Kottayam
-
కేరళలో కాలనీయే ఖాళీ ..!
కొచి: కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా గ్రామంలో ఒక కాలనీలో ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న 100కి పైగా ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ ఎన్నారైలకు చెందిన ఇళ్లే. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి మెరుగైన జీవితం కోసం ప్రజలు వివిధ దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ సంపాదించిన డబ్బులతో తమ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించారు. రిటైర్మెంట్ జీవితం ఆ ఇళ్లల్లోనే గడిపారు. వారి తదనంతరం పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆ ఇళ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఉన్న ఆ కాలనీ ఒకేసారి ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ మంచి సదుపాయాలు ఉండడంతో చాలా మంది ఆ ఇళ్లను కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
బస్సుకిందపడ్డ మహిళ.. చక్రంలో ఇరుక్కున్న జుట్టు.. అంతా క్షణాల్లో..
తిరువనంతపురం: కేరళ కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. బస్సు ఢీకొట్టి దాని కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోగా.. స్థానికులు చేశారు. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది. కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి. స్కూల్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్‌ను పిలిపించారు. అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చదవండి: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్.. -
89 ఏళ్ల బామ్మ.. పూర్వీకుల ఇల్లును డే కేర్ సెంటర్‌గా మార్చేసి! స్థానిక యువతులకు....
Manavodaya Pakalveedu- Kerala: ‘వయసు పైబడటంతో ఏ పనీ మునుపటి ఉత్సాహంతో చేయలేకపోతున్నాను’ అనే మాట పెద్దల నోట తరచూ వినిపిస్తుంటుంది. అయితే, కేరళలోని కొట్టాయంలో ఉంటున్న 89 ఏళ్ల ఈ బామ్మను చూస్తే మాత్రం మనమెందుకు ఇలాంటి ఆలోచన చేయలేం అనిపించక మానదు. ఇటీవల 89వ పుట్టినరోజు వేడుకను తనలాంటి వయసు పైబడిన వారి మధ్య ఆనందంగా జరుపుకున్న ఈ బామ్మ పేరు కరుస్సెరిల్ తంకమ్మ. ఐదేళ్ల క్రితం ఆమె తన పూర్వీకుల ఇంటి తలుపులను ఒంటరి వృద్ధ మహిళల సంరక్షణ కోసం వీరిలో ఉత్సాహం నింపడానికి తెరిచింది. ఒంటరితనం నుంచి.. ఒక వయసు దాటాక పిల్లలు స్థిరపడతారు, భాగస్వామి దూరమవుతారు. ఇలాంటి పరిస్థితే తంకమ్మ జీవితంలోనూ జరిగింది. ఆమె రిటైర్డ్ హిందీ టీచర్. ఆమె ఇద్దరు పిల్లలు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. కొద్దిరోజులు పిల్లల దగ్గర రోజులు గడిపింది. పిల్లలు ఉద్యోగాల్లో బిజీ. మనవలు, మనవరాళ్లు చదువుల్లో బిజీ. ‘ఈ వయసులో మా రోజులు ఒంటరిగానే గడుస్తుంటాయి. కానీ, మేము కోరుకునేది మరొకరి కంపెనీ మాత్రమే. బిజీగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉండలేరు. ఇలా రోజులు గడుస్తున్నప్పుడే వయసు పైబడిన వారి రోజులను ఉత్సాహంగా మార్చడానికి, వారికి నచ్చిన పనుల్లో వారిని నిమగ్నమయ్యేలా చేయాలనే ఆలోచన వచ్చింది’ అని చెబుతారు తంకమ్మ. ఆమెకు కొట్టాయంలో వారసత్వంగా వచ్చిన 200 ఏళ్ల నాటి వారి పూర్వీకుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని వృద్ధుల కోసం డే కేర్ సెంటర్‌గా ఉపయోగించాలనుకుంది. దీనివల్ల స్థానిక యువతులకు ఉపాధి కూడా కల్పించవచ్చు అనుకుంది. దీనికి ఆమె పిల్లలు శ్రీకుమార్, సతీష్ కుమార్, గీత మద్దతు పలికారు. వారు ఆ ఇంటి పునరుద్ధరణకు సహకరించారు. దీంతోపాటు ఆమె చొరవ గురించి ప్రచారం చేశారు. చేయదగిన పనులు ‘మా ప్రాంతంలో అమ్మ పరిచయం అవసరం లేదు‘ అని న్యూయార్క్ ఆధారిత సంస్థలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయిన శ్రీ కుమార్ చెబుతారు. ‘ఆమె టీచర్ కాబట్టి, ఆమె మనకంటే ఎక్కువమందితో కనెక్ట్ అయ్యింది. ఆమె సంపాదన ఇతర మహిళల సాధికారత కోసం ఖర్చుపెట్టడానికి ఇష్టపడే వ్యక్తి. ఈ వయస్సులో కూడా, ఆమె ఈ డే కేర్‌ను విస్తరించడానికి కొత్త ఆలోచనలు చేస్తుంది’ అని ప్రశంసిస్తారు. ఐదుగురు ఉద్యోగులు కొట్టాయంలోని మానవోదయ పాకాలవీడు అని పిలువబడే ఈ ఇల్లు అధికారికంగా స్వచ్ఛంద సంస్థగా నమోదు చేయబడింది. అక్టోబర్ 11, 2017న ఈ ఇంటినుంచి కార్యకలాపాలు ప్రారంభించింది ఈ బామ్మ. ఇక్కడ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఐదుగురు ఉద్యోగులు డే కేర్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చినవారు క్యాండిల్ లైట్లు, అగరుబత్తులు, పేపర్ బ్యాగులు, డిటర్జెంట్లు, క్లీనింగ్ లోషన్లు తయారు చేస్తారు. తయారు చేసిన ఉత్పత్తులను డే కేర్ సమీపంలోని ఒక దుకాణం ద్వారా విక్రయిస్తారు. ఆ ఆదాయం పూర్తిగా ఈ డే కేర్ కొనసాగించడానికి ఉపయోగిస్తారు. ఉదయం 8 గంటలకు మొదలు ‘ఇంట్లో చేయగల కుట్టుపనిపై ఉచిత కోర్సు కూడా ఇక్కడ లభిస్తుంది. డే కేర్‌లోని ఉద్యోగులందరూ యువతులు. వీరిలో ఇద్దరు సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు’ అని చెప్పే తంకమ్మ కుమార్తె గీత ప్రతి వారాంతంలో ఇంటికి వెళ్లి తల్లి చేసే కార్యకలాపాలకు సహకరిస్తుంటుంది. పాకలవీడులో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వృద్ధులను వారి ఇళ్ల నుండి డే కేర్ వాహనం ద్వారా పికప్ చేయడంతో ప్రారంభమవుతుంది. మొదట ప్రార్థన, తర్వాత ధ్యానం, యోగా సెషన్లో వార్తాపత్రిక చదవడం, అల్పాహారం మొదలవుతుంది. ఆ తర్వాత వారి ఇష్టం మేరకు చేయదగిన పనులను ఎంచుకొని, ఇతరులతో మాట్లాడటం, చదవడం, వ్యవసాయం లేదా ఆటల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం కలిసి నడక, కాఫీ తర్వాత ఐదు గంటలకు వారిని వారి వారి ఇళ్లకు తీసుకు వెళతారు. ఇక్కడ ఉన్న వారంతా తమ పిల్లలు విధుల్లోకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా గడిపే స్త్రీలు. వారు ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి, ఇక్కడ హెల్త్ క్లినిక్, ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పగటి పూట డాక్టర్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారు. కొత్త వెంచర్‌ను ప్రారంభించడానికి ఈ పనులు ఎప్పుడూ అడ్డు కాదం’టారు తంకమ్మ. చదవండి: Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం -
‘100 రకాల’ డ్రాగన్ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!
డ్రాగన్ ఫ్రూట్ పుష్కలంగా పోషకాలు కలిగి ఉండే పండు. అంతేకాదు, ఖరీదైనది కూడా. ఈ రెండు లక్షణాలూ 72 ఏళ్ల వృద్ధుడు జోసెఫ్‌ను రైతుగా మార్చేశాయి. కేరళకు చెందిన ఆయన అమెరికా వెళ్లినప్పుడు తియ్యని డ్రాగన్ ఫ్రూట్ రుచి చూసి పరవశుడయ్యారు. ఏడేళ్ల క్రితం ఆ పండును ఏడు డాలర్లకు కొన్నారాయన. ఆ రుచి, కళ్లు చెదిరే ధర ఆయనను డ్రాగన్ రైతుగా మార్చేసింది. హైదరాబాద్‌లో మెషిన్ టూల్ ఇండస్ట్రీ నిర్వహించి విరామ జీవనం గడుపుతున్న జోసెఫ్.. తన స్వస్థలం కొట్టాయం దగ్గర్లోని చెంగనస్సెరీకి తిరిగి వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక దేశ విదేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని సేకరించటం మొదలు పెట్టారు. ఈక్వడార్, తైవాన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని తెప్పించి ఇంటి పెరట్లోని 65 సెంట్ల స్థలంలో నాటారు. 100 రకాలు ఇప్పటికి దాదాపు 100 రకాలు సేకరించారు. అందులో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయంటారు జోసెఫ్. కొన్ని రకాల పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నిటికి ఎర్రగా, పసుపు పచ్చగానూ ఉంటాయి. డ్రాగన్ జీవవైవిధ్యంతో ఆయన పెరటి తోట కళకళలాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రకాలను సంకరం చేసి 10 కొత్త డ్రాగన్ వంగడాలను రూపొందించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. 65 రోజులకు పండు కోతకు వీటిల్లో జేకే1 పలోరా 2, రెడ్ చిల్లీ, వండర్ బాయ్ జేకే 2 అనే రకాల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. జేకే1 పలోరా 2 రకం పసుపు రంగు పండు అన్నిటికన్నా తియ్యనిది (బ్రిక్స్ 23.6). పూత వచ్చాక 65 రోజులకు పండు కోతకు వస్తుందని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తన డ్రాగన్ పండ్ల రంగు, రుచిని బట్టి.. ఒక్కో మొక్కను రూ. వంద నుంచి 4,000 వరకు విక్రయిస్తుండటం విశేషం. వండర్ బాయ్ జేకే 2 రకం (క్రాస్ పాలినేషన్ రకం) పండు తియ్యదనం బ్రిక్స్ 21.5. ఈ మొక్క ధర రూ. 1,500. రెడ్ చిల్లీ పండు తియ్యదనం బ్రిక్స్ 17.5. దీని కటింగ్‌ను రూ. వెయ్యికి అమ్ముతున్నారాయన. అన్నట్టు.. మొక్కలతో పాటు పండ్లను కూడా అమ్ముతున్నారు జోసెఫ్(94472 94236). అనేక రాష్ట్రాల్లో తన కస్టమర్లున్నారని ఆయన అంటున్నారు కించిత్ గర్వంగా! చదవండి: Cocoponics: మట్టి లేని సేద్యం.. కూరగాయలు పుష్కలం! రూపాయి పెట్టుబడికి 11 వరకు ఆదాయం! -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
Rehana Shah Jahan: కేరళ అమ్మాయి ప్రపంచ రికార్డ్! 24 గంటల్లో ఏకంగా..
‘నేనింతే’ అనుకుంటే.. ‘అవును. అంతే’ అంటుంది విధి. అప్పుడు కాళ్లకు బంధనాలు పడతాయి. కలలు మసకబారిపోతాయి. ‘యస్. నేను సాధించగలను. ఆ శక్తి నాలో ఉంది అనుకుంటే మాత్రం కొత్త అడుగులు పడతాయి. మన విజయాలు సగర్వంగా మాట్లాడుతాయి...’ అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం రెహన షాజహాన్... ఒక్క మార్కుతో దిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎంకాం సీటు మిస్ అయిన సందర్భంలో కేరళలోని కొట్టాయంకు చెందిన రెహన షాజహాన్ ముందు ప్రశ్న రూపంలో చీకటి నిల్చుని ఉంది. ఆ చీకట్లోనే, అక్కడే ఉండి ఉంటే రెహన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచేది కాదు. సీటు మిస్ అయిన నిరాశలో నుంచి వేగంగా తేరుకొని, ఒకేసారి ఆన్లైన్లో సోషల్‌వర్క్, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసింది. జామియా మిలియా ఇస్లామియాలో ఎంబీఏలో సీటు సంపాదించింది. ‘ఎంబీఏ సీటు సంపాదించడం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నేను సాధించగలను అనే బలాన్ని ఇచ్చింది’ అంటుంది రెహన. ‘మహిళలలో ఉన్న శక్తిసామర్థ్యాలు అపారం. వాటిని వారికి ఎరుకపరచడమే మా ధ్వేయం’ అనే నినాదంతో దిల్లీ కేంద్రంగా ‘వుమెన్స్ మ్యానిఫెస్టో’ అనే స్వచ్ఛంద సంస్థ మొదలైంది. ఈ సంస్థలో భాగం కావడం ద్వారా తన మానసిక దృక్పథాన్ని విశాలం చేసుకునే అవకాశం ఏర్పడింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, గృహహింస బాధితులకు అండగా నిలవడం, వారికి కావాల్సిన న్యాయసహాయాన్ని అందించడం, ఆరోగ్యం, శుభ్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్డడం...ఇలా కెరీర్ గైడెన్స్ నుంచి బాధితుల కన్నీరు తుడవడం వరకు ‘వుమెన్స్ మ్యానిఫెస్టో’ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించింది. పాఠ్యపుస్తకాలు చదువుకున్న రెహనకు ‘ఉమెన్స్ మ్యానిఫెస్టో’ ప్రభావంతో సమాజాన్ని లోతుగా చదువుకునే అవకాశం లభించింది. వెబినార్ స్పీకర్, జోష్ టాక్స్ స్పీకర్‌గా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసింది. జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సంస్థల ఉచిత ఆన్లైన్ కోర్సుల గురించి తెలుసుకుంది. 24 గంటలలో 81 ఆన్లైన్ సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అంతకుముందు ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ‘నీలో ఉన్న ధైర్యాన్ని నువ్వు కనిపెట్టేంత వరకు నువ్వు ఎంత ధైర్యవంతురాలివో నీకు తెలియదు. నీలోని శక్తి,సామర్థ్యాలను తెలుసుకునేంత వరకు నువ్వు ఎంత శక్తిమంతురాలిలో నీకు తెలియదు’ అంటున్న రెహన యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. రెహన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలోని నుంచి కొంత... ‘మన కోసం ఒక అవకాశం ఎక్కడో ఒకచోట ఎదురుచూస్తుంటుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకోవడమే మన పని. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా తక్కువ చేసి చూశారా? ఏమీ సాధించలేరనే వెక్కిరింపులు మీకు ఎదురయ్యాయా! అయితే మీరు నా గురించి తెలుసుకోవాల్సిందే. చిన్నప్పుడు అక్కయ్యతో పోల్చుతూ నన్ను చిన్నబుచ్చేవారు. మనకు ఏ సబ్జెక్ట్‌లో ఆసక్తి ఉందో ఆ సబ్జెక్ట్‌లోనే రాణిస్తాం. మంచి విజయాలు సాధిస్తాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్ నుంచి కామర్స్‌కు మారాను. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పనిలేదు. అయితే జామియా యూనివర్శిటీలో పీజీ సిట్ మిస్ అయిన క్షణం మాత్రం కొంచెం నిరాశకు గురయ్యాను. దీని నుంచి నేను గుణపాఠం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసం మంచిది, అతి ఆత్మవిశ్వాసం మాత్రం చెడ్డది’ ‘మీ ప్రసంగం విన్న తరువాత నన్ను నేను చాలా మార్చుకున్నాను’ అని యూట్యూట్ కామెంట్ సెక్షన్లో ఒకే వాక్యంలో తనలోని మార్పు గురించి రాసింది ఒక అమ్మాయి. రెహన షాజహాన్ స్ఫూర్తిదాయకమైన విజేత అని చెప్పడానికి ఆ అమ్మాయి కామెంట్ చాలు కదా! చదవండి: Divya Mittal: ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి -
తలక్కల్ చందు తలవంచిందేలే!
కేరళ ఆదివాసీ వీరుడు తలక్కల్ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్ధంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే మలబారు తీరంలో మిరియాల వర్తకంపై ఏకఛత్రాధిపత్యం సాధించాలన్న కంపెనీ ప్రయత్నాలకు కేరళ ఆదివాసీ వీరులు అడ్డుగా నిలిచారు. ఈ వీరులకు పోరాటాల్లో కేరళ కొట్టాయంకు చెందిన వీర కేరళ వర్మ పళాసీ రాజా సాయం చేశారు. రాజా సాయంతో స్థానిక ఆదివాసీ వీరుడు తలక్కల్ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. 1779–1805 కాలంలో వయనాడ్‌లోని కురిచియ సైన్యాన్ని కంపెనీకి వ్యతిరేకంగా ఆయన ముందుండి నడిపించారు. కేరళ మనంతవాడికి చెందిన కక్కొట్టిల్ కురిచయ తరవాడ్ (కురిచయల ఉమ్మడి కుటుంబం)లో చందు కీలక సభ్యుడు. ఈ కుటుంబానికి పళాసీ ఎడచన నాయర్ కుటుంబంతో చాలా అనుబంధం ఉండేది. కురిచయ తెగ ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడేవారు. వయనాడ్ ప్రాంతంలో వరి సాగులో వీరు ముందంజలో ఉండేవారు. పన్నుల భారం మలబార్ రెవెన్యూ సెటిల్మెంట్కు మేజర్ విలియం మాక్లీడ్ పన్ను కలెక్టర్‌గా పనిచేసిన కాలం మలబార్ ప్రాంత రైతాంగానికి పీడకలలా మారింది. ముఖ్యంగా వయనాడ్ ఆదివాసీ రైతులను పన్నుల పేరిట విలియం పలు ఇక్కట్లు పెట్టాడు. మేజర్ కింద పనిచేసే అవినీతి అధికారులు అసంబద్ధ రెవెన్యూ సర్వేలు చేసేవారు. చివరకు ఒక్కో వ్యక్తి బంగారం రూపంలో చెల్లించాల్సిన పన్నులను 20 శాతం పెంచాడు విలియం. అలాగే వరి ఉత్పత్తిపై పన్ను 40 శాతం వరకు పెంచారు. వీటి వసూలు కోసం బ్రిటీష్ పోలీసులు, రెవెన్యూ అధికారులు కురిచియ తెగ నివాసాలపై దాడులు చేసేవారు. దాడుల సమయంలో అమాయక ఆదివాసీలను అవమానించడం, అణగదొక్కడం జరిగేది. ఇవన్నీ చూసిన చందు తన ప్రజల్లో విప్లవాగ్ని రగిలించాడు. వరి సాగుతో పాటు పోరాట అవసరాన్ని వివరించాడు. దీంతో వయనాడ్ ప్రాంత ఆదివాసీలు చందు నాయకత్వంలో సంఘటితమయ్యారు. మిలీషియా దాడి మేజర్ విలియం అకృత్యాలకు ప్రతిఘటనగా చందు నాయకత్వంతో దాదాపు 150 మంది కురిచయ మిలిషీయా 1802 అక్టోబర్ 11న వయనాడ్‌లోని పనమరం బ్రిటీష్ క్యాంపుపై దాడి చేసింది. ఆ సమయంలో క్యాంపులో 70 మంది సైనికులున్నారు. వీరంతా బొంబాయి ఇన్‌ఫ్యాంటరీకి చెందిన కెప్టెన్ డికెన్సన్ , లెఫ్టినెంట్ మాక్స్వెల్ ఆధ్వర్యంలో పనిచేసేవారు. కురిచయ ప్రజలను అవమానించడంలో వీరిది అందెవేసిన చేయి. అందుకే తొలిదాడికి ఈ క్యాంపును చందు ఎంచుకున్నాడు. కెప్టెన్ , లెఫ్టినెంట్ సహా ఏ ఒక్క సైనికుడిని మిగల్చకుండా కురిచయ సైనికులు హతమార్చారు. క్యాంపు నుంచి 112 తుపాకులు, ఆరు పెట్టెల మందుగుండు, రూ. 6వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్యాంపులో నిర్మాణాలన్నీ తగలబెట్టి కంటోన్మెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కురిచయల సైన్యంలో ఐదుగురు మరణించారు. ఈ దాడి దక్షిణ భారతంలో బ్రిటీషర్లకు తీవ్ర దిగ్భ్రమను కలిగించింది. కంపెనీకి అవమానం పనమరం దాడికి ప్రతీకారం కోసం బ్రిటీష్ సైన్యం దాదాపు మూడేళ్లు యత్నించింది. చందు సహా కురిచయన్ యోధులను బంధించాలని, తద్వారా పళాసీ రాజాను అదుపులోకి తీసుకోవాలని విపరీతంగా శ్రమించింది. అయితే కురిచయల గొరిల్లా పోరాట రీతులముందు బ్రిటీషర్ల ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా పులపల్లి సమీపంలోని సీతాదేవీ ఆలయంలో తలదాచుకొనేవారు. ఎలాగైనా వయనాడ్‌ను బ్రిటీషర్ల నుంచి విముక్తి చెందించి పళాసీ రాజాను గద్దెనెక్కించాలని కురిచయలు ప్రతినబూనారు. వీరి పోరాటాలను తట్టుకోలేని కంపెనీ ప్రభుత్వం 1803లో ఆ ప్రాంతమంతా మార్షల్ లా విధించింది. అయితే ఎవరూ ఈ చట్టానికి తలవంచకపోవడం, స్థానికులంతా బ్రిటీషర్లను ఎదరించడం వంటివి కంపెనీకి మరింత అవమానం మిగిల్చాయి. చివరకు ఆంగ్లో మరాఠా యుద్ధంలో వీరుడిగా పేరుగాంచిన ఆర్థర్ వెల్లెస్లీ సైతం కురిచయల చేతిలో ఓటమిని చవిచూశాడు. పట్టించిన నమ్మకద్రోహం ఎదురుదెబ్బలు తగిలిన చోట కుట్రలు పన్నడం బ్రిటీషర్లకు వెన్నతో పెట్టిన విద్య! చందు పోరాటాన్ని తట్టుకోలేని కంపెనీ చివరకు కుట్రలకు దిగింది. కురిచయల, చందు ఆచూకీ తెలిపినవారికి ధనం, భూమి ఇస్తామని ఆశపెట్టడంతో స్థానికుల్లో కొందరు నమ్మక ద్రోహానికి దిగారు. 1805 నవంబర్ 14న జరిగిన భీకర యుద్దంలో స్థానికుల కుట్ర కారణంగా చందు కంపెనీ చేతికి చిక్కాడు. పట్టుబడిన చందును పనమరం కోటకు తెచ్చి దాదాపు తీవ్రంగా హింసించి అనంతరం నవంబర్ 15న కోలీ చెట్టుకు ప్రజలందరి ముందర ఉరి తీశారు. ఆయన సహచరుడు ఎడచెన కుంకన్ బ్రిటీషర్ల చేతికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. చందు పోరాటం కేరళలో పలు స్వాతంత్య్రోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. 2012లో కేరళ ప్రభుత్వం పనమరం కోటలో చందు పేరిట మ్యూజియంను, స్మారకచిహ్నాన్ని నెలకొల్పింది. ఈ మ్యూజియంలో చందు, ఆయన తోటి వీరులు వాడిన విల్లంబులు ఇతర ఆయుధాలతో పాటు నాటి సాంప్రదాయక వ్యవసాయ సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: జైహింద్ స్పెషల్: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు) -
జలజ: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది
ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్’’ అంటోంది జలజా రతీష్. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్‌నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ. కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్‌కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు ట్రిప్‌ను ప్లాన్ చేసేలా చేసింది. భర్తతో కలిసి.. లాంగ్ ట్రిప్‌కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్ లోడింగ్ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్‌ల మీదుగా కశ్మీర్ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు. లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్‌ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్ ట్రిప్‌ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్లో ప్లైవుడ్ ట్రాన్స్పోర్ట్ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్ దించి, అక్కడ పంచదారను లోడ్ చేసుకుని కేరళ లో అన్లోడ్ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. జలజ తన ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు. సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా.. ‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్మర్గ్, పంజాబ్ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది. రోజూ చేసే పని అయినా రొటీన్‌కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. -
ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్‌జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్‌కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
నన్ అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకోని నిర్దోషిగా ప్రకటించిన కేరళ కోర్టు
Bishop Franco Mulakkal: కేరళలో నన్‌పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది. ఈ మేరు 2018లో జలంధర్ డియోసెస్ పరిధిలోని ఒక నన్ 2014 నుంచి 2016 మధ్యకాలంలో బిషప్ ఫ్రాంకో తన పై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు బిషప్ ఫ్రాంకోని అరెస్టు చేశారు. అంతేకాదు మరోవైపు పోలీసులు, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నన్‌లు వీధుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేశారు. అయితే ఒక నన్ ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం కేసులో అరెస్టయిన భారతదేశంలోని తొలి క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్. ఆ తర్వాత సుమారు 100 రోజులకు పైగా సాగిన విచారణ తర్వాత కోర్టు అతనిని అన్ని అభియోగాల నుండి విముక్తి చేసింది. ఈ మేరకు ఫ్రాంకో ములక్కల్ పోలీసులకు, కోర్టుకు సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. (చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు) -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
అ ఆ లు ప్రతి ఇంటికీ రావాలి
104 ఏళ్ల కేరళ కుట్టియమ్మ పరీక్షలు రాసి పాసవడం చూశాం. ఆమెకేనా ఆ అదృష్టం? ఐదారు దశాబ్దాల క్రితం పుట్టిన చాలా మంది స్త్రీలు చదువుకు నోచకనే జీవితంలో పడ్డారు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలుగా ఉన్న వారంతా కుట్టియమ్మకు మల్లే చదువుకోవాలని అనుకోవచ్చు. కేరళలో ఇలాంటి స్త్రీల కోసం ఇంటికి వచ్చి చదువు చెప్పే ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. కుట్టియమ్మ అలా ఇంట్లోనే చదివింది. దేశమంతా ఇలా అఆలు ఇళ్ల తలుపు తట్టాల్సి ఉంది. వెలుతురు నవ్వు చూడాల్సి ఉంది. ‘అ’ అంటే అమ్మ అని పుస్తకాల్లో చదువుకుంటాం. ఇక మీదట ‘అ’ అంటే ‘అవ్వ’ అని చదవాలమో. కుట్టియమ్మ అనే అవ్వ ఇప్పుడు ఆ మేరకు వార్తలు సృష్టిస్తోంది. దానికి కారణం ఆమె వయసు 104. ఆమె పరీక్షల్లో సాధించిన మార్కులు 100కు 89. మొన్నటి నవంబర్ 10న ఆమె ఈ పరీక్షలో కూచుంది. ఇంకేంటి. ఆమె పేరు మారుమోగదా? కేరళలోని కొట్టాయం జిల్లాలోని ‘అయర్ కున్నమ్’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మను చూడటానికి ఇప్పుడు ఆ ఊరికి కార్లు వస్తున్నాయి. అందులో నాయకులు వస్తున్నారు. కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నాడు. ఆమె ఇలా చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నాడు. ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది ఏ వయసులో అయినా చదువుకోవడానికి. రెండు నెలల్లో చదివి కుట్టియమ్మ కథ దేశంలోని లక్షల మంది స్త్రీల కథే. ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. ఇప్పటికి ఆమె తన వంశంలో ఏడు తరాలను చూసింది. కాని ఆమెకు చదువుకోవాలని ఉండేది. అక్షరాలను గుణించుకుని న్యూస్‌పేపర్ చదివే ప్రయత్నం చేసేది. కాని ఆమె పెన్ను పట్టుకుని రాయలేదు. కేరళ ప్రభుత్వం ‘సాక్షరతా మిషన్’లో భాగంగా ‘సాక్షరతా ప్రేరకులు’ పేరుతో వాలంటీర్లను నియమించి ఇలాంటి మహిళల కోసం ఇంటింటికి వెళ్లి చదువు చెప్పే ఏర్పాటు చేసింది. అలా ఫెహరా జాన్ అనే వాలంటీర్ ఆమె ఇంటికి వచ్చి చదువు చెప్పింది. ‘టీచర్‌ను చూసి ఆమె చిన్నపిల్లలా ఉత్సాహపడింది’ అని కుట్టియమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు. పరీక్ష రాస్తున్న కుట్టియమ్మ ‘ఆమె షరతు ఒక్కటే. పెద్దగా పాఠం చెప్పమని. ఎందుకంటే ఆమెకు సరిగా వినపడదు. నేను అరిచి చెప్పేదాన్ని. సాక్షరతా మిషన్‌లో భాగంగా కేరళలోని ప్రతి పంచాయితీలో ప్రాథమిక పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైతే 4వ తరగతి స్థాయి పరీక్ష రాయవచ్చు. ప్రాథమిక పరీక్షలో మలయాళం, లెక్కలు, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. పరీక్షకు కేవలం రెండు నెలల ముందే ఆమెకు చదువు మొదలయ్యింది. రెండు నెలల్లోనే ఆమె బాగా పాఠాలు నేర్చుకుంది. అంతే కాదు పెన్ను పట్టి అక్షరాలు రాయడం మొదలెట్టి మార్కులు కూడా తెచ్చుకుంది’ అంది ఫెహరా జాన్. ‘ఆమె గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకునేది. నస పెట్టడం అంటారు చూడండి. అలా’ అని నవ్వుతుంది ఆ పెద్ద వయసు స్టూడెంట్ కలిగిన చిన్న వయసు టీచర్. కర్ర పెండలం, చేపలు కుట్టియమ్మకు 104 సంవత్సరాలు ఉన్నా ఇంకా చురుగ్గా ఉంది. బి.పి, షుగర్ లేవు. కళ్లద్దాలు కూడా లేవు. రాత్రి పూట చూపు ఆనదు. వినపడదు. అంతే. ‘ఆమె ఉదయం పూట టిఫిన్ రాత్రి భోజనం తప్ప మధ్యలో ఏమీ తినదు. అవి కూడా కొంచెం కొంచెమే తింటుంది. మధ్యాహ్నం ఆమెకు పడుకునే అలవాటు లేదు. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు చేపలు, కర్రపెండలం ఇష్టం.’ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వయసులో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు మాత్రమే కాక ఆమె ఇంటికి కూడా గుర్తింపు వచ్చింది. ఇతరుల సంగతి ఏమిటి? ఏ మనిషికైనా తన పేరు తాను రాసుకోగలగడం, తన పేరును తాను చదువుకోగలడం ప్రాథమిక అవసరం. దేశంలో సంపూర్ణ అక్షరాసత్య కార్యక్రమాలు మొదలయ్యి ఇన్నాళ్లవుతున్నా అందరినీ అక్షరాస్యులు చేసే పని అంత సజావుగా సాగడం లేదు. కేరళలో మాత్రం 1989లోనే ‘కొట్టాయం’ జిల్లా సంపూర్ణ సాక్షరతను సాధించిన జిల్లాగా పేరు పొందింది. సాక్షరతా సూచిలో తమ రాష్ట్రం ముందుండేలా ఆ రాష్ట్రం నిరంతరం శ్రద్ధ పెడుతూనే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో చదువు, జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. వారి కోసం కొంత కాలం ప్రభుత్వాలు రాత్రి బడులు నిర్వహించాయి. ఇప్పుడు అలాంటి పని జరగడం లేదు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. కుట్టియమ్మ చూపిన పట్టుదల చదువుకు నోచుకోని ప్రతి మహిళా చూపితే, అందుకు వ్యవస్థలు మద్దతుగా నిలిస్తే దేశం నిజమైన వికాసంలోకి అడుగు పెడుతుంది. ఇంట్లో తన టీచర్ దగ్గర చదువుతూ... జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. -
విషాదం: మూడు తరాలను మింగేసిన వరద
తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొట్టాయం, ఇడుక్కి వంటి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరద కారణంగా కేరళ వ్యాప్తంగా 23 మంది మరణించినట్లు ప్రభుత్వ ప్రకటించింది. భారీ వర్షం కొట్టాయం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషుల్ని మింగేసింది. వరదలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కొట్టాయం జిల్లాకు చెందిన కావాలి ప్రాంతంలో మార్టిన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేవాడు. మార్టిన్‌కు భార్య, ముగ్గరు పిల్లలు. మార్టిన్ అమ్మ కూడా వారితో పాటే ఉండేది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. (చదవండి: వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది) ఈ క్రమంలో మార్టిన్ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో మార్టిన్ కుటుంబ సభ్యులంతా మృతి చెందారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు తరాల మనుషులను వరద మింగేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు మార్టిన్ బంధువులు, ఇరుగుపొరుగువారు. చదవండి: క‘న్నీటి’ రాత్రి: ఏడాది గడిచినా మానని గాయాలు -
కేరళలో ఆగని వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది. అన్ని విధాలా అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’
ఆ అమ్మాయికి వినికిడి సమస్య ఉంది. మాటలు సరిగ్గా పలకవు. ‘లాయర్ కావాలి’ అనేది ఆమె బలమైన కల. చాటుమాటుగా వెక్కిరింపులు... ‘నీకెలా సాధ్యం అవుతుంది తల్లీ’ అని వెనక్కిలాగే మాటలు వినబడి ఉండొచ్చు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ‘లక్ష్యం కోసం బలంగా నిలబడితే, లోకం తనకు తానుగా దారులు తెరుస్తుంది’ అంటారు. ‘అవును. ఇది నిజం’ అని చెప్పడానికి నిలువెత్తు ఆత్మవిశ్వాసం...సారా. కేరళలోని కొట్టాయంకు చెందిన సన్నీ, బెట్టి దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు. దురదృష్టవశాత్తు ముగ్గురికి వినికిడి సమస్య ఉంది. నార్మల్ స్కూల్లోనే చదివించారు. మిగతా విద్యార్థులతో పోటీ పడుతూ చదువులో తమ ప్రతిభను చాటుకున్నారు పిల్లలు. ఎక్కడా ఆత్మన్యూనతకు గురికాకుండా అణువణువూ ఆత్మవిశ్వాసం ఉండేలా పిల్లలను పెంచారు తల్లిదండ్రులు. సారా, మరియాలు కవలపిల్లలు. లాయర్ కావాలనేది సారా చిన్నప్పటి కోరిక. ‘కచ్చితంగా అవుతావు తల్లీ’ అని తల్లిదండ్రులు ఆశీర్వదించారు తప్ప ఎప్పుడూ చిన్నబుచ్చలేదు. బెంగళూరులో బి.కామ్ పూర్తి చేసింది సారా. ఇప్పుడిక తన చిరకాల కోరికను నెరవేర్చుకునే ఆనందసమయం వచ్చేసింది అనుకుంది. ఒక లా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే సారాకు వినికిడి సమస్య ఉన్న కారణంగా నిరాకరించారు. అయితే చదువులో తన పూర్వ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని సెయింట్ జోసెఫ్ లా కాలేజీ ఆడ్మిషన్ ఇచ్చింది. పాత క్లాస్‌మెట్ ఒకరు కూడా ఈ కాలేజీలో చేరడంతో తనకు సహాయంగా నిలిచినట్లయింది. కాన్స్ట్యూషనల్ లా, డిసెబిలిటీ లా, హ్యుమన్ రైట్స్లాను లోతుగా అధ్యయనం చేయాలనేది సారా కోరిక. సెయింట్ జోసెఫ్ కాలేజీలో నార్మల్ స్టూడెంట్స్‌తో పోటీ పడుతూ మంచిమార్కులు తెచ్చుకుంది. ‘లా’ పట్టా చేతికి వచ్చిన క్షణాలు తన జీవితంలో మరిచిపోలేని సమయం! ‘పట్టుదలతో కృషి చేస్తే, దారి ముందుకు వచ్చే అవరోధాలు తోకముడుస్తాయి’ అని మరోసారి గుర్తు చేసుకున్న సగర్వ సందర్భం. కర్నాటక బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయింది సారా. న్యాయశాస్త్రం చదువుకోవడం సరే ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’ అనే ప్రశ్నకు ‘ ఇంటర్ప్రెటర్ సహాయంతో’ అని జవాబు ఇచ్చింది సారా. సారా న్యాయవాద వృత్తిని ఎంచుకోవడానికి, న్యాయశాస్త్రం మీద ఆసక్తి, అభిమానాలతో పాటు వినికిడి సమస్య ఉన్న వాళ్లలో ‘యస్. నేను కూడా లాయర్ కాగలను’ అనే ఆత్మవిశ్వాసం నింపడం కూడా. చదవండి: Meenakshi Vashist: దీపం వెలిగింది -
అసలు నా మరో పేరు ఆనంద విహారి
కేరళకు చెందిన నిధి కురియన్ ప్రస్తుతం కోల్‌కతాలో ఉంది. ఆమె తమిళనాడులో పొలంగట్లన నిలబడింది. ఆంధ్రాలో చేపల చెరువులను చూసింది. ‘ఈ దేశం స్త్రీలకు ఎంత భద్రత ఇవ్వగలదో తెలుసుకోవాలి’ అని ఒంటరిగా సొంత కారులో సొంత డ్రైవింగ్ చేసుకుంటూ దేశాటనకు బయలుదేరింది. అర్ధరాత్రి తర్వాత సంగతి పట్టపగలు తిరగడమే స్త్రీకి కష్టం అని చెప్పే ఈ దేశంలో ఇష్టమైన విహారం మనమూ చేయొచ్చు అని తన అనుభవాలను రికార్డు చేస్తోంది నిధి. 33 ఏళ్ల నిధి కురియన్ రాయబోయే పుస్తకం కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వస్తువు అలాంటిది. ‘ఈ దేశమూ... ఈ దేశ స్త్రీలూ’... ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉన్నారో తను తెలుసుకోదలిచింది. అయితే అందుకు కంప్యూటర్ ఎదురుగా కూచుని గూగుల్ చేయలేదు. కారు తీసుకొని బయలుదేరింది. దానికి ‘ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్’ అని పేరు పెట్టింది. సోలో ట్రిప్ నిధి కురియన్‌ది కొట్టాయం. కొచ్చిలో నివసిస్తోంది. ట్రావెల్‌కు సంబంధించిన బ్లాగ్ ద్వారా కొత్త కొత్త ప్రాంతాల గురించి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న యాత్రల కంటే ఒక భారీ యాత్ర చేయాలని నిశ్చయించుకుంది. దేశం మొత్తం తిరుగుతూ ఆ దేశంలోని ప్రదేశాలలో స్త్రీలు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో నలుగురితో పంచుకోవాలనుకుంది. పుస్తకం రాయాలనుకుంది. అనేక ఆలోచనల తర్వాత 100 రోజుల్లో 25 వేల కిలోమీటర్లు సొంత కారులో సోలో ట్రిప్ చేయాలనుకుంది. తనకు రెనాల్ట్ కారు ఉంది. ఆ కారులో ఫిబ్రవరి 7, 2021న బయలుదేరింది. తమిళనాడు మీదుగా కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి విశాఖ మీదుగా ఒరిస్సా చేరుకుని ‘పూరి’ దర్శించుకుని ప్రస్తుతం కోల్‌కతా చేరుకుంది. ‘తమిళనాడు పంటపొలాల్లో స్త్రీలను కలిశాను. విశాఖలో చేపల మీద ఆధారపడి జీవించే స్త్రీల కష్టాన్ని చూశాను. ఒరిస్సా ఆవాల చేలలో స్త్రీలు పిలిచి తాము తెచ్చుకున్న ఆహారంలో పెట్టింది తిన్నాను. ఒరిస్సాలోనే ఒక ఊరు ఊరు హస్తకళలు చేయడంలో నిమగ్నం కావడం గమనించాను. స్త్రీలే ఎక్కువగా ఈ కళాఖండాలు చేస్తున్నారు. వారే కుటుంబానికి ఆధారం’ అని చెప్పిందామె. పూరిలో ప్రసాదాలు తయారు చేసి పంచే స్త్రీలతో ఆమె సంభాషించింది. ప్రస్తుతం కోల్‌కతా దారుల్లో అనంతంగా కనిపించే స్త్రీలలో తాను ఒక స్త్రీగా తిరుగుతోంది. ఆ స్త్రీల ప్రతిధ్వని ఏదో ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని ఆమె తన పుస్తకంలో రాస్తుంది. టూర్ కాదు ట్రావెల్... టూర్ చేయడం అంటే ఏవో ముఖ్య ప్రదేశాలను చూడటం... ట్రావెల్ చేయడం అంటే జన జీవనంలో భాగమై కలిసి తిరుగుతూ ఆ ప్రదేశాలను అనుభూతి చెందడం అంటుంది నిధి. ‘ఈ ప్రయాణం ఒక ధ్యానం కంటే తక్కువ కాదు నాకు’ అంటుందామె. కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనం లోకాన్ని తెలుసుకుంటాము. స్త్రీలు ప్రయాణాలు చేయాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం... అంతే కాదు, మన అనుభవాలు మిగిలిన స్త్రీలతో చెప్పగలుగుతాం అంటుందామె. ప్రస్తుతం నిధి తెల్లవారుజామునే తన ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రానికి ఆ రోజుకు నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కువగా యూత్ హాస్టల్స్‌లో దిగుతోంది. లేదంటే ముందే బుక్ చేసుకున్న హోటళ్లలో. అయితే ఆమె తన డిక్కీలో ఒక చిన్న సిలిండర్, వంట సామాగ్రి కూడా పెట్టుకుంది. ‘నేను తినడానికి ఈ దేశ యాత్ర చేయడం లేదు. ఏదో అవసరమైనది వండుకుంటా. లేదంటే స్ట్రీట్‌ఫుడ్ తింటా’ అని చెబుతోంది నిధి. ఆమె తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తోంది. ‘నీ ప్రయాణాన్ని నీతోపాటు మేమూ చేస్తున్నాం’ అంటున్నారు ఆమె ఫాలోయెర్స్. నిధి ఇప్పుడు కోల్‌కతా నుంచి ఉత్తర భారతదేశంలోకి వెళ్లనుంది. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల మీదుగా ప్రయాణిస్తూ దేశం తిరుగుతుంది. ఆమె యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది. నిధిలా తిరిగే అదృష్టం అందరికీ లేకపోవచ్చు. కాని ఆమె యాత్ర సేఫ్‌గా సఫలం అవ్వాలనుకునే హృదయం మనందరికీ ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
బర్డ్ ఫ్లూ కలకలం: రెండు జిల్లాల్లో అలర్ట్
తిరువనంతపురం : దేశంలో మళ్లీ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి మొదలైంది. తాజాగా కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు, తక్షణ స్పందన కోసం బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా గత వారం కొట్టాయం, అలపూజ రెండు జిల్లాలో అనేక బాతులు మరణించాయి. వీటిలో ఎనిమిది బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. వీటిలోని 5 శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్8) కనుగొన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పక్షులను వేరే ప్రదేశాలకు మార్చారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఇప్పటికే 12000 బాతులు మృత్యువాత పడ్డాయి. అలాగే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మరో 36,000 చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మరణాలు సంభవించే ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన సంబంధిత ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు అధికారులు డ్రైవ్ కూడా ప్రారంభించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది. -
అత్యాచార కేసు: బిషప్కు కరోనా
తిరువంతపురం: కేరళ నన్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సోమవారం నాటి రిపోర్టుల్లో అతనికి వైరస్ సోకినట్లు జలంధర్ నోడల్ ఆఫీసర్ టీపీ సింగ్ దృవీకరించారు. ఆయన లాయర్‌కు కరోనా సోకడంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఫ్రాంకోకు కూడా వైరస్ సోకినట్లు వెల్లడైంది. కాగా కొట్టాయమ్‌లోని స్థానిక కోర్టు ఆయన సరిగా కేసు విచారణకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బిషప్కు వైరస్ సోకినట్లు తెలిసింది. (ముద్దిస్తా కానీ కొరకకూడదు: పోప్) మరోవైపు జూలై 1న జరిపిన కోర్టు విచారణకు సైతం ఆయన హాజరవలేదు. పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందువల్లే కోర్టుకు రాలేకపోయానని తెలిపారు. కానీ ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లోనే లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఏకీభవించిన న్యాయస్థానం బిషప్ బెయిల్‌ను రద్దు చేయడమే కాక నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. (‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’) -
ఆగని బతుకు చక్రం
జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది. ముందుంది మంచికాలం అజ్మల్‌కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్‌కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్‌కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్. హాస్టల్‌కి లాక్డౌన్ కోళికోద్‌కు చెందిన ప్రీతి సంతోష్‌కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. తొంభై మందితో హాస్టల్ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్‌డౌన్‌తో హాస్టల్‌కు లాక్ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్‌ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చేదెక్కిన దుబాయ్ కాఫీ కరీమ్ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్‌లో చిన్న కాఫీ షాప్ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద చేపల ట్యాంక్ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు. ఆదుకుంటున్న అప్పడాలు కృష్ణదాస్ ఎనిమిదేళ్లుగా కోళికోద్లో ఆటో నడిపేవాడు. లాక్‌డౌన్‌తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్. -
సోదరి ప్రేమికుడిపై విచక్షణారహితంగా దాడి
తిరువనంతపురం: తన సోదరిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో దళిత యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన కేరళలో ఆదివారం చోటు చేసుకుంది. ఎర్నాకులంలోని మువట్టుపుఝకు చెందిన 20 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. ప్రేమ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు దళితుడిని మర్చిపోవాలంటూ సోదరిని మందలించాడు. అయినప్పటికీ వాళ్లిద్దరూ ప్రేమను వదులుకోడానికి ఇష్టపడలేదు. ఇదిలా వుండగా ఆదివారం సాయంత్రం యువతిని ప్రేమించిన వ్యక్తి ఫేస్ మాస్కు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. (నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్) అక్కడికి చేరుకున్న యువతి సోదరుడు అతడిని బయటకు రమ్మని పిలిచాడు. దీంతో అతను దుకాణంలో నుంచి బయటకు రాగానే కత్తి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై తీవ్ర గాయాలైన అతడిని కొట్టాయంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి సహకరించిన పదిహేడేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. (నవవధువు అనుమానాస్పద మృతి) -
ఒకే వేదికపై మోదీ, విజయన్, పోప్!
కొట్టాయం: ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పోప్ ఫ్రాన్సిస్ వీరంతా కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ అమలవుతుండగా ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? దీనికి గురించి తెలుసుకోవాలంటే కేరళలోని ఎలక్కాడ్ ప్రాంతానికి వెళ్లాలి. స్థానిక సెయింట్ మెరీస్ చర్చిలో ఆదివారం వీరి అట్ట బొమ్మలను కుర్చీల్లో పెట్టారు. తర్వాత ఈ బొమ్మలకు చర్చి ఫాదర్ పాల్ చలవీటిల్ శాలువాలు కప్పి సన్మానం చేశారు. ‘కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోదీని సముచితంగా అభినందించాలని అనుకున్నాం. కేరళలో కోవిడ్ నివారణ చర్యలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇతరులకు ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ బొమ్మల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామ’ని పాల్ తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధుల బొమ్మలకు కూడా ఈ సందర్భంగా సన్మానం చేశారు. చర్చి ద్వారా సేకరించిన లక్ష రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు పాల్ తెలిపారు. కేంద్రం ఆగ్రహం: వెనక్కి తగ్గిన కేరళ! -
క్యాన్సర్ లేకున్నా చికిత్స.. జుట్టంతా పోయి
తిరువనంతపురం : వైద్యుల నిర్వాకం ఓ మహిళ నిండు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. వారి అవగాహనలేమి, నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. క్యాన్సర్ లేకున్నా కీమోథెరపీ చేయడంతో శరీరం బలహీనమవడంతో పాటు బతుకుభారంగా మారింది. వివరాలు.. కేరళలోని కొట్టాయంకు చెందిన రజని(38) ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రొమ్ములో గడ్డలు రావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తీసేశారు. అనంతరం వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. కానీ రిపోర్టులు రాకముందే రజనీకి బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని నిర్ధారించిన వైద్యులు ఆమెకు కీమోథెరపీ మొదలు పెట్టారు. కొట్టాయం గవర్నమెంటు మెడికల్ కాలేజీలో చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో ఆమెకు కాన్సర్ లేదనే విషయం బయటపడింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కీమోథెరపీతో జుట్టంతా ఊడిపోవడంతో పాటు రజనీ శరీరం బలహీనమై పోయింది. అంతేకాకుండా మందుల కోసం భారీగా ఖర్చుపెట్టడంతో ఆర్థికంగా కూడా ఆమె చితికిపోయింది. ఈ క్రమంలో మీడియా ముందు రజనీ తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి...
సాక్షి, తిరువనంతపురం: కనిపించకుండా పోయిన ఓ కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కేరళలో కలకలం రేపింది. ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్, అతని భార్య ఇద్దరు పిల్లలు గత నాలుగు రోజులుగా అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి పెరట్లోనే వారి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా ఆ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఇంట్లోకి వెళ్లిన బంధువులు ఇంటి గోడలకు రక్తపు మరకలు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డాగ్ స్క్వాడ్ సాయం తీసుకోగా.. అవి పెరట్లోని ఓ గుంత వద్ద ఆగిపోయాయి. అక్కడ తవ్వి చూసిన పోలీసులు నాలుగు మృత దేహాలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. మృతులను కృష్ణన్(56), సుశీల(52), ఆర్ష(21), అర్జున్(19) గా గుర్తించారు. ఇంట్లో ఓ సుత్తి, కత్తికి రక్తపు మరకలు ఉండటంతో వారిని వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాల ఆధారంగా వారిని కిరాతకంగా హత్య చేశారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణన్‌కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా ఆ ప్రాంతంలో పేరుంది. పలువురు ప్రముఖులు కూడా అతన్ని కలుస్తుంటారని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఆ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. చేతబడి, కోణంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీకి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కేసును త్వరగా చేధిస్తామని అంటున్నారు. బురారీ కేసు; ఊహించని ట్విస్ట్ -
మృగాళ్లలా ప్రవర్తించారు.. వదిలిపెట్టొద్దు
సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్‌రేప్ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్ చేయాలని బుధవారం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు. కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని చర్చి మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేస్తూ.. ఆమె భర్త ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. ‘20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా, 2006లో మహిళకు వివాహం కాగా, వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదంట. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు వివరించగా.. ఆయన మత గురువుల ఆరాచకాలను వెలుగులోకి తెచ్చాడు. మృగాళ్లలా ప్రవర్తించారు.. కాగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మత గురువులు మృగల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకడైన ఫాదర్ జాబ్ మాథ్యూ పోలీసులకు గురువారం లొంగిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలో గత 18 నెలలుగా.. మొత్తం 12 మంది మత గురువులను లైంగిక దాడుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మేమేం రక్షించట్లేదు.. కాగా, ఈ వ్యవహారంలో చర్చి అధికారులపైనా విమర్శలు చెలరేగాయి. వారిని రక్షిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫిర్యాదు అందగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇప్పుడు వారికి-చర్చికి ఎలాంటి సంబంధం లేదు’ అని ఓ ప్రకటనలో చర్చి మేనేజ్మెంట్ పేర్కొంది.