Kia India
-
నాలుగేళ్లలో.. ఈ కారును 4.5 లక్షల మంది కొనేశారు
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి. -
300 నగరాల్లో కియా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కియా ఇండియా విక్రయ, సర్విస్ కేంద్రాలను విస్తరిస్తోంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా డిసెంబర్‌కల్లా 300 నగరాలు, పట్టణాల్లో అడుగు పెట్టడం ద్వారా టచ్ పాయింట్స్ సంఖ్యను 700లకు చేరుస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 236 నగరాలు, పట్టణాల్లో కంపెనీకి 522 సేల్స్, సర్విస్ సెంటర్స్ ఉన్నాయి. -
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
అదరగొట్టిన కియా.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో 2019 ఆగస్ట్ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్ మోడల్ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం. -
కియా దూకుడు.. ఏపీ కియా ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ కియా.. భారత మార్కెట్లో 2025 నాటికి మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయని కియా ఇండియా ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్ మంగళవారం వెల్లడించారు. సెల్టోస్ అప్డేటెడ్ వెర్షన్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కియా 2.0 వ్యూహంలో భాగంగా సమీప భవిష్యత్తులో భారత ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో కంపెనీ వాటాను 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కియాకు సుమారు 7% వాటా ఉందన్నారు. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 20%కి చేరుతుందని అంచనా వేశారు. అనంతపురం ప్లాంటులో: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన భారత్ విషయంలో దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు టే–జిన్ పార్క్ తెలిపారు. ‘ఇక్కడి వృద్ధి తీరుకు అనుగుణంగా వాటాను పెంచుకోవాలంటే కంపెనీ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న మోడళ్లు సరిపోవు. అందుకే కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాం. కొత్తగా వచ్చే మూడు మోడళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కియా అభివృద్ధి చేసిన రీక్రియేషనల్ (వినోద) వెహికల్స్. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో వీటిని అసెంబుల్ చేస్తాం’ అని వివరించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఏడాది వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.5 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది ఏడాదికి 4.3 లక్షల యూనిట్లకు చేరుకోగలదని అన్నారు. డిమాండ్ బలంగా కొనసాగితే అనంతపురం ప్లాంటులో కొత్త లైన్ ఏర్పాటును కియా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లు.. భారత్‌లో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగవంతం అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే యూరప్ మార్కెట్లా కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) కూడిన వాహనాలు మరో 10–15 సంవత్సరాల పాటు ఇక్కడ కొనసాగుతాయని పార్క్ అన్నారు. డీజిల్ మోడళ్లు సైతం..: డిమాండ్ కొనసాగుతున్నందున దేశంలో డీజిల్ వాహనాల విక్రయాన్ని కొనసాగిస్తామని కంపెనీ ఎండీ తెలిపారు. ఉద్గార నిబంధనలు కఠినతరం అయితే హైబ్రిడ్, ఇతర సాంకేతికతలను పరిగణిస్తామని వివరించారు. కాగా, కంపెనీ భారత మార్కెట్‌పై దృష్టి సారించడంతో ఎగుమతులు మొత్తం ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 25 నుండి 20%కి తగ్గవచ్చని అన్నారు. -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్: కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కియా సోనెట్ సిఎన్జి: ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) కియా కారెన్స్ 5 సీటర్: సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. న్యూ జనరేషన్ కార్నివాల్: 2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్ ఇండియా, హోండా కార్స్ తెలిపాయి. -
71 వేల కార్స్ ను రీకాల్ చేసిన కియా ..
-
ఎయిర్బాగ్స్ సమస్య: కియా కార్ల భారీ రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల కంపెనీ కియా తన పాపులర్ మోడల్ కియా కేరెన్స్ కార్లను భారీగా రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా దాదాపు 44,174 ఎంపీవీ యూనిట్లు రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను పరిశీలించనుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్న కియా కేరెన్స్ కార్ల స్వచ్ఛంద రీకాల్‌లో అవసరమైతే సాఫ్ట్వేర్ అప్డేట్తో ఎయిర్‌బ్యాగ్ సమస్యను కంపెనీ పరిష్కరించ నుంది. ఇందులో భాగంగా ప్రభావితమైన కారు యజమానులను నేరుగా సంప్రదిస్తుంది. లేదంటే సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కియా కేరెన్స్ యజమానులు తమ కారును సమీపంలోని కియా డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా కియా ఇండియా వెబ్సైట్, యాప్ లేదా వారి కాల్ సెంటర్లో గానీ సంప్రదించవచ్చు. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) కాగా గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కియా కేరెన్స్ 3-స్టార్ ర్యాంక్ సాధించింది.1.5 పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8-స్పీకర్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే 5 ట్రిమ్‌లలో ఇది లభ్యం. అన్నింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు కూడా అందింస్తున్న సంగతి తెలిసిందే. (జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్) -
అత్యంత సంతృప్తి చెందిన డీలర్ల జాబితా విడుదల..అగ్రస్థానంలో కియా ఇండియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సాధ్యాసాధ్యాలు, న్యాయమైన వ్యాపార విధానం విషయంలో వాహన తయారీదారుల నుండి డీలర్లు అధిక పారదర్శకతను ఆశిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కంపెనీల విధాన రూపకల్పనలో డీలర్లనూ భాగస్వాములను చేయాలని ఫెడరేషన్ ప్రధానంగా ఆశిస్తోంది. ద్విచక్ర వాహనాల విషయంలో మిగిలిపోయిన సరుకు, అమ్మకాలపై మార్జిన్స్ పట్ల డీలర్లు ఆందోళనగా ఉన్నారు. వ్యాపారంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నందున తయారీ సంస్థలు దీనిపై దృష్టిసారించాలని పరిశ్రమ కోరుతోంది. ఉత్పత్తి విశ్వసనీయత, కస్టమర్లకు అందించే మోడళ్లతో డీలర్లు సంతోషంగా ఉన్నారు. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో విడిభాగాల డెలివరీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు, డెలివరీ, విక్రయానంతర సేవల్లో తయారీ కంపెనీల శ్రమను స్వాగతిస్తున్నట్టు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. కియా ఇండియా అగ్రస్థానం.. డీలర్ల సంతృప్తిపై 2022 అధ్యయనాన్ని ఫెడరేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అత్యంత సంతృప్తి చెందిన డీలర్ల జాబితాలో కార్ల విభాగంలో కియా ఇండియా అగ్రస్థానంలో ఉంది. హ్యుండై మోటార్ ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా వరుసగా ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. వాహన తయారీ దగ్గజం మారుతీ సుజుకీ ఎనమిదవ స్థానంలో నిలిచింది. టూ వీలర్స్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ వరుసగా మూడు స్థానాలను చేజిక్కించుకున్నాయి. వాణిజ్య వాహన విభాగంలో వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ తొలి స్థానంలో ఉంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి. -
కియా మరోసారి అదరగొట్టింది: సెల్టోస్ కొత్త రికార్డు
అనంతపురం: కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ దేశీయంగా ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్లు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. అలాగే భారత్ నుంచి 1,03,033 యూనిట్లు ఎగుమతి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో కియా విక్రయాలు మొదలైన నాటి నుంచి దేశంలో 5 లక్షల యూనిట్ల కీలక మైలురాయిని ఇటీవల దాటేసింది. ఇందులో 60 శాతం వాటా సెల్టోస్ కార్లదే కావడం విశేషం. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! కియా బ్రాండ్ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాతి తొలి ప్రొడక్షన్ సెల్టోస్. డిజైన్, ఫీచర్లు, భద్రత, ఇతర అంశాల కారణంగా ఈ కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈసెగ్మెంట్లో ఆరు-ఎయిర్‌బ్యాగ్‌లను వేరియంట్లలో ప్రామాణికంగా అందిస్తున్న ఏకైక కారు. సెల్టోస్ కియా సెల్టోస్ ఎగుమతి మార్కెట్ కూడా బలంగా ఉంది. ఈ కారు 91 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతోంది. చదవండి: ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
కియా ఇండియా కీలక ప్రకటన.. ఇకపై సెల్టోస్ కార్లలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది. భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. -
మరోసారి, కార్ల ధరల్ని భారీగా పెంచిన కియా!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా కార్ల ధరల్ని భారీగా పెంచింది. సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల ధరల్ని ఒకే సారి రూ.34వేలు పెంచింది. ఈ ఏడాది క్యూ1 ఫలితాల సందర్భంగా జనవరిలో కార్ల ధరల్ని పెంచిన కియా ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కియా సోనెట్ సిరీస్‌లో హెచ్‌టీఈ,హెచ్టీకే, హెచ్టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్,జీటీఎక్స్ప్లస్తో పాటు ఇతర యానివర్సరీ ఎడిషన్ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌టీఈ 1.2 పెట్రోల్ వేరియంట్ కార్ల ధరల్ని అత్యధికంగా రూ.34వేలకు పెంచింది. ఇతర వేరియంట్లపై రూ.10వేలు, రూ.16వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్లలో అదిరిపోయే ఫీచర్లు కియా ఇండియా మై2022పేరుతో సోనెట్ వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కార్లలో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ స్టేబులిటీ కంట్రోల్ ఫీచర్లను అప్డేట్ చేసింది. ఇంపీరియల్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్విర్ కలర్ ఆప్షన్‌తో న్యూ బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. ఇక ఈ కియా సోనెట్‌లో మొత్తం మూడు ఇంజిన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి 1.2లీటర్ల నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0లిటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సౌకర్యం ఉండగా.. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఐఎంటీ, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ వంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. -
సరికొత్త రికార్డ్..దుమ్మురేపుతున్న కియా కార్ల అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా గడిచిన మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని అధిగమించింది. తక్కువ కాలంలో ఈ ఘనతను సాధించిన కార్ల తయారీ కంపెనీ తామేనని కియా వెల్లడించింది. అలాగే గడిచిన నాలుగున్నర నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఎగుమతులతో కలిపి ఈ మూడేళ్లలో కంపెనీ 6,34,224 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సెల్టోస్ మోడల్‌దే ప్రధాన వాటాగా ఉంది. అంతర్జాతీయంగా కియా మొత్తం అమ్మకాల్లో భారత వాటా 6 శాతానికి పైగా ఎగసింది. ‘భారత్‌లో మూడేళ్లలో ట్రెండ్ సృష్టించాం. స్పూర్తిదాయక బ్రాండ్‌గా స్థిరపడటమేగాక నూతన సాంకేతికతలను స్వీకరించడంలో సైతం నాయకత్వం వహించాం’ అని కియా ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 339 నుంచి డిసెంబర్ నాటికి 400లకు చేర్చనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో కియా తయారీ కేంద్రం ఉంది. -
సోనెట్ జాదూ ‘కియా’ దూకుడు మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా భారతీయ అనుబంధ సంస్థ కియా ఇండియా విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇండియాలో వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధిని సాధించింది. 2022, మే నెలలోనే 18,718 యూనిట్లను విక్రయించింది కియా ఇండియా. ఏప్రిల్ నెలలో 19,019 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఈ ఏడాదిలో మే నెలకు సంబంధించిన గణాంకాలను బుధవారం విడుదల చేసింది. తాజా రికార్డు అమ్మకాలతో దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్‌మేకర్ ఘనతను దక్కిచుకుంది. ఈ విక్రయాల్లో అత్యధికంగా అమ్ముడు పోయిన కారుగా సోనెట్ నిలిచింది. 7,899 యూనిట్లను, సెల్టోస్ 5,953 , కేరెన్స్ 4,612 , కార్నివాల్ 239 యూనిట్లను విక్రయించింది. కాగా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీకార్ల సెగ్మెంట్లో 15 పూర్తి-ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పూర్తి-ఎలక్ట్రిక్, కియా ఈవీ6 మోడల్‌ను పరిచయం చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీబుకింగ్స్ ( మే 26, 2022) ఇండియాలో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 97,796 యూనిట్లను విక్రయించింది.ఇది 19 శాతం పెరుగుదల. ముఖ్యంగా సోనెట్ లాంచ్ తర్వాత మొదటిసారిగా 1.5 లక్షల అమ్మకాలను సాధించిన సంస్థ గత నెలలో 4.5 లక్షల దేశీయ విక్రయాల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ప్రస్తుతం దేశంలో ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ బ్రాండ్‌గా నిలిచింది కియా ఇండియా. అనేక సవాళ్ల మధ్య అమ్మకాల జోరును కొనసాగించడం సంతోషంగా ఉందని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. రికార్డు టైంలో 4.5 లక్షల అమ్మకాలను సాధించాం. కియా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్ల విశ్వాసాన్ని తెలియజేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఎలక్ట్రిక్ కియా.. ఆగయా: నటి క్యాథెరిన్, జానీ మాస్టర్ సందడి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్ల కంపెనీ కియా సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం తొలిసారిగా మార్కెట్ లోకి వస్తోంది. త్వరలో వినియోగదారుల కు అందుబాటులో కి రానున్న ఈ కార్ ని హైదరాబాద్ లో ప్రదర్శించారు. · హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటి క్యాథెరిన్, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్ ; షోరూమ్ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ, జీఎం వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్ కియా, హైటెక్ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 3లక్షల రూపాయల టోకెన్ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్ చేసుకో వచ్చు. దేశవ్యాప్తంగా 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేకతలివీ... ఈ కియా ఈవీ6ను ఈ–జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్లో 77.4 కిలోవాట్ హవర్ లిథయం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్ విద్యుత్ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్లో 325పీఎస్ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్రైవర్, ప్యాసెంజర్ రిలాక్సేషన్ సీట్లు, రిమోట్ ఫోల్డింగ్ సీట్లు, ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం మూన్‌స్కేప్, స్నో వైట్ పెరల్, రన్‌వే రెడ్, అరోరా బ్లాక్ పెరల్, యాచ్ బ్లూ –రంగుల లో లభిస్తుంది. -
వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. బుకింగ్స్ ప్రారంభం..! భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కొద్ది రోజుల్లోనే లాంచ్ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్ ఆవిష్కరించింది. సూపర్ ఫీచర్స్‌తో..! కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్ఎల్స్తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది. Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే..! అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..! -
కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే
ఇండియన్ రోడ్లపై హల్చల్ చేస్తోన్న సెల్టోస్, సొనెట్ మోడల్ కార్లకు కియా సంస్థ మెరుగులద్దింది. సరికొత్త ఫీచర్లు జోడించి రిఫ్రెషెడ్ వెర్షన్ పేరుతో మార్కెట్లో రిలీజ్ చేసింది. అనతి కాలంలోనే కియా సంస్థ ఇండియన్ మార్కెట్లో పాగా వేయగలిగింది. ముఖ్యంగా కియా సంస్థ నుంచి వచ్చిన సెల్టోస్, సొనేటా మోడళ్లు ఇక్కడి వారికి బాగా నచ్చాయి. గడిచిన మూడేళ్లలో ఇండియాలో బాగా సక్సెస్ అయిన మోడళ్లలో సెల్టోస్ ఒకటి. అమ్మకాల్లో ఈ కారు రికార్డు సృష్టిస్తోంది. వెయింటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. తాజాగా రీఫ్రెష్ చేసిన తర్వాత సెల్టోస్‌లో కొత్తగా 13 ఫీచర్లు, సొనెట్‌లో అయితే 9 రకాల మార్పులు చేసినట్టు కియా పేర్కొంది. కియా సంస్థ సెల్టోస్, సొనెట్ కార్లలో చేసిన కీలక మార్పుల్లో ఎంట్రీ లెవల్ హై ఎండ్ అనే తేడా లేకుండా అన్ని వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగ్స్ అందించనుంది. కియా కనెక్ట్ యాప్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. డీజిల్ వెర్షన్ కార్లలో కూడా ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని పరిచయం చేసింది. కియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ మోడలైన సెల్టోస్ ప్రారంభం ధర రూ.10.19 లక్షల దగ్గర మొదలవుతోంది. సోనెట్ ప్రారంభ ధర రూ.7.15 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు 2.67 లక్షల సెల్టోస్ , 1.25 లక్షల సొనెట్ కార్లు ఇండియాలో అమ్ముడయ్యాయి. చదవండి: Kia Motors: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..! -
కియా ఇండియా షాకింగ్ నిర్ణయం..!
Kia Car Price Hike: భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఆనతి కాలంలో భారీగా ఆదరణను పొందింది కియా మోటార్స్. కాగా తాజాగా కొనుగోలు దారులకు షాక్ ఇస్తూ కార్ల ధరలను పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తోందని కియా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లలోకి సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్, కియా సెల్టోస్, సోనెట్, కార్నివాల్ ధరలు భారీగా పెరగనున్నాయి. సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..! భారత మార్కెట్లలోకి కియా కారెన్స్ ఎంపీవీ వాహనాన్ని కియా ఇండియా లాంచ్ చేసింది. కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. వీటిపై రూ.70,000 వరకు ధరలను కియా ఇండియా పెంచింది. ఆయా ట్రిమ్స్ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన ప్రీమియం 7-సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన లగ్జరీ+ 7-సీటర్ ధర వరుసగా రూ. 40,000, రూ. 70,000 వరకు పెరిగింది. కియా సెల్టోస్ ధరలు కూడా రూ. 10,000 నుంచి రూ. 36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ GTX+ 1.4 మాన్యువల్ ధర రూ. 10,000 పెరిగింది. సెల్టోస్ HTX+ 1.5 మాన్యువల్, iMT ట్రిమ్స్ ధరలు రూ. 36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజిల్ మోడల్స్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలలో రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్ సోనెట్ హెచ్టిఎక్స్ 1.0 మోడల్ ధర గణనీయంగా రూ. 30,000 వరకు పెరిగింది. కియా సోనెట్ HTX 1.5 డీజిల్ వెర్షన్ ఇప్పుడు GTX 1.5 మాన్యువల్ వెర్షన్ కంటే రూ. 30,000 ఖరీదైనది. కియా కార్నివాల్ ధరలను రూ. 50,000 పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.... ఇప్పుడు ఈ కారు రూ.29.99 లక్షలకు లభించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..? -
హాట్‌కేకుల్లా బుక్కైన కియా నయా కార్..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం..
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారత మార్కెట్లలో సరికొత్త మోడల్స్‌తో అదరగొడుతోంది.గత నెలలో కియా భారత్‌లోకి కియా ఎంపీవీ వెహికిల్ కియా కారెన్స్‌ను లాంచ్ చేసింది.జనవరి 14, 2022న కియా కారెన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమవ్వగా.. కేవలం రెండు నెలల్లోనే 50,000 బుకింగ్‌లను దాటినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ బుకింగ్స్‌లో ఎక్కువగా టైర్-1, టైర్-2 నగరాల్లోనే 60 శాతం పైగా బుకింగ్స్ జరిగాయి. దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్లను కొనేవారిలో 45 శాతం మంది కియా కారెన్స్ తొలి ఎంపికగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. సమానంగా డిమాండ్..! కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకూ డిమాండ్ సమానంగా ఉందని కియా ఇండియా తెలియజేసింది. దాదాపు 50 శాతం మంది వినియోగదారులు డీజిల్ వేరియంట్లను బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కియా కారెన్స్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 30% మంది కస్టమర్లను మాత్రమే ఆకర్షించగలిగింది. కారెన్స్ మాన్యువల్ ట్రిమ్‌ల వేరియంట్స్ ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. ఫిబ్రవరిలో, కియా ఇండియా ప్రారంభించిన 13 రోజుల్లోనే 5,300 కారెన్స్ కార్లను విక్రయించింది. కియా కారెన్స్ కేవలం రెండు నెలల కంటే తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయి సాధించడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ..‘ఫ్యామిలీ మూవర్ కార్ల సెగ్మెంట్లో మునుపెన్నడూ లేని విధంగా కియా కారెన్స్ రికార్డు సృష్టించింది. ఇది మా ఇతర ఎస్‌యూవీల వలే అతి తక్కువ కాలంలోనే భారీ బుకింగ్స్‌ను సాధించింది. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..! -
కియా డేరింగ్ స్టెప్.. ఇక నో వెయిటింగ్
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో మూడవ షిఫ్ట్ ప్రారంభించింది. దీంతో 3 లక్షల యూనిట్ల పూర్తి వార్షిక సామర్థ్యానికి ఉత్పత్తిని పెంచింది. 2019 ఆగస్ట్‌లో ఈ ప్లాంటులో కార్ల తయారీ మొదలైంది. ఇప్పటి వరకు కంపెనీ దేశీయంగా నాలుగు లక్షల కార్లను విక్రయించింది. అలాగే మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్ వంటి 91 దేశాలకు ఒక లక్ష కార్లను ఎగుమతి చేసింది. కియా కార్లపై వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ నేపథ్యంలో.. వనరులను సమకూర్చుకున్నామని, అదనపు సిబ్బందిని నియమించామని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా కియాకు భారత్ వ్యూహాత్మక మార్కెట్. మా ఉత్పత్తులన్నింటికీ ఇక్కడ అద్భుతమైన స్పందన లభించింది’ అని అన్నారు. చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్ కొత్త రికార్డ్ -
వారెవ్వా కియా! రికార్డు సృష్టించిన అనంత ప్లాంట్.. తక్కువ వ్యవధిలోనే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్ నుంచి 5 లక్షలకుపైగా యూనిట్లను భారత్‌తోపాటు విదేశాలకు సరఫరా చేసింది. దేశీయంగా 4 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. లక్షలకుపైగా కార్లను 91 దేశాలకు ఎగుమతి చేసింది. 2019 సెపె్టంబర్లో అనంతపూర్ ప్లాంట్ నుంచి సెల్టోస్ కార్ల ఎగుమతి ప్రారంభమైంది. భారత్ నుంచి విదేశాలకు యుటిలిటీ వాహనాలను అధికంగా సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా.. గతేడాది ఎగుమతుల్లో 25 శాతంపైగా వాటాను దక్కించుకుంది. ‘అయిదు లక్షల యూనిట్లు అనేది పెద్ద సంఖ్య. 29 నెలల్లోపే ఈ మైలురాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాం. భారత్‌లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండీ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల ద్వారా కస్టమర్లకు గొప్ప విలువను అందించడంపై దృష్టి సారించాం. నాలుగు లక్షల భారతీయ కుటుంబాలలో భాగమయ్యాం. వినియోగదార్లు మాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కొత్త కారు కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోగలం. కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడం ద్వారా దేశంలో వృద్ధి ప్రయాణంలో ఈ కారు మార్గనిర్దేశం చేస్తుంది’ అని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. -
కియా ఇండియా కీలక నిర్ణయం..ఆ మోడల్స్ పూర్తిగా నిలిపివేత..!
సౌత్ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన పలు కార్ల వేరియంట్లను భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వేరియంట్స్ కనిపించవ్...! ఇండియాలో ప్రజాదరణ పొందిన సెల్టోస్ SUV, కార్నివాల్ MPV కార్లకు చెందిన పలు వేరియంట్లను భారతదేశంలో నిలిపివేయాలని కియా నిర్ణయించుకుంది. సెల్టోస్ SUV రేంజ్ లోని మిడ్-రేంజ్ HTK+ డీజిల్-ఆటోమేటిక్ ట్రిమ్, ఏడు సీట్ల ప్రీమియం MPV కార్నివాల్ బేస్ వేరియంట్‌ను కంపెనీ ఉపసంహరించుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణాలను కియా ఇండియా వెల్లడించలేదు. తక్కువ డిమాండ్... ఇండియాలో ఆయా వెరియంట్లకు తక్కువ డిమాండ్ ఉన్నందున కంపెనీ ఉపసంహరించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కార్ల కోసం డీలర్ల నుంచి బుకింగ్‌లు తీసుకోవడానికి కియా ఇండియా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. వాటి బదులుగా.. కియా సెల్టోస్ HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కియా కార్నివాల్ బేస్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ రూ. 25.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. కాగా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు GTX+ ఆటోమేటిక్ వేరియంట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది., దీని ధర రూ.17.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ వేరియంట్ కంటే రూ. 3.7 లక్షలు ఎక్కువ. కార్నివాల్ MPV కొత్త బేస్ వేరియంట్ ఇప్పుడు ప్రెస్టీజ్ ట్రిమ్ సెవెన్-సీటర్ యూనిట్, దీని ధర రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ల కంటే రూ.4.5 లక్షలు ఎక్కువ. -
వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత మార్కెట్లలోకి సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) కియా కరెన్స్‌ను లాంచ్ చేసింది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో క్రేజీ లుక్స్‌తో..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.5-అంగుళాల డిజటల్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ల బాస్ సౌండ్ సిస్టమ్ 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. సెఫ్టీ విషయంలో రాజీ లేకుండా..! కియా కరెన్స్ కారులో భద్రత విషయంలో ఎక్కడ తగ్గకుండా పలు జాగ్రత్తలను కియా తీసుకుంది. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ఓవర్ మిటిగేషన్, హిల్ అసిస్ట్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్‌తో రానుంది. జియోఫెన్సింగ్, లైవ్ వెహికిల్ స్టాటస్ అండ్ ట్రాకింగ్, క్లైమట్ కంట్రోల్ ఆపరేషన్‌తో రానుంది. దాంతోపాటుగా స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ఫ్యూరిఫైయర్ సిస్టమ్‌ను కల్గి ఉంది. దీని సహాయంతో వైరస్, బాక్టీరియా నుంచి ప్రయాణికులను కాపాడుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: హోండా బంపరాఫర్..! ఆ బైక్‌పై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..!