్లో మరో 23 లక్షల ఇళ్ళు కట్టించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారన్నారు. పెదతాడేపల్లి గ్రామంలో రెండో దఫా 24 మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నట్టు తెలిపారు. పేదల సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. పెదతాడేపల్లిలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారని, దోచుకోవడానికి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేయాలనేది వారి ఆలోచనగా పేర్కొన్నారు. దుర్మార్గుల కళ్ళు తెరిపించేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే సీఎం జగన్‌కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, వీఆర్వో ఆర్వీ.పోతురాజు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగలు నాగు, పెద తాడేపల్లి సొసైటీ అధ్యక్షుడు పరిమి తులసీదాస్, వీరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ ఆలపాటి కాశీవిశ్వనాధం, నాయకులు పరిమి ప్రసాద్, పరిమి రంగ, తదితరులు పాల్గొన్నారు. -
భూసర్వే వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంలో భాగంగా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో ఎక్కువ డ్రోన్లను వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆదేశించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం సమీక్ష నిర్వహించింది. అటవీ భూముల సరిహద్దులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించడంతో పాటు పట్టణ ప్రాంతాల సర్వేలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,277 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల కోసం చిత్రాలు తీసే ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు సబ్‌కమిటీకి వివరించారు. 6,843.81 చదరపు కిలోమీటర్ల మేర 51 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే మొబైల్ మేజిస్ట్రేట్లకు శిక్షణ పూర్తయిందని, అర్బన్ ఏరియాల్లో అధికారులకు పది రోజుల శిక్షణ ప్రారంభించామన్నారు. త్వరలోనే వార్డు, ప్లానింగ్ సెక్రటరీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఓటీఎస్‌పై చైతన్యం కలిగించాలి ప్రజల్లో ఓటీఎస్‌పై చైతన్యం కలిగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రులు సూచించారు. ఇప్పటి వరకు పది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, 4.97 లక్షల మందికి డాక్యుమెంట్లు కూడా రిజిస్టర్ చేసినట్టు అధికారులు వివరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 2.83 లక్షల మంది డాక్యుమెంట్లకు అనుమతులు లభించాయన్నారు. సమీక్షలో సీసీఎల్ఏ కమిషనర్ జి.సాయిప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ఓటీఎస్‌పై అదే దూకుడు
ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారికిఆ అప్పు ఎంత ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు మాత్రమే చెల్లించి దానిని పూర్తిగా మాఫీ చేసుకుని శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సొంతిల్లు ఉన్నా దానికి శాశ్వత గృహ హక్కు పత్రాలు లేక, అత్యవసర సమయాల్లో కుటుంబ అవసరాల కోసం బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందడానికి కూడా వీలులేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది భారీ ఊరట కలిగించే పథకం. ఈ పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇంకా సందేహాలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఈ పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు... ఓటీఎస్ పథకానికి జిల్లా వ్యాప్తంగా 1,56.914 మంది అర్హత కలిగినవారు ఉండగా, వారిలో ఇప్పటికే 1,13,665 మంది దరఖాస్తు చేసి సొమ్ము చెల్లించారు. మొత్తం రూ.16 కోట్ల 63 లక్షల 32 వేల 793 ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వానికి అందించారు. దరఖాస్తుదారుల్లో 83,707 మందికి ఇప్పటికే డేటా నమోదు ప్రక్రియను తహసీల్దార్లు పూర్తిచేశారు. వారిలో 52,281 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలు అందజేశారు. ఇంకా 31,426 మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అమలులో ముందు వరుసలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావించి ఈ హక్కు పత్రాల కార్యక్రమాన్ని లాంఛనంగా జిల్లాలోనే ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు మొదట్లో చూపించిన వేగాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి లబ్ధిదారునికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబరు 21న అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పత్రాలు సీఎం జగన్మోహన్రెడ్డి తణుకులో అందించారు. జిల్లాలో అర్హులకు హక్కు పత్రాలు అందించడంలో భాగంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేయడంలో ముందు వరుసలో నిలబడటంపై జిల్లా అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ, గృహనిర్మాణ అధికారులు ఓటీఎస్ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అర్హులందరికీ పట్టాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 52,281 మందికి పట్టాలు అందించాం. త్వరలోనే మరింత మందికి అందించేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నాం. – సూరజ్ ధనుంజయ్, జాయింట్ కలెక్టర్ -
ఉత్సాహంగా ‘ఓటీఎస్’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకులు పెద్దఎత్తున రుణ సదుపాయాన్ని కల్పిస్తుండటంతో ఓటీఎస్ వినియోగించుకునేవారికి మరింత మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిళ్లు పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కనిష్టంగా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేస్తోంది. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందజేయడంతోపాటు పథకంపై సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ – ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి. బ్రహ్మానందరెడ్డి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టి. కామేశ్వరరావు, ఆ బ్యాంకు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. న్యాయ వివాదాలు లేకుండా స్థిరాస్తి గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన ఈ లబ్ధిదారులు ఓటీఎస్ కింద కేవలం రూ.20 వేలు చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఈ ఆస్తిని మళ్లీ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 లక్షలు చొప్పున రుణం పొందారు. వారి కుటుంబాలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ. బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటీఎస్ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం సంతోషకరం. రిజిస్ట్రేషన్ చార్జీలు.. స్టాంపు డ్యూటీ లేదు రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయించడం వల్ల ఒక్కో లబ్ధిదారుడికి రూ.15 వేల చొప్పున ప్రయోజనం చేకూరుతోంది. ఓటీఎస్ పథకం ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా స్టాంపు డ్యూటీ మినహాయింపు ద్వారా ఇప్పటివరకు మరో రూ.1,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. పేదల జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయి. వారి జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. ఓటీఎస్ లబ్ధిదారులకు నిర్ణీత కాలంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు రుణాలు అందేలా చూడాలి. ఈ సదుపాయాన్ని అంతా వినియోగించుకోవాలి. భావి తరాలకు చక్కటి పునాదులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుల ఆస్తికి క్లియర్ టైటిల్స్ ఇవ్వడం అభినందనీయం. సీఎం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు తరాలకు మంచి పునాదులు వేస్తున్నాయి. అధిక వడ్డీల బారిన పడకుండా మా బ్యాంకు సహకారం అందిస్తోంది. ముఖ్యమంత్రి పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఇది లబ్ధిదారుల జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది. ఇవాళ నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రూ.11,75,000 రుణాలను అందచేస్తున్నాం. నాలుగు జిల్లాల్లో 228 బ్రాంచీలున్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు మా బ్యాంకు బ్రాంచీలను సంప్రదిస్తే రుణసేవలు అందిస్తాం. – టి.కామేశ్వర్రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ పేదలకు ఎంతో ప్రయోజనం ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోంది. గతంలో డాక్యుమెంట్లు, తగిన సెక్యూరిటీ లేక రుణాల మంజూరులో సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా ప్రభుత్వం క్లియర్ టైటిల్స్‌తో ఇస్తోంది. బ్యాంకులకు ఇది గొప్ప అవకాశం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
సంపూర్ణ హక్కుతో సంతోషం
ఫొటోలో కనిపిస్తున్న కంచెర్ల కృష్ణవేణిది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం. చాలా ఏళ్ల క్రితం గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. రుణం చెల్లించకపోవడంతో ఇంటి పత్రాలు తనఖాలోనే ఉండిపోయాయి. గత ఏడాది సీఎం జగన్ ప్రభుత్వం ఇంటి రుణాలపై రాయితీ ఇస్తూ, నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో తన అప్పు వడ్డీ, అసలు కలిపి రూ. 50,620కు చేరిందని తెలుసుకుంది. అయితే, రూ.10 వేలు చెల్లిస్తే చాలని అధికారులు సూచించడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించింది. సర్కారు సర్వహక్కులతో ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న జి. వాణిప్రియది శ్రీకాకుళం జిల్లా రాజాం. రోజూ కూలి పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. ఈమెకు భర్త కూడా లేడు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటికి హక్కు పత్రాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అప్పు కూడా పుట్టదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడంతో వాణిప్రియ రూ.10వేలు కట్టేసి ఇంటిపై సంపూర్ణ హక్కులు పొందింది. దీంతో ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ.10 లక్షలకు పెరిగిందని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణం వస్తుందని ధీమాగా ఉంది. .. ఇలా కృష్ణవేణి, వాణిప్రియ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదలు ఈ పథకం కింద ఇళ్లపై సర్వహక్కులు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్‌జీహెచ్‌పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోగా వీరిలో 96% మందికి ఇళ్లలో నివసించే హక్కులు తప్ప, ఆస్తులపై ఇతర హక్కులు లేవు. దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు వరంలా మారింది. ఎంతో సంతోషంతో వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, టీడీపీ, దాని అనుకూల పచ్చమీడియా ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి. ఈ పథకంపై ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి.. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు ఓటీఎస్‌ను అమలుచేస్తూ వస్తున్నప్పటికీ 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓటీఎస్ అమలుచేయాలని ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం కోరినా చంద్రబాబు కనికరించలేదు. జగన్ సీఎం అయ్యాక జేఎస్‌జీహెచ్‌పీ ప్రవేశపెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,69,786 మంది ముందుకొచ్చారు. వీరిలో 3,69,139 మంది పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రూ.16 వేల కోట్ల మేర లబ్ధి 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థకు ఇళ్ల లబ్ధిదారులు పడిన బకాయి వడ్డీతో కలిపి రూ.14,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం జేఎస్‌జీహెచ్‌పీ ద్వారా ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మాఫీ చేసింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ సమయంలో చార్జీలు, ఫీజులను ఎత్తివేస్తూ రూ.6 వేల కోట్లు పేదలపై భారం పడకుండా చూసింది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర పేదలకు లబ్ధిచేకూర్చింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఇంటిపై ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తోంది. ఇక నిర్దేశించిన మొత్తం కన్నా అప్పు తక్కువగా ఉంటే లబ్ధిదారులు ఆ మొత్తాన్నే చెల్లించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఓటీఎస్ అమలుకు 03–11–2017న గృహ నిర్మాణ సంస్థ ఎండీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. ఈ తరహాలో 2014–19 మధ్యలో గత టీడీపీ ప్రభుత్వానికి గృహ నిర్మాణ సంస్థ ఐదుసార్లు ప్రతిపాదనలు పంపింది. అయినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వడ్డీతో సహా వసూలుకే అప్పట్లో బాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనాలివే.. ► పూర్తి యాజమాన్య హక్కులు రావడంవల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువే. ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారంలేదు. ఈ పథకం ద్వారా ఆస్తులను బదలాయించుకోవడంతో పాటు అమ్ముకోవచ్చు. రుణం రూ.51 వేలు.. కట్టింది రూ.10 వేలు 17 ఏళ్ల క్రితం ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం రూ.51 వేలకు చేరుకుంది. ఇంటిపై అధికారికంగా మాకు ఎలాంటి హక్కులు లేవు. సీఎం వైఎస్ జగన్ ఎంత అప్పు ఉన్నా, కేవలం ఒకేసారి రూ.10 వేలు కడితే అప్పును పూర్తిగా రద్దుచేయడంతో, పాటు ఇంటి పత్రాలు ఇస్తామని చెప్పడంతో వెంటనే కట్టేశా. ఇల్లు నా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు తీసుకున్నా. – పి. అనంతమ్మ, పగిడిరాయి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ సంస్థ బోర్డు మీటింగ్ లో చేసిన తీర్మానంకు సంబంధించిన ప్రతి ఇన్నేళ్లకు సొంతింటి కల నేరవేరింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇందులో మాకు నివసించే హక్కు తప్ప మా వారసులకు దీనిని బదలాయించే హక్కులేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆ బెంగ తీరింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు బ్యాంకు రుణాలు పుట్టవు. ఇది మాలాంటి వాళ్లకి పెద్ద సమస్య. మా సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు. చాలా ఏళ్లుగా సొంతింటిలో ఉంటున్నప్పటికీ ఇప్పటికి నా సొంతింటి కల వాస్తవ రూపం దాల్చింది. – జంగాల నాగమ్మ, జయంతి కాలనీ, రాజుపాలెం గుంటూరు జిల్లా దుష్ప్రచారం మానుకోవాలి గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు. బాబుకు పేదలు బాగుపడటం ఇష్టం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం అసలు, వడ్డీలో రాయితీ ఇచ్చి, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బాబు బుద్ధి మార్చుకోవాలి. – దావులూరు దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మా ఆస్తి విలువ పెరిగింది 15 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాం. మాది ప్రభుత్వం ఇచ్చిన స్థలం. డీ పట్టా ఉండటంతో మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఆస్తి విలువ 50 శాతం తక్కువే పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో ఇకపై మాది ప్రైవేట్ ఆస్తితో సమానం. దీంతో భవిష్యత్‌లో మేం అమ్మాలనుకున్నా కొనుగోలుకు ఎంతోమందిముందుకు వస్తారు. మాకు దిగులుండదు. ఇప్పుడు మా ఇల్లు రూ.35 లక్షల వరకు పలకనుంది. – కోనేటి రాజ్యలక్ష్మి, రమణయ్యపేట, కాకినాడ ఇంటి పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు సొంత ఇంట్లో ఉన్నా ఇంటిపై యాజమాన్య హక్కులు లేవని లోటు ఉండేది. 2007లో తీసుకున్న రుణం వడ్డీతో రూ.30 వేలు అయింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వలంటీర్ చెప్పగానే ఎవరి ప్రోద్బలం లేకుండా రూ.10 వేలు చెల్లించాం. సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు. – కోకిల, పలమనేరు, చిత్తూరు జిల్లా ఇంటి విలువ పెరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంపూర్ణ గృహ హక్కు పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను 2010లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.28 వేలకు చేరుకుంది. ప్రభుత్వం ఓటీఎస్ ప్రవేశపెట్టడంతో వెంటనే రూ.10 వేలు చెల్లించా. నా ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అందించారు. ఇప్పటివరకు ఇల్లు నాదైనా, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంవల్ల ఎంతో ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం డాక్యుమెంట్లు పక్కాగా రావడంవల్ల నా ఇంటి విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరుకుంది. – అల్లాబకాష్, నెరవాడ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా -
మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్
-
వైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ
ఒంగోలు/ఒంగోలు సబర్బన్: ఆర్యవైశ్యుల్ని రెచ్చగొట్టే పనిలో టీడీపీ నాయకులు, వారికి మద్దతుగా పనిచేస్తున్న కొన్ని చానళ్లు కంకణం కట్టుకున్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమిశెట్టి సుబ్బారావు (గుప్తా) ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు తమ పార్టీలోనే కొందరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో వారు కొంత తొందరపడ్డారని చెప్పారు. ఆ విషయం తన దృష్టికి రాగానే వాళ్లని నిలువరించానని చెప్పారు. ఆ తరువాత సుబ్బారావు తమతోనే ఉన్నారన్నారు. ‘అసలు టీడీపీ వాళ్లకు ఏమిటి బాధ. వీళ్లకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మమ్మల్ని అభాసుపాలు చేయాలన్నదే టీడీపీ నాయకులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పనిగా పెట్టుకుని కుయుక్తులు పన్నుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘రాజకీయ సన్యాసం తీసుకుంటా’ ‘ఐదుసార్లు ఒంగోలు శాసనసభ్యునిగా ఎన్నికయ్యా. ఇన్నేళ్లలో నా వల్ల ఏ ఒక్క ఆర్యవైశ్యుడైనా బాధపడ్డారా. వైఎస్సార్ సీపీలోనే కాదు. చివరకు టీడీపీ, జనసేనలో ఉన్న వారినీ అడుగుతున్నా. ఎవరైనా బాధపడి ఉంటే చెప్పండి. రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని మంత్రి బాలినేని అన్నారు. ‘నాకు స్నేహితుడి వంటి వ్యక్తి అతని వ్యాపారం నిమిత్తం డబ్బుతో చెన్నై వెళ్తుంటే ఆ డబ్బులు నావంటూ హవాలా మంత్రి అని మీడియా ప్రచారం చేసింది. ఆ డబ్బు ముమ్మాటికీ నల్లమల్లి బాలు అనే వ్యక్తికి చెందినదనే విషయం ఆర్యవైశ్యుల్లో అందరికీ తెలుసు. ఇప్పుడు సుబ్బారావుగుప్తాపై ఓ కార్యకర్త దాడిచేస్తే దానిపై నేను స్వయంగా కేసు పెట్టించాను. అరెస్ట్ కూడా చేయమని కోరాను. ఈ దాడికి, బాలినేనికి సంబంధం లేదని స్వయంగా సుబ్బారావే చెప్పినా మీడియాలో విష ప్రచారం చేయడం దారుణం’ అని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాట్లాడినా, మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెట్టినా అందరి సంతోషం, సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. గతంలో వ్యాపారి పత్తి రామకృష్ణ మరణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం కారణమైతే.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న మీడియా అప్పుడేమైందని ప్రశ్నించారు. తాను మౌనంగా ఉంటున్నానని ఇష్టం వచ్చి నట్లుగా విమర్శలు చేస్తుండటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. భౌతిక దాడులను సహించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లాతో ఉన్న బంధం విడదీయరానిదని మంత్రి బాలినేని అన్నారు. ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివ ర్గంలో తాను ఒక మంత్రినని, ఈ నేపథ్యంలో ఆయన రుణం కొంతైనా తీర్చుకునేందుకు ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్యవైశ్య ప్రముఖులు ఏ స్థలంలో రోశయ్య విగ్రహాన్ని పెడితే బాగుంటుందో వారం రోజుల్లో సూచించాలని కోరారు. -
సర్వ హక్కులతో స్వగృహాలు
మీకెందుకయ్యా.. కడుపుమంట? ఈ రోజు మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. అది చంద్రబాబు కావచ్చు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 కావచ్చు. ఒకవేళ వారు మీ దగ్గరికి వస్తే కొన్ని ప్రశ్నలు అడగండి. అయ్యా.. మా ఇళ్లను ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు కొనుగోలు చేస్తారా? అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో మీ ఆస్తులను రిజిస్టర్ చేసి ఇస్తారు కదా..! మరి మా బిడ్డలకు ఇంటిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు కల్పిస్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని గట్టిగా అడగండి. మీరు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూముల మాదిరిగానే మా ఇంటి విలువ కూడా పెరిగేలా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మా అన్న చెబుతుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని ప్రశ్నించండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల విలువైన భూమిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు స్థిరాస్తిపై వివాదరహితంగా, క్లియర్ టైటిల్‌తో సర్వహక్కులూ కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. కలను నిజం చేస్తున్నాం... ఇవాళ నా పుట్టిన రోజు నాడు దేవుడి దయతో దాదాపు 52 లక్షల మందికిపైగా మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొంతూరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లును కూడా జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాం. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటిని తదనంతరం పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వాలని ఆరాట పడే పేదల కలలను నిజం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదలకు ఇంటి పట్టాలు, స్థలాలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాటిపై హక్కులు కల్పించడం లేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా 52 లక్షలకుపైగా కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం. ఇందులో ఓటీఎస్‌తో మొదటగా లబ్ధి పొందుతున్న 8.26 లక్షల మందికి పత్రాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాం. ఓటీఎస్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హక్కులు లేక.. దిక్కు తోచక తమ ఇంటిలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న 52 లక్షల మందికి సర్వ హక్కులు కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తెచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నా. వారికి అందించే ఆస్తి విలువ రూ.1.58 లక్షల కోట్లు. అది నేరుగా వారి చేతుల్లోకి వస్తుంది. నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటిపై హక్కులు దక్కితే అవసరం వచ్చినప్పుడు మార్కెట్ రేటుకు అమ్ముకునే వీలుంటుంది. ఇప్పటిదాకా ఆ అవకాశం లేదు. వారసత్వంగా సంతానానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే వీలు కూడా లేదు. కష్ట కాలంలో తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకునేందుకూ వీల్లేదు. ఏ హక్కూ లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి. శనక్కాయలు, బెల్లానికీ సరిపోవు... ఇంటి మీద మనకు హక్కు లేకపోతే మార్కెట్లో రూ.10 లక్షలు పలికే నివాసం విలువ మరో రకంగా ఉంటుంది. రూ.2 లక్షలకు కూడా కొనేవారుండరు. శనక్కాయలకు, బెల్లానికి కూడా సరిపోవు. ఉదాహరణకు ఈ రోజు ఇదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూమి, ఇంటికి.. రిజిస్ట్రేషన్ చేయని వాటికి తేడా ఎంత ఉందో ఒకసారి గమనించాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ జరిగిన వాటి విలువ చేయని వాటితో పోలిస్తే పలు రెట్లు అధికంగా ఉంది. నా పాదయాత్ర సమయంలో నన్ను కలిసిన అక్క చెల్లెమ్మలను అడిగి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాం. పేదలకు ఇంటిపై సర్వ హక్కులు కల్పిస్తూ అవసరమైతే కష్ట కాలంలో అమ్ముకునే స్వేచ్ఛను కూడా ఈరోజు నుంచి కల్పిస్తున్నాం. ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్మెంట్) ద్వారా తొలుత లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కులతో డాక్యుమెంట్లను ఇవాళ అందచేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 12 లక్షల కుటుంబాలు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నాం. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న వారు గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. వీరందరికీ సర్వ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఆస్తిని వారి చేతుల్లో పెడతాం. పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయి ఉండగా ఏకంగా రూ.10 వేల కోట్లు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో మరో రూ.6 వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ప్రయోజనం కల్పిస్తోంది. మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నాం. ఒకవేళ అదే వారే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే 7.50 శాతం మేర రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు కట్టాలి. ఒక ఇంటి విలువ రూ.15 లక్షలు అని లెక్కేసుకున్నా కనీసం రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా రిజిస్ట్రేషన్‌తో 52 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 41 వేల మంది అసలు, వడ్డీ కడితే కేవలం డి.ఫారం మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. నిషేధిత భూముల జాబితా (22 ఏ) నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్æ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిని సచివాలయాల్లోనే నామమాత్రపు రుసుము చెల్లించి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓటీఎస్ ద్వారా లబ్ధి పొందిన వారికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. పేదలు రూ.15.29 కోట్లు చెల్లిస్తే హక్కులేవి? ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయాలని 2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి చంద్రబాబు పాలనలో అధికారులు ఐదుసార్లు ప్రతిపాదనలు పంపితే నిరాకరించారు. రుణమాఫీ దేవుడెరుగు.. కనీసం వడ్డీ కూడా మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 43 వేల మంది లబ్ధిదారులు అప్పో సప్పో చేసి రూ.15.29 కోట్లు చెల్లిస్తే గత సర్కారు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించిందని గట్టిగా నిలదీయండి. ఆ పెద్ద మనుషులకు చెప్పండి అధికారంలోకి వచ్చిన 30 నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వం ఎలాంటి వివక్ష, దళారులకు తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా రూ.1.16 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అర్హుల ఖాతాలకు జమ చేసింది. ఒక్క రూపాయి కూడా లంచానికి ఆస్కారం లేకుండా పంపిణీ చేసి మంచి చేసిన జగనన్న మీవద్ద నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటాడా? ఈ విషయాన్ని ఆ పెద్ద మనుషులకు ఒకసారి తెలియజేయాలని కోరుతున్నా. మీ పిల్లలైతే ఇంగ్లీష్ మీడియం బడుల్లో చదవచ్చు.. మా పిల్లలేమో తెలుగుమీడియం బడుల్లో మాత్రమే చదవాలా? అని వారిని అడగండి. మా జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి పేదలకు మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించండి. ఇదే రాజధాని (అమరావతి)లో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే సామాజిక అసమతుల్యత నెలకొంటుందని ఆ పెద్ద మనుషులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఓటీఎస్ ఉగాది వరకు పొడిగింపు ఓటీఎస్ పథకాన్ని వచ్చే ఉగాది వరకు పొడిగిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2వతేదీ వరకు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర... చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా రెండున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశాం. ఒక అన్నగా నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్లు. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతులతో కలిపి ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్థిని పెట్టినట్లు అవుతుంది. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ధర్మాన కృష్ణదాస్ తానేటి వనిత, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి చైర్మన్ కె.మోషేన్‌రాజు, సీఎం ప్రొగామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. -
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
-
పేదవాడికి మేలుచేస్తుంటే చూడలేకపోతున్నారు: సీఎం జగన్
-
AP: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగింపు
సాక్షి, పశ్చిమగోదావరి: ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలివే.. ♦ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి. ♦లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు. ♦రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది. ♦నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు. ♦ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోంది. ♦22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. ♦ రిజిస్ట్రేషన్ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు. ♦ లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నామ మాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేట్ల కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలి’’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోతే మీరు కొంటారా? అని వారిని ప్రశ్నించాలన్నారు. ‘‘మీ ఆస్తులైతే రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్ట్రేషన్లు అవ్వకూడాదా? మంచి చేస్తుంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ జీర్ణించుకోలేపోతున్నారని’’ అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదు సార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు. రుణమాఫీ కాదు కాదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరు’’ అని సీఎం దుయ్యబట్టారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతి రూపం ఇల్లు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు లబ్ధిచేకూరే మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. ‘‘ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని’’ సీఎం అన్నారు. తణకులో ఇంటి మార్కెట్ విలువ రూ.30 లక్షల వరకు ఉంది. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి యజమానులుగా మారుస్తున్నాం. కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ.16వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రిజిస్ట్రేషన్ స్టాల్స్ పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
పేద ప్రజలకు ఇదో వరం
పేద ప్రజలకు అద్భుతమైన వరం లాంటి ‘వన్ టైమ్ సెటిల్మెంట్‘ (ఓ.టి.యస్.) చెల్లించటం ద్వారా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధి పొందిన ప్రజలు రాష్ట్ర మంతటా ఎంతో ఉత్సాహంతో డిసెంబర్ 21న మంగళవారం పండుగ జరుపుకొంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం ప్రారంభించారు. ఓ.టి.యస్. లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల లబ్ది కల్పించింది. రుణ బకాయిల రద్దుతో మరో రూ. 10 వేల కోట్ల లాభం ప్రజలకు చేకూరింది. ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి తేడా చూపబోమని తొలినాళ్లలో ప్రకటించిన విధంగానే గత ప్రభుత్వ హయాంలో కట్టిన వారికికూడా మేలు కలిగేలా ప్రభుత్వం నిర్ణయం చెయ్య డంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి వారు గమనించాల్సినది ఏమిటంటే వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలనూ గత ప్రభుత్వం అసలు పరిశీలించనేలేదని! సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా గృహ నిర్మాణాల రుణం నిమిత్తం చెల్లించారు. గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కోరినా పట్టించుకోని చంద్రబాబు రేపు అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని అనడం ప్రజలను మభ్య పెట్టడమే. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేస్తున్న ప్పుడు ప్రజల గుండె చప్పుడు విన్నందున.. వారి సంక్షేమానికి అనుకూలమైన నవరత్నాల ద్వారా జనరంజక పాలన అందిస్తున్నారు. (చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు) గత ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ము కునే హక్కు కల్పించలేదని, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసిందని పాదయాత్రలో తెలుసుకుని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఓ.టి.ఎస్. పధకాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు పేద ప్రజలకు అందు తోంది. డి.ఫారం పట్టాలపై రుణం తీసుకుని ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేదలకు ప్రస్తుతం అమలులో వున్న నిబంధనలను సవరించి ఓ.టి.ఎస్. ద్వారా శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన పేదలు తమ ఇల్లు అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా పూర్తి హక్కులు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధి దారులు మొత్తం 56,69,000 మంది. ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసు కున్నారు. వీరి రుణ బకాయిలు వన్‌టైమ్ సెటిల్మెంట్ కన్నా తక్కువ ఉంటే ఆ మొత్తం కడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌లో చెప్పిన మొత్తం కట్టి సెటిల్ చేసుకుంటున్నారు. ఎలాంటి రుణం తీసుకోని వారు 12 లక్షల మంది వరకూ ఉన్నారు. వాళ్లు కేవలం 10 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ లేవు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(అ) జాబితా నుంచి తొలగించినందువల్ల ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజి స్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుంది. లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచి వాలయంలోనే రిజిస్ట్రేషన్‌చేసి సచివాలయంలోనే అందజేస్తారు. సామాన్యుల ఇళ్లలో పేదరికం ఎంత దారుణంగా ప్రభావం చూపుతుందో తన పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వారికి ఆత్మగౌరవం కలిగేలా పేదలకు ఇచ్చిన వరం లాంటి ఓ.టి.ఎస్.ను వినియోగించుకొని తమ ఆస్తికి విలువను కల్పించు కోవడంలో ప్రజలు ఎంత మాత్రం వెనుకాడటం లేదు. - దవులూరి దొరబాబు చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ -
CM YS Jagan: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం
Time 1.20 PM జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు: సీఎం జగన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. 'ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇది. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు. గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయించాము. 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. అందరూ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉగాది వరకు పొడిగిస్తున్నాం' అని సీఎం జగన్ అన్నారు. పేదల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ మాత్రమే టీసీఎస్ ఉద్యోగి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓటీఎస్ పథకం మా కుటుంబానికి ఎంతో స్వాంతన కలిగించింది. రాష్ట్రంలో పేదల గురించి సీఎం జగన్ ఆలోచించినంతగా మరే వ్యక్తి ఆలోచించలేరు. ఈ పథకంపై టీడీపీ నాయకులు మా ఇంటికి వచ్చి ప్రభుత్వం వచ్చాక రూపాయి లేకుండా ఇంటి పట్టా ఇస్తామని చెప్పారు. ఆ విషయం వినగానే నాకు నవ్వొచ్చింది. నాతో మాట్లాడిన పాలకులే మూడేళ్ల కింద అధికారంలో ఉన్నారు. ఆనాడు ఏమీ చేయక ఇప్పుడు ఏదో చేస్తామని మభ్యపెట్టడం టీడీపీ నాయకులకే సాధ్యమని అన్నారు. లబ్ధిదారు సుజాత భావోద్వేగం ►సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారు సుజాత మాట్లాడుతూ.. 'ఈ పథకం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు అన్న. 9 ఏళ్ల క్రితం నేను ఇళ్లు కట్టుకున్నా అయితే ఇప్పటిదాకా ఇంటికి సంబంధించి నాకు ఎటువంటి ఇంటి పత్రం లేదు. ఇప్పుడు ఈ పథకం క్రింద దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని నా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ►తణుకు బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ 11:35AM ►తణుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 08:10AM సాక్షి, ఏలూరు/తణుకు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఆయన తొలిసారి తణుకు రానుండటంతో అధి కార యంత్రాంగం, పార్టీ నాయకులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు గృహహక్కు పత్రాల పంపిణీని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బాండ్లను ఆయా మండల కేంద్రాలకు పంపారు. భారీ స్వాగత ఏర్పాట్లు : తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణమంతా వైఎస్సార్సీపీ జెండాలతో రెపరెపలాడుతోంది. భారీ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కూడా కావడంతో భారీఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో సుమారు రూ.171.48 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముస్తాబైన స్టాల్స్ : సభావేదిక ప్రాంతంలో గృహనిర్మాణ శాఖ, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్ పథకం వంటి స్టాల్స్‌ను ముస్తాబుచేశారు. ఫొటో గ్యాలరీ, ఓటీఎస్ లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హెలికాప్టర్ ట్రయల్‌రన్ ముఖ్యమంత్రి ప్రయాణించనున్న హెలికాప్టర్ ట్రయల్‌రన్ నిమిత్తం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సమీపంలోని హెలీప్యాడ్‌కు వచ్చింది. సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హెలికాప్టర్లో వచ్చి స్వయంగా పరిశీలించారు. రూ.10 వేల కోట్ల భారం తగ్గింపు ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్ పత్రం, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు. జిల్లాలో 1.04 లక్షల మంది ముందుకు.. జిల్లాలో ఓటీఎస్ పథకానికి 1,43,072 మంది అర్హులు ఉండగా ఇప్పటివరకూ 1,04,524 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరందరికీ శాశ్వత గృహహక్కు పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధునాతన రీతిలో సభావేదిక హైస్కూల్ ఆవరణలో అధునాతన రీతిలో సభావేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. వేదికపై భారీ స్క్రీన్స్ ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తణుకు, నిడదవోలు ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీనివా సనాయుడు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, హౌసింగ్ ఎండీ భరత్‌గుప్తా, జేసీ హిమాన్షు శుక్లా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సభావేదికపై ఏర్పాటుచేసిన స్క్రీన్ -
నివాస హక్కులు కాదు.. ఇక సర్వహక్కులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు. నిజానికి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు పేదల ఇళ్లకు కేవలం ‘నివసించే హక్కులు’ మాత్రమే ఇచ్చాయి. ఆ ఇంటి విలువ రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఉన్నప్పటికీ ఇల్లు, ఇంటి స్థలాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదు. అంతేకాదు.. ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్థితి కూడా. ఈ నేపథ్యంలో.. కేవలం నామమాత్రపు రుసుముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల రుణాలు, వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తూ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఆ 43వేల మందికి కూడా.. గత ప్రభుత్వ హయాంలోని 2014–19 మధ్య అధికారులు ఐదుసార్లు వడ్డీ మాఫీ ప్రతిపాదనలు పంపినా ఏదో ఒక నెపంతో నాటి సర్కారు తిప్పిపంపింది. రుణం సంగతి దేవుడెరుగు, వడ్డీ కూడా మాఫీ చేయలేదు. అయితే.. 43 వేల మంది లబ్ధిదారులు వారి అసలు, వడ్డీ కలిపి రూ.15.29 కోట్లు చెల్లించినప్పటికీ ఎలాంటి యాజమాన్య హక్కులు పొందలేదు. వారికి కూడా నేడు వైఎస్ జగన్ సర్కారు ఉచితంగా సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలివే.. ► ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి. ► లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు. ► రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది. ► నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు. ► ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోంది. ► 22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. ► రిజిస్ట్రేషన్ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు. ► లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరంలేదు. నేడు తణుకుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వెళ్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి అక్కడ శ్రీకారం చుడతారు. ఉ.10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జెడ్పీ బాలుర హైస్కూల్లో జరిగే బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లి అక్కడ పథకాన్ని ప్రారంభించి, ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మ.1 గంటలకు తాడేపల్లికి బయల్దేరుతారు. -
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ఆదరణ పెరుగుతోంది. పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.14 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.03 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 వేల మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 8.11 లక్షల మందిలో 6 లక్షల మంది గడిచిన 10 రోజుల్లో ముందుకు రావడం విశేషం. రూ.10వేల కోట్ల రుణాల మాఫీ ఇక గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో భారీ ఊరట కల్పించింది. ఓటీఎస్ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. రేపటి నుంచి పంపిణీ స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. గతంలో చెల్లించిన వారికి కూడా.. 2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు. అవగాహన కల్పిస్తున్నాం పథకంతో కలిగే ప్రయోజనాలపై అర్హులకు అవగాహన కల్పిస్తున్నాం. అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 22ఏ జాబితా నుంచి స్థలాలను తొలగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఇళ్లను తనఖా పెట్టుకోవడానికి, అమ్మడానికి, వారసుల పేర్లపై బదిలీ చేయడానికి వీలుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలును వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఐదుసార్లు సిఫార్సు చేసినా ఓటీఎస్ కింద వడ్డీలు మాఫీ చేయడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం వడ్డీ, అసలు రెండింటిలో రాయితీ ఇవ్వడంతో పాటు, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అర్హులు దీన్ని గమనించాలి. అర్హులైన ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకుని పథకాన్ని వినియోగించుకోవాలి. – దావులూరి దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ -
CM YS Jagan: 21న సీఎం జగన్ తణుకు పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మంగళవారం ఉదయం ఆయన 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 11 గంటలకు తణుకు టౌన్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 1.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. -
దుష్ప్రచారం తిప్పికొట్టాలి
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఒత్తిడి లేదని, అది పేదలకు మేలు చేసేదని వివరించాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. జగనన్న గృహ హక్కు పథకంపై చంద్రబాబు కుట్ర పూరితంగా, పచ్చ మీడియాతో కలసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా అటు పర్యావరణ పరిరక్షణతో పాటు అందరికీ స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుందన్నారు. -
ఓటీఎస్‌తో పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: నిరుపేదలకు ఎంతో మేలు జరిగే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)పై విమర్శలు చేస్తున్న వారు పేదల వ్యతిరేకులని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇళ్లపై పేదలకు సంపూర్ణ హక్కులు దక్కడం కొందరికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం దీన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అమలు చేయకపోగా కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. వన్‌టైమ్ సెటిల్మెంట్కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటివరకూ 5 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. ఏడాది మొత్తం అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలపై సీఎం ఇలా మార్గనిర్దేశం చేశారు.. సంపూర్ణ అవగాహన కల్పించాలి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. తొలుత సిబ్బంది, వలంటీర్లకు క్షుణ్నంగా వివరించి పథకం ప్రయోజనాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల మేర భారీ బకాయిలను మాఫీ చేస్తోంది. క్లియర్ టైటిల్ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకునేందుకు లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంది. అంత మొత్తంపై రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నాం. ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల పేదలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. ఇలా మొత్తం రూ.16 వేల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలుగుతుంది. ఇక చంద్రబాబు హయాంలో అసలు, వడ్డీ చెల్లించిన వారు 43 వేల మంది ఉన్నారు. డబ్బులు కట్టినా వారికి ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఇప్పుడు వారందరికీ మేం ఉచితంగా ఇస్తాం. ఈ అంశాలను లబ్ధిదారులకు క్షుణ్నంగా చెప్పాలి. వీటన్నిటిపై అవగాహన కల్పించి ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందేలా చూడాలి. ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఊరట లభించింది. హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. సిమెంట్, స్టీల్ ఇతరత్రా కొనుగోళ్లతోపాటు స్థానికులకు పనులు లభిస్తాయి. ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం. బిల్లులు పెండింగ్ లేకుండా అన్నింటినీ చెల్లించాం. జనవరి 31 కల్లా అన్నీ మొదలవ్వాలి మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణం కొనసాగేలా చూడాలి. జనవరి 31 కల్లా అన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావాలి. బేస్మెంట్ స్థాయిని దాటి ముందుకెళ్లాలి. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి 20 మంది లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు ముమ్మరం చేయాలి. జనవరి 31 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తై ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. కలెక్టర్లు, జేసీలు, మున్సిపల్ కమిషనర్లు ఇళ్ల నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. గతంలోనే చెప్పిన విధంగా కలెక్టర్ ప్రతివారం ఒక లేఅవుట్‌ను పరిశీలించాలి. జేసీ (రెవిన్యూ, డెవలప్మెంట్, ఆసరా) వారానికి ఒకసారి, హౌసింగ్ జేసీలు, ఆర్డీవోలు, సబ్కలెక్టర్లు వారానికి నాలుగు సార్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించాలి. వ్యయాన్ని నియంత్రించాలి.. ఇళ్ల నిర్మాణ ఖర్చును తగ్గించడంతో పాటు వ్యయాన్ని నియంత్రణలో ఉంచాలి. లేఅవుట్ల పరిధిలోనే ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. సిమెంట్‌ను సబ్సిడీ ధరకు అందిస్తున్నాం. స్టీల్‌ను కూడా సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తున్నాం. మెటల్ ధరలపై కలెక్టర్ల నియంత్రణ ఉండాలి. లబ్ధిదారులకు పావలా వడ్డీకే రుణాలు ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే రుణాలు అందించాలని సూచించాం. దీనిపై బ్యాంకర్లతో కలెక్టర్లు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలి. సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇళ్ల నిర్మాణ నాణ్యత బాగుండేలా చూడాలి. ఇళ్లు నిర్మించే కాలనీల్లో నీటి సరఫరా కచ్చితంగా ఉండాలి. వీలైనంత మేర ఇసుక రీచ్‌లను తెరిచి అందుబాటులోకి తేవాలి. పెద్ద లేఅవుట్లలో మెటీరియల్‌ను నిల్వ చేసేందుకు గోడౌన్లను ఏర్పాటు చేయాలి. ఇళ్ల నిర్మాణంపై సచివాలయాల నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ ప్రతి వారం సమావేశాలు జరగాలి. మధ్య తరగతికి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ మధ్య తరగతి ప్రజల కోసం వీటిని తీసుకొస్తున్నాం. వివాదాలు లేని ప్లాట్లను సరసమైన ధరలకే వారికి అందిస్తాం. ఆ లేఅవుట్లలో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తాం. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేపడతారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం వస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి భూ సేకరణపై దృష్టి సారించాలి. అర్హులందరికీ ఇంటి పట్టాలు.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా అందాలి. ఇప్పటివరకూ అందిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించారు. డిసెంబర్ 28న వివిధ కార్యక్రమాలు, పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ప్రయోజనాలను అందిస్తున్నాం. ఏటా రెండు సార్లు ఇలా చేస్తున్నాం. లబ్ధిదారులుగా గుర్తించిన వారికి, అందుబాటులో ఇళ్లస్థలాలు ఉన్నవారికి అదేరోజు పట్టాలివ్వాలి. మిగిలిన వారి కోసం కూడా అవసరమైన భూములను సేకరించండి. ల్యాండ్ స్వాపింగ్ ఆప్షన్‌ను కలెక్టర్లు వినియోగించాలి. అవసరమైన చోట భూమి సేకరించాలి. వీరికి జనవరి నెలాఖరులోగా పట్టాలు అందించేలా చర్యలు తీసుకోండి. -
Andhra Pradesh: పేదలకు నిశ్చింత
ఓటీఎస్ పథకం గురించి ఇవాళ ఇష్టాను సారం మాట్లాడుతున్న వారు ఒకసారి గతం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడంతా మాఫీ చేస్తామని చెబుతున్న వారు గతంలో ఏం చేశారు? ఒకరిద్దరు కాదు.. ఏకంగా 43 వేల మంది అసలు, వడ్డీ కట్టినప్పటికీ ఎందుకు రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికీ వీరికి డీకేటీ పట్టాలే ఉన్నాయి. మిగతా వారికి అసలు కాదు కదా.. వడ్డీ కూడా మాఫీ చేయడానికి మనసొప్ప లేదు. ఇలాంటి వారు ఇప్పుడు పేదలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతున్నారు. – సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ పథకానికి సంబంధించి 22–ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులు రద్దు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నాం. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్ స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్‌తో అధికారులు సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా పేదలపై రూ.10 వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఓటీఎస్ కింద లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయడంతో పాటు క్లియర్ టైటిల్‌తో ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు. తద్వారా ఆ ఆస్తిపై వారికి సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్), పేదల ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటీఎస్ పథకం స్వచ్ఛందమని, దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పేదలకు మేలు చేసే ఈ పథకం అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వం పరిశీలించలేదని తెలిపారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని చెప్పారు. ఇవాళ మాట్లాడుతున్న వారు ఆ రోజు ఎందుకు డబ్బు కట్టించుకున్నారని ఆయన ప్రశ్నించారు. వారికి ఇప్పటికీ డీకేటీ పట్టాలే ఉన్నాయన్నారు. గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఓటీఎస్ పథకం ద్వారా అన్ని రకాలుగా సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఓటీఎస్, పేదల ఇళ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకోవచ్చు ► ఓటీఎస్ ద్వారా లబ్ధిదారులు ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కు కూడా వస్తుంది. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టం. ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్ఛందం. ► ఓటీఎస్ కింద డిసెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయి. గృహ నిర్మాణాల్లో వేగం పెంచండి ► గృహ నిర్మాణాలపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. వర్షాలు కూడా ఆగిపోయాయిన నేపథ్యంలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది. పనుల్లో వేగం పెరగాలి. ► గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇస్తూ పర్యవేక్షించాలి. ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలి. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి. లేబర్ క్యాంపు, సిమెంటు గోదాముల వంటివి లే అవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్), గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ♦ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం ♦క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది ♦రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నాం ♦వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాం ♦వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి, వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలి ♦ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ♦గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదు ♦సుమారు 43వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారు ♦ఇవాళ మాట్లాడుతున్నవారు... అప్పుడు ఎందుకు కట్టించున్నారు? ♦గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు ♦ఇప్పుడు ఓటీఎస్ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నాం ♦అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుంది ♦పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాం ♦ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టం ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్ఛందం ♦డిసెంబర్ 21 నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది ♦గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం ♦భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయి గృహనిర్మాణంపైనా సీఎం సమీక్ష : ♦అందరికీ ఇళ్లు కింద రాష్ట్రంలో గృహనిర్మాణంపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు. గృహ నిర్మాణంపై సీఎం ఏమన్నారంటే...: ♦గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి: సీఎం ♦కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి: ♦వర్షాలు కూడా ఆగిపోయాయి : ♦ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది ♦గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ♦సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలి ♦ఇళ్లు క్వాలిటీతో కట్టుకునేలా చూడాలి ♦ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలి ♦నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి ♦లేబర్ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లేఅవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి : ♦దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఇళ్లపై యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మించిన ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పథకం కింద 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకున్నవారు నిర్దేశించిన మొత్తం, రుణం తీసుకోని వారు రూ.10 నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. గుంటూరు, కృష్ణా సహా ఐదు జిల్లాల్లో శనివారం లాంఛనంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. సోమవారం నాటికి 200 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మంగళవారం నుంచి 13 జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్టు గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.