Kollywood
-
'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ సినిమాకు మరింత బజ్‌ను క్రియేట్ చేయనుంది.ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న 'ఎర్రచీర - ది బిగినింగ్' చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. -
విడాకుల తర్వాత మాజీ భర్త గురించి సైంధవి పోస్ట్.. అభినందిస్తున్న ఫ్యాన్స్
విడాకుల తర్వాత కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్, గాయని సైంధవి మరోసారి ఒక వేదికపై కలవనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు కలిసి జీవించిన వారు తమ వైవాహిక బందానికి వీడ్కోలు పలికారు. బాల్యం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు. అలా 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగు అన్వి అనే కూతురు కూడా ఉంది.సింగర్ సైంధవి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన మాజీ భర్తకు సంబంధించిన సంగీత కచేరీ గురించి ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. గతంలో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన వీరిద్దరూ మరోసారి ఒక మ్యూజిక్ ప్రోగ్రాం కోసం కలిసి పనిచేయబోతున్నారు. డిసెంబర్ 7న మలేషియాలో జరిగే సంగీత కచేరి కార్యక్రమంలో వారిద్దరూ కలిసి కనిపించనున్నారు. దీంతో అభిమానులు సంతోషించడమే కాకుండా సైంధవిని అభినందిస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి వృత్తిరిత్యా జివి ప్రకాష్‌తో కలిసి పనిచేయడం అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా స్నేహం అనే చర్య తమ పరిపక్వతను తెలియజేస్తోందని సోషల్ మీడియాలో పలువురు కొనియాడారు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన ‘అమరన్’ సినిమాలోని ‘గానవే’ పాటను సైంధవి పాడడం గమనార్హం.విడాకుల సమయంలో కూడా జివి ప్రకాష్ గురించి సైంధవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జి.వి.ప్రకాష్ తనకు స్కూల్ నుంచే మంచి స్నేహితుడని ఆమె తెలిపింది. అలా 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసింది. విడాకుల తర్వాత అదే స్నేహంతో ప్రయాణం చేస్తామని ఆమె తెలిపింది. దానిని సైంధవి పాటిస్తున్నట్లు నెటిజన్లు తెలుపుతున్నారు. ప్రభాస్ చిత్రం 'డార్లింగ్' సినిమాలో 'ఇంకా ఏదో' అనే పాటతో జివి ప్రకాష్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. View this post on Instagram A post shared by DMY Creation (@dmycreation) -
వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్ సాంగ్ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్
చిత్రపరిశ్రమలో ఐటమ్ సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్ హీరో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కథా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. -
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్‌ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.అసలేం జరిగిందంటే?అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్లోనే ది బెస్ట్ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది.మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.12 నిమిషాల తగ్గింపుకంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. -
వేట్టయన్, కంగువా, సినిమాల ఎఫెక్ట్.. కోలీవుడ్ కీలక నిర్ణయం
ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది. -
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.కంగువా సినిమాతో కోలీవుడ్‌లో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది. సీన్స్ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి. బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్‌కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్‌ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.హీరోయిన్ దిశా పటాని గురించి నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన్ తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్‌తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్‌కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్‌పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్‌కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్‌కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్‌కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
నయనతార విశ్వరూపం మీరూ చూసేయండి
లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. తాజాగా తన నటించనున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నయన్ 'రక్కయీ' (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించింది. కథలో ఉమెన్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చేలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వర్స్‌ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. తల్లి పాత్రలో నటిస్తున్న నయన్తన కూతురు కోసం చేసే పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుందని దర్శకుడు టీజర్లోనే చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. -
కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. -
తెలుగువారిపై కామెంట్స్.. సినీ నటి కస్తూరికి రిమాండ్
తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. (ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)క్షమాపణలు చెప్పిన కస్తూరిఅలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది. -
బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య, విక్రమ్
-
ధనుష్ క్యారెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసిన నయనతార
-
'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక
కోలీవుడ్ 'బాహుబలి'గా ప్రచారం చేసిన సూర్య 'కంగువ'.. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్‌తో రిలీజైన ఈ సినిమాకు మొదటి సీన్ తర్వాత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీలో ప్లస్సులు కంటే మైనస్సులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూర్య భార్య జ్యోతిక ఇప్పుడు 'కంగువ'పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది. కావాలనే మా మూవీని తొక్కేస్తున్నారని అంటోంది.(ఇదీ చదవండి: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్)జ్యోతిక ఏమంది?'నటుడు సూర్య భార్యగా కాదు నేను ఈ నోట్‌ని జ్యోతికగా, ఓ సినీ ప్రేక్షకురాలిగా రాస్తున్నాను. కంగువ- ఓ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు. మ్యూజిక్ కూడా లౌడ్‌గా అనిపించింది. మన సినిమాల్లో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇలాంటి మూవీస్‌లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు.''మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయా. వీళ్లెవరు కూడా అవే పాత స్టోరీలతో తీసిన సినిమాలకు, అమ్మాయిల వెంటపడే, డబుల్ మీనింగ్స్ ఉండే, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే మూవీస్‌కి ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదు. మరి 'కంగువ' పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్.. రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు కనిపించలేదా?'(ఇదీ చదవండి: గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్)'తొలిరోజే 'కంగువ'పై నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. తొలి షో పూర్తవకముందే ఇలా చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాని కావాలని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్, కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు' అని జ్యోతిక ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజైన 'కంగువ'సినిమాకు 2 రోజుల్లో రూ.89.32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.2000 కోట్ల వసూళ్లు వస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ఫ్రీగా నటిస్తున్నారా? ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలి?: నిర్మాత
మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.మరి నీ భర్త చేసిందేంటి?ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను అప్పనంగా వాడేశాడు. నా నిర్ణయాన్ని గౌరవించలేదుఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్ఐసీ టైటిల్‌తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్ఐసీ టైటిల్‌కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్‌ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?ఎంత కుంగిపోయానో?ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్‌గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్‌ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: బిగ్‌బాస్ షోలో పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్ -
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. తెలుగువారు ఎవరు?అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. పోలీసుల గాలింపుకానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.చదవండి: నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్ -
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్‌ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్‌లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్‌తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్‌లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
చిన్న వయసులోనే యువ దర్శకుడు కన్నమూత
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా లివర్ (కాలేయ) సమస్యలతో బాధపడుతున్న ఈయన.. శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇతడి ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: )2017లో 'ఒరు కిడైయిన్ కరు మను' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు.. గతేడాది 'సత్య సొతనై' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కమెడియన్ యోగిబాబుతో ఓటీటీ సినిమా కూడా తీశాడు.అయితే గత కొన్నాళ్లుగా లివర్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైరెక్టర్ సురేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ) -
కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్
హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని సన్నివేశాల్లో సౌండ్ ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చాయి. భరించలేనంత సౌండ్ వాడటంతో సినిమా చూసేటప్పుడు చిరాకు వచ్చిందని పలువురూ అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించాడు.చివరి క్షణాల్లోనే ఈ సమస్యలుకంగువాలో సౌండ్ బాలేదన్న రివ్యూలు చూస్తుంటే బాధగా ఉంది. ఈ విషయంలో ఎవర్నీ నిందించలేము. సినిమా కంప్లీట్ అయిన చివరి క్షణాల్లోనే ఇలాంటి సమస్యలే వస్తాయి. సినిమా రూపొందించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువే మారిపోతుంది. మూవీ చూశాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు వెళ్తే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.కంగువా..ఈ పోస్ట్ చూసిన పలువురూ నిజంగానే తమకు సినిమా చూస్తుంటే ఆ సౌండ్‌కు తలనొప్పి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కంగువా విషయానికి వస్తే.. సూర్య.. కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. దిశా పటానీ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.చదవండి: పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్