Jayamma Panchayathi Movie
-
ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
థియేటర్లలో సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతుండగా, సెకండ్ వీక్‌లో రిలీజైన నాని 'అంటే.. సుందరానికీ', '777 చార్లీ' సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జూన్ మూడో వారంలో ఇటు థియేటర్, అటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. 1. విరాట పర్వం దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేకామార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17 ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. 1990 దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. 2. గాడ్సే విభిన్నకథలతో, మంచి పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం గాడ్సే. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి. కల్యాణ్ నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 3. కిరోసిన్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కిరోసిన్. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దిప్తీ కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వీటితోపాటు హీరో, మొనగాడు తదితర చిత్రాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు 1. జయమ్మ పంచాయితీ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో అలరించిన సినిమా జయమ్మ పంచాయితీ. మే 6న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2. O2 లేడీ సూపర్‌స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 (ఆక్సిజన్). జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 3. రెక్కీ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ రెక్కీ. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో జూన్ 17 నుంచి ప్రదర్శించబడనుంది. 1990లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్యకు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్ రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అవతార పురుషా-1 (కన్నడ), జూన్ 14 సుడల్ (వెబ్ సిరీస్), జూన్ 17 నెట్‌ఫ్లిక్స్ గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్ సిరీస్), జూన్ 15 ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్), జూన్ 15 షి (హిందీ వెబ్ సిరీస్ 2), జూన్ 17 ఆపరేషన్ రోమియో (హిందీ), జూన్ 18 జీ5 ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్), జూన్ 14 ఫింగర్ టిప్ (హిందీ, తమిళ వెబ్ సిరీస్ సీజన్ 2), జూన్ 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మసూమ్ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 17 సోనీలివ్ సాల్ట్ సిటీ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 16 -
ఓటీటీలో జయమ్మ పంచాయితీ, ఎప్పటినుంచంటే?
యాంకర్ సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన మూవీ జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించారు. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అదించారు. మే6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ సహజ నటనతో అదరగొట్టేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జూన్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే జయమ్మ పంచాయితీ ఏంటో ఓ లుక్కేయండి. చదవండి: భర్తకు నయన్ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్, మరి విఘ్నేశ్ ఏమిచ్చాడో తెలుసా? సుకృతి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ -
తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు రావడం హ్యాపీ
ఇటీవల విడుదలైన జయమ్మ పంచాయితీ చిత్రం తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని చిత్ర కథానాయకుడు కదంబాల దినేష్‌కుమార్ అన్నారు. పాలకొండ పట్టణంలోని ఆంజనేయనగర్ కాలనీకి చెందిన ఆయన సినిమా విడుదల అనంతరం గురువారం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను పట్టణంలోనే ఓ జిమ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీరంగంపై ఉన్న మక్కువతో ముమ్మర ప్రయత్నం చేశానని, ఈ నేపథ్యంలో జయమ్మ పంచాయితీలో అవకాశం లభించినట్లు తెలిపారు. మండలంలోని కోటిపల్లికి చెందిన కలివరపు విజయ్‌కుమార్ దర్శకత్వంలో ఇదీ ప్రాంతంలో చిత్రాన్ని తెరకెక్కించిన వైనాన్ని వివరించారు. స్థానికంగా పలువురు ఇందులో నటించడంతో చిత్రానికి మరింత బలం చేకూరిందని, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన నటనకు అభినందనలు తెలియజేయడం మర్చిపోలేని విషయమన్నారు. ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ సుమ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రానికి ప్రజల్లో, సినీ వర్గాల్లో మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందన్నారు. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైందని సంతృప్తి వెలిబుచ్చారు. ఇటీవల సాక్షి లైవ్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లభించిందని తెలిపారు. చదవండి: క్రాక్ సినిమా కథ నాదే: రచయిత ఫిర్యాదు కరాటే కల్యాణిపై శ్రీకాంత్ సంచలన ఆరోపణలు -
యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
యాంకర్ సుమకు తృటితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు కాదు.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. షూటింగ్ నిమిత్తం ఆమె ఓ అడవిలో ఉన్న చిన్న నీటి ప్రవాహం వద్ద నిలబడింది. అక్కడ ఉన్న రాళ్లు పీచు పట్టి ఉండడంతో కాలు జారి కిందపడింది. తనను తాను కంట్రోల్ చేసుకొని వెంటనే లేచి బయటకు వచ్చేసింది. (చదవండి: సరికొత్త కాన్సెఫ్ట్‌తో నయనతార కొత్త చిత్రం?) దీనికి సంబంధించిన వీడియోని తాజాగా సుమ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రొడక్షన్స్ టీమ్స్‌కి.. టోటల్‌గా ఎంటర్టైన్మెంట్కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమా విషయాకొస్తే.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మే 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
సుమ యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టనుందా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది. -
నాకు నేను కనిపించలేదు!
‘‘జయమ్మ పంచాయితీ’కు కేటాయించిన సమయాన్ని టీవీ షోలు, ప్రీ రిలీజ్‌లకు హోస్ట్‌గా చేయడం వంటి వాటికి వినియోగించినట్లయితే మరిన్ని డబ్బులు వచ్చి ఉండేవేమో. కానీ నన్ను నేను ప్రపంచానికి ఎక్స్ప్లోర్ చేసుకోవాలను కున్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేసినందుకు నాకు నేను శెభాష్ చెప్పుకుంటున్నా’’ అని ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల అన్నారు. విజయ్ కుమార్ దర్శకుడిగా సుమ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సుమ చెప్పిన విశేషాలు.... ‘జయమ్మ పంచాయితీ’ బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ నిడికి తక్కువ ఉంటుందేమోనని ఊహించి, చదవడం మొదలుపెట్టాను. కానీ కథ మొత్తం ఆ పాత్రతోనే నడుస్తోందని స్క్రిప్ట్ చదువుతున్న కొద్దీ అర్థం అయ్యింది. అయితే టెలివిజన్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఫ్యామిలీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా చేయాలా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ చాలెంజ్‌గా తీసుకుని చేశాను. అవి నచ్చి ఈ సినిమా చేశా! కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజయ్‌గారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. మన ఊర్లో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం ఈడ్లు (చదివింపులు) వేస్తాం. జయమ్మకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే జయమ్మ ఎవరికైతే ఈడ్లు వేసిందో వారందరూ తిరిగి వేయాలి. కానీ జయమ్మ ఈడ్లు తీసుకున్నవారికీ కొన్ని సమస్యలు ఉంటాయి. మరి.. జయమ్మ సమస్య ఎలా తీరింది? అన్నదే ఈ చిత్రకథ. ఎవరూ నిరుత్సాహపడరు సుమ బాగా యాక్ట్ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యాక అందరూ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజయ్ రాసిన స్టోరీ ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేçస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ జయమ్మ పంచాయితీ హిట్ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం రెండు కథలు ఉన్నాయి. రోషన్ లాంచ్ ఈ ఏడాదే.. నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్న సమయంలో చాలా బిజీగా ఉండి వరుసగా మూడు రోజులు నేను తనకు కనిపించలేదు. ఆ సమయంలో ‘నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..’ అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. నా కొడుకు రోషన్‌కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్ చేస్తాం. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో శ్రీకాకుళంలోని పాలకొండ, చెన్నైపేట, అక్కడి అటవీ ప్రాంతం.. ఈ లొకేషన్స్‌ను ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా.. ఈ లొకేషన్స్‌లోకి యూనిట్ వెళ్లడం, సామాగ్రిని తీసుకుని వెళ్లడం కష్టమని భావించి ఎవరూ ప్రయత్నించలేదేమో కానీ ఈ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. మా ‘జయమ్మ పంచాయితీ’ సినిమా సెకండాఫ్‌లోని కొన్ని సీన్ల కోసం ట్రెక్కింగ్ చేసి మరీ ఆ లొకేషన్స్‌కు వెళ్లాం. అక్కడ కొన్ని జలపాతాలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎంత అందం ఉందో! -
‘జయమ్మ పంచాయితీ’ట్రైలర్ రివ్యూ
‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ అంటుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్‌ని కట్ చేశారు మేకర్స్. ట్రైలర్లో ఏముందంటే.. పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. (చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ) కామెడీ డ్రామాతో పాటు ఎమోషనల్‌గా ‘జయమ్మ పంచాయితీ’ మూవీ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ తన సహజ నటనతో ఆదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘గుండాలు తొక్కిన గండం గట్టేకినట్టే ఉంది’.‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదించారు. -
సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది సుమ. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (చదవండి: హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్) తన చేతిపై ఉన్న పంచబొట్టు సీక్రెట్‌ని కూడా రిలీల్ చేశారు. చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నారు సుమ. ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్ ఏంటని అడిగితే.. సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. సెకండాఫ్‌లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికి తెలుస్తుందని సుమ చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. మంచి కథలు దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. 'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రేమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5 ద వైల్డ్(వెబ్‌సిరీస్2)- మే6 నెట్‌ప్లిక్స్ రాధేశ్యామ్(హిందీ)-మే4 థార్(మిందీ)-మే6 40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్‌సిరీస్)-మే6 డిస్నీ+హాట్‌స్టార్ హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6 స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6 జీ5 ఝండ్(హిందీ)-మే6 -
‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పక్కింట్లో టీవీ చూసే బుడ్డి సుమ సినిమాల్లోకి రావడం అదృష్టం
‘‘సుమ పంచాయితీ పెడుతుందని కాదు.. పిలిచిందని ప్రేమతో వచ్చాను (నవ్వుతూ). సుమ ప్రతిభను దర్శకులు, టెక్నిషియన్స్ పది శాతం వినియోగించుకున్నా చాలు ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సుమకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు హీరో నాగార్జున. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున, నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు రాజీవ్ కనకాల (సుమ భర్త) బిగ్ టికెట్ అందుకున్నారు. నాని మాట్లాడుతూ.. ‘‘సుమగారికి నేను పెద్ద అభిమానిని. ఇండస్ట్రీలో పెద్దలు, ప్రభుత్వాలు, అసోసియేషన్స్ సినిమాకు ఏం చేశాయో నాకు తెలియదు కానీ సుమగారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారు. ప్రతి సినిమాకు సుమగారు పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ చూశాను. సుమగారు బాగా చేశారు’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి సుమగారికి ఆడియన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందమైన ఆడవాళ్లను చూశాను. తెలివితేటలున్న ఆడవాళ్లను చూశాను. మంచి మనసున్న ఆడవారిని చూశాను. ఈ మూడూ సుమలో ఉన్నాయి’’ అన్నారు. సుమ మాట్లాడుతూ – ‘‘టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లిన ఓ బుడ్డి సుమ.. టీవీకి వచ్చి, సినిమాకు కూడా రావడం అనేది నిజంగా అదృష్టం. ఆడియన్స్ ప్రోత్సాహంతోనే నాకు ఎనర్జీ వస్తుంది. అందరి హీరోల ఫ్యాన్స్ మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ మహిళ ఉందంటారు. కానీ విజయం సాధించిన ప్రతి మహిళ వెనక ఓ కుటుంబం ఉంటుంది. మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఫ్యామిలీ’’ అన్నారు. ‘‘సుమగారు మంచి ప్రతిభావంతురాలు. ఓ రెండు షాట్స్‌లో తప్పులు కనిపెట్టి, వాటిని మ్యూజిక్‌తో ఎలివేట్ చేద్దామన్న కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విజయ్ కుమార్. ‘‘నేను సిక్కోలు బిడ్డను. సుమగారు లేకపోతే ‘జయమ్మ పంచాయితీ’ లేదు. కీరవాణిగారు మా సినిమాకు సంగీతం అందిస్తా అన్నప్పుడే మా సినిమా విజయం సాధించినట్లు భావించాను. సక్సెస్ మీట్లో మరింత మాట్లాడతాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశ్. ఓ సినిమా సాంగ్ షూట్లో ఉన్నందువల్ల దర్శకులు రాఘవేంద్రరావు, వెకేషన్లో ఉన్నందువల్ల రాజమౌళి ఈ వేడుకకు రాలేకపోతున్నట్లుగా వీడియో సందేశాలు పంపారు. చిత్రయూనిట్‌కి దర్శకులిద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, గాయకుడు రేవంత్, డీవోపీ అనుష్కుమార్, ఆర్ట్ డైరెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు ! -
ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
Upcoming Telugu Movies On May 6 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఇక సినీ ప్రియులు, సినిమా నిర్మాతల దృష్టి వచ్చే శుక్రవారం పడింది. అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముచ్చటగా మూడు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దామా ! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. యాంకర్‌గా బాగా రాణిస్తున్న సుమ కనకాల నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో వస్తున్న ఈ 'జయమ్మ పంచాయతీ' ఎంటో మే 6న తెలియనుంది. ఇక శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్గా వస్తున్న చిత్రం 'భళా తందనాన'. వారాహి బ్యానర్‌పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ 1 ఫేమ్ గరుడ రామ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా తన సత్తా చాటేందుకు మే 6 తేదినే ఎంచుకుంది. ఈ మూడు చిత్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి. చదవండి: తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్.. అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
8 ఏళ్ల కృషి ఫలించి సుమతో నటించే ఛాన్స్ దక్కింది
‘‘గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ పూజారి అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.. మా ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మ (సుమ)కు ఓ సమస్య ఉంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ ఉంటుంది.. అది ఏంటనేది సినిమాలో చూడాల్సిందే’’ అని హీరో దినేష్ కుమార్ అన్నారు. యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్, షాలినీ జంటగా నటించారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. విజయ్ కుమార్‌ది మా ఊరే అయినప్పటికీ ఆడిషన్స్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఎనిమిదేళ్లుగా నేను చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడం, అది కూడా ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చింది’’ అన్నారు. చదవండి: నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే నిజజీవితానికి భిన్నంగా.. హీరోయిన్ షాలినీ మాట్లాడుతూ– ‘‘మా అమ్మది మొగల్తూరు, నాన్నది హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో పెరిగాను. సినిమాలపై ఆసక్తి ఎక్కువ. తమిళంలో షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. ‘జయమ్మ పంచాయితీ’ సినిమాకు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. నా పాత్రకూ, జయమ్మ పాత్రకు మధ్య పెద్దగా సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాలో నా నిజ జీవితానికి భిన్నమైన పాత్ర పోషించాను. అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో! చెప్పలేం అంటున్న హీరోయిన్ -
‘జయమ్మ పంచాయతీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్‌గా ఈ స్టార్ హీరోలు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi. Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani 📍Daspalla convention ⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk — Vennela Creations (@vennelacreation) April 29, 2022 -
యాంకర్ సుమపై ఆ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు. చదవండి: రాజీవ్‌తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం మంగళవారం హనుమకొండలో పర్యటించింది. ముందుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో జయమ్మ పంచాయితీ విజయం ఖాయమైందన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యోంలో ఈ మూవీని రూపొందించామని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మా సినిమా బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషించానని, చదివింపుల చుట్టూ ఈ కథ ఉంటుందని చెప్పారు. మనిషికి మనిషి ఎలా సహాయంగా నిలబడాలో ఈ చిత్రం తెలుపుతుందన్నారు. కాగా ఈ సమావేశంలో సుమతో పాటు మిగతా నటీనటులు శాలిని, భవన్, దినేశ్ కుమార్, త్రినాథ్‌లు పాల్గొన్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. -
హృదయాలను హత్తుకునేలా సుమ ‘గొలుసు కట్టు గోసలు’ పాట
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. (చదవండి: సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్‌బాస్ గంగవ్వ..) ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గొలుసు కట్టు గోసలు’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘కలిసి బతికే కాలమేమాయే నేడే..పగటి వేళ పీడ కలలాయే, అలసి పోని ఆశలేమాయే అయ్యో... గొలుసు కట్టు గోసలైపోయే’ అంటూ చాలా ఎమోషనల్‌గా సాగే పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సినిమాలో సుమ దయనీయ పరిస్థితిని ఈ పాట వివరిస్తుంది. ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించమే కాకుండా.. హరిహరన్‌తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చాన్స్ లేదు.. వచ్చినా బోల్తా పడ్డాయి.. చిన్న సినిమాలకు విచిత్ర పరిస్థితి!
గత రెండేళ్లు కరోనా కారణంగా థియేటర్స్ సరిగ్గా తెరుచుకోలేదు.దాంతో చిన్న సినిమాలకు విడుదలకు పెద్దగా దారి దొరకలేదు. థర్డ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల క్రితం పరిస్థితులు మల్లీ కనిపించాయి. అందుకు తగ్గట్లే పెండింగ్ లో ఉన్న బిగ్ మూవీస్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా థియేటర్లకు వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేశాయి. త్వరలో ఆచార్య , సర్కారు వారి పాట, ఎఫ్ 3 రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే పూర్తిగా తెరుచుకున్న థియేటర్స్,కేవలం బిగ్ మూవీస్, పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపతున్నాయే తప్ప..చిన్న సినిమాలకు మాత్రం దారి దొరకడం లేదు.మొన్నటి వరకు టాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో తెలుగులో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకలేదు.దాంతో కేజీయఫ్ 2 రిలీజైన తర్వాతి వారం థియేటర్స్ రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాయ్ చాలా చిన్న చిత్రాలు. వీటిల్లో జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణవృందా విహారి సినిమాలు ఉన్నాయి. (చదవండి: నేషనల్ క్రష్‌కి క్రేజీ ప్రాజెక్ట్.. మరో పాన్ ఇండియా చిత్రంలో రష్మిక!) కాని కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర భీకరంగా కంటిన్యూ అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 750 కోట్లు దాటిపోయింది.టాలీవుడ్ లోనూ ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంది.అందుకే చిన్న చిత్రాలు రాకీభాయ్ కు ఎదురెల్లే సాహసం చేయలేక వాయిదా వేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బిగ్ హీరోస్ మాత్రమే బాక్సాఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నారు. ఒక్క డీజే టిల్లు మాత్రమే స్మాల్ మూవీతో బిగ్ కలెక్షన్స్ రాబట్టాడు. సూపర్ మచ్చి, హీరో, గుడ్ లఖ్ సఖి, సెబాస్ఠియన్, ఆడవాళ్లకు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలు మినిమం వసూళ్లు లేక డీలా పడ్డాయి. పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదలై, ప్రేక్షకులను మెప్పించలేక డీలా పడ్డాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Jayamma Panchayathi : బూతులు తిట్టిన యాంకర్ సుమ!
బుల్లితెర యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలీవరీ ఆకట్టుకుంటుంది. అయితే తొలినుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన సుమ ట్రైలర్ చివర్లో మాత్రం బూతు డైలాగ్ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
సుమ ‘జయమ్మ పంచాయతీ’ రిలీజ్‌కు రెడీ
Suma Jayamma Panchayathi Movie Release Date: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ, దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ నటించారు. రామ్‌చరణ్ రిలీజ్ చేసిన మా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించిన టైటిల్ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: అనూష్ కుమార్, సమర్పణ: విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అమర్–అఖిల. -
జయమ్మ పంచాయితీ: ఓ రేంజ్లో పారితోషికం తీసుకుంటున్న సుమ!
యాంకర్ సుమ. ఈమె హోస్టింగ్‌కు సాధారణ జనాలే కాదు సెలబ్రిటీలు సైతం జై కొడుతుంటారు. వరుస షోలు చేస్తూ బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఈసారి సహాయక పాత్రల్లో కాకుండా ఏకంగా లీడ్ రోల్లో నటించింది సుమ. దీనికి 'జయమ్మ పంచాయితీ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు. ఈ సినిమాకుగానూ సుమ ఓ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుందట! ఒకరోజు హోస్టింగ్‌కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా తీసుకునే సుమ ఇప్పుడీ సినిమా కోసం ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందని టాక్. తనకున్న క్రేజ్‌ను బట్టి అంత మొత్తం ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదట నిర్మాతలు. ఇప్పటికే సుమకున్న పాపులారిటీతో సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడింది. గతంలో రిలీజైన టీజర్ కూడా వినోదాత్మకంగా ఉండటంతో మూవీ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి చాలాకాలానికి వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సుమ 'జయమ్మ పంచాయితీ'తో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి! -
సంక్రాంతి స్పెషల్: పోస్టర్లు, పాటలతో సందడే సందడి
సంక్రాంతి పండగ సందర్భంగా పండగే పండగ అంటే కనువిందైన పోస్టర్లు, వీనుల విందైన పాటలు, టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి... సినిమా ప్రియులకు పండగ తెచ్చాయి. కుటుంబసమేతంగా రామారావు వచ్చాడు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 25న థియేటర్లకి వస్తామని పేర్కొంటూ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ ఫ్యామిలీతో వస్తే... హాట్ హాట్‌గా దూసుకొచ్చారు తమన్నా. వరుణ్ తేజ్‌తో కలసి ‘గని’ చిత్రంలో ఈ బ్యూటీ స్టెప్పులేసిన ప్రత్యేక పాట ‘కొడితే..’ విడుదలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది. ఇక పందెం కోళ్లలా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు ‘భీమ్లా నాయక్’ నుంచి పవన్ కల్యాణ్, రానా మాస్ లుక్ పోస్టర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్తా మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు రోట్లో ఏదో నూరుతూ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసింది జయమ్మ. సుమ కనకాల టైటిల్ రోల్లో నటిస్తున్న ‘జయమ్మ పంచాయతీ’ టైటిల్ సాంగ్‌ని పండగ సందర్భంగా వినిపించారు. ఈ పాటను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ పాడారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకోవైపు యువహీరో నవీన్ పోలిశెట్టి నటించనున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ఖరారైంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మరో చిత్రం ‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ద్వారా గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయం అవుతున్నారు. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో పూర్తి కానున్న ఈ చిత్రం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంకా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘సమ్మతమే’ పోస్టర్ విడుదలైంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘మన్మథలీల’ పోస్టర్ విడుదలైంది. అశోక్ సెల్వన్, సంయుక్తా హెగ్డే, స్మృతీ వెంకట్, రియా సుమన్ హీరో హీరోయిన్లుగా టి.మురుగానందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండగ సందర్భంగా ఇంకా పలు చిత్రాల లుక్స్, పాటలు తదితర అప్డేట్స్ వచ్చాయి. -
సుమ 'జయమ్మ' లిరికల్ వీడియో సాంగ్.. వచ్చేసిందిగా
Suma Kanakala Jayamma Song Lyrical Video Released By SS Rajamouli: బుల్లితెర యాంకర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతి గడించింది సుమ కనకాల. స్మాల్ స్క్రీన్‌పై వ్యాఖ్యతగా రాణిస్తూనే తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాకు విజయ్ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి సాంగ్ అయిన తిప్పగలనా.. చూపులు నీ నుంచే పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. రామాంజనేయులు రాసిన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్‌ను విడుదల చేశారు. 'జయమ్మ పంచాయితీ' చిత్రంలోని జయమ్మ లిరికల్ సాంగ్ వీడియోను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' అంటూ సాగే ఈ సాంగ్‌లో జయమ్మ పాత్ర జీవనశైలి, స్వభావం ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ ఆలపించారు. అక్కడక్కడా పాట మధ్యలో సుమ కనకాల కూడా తన గాత్రం అందించింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలాగ్ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులముందుకు వచ్చి సందడి చేయనుంది 'జయమ్మ పంచాయితీ'. జయమ్మ, చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ! Happy to Launch #JayammaJayamma song from #JayammaPanchayathi ▶️https://t.co/esGUewjy0R Best wishes to @ItsSumaKanakala & Team @mmkeeravaani @srikrisin @ramjowrites @VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic — rajamouli ss (@ssrajamouli) January 16, 2022 ఇదీ చదవండి: సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ -
Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..
కొరాపుట్ (ఒడిశా): మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన యువకుడు టాలీవుడ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బైరాగి పంచాయతీ రిటైర్డ్ పీఈఓ కె.హరీష్చంద్ర చౌదరీ, గాయత్రీ కుమారుడు దినేష్ తెరగేట్రం చేస్తున్నాడు. ‘జయమ్మ పంచాయతీ’ అనే తెలుగు చిత్రంలో హీరోగా నటించాడు. వర్ధమాన నటి శాలినీ హీరోయిన్గా, స్టార్‌యాంకర్ సుమా కనకల తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ విజయ్ కలివారపు దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బలగ ప్రకాష్‌రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఎంఎం కీరవాణీ సంగీతం అందించిన ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. దినేష్ స్వగ్రామం జిల్లాలోని మారుమూల అటవీప్రాంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండలో ఉన్న తాత గారింట్లో పుట్టి, పెరిగాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తితో బీటెక్ పూర్తి చేసి, అవకాశాల కోసం 2013లో హైదరాబాద్ వెళ్లాడు. సుమారు 8 ఏళ్లు అనేక అడిషన్లలో పాల్గొన్నప్పటికీ అవకాశాలు లభించలేదు. చివరికి నూతన దర్శకుడు విజయ్‌కుమార్ కొత్త నటీ, నటులతో జయమ్మ పంచాయతీ సినిమా తీయాలనే అన్వేషిస్తుండగా దినేష్‌కు అవకాశం దక్కింది. అంతకుముందు దినేష్ 2సీరియళ్లలో నటించాడు. ప్రస్తుతం హీరోగా అవకాశం రావడంతో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న బైరగి గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. చదవండి: (మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్) అగ్రతారల సహకారం.. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన జయమ్మ పంచాయతీ సినిమా దాదాపుగా చిత్రకరణ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ పాపులర్ యాంకర్ సుమ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 2021 దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. అలాగే నేచురల్ స్టార్ నానీ సినిమాలోని మొదటి పాట ‘తిప్పగలనా?’ లిరికల్ వీడియోను హీరో దినేష్, చిత్ర యూనిట్ సమక్షంలో ఇటీవల విడుదల చేశారు. ఇందులో గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆకట్టుకుంటోంది. అనుష్‌మార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. దీంతో హిట్ ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దినేష్ సొంత జిల్లా కొరాపుట్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తమ ప్రాంతానికి చెందిన యువకుడి చిత్రం టాలీవుడ్లో అద్భుత విజయం సాధించాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. -
యాంకర్ సుమ జయమ్మ పంచాయితి టీజర్ లాంచ్ ఫోటోలు