Jubilee hills police station
-
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అలా జైలుకు..ఇలా బెయిల్‌పై
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నని..తనకు డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రెస్‌లో ఏకంగా సైఫాబాద్‌లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్‌కు చెందిన కొనకంచి కిరణ్‌కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్స్పెక్టర్నని, డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్‌లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్‌పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది. -
తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి..
బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. అతివేగంతో వచి్చన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ (30) రాయదుర్గం సమీపంలోని అడాప్‌్ట్స ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్ బైక్‌పై హెల్మెట్ ధరించి జూబ్లీహిల్స్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వచి్చ న టిప్పర్ శివశంకర్ బైక్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారయ్యాడు. మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్ విగత జీవిగా మారడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో శివశంకర్ పని చేస్తున్న సంస్థలో, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
Hyd: లిఫ్ట్ అడిగి మరీ రేప్ బెదిరింపులు!
హైదరాబాద్, సాక్షి: నడిరోడ్డుపై నిల్చుని కారులో వెళ్లేవాళ్లను లిఫ్ట్ అడుగుతుంది. జాలిపడి లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే!. రేప్ చేయబోయారని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటుంది. అలా పదుల సంఖ్యలో బెదిరింపు ఉదంతాలకు పాల్పడిన కిలా(లే)డీని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి ఏదో అర్జంట్ పని ఉందంటూ లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత ‘రేప్’ చేయబోయారని బెదిరిస్తూ డబ్బులు గుంజడం ఆమెకు బాగా అలవాటు అయ్యింది. పైగా తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు దిగుతుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఓ కారు ఎక్కింది. ఆపై దిగేముందు బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో సదరు డ్రైవర్ పరమానంద.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించిన పోలీసులు.. నగర వ్యాప్తంగా పలు స్టేషన్లో ఆమెపై 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
పార్కింగ్‌లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో అతి వేగంగా కారులో దూసుకెళుతూ కారును కంట్రోల్ చేయలేక పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా, గడి గ్రామానికి చెందిన ఫిర్దోస్ సాదిక్ అలీ ఆదివారం రాత్రి కారులో తన స్నేహితులు అస్మత్, షాబాద్‌తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం వారు కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెం 70 డీకే నగర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ప్లాట్ నెం 179లోని పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బోర్వెల్ను ఢీకొట్టడంతో బోర్వెల్ ధ్వంసమైంది. అదే సమయంలో సమీపంలో నిద్రిస్తున్న వాచ్మెన్ రవి పక్కకు జరిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి వారు మద్యం సేవించినట్లుగా నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్మాత బెల్లంకొండ కారు అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడనే అభియోగం మీద.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలానగర్ బస్తీవాసి విజయ్‌తో కలసి షేక్ హైదర్ అనే వ్యక్తి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే వారెవరికీ అక్కడ ఇళ్లు రాలేదు. షేక్‌హైదర్, విజయ్ చేతుల్లో మోసపోయినట్లు వారికి తెలిసింది. దీంతో వారంతా బస్తీవాసులపై గొడవకు దిగుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందంటూ అదే బస్తీకి చెందిన జె.గోపీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమను మోసగించాడంటూ డబ్బులు చెల్లించిన వారందరికీ విజయ్, షేక్‌హైదర్‌లు చెబుతూ.. వారిని నమ్మించి తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని బస్తీవాసులుగా పేర్కొంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు వారినుంచి ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో తీన్మార్‌మల్లన్నతోపాటు షేక్‌హైదర్, విజయ్, మధులపై ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితే అసలైన పెట్టుబడిదారు! -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పిపుచ్చుకోలేరు: డింపుల్
-
సినీ నటి డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు
-
పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుసరిస్తున్నవారు అభిమానులు కాదని పేర్కొన్నారు. మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలపైన, కారులోను పవన్‌కళ్యాణ్‌ను వెంబడించారని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్‌కళ్యాణ్ ఇంటివద్దకు వచ్చి గొడవ చేశారని, సెక్యూరిటీ సిబ్బంది నివారిం చబోగా దుర్భాషలాడుతూ గొడవకు దిగారని పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
'నా కుటుంబం ఆపదలో ఉంది'.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో పూరి ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది. #Liger : Producer-Director #PuriJagannath Complains to Poloce Authorities that his Distributors are trying to instigate violence! pic.twitter.com/POxsnGsbdk — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 26, 2022 -
అర్ధరాత్రి గోడదూకి.. మహేష్‌బాబు ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇంట్లో ఓ యువకుడు గోడదూకి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్‌నెం 81లో నివసించే మహేష్‌బాబు ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి కృష్ణ(30) అనే యువకుడు గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించాడు. పది అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శబ్ధానికి అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తీవ్ర గాయాలతో వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరా తీయగా సదరు యువకుడు మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు కోలుకున్నాక లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. చదవండి: (25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్‌లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు) -
పీఎస్‌లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు
-
ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. పోలీస్‌స్టేషన్‌లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంఐఎం నేత కొడుకును తప్పించారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ -
భర్తను చంపి ఫ్రిజ్‌లో పెట్టి.. పుట్టింటికి వెళ్లింది
సాక్షి: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్లో జరిగిన టైలర్ హత్య కేసును పోలీసులు చేధించారు. సాధిక్‌ను హత్య చేసింది భార్య రుబినా అని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోభార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో రుబినా తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తల్లిగారింటికి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధిక్ తొలుత అమీర్‌పేట్‌లో టైలర్ షాపు నడిపేవాడు. కానీ లాక్డౌన్ కారణంగా షాప్ మూతపడింది. ఈ క్రమంలో ఇటీవలే కూకట్పల్లి ప్రాంతంలో మరో షాప్ ఓపెన్ చేశాడు. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ కోపంలో రుబినా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం గురించి తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రస్తుతం రుబినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణం -
కన్నేసి... కాటేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతిని బర్త్‌డే పార్టీ పేరుతో నగరానికి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టిన విషయం మరువకముందే నగరంలో అటువంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కేక్‌లో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు వేరైనా నేరం తీరు ఒకేరకంగా ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్గా నమోదైన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బొందలగడ్ల నవీన్‌రెడ్డి(22) క్లీనర్‌గా పనిచేస్తుండగా అదే ప్రాంతంలో నివసించే మాధవ్‌జీ జోసెఫ్(20) ప్లాస్టిక్ గ్లాసుల విక్రయం చేస్తుంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్ పనిచేసే రాగిని రాము(23) ముగ్గురూ ఫ్రెండ్స్ కాగా ఈ ముగ్గురికీ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నలుగురూ స్నేహితులుగా ఉండేవారు. ఎవరికి వారే ఆమెను ప్రేమలో పడేసేందుకు యత్నిస్తున్నారు. ఆ యువతి సికింద్రాబాద్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈనెల 5న ఫీజు చెల్లించేందుకు ఇంట్లోంచి కాలేజీకి వెళ్లింది. కలసి వేడుక చేసుకుందామని.. యువతికి జోసెఫ్ ఫోన్ చేసి తన పుట్టినరోజు ఉందని అందరం కలసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. నవీన్‌రెడ్డి, జోసెఫ్‌లు యువతి కళాశాలకు వెళ్లి ఆమెను బైక్‌పై కూకట్‌పల్లిలోని ఓయో రూమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో స్నేహితుడు రాము వేచి ఉన్నాడు. ముగ్గురూ కలసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కేక్‌పై మత్తు చల్లి ఆమెకు తినిపించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని రోదిస్తుండగా ఈ విషయం బయటికి చెబితే నగ్న దృశ్యాలు వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయపడి ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. ఆరోగ్యం దెబ్బతినడంతో.. రెండ్రోజుల తర్వాత బాధిత యువతికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు లోతుగా అడగడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లిదండ్రులు ఆ ముగ్గురు యువకులను పిలిపించి తిట్టారు. కూతుర్ని కొట్టారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన కేపీహెచ్‌బీ ప్రాంతంలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ స్టేషన్‌కు ఏమైంది..?
బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులు... అటాచ్మెంట్లు.. సస్పెన్షన్లు.. గడువు తీరకుండానే అర్థాంతరపు బదిలీలు... సిబ్బందిపై కోల్పోతున్న పట్టు... ఎవరికివారే యుమునాతీరే చందంగా వసూల్ రాజాలు... ఇదీ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ తాజా పరిస్థితి. గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌ను వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. మూడురోజుల క్రితం ఇన్స్పెక్టర్, ఎస్ఐలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ పోలీస్‌స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే పోలీస్‌స్టేషన్ నుంచి ఒకేసారి ముగ్గురు ఎస్ఐలు అటాచ్ అయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ లేకుండానే స్టేషన్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోలీస్‌స్టేషన్ అప్రతిష్టపాలవుతోంది. ఉన్నతాధికారులు తరచూ క్లాస్‌లు తీసుకుంటున్నా ఇక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటేనే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వణికిపోతున్నారు. ఇటీవలే ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ పనిచేయలేమంటూ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్టేషన్‌కు పదిమంది ఎస్ఐలు అవసరం. ప్రస్తుతం ఓ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌కాగా కేవలం నలుగురు మాత్రమే మిగిలారు. ఆరు ఎస్ఐ పోస్టులతో పాటు ఒక సీఐ పోస్టు ఖాళీగా ఉంది. అడ్మిన్ ఎస్ఐ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. క్రైమ్ ఎస్ఐ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సరిపడ సిబ్బంది లేక పోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఉపరాష్ట్రపతి ఇదే పీఎస్ పరిధిలో ఉండటంతో నిత్యం వీవీఐపీల రాకపోకలు జరుగుతుంటాయి. ప్రముఖులపై కేసులు, పబ్‌లలో గొడవలు నిత్యకృత్యం. అయితే ఇంటికి కీలకమైన పోలీస్స్టేషన్లోనూ అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రక్షాళన చేయాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ క్రైమ్ విభాగం కూడా పడకేసింది. కేసులు ముందుకు సాగడంలేదు. ఎక్కడి ఫైళ్లు అక్కడే పేరుకుపోతున్నాయి. మరి అధికారులు ఈ స్టేషన్‌ను ఎలా బతికిస్తారో..? వేచి చూడాల్సిందే. -
ఏసీబీ ఎదుట లొంగిపోయిన బల్వంతయ్య..
బంజారాహిల్స్: చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ దొరికిన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ పి.సుధీర్‌రెడ్డి కేసులో వాంటెడ్‌గా ఉన్న ఇన్స్పెక్టర్ బల్వంతయ్య శుక్రవారం ఏసీబీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కాగా, డబ్బులు ఇవ్వాలని తానే నిందితుడిని డిమాండ్ చేశానని.. ఎస్ఐ సుదీర్‌రెడ్డి ద్వారా తీసుకున్నట్లు బల్వంతయ్య వాం గ్మూలం ఇచ్చారని ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బల్వంతయ్యతో పాటు సు«దీర్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ‘పేజ్ 3 లగ్జరీ సెలూన్’నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ నుంచి రూ.50 వేల నగదు, 2 మద్యం సీసాలు లంచంగా తీసుకుంటూ గురువారం సు«దీర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదిత మే. ఈ విషయం తెలియడంతో బల్వంతయ్య పరారయ్యారు. అనంతరం ఏసీబీ అధికారుల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. -
మోడల్‌పై లైంగిక దాడి.. వీడియో చిత్రీకరణ
బంజారాహిల్స్: ఓ మోడల్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా మరో యువకుడు దానిని సెల్ఫోన్లో చిత్రీకరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ప్రాంతానికి యువతి(21) కొద్ది రోజుల క్రితం మోడలింగ్ చేయడానికి నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్లో ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు హాస్టల్ యజమాని కుమారుడు రిషితో పరిచయం ఏర్పడింది. కాగా నాలుగు నెలలుగా ఆమె తెలంగాణ మిస్ మోడల్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో తన చెల్లితో కలిసి అద్దెకు ఉంటోంది. గత నెల 28న ఆమె సోదరి బంధువుల వద్దకు వెళ్లడంతో రిషితో పాటు అతడి స్నేహితుడు నిఖిల్‌రెడ్డి భోజనం చేస్తామంటూ ఆమె గదికి వచ్చారు. గంజాయి మత్తులో ఉన్న రిషి ఆమెపై నోరు నొక్కి లైంగికదాడికి పాల్పడుతుండగా అతని స్నేహితుడు నిఖిల్‌రెడ్డి ఫోన్లో వీడియో తీశాడు. అంతేగాక నిఖిల్‌రెడ్డి ఆమె ఫోన్ లాక్కుని అందులో నుంచి రిషి ఫోన్‌కు ఓ తప్పుడు మెసేజ్‌ను కూడా పంపించాడు. అయితే తాను భయంతో ఎవరికీ చెప్పుకోలేక తన సొంత ఊరికి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచన మేరకు ఈనెల 7న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియాతో పేర్కొంది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు మార్చి రాయాలంటూ డీఐ రమేష్ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. తన కళ్లముందే ఎస్ఐ నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని పేర్కొంది. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు పేర్కొన్నారు. -
ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది
అతడో ఆటో డ్రైవర్. తన ఆటోను తీసుకెళ్లి ఎంచక్కా ఓ సీసీ కెమెరా కింద ఆపాడు. అటూఇటూ చూసి ఎవరూ తనని చూడకపోవడంతో చకచకా ఆటోపైకి ఎక్కేశాడు. చటుక్కున సీసీ కెమెరా తీగలు కత్తిరించి దాన్ని పట్టుకుని ఉడాయించాడు. అనంతరం దాన్ని ముక్కలు చేసి పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. ఇక బస్తీలో తాను చేసే చిల్లర పనులు ఏ కెమెరా రికార్డు చేయలేదులే అన్న ధైర్యంతో బస్తీకి వచ్చేశాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతగాడిని పట్టుకొని పక్కనే ఉన్న మరో కెమెరాలో ఈయనగారు చేసిన చోరకళను చూపించి బిత్తరపోయేలా చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. వనపర్తికి చెందిన శాంతానాయక్(40) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని నందగిరిహిల్స్‌ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్‌లో గుడిసె వేసుకొని బతుకుతూ ఆటో నడుపుతున్నాడు. అతడు మద్యం సేవించడం, పేకాడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు నందగిరిహిల్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ సీసీ కెమెరా తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందనే కారణంగా ఏకంగా సీసీ కెమెరానే దొంగిలించి అమ్మేశాడు. అయితే అతడు ఈ కెమెరాను దొంగిలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇంకో కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయం తెలియని శాంతానాయక్ తాను దొంగతనం చేయలేదని బుకాయించగా పోలీసులు ఆ ఫుటేజీలను కళ్ల ముందుంచారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. సీసీ కెమెరా దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడం నగరంలో ఇదే మొదటిసారి. –హైదరాబాద్ -
పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం భీమవరంలో జరి గిన ఎన్నికల సభలో పవన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడు లు చేస్తున్నారని, తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన సమయంలో కూడా ఏ ఒక్కరిపైనా దాడు లకు పాల్పడలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కూడా ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టు కుని చూసుకుంటున్నామని, అన్నదమ్ములవలే ఎంతో సఖ్యతతో ఉన్నామని గుర్తుచేశారు. చంద్రబాబు సూచనలతో పవన్‌కల్యాణ్ ఓట్లకోసం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పా లని ప్రశ్నించారు. తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సీ.హెచ్ ఉపేందర్, తూడి శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన యువతి (18)కి ఆమె అద్దెకుంటున్న ఇంటి కింది పోర్షన్లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అతడు అక్కడి టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి లోనైన దుర్గాప్రసాద్ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ నిలదీశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో మెడపై పొడిచాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని కిందకి పరుగు తీసింది. దీనిని గుర్తించిన టైలర్‌షాపు యజమాని యూసుఫ్ ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. స్థానికులు దుర్గాప్రసాద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమ య్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరిచంద్రరెడ్డి.. ఆమెను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
బెటాలియన్‌కు బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని అత్యంత కీలకమైన బలగాల యూనిట్ బెటాలియన్‌లో సంక్షేమ విభాగపు నిధులకు గండిపడింది. ప్రతీ బెటాలియన్‌లో బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీ సర్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. బెటాలియన్‌లో క్యాంటీన్, గ్యాస్, పెట్రోల్ పంప్, కామన్ గుడ్ ఫండ్ తదితరాల మెయింటెనెన్స్ మొత్తం ఈ బెటాలియన్ వెల్ఫే ర్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులను బురిడీ కొట్టించి కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. చెక్కులపై సంతకాలు ఫోర్జరీ యూసఫ్‌గూడలోని మొదటి పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెల్ఫేర్ వింగ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతీ నెలా మెయింటెనెన్స్ కింద వచ్చే డబ్బులను బ్యాంకులో జమ చేయడం, అకౌంట్ బుక్కులు, చెక్కులను అప్డేట్ చేస్తూ ఉండటం ఇతడి విధి. బ్యాంకుల్లో జమ చేయాల్సిన నగదును సొంత ఖాతాలో జమ చేసుకోవడం, బ్యాంకు చలానా కట్టినట్టుగా స్టాంప్, బ్యాంకు అధికారుల సంతకాలు తానే పెట్టి ఆడిటింగ్ ఫైళ్లలో పెట్టేవాడు. ఇలా 2013 నుంచి 2018 మార్చి వరకు మొత్తం రూ.40 లక్షల మేర శ్రీకాంత్ కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. బ్యాంకులో నగదు జమ చేసినట్టుగా ప్రతీ నెలా పాస్‌బుక్ అప్డేట్ చేయడం కోసం తన ఇంట్లోనే అప్డేట్ చేసే సాఫ్ట్వేర్, ప్రింటర్‌ను పెట్టుకున్నాడు. ఇలా ప్రతీ నెలా గ్యాస్, క్యాంటీన్, ఇతర మెయింటెనెన్స్ కింద వచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది. కానిస్టేబుల్‌పై కేసు నమోదు... కుంభకోణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంది. చెక్కులపై సంతకాలు చేయడం, వాటి డిపాజిట్, తదితర వ్యవహారాలన్నింటిపై ప్రతీ మూడు నెలలకోసారి ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బాంకుల్లో ఉన్న నగదును కూడా చెక్ చేయాలి. కేవలం పాస్‌బుక్‌లను ఆధారంగా చేసుకొని ఆడిటింగ్ చేయడం, శ్రీకాంత్‌పై ఆరోపణలున్నా సంబంధిత ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో గతంలో పనిచేసిన వెల్ఫేర్ అధికారులతో పాటు కమాండెంట్లపై విచారణ జరపాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. 2013 నుంచి జరిగిన ఈ స్కాంలో ఆ సమయాల్లో పనిచేసిన బెటాలియన్ వెల్ఫేర్ అధికారులు, కమాండెంట్ల నుంచి సంబంధిత నగదును రికవరీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. గతంలోనే ఇలాంటి అవినీతి ఆరోపణల వ్యవహారంపై ‘సాక్షి’కథనాలు ప్రచురించింది. బెటాలియన్ వెల్ఫేర్ అధికారులతో పాటు ఎంటీవో (మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి) పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు సాగుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతమంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయినా.. మళ్లీ అక్కటే అటాచ్మెంట్ పేరుతో పాతుకుపోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా బయటపడింది... గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న ఈ కుంభకోణం ఓ చెక్కు వల్ల బయటపడింది. మార్చి 13న శ్రీకాంత్ తన స్నేహితుడు ఖాతాలో రూ.రెండు లక్షల చెక్కును బదిలీ చేశాడు. మొదటి బెటాలియన్‌కు సంబంధించి వివిధ బ్యాంకుల్లో 13 ఖాతాలున్నాయి. శ్రీకాంత్ నగదు జమచేసే బ్యాంకు ఎస్బీహెచ్ కాగా, బ్యాంకుల విలీనం వల్ల ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనం అయ్యింది. మార్చి వరకు పాత బ్యాంకు చెక్కులు చెలామణి కావడంతో పాత డేట్‌తో ఒక చెక్కును ఎస్బీఐ అకౌంట్ ద్వారా తన స్నేహితుడి ఖాతాకు రూ.రెండు లక్షలు పంపించాడు. అయితే ఈ ఎస్బీఐ ప్రధాన ఖాతాకు సంబందించిన సంక్షిప్త సందేశాలు ఏఆర్ఎస్ఐకి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.రెండు లక్షల చెక్కుకు సంబంధించి తామేమి లావాదేవీలు జరపలేదని గ్రహించి ఏఆర్ఎస్ఐ బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా, శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ పాత ఎస్బీహెచ్ చెక్కును బదిలీ చేసినట్టు తెలిపారు. దీంతో సందేహం వచ్చి బ్యాంకు పాసుబుక్‌లో ఉన్న నగదు, బ్యాంకులో డిపాజిట్లో ఉన్న నగదును టాలీ చేశారు. ఇక్కడే శ్రీకాంత్ అసలు కథ బయటపడింది.