Jathi Ratnalu Movie
-
వైల్డ్ ఫైర్‌లా 'జాతిరత్నాలు' చిట్టి అందాల జాతర (ఫొటోలు)
-
'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?
'జాతిరత్నాలు' అనగానే నవీన్ పొలిశెట్టి గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అని మరో మూవీ చేశాడు. దీంతో కూడా హిట్ కొట్టాడు. ఇదొచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి పెళ్లయిపోయిందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్)'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన నవీన్.. చాలారోజుల నుంచి అక్కడే ఉన్నాడు. మొన్నీమధ్య ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో చేతికి కట్టుతో కనిపించాడు. తన గాయం గురించి కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి, తనకేం పర్లేదని త్వరలో కోలుకుంటానని కూడా చెప్పాడు.అయితే అమెరికాలో నవీన్ ఓ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని, అందుకే చాలారోజుల నుంచి అక్కడే ఉండిపోయాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవీన్.. అలాంటిదే లేదని, తనకు పెళ్లి జరిగితే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పాడు. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..?
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్ గుండెల్ని తాకింది ఫరియా అబ్దుల్లా. మొదట్లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. జాతిరత్నాలు తర్వాత పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఫిరియా పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితో ఆమె వివాహం జరగనుందట. ఇప్పటికే ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్‌లలో నటించాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. నిజం ఎంటో తెలియాలంటే మన చిట్టి చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన ఫరియా.. తనకు కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలిపింది. కానీ వాళ్లు కేవలం బాయ్‌ఫ్రెండ్స్ మాత్రమేనని. రిలేషన్, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని ఆ సమయంలో చెప్పింది. తాజాగా ఆమె పెళ్లి వార్తలు బయటకు రావడంతో తను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినట్లు చెబుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్‌తో అల్లరి నరేశ్‌తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంలో నటించింది ఫరియా అబ్దుల్లా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్‌పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్‌బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్
నవ్వుల ఆటంబాంబు, కామెడీ ఖజానా, పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా జాతిరత్నాలు. ఈ ఫుల్ కామెడీ ప్యాక్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ. పిట్టగోడ సినిమాతో 2016లో దర్శకరచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ డైరెక్టర్. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈయన సినిమాలే కాదూ, ఇంటర్వ్యూలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. తన నోటి వెంట నుంచి వరుసగా పంచులు పేలుతూనే ఉంటాయి. గతేడాది ప్రిన్స్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఇతడు తాజాగా మ్యాడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం(అక్టోబర్ 5) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుదీప్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ నటించమని కోరితేనే తాను ఈ చిత్రంలో యాక్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంతలో యాంకర్ సుమ వచ్చి.. జాతిరత్నాలు సినిమాలో నటించారు. ఈ చిత్రంలోనూ యాక్ట్ చేశారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాం అంది. దీంతో అనుదీప్.. అదేం లేదండీ.. ఇదే నా చివరి సినిమా.. కేవలం కళ్యాణ్ కోసమే ఈ మూవీలో నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇకపై నటనకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా హీరో సంతోష్ శోభన్‌తో కలిసి ఓ టాక్‌లో షోలో పాల్గొంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కి నాగార్జున గెస్ట్‌గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. -
స్టార్ హీరోతో 'జాతి రత్నాలు' డైరెక్టర్ సినిమా..
Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil: శివ కార్తికేయన్ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ‘ఎస్కె 20’ వర్కింగ్ టైటిల్‌తో తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ ‘ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అని సురేష్ బాబు తెలిపారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సహనిర్మాతగా అరుణ్ విశ్వ వ్యవహరిస్తున్నారు. చదవండి: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ❤️❤️❤️👍#SK20FromAugust31 https://t.co/aa13VqnZct — Sivakarthikeyan (@Siva_Kartikeyan) May 30, 2022 -
జాతిరత్నాలు డైరెక్టర్‌తో స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్
Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep: జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్. డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ఎస్కే 20 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఇక ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రెమో చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇటీవలె ఈయన నటించిన డాక్టర్ సైతం విడుదలైంది. Very happy to join with @AsianSuniel sir @SBDaggubati sir & my frnd @iamarunviswa for #SK20 ,directed by my fav @anudeepfilm & music by @MusicThaman bro😊 A fun-filled entertainer on the way👍❤️#NarayanDasNarang @SVCLLP @SureshProdns #PuskurRamMohanRao @ShanthiTalkies pic.twitter.com/3g5sjGCePH — Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022 -
చిట్టి సాంగ్.. లక్ష్మీ పటాస్‌లా పేలిందిగా..
Chitti Song Hits 100 Million Views: చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 11లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులోని పాటలు కూడా బాగానే హిట్టయ్యాయి. ముఖ్యంగా 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే..' అనే పాట యువతకు బాగా కనెక్ట్ అయింది. మార్చి 29న రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. దీంతో చిట్టి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి మార్మోగుతోంది. -
డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసేది అందుకే: జాతిరత్నాలు భామ
చిట్టి.. నా బుల్బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలనుకుందట ఈ అమ్మడు. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్, డ్రెస్‌లు ట్రై చేస్తుంటానని చెప్పింది చిట్టి. ఆ నటికి నచ్చిన.. ఆమె మెచ్చిన బ్రాండ్స్ ఇవీ.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆమె డిజైన్స్ పాపులర్ అయి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఇక్కడ ఏది కొనాలన్నా వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాలి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్ .. అతి తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ప్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు. చదవండి: క్లాస్ అయినా.. మాస్ అయినా ఆయనే ‘బాస్’ -
హైదరాబాదీలు అత్యధికంగా వింటున్న పాట ఇదే!
హైదరాబాదీలు ముఖ్యంగా యువత అత్యధికంగా వింటున్న గాయకుల్లో సిద్ శ్రీరామ్ అగ్రగామిగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై తాజా అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్ వాసుల సంగీతాసక్తులపై తమ డేటా విశ్లేషణ ఫలితాలను సంస్థ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాదీలు అత్యధికంగా వినే గాత్రాల్లో తొలి స్థానం సిద్ శ్రీరామ్‌కు దక్కగా, ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అనిరుథ్ రవిచందర్, శ్రేయా ఘోషల్ తదితరులతో పాటు కె.ఎస్.చిత్ర, అనురాగ్ కులకర్ణి, ప్రీతమ్, దేవిశ్రీ ప్రసాద్, ఎఆర్‌రెహ్మాన్ తదితర టాలీవుడ్ సంగీత ప్రముఖులూ ఉన్నారు. దివంగత మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం కూడా ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్నారు. చిట్టి నీ నవ్వంటే...కి టాప్ ప్లేస్.. అదే విధంగా హైదరాబాదీలు అత్యధికంగా విన్న/వింటున్న పాటల్లో చిట్టి నీ నవ్వంటే (జాతిరత్నాలు)ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జలజల పాతం నువ్వు (ఉప్పెన), ఒకేఒక లోకం నువ్వే(శశి), లాహె లాహె(ఆచార్య) తరగతి గది (కలర్ ఫొటో), హే ఇది నేనేనా (సోలో బతుకే సో బెటర్), మగువా మగువా (వకీల్ సాబ్), హోయ్‌నా హోయ్‌నా (నానిస్ గ్యాంగ్ లీడర్), కాటుక కనులె (ఆకాశం నీ హద్దురా), భలేగుంది బాలా (శ్రీకారం) పాటలున్నాయి. -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’
పెద్ద హీరోలు కాదు, అగ్ర దర్శకుడు లేడు అయినా ఆ సినిమాకు ప్రేక్షకులు జైకొట్టారు. థియేటర్లలో పడిపడి నవ్వి.. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించారు. ఇప్పటికే అది ‘జాతిరత్నాలు’సినిమా అని అర్థమైపోయిందనుకుంట. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జాతిరత్నాలు’నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల మనసును దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది. ‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఫరియాకు చాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇంతవరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి రెండు భారీ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్లను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. అందుకు కారణం ఆమె ఎత్తు అనే తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరి ఫరియానే. ప్రభాస్, రానా, గోపిచంద్, వరుణ్‌తేజ్ మినహా మరే హీరోలు ఆమె హైట్‌కు సెట్ కాలేరు. తాజాగా ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. తనకంటే తక్కువ హైట్ ఉన్నహీరోలతో నటించేందుకు ఫరియా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఫరియా బాలీవుడ్ చాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ! మహేశ్ బాబు వీడియోని వాడేసిన తెలంగాణ పోలీసులు.. వైరల్ -
జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్
ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ ఏది? అనగానే జనాలు జాతిరత్నాలు అని టక్కున చెప్పేస్తుంటారు. థియేటర్‌కు వెళ్లి చూసిన ప్రేక్షకులు సినిమాలో భలే కామెడీ ఉందే అని నవ్వుకుంటుంటే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అబ్బే.. కంటెంట్ తక్కువ... కామెడీ మాత్రమే ఎక్కువ అని పెదవి విరిచారు. కానీ సెలబ్రిటీలు ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్ జాతిరత్నాలు గురించి ట్వీట్ చేశాడు. JATHI RATHNALU My goodness, what a laugh riot.I kept laughing in every scene.Amazing dialogues, outstanding direction and incredible performances by each n every one.More power to you guys. This is one genre that's probably the toughest and you guys aced it.Outstanding ❤️❤️❤️ — DK (@DineshKarthik) April 16, 2021 'జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ.. ప్రతి సన్నివేశానికి పడీపడీ నవ్వుతూనే ఉన్నాను. డైలాగులు, డైరెక్షన్, నటన.. ఇలా ప్రతీది అద్భుతం, అమోఘం. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మీరు దాన్ని సుసాధ్యం చేశారు..' అంటూ చిత్రయూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇది చూసిన నెటిజన్లు 'ఏంటి? నీకు తెలుగొచ్చా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమాను ఆదరించడం బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా! ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? -
జాతిరత్నాలకు షాక్.. వారికి అస్సలు నచ్చడం లేదట!
చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దుమ్ము లేపిన ఈ సినిమా.. ఓటీటీలోలో మాత్రం బోల్తా కొట్టింది. మాకు నచ్చలేదు: నెటిజన్లు ఓటీటీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘జాతిరత్నాలు’ చిత్రం ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు తెగ నవ్వుకున్నారు. కానీ అదే జనానికి ఓటీటికు వచ్చేసరికి నచ్చటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో 'కంటేంటే లేదు, ఓవర్ రేటెడ్ కామెడీ తప్పా' అని పెదవి విరుస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు. అసలు ఈ స్థాయి హిట్ మూవీకి ఓటిటిలోనూ బ్రహ్మరథం దక్కుతుందని అనుకున్నారు అంతా. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యి సినిమాలో విషయమే లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని బట్టి ఓ విషయం స్పష్టమైంది. థియేటర్ కు ఓటిటి కు ప్రేక్షకుల టేస్ట్ల్లో చాలా తేడాలుంటాయి. జనం మధ్య చూసిన సినిమాకు ..ఒంటరిగా లేదా ఇద్దరో ముగ్గురో కూర్చుని సెల్ ఫోన్, ట్యాబ్‌లలో చూసే సినిమాకు.. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌లో చాలా తేడా ఉంటుందని ‘జాతిరత్నాలు’ విషయంలో తెలిసొచ్చింది. అయితే, నటన పరంగా నవీన్ పొలిశెట్టి మరో విజయ్ దేవరకొండ కానున్నాడని ఓటీటీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం జాతి రత్నాలకు ఓ సానుకూల అంశం. ( చదవండి: ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని నా భార్య వార్నింగ్ ఇచ్చింది : నాగబాబు ) #JathiRatnalu is overrated movie. Audience blindly following the majority opinion without having any own taste. #colorphoto #Jathirathnalu #uppena are examples of overrated ones. #naveenpolishetty is just brilliant to watch. He can be the next #vijaydevarakonda pic.twitter.com/N62eq6jAKj — srini - శ్రీని (@srinidurvasula) April 12, 2021 -
‘జాతిరత్నాలు’పై మంత్రి కేటీఆర్ రివ్యూ
చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. థియేటర్‌కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వచ్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాపై సీనీ ప్రముఖులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కేటీఆర్ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు. ఆదివారం ‘జాతిరత్నాలు’ వీక్షించిన మంత్రి.. సినిమా చాలా నచ్చిందని, కామెడీ హిలేరియస్‌గా ఉందని ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు. థాంక్యూ సార్…మీకు నచ్చడం చాలా హ్యాపీగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, ఈ సూపర్ హిట్ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఏప్రిల్ 11నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Thank you so much sir @KTRTRS 🙏 so happy you loved it #JathiRatnalu https://t.co/czkkj99Ynd — Naveen Polishetty (@NaveenPolishety) April 11, 2021 -
‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?
‘జాతిరత్నలు’ సినిమాతో హీరో నవీన్ పొలిశెట్టి జాతకమే మారిపోయింది. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే ఆకట్టుకున్న ఈ ‘జాతిరత్నం’, రెండో సినిమాతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకా, నవీన్‌కు ఎనలేని క్రేజీని తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ అంతా తన వైపు తిరిగేలా చేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారట. నవీన్ యాక్టింగ్‌లో కొత్తదనం చూసి ముచ్చటపడిన ఓ బడా నిర్మాత.. అతనికి భారీ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. నవీన్ మూడో చిత్రం తమ బ్యానర్లో తీస్తే.. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే నవీన్ పొలిశెట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. నచ్చిన కథ దొరికితేనే సినిమా చేద్దామని వేచిచూస్తున్నాడట. త్వరలో తన మూడో సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా! ‘బిగ్‌బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్ -
జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా!
ఈ మధ్యకాలంలో యూత్‌ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుంది. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. దీంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు మనసారా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. మొత్తానికి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా భారీ హిట్ కొట్టి నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎంత? నిర్మాతలకు ఏమేరకు లాభాలు వచ్చాయో చదివేయండి.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఫలితంగా నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్‌లో రూ.4.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.1.92 కోట్లు, వెస్ట్‌లో రూ.1.58 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, గుంటూరులో రూ.2.08 కోట్లు, నెల్లూరులో 92 లక్షలు వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 32.59 కోట్లు షేర్, రూ.52 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. కానీ జాతిరత్నాలు ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది. దీంతో జాతిరత్నాలు రూ.27 కోట్లకు పైగా లాభాల మార్కును చేరుకున్న చిన్నచిత్రంగా ఘనత సాధించింది. ఇదిలా వుంటే ఈ సినిమా నేటి(ఆదివారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. #JathiRatnaluOnPrime, watch now: https://t.co/yJRGqrNZLh@NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema pic.twitter.com/rP2SnWTsQj — BARaju (@baraju_SuperHit) April 11, 2021 చదవండి: 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
అమెజాన్‌లో జాతిరత్నాలు: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత!
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. కథ కన్నా కామెడీ మీద దృష్టిపెట్టిన డైరెక్టర్ అనుదీప్ ప్రజలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్ సాధించాడు. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి విజయం సాధించింది. ప్రధాన తారాగణం నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం తహతహలాడిపోతున్నారు. తాజాగా వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో శుభవార్త చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఈ సినిమా హిందీ, కన్నడ డబ్బింగ్ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. we got you @NaveenPolishety‘s movie, now we can hear this image and you giggle!#JathiRatnaluOnPrime premiers April 11.@priyadarshi_i @eyrahul @anudeepfilm pic.twitter.com/xSNRUPjVKR — amazon prime video IN (@PrimeVideoIN) April 7, 2021 చదవండి: 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్ -
జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు!
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్ అనుదీప్‌కు స్వప్నా సినిమా బ్యానర్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్‌లు కాస్ట్లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్లోని ఓ బొమ్మకారును అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్‌ని చేస్తున్నారు అంటూ అనుదీప్ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్ తన పంచులు, కౌంటర్లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku) చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు!
ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగర్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట! Eeeeyyy... Congratulations 🥳#JathiRatnalu @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @VyjayanthiFilms @LahariMusic pic.twitter.com/4PWLEJefti — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 1, 2021 చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా ఏప్రిల్: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ.. -
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 8 హిట్ సినిమాలు ఇవే
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్‌కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయో చూద్దాం. కిర్రాక్ అనిపించిన ‘క్రాక్’ థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన తొలి బిగ్ మూవీ ‘క్రాక్’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజాలోని ఫైర్ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. పర్వాలేదనిపించిన ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నం ఫలించింది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది. రికార్డులు షేక్ చేసిన జాంబి రెడ్డి కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. అల్లరి నరేశ్ నట విశ్వరూపానికి ‘నాంది’ 8 ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘జాతి రత్నాలు’ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. -
జాతిరత్నాలు ఆ రికార్డును కూడా బ్రేక్ చేసిందా?
చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ భారీ కలెక్షన్లతో పాటు రికార్డులను కూడా క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అందులో కొన్ని పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కానీ రేర్ ఫీట్లను కూడా సునాయాసంగా సాధిస్తోంది. కోవిడ్ అనంతరం ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా మరో రికార్డును సృష్టించింది. చిన్న సినిమా పెద్ద రికార్డులు ‘క్రాక్, ఉప్పెన’ లాంటి సినిమాలు హిట్ టాక్‌తో టాలీవుడ్లో భారీ కలెక్షన్లను రాబట్టాయి, కానీ ఓవర్సీస్లో మాత్రం ఎందుకో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ‘జాతిరత్నాలు’ చిత్రం మాత్రం ఆ పరిస్థితిని మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే వసూళ్లను రాబడుతోందో ఓవర్సీస్లోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. గురువారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నట్లు నవీన్ పొలిశెట్టి తన ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. మొత్తం 1,001,825 డాలర్ల కలెక్షన్లతో చిన్న సినిమాల జాబితాలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూఎస్‌లో ‘జాతిరత్నాలు’ తన వసూళ్ల వేటను ఇంకా కొనసాగిస్తోంది. గతంలో టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పాటు యూఎస్ మార్కెట్ మీద కూడ అంతే శ్రద్ద ఉండేది. అక్కడ చిన్న సినిమా మిలియన్ డాలర్ వసూలు చేసింది అంటే హిట్ అనే ప్రామాణికం ఉండేది. కానీ లాక్డౌన్ మూలంగా ఓవర్సీస్ లో కలెక్షన్లు అనే మాట వినడమే కరువైంది, అక్కడి మన సినిమాల మార్కెట్ క్రాష్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు పూర్తిగా తెరుచుకుని వరుసగా సినిమాలు విడదలై వసూళ్లను రాబడుతున్న యూఎస్‌లో మాత్రం తెలుగు సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఆ పరిస్థితిని ఇప్పుడు జాతిరత్నాలు మార్చేసిందని చెప్పాలి. ( చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! )