Kasturba school
-
కస్తూర్బా విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్
ఖలీల్‌వాడి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 120 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. సోమవారం రాత్రి స్కూల్లో అన్నం, పప్పు, వంకాయకూర వంట చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 11.30 గంటలకు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో పాఠశాల సిబ్బంది పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే 84 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భీమ్‌గల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 36 మందిలో 16 మంది విద్యార్థినుల పరిస్థితి అలాగే ఉండటంతో వారిని మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమ్‌గల్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 20 మంది విద్యార్థినులను మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాందీ హన్మంతు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం వంట సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. రాత్రి చేసిన వంటకాల షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. -
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్‌తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత
కౌటాల (సిర్పూర్): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్‌లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్‌కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
సాక్షి, నిర్మల్: సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్ సీన్ రిపీట్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. -
కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి.. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత
సాక్షి, నిజామాబాద్: గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థిని మృతిచెందింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోతు చంద్రు, లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దివ్య(14) గరిడేపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. విధుల్లో ఉన్న ఏఎన్ఎం ఇందిర, పీఈటీ ధనమ్మలు వెంటనే దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్లగా అప్పటికీ ఇంకా తెరువలేదు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే దివ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆదివారం సెలవు కావటంతో దివ్య తండ్రి చంద్రు పాఠశాలకు వచ్చి కుమార్తెని చూసి తన వెంట తెచ్చిన మిక్చర్(కారా) ఇచ్చి వెళ్లినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉదయం దివ్య తండ్రి తెచ్చిన మిక్చర్ తిన్న అనంతరం కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ కార్తీక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ఎంపీఓ లావణ్య పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దివ్య చనిపోయిన విషయంపై సిబ్బందిని, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. చదవండి: పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై కస్తూర్బా పాఠశాల నిర్వాహకురాలు శైలజ మాట్లాడుతూ.. దివ్య కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే హాస్టల్లో ఉన్న సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా తీయకపోవడంతో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు దివ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. -
దారుణం: కస్తూర్భ టీచర్‌పై భర్త కత్తి దాడి
సాక్షి, తూర్పు గోదావరి: తుని మండలం వి.కొత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్భా బాలికలో విద్యాలయంలో పనిచేస్తున్న జూవాలజీ టీచర్‌పై ఆమె కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. భర్త విచక్షణంగా దాడి చేయడంతో సదరు ఉపాధ్యాయురాలు మధురాక్షి తీవ్ర గయాలయ్యాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకుని గాయపడిన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ తగాదాలే దాడికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ప్రధాని మోదీని కలవడానికి వెళ్తున్నాం!
సాక్షి, దోమకొండ(నిజామాబాద్): ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఇద్దరు విద్యార్థినులు పాఠశాల నుంచి పారిపోయిన ఘటన దోమకొండ మండలం సీతారాంపల్లి శివారులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు.. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆదివారం వేకువజామున చున్నీల సహాయంతో పాఠశాల గోడ దూకి పారిపోయారు. విషయం ఆలస్యంగా గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే బీబీపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన విషయాన్ని కామారెడ్డి డీఎస్పీకి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి విద్యారి్థనుల కదలికలను గమనించారు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. చివరకు విద్యార్థినులు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. విద్యార్థుల్లో ఒకరిది రాజంపేట మండలం, మరొకరిది మాచారెడ్డి మండలం. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకొని పాఠశాల నుంచి తప్పించుకున్నట్లు పోలీసులకు చెప్పారు. వీరిలో ఒక విద్యార్థి టగ్ ఆఫ్ వార్ క్రీడలో జాతీయ క్రీడాకారిణి. ఆమె గతంలో జాతీయ స్థాయి క్రీడలకు ఢిల్లీ వెళ్లింది. అప్పుడు ప్రధానిని కలువలేకపోయానని, ఇ ప్పుడు కలిసి ఫొటో దిగుతామని తోటి విద్యార్థినులకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. విద్యార్థినులు తప్పిపొయిçన సంఘటన సంచలనంగా మారింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థినులు తప్పిపోయారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు కోరుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులను ఎస్పీ శ్వేత అభినందించారు. -
కస్తూర్బా పాఠశాలను సందర్శించిన మహ్మద్ ఇక్బాల్
సాక్షి, అనంతపురం : డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూల్ పిల్లల సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మహ్మద్ ఇక్బాల్ స్పందించారు. జిల్లాలోని హిందూపురం మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్ నగర్లో స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉంది. గురువారం డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో స్కూల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఈ సమస్య కాస్త మహ్మద్ ఇక్బాల్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే స్పందించారు. తక్షణమే డంపింగ్ యార్డును ప్రజావాసాలకు దూరంగా మార్చాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌ని ఫోన్లో కోరారు. సమస్య తీరేవరకూ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరారు. అలానే హిందూపురం మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి కంపూట్యర్లు, మైకులు అందజేశారు. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
భవనంపై నుంచి జారి పడిన విద్యార్థిని
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): కస్తూర్బా విద్యాలయంలోని ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో రెండంతస్తుల భవనంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైంది. మండల పరిధిలోని పాల్మాకులలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భవనంపై ఆరేసిన దుస్తులు తీయడానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడినట్లు టీచర్లు చెబుతుండగా.. సరిగా చదువుకోలేదని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని భవనంపై నుంచి దూకినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన బెల్లంకొండ మల్లేశ్, సునీత దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. వీరు చాదర్గుట్ట సమీపంలో బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు రేణుక పాల్మాకుల కస్తూర్బా పాఠశాలలో టెన్త్ చదువుతోంది. ఇటీవలే ఆమె త్రైమాసిక పరీక్షలు రాసింది. రేణుక గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ కాగా.. తరగతిలోని విద్యార్థులను గ్రూపులుగా విభజించి విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూపు లీడర్ చెప్పింది రేణుక వినకపోవడంతో ఉపాధ్యాయులు మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2న సాయంత్రం పాఠశాల ముగియగానే రేణుక భవనం రెండో అంతస్తు పైకి వెళ్లింది. అక్కడ దుస్తులు తీస్తుండగా.. జారి కింద పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కాలు, నడుముకు గాయాలయ్యాయి. ఆమెను శంషాబాద్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. కాలు విరగడంతో ఆపరేషన్ చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం అవసరమైన డబ్బులను పాఠశాల ఉపాధ్యాయులు సర్దినట్లు విద్యార్థిని తల్లి సునీత తెలిపారు. భవనంపై నుంచి జారిపడిందని ఫోన్ చేస్తే ఆస్పత్రికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా దాచారు. ప్రమాదవశాత్తు జరిగింది: ప్రిన్సిపాల్ భవనంపై నుంచి విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడిందని ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. ఇటీవల పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో కష్టపడి చదవాలని సూచించామని, దీంతో అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది ఉంటుందని చెప్పారు. -
బొట్టు వద్దు.. పూజ చేయొద్దు..
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఉన్న కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బొట్టు పెట్టుకోవద్దని, పూజలు చేయవద్దని చెప్పడంతో పాటు ఇతర మతాల ప్రార్థన చేయాలంటూ ప్రిన్సిపాల్ నిస్సీనిహారిక ఆంక్షలు విధిస్తుండగా.. సిబ్బంది చెప్పలేని మాటలతో హింసిస్తున్నారని వారు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ చెన్నకిష్టయ్య, డీఈఓ సోమిరెడ్డి పాఠశాలకు వచ్చి విచారించారు. విద్యార్థినుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని తేలడంతో ప్రిన్సిపాల్ నిస్సీనీహారిక, క్రాఫ్ట్ టీచర్ రుక్మిణి, ఇంగ్లిష్ టీచర్ సారా, వంట మనిషి జయమ్మ, వాచ్‌మన్ యాదమ్మను డీఈవో సస్పెండ్‌చేశారు. -
పాఠశాల ఆవరణలోనే కాపురం
♦ కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్వాకం ♦ సర్వశిక్ష అభియాన్ అధికారుల తనిఖీలో బట్టబయలు ♦ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రాజుపాలెం(సత్తెనపల్లి): రాజుపాలెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురం ఉంటున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభయాన్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు. తెలుగు ఉపాధ్యాయిని అమృతవాణి, ప్రస్తుత ఇన్చార్జి, లెక్కల ఉపాధ్యాయిని నాగరాజకుమారి, ఏఎన్ఎం సుమన్, డే వాచ్మెన్ నాగమణి కొంత కాలం నుంచి పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురముంటున్నారని ముందస్తు సమాచారం అందడంతో ఆయన, సిబ్బందితో కలసి బుధవారం పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఎంఈవో మల్లికార్జునశర్మను ఫోన్ చేసి పాఠశాలకు రప్పించారు. ఆ నలుగురి కుటుంబాలు పాఠశాల ఆవరణలో కాపురముంటున్నట్టు నిర్థారణ కావడంతో ఆ నలుగురిపై ఎంఈవో సమక్షంలో ఎస్ఐ రమేష్‌కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పరిశీలించి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ తెలిపారు. నీళ్ల మజ్జిగ..నీళ్ల పప్పుచారు... సర్వశిక్ష అభయాన్ బృందం పాఠశాలలో భోజనాన్ని పరిశీలించింది. పప్పుచారు, మజ్జిగ నీళ్లలా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విచారణలో తేలడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రికార్డులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. -
పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవు
వేముల : కస్తూర్బా పాఠశాలలో వర్గాలుగా ఏర్పడి విద్యార్థినుల చదువుతో ఆడుకోవద్దని, ఇకపై పద్ధతి మార్చుకుని బోధనపై దృష్టి పెట్టాలని గర్ల్ చైల్డ్ డెవెలప్మెంట్ ఆఫీసర్(జీసీడీవో) ప్రమీల ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం సాక్షి దిన పత్రికలో ’కస్తూర్బా పాఠశాల ఘటనలో తప్పెవరిది’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ప్రమీల మంగళవారం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయినులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సిబ్బందిలో లుకలుకలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇకపై ఏ సంఘటనలు జరిగినా సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినుల చదువుతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని చెప్పారు. ఇన్చార్జి ఎస్‌వోగా హెప్సీబా : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఇన్చార్జి స్పెషలాఫీసర్‌గా హెప్సీబా నియమించినట్లు ప్రమీల తెలిపారు. పాఠశాలలో జరిగిన ఘటనతో ఇక్కడ ఎస్‌వోగా పనిచేస్తున్న ఉమాదేవిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హెప్సీబాను ఇన్చార్జి ఎస్‌వోగా నియమిస్తూ ఎస్ఎస్ఏ పీవో వెంకటసుబ్బయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఆమె తెలిపారు. -
‘కస్తూర్బా’ విద్యార్థినులకు జ్వరాలు
డోర్నకల్ : మండల కేం ద్రంలోని కస్తూర్బా పా ఠశాలలో పది మంది వి ద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. 9వ తరగతి విద్యార్థిను లు జి.స్రవంతి, వినిత, రమ్యకృష్ణ, వనిత, శ్రీదే వి, అరుణ, మయూరి, అఖిల, 10వ తరగతి చదువుతున్న బి.స్వరూ ప, 8వ తరగతి విద్యార్థిని అమల జ్వరాలతో బాదపడుతున్నారు. పాఠశాల ఏఎన్ఎం ఎలిజిబెత్ విద్యార్థినులను స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్ ఉపేందర్ వారిని పరీక్షించి సెలైన్ ఎక్కించారు. పాఠశాలలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడం, 9వ తరగతి బాలికలు పడుకునే గది పక్కనే సెప్టిక్ ట్యాంక్ ఉండటంతో దోమల బెడద పెరిగి బాలి కలు జ్వరాల బారిన పడినట్లు పాఠశాల సిబ్బం ది చెబుతున్నారు. పాఠశాలలో వృథా నీరు ప్రహరీ గోడ పక్కన ఉన్న పెద్ద గుంతలోకి చేరి నిల్వ ఉండటంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. పాఠశాల సిబ్బంది కూడా ఒకరిద్దరు జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. జ్వరం వచ్చిన బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇళ్లకు పంపుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల పరిసరాలను శుభ్రపరచాలని, వృథా నీటిని పాఠశాలకు దూరంగా పంపేలా చర్యలు చేపట్టాలని, దోమల మందు పిచికారి చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కస్తూర్బా విద్యార్థులకు అస్వస్థత
పుట్టపర్తి అర్బన్: మండలంలోని జగరాజుపల్లి గ్రామం వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. రాత్రి తొమ్మిది గంటలకు భోజనం వండిన తర్వాత చిన్న పిల్లలకు ముందుగా వడ్డిస్తుంటారు. ముందుగా భోజనం తిన్న సుమారు 20 మందికి కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. వెంటనే 108 వాహనంలో పిల్లలందరినీ పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు ప్రిన్సిపాల్ సౌజన్యకుమారి పేర్కొన్నారు. పది మంది విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మిగతా అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. -
గురుకుల పాఠశాలలకు రూ. 239 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కస్తూర్బా గాంధీ, మోడల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం రూ. 239 కోట్లు మంజూరు చేసింది. ఈ మూడు కేటగిరీల్లోని పాఠశాలల్లో చదువుతున్న 1,75,000 మంది బాల బాలికలకు హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సంరక్షణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయా సంస్థల అధికారులతో సమీక్ష అనంతరం కడియం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెం చేందుకు నిధులు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వివిధ నిర్వహణ సంస్థల కింద నడుస్తున్న కస్తూర్బా పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 26న వైస్ చాన్స్లర్ల సమావేశం నిర్వహించనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. -
అమ్మను చూడాలని వెళ్లా
రాయచోటి టౌన్ : వీరబల్లిలోని కస్తూర్బా పాఠశాల నుంచి గురువారం అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. అమ్మను చూడాలనే తాను తన స్నేహితురాలిని వెంట తీసుకుని తిరుమలకు వెళ్లానని ఉషారె డ్డి అనే బాలిక పేర్కొంది. శనివారం బాలికలను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వీరబల్లి మండలం గడికోట ఎడపల్లెకు చెందిన ఉషారెడ్డి వీరబల్లిలోని కస్తూ ర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కామేశ్వరి, నాగారెడ్డి. ఉషారెడ్డి జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అప్పటి నుంచి ఆ బాలిక తండ్రి వద్దే ఉంటోంది. తల్లి తిరుమలలో చిరుద్యోగం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తన తల్లిని చూడాలనే ఉద్దేశంతో తనతో పాటు చదువుకుంటున్న చార్మి అనే బాలికతో తిరుపతికి వెళ్లి వద్దామని చెప్పింది. దీంతో ఆ బాలిక తన వద్ద ఉన్న రూ.200 తీసుకుని మరో బాలిక ను వెంట తీసుకుని బయలు దేరింది. తొలుత వీరు తిరుపతికి కాకుండా నేరుగా బస్సులో కదిరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి తిరుపతి బస్సు ఎక్కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ బాలిక తన తాతకు కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్లి తిరిగి వస్తానని తన కోసం వెతక వద్దని చెప్పింది. ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలిపాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ బాలికలు తిరుపతిలో ఉన్నారని తెలుసుకుని వీరబల్లి ఎస్ఐ భక్తవత్సలం తన సిబ్బందితో కలసి తిరుపతికి వెళ్లి గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో ఆ బాలిక మళ్లీ ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్తున్నానని చెప్పింది. ఆ ఫోన్ నెంబర్ తిరుమలదని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో తిరుమలలో గాలిస్తుండగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరబల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులని తెలిసింది. దీం తో వారిని రాయచోటికి తీసుకొచ్చారు. అలాగే ఆ బాలిక తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్‌కు పిలిపించి బాలికను అప్పగించారు. మరో బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ తెలిపారు. -
స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్
శాయంపేట: కస్తూర్బా పాఠశాల ప్రారంభానికి స్పీకర్ వస్తున్నారన్న సమాచారం స్పెషలాఫీసర్ శనివారం విద్యార్థులతో మొరం పోయించారు. పాఠశాల ఆవరణను చదును చేయించారు. వరంగల్ జిల్లాలో శాయంపేటలోని కస్తూర్బా పాఠశాల లోపల, బయటి ఆవరణ వర్షపునీటితో మడుగులా తయారైంది. అయితే, భవనం ప్రారంభించేందుకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వస్తున్నారని తెలుసుకొన్న స్పెషల్ ఆఫీసర్ తన సొంత ఖర్చులతో సుమారు 40 ట్రాక్టర్ ట్రిప్పుల మొరం పోయించారు. లెవలింగ్ చేయించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరారు. -
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకి అస్వస్థత
మంచిర్యాల: ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని వారు కోరారు. -
పాఠశాలలో వికటించిన అల్పాహారం
ప్రకాశం: అల్పాహారం వికటించడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తిన్నప్పటి నుంచి పాఠశలలో ఏడో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కలుషితాహారం.. 15 మందికి అస్వస్థత
-
కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జెడ్పీ చైర్ పర్సన్
వరంగల్: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం సరిగ్గా ఉందా లేదా అని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. సాంబారులో ఎండిన కూరగాయలు, పుచ్చులు ఉండటంపై వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల పర్యవేక్షణ సరిగా లేనందుకు స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మీని మందలించారు. (ఏటూరునాగారం) -
కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన
మెనూ అమలుచేయాలని డిమాండ్ అల్పాహారం తినకుండా నిరసన ఏటీడబ్ల్యూవో హామీతో విరమణ పెదబయలు: వారం రోజులుగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదని స్థానిక కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. సుమారు 180 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు ధ్వజమెత్తారు. అల్పాహారాన్ని బహిష్కరించి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పాహారంగా చపాతి, వడ పెట్టాల్సి ఉండగా పొంగలి ముద్దలా ఉందని, సాయంత్రం ఇవ్వాల్సిన పండ్లు, మిఠాయి చాలా రోజులుగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నెల నుంచి కాస్తోటిక్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆదివారం పెట్టిన మాంసం ఒక్కో విద్యార్థికి 100 గ్రామాలు కేటాయించాల్సి ఉండగా, 50 గ్రాములు మాత్రమే పెడుతున్నారని ఆరోపించారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని వివరించారు. ఇప్పటికైనా పాఠశాల ప్రత్యేకాధికారి సుధారాణి, అధికారులు స్పందించి మెనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో 77 రోజుల ప్రణాళిక తీరు, పాఠశాల మౌలిక సదుపాయాలపై మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని పీవో ఆదేశించినా ఫలితం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థినుల ఆందోళన సమాచారం తెలుసుకున్న మండల ఉప గిరిజన సంక్షేమ అధికారి బి. సూర్యనారాయణ పాఠశాలకు వచ్చారు. విద్యార్థినుల ససమస్యలు తెలుసుకున్నారు. మెనూ అమలుచేయకపోవడంపై ప్రత్యేకాధికారి సుధారాణిపై మండిపడ్డారు. మెనూ అమలుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
‘కస్తూరిబా’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మధ్యలో చదువు మానేసిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా పాఠశాలలు ఆచరణలో చతికిలపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థినుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు ప్రత్యేకాధికారులు మెనూ పాటించకుండా డబ్బులు నొక్కేసి నాసిరకం భోజనం పెడుతున్న దాఖలాలున్నాయి. చాలాచోట్ల విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన నోట్ బుక్‌లు, ట్రంకు పెట్టెలతోపాటు యూనిఫాంలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పట్లు లేకపోవడంతో రాత్రి వేళ దోమలతో ఇబ్బందులు పడడమేకాదు చలికి వణికిపోతున్నారు. ఈ ఇక్కట్లపై ‘సాక్షి’ విజిట్ చేయగా పాఠశాలల డొల్లతనం బట్టబయలైంది. చినగంజాంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో మొత్తం 200 మంది బాలికలున్నారు. పాఠశాల చుట్టూ గోడ లేకపోవడంతో వారికి రక్షణ కరువైంది. మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం శివారులోని పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు మథనపడుతున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట పాఠశాల పక్కనే శ్మశానవాటిక ఉండటంతో విద్యార్థినులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు పాఠశాల ముందు భాగంలో శవాన్ని దింపే కార్యక్రమం నిర్వహిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పొన్నలూరు మండలం కె.అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలను పెద్ద గోడౌన్లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సామాన్లు పెట్టుకోవడంతోపాటు పాఠాలు కూడా అక్కడే వినాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 104 మంది ఉండగా మరుగుదొడ్లు రెండు మాత్రమే ఉన్నాయి. పీసీపల్లి కస్తూరిబా పాఠశాలకు ప్రహరీ లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెలిగండ్ల పాఠశాలలో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక రాత్రి పూట అనేక ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల బాలికలకు బోరింగ్ నీరే దిక్కు. బోర్లలోని ఫ్లోరైడ్ నీరు తాగలేక నానా అవస్థలు పడుతున్నారు. హనుమంతునిపాడు కస్తూరిబాలో బోరింగ్ నీరు తాగుతుండటంతో ఇటీవల కొందరు దురద, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని ఆట స్థలం కొండలు, గుట్టలతో నిండిపోయింది. తరగతి గదుల్లోనే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. = తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు విద్యార్థినులకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. పాఠశాల చుట్టూ ముళ్లపొదలు, చెత్తచెదారం ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బాలికలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఊరికి దూరంగా బీడు భూముల్లో పాఠశాల ఉండటం, ప్రహరీ మధ్యలో ఆగిపోవడంతో రాత్రి పూట బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిబా పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో తరచూ విష సర్పాలు లోపలికి వస్తున్నాయి. తాళ్లూరు పాఠశాలలో సరిపడినన్ని బెంచీలు లేకపోవడంతో బాలికలు నేలపై కూర్చొంటున్నారు. డార్మేటరీ పూర్తి కాకపోవడంతో డైనింగ్ హాల్, పెట్టెల మధ్యనే నిద్రిస్తున్నారు. కురిచేడు విద్యాలయానికి కంప్యూటర్లు అందజేసిన అధికారులు ఇన్స్ట్ట్రక్టర్ను నియమించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగావున్నాయి. రాచర్లలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో విద్యార్థినులు ఆరు బయట నిద్రించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాలల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అన్నంలో రాళ్లు, పురుగులు
గజపతినగరం: కస్తూరిబా పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మాటలు వట్టిమాటలుగానే తేలిపోతున్నాయి. దీనికి ఉదాహరణగా దత్తిరాజేరు మండలంలోని కస్తూరిబా పాఠశాలలో నాశిరకం బియ్యంతో ఉడకని అన్నం తినలేక విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను చెప్పుకోవచ్చు. ఇక్కడి విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. మంగళవారం రాత్రి విద్యాలయంలో నాసిరకం బియ్యంతో వండిన అన్నం తిని విద్యార్థినులు ఎ.సాయి, ఎన్. రుద్రమదేవి, కె. భారతి, కె.నాగమణి, జి.లీల, డి.రమ్య, ఎ.సరస్వతి, సి.హెచ్.సరస్వతి, ఐ.ఆదిలక్ష్మి, ఆర్.పావని, సి.హెచ్. సత్యవ తి, కె.ఆదిలక్ష్మి, టి.సూరితల్లి, జె.గౌరి, వి.కల్యాణి, జి. సాయిరమాదేవి, జి.రామలక్ష్మి, పి.సాయికుమారిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విద్యాలయం సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లి వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పటికీ గత కొన్ని రోజులుగా వండుతున్న బియ్యం బాగోలేవని తరచూ వాంతులు, కడుపునొప్పి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. బియ్యంలో తెల్లనిరాళ్లు, పురుగులు ఉంటున్నాయని వాటినే వండి పెట్టడంవల్ల అనారోగ్యానికి గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనిపై ప్రత్యేక అధికారిణి శ్రీదేవి వివరణ కోరగా నెలరోజుల క్రితమే తాను విధులకు వచ్చానని బియ్యంలో రాళ్లు, తెల్లని పురుగులు ఉన్నాయని వాటిని తిరిగి పంపించడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. విషయాన్ని ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని తెలిపారు. ఇటువం టి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
కలుషిత ఆహారంతో బాలికలకు అస్వస్థత
కుల్కచర్ల: కలుషిత ఆహారం తినడంతో ‘కస్తూర్బా’ పాఠశాలలోని 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన కుల్కచర్లలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం పరిగి-మహబూబ్‌నగర్ రహదారిపై బైఠాయించారు. వివరాలు.. కుల్కచర్లలోని ‘కస్తూర్బా’ పాఠశాలలో 198 మంది బాలికలు చదవుకుంటున్నారు. భోజనం సరిగా లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని కొంతకాలంగా బాలికలు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాయకులు, మూడు రోజుల క్రితం తహసీల్దార్, ఎంఈఓ తదితరులు పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వంటవారిని హెచ్చరించి వెళ్లారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి సిబ్బంది అన్నంతో పాటు తోటకూర చారు చేసి విద్యార్థులకు వడ్డించారు. అర్ధరాత్రి బాలికలు రాధిక(6వ తరగతి), భారతి (6వ), సురేఖ (9 వ), జయమ్మ (10 వ), లక్ష్మి (9వ), అనూష (9వ), మనూష (7 వ), రాధ, సుష్మ(8వ తరగతి)లకు కడుపునొప్పి, తీవ్ర జ్వరం వచ్చింది. పాఠశాలలోని ఏఎన్ఎం లక్ష్మి బాలికలకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం వరకు సదరు విద్యార్థులతో పాటు మొత్తం సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుల్కచర్ల పీహెచ్సీ నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఐదు మందిని కుల్కచర్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి స్కూల్లో సెలైన్లు పెట్టి చికిత్స చేశారు. కాగా అన్నంలో సొడా, సున్నం కలపడంతో తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు. కాగా మంగళవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థులకు మంచినీరు సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్‌లో పూర్తిగా నాచుపేరకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాధ్యులపై చర్యలు.. విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి దశరథ్‌నాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయనతో పాటు జిల్లా డీటీడబ్ల్యూఓ అధికారి శివప్రసాద్ తదితరులు కస్తూర్బా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా సరిగా తిండి లేదని విద్యార్థులు ఆయనతో చెప్పారు. కుక్‌లను తొలగించి కొత్తవారిని ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రమాదం ఏమి లేదు.. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఎవరికీ ఏ ప్రమాదం లేదు. బాలికలు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండి చికిత్స చేస్తాం. అందరికి మందులు ఇస్తున్నాం. సాయిలక్ష్మి, వైద్యురాలు కుల్కచర్ల పీహెచ్సీ అన్నం తిన్న గంట తర్వాతి నుంచి.. మంగళవారం రాత్రి అన్నం, చారు తిన్నాం. కొద్దిసేపు చదువుకున్నాం. గంట తర్వాత కడుపునొప్పి వచ్చింది. జ్వరం కూడా వచ్చింది. అసలేం జరిగిందో తెలియదు. కవిత, 10 తరగతి నాలుగు రోజులుగా సరిగా తిండిలేదు. నాలుగు రోజులుగా పాఠశాలలో సక్రమంగా తిండిలేదు. అ న్నం సరిగా వండడం లేదు. మంగళవారం రాత్రి అన్నంలో సొడా, సున్నం వేశారు. భోజనం చేసేట ప్పుడు వాసన వచ్చింది. అందుకే కొంచమే తిన్నాం. కోమలి, 9వ తరగతి