kabja
-
కబ్జా కథలు చెప్పారు.. కారకుల్ని వదిలేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చెరువుల పరిరక్షణ పేరుతో పేదలు, మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు నిర్తించుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వానికి బడా బాబులు చేసిన కబ్జాలు కనిపించట్లేదా?’అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ వ్యవహారశైలిని విమర్శించారు. ఆరు ప్రముఖ సంస్థలు చెరువుల్ని ఎలా కబ్జా చేశాయో, దానికి ప్రభుత్వ విభాగాలు ఏ విధంగా సహకరించాయో వివరిస్తూ బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా రాజీనామా కాదని, ఏకంగా ప్రాణత్యాగమే చేస్తానంటూ సవాల్ విసిరారు. ఎస్ఎంఆర్ కాసా కరీనో గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని సర్వే నంబరు 13లో 1.49 ఎకరాల విస్తీర్ణంలో కుంటఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు అనుమతి ఇచ్చారు.దీంతో చెరువును పూర్తిగా మింగేసిన ఎస్ఎంఆర్ కాసా కరీనో సంస్థ విల్లాలు నిర్మించింది. ప్రస్తుతం చెరువు ఉండాల్సిన ప్రాంతంలో 15 విల్లాలునిర్మించినట్టు కనిపిస్తోంది. ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు లెక్కేసుకున్నా వీటి ఖరీదు రూ.150 కోట్లకు పైనే. వజ్రం ఇక్సోరా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో సర్వే నంబరు 29లో 1.86 ఎకరాల విస్తీర్ణంలో మేడ్లకుంట చెరువు ఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2022లో వజ్రం ఇక్సోరాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ జీ+11 అంతస్తులతో నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.900 కోట్లు. ఫీనిక్స్, కాండూర్ గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నంబర్లు.185, 186, 187, 188, 285, 286, 287, 288, 289ల్లో ముక్కసాని కుంట 19.58 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని తొలుత సెజ్‌గా మార్చిన గత ప్రభుత్వం ఆపై తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్చక్చర్ కార్పొరేషన్‌కు (టీఎస్ఐఐసీ) బదిలీ చేసింది. ఫీనిక్స్ సంస్థ ఎనిమిది ఎకరాల్లో, కాండూర్ సంస్థ ఏడు ఎకరాల్లో వాణిజ్య భవనాలు నిర్మించడానికి టీఎస్ఐఐసీ 2023లో అనుమతులు మంజూరు చేసింది. ఫీనిక్స్ నిర్మాణాలను పూర్తి చేయగా, కాండూర్ సంస్థ స్కైలైన్ పేరుతో చేపట్టింది. వీటి విలువ రూ.6 వేల కోట్లు. ఫీనిక్స్ గండిపేట మండలం పుప్పాలగూడలోని 9.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో గెటేడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2021లో ఫీనిక్స్కు అనుమతి ఇచ్చింది. ప్లాన్‌తోపాటు గ్రామ మ్యాప్‌లోనూ సర్వే నంబర్లు 272, 273లను వాటర్ బాడీస్‌గా పేర్కొన్నా, అనుమతులు లభించాయి. వీటిలో ఫీనిక్స్ సంస్థ ఆరు సెల్లార్లు, గ్రౌండ్+30 అంతస్తుల్లో 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడుతోంది. దీని మార్కెట్ విలువ కూడా రూ.వందల కోట్లే. ది ప్రెస్టేజ్ సిటీ ప్రేమావతిపేటలోని సర్వే నంబరు 86లో 98 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. ఇందులో 31 ఎకరాల్లో ది ప్రెస్టేజ్ సిటీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఇందులో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు వచ్చాయి. మరో 24 ఎకరాల్లో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు 15 ఎకరాల బఫర్ జోన్‌నూ మింగేశారు. వీటి విలువ రూ.8,600 కోట్లు. 1955–1976 మధ్య శిఖం తలాబ్‌లో రికార్డుల్లో ఉన్న ఈ భూమి 1985–86 నాటికి ప్రభుత్వ పట్టా భూమిగా మారిపోయింది. చెరువు పేరే మారిపోయింది గడ్డిపోతారంలోని ఉస్మాన్‌కుంట చుట్టూ 70 ఎకరాల్లో 884 విల్లాలు నిర్మించుకోవడానికి హెచ్ఎండీఏ 2021లో ప్రణీత్ ప్రవణ్ సంస్థకు అనుమతి ఇచ్చింది. వీరు చెరువు, దానిలోని నీళ్లు వచ్చి, వెళ్లే మార్గాలను అలానే ఉంచి... చుట్టూ 884 విల్లాలు నిర్మించారు. ప్రణీత్–ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్ అంటూ ఆ చెరువు పేరునే మార్చేశారు. తెల్లాపూర్‌లోని చెరువు, శ్మశానాన్ని కబ్జా చేసిన ఏలియన్ స్పేస్ స్టేషన్ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి అనుమతి పొందింది. ప్రస్తుతం ఈ చెరువు రికార్డులు సైతం అందుబాటులో లేకుండా చేశారు. నోటిఫికేషన్ల జారీలోనూ గోల్మాల్ రెండు వేలకు పైగా చెరువులు ఉండగా, గడిచిన 14 ఏళ్లల్లో కేవలం 229 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. గత నెలలోనే అనూహ్యంగా 95 చెరువులకు ఇది జారీ అయ్యింది. ఇందులోనూ ఏదో గోల్మాల్ ఉందనిపిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి రాక్స్, లేక్స్, పార్క్ అంటున్నారు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే... డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్. పర్మిషన్ ఇచ్చిన అధికారులు, వెనుక ఉండి ఇప్పించిన రాజకీయ నాయకులు, నిర్మించిన బిల్డర్లు బాగానే ఉంటున్నారు. ఏమీ తెలియకుండా కొనుక్కున్నవారు నష్టపోతున్నారు. ఇలాంటి అనుమతులు ఇచ్చి న అధికారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. రిటైర్ అయితే వారి ఆస్తులను జప్తు చేయాలి. మరో 30 సంస్థల బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేయడం, హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ప్రజా పోరాటం చేస్తా. ఇళ్లు కూల్చిన వారికి ఏం చేద్దాం అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు. నా ఐదేళ్ల జీతభత్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ముందుకొస్తే దాదాపు రూ.300 కోట్లు సమకూరుతాయి. వీటితో నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. చెరువుల్లో కట్టిన ఆ భవనాలు కూడా అక్రమ భవనాలే వాటిని కూడా కూల్చేయండి. లేనిపక్షంలో ఇప్పటివరకు కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయి బాధితులుగా మారిన వారికి వాటిలో ఇళ్లు ఇవ్వండి. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. లేకపోతే పైసల ప్రభుత్వం అవుతుంది. – కె.వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే -
ఖాళీ జాగా.. వేసేయ్ పాగా
సాక్షి టాస్‌్కఫోర్స్ : టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘తమ్ముళ్ల’ దురాక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఒకరు వాగులూ వంకలు మింగితే.. మరొకరు చెరువును కొల్లగొడుతున్నారు. ఇంకొకరు ప్రభుత్వ, పోరంబోకు, గ్రామనెత్తం.. ఇలా స్థలం ఏదైనా ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలకు అధికారులు “పచ్చ’ జెండా ఊపుతూ రిజి్రస్టేషన్‌కు అనువుగా మారుస్తుండటంతో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండగా ఉండడంతో యంత్రాంగం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఆళ్లగడ్డలోని ఓ అంగన్వాడీ భవనానిది ఇప్పుడు ఇదే పరిస్థితి. వివరాలు ఏమిటంటే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని రామలక్ష్మీ కొట్టాల కాలనీలో సుమారు పాతికేళ్ల క్రితం అంగన్వాడీ కేంద్రం కోసమని అప్పటి పంచాయతీ కార్యాలయం 6 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అందులో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రానికి భవనం నిర్మించి ఇచ్చింది. కాలక్రమేణా భవనం పాతపడటంతో ఈ కేంద్రాన్ని అద్దె భవనంలోకి మార్చారు. అప్పట్లో గ్రామ శివారులో ఉన్న ఈ స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండడంతో ఈ స్థలంపై ఓ టీడీపీ నేత కన్నుపడింది. అంతే.. జేసీబీతో ఆ భవనాన్ని కూల్చి దాని ఆనవాళ్లు లేకుండా చదును చేసేశాడు. అందరూ అంగన్వాడీ కేంద్రాన్ని మళ్లీ నిరి్మస్తున్నారని భావించారు. కానీ, అసలు విషయం తెలుసుకుని సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో స్థలం అభివృద్ధి పనులను టీడీపీ నేత వేగవంతం చేశాడు. అడ్డదారులనూ ఆక్రమించేశారు.. ఇదిలా ఉంటే.. సుమారు 30 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ కాలనీలో ప్రధాన రోడ్లకు సమాంతరంగా అడ్డదారులు ఏర్పాటుచేశారు. ఈ దారులపైనా కన్నేసిన తమ్ముళ్లు ఖాళీగా ఉన్న స్థలాలతోపాటు అడ్డరోడ్లను ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు. దీంతో ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి పోవాలంటే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఎవరో అంగన్వాడీ భవనం కూల్చి స్థలం ఆక్రమించుకుంటున్నారనే విషయం తెలిసింది. ఈ విషయం వెంటనే పీడీ మేడంకు తెలియబరిచా. ఆమె స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారితో మాట్లాడారు. అక్కడ అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేశామని చెప్పారంట. – తేజేశ్వరి, సీడీపీఓ మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలి.. అంగన్వాడీ భవనం కూల్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని అక్కడి సిబ్బంది వచ్చి చెప్పారు. అది మీ స్థలం, అందులో భవనం కూడా ఉంది.. దాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పా. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారిస్తామని చెప్పా. అయినా వారు ఇంతవరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేయలేదు. – రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఐదు నెలల క్రితం నాడు–నేడుకు ఎంపిక ఐదు నెలల క్రితం గత ప్రభుత్వం అక్కడ కొత్త భవనం నిర్మించాలని నిధులు విడుదల చేసింది. విశాలమైన స్థలం ఉండటంతో నాడు–నేడు కింద మోడల్ అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని తీర్మానించారు. అధికారులు పరిశీలించడంతో చుట్టుపక్కల కాలనీల వారు సంబరపడ్డారు. అయితే, ఇంతలో ప్రభుత్వం మారడంతో విలువైన స్థలం కబ్జాకు గురైంది., భవనం కూలిపోయింది. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధంలేదని ఆయా శాఖలు తప్పించుకుంటున్నాయి. -
టీడీపీ నేత అండతో శ్మశానం కబ్జా
తిరుపతి మంగళం: ‘మా తాతముత్తాల నుంచి తిరుపతి తిమ్మినాయుడుపాలెం గ్రామంలో దళితవాడ ఎదురుగా సర్వే నంబర్ 199లోని 1.49 ఎకరాల స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామంలోని టీడీపీ నాయకుడు వెంకటరత్నం అండతో కొందరు శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. అక్రమంగా షెడ్లు నిరి్మంచారు. వెంటనే అడ్డుకోండి..’ అని తిమ్మినాయుడుపాలెం గ్రామస్తులు శుక్రవారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన శ్మశాన స్థలంలోని ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం ప్రజలు వందేళ్లుగా వినియోగించుకుంటున్న శ్మశాన స్థలంలో ఇటీవల కొందరు టీడీపీ నాయకులతో కలసి ఆక్రమించుకుని అందులో షెడ్లు నిరి్మంచుకున్నారని తెలిపారు. దీంతో తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి స్థలం లేక నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నవారు కొత్తగా అటవీశాఖ భూమిని శ్మశానం కోసం కేటాయించాలని కోరుతున్నారని తెలిపారు. మరోవైపు ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొత్త నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు ఉన్న వాటిని తొలగించి తమ గ్రామానికి శ్మశాన స్థలాన్ని అప్పగించాలని కోరారు.శ్మశానం కబ్జాకు యత్నం.. తిరగబడిన దళితులురాజంపేట: శ్మశానస్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ వర్గీయులపై దళితులు తిరగబడిన ఘటన అన్నమయ్య జిల్లా ములక్కాయపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సర్వే నంబరు 1,713లో 0.20 సెంటు భూమిని దళితవాడకు శ్మశానస్థలంగా కేటాయిస్తూ గత సంవత్సరం ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న కొందరు ఈ స్థలంపై కన్నేశారు.శుక్రవారం స్థలానికి ముళ్లకంచె వేసి కబ్జాకు యత్నించారు. ఇది తెలుసుకున్న దళితులు మూకుమ్మడిగా స్థలం వద్దకు చేరుకుని టీడీపీ వర్గీయులు వేసుకున్న ముళ్లకంచెను తొలగించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. దళితులపై బెదిరింపులకు దిగారు. సమాచారం తెలుసుకున్న మన్నూరు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగింది. అయితే తమ శ్మశానవాటికను కబ్జా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ములక్కాయపల్లె దళితులు రెవెన్యూ అధికారులకు విన్నవించారు. స్థలాన్ని కబ్జా కానివ్వమని, జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లి పోరాడుతామని వెల్లడించారు. -
టీడీపీ నేత బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో టీడీపీ నేత కబ్జాచేసిన పెన్నా పొరంబోకు భూములను బుధవారం అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 30 ఎకరాలు ఆక్రమించి దాదాపు 1,400 ప్లాట్లు వేసిన ఆ నేత ఇప్పటికే కొన్ని అమ్మి రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్నారు. మిగిలిన ప్లాట్లను పేదలకు పంచుతున్నానంటూ చీటీలు పంపిణీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు.. పోలీసుల సహకారంతో ఆ భూమిని స్వా«దీనం చేసుకుని జేసీబీతో హద్దురాళ్లను తొలగించారు. కోడూరుపాడుకు చెందిన టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 550, 411, 435, 538, 39, 40లోని 30 ఎకరాల పెన్నా పొరంబోకు స్థలంపై కన్నేశారు. దీన్లో కొంత భూమిని గతంలో దళితులకు డి–ఫారం పట్టాగా పంపిణీ చేశారు. వారు ఆ భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.రెండుకోట్ల వరకు ఉంది. ఈ మొత్తం భూమిని ఆక్రమించిన కమలాకర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని గత ఏడాది అందరినీ నమ్మించారు. రోడ్లు ఏర్పాటుచేసి దాదాపు 1,400 ప్లాట్లతో లే అవుట్ వేశారు. కొన్ని ప్లాట్లను రూ.రెండులక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు విక్రయించి దాదాపు రూ.15 కోట్లు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేస్తానంటూ చీటీలు అందజేశారు. చీటీలు అందుకున్నవారిలో ఆయన అనుచరులు, వారి సంబందీకులే 300 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారుల ఆందోళన పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వస్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ నేత వద్ద రూ.నాలుగు లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడ పదిమంది ఆందోళన చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసే హక్కు ఎవరికీలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు. -
‘మా పార్కును కాపాడండి ప్లీజ్’
హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు. హైకోర్టుకు చిన్నారుల లేఖ ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్‌ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది. స్థలం సంగతేంటీ? అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. పెద్దల వల్ల కానిది పిల్లలు.! ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. -
దేవుని భూములను కొందరు కబ్జా.. చట్టారీత్యా నేరం..
కరీంనగర్: ధూప..దీప.. నైవేద్యం.. ఆలయాల పరిరక్షణకు దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములు పరాధీనమవుతున్నాయి. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు.. దేవుడి సొమ్ము దేశదిమ్మరుల పాలు’ అన్న చందంగా మారింది. దేవుడి సొమ్మే కదా అని తేరగా కబ్జాలకు పాల్పడుతుండడంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారుల అలసత్వంతో ఇప్పటికే కొన్నిచోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే చేపట్టకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేక కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 85 ఆలయాల పరిధిలో 1,089.34 ఎకరాలు ఉండగా.. అందులో 15 నుంచి 20 శాతం భూములు ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం. దేవాదాయ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ హెచ్చరికబోర్డులు లేకపోవడం, వందల ఏళ్ల కిందటి భూములు కావడంతో రక్షణ కరువైంది. కాలక్రమేణా వీటి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెద్దపల్లి నుంచి ఓ ప్రజాప్రతినిధే అక్రమంగా దేవాదాయ భూములు పట్టా చేయించుకున్నాడని హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చ నడుస్తోంది. నేత, బంధువుల పేరిట పట్టాలు.. దేవుడి భూములు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే వాటికి ఎసరు పెడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని పాలితం, బొంపల్లి, కనగర్తి, కాసులపల్లి, ధర్మాబాద్ గ్రామాల్లో 462.33 ఎకరాలు రంగనాయకుల స్వామి భూములు ఉన్నాయి. ఈ భూములను లీజుకు తీసుకొని ఏళ్లుగా పేదరైతులు సాగు చేసుకుంటూ.. ప్రభుత్వానికి కాస్తు(లీజు) డబ్బులు చెల్లించేవారు. తాజాగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుకు బదులు కొందరు రైతులు పేర్లు ఎక్కించుకున్నారు. అందులో ప్రజాప్రతినిధి, వారి కుటుంబసభ్యులు సైతం ఉన్నారు. ధరణి పోర్టల్‌లో పలువురు రైతులతోపాటు ఆ నాయకుడి కుటుంబ సభ్యుల పేరిట పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అయినా వాటిని ఇంకా దేవాదాయశాఖ భూములుగానే చూపెడుతుండడం గమనార్హం. పాసుపుస్తకాలు జారీకావడంతో సదరు ఆక్రమణదారులు రైతుబంధు పొందుతున్నారు. ఆ ఆలయ భూములను పరిరక్షించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్షక్ జాపతి రాజేశ్‌పటేల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సదరు నాయకుడితో సహా పలువురు రైతులకు, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్లో వ్యవసాయ భూములుగా.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు నాయకుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట ఉన్న భూముల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో కాసులపల్లిలో తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు. సదరు భూమి ధరణి పోర్టల్‌లో చూస్తే ఆ నేత పేరు చూపుతూనే.. అవి దేవాదాయశాఖ భూములుగా చూపుతుండడం గమనార్హం. ఇంకా ఆ సర్వే నంబర్లలోని భూములకు నాయకుడు రైతుబంధు తీసుకుంటుండగా, ప్రస్తుతం పొజిషన్లో ఆ సర్వేనంబర్లలో నాయకుడికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీంతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంతోపాటు అర్హత లేకున్నా రైతుబంధు పొందుతుండడంపై వివిధ రాజకీయ పక్షాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతోనే చర్యలు చేపట్టడం లేదని కోర్టుల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. పేర్లు ఎక్కిస్తామని డబ్బుల వసూలు.. రంగనాయకులస్వామి పరిధిలోని భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వారిలో చిన్న, సన్నకారు రైతులు, భూస్వాములు, రాజకీయనేతలు ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక పలువురు నేతలు భూములను రైతుల పేరిట ఎక్కిస్తామని ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. ఆ సొమ్ముతో కొందరు మాత్రమే తమ పేరిట భూములను ధరణిలో ఎక్కించుకోగా.. మిగతా సాధారణ చిన్న, సన్నకారు రైతులు మోసపోయారు. స్థానిక బడా నేత, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు విజయవంతంగా ధరణిలో పేరు ఎక్కించుకోవడంతో వారికి రైతుబంధు అందుతుండడం విశేషం. ధరణిలో ఎండోమెంట్ భూములు అని చూపుతున్నా ప్రభుత్వం రైతుబంధు చెల్లిస్తుండడం గమనించాల్సిన విషయం. రెండేళ్ల కిందే ప్రభుత్వానికి నివేదించాం.. పాలితం గ్రామంలోని రంగనాయకుల స్వామికి చెందిన దాదాపు 400 ఎకరాలకుపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయని గతంలోనే నివేదిక ఇచ్చాం. చాలా ఏళ్ల కింద స్థానికులు దేవుని మాన్యం భూములను సాగుపేరిట లీజుకు తీసుకున్నారు. వారిలో కొందరు అక్రమార్గంలో పట్టాలు పొందారు. అక్రమంగా రైతుబంధు కూడా పొందుతున్నారు. ఈ విషయాన్ని 2021లోనే పెద్దపల్లి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి నివేదిక పంపాం. మా దేవాదాయశాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. వారికి వెంటనే రైతుబంధు నిలిపివేయాలని నివేదికలో పొందుపరిచాం. – ఏసీ చంద్రశేఖర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. దేవాదాయ భూములను ఇతరులకు విక్రయించడం, వాటిని కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరం. రాజకీయ పలుకుబడి కలిగిన నేత, అతని బంధువులు మాత్రమే పట్టాలు చేయించుకున్నారు. నిజంగా సాగు చేసుకునే పేద, సన్నకారు రైతుల పేర్ల మీద పట్టాలు జారీకాలేదు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సాగుచేసుకోకుండా అందులో వ్యాపారాలు చేసుకునే వారి భూములను ప్రభుత్వం స్వాఽధీనం చేసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. దీనిపై పలుసార్లు అధికారులను కలిసినా రాజకీయ ఒత్తిళ్లతో ఎవరూ పట్టించుకోవడం లేదు. – సత్యనారాయణరెడ్డి, న్యాయవాది -
పవన్‌వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించే పార్టీ కేంద్ర కార్యాలయం కోసం బీజేపీ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేస్తోందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న పాఠశాల స్థలాన్ని ఇప్పటికే కొంత ఆక్రమించిన బీజేపీ..ఇప్పుడు అభివృద్ధి పేరుతో భవనాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆప్ అలా జరగనీయబోదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. స్కూలు భవనాన్ని కూలగొడితే 350 మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క స్కూల్‌ను కూడా ధ్వంసం కానివ్వమన్నారు. -
ఈ వారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో.. వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా అటు ఓటీటీలో ఇటు థియేటర్స్‌లో చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. మార్చి మూడో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఓ లుక్కేయండి. కబ్జ కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా నటంచిన మల్టీస్టారర్ ‘కబ్జ’. ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ‘సార్’ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక థియేటర్ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రైటర్ పద్మభూషన్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషన్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మార్చి 17నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు.. మనీషాట్- మార్చి 15 కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16 షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16 మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17 ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17 ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15 డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17 ఆహా.. సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17 లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17 జీ5 లాక్(తమిళం)- మార్చి 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17 సోనీ లివ్.. రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16 -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
Hyderabad: హౌసింగ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్‌బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్‌బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్‌పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్‌బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్‌ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్‌బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్‌బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్‌బాబు, హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... తండ్రీ కొడుకుల అరెస్ట్
బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్‌ను కోరారు. అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్‌ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు. నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో.. ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది. (చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్) -
పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ అయిన నీలంపేట చానల్‌కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్మెంట్ నిర్మించారు. ఈ చానల్ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. ఈనెల 2న నోటీసులు జారీ అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్ అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్ సీఐ మోహన్‌రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు. అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేసినట్లు సమాచారం. కాలువను కబ్జాచేసి కట్టేశారు ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ నీలంపేట చానల్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు. -
‘నా భూమిని కాజేసేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు’
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఓ అన్నదాత కన్నీరు పెట్టుకున్నాడు. తన భూమిపై రాబందుల నీడ పడడంతో దాన్నెలా కాపాడుకోవాలో తెలీక బోరున విలపించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు విన్నవిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. టెక్కలి మండలం సీతాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భూమిని కాజేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని, తనతో పాటు భార్య, కుమారుడిని హతమారుస్తానంటూ బెదిరిస్తున్నారని టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన రైతు సత్తారు వేణుగోపాలరావు సోమవారం టెక్కలి ఆర్డీఓ హెచ్వీ జయరాంకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కార్యాలయం ఆవరణలోనే బోరున విలపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సీతాపురం సమీపంలో తిర్లంగి రెవెన్యూ గ్రూపు పరిధిలో సర్వే నంబరు 178–2లో వే ణుగోపాలరావుకు సుమారు 66 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిపై గ్రామానికి చెందిన బొరిగి వెంకటరావు అలియాస్ సత్యం అనే టీడీపీ కార్యకర్త సాయంతో అతని బంధువు బొరిగి వరహాలనాయుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ అన్యాయంపై రైతు అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తన భూమిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మ్యుటేషన్‌తో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయం పై అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
దేవుడు ముసుగులో దోచేస్తున్నారు
పేరు దేవుడిది.. దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు. అక్కడ రేకుల షెడ్లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు. స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం... కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు... వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు. స్వాగతద్వారం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు... కలెక్టర్ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు. దర్జాగా నిర్మాణ పనులు... ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు. నీరుగారిన క్రిమినల్ కేసు... ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత తహసీల్దార్ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్ గ్రాబింగ్) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాలకు ఎసరు... కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వర్టును ధ్వంసం చేయించాం.... ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస -
భారీ భూకబ్జా.. అంతా సాఫీగా సాగింది.. కానీ బయటకు పొక్కిందిలా..
జిల్లా కేంద్రంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఓ కీలక ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఇంకేం కబ్జాకు శ్రీకారం చుట్టేశారు. పథక రచన చేసి ముప్పై ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రోడ్డును కుదింపు చేశారు. అనుచరులను రంగంలోకి దించి అక్కడ కొంతభాగంలో ఆక్యుపెన్సీలో ఉన్న వారితో చర్చలు జరిపారు. వారున్న 20 శాతం ఆక్యుపెన్సీలో 50 శాతం వాటాకు ఒప్పందం కుదిరింది. మిగతా 80 శాతం ప్రభుత్వ భూమి స్వాధీనానికి ప్రయత్నాల్లో ఉన్నారు. సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఎల్ల మ్మగుట్ట ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని 60 నుంచి 90 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 15 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవానికి ఈ భూమి ఇనాం, వక్ఫ్ బోర్డు పేరిట రికార్డులో ఉన్నట్లు సమాచారం. 30 ఏళ్ల కిత్రం ఈ భూమిని ఆర్టీసీ డిపో–2 కోసం అప్పటి తహసీల్దారు కేటాయించారు. అయితే కొందరు ఆ సర్వే నంబర్లలో తమ భూమి ఉందంటూ కోర్టుకు వెళ్లా రు. దీంతో ఆర్టీసీ డిపో–2కు న్యాల్కల్ రోడ్లో మరోచోట భూమిని కేటాయించారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డు వస్తుందని అప్పటి మాస్టర్‌ప్లాన్ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఆ సర్వే నంబర్లలో తమకు ఉన్న కొద్ది భూమిలో 100 అడుగుల రోడ్డు వేస్తే మిగిలే భూమి నామమాత్రమేనని, కోర్టుకు వెళ్లిన వ్యక్తులు తర్వాత పట్టించుకోకుండా ఉండిపోయారు. ఈ భూమికి అప్పట్లో పెద్దగా విలువ లేకపోవడంతో అంతగా దృష్టి పెట్టలేదు. కోర్టుకు వెళ్లిన వారికి సర్వే నంబర్లలోని 20 శాతం భూమికి సంబంధించి ఇటీవలే క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమి. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుంది. బయటకు పొక్కిందిలా.. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 25 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్‌ప్లాన్ మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భూమిపై కన్నేసిన కీలక ప్రజాప్రతినిధి ఈ భూమి కోసం ప్రణాళికలు రచించారు. ఇక్కడ ప్రభుత్వ భూమితో పాటు కొంతమంది ఎల్లమ్మగుట్టకు చెందినవారి భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పట్టాదారులెవరూ లేరని, ఎల్లమ్మగుట్టకు చెందిన కొందరు కబ్జాలో ఉన్నట్లు తెలిసింది. అయితే 100 అడుగుల రోడ్డు రద్దు అయ్యిందని, 40 అడుగుల రోడ్డు వేయిస్తున్నామని మీ భూమిని మాకు ఇవ్వాలంటూ రహస్యంగా తన అనుచరుల ద్వారా కబ్జాలోని వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు. అవసరమైతే భూమిని డెవలప్ చేసి ఫిఫ్టీ–ఫిఫ్టీ ప్రాతిపదికన (200 గజాలు ఉంటే 100 గజాలు ఇచ్చేలా) ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిదే ఈ తతంగం నడిపించడంతో సదరు వ్యక్తులు భయపడి ఆఫర్‌కు అంగీకరించినట్లు సమాచారం. అయితే మిగిలిన 80 శాతం ప్రభుత్వ భూమికి ఏవిధంగా రికార్డులు సృష్టించారో తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులను నయానో, భయానో ఒప్పించి ఈ తతంగం నడిపిస్తున్నట్లు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చదవండి: పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి -
వీళ్లు మహాముదుర్లు, స్వామికే.. శఠగోపం పెట్టారుగా!
చింతపల్లి(నల్లగొండ): విలువైన దేవుని మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపం, పూజారుల ఇష్టారాజ్యం వల్ల చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భూములలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ రికార్డుల్లో 110 ఎకరాలు ఉండగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 70 ఎకరాలను మాత్రమే అధికారికంగా లెక్క చూపిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ఆధీనంలో 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతుంది. విలువైన భూములు కావడంతో కొందరు అక్రమార్కులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ తప్పుడు లెక్కలతో దేవాలయ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. ఆలయానికి దేవరకొండ, గోకారం, గడియగౌరారం గ్రామాల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడా రికార్డుల్లో లేని పరిస్థితి. పూజారుల ఆధీనంలో.. గట్టుపతి దేవాలయం భూములు ఇక్కడి 80 ఏళ్ల నుంచి పూజారుల ఆధీనంలో ఉన్నాయి. అసలు దేవాదాయ శాఖ కమిటీ ఆధీనంలో దేవాలయ ఈ భూములు ఉండాలి. దానిపై కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భూములు కౌలు వేలం వేసి దేవాలయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ వేలంపాట నిర్వహించకుండానే విలువైన భూములు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటివరకు సుమారు 40 ఎకరాల వరకు భూములు మాయమైనట్లు తెలుస్తోంది. 40 ఎకరాల లెక్క తేల్చని రికార్డులు గట్టుపతి దేవాలయ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో 110 ఎకరాలకు బదులుగా 70 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుండగా.. మిగతా 40 ఎకరాల ప్రస్తావన ఎక్కడా చూకపోవడం ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు అద్దంపడుతోంది. సంబంధిత అధికారులు స్పందించి భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విష యం తమ దృష్టికి వచ్చింది. భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు దేవాదాయ భూములను ఆక్రమిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భూముల వేలంపాటకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – సత్యనారాయణమూర్తి, దేవాదాయ శాఖ ఈఓ చదవండి: Hyderabad Collector L Sharman: బైక్‌పై వెళ్లి.. తనిఖీలు చేసి.. -
ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే
-
అయ్యో భగవంతుడా.. నీకెవరు దిక్కు
వికారాబాద్: జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి, దొంగఎన్కెపల్లి సంజీవస్వామి, పరిగి మండలంలోని వేణుగోపాల స్వామి, బషీరాబాద్ మండల పరిధిలోని మల్కన్‌గిరి ఆంజనేయ స్వామి తదితర ఆలయాలకు సంబంధించి మొత్తం 2,000 ఎకరాల భూములు (ఎండోమెంట్)ఉన్నాయి. ఇవి కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. భూముల నమోదుకు సంబంధించి ఎండోమెంట్ అధికారులు వినియోగించే ఫామ్ వన్ రిజిస్టర్‌తో పాటు పర్మినెంట్ రిజిస్టర్లలోనూ పొంతనలేని విధంగా భూముల సమాచారం నమోదై ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఆక్రమణల్లో వందల ఎకరాలు రెండేళ్ల క్రితం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఎండోమెంట్‌కు సంబంధించి ఇప్పటి వరకు 700 ఎకరాలు మాత్రమే నమోదయ్యాయి. వందల ఎకరాల్లో దేవాదాయ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. తమ కళ్ల ముందే అన్యాక్రాంతమవుతున్నా ఎండోమెంట్ అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. భూముల పరాధీనంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు దేవాదాయశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. మొత్తం 2,000 ఎకరాల గాను సుమారు 800 ఎకరాలకు పైగా పరాధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పరిగి మండల పరిధిలోని కిష్టమ్మగుడి తండాలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి పూడూరు మండలంలో 14 ఎకరాల భూమి ఉంది. సదరు పొలాన్ని కొందరు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీల స్థానిక నేతలు ఉద్యమించటంతో ఎండోమెంట్ అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేయించి తిరిగి ఆ భూములను ఆలయం పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, సహకరించిన అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఆదేశించినా.. 15 రోజుల క్రితం ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ వికారాబాద్‌కు వచ్చి రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణపై ఆయన చర్చించారు. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు సమన్వయంతో పని చేసి మొత్తం భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. 15 రోజుల పాటు ఈ విషయమై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పని పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు దాటినా సంబంధిత ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పూర్తి వివరాలతో తమ వద్దకు వస్తే ధరణిలో నమోదుకు తాము సిద్ధంగా ఉన్నా మ ని రెవెన్యూ అధికారులు చెబుతుండగా ఎండోమెంట్ అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించటం లేదు. చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే.. -
వాళ్లకి హెచ్చరిక.. అడుగు జాగా కూడా వదలం
కబ్జా.. కబ్జా.. కబ్జా.. మేడ్చల్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ పదం వింటూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు.. బాధితుల నుంచి లెక్కకుమించిన వినతులు.. నిత్యం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాలను హ్యాపీగా కబ్జా చేసేసి.. అక్రమంగా నిర్మాణాలు చేసేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు అంటగడుతూ కోట్లకు పడగెత్తుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, సమీక్ష, సమావేశాలతో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి,సిటీబ్యూరో: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాంటి వారిపై చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్లో భాగంగా అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న యంత్రాంగం ఇంకా అదనపు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, రోడ్లు, పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలు, బహుళ అంతస్తులు, ఇండిపెండెంట్ ఇళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది తీరుపై సీరియస్‌గా ఉన్న యంత్రాంగం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్, జవహర్‌నగర్, నిజాంపేట్, కొంపల్లి, దుండిగల్, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ కట్టడాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా పడుతున్న గండిని నివారించి.. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి అక్రమ కట్టడాల పర్వాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో.. చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుర్తించిన అక్రమ కట్టడాలివే.. మేడ్చల్ జిల్లాలో పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో గుర్తించిన అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, 3,643 ఉండగా, ఘట్కేసర్ మండలంలో 656, దుండిగల్‌లో 1,950, కీసరలో 650, శామీర్‌పేట్‌లో 191, మేడ్చల్ మండలంలో 196 ఉన్నట్లు తెలుస్తోంది. నాగారం పట్టణంలో 12 అక్రమ లేఅవుట్లు ఉండగా, దమ్మాయిగూడలో 7, మేడ్చల్‌లో 10, నిజాంపేట్‌లో 20, కొంపల్లిలో 11, దుండిగల్‌లో 12, తూముకుంటలో 15, పోచారంలో 12, ఘట్కేసర్లో 8 ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఇటీవల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ఇలా.. మేడ్చల్ జిల్లా పరిధిలోని జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్లలోని పార్కులు, రోడ్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఉప్పల్ సర్కిల్లో 1,989 చదరపు గజాల స్థలం, కాప్రా సర్కిల్లో 194 చదరపు గజాల స్థలం, మల్కాజిగిరి సర్కిల్లో 36 చదరపు గజాలు, మూసాపేట్లో 20, కూకట్‌పల్లిలో 455, కుత్బుల్లాపూర్‌లో 62, గాజులరామారంలో 198, అల్వాల్ సర్కిల్లో 155 చదరపు గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన యంత్రాంగం ఆక్రమణలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
చెరువును మింగిన తెలుగు తమ్ముళ్లు : విశాఖ
-
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు : మేడ్చల్
-
రెండు భాగాలుగా కబ్జా
ఒక కథను ఒకే సినిమాలో ప్రేక్షకులకు చెప్పలేం అని చిత్రబృందం భావిస్తే అప్పుడు ఆ కథను రెండు భాగాలుగా చెబుతుంటారు. ఇటీవల కాలంలో ‘బాహుబలి, కేజీయఫ్’లు అందుకు ఉదాహరణ. తాజాగా ఉపేంద్ర నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కబ్జా’ కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఉపేంద్ర మాఫియా డాన్‌లా కనిపించనున్నారు. ముందు ఒక్క సినిమాగా ప్లాన్ చేశారు. అయితే లాక్డౌన్లో ఈ కథపై ఇంకా వర్కవుట్ చేశారు. దాంతో కథ పెద్దదయింది. ఈ కారణంగా సినిమాని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. ‘రెండో భాగం ఐడియా ఉపేంద్రగారికి చాలా నచ్చింది’’ అని దర్శకుడు చంద్రు తెలిపారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా సుమారు 7 భాషల్లో విడుదల కానుంది. -
కబ్జా చేస్తా
అండర్ వరల్డ్ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఆక్రమణలపై ఆగ్రహం!
సాక్షి, బలిజిపేట (విజయనగరం): మండంలోని పెద్దింపేటలో కబ్జాకు గురైన సంతచెరువులో ఆక్రమణలను గ్రామస్తులు మంగళవారం తొలగించారు. గ్రామంలో కొందరు బడాబాబులు చేస్తున్న దురాక్రమణల వల్ల చెరువు గర్భాలు తగ్గుతున్నాయని, ఆయకట్టుదారులకు సాగునీరు అందడం లేదని, చెరువుల్లో చేపలు పెంచుకునేవారికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని భావించి ఆక్రమణలను తొలగించారు. పెత్తనందారులు చేస్తున్న ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండా పోతోందని బాధితులు టి సూర్యనారాయణ, మజ్జిరావు, సాంబయ్య, ఎస్ అప్పలస్వామి, సత్యం, బి పోలీసు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్.69లో ఉన్న సంతచెరువు గర్భం 11.66 ఎకరాలు, ఆయకట్టు సుమారు 400 ఎకరాల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ చెరువు దిగువన పెద్దింపేట, పోలినాయుడువలస, గౌరీపురం గ్రామాలకు చెందిన రైతుల ఆయకట్టు భూమి ఉందన్నారు. అటువంటి చెరువు గర్భంలో సుమారు 8ఎకరాల వరకు దురాక్రమణలు జరిగాయని తెలిపారు. చెరువు గర్భంలో ఉండే గట్టును జేసీబీతో తొలగించి దురాక్రమణ చేయడం దారుణమని తెలిపారు. సంతచెరువు, పద్మనాభం చెరువు, పనసోడు చెరువులను మూడు సంవత్సరాలకు చేపలు పెంచుకునేందుకు లక్ష రూపాయలకు పాడుకున్నామని అటువంటి చెరువును దురాక్రమణ చేస్తున్నారని తెలిపారు. మూడు చెరువుల్లో చేపలు పెంచుకుంటూ 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. చెరువు కొమ్మును తొలగించి ఆక్రమణదారుల పంటపొలాలకు నీరు మళ్లించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు. అధికారులు ఇటీవల నీటివనరులపై సర్వే నిర్వహించారు. కానీ ఎన్ని చెరువులు ఆక్రమణలో ఉన్నాయి, వాటివల్ల ఎంతమేర ఆయకట్టు భూమికి నష్టం వాటిల్లుతుందో పర్యవేక్షించలేదని బాధితులు ఆరోపించారు. మండలంలో 24 పంచాయతీల్లో 428 ఇరిగేటెడ్ చెరువులు ఉన్నట్లు సర్వేలో తేలింది. పరిశీలించి తగు చర్యలు తీసకుంటాం ఆక్రమణలో ఉండే చెరువులను పరిశీలిస్తాం. ఈ చెరువు ఇప్పటికే కబ్జా అయిందని గుర్తించాం. గట్టు కూడా వేయడం జరిగింది. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి పరిశీలిస్తాం. ఆక్రమణలు రుజువైతే చర్యలు తీసుకుంటాం. –రాణి అమ్మాజీ, తహసీల్దార్, బలిజిపేట