Kodi Ramakrishna
-
కోడి రామకృష్ణ తల'కట్టు' వెనుక కారణం ఇదే..!
-
సినిమా కోసం భానుమతి గారి ఇంటికి వెళ్లే కానీ ..!
-
కోడి రామకృష్ణ తన జన్మస్థలం గురించి గొప్ప మాటలు
-
తండ్రి చనిపోయిన చూడడానికి పోలేదు నేను ఎందుకంటే : కోడి రామకృష్ణ
-
సినిమాలో ఆసక్తి విషయాలు చెప్పిన కోడి రామకృష్ణ
-
చిరంజీవి, ఎన్టీఆర్ గురించి దర్శకుడు కోడి రామకృష్ణ
-
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
ఘనంగా కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్.. సుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం
కోడిరామకృష్ణ.. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించారు. లెజండరీ దర్శకుడు కోడిరామకృష్ణ జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్, బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను అందజేశారు. హీరో సుమన్‌కు కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. 'నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను' అని అన్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. 'మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు. అయితే అయన లేకున్నా ఆయనతో ఏ విధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియజేయాలని అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తున్న రామ సత్యనారాయణ గ్రేట్' అని పేర్కొన్నారు. నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా ఉన్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమయ్యాను. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చిదిద్దారు. యం.యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ' అని తెలిపారు. -
అందుకే డైరెక్షన్ చేయకూడదనుకున్నాను: కోడి రామకృష్ణ కూతురు
‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు. -
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
టాలీవుడ్లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే..
లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. KODI RAMAKRISHNA presents ! Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥 A #ManiSharma Musical 🎹 Directed by #KaarthikShankar 🎬 pic.twitter.com/dgfnUkrFRg — Haricharan Pudipeddi (@pudiharicharan) July 15, 2021 -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
కోడి రామకృష్ణ కుమార్తె వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు
-
గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
-
గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు. -
దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే
కాగితం కంటే పల్చగా.. నాన్‌స్టిక్ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్ క్యాంటీన్లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. ఇలా కాలుస్తారు.. ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. వారంతా రుచిచూశారు.. పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే. నిత్యం 500 రొట్టెలకు పైనే.. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ కావడం వల్ల ఈ క్యాంటీన్‌కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు. ఆరు దశాబ్దాల చరిత్ర మారుతి థియేటర్ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్‌ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం. – మట్టా విజయభాస్కర్, క్యాంటీన్ యజమాని -
కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్ధ వేడుక
-
కోడి–సినీమా జీవనాడి
కోడి రామకృష్ణతో నా జ్ఞాపకాలు బహుశా అనితర సాధ్యమైనవి. కోడి నా దగ్గరికి వచ్చేనాటికి (1981) హైస్కూలు ఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలాగ ఉండేవాడు (ఫొటో). ‘ఇతనా కొత్త దర్శకుడు!’ అని మనసు కాస్సేపు శంకించిన మాట వాస్తవం. చాలా మొహ మాటస్తుడు. ఎప్పుడూ ఎవరినీ నొప్పించని మన స్తత్వం. అలాంటి ఆలోచన వస్తే తనే అక్కడి నుంచి తొలగిపోతాడు. ఆ రోజుల్లో నాకు బోలెడంత తీరిక. కొన్ని నెలలపాటు పొద్దున్నే వచ్చి రాత్రి నేను అమృతం సేవించి భోజనం చేసేదాకా కూర్చునేవాడు. ఏం చేసేవాడు? ఏదో చేసేవాడు– పిల్లలతో కబుర్లు చెప్తూనో, మరేదో. నా పనిపాటల్లో నవ్వుతూ పాలు పంచుకునేవాడు. నాకు కడప బదిలీ అయితే ఎన్నోసార్లు నాతో వచ్చాడు. నేను రేడియోలో ఆఫీసర్ని. ప్రతీ ఆదివారం చెన్నైలో బొంబాయి మైలు ఎక్కి సెకెండు క్లాసు కంపార్టుమెంటులో ఇద్దరం గుమ్మందగ్గర బయటికి కాళ్లు జాపుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాతో అప్పుడప్పుడు కథా చర్చ. జరపకపోతే అడిగేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టని ఒక్క కారణంగానే– సరదాగా– అలవోకగా– ఆడుతూ పాడుతూ రెండు కథలు రెడీ చేశాం. కథ ఎవరివో ఒప్పించాలని కాదు. మేం ఒప్పుకోవాలని. (ఆ రెండు కథలూ చరిత్ర. రెండో కథ– ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిస్తే– ‘తరంగిణి’ తేలికగా సంవత్సరం నడిచింది) రెండో కథ, మొదటి కథ కావడానికి కారణం– ‘తరంగిణి’ చేయడానికి దర్శకుడి వెన్ను ముదరాలని భావించాం కనుక. రామకృష్ణ మెదడు పాదరసం. అతని గురువు గారి దగ్గర పుణికి పుచ్చుకున్న గొప్ప లక్షణం– నటుడికి ప్రత్యేకతనివ్వగల పాత్రీకరణ పుష్టి. ఇది చాలామంది దర్శకులకి లేదు. ప్రయత్నించినా రాదు. ఇందులో నిష్ణాతుల పేర్లు రెండు చాలు– సత్యజిత్ రే, మణిరత్నం. మొదటి చిత్రం రిలీజు నాటికే అతను స్టార్ డైరెక్టర్. నేను స్టార్‌ని. మరెందరో కొత్త నటు లకి– టైలర్ కృష్ణ, అశోక్ కుమార్ లాంటి వారికి ప్రాణం పోశాడు. కొత్త ఆలోచన వస్తే చుట్టూ అమోఘంగా అల్లు కునే అందమైన సాలెగూడు అతని మెదడు. కెమెరా ముందు నటుడి దమ్ముని గుర్తుపడితే– రామకృష్ణ గోమతేశ్వరుడయిపోతాడు. పూచిక పుల్లని పవిత్ర మైన దర్బని చేస్తాడు. కాగా, వ్యక్తిగా రామకృష్ణ బ్రతక నేర్చినవాడు. చాలామందికి తెలియదు. అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లేకపోతే అతని ప్రతిభకీ, తొలి నాళ్లలో అతనికి వచ్చిన అవకాశాలకీ ఆకాశంలో ఉండవలసినవాడు. తన పరిధిలో ‘తను’ ముఖ్యం. దానిని సంపాదించుకోడు. ఆ ‘పరిధి’ని తన హక్కుగా చేసుకుంటాడు. అదీ అతని Creative Volcano. అతను దర్శకుడిగా స్థిరపడటానికి బేషరతుగా నా వాటాని పుంజుకుంటూనే నేను నటుడిగా స్థిరపడ టానికి అతని వాటాని బంగారు పళ్లెంలో పెట్టి సమ ర్పిస్తాను. తన చుట్టూ ఎప్పుడూ ముసురుకునే నా కొడుకుల్లో శ్రీనివాస్‌ని దర్శకత్వ విభాగంలోకి లాగి నవాడు కోడి. మొదటి రోజుల్లో ‘వాసూ గారూ’ అనే వాడు ఆ కుర్రాడిని. నేను కోప్పడితే పద్ధతి మార్చు కున్నాడు. అతని శిష్యుడు గురువుగారికంటే పాతికేళ్లు ముందే వెళ్లిపోయాడు. అందమైన ఆలోచనకి వెండితెరమీద రేంజ్‌ని ఇవ్వగల పనివాడు. నేను రాసిన డైలాగుల్ని నాకంటే బాగా అలంకరించుకున్న దర్శకుడు. కానీ ప్రతిభని ఏనాడూ తలకెత్తుకోడు. నేనూ, మా ఆవిడన్నా భక్తి. ‘ఇంట్లో రామయ్య...’కి 30 పైగా సెన్సార్ కట్స్ వస్తే జ్వరంతో తేనాంపేటలో చిన్న గదిలో దుప్పటి కప్పుకు పడుకున్న అతన్ని నేనూ మా ఆవిడా వెళ్లి లేపి ధైర్యం చెప్పాం. ఏం సినీమా అది! అప్పటికి పది సినీమాలు తీసినంతగా దర్శకుడిలో ‘పదును’ సంధించిన ఇట్ఛ్చ్టజీఠ్ఛి Vౌ ఛ్చిnౌ అది. అందులో లేచిన పెద్ద లావా సెల– ‘దటీజ్ సుబ్బారావ్!’ రాత్రిళ్లు షూటింగులూ, అకాల భోజనాలతో ఆరోగ్యాన్ని ఎక్కువగా దుబారా చేసుకున్నవాడు. మరికొంతకాలం ఉంటే తెలుగు చలన చిత్ర రంగంలో సమగ్రమైన దర్శకత్వ ప్రతిభకి, తనదైన బాణీకి విలాసంగా నిలిచేవాడు. చిన్నవాడు. అతనికి నేను నివాళి అర్పించేరోజు వస్తుందని అనుకోలేదు. పదికాలాలపాటు ఉండవల సినవాడు. పదికాలాలు నిలిచే మౌలిక కృషికి తోట మాలి. మృత్యువుకి ఓ దుర్మార్గం ఉంది. మన్నికయిన ప్రతిభకి అర్ధంతరంగా ముగింపురాసి చేతులు దులు పుకుంటుంది. మృత్యువుకి లొంగకపోతే రామకృష్ణ తెలుగు సినీమాకి కొండంత ఉపకారం చేయగల దక్షత, దమ్ము ఉన్నవాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!
-
బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!
సాక్షి, హైదరాబాద్ : సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోసారి తన తెలుగు ప్రావీణ్యంతో ఆయన వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన బాలయ్య.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. అయితే గతంలో తన సోదరుడు నందమూరి హరికృష్ణ మరణంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యానన్న బాలయ్య.. ఇప్పుడు కోడిరామకృష్ణ మరణం ఏకంగా యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చరాల్లో ముంచెత్తిందని వ్యాఖ్యానించారు. హరికృష్ణ మృతిపై చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో దుమారం సృష్టించగా.. తాజా వ్యాఖ్యలు బాలయ్యను మరింత అబాసుపాలు చేస్తున్నాయి. ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఏంటి బాలయ్య అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘లోకేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఇప్పుడు అర్థమైంది.. అన్ని మేనమామ పోలికలే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చదవండి: బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!) ఇంతకీ బాలయ్య ఏమన్నాడంటే.. ‘కోడి రామకృష్ణ మనతో లేరనే సంగతి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. భూమి మీద చాలమంది పుడ్తారు గిడ్తారు. మరణాణంతరం శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోతారో.. అటువంటి జన్మకు ఓ పరిపక్వత.. ఓ సార్థకం. ఆ కోవకు చెందిన వారే కోడి రామకృష్ణ. ఆయన లేరన్నది నమ్మలేక పోతున్నాం. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీర్చనది.’ అని భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి : మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం) చదవండి: వైరల్: బుల్బుల్ బాలయ్య..! -
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు
-
‘ఏనాడు ఆయనలో గర్వం చూడలేదు’
శుక్రవారం మరణించిన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ మృతదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణతో పాటు దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, జగపతిబాబు, సంగీత దర్శకుడు కోటి లాంటి వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100కు పైగా చిత్రాలను తెరకెక్కించినా కోడి రామకృష్ణలో ఏనాడు గర్వం చూడలేదన్నారు రాఘవేంద్ర రావు. దాసరి గారి తరువాత అత్యథిక చిత్రాలకు డైరెక్ట్ చేసిన దర్శకుల జాబితాలో కోడి రామకృష్ణ ముందుంటారని, గురువు బాటలోనే ఆయన కూడా ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. -
దర్శక దిగ్గజానికి పలువురి నివాళి
-
గోదావరివాసులను కలచి వేసిన ‘కోడి రామకృష్ణ’ మరణవార్త
చిత్రాల దర్శకుడు ఆయన. ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’గా తొలి చిత్రంతో గుర్తింపు సాధించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’లను తెలుగు తెరకు పరిచయం చేయడమే కాదు.. ‘శ్రీనివాస కల్యాణం’ను ‘పెళ్లి పందిరి’లో ‘భలేదంపతుల’ సాక్షిగా.. ఎలా జరిపించాలో కూడా తీసి చూపించారాయన. ‘మధురానగరి’లో ‘చిలకపచ్చ కాపురాలు’ ఉంటాయని చెప్పారు. ‘పెళ్లి’లో ‘తలంబ్రాలు’ విశిష్టతను వివరిస్తూ ‘పుట్టింటికి రా’ చెల్లి అని ఆహ్వానం పలకడమూ ఆయనకే చెల్లింది. ‘20వ శతాబ్దం’లో తనదైన మార్కు చూపించాలని ‘అంకుశం’తో అదరగొట్టి.. ‘ఆహుతి’తో ఆకట్టుకుంటూ దర్శకత్వంలో ఆయనకు ఉన్న పవర్ చూపారు. ‘దేవీ’ దీవెనలతో ‘అమ్మోరు’ ఆశీస్సులతో ‘అంజి’ అని ‘పిలిస్తే పలుకుతా’ అని అందరి హృదయాలోనూ ‘మా పల్లెల్లో గోపాలుడు’ అని అనిపించుకున్నారు. ‘స్టేషన్ మాస్టర్’లోనే కాదు.. ‘రిక్షావోడు’లోనూ సత్తా ఉంటుందని చెప్పగలిగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అని గట్టిగా చెప్పడమే కాదు..‘మా ఆవిడ కలెక్టర్’ అంటూ మహిళా ప్రేక్షకులకు దగ్గరైన ‘దేవీపుత్రుడు’ ఆయన. ‘దొంగాట’ను ఆడించడమే కాదు.. అజాత ‘శత్రువు’గాను సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవుళ్లు’ సాక్షిగా ‘అరుంధతి’ని తెరంగేట్రం చేసిన ఘనత ఆయనదే. ఆయనే ప్రముఖ శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. శుక్రవారం ఆయన మృతి చెందడం ‘తూర్పు’వాసులను కలచివేసింది. ఈనేపథ్యంలో జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం కల్చరల్: శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరన్న వార్త విన్న గోదావరి శోకసంద్రమైంది. తెలుగు సినీరంగంలో ఎన్నో వినూత్న చిత్రాలకు సారధ్యం వహించిన కోడి రామకృష్ణ అనేక హిట్ సినిమాలకు ఈ జిల్లాలో ప్రాణప్రతిష్ట చేశారు. గోదావరికి ‘అద్దరిన’ ఉన్న పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణకు చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండేది. పాలకొల్లులో లలిత కళాంజలి సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించేవారు. దాసరి ప్రోత్సాహం దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు కోడి రామకృష్ణలోని టాలెంట్‌ను గుర్తించారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి కోడి రామకృష్ణను సహాయదర్శకుడిగా ఎంపిక చేశారు. స్వర్గం–నరకం చిత్రంలో ఒక పాత్రను పోషించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో అమ్మోరు, ఆలయ శిఖరం, జైలు పక్షి, దేవి, పెళ్లాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, భారత్ బంద్, మంగమ్మగారి మనుమడు, మా పల్లె గోపాలుడు, ముద్దుల మామయ్య, శ్రీనివాస కల్యాణం మొదలైన సినిమాల షూటింగ్ కొంతభాగం జిల్లాలోనే జరిగింది. సందేశాత్మక చిత్రాలను వినోదంతో మేళవించి, జనరంజకం చేయడం ఆయన బాణీగా నిలిచిపోయింది. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య పాత్రలో గొల్లపూడి మారుతీ రావుతో అద్భుతమైన శాడిస్టు పాత్రను కోడి రామకృష్ణ ధరింపజేశారు. రాయవరంతో అనుబంధం రాయవరం (మండపేట): ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణకు రాయవరంతో అనుబంధం ఉంది. కోడి రామకృష్ణ 1998 ఏప్రిల్ 27న రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో రామచంద్రపురం, కోటిపల్లిలో ‘పెళ్లికానుక’ సినిమా షూటింగ్‌ను నిర్వహించారు. షూటింగ్ నుంచి వార్షికోత్సవానికి వచ్చిన కోడి రామకృష్ణ రాయవరంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రముఖ సినీ రచయత పైడిపాలతో కలిసి కోడి రామకృష్ణ రాయవరం వచ్చారు. సినీ నటుడు జగపతిబాబుతో కలిసి కోడి రామకృష్ణ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కోడి రామకృష్ణ మంచి స్నేహశీలి అని సాయితేజా విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1984లో సినిమా షూటింగ్ సందర్శంగా హీరో బాలకృష్ణ, నర్సరీ అధినేత పల్ల వెంకన్నలతో దర్శకుడు కోడి రామకృష్ణ ఆయన మరణం తీరని లోటు కాకినాడ రూరల్: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం అకాలమరణంతో కాకినాడకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత కోకా సాయిప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణతో ఆయనకున్న పరిచయాన్ని ఇలా వివరించారు. ‘‘1994లో మద్రాస్ రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మిం టెక్నాలజీ డైరెక్షన్ డిపార్టుమెంట్లో శిక్షణ తీసుకున్న అనంతరం నేను ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణను హెదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆశ బారెడు, ఆస్తిమూరెడు సినిమా షూటింగ్ సమయంలో రామకృష్ణను కలిశాను. మరుక్షణం నాకు దర్శకత్వంలో అన్నిశాఖల్లో తర్ఫీదు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం అనారోగ్యంగా ఉన్న కోడి రామకృష్ణను పలకరించేందుకు 2018లో హైదరాబాద్ ఫిల్మినగర్‌లో కోడిరామకృష్ణ స్వగృహంలో కలిశాను. 24 ఏళ్ల తరువాత కలిసి గతంలో జరిగిన పరిచయాన్ని గుర్తుచేస్తే అంతే ఆత్మీయంగా పలకరించడం నేను మరచిపోలేని మధురానుభూతిగా భావిస్తున్నా. ఎలాంటి వారినైనా ఎంతో ఆత్మీయం పలకరిస్తూ తనదైన శైలిలో మనసులో నిలుపుకొనేంత ప్రేమను పంచడం కోడి రామకృష్ణ కే దక్కుతుంది. అటువంటి మహోన్నత వ్యక్తి మనకుదూరం అవ్వడం సినీలోకానికి తీరని లోటు.’’ అని తెలిపారు. గొప్ప దర్శకుడిని కోల్పోయాం :రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజ్‌కుమార్ కొత్తపేట: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతితో గొప్ప తెలుగు సినీ దర్శకుడిని కోల్పోయామని ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్ అన్నారు. ఆయనతో తనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయని, అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నానని తెలిపారు. ఆయన మృతి ఒక్క తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమలకు తీరని లోటన్నారు. అతికొద్దిమంది దర్శక దిగ్గజాల్లో కోడి రామకృష్ణ ఒకరని, ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు సూపర్, డూపర్ హిట్ కాగా ఆయా సినిమాల్లో నటించిన ప్రధాన, సహాయ నటులకు సైతం మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. అలాగే ఎంతో మంది నూతన నటులకు ఆయన అవకాశాలు కల్పించి, ప్రోత్సహించారన్నారు. వారు నేడు గొప్ప నటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారన్నారు. రామకృష్ణ తనకు మంచి వ్యక్తిగత మిత్రుడని, ఆయన లేరంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నామన్నారు. కడియం నర్సరీలతో అనుబంధం కడియం: శతచిత్రాల దర్శకుడిగా తనదైన శైలిలో కోడి రామకృష్ణ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సిని షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందిన కడియం పల్ల వెంకన్న నర్సరీలో 1984లో బాల కృష్ణ హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణతో స్థానిక నర్సరీ రైతులకు ఎంతో పరిచయం ఏర్పడింది. ఇక్కడి రైతులను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని స్థానిక రైతులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నర్సరీ అధినేత పల్లవెంకన్న తోపాటు పలువురు నర్సరీ రైతులు దర్శకుడు రామకృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, సినీ రంగానికి ఆయన లేని లోటు తీరనిదన్నారు. -
ఇంట్లో రామయ్య.. ఇక లేరయ్య
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్/పాలకొల్లు అర్బన్: కళామతల్లి ముద్దు బిడ్డ, క్షీరపురి ఆణిముత్యం, ప్రముఖ సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ శుక్రవారం తుది శ్వాస విడిచారు. దీంతో జిల్లా శోకసంద్రమైంది. పేదరికంలో పుట్టిన కోడి రామృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పట్టణంలోని ఎంఎంకేఎన్ మునిసిపల్ హైస్కూల్ సెకండరీ ఫోరం చదివి, ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి కుంచె చేత పట్టి బ్యానర్లు రాసేవారు. బాల్యంలోనే ముఖానికి రంగు పూసుకుని ఎన్నో నాటకాలు స్వయంగా రచించి, ప్రదర్శించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద శిష్యరికం చేసి వంద సినిమాలకు దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు కోడి నరసింహులు–చిట్టెమ్మ దంపతులకు రామకృష్ణ మొదటి సంతానం. ఆయన సోదరులు లక్ష్మణరావు సినీ కెమెరామెన్‌గానూ మరో సోదరుడు వెంకన్న ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసి ఇటీవల మృతిచెందారు. సినీ రంగ ప్రవేశం కోడి రామకృష్ణ 1975లో ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అప్పట్లో అతని మిత్రబృందంతో కలిసి నాటికలు ప్రదర్శిస్తూ లలిత కళాంజలి నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ బ్యానర్‌పై అనేక పరిషత్‌ల్లో నాటకాలు ప్రదర్శించి బహుమతులు అందుకున్నారు. ‘రథచక్రాలు, రేపు సెలవు’ తదితర నాటకాలు ఆయన స్వీయ రచనలు కాగా, ‘సుడిగుండాలు’లో ఏకపాత్ర ద్వారా ప్రజల్ని మెప్పించారు. సినీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య ‘పల్లెపడుచు’ నాటకాన్ని కమర్షియల్ నాటకంగా ప్రదర్శించేవారు. ఈ నాటకంలో కోడి రామకృష్ణ బాల నటుడిగా రంగస్థలం ప్రవేశం చేసి గోపి పాత్రలో నటించారు. సినిమారంగంపై మమకారంతో మద్రాసు వెళ్లి పాలకొల్లుకి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1983లో ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య సినిమాకి దర్శకత్వం వహించి బంపర్ హిట్ కొట్టారు. వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. లలిత కళాంజలి వ్యవస్థాపకుడిగా.. పుట్టిన గడ్డపై మమకారం, కళలపై తనకున్న అభిరుచి కారణంగా 1983లో లలిత కళాంజలి నాటక అకాడమీని స్థాపించారు. దక్షిణ భారత స్థాయిలో నాటక పోటీలు ఏకధాటిగా 33 సంవత్సరాలు నిర్వహించారు. సినీ ప్రముఖులను పాలకొల్లు తీసుకువచ్చి ఏటా సత్కరించేవారు. ఇలా సత్కారం పొందిన వారిలో దాసరి నారాయణరావు, డి రామానాయుడు, కృష్ణ, జయసుధ, జయప్రద, డా.మోహన్‌బాబు తదితరులున్నారు. ఎంత ఎదిగినా.. లలిత కళాంజలి నాటక అకాడమీ ఆధ్వర్యంలో దర్శకుడు కోడి రామకృష్ణ, అతని స్నేహితులు, ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మా ఇంటికి రండి’ సినిమాను సుమారు 20 ఏళ్ల క్రితం పాలకొల్లు, పోడూరు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ సినిమా నిర్మాతగా వాకాడ అప్పారావు, సినీ హీరోగా కోడి రామకృష్ణ నటించారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన గాదిరాజు సుబ్బారావు, తాళాబత్తుల వసంతరావు, లక్కింశెట్టి నాగేశ్వరరావు, సారిక రామచంద్రరావు, హనుమాన్రెడ్డిలకు ఆ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య, చిలక పచ్చకాపురం, పుట్టింటికి రా చెల్లీ తదితర సినిమాలను పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని.. కోడి రామకృష్ణ కళాశాలలో చదివే రోజుల్లో కల్చరల్ డిపార్టుమెంట్‌కి సెక్రటరీగా పనిచేశారు. ఆ రోజుల్లో జై ఆంధ్ర ఉద్యమం జోరుగా సాగింది. ఆ సమయంలో కోడి రామకృష్ణ జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకుని జైలు జీవితం గడిపారు. రామకృష్ణ మృతి.. తీరని లోటు దెందులూరు: శత చిత్రాల దర్శకుడు, జిల్లా వాసి కోడి రామకృష్ణ ఆకస్మిక మరణం బాధించిందని ఉషా సంస్థల అధినేత డాక్టర్ వీవీ బాలకృష్ణారావు, అన్నపూర్ణ సినీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎంపీపీ కొడాలి ఆంజనేయ చౌదరి తెలిపారు. కొవ్వలిలో ఆయన మాట్లాడుతూ అందరితో నవ్వుతూ మంచిగా ఉండే రామకృష్ణ ఆకస్మిక మరణం వ్యక్తిగతంగా తమకు, చిత్రపరిశ్రమకు తీరని నష్టమన్నారు. అనేక సాంఘిక, పౌరాణిక, రాజకీయ, విభిన్న చిత్రాలతో రామకృష్ణ తనదైన శైలిలో ముద్రవేశారన్నారు. సత్యసాయిబాబా సినిమా పూర్తికాకుండానే.. జంగారెడ్డిగూడెం రూరల్: కోడి రామకృష్ణ మృతి జంగారెడ్డిగూడెం మండల ప్రాంత ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో కరాటం రాంబాబు నిర్మిస్తోన్న శ్రీ సత్యసాయిబాబా సినిమాకు సంబంధించి అనేక సన్నివేశాల చిత్రీకరణ 2012లో జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని 150 సంవత్సరాల పురాతన లోగిలిలో జరిపారు. ఈ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఆయన ఆ సినిమాలో నటించే అవకాశం కూడా ఇచ్చారు. వారంతా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కోడి రామకృష్ణతో కలిసి నటించా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాటక పరిషత్‌లు నిర్వహించే వాడిని. ఆ సమయంలో కోడి రామకృష్ణతో కలిసి నాటకం ఆడా. అలాగే దాసరి నారాయణరావుకి రామకృష్ణను పరిచయం చేసినవారిలో నేను ఒకర్ని. సినిమా రంగంలో బిజీ జీవితాన్ని గడుపుతూ కూడా రామకృష్ణ ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఆ సమయంలో రామకృష్ణతో ఎక్కువ అనుబంధం ఉండేది.– వంగా నరసింహరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నా షెడ్డుకు వచ్చి టీ తాగేవారు పాలకొల్లు పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌కి ఎదురుగా నా కారు మెకానిక్ షెడ్డు ఉంది. లలిల కళాంజలి నాటకోత్సవాల్లో భాగంగా ఏటా నా కారు షెడ్డు వద్దకు వచ్చి కూర్చునేవారు. ఓ టీ తాగి సేద తీరేవారు. అదే పరిచయంతో మద్రాసు వెళ్తే ఎంతో ఆప్యాయంగా సకల మర్యాదలు చేసేవారు. ఆయనతో ఉన్న స్నేహంతో నా కుమారుడ్ని సినిమా రంగానికి పంపించా. రామకృష్ణ మృతి చాలా బాధ కలిగించింది. – ఏకుల బాబూ రాజేంద్రప్రసాద్, స్నేహితుడు అరమరికలు లేకుండా ఆదరించేవారు పుట్టింటికి రా చెల్లీ సినిమాకి కోడిరామకృష్ణ గారితో కలిసి 22 రోజులు పనిచేశాను. పాలకొల్లు అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతో మమ్మల్ని చాలా బాగా ఆదరించేవారు. చిన్న, పెద్ద తేడా లేకుండాఅందర్నీ ఆప్యాయంగా, కలుపుగోలుతనంగా పలకరించేవారు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది.– వంటపాటి నాగరాజు, జూనియర్ ఆర్టిస్ట్ సఫ్లై దారుడు సత్య సాయిబాబా సినిమా ఆగిపోయింది శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు. శ్రీ సత్యసాయిబాబా జీవిత చరిత్ర నేను నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించాను. దాదాపు 60 శాతం చిత్ర నిర్మాణం పూర్తయ్యింది. కొద్ది నెలలుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. రామకృష్ణ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.– కరాటం రాంబాబు, సినీ నిర్మాత