Leander Paes
-
భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతుంది: లియాండర్ పేస్
ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్‌కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల పట్టిక టాప్–10లో నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని పేర్కొన్నాడు. ముంబైలో బుధవారం జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా పేస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పేస్‌తో పాటు మహేశ్ భూపతి, సానియా మీర్జా, సోనాలీ బెంద్రే, రకుల్‌ప్రీత్ పాల్గొన్నారు. ‘దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. వారిని గుర్తించి సానపెట్టాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతుంది’ అని పేస్ ఆశాభావం వ్యక్తంచేశాడు.చదవండి: ENG vs PAK: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్‌రాజ్
న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్‌కప్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్‌లో 8 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో 10 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెల్చుకున్న పేస్‌కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంపిక చేశారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్‌లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్‌రాజ్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్‌లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్‌గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్‌రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్‌గా 15 టైటిళ్లు సాధించిన అమృత్‌రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్‌గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
కలిసిరాని ప్రేమ, నాలుగోసారి బ్రేకప్ చెప్పిన ఖడ్గం బ్యూటీ!
ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ, టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్‌ల బంధానికి బీటలు వారింది. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో కిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లియాండర్ పేస్‌తో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కుతారనుకుంటే ఇలా సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. కిమ్‌కు బ్రేకప్ కొత్త కాదు! ఖడ్గం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీరలో 'ఏం పిల్లడో ఎల్దం వస్తవా' స్పెషల్ పాటతో మరింత పాపులర్ అయింది. హిందీలోనూ పలు చిత్రాలు చేసిన ఆమె సినిమాల కంటే కూడా లవ్ ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం నడిపిన ఆమె పలు కారణాలతో అతడికి బ్రేకప్ చెప్పింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను పెళ్లాడగా కొంతకాలానికే అతడికి విడాకులిచ్చేసింది. తర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించినప్పటికీ అదీ ఎంతోకాలం నిలవలేదు. రెండేళ్లుగా టెన్నిస్ స్టార్ లియాండర్పేస్తో రిలేషన్లో ఉన్న ఆమె చివరకు అతడికి కూడా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. లియాండర్‌కు కూతురు కూడా ఉంది.. అటు లియాండర్ పేస్ కూడా ఎంతోమందితో ఎఫైర్స్ నడిపాడు. ప్రముఖ మోడల్ రియా పిళ్లైతో సహజీవనం చేయగా వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. తర్వాత కిమ్‌తో లవ్‌లో పడ్డాడు. 2020 చివరిలో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ టెన్నిస్ స్టార్.. 1992 నుంచి 2016 వరకూ మొత్తం 7 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతని సుదీర్ఘ కెరీర్లో 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడమే కాకుండా 18 గ్రాండ్‌స్లామ్(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్)ల్లో విజేతగా నిలిచాడు. -
Leander Paes: ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా
Leander Paes Inspirational Journey: 1996 ఆగస్టు 3.. భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. ఒలింపిక్స్‌లో పతకం గురించి ఎదురు చూసి చూసి ఇక మనకు రాదులే అనుకొని నిట్టూర్చిన ఒక తరం క్రీడాభిమానులకు సుదినం.. ఒలింపిక్స్ వేదికపై జాతీయ జెండా ఎగురవేసేందుకు నేనున్నానంటూ ఒక్కడు దూసుకొచ్చాడు.. 16 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్‌ను చేర్చాడు. వ్యక్తిగత విభాగంలోనైతే 44 ఏళ్ల తర్వాత భారత ఆటగాడి పేరు వినిపించింది. మెగా వేదికపై విజయంతో తానేంటో చూపించిన అతని పేరు లియాండర్ పేస్! ఈ విజయంతో ఆగిపోకుండా ఆ తర్వాతా.. ఏళ్ల పాటు భారత టెన్నిస్‌కు పర్యాయపదంలా నిలిచిన స్టార్... వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో కనీసం ఒక్క పతకం కూడా సాధించలేని మన దేశం.. అసలు ఒలింపిక్స్ అంటే మనవి కావు, మనకు ఎలాగూ పతకాలు గెలిచే అవకాశమే లేదు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుంటున్న సమయం.. ఎప్పుడో 1980లో హాకీలో పతకం వచ్చింది. ఆ తర్వాత 1984, 1988, 1992.. క్యాలెండర్ మారింది కానీ కనీసం కంచు మోత కూడా వినిపించలేదు. భారత్‌కు మిగిలింది రిక్త హస్తమే.. సరిగ్గా చెప్పాలంటే ఒక తరం మొత్తం ఒలింపిక్స్ పతకం గురించి ఆలోచించడమే మానేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఒలింపిక్స్ పతకం భారత క్రీడలకు కొత్త ఊపిరి పోసింది. అప్పటినుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత్ వరుసగా ఏదో ఒక పతకం గెలుస్తూనే వచ్చింది. టీనేజర్ నుంచి వెటరన్ వరకు.. 1990లో టీనేజర్‌గా పేస్.. డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 47 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ఉత్సాహం, అదే జోరు.. పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్.. దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్నాడు. అలుపు లేని ఆటసారి 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకున్న రికార్డులు మరో ఎత్తు. ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజుల్లేవు.. ఇదెలా సాధ్యం ఈ మనిషికి? మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది భావించే ఆటలో 47 ఏళ్ల వయసు వచ్చినా గ్రాండ్‌గా ఆడి చూపించిన అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే వరకు చూస్తే టెన్నిస్‌లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి ఎడ్బర్గ్, బెకర్, లెండిల్ లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఆపై ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడింది. కెరీర్లో ఎక్కువ భాగం డబుల్స్‌లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను (ఆ)హాశ్చర్యంతో చూశారు భారత క్రీడాభిమానులు. కానీ టెన్నిస్‌లాంటి వ్యక్తిగత క్రీడలో 30 ఏళ్లు సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... 1990లో పేస్.. జూనియర్ వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత కాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 ఒలింపిక్స్‌లో అతని వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్స్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్.. ఆ తర్వాత తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్స్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్ పేస్‌కు సంబంధించి ప్రతి భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే ‘వాలి’ బలం రెట్టింపు అయిపోయినట్లు.. భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా.. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్‌కప్ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంతటి ఆటగాడైనా సరే.. తన వీరోచిత ప్రదర్శనతో పేస్.. డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిక్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్‌ల్లో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచ్చిన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్ సెమీస్‌కు చేరడంలో పేస్‌దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి.. 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో కోర్టు అటు వైపు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి. శరీరంపై నియంత్రణ కోల్పోయి.. నిలబడేందుకు భాగస్వామి మార్టినా నవ్రతిలోవాను ఆసరాగా చేసుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మార్టినా సిద్ధమైంది. దాన్నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్థానం సాగిస్తూ... పేస్ ఆటతీరు భీకరమైన సర్వీస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్.. కుర్రాళ్ల ఆటగా మారిపోయిన కొత్త తరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో పదునును చూపించింది. రాడ్‌లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్.. వేర్వేరు భాగస్వాములతో కలసి 100కు పైగా మ్యాచుల్లో డబుల్స్ బరిలోకి దిగాడు. ఆటను పిచ్చిగా ప్రేమించిన పేస్ ఏ స్థాయిలోనైనా చివరి వరకు ఆడుతూనే వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. (క్లిక్ చేయండి: మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ) - మొహమ్మద్ అబ్దుల్ హాది -
లియాండర్ పేస్ గురువు కన్నుమూత
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్ ప్లేయర్, డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ నరేశ్ కుమార్ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్ లియాండర్ పేస్‌కు మెంటార్‌గా వ్యవహరించిన నరేశ్ కుమార్.. పేస్ తన కెరీర్లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్ కప్‌లో పేస్‌కు మెంటార్‌గా వ్యహరించిన నరేశ్ కుమార్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల నరేశ్ కుమార్ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్ కుమార్ 1928 డిసెంబర్ 22న లాహోర్‌లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్‌షిప్స్ ద్వారా టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన నరేశ్ కుమార్.. ఆ తర్వాత మరో టెన్నిస్ ప్లేయర్ రమానాథన్ కృష్ణన్‌తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్ నుంచి టెన్నిస్‌లో కీలకపాత్ర పోషించాడు. ఇక 1952లో డేవిస్ కప్ జర్నీ ఆరంభించిన నరేశ్ కుమార్ ఆ తర్వాత భారత్ తరపున డేవిడ్ కప్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్ కుమార్ తన టెన్నిస్ కెరీర్లో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ తరపున తొలిసారి నాలుగో రౌండ్‌కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్లో అప్పటి టెన్నిస్ ప్రపంచ నెంబర్‌వన్ టోనీ ట్రేబర్ట్ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. ఇక నరేశ్ కుమార్ ఖాతాలో ఐదు సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్ చాంపియన్‌షిప్స్.. 1952లో వెల్ష్ చాంపియన్స్, 1957లో ఎసెక్స్ చాంపియన్షిప్స్లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నరేశ్ కుమార్ తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్ కుమార్.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ కోచ్‌గా నిలిచారు. -
టెన్నిస్ స్టార్‌తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్‌తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్‌బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్‌ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్‌ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్‌తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్‌తో రిలేషన్షిప్లో ఉంది. -
మహిమాతో బ్రేకప్.. రియాతో సహజీవనం.. లియాండర్ పేస్ బ్రేకప్ స్టోరీ
ఆట లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది.. నటన భావోద్వేగాన్ని అనుసరిస్తుంది! ఈ రెండిటి మధ్య ప్రేమ కుదిరితే లౌక్యం గెలుస్తుంది.. భావోద్వేగం వీలైతే సర్దుకుపోతుంది.. వీల్లేకపోతే ఓటమిని అంగీకరిస్తుంది.. బాలీవుడ్‌తో టెన్నిస్ కూడా ప్రేమలో పడింది. ఆ జంటే మహిమా చౌధరి, లియాండర్ పేస్!! లియాండర్, మహిమా.. ఒకరికొకరు పరిచయం అయ్యేనాటికి ఇద్దరూ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. ఒక పార్టీలో కలుసుకున్నారు ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితుల ద్వారా. తొలి చూపులోనే మహిమాతో ప్రేమలో పడ్డాడు లియాండర్. అతని ప్రేమను చూసి మురిసిపోయింది మహిమా. కెరీర్ కన్నా అతనితో కలసి ఆస్వాదించే కాలానికే ప్రాధాన్యమిచ్చింది. ఇంకా చెప్పాలంటే లియాండర్ కెరీరే ముఖ్యమనుకుంది. అందుకే టెన్నిస్ ఆడడానికి అతను ఎక్కడికి వెళ్లితే అక్కడికి వెంటే వెళ్లింది. అతని బాగోగులను పట్టించుకుంది. అలా మూడేళ్లు సంతోషంగా గడిచిపోయాయి ఆ ఇద్దరి జీవితంలో! 2003... నెమ్మదిగా లియాండర్ పేస్ మది చలించసాగింది. కళ్లు ఇంకొకరి కోసం వెదకసాగాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్ రియా పిళ్లై. ఎక్కడో ఈవెంట్లో ఆమెను చూశాడు. ఇట్టే మనసు పారేసుకున్నాడు. ఆ విషయం రియాతో చెప్పాడు కూడా. అప్పటికే సంజయ్ దత్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న రియా.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. ఫోన్ కబుర్లు, డిన్నర్ డేట్లు షెడ్యూల్లో భాగమయ్యాయి. రియాకు తన టైమ్ ఇవ్వడం వల్ల సహజంగానే మహిమాకు దూరమవసాగాడు లియాండర్. గ్రహించింది ఆమె. కారణం అడిగింది. ‘చూస్తున్నావ్ కదా మ్యాచ్‌లు, ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉంటున్నాను’ అని చెప్పాడు పొడిపొడిగా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో లియాండర్ ఎంగేజ్ అవడం మహిమా ఆలోచనల్లో అనుమానానికి తావిచ్చింది. ఒకసారి రియాతో అతను మాట్లాడుతుండగా విన్నది కూడా. నిలదీసింది. అప్పుడూ అదేం లేదంటూ ఆ సందర్భాన్ని తప్పించాడు. అయినా మహిమా మనసు లియాండర్ ప్రవర్తనను తప్పుపడుతూనే ఉంది. అందుకే లియాండర్ చెప్పే మాటలను నమ్మలేదు. ఒకసారి.. లియాండర్.. రియాతో చనువుగా ఉండడాన్ని చూసింది మహిమా. ‘ఇప్పుడు ఏం మాయ చేసి.. ఏ అబద్ధం చెప్పి దాటవేస్తావ్?’ అని ప్రశ్నించింది కళ్ల నిండా నీళ్లతో. తలవంచుకున్నాడు లియాండర్. చెదిరిన మనసుతో అతని జీవితం నుంచి తప్పుకుంది మహిమా. సహజీవనం మహిమాతో బ్రేకప్ తర్వాత వెంటనే రియాతో సహజీవనం స్టార్ట్ చేశాడు లియాండర్. 2005 –08 మధ్యలో ఆ ఇద్దరూ ముంబైలోని కొలాబాలో పెళ్లీ చేసుకున్నారని వదంతి. ఆ ఇద్దరికీ కూతురు పుట్టింది. పేరు అయానా. సంతోషంగా సాగిపోతోంది వాళ్ల కాపురం అనే అనుకున్నారు లియాండర్ అభిమానులు.. 2014లో లియాండర్, అతని తండ్రి మీద రియా డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ పెట్టేదాకా. ఆ వార్త విని అంతా హతాశులయ్యారు. కూతురి కస్టడీ కోసమూ కేస్ ఫైల్ చేసింది రియా. వాళ్ల ప్రేమ.. అలా వివాదంగా ఎందుకు మారిందనే ఆరా మొదలైంది రియా అభిమానుల్లో. ‘రియా కోసం నన్ను మోసం చేసినట్టే ఇంకెవరికోసమో రియానూ మోసం చేసి ఉంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మహిమా. ఆమె అన్నట్టుగానే కొన్నాళ్లకే.. టెన్నిస్ క్రీడాకారిణి తన్వీ షాతో లియాండర్ ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లోని సత్యాన్ని ఇటు లియాండర్ కానీ అటు తన్వీ కాని నిర్ధారించలేదు. కానీ ప్రస్తుతమైతే లియాండర్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడని వినికిడి. వాళ్లిద్దరూ కలసి గోవాలో హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వినికిడిని ఈ దృశ్యాలు నిజం చేసినట్టుగా భావిస్తున్నారు క్రీడా, సినీ అభిమానులు. మహిమా ఏం చేస్తోంది? లియాండర్ కోసం తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసిన మహిమా .. ప్రేమలో అతను చేసిన మోసం నుంచి బయటపడ్డాక బాబీ ముఖర్జీ అనే ఆర్కిటెక్ట్, బిజినెస్‌మన్‌ను పెళ్లిచేసుకుంది. వాళ్లకో కూతురు అరియానా. కానీ పరస్పర విరుద్ధమైన స్వభావాలు.. దాని వల్ల తలెత్తిన స్పర్థల వల్ల మహిమా, బాబీ సఖ్యంగా ఉండలేకపోయారు. కూతురుని పెట్టుకుని విడిగా ఉంటోంది మహిమా. మళ్లీ సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నిస్తోంది. లియాండర్ పేస్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు. కానీ నాతో మాత్రం ఫెయిర్‌గా లేడు. అతను ఇంకో స్త్రీ చుట్టూ తిరుగుతున్నాడనే నిజం తెలిసినప్పుడు నేనేమంత షాక్ అవలేదు. ఎందుకంటే అప్పటికే అతనెలాంటివాడో తెలిసిపోయింది. అందుకే ఆ బ్రేకప్ కూడా నా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకరకంగా నాకు హెల్పే చేసింది. నాలో పరిణతిని పెంచింది! – ఒక ఇంటర్వ్యూలో లియాండర్ పేస్ గురించి మహిమా చౌధరి. -ఎస్సార్ -
టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు
Leander Paes Join TMC కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. We are extremely delighted to share that Shri @Leander joined us today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial! Together, we shall ensure that every single person in this nation sees the Dawn of Democracy that we have been waiting for since 2014! — All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021 (చదవండి: ‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?) టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్ పేస్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్’’ అన్నారు. చదవండి: జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు -
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ జోడి మరోసారి చాంపియన్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
Kim Sharma: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?
Kadgam Actress Kim Sharma Life Story: ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ మూవీ డర్(1993)లో అతిథి పాత్రతో వెండితెరకు పరిచయం అయింది కిమ్ శర్మ. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ .. 2002లో ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్ శర్మ. ఆ తర్వాత మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించింది. (చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా) యువరాజ్ ప్రేమాయణం.. బిజినెస్ మ్యాన్‌తో వివాహం ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది ఈ భామ. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది. 2010లో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అతనితో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేసింది. విడాకులు తీసుకునే సమయంలో ఆమె మాజీ ప్రియుడు యువరాజ్ సింగ్ కిమ్ కెన్యాకు వెళ్లడం గమనార్హం. అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ, హర్షవర్థన్ రాణేల డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. లియాండర్ పేస్‌తో డేటింగ్! ప్రస్తుతం ఈ బ్యూటీ టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్‌తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లిన ఫోటోలు కూడా మీడియాకు చిక్కాయి. అయితే వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై ఇంతవరకు నోరు విప్పలేదు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కిమ్.. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
టెన్నిస్ దిగ్గజంతో ఖడ్గం బ్యూటీ డేటింగ్..?
ముంబై: 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్), భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(48).. ఖడ్గం సినిమా బ్యూటీ కిమ్ శర్మతో డేటింగ్లో ఉన్నాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ.. వీరి జోడీ గోవా బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరూ ఇలా కెమెరా కంటికి చిక్కడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో వీరు దగ్గరగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను వారు బస చేసిన హోటల్ యాజమాన్యమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) కాగా, 2007లో కిమ్ శర్మ.. టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువ్రాజ్సింగ్తో ప్రేమాయణం సాగించింది. అయితే, వీరిద్దరికి పొసగకపోవడంతో కొద్దికాలంలోనే విడిపోయారు. ఆతర్వాత యువీ.. హేజిల్ కీచ్‌ను పెళ్లి చేసుకోగా, కిమ్ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను మనువాడింది. అయితే, 2016లో అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న ఈ 40 ఏళ్ల ఢిల్లీ భామ.. ఆతర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించింది. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) ఆతర్వాత ఏమైందో తెలీదు కానీ ప్రస్తుతం ఆమె పేస్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పేస్ సైతం చాలా మందితో ఎఫైర్లు నడిపాడు. ఇటీవలి కాలంలో అతను ప్రముఖ మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికైతే పేస్, కిమ్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. కాగా, కిమ్.. కృష్ణవంశీ పాపులర్ సినిమా ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద'.. అలాగే మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ భారీ ప్రేక్షకాధరణ పొందింది. View this post on Instagram A post shared by The Project Café Ahmedabad (@theprojectcafeahd) -
‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?
కోల్‌కతా: వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ‘మహమ్మారి బారిన పడతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నేను నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చరిత్ర పుటల్లో భారత్ పేరు లిఖించేందుకే నేను 30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను కొట్టే టెన్నిస్ బంతికి నా వయస్సు గురించి తెలియదు. కేవలం ఎంత బలంగా, వేగంగా బాదుతున్నాననే అంశంపై అది కదులుతుంది. నాలో మరో ఒలింపిక్స్ ఆడేందుకు కావాల్సినంత ప్రేరణ ఉంది. విశ్వ క్రీడల్లో అత్యధికంగా వరుసగా ఎనిమిదిసార్లు టెన్నిస్ ఆడిన వ్యక్తిగా భారత్ పేరిట రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. టోక్యో ద్వారా ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేస్ వివరించాడు. నిజానికి గతేడాది క్రిస్మస్ రోజున... 2020 టెన్నిస్ సీజన్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ముగిస్తానని పేస్ ప్రకటించాడు. ఈ మేరకు ‘వన్ లాస్ట్ రోర్’ స్లోగన్‌తో ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. కరోనా కారణంగా ఏడాదిపాటు ఒలింపిక్స్ వాయిదా పడటంతో పేస్ మళ్లీ రాకెట్‌పట్టడం అనుమానంగా మారింది. తాజాగా పేస్ తన మనసులో మాటను బయటపెట్టడంతో ఒలింపిక్స్‌లో అతని ప్రాతినిధ్యం ఖాయంగానే అనిపిస్తోంది. ఈ సైకిల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్.. సైకిల్‌ను నడిపించే ప్రయత్నంలో ఇలా జారి కిందిపడ్డాడు. -
స్పాన్సర్లు వస్తారా?
కోల్‌కతా: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్ దేశం ఒలింపిక్స్‌ను ఎలా నిర్వహిస్తుందో తనకు అర్థం కావడం లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. ఒక అగ్రశ్రేణి ఆటగాడికి కరోనా సోకితే పరిస్థితి ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘ఒలింపిక్స్‌కు అండగా నిలిచే కార్పొరేట్ స్పాన్సర్లు ఎప్పటిలాగే ముందుకొస్తారా అనేది సందేహమే. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. మైదానాలు ఖాళీగా ఉంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. క్రీడలు కూడా ఒక పెద్ద వ్యాపారమే. నా చేతులకు కూడా పెద్ద మొత్తంలో బీమా ఉంటుంది. అనుమతి లేకుండా నేను టమాటాలు కూడా కోయలేను. ఫుట్‌బాల్ లీగ్‌లు ప్రారంభించారు సరే దురదృష్టవశాత్తూ ఏ రొనాల్డోకో, మెస్సీకో కోవిడ్–19 సోకితే ఏం చేస్తారు. ఆ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడటాన్ని మనం ఊహించగలమా. ఫుట్‌బాల్ అయినా సరే మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో ఆటగాళ్లు దగ్గరకు వస్తూనే ఉంటారు కదా. ఇలాంటి స్థితిలో క్రీడలు ఎలా సాధ్యం’ అని 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాలో కొత్త వెర్షన్‌ను చూస్తారు... సుమారు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే క్రమంలో ‘వన్ లాస్ట్ రోర్’ అంటూ ఈ ఏడాది ముగిసేవరకు ఆడే విధంగా 2020 ఆరంభంలో పేస్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని ఎనిమిదోసారి ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని కూడా అతను కలగన్నాడు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా అంతా తలకిందులైంది. ఒలింపిక్స్ సంవత్సరంపాటు వాయిదా పడగా... ప్రస్తుత సీజన్లో ఎన్ని టెన్నిస్ టోర్నీలు జరుగుతాయనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించే అవకాశం తనకు దూరం కావచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్స్ గురించి నేను నిజంగానే ఆందోళన చెందుతున్నాను. ఒక చరిత్ర సృష్టించేందుకు, భవిష్యత్తుపై నా ముద్ర నిలిచిపోయేందుకు నాకు అది మంచి అవకాశంగా కనిపించింది. ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా సీజన్‌ను ముగించాలని అనుకున్నా. కానీ ఏడాది ఆలస్యమైన పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనేది సందేహమే. దాదాపు 30 ఏళ్ల ఆట తర్వాత ఇక చాలంటూ రిటైర్ కావాలని గత సెప్టెంబరులో అనుకున్నాను. అయితే విరామం తీసుకొని కుటుంబంతో గడిపాక ఆలోచన మారింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా నాన్నతో ఎంతో సమయం వెచ్చించగలగడం సంతోషం. లాక్డౌన్ ముగిశాక మళ్లీ కోర్టులోకి అడుగు పెడతాను. ఒక కొత్త వెర్షన్ పేస్‌ను మీరు చూస్తారు. 30 ఏళ్ల వయసు లో ఎలా ఉండేవాడినో అలా వస్తాను’ అని పేస్ వెల్లడించాడు. -
100 గ్రాండ్ స్లామ్‌లు ఆడటం నా కల
న్యూఢిల్లీ: 100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాలనుకున్న తన కల కరోనా కారణంగా అనిశ్చితిలో పడిందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. రికార్డుస్థాయిలో వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న తన ఆశయాన్ని కూడా కరోనా చిదిమేసిందని పేర్కొన్నాడు. తన కెరీర్‌కు ఈ ఏడాదే చివరిదని పేస్ గతంలోనే ప్రకటించాడు. ఇప్పటివరకు 97 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన పేస్ మరో మూడింటిలో పాల్గొంటే 100 గ్రాండ్‌స్లామ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే కరోనాతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల నిర్వహణపై అనిశ్చితితోపాటు ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన ఆశలు నెరవేరేలా లేవన్నాడు. ‘100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ప్రాతినిధ్యం, ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించాలని పట్టుదలతో ఉన్నా. ఒకవేళ అందుకోలేకపోయినా... ఇప్పటివరకు సాధించిన వాటిపట్ల సంతృప్తిగానే ఉంటా. లాక్డౌన్ ఎత్తేశాక 2021లో కూడా ఆడాలా? వద్దా? అనేది నా టీమ్‌తో కలిసి నిర్ణయం తీసుకుంటా’ అని పేస్ వివరించాడు. -
టైటిల్ పోరుకు పేస్ జోడీ
బెంగళూరు: ఈ ఏడాదిలో రిటైర్ కానున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–ఆండ్రీ వాసిలెవ్స్కీ (బెలారస్) జోడీపై గెలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సరీ్వస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం పేస్ జంట పైచేయి సాధించి ఫైనల్‌కు చేరింది. -
మూడు దశాబ్దాల ఆటకు వీడ్కోలు
29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ఒక టీనేజీ కుర్రాడు తొలిసారి భారత జట్టు తరఫున డేవిస్ కప్ మ్యాచ్ ఆడాడు. డబుల్స్ మ్యాచ్‌లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలిసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు 46 ఏళ్ల ప్రాయంలోనూ కూడా అదే ఉత్సాహం, అదే జోరు... పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్... దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్న ఆ శరీరానికి అలసట వచ్చేసింది. వయసును గెలిచిన ‘ఆ కుర్రాడు’ వచ్చే ఏడాది తన మూడు దశాబ్దాల టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్... ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్... ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకుంటూ వస్తున్న రికార్డులకైతే అంతే కనిపించడం లేదు. అలసిపోవడం లేదు, ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజులే లేవు... ఈ మనిషికి ఎలా సాధ్యం. మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచి్చందని చాలా మంది భావించే ఆటలో 46 ఏళ్ల వయసు వచి్చనా గ్రాండ్‌గా ఆడి చూపిస్తున్న అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి డేవిస్ కప్‌లో కొత్త రికార్డు సృష్టించే వరకు టెన్నిస్‌లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెకర్, ఇవాన్ లెండిల్లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఇప్పుడు ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడుతూనే ఉంది. పేస్ ఆడేది డబుల్స్‌లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను ఆశ్చర్యంతో భారత క్రీడాభిమానులు చూశారు. కానీ టెన్నిస్‌లాంటి క్రీడలో 29 ఏళ్లుగా సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... పేస్ 1990లో జూనియర్ వింబుల్డన్... 1991లో జూనియర్ యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత సుదీర్ఘకాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్... ఇప్పటికీ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్... పేస్‌కు సంబంధించి ప్రతీ భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే వాలి బలం రెట్టింపు అయిపోయినట్లు... భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోరీ్నల సంగతి ఎలా ఉన్నా... దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్‌కప్ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంత బలమైన ఆటగాడు అయినా వీరోచిత ప్రదర్శనతో పేస్ డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్‌సెవిచ్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్‌లలో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచి్చన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్ సెమీస్ చేరడంలో పేస్‌దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి... 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో అటు వైపు కోర్టు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లు కమ్మాయి. శరీరంపై నియంత్రణ లేక నిలబడేందుకు భాగస్వామి మారి్టనా నవ్రతిలోవాను పట్టుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. చివరకు అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మారి్టనా నవ్రతిలోవా సిద్ధమైంది. దాని నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. వచ్చే ఏడాదే ఆఖరు... పేస్ ఆటతీరు భీకరమైన సరీ్వస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్ కుర్రాళ్ల ఆటగా మారిపోయిన ఈతరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ ఇటీవల మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో ఇంకా పదును మిగిలి ఉందనే చూపిస్తోంది. రాడ్ లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్, 100కు పైగా వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. ఇటీవల పదే పదే అతని రిటైర్మెంట్పై వార్తలు రావడం, దానిని అతను ఖండించడం చాలా సార్లు జరిగాయి. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటివి వినిపించడం సహజం. అయితే ఆటను పిచి్చగా ప్రేమించే పేస్, ఏ స్థాయిలోనైనా దానిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. డబుల్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 105వ ర్యాంకర్‌గా ఉన్న పేస్ వచ్చే ఏడాది కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాడు. కొన్ని విశేషాలు.... ►అంతర్జాతీయ టెన్నిస్‌లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడు. 18 గ్రాండ్‌స్లామ్‌లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్) గెలిచాడు. ►వరుసగా 7 ఒలింపిక్స్‌లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్ ఆటగాడు. 1999లో డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. వరుసగా 19 సీజన్ల పాటు (1997–2015) ఏడాదికి కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచాడు. ►తన ప్రొఫెషనల్ కెరీర్లో పేస్ ఇప్పటివరకు 55 టైటిల్స్ సాధించాడు. ఇందులో సింగిల్స్‌లో ఒక టైటిల్ ఉండగా... మిగతా 54 టైటిల్స్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ►సింగిల్స్ విభాగంలో పేస్ 101 మ్యాచ్‌ల్లో గెలిచి... 99 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. డబుల్స్‌లో పేస్ 767 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 455 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో పేస్ 85,71,006 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 61 కోట్ల 11 లక్షలు) సంపాదించాడు. ►1990లో జపాన్‌పై డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన పేస్ 57 సార్లు డేవిస్ కప్ బరిలోకి దిగాడు. 92 మ్యాచ్‌ల్లో గెలిచి (సింగిల్స్‌లో 48; డబుల్స్‌లో 44)... 35 మ్యాచ్‌ల్లో (సింగిల్స్‌లో 22; డబుల్స్‌లో 12) ఓడిపోయాడు. డేవిస్‌కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (44) సాధించిన ప్లేయర్‌గా పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ►ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేరి్పన క్రమశిక్షణ, చేసిన మార్గదర్శనం, కల్పించిన వాతావరణం ఇవన్నీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వారు నా పట్ల కనబరిచిన అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పటికీ మరువలేను. అమ్మా–నాన్న... మీరు లేకుంటే నేనూ లేను. ఐ లవ్ యూ. మా అక్కలకు థ్యాంక్స్ చెప్పాలి. జాక్వి, మరియాలిద్దరు నాకంటే పెద్దవాళ్లు. వాళ్లే నన్నింతలా మార్చేశారు. జీవన ప్రయాణంలో ఎత్తుపల్లాలు అర్థమయ్యేలా చేశారు. నేనో పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు బాగా సహకరించారు. తల్లిదండ్రులు చెప్పిన నైతిక విలువల్ని నేనూ పాటించేలా చేశారు. ఐ లవ్ యూ సిస్టర్స్. ఇక నా గారాలపట్టి... కుమార్తె అయానా! పాప లవ్స్ యూ. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అంశం కూతుర్ని కలిగి ఉండటం అనేది నీ వల్లే నాకు అర్థమైంది. అయానా నీవే నాకు స్ఫూర్తి. నా కెరీర్లో మిగిలున్నది 2020 టెన్నిస్ క్యాలెండరే! కేవలం ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడతాను. నా జట్టుతో చేసే ఆఖరి క్రీడా పయనాన్ని గొప్పగా మలచుకుంటా. సహచరులు, మిత్రులు, అభిమానులతో ఆనందంగా గడుపుతా. నా సుదీర్ఘ ప్రయాణానికి అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. అభిమానులకు విన్నపం. నాతో ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటే ‘లియాండర్ మెమోరిస్’కు షేర్ చేయండి. నేను నా మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటాను. ‘గుడ్‌బై ఇయర్‌గా 2020 నాకు ఉద్వేగంగా గడువనుంది. భారంగా నేను రాకెట్‌ను విడువనున్నాను. – ట్విట్టర్లో లియాండర్ పేస్ పేస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల డబుల్స్ ► ఆస్ట్రేలియన్ ఓపెన్: 2012 ►ఫ్రెంచ్ ఓపెన్: 1999, 2001, 2009 ►వింబుల్డన్: 1999 ►యూఎస్ ఓపెన్: 2006, 2009, 2013 మిక్స్డ్ డబుల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్: 2003, 2010, 2015 ►ఫ్రెంచ్ ఓపెన్: 2016 ►వింబుల్డన్: 1999, 2003, 2010, 2015 ►యూఎస్ ఓపెన్: 2008, 2015 ►పేస్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అర్జున అవార్డు...1996–1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’... 2001లో ‘పద్మశ్రీ’... 2014లో ‘పద్మభూషణ్’ అవార్డులు అందజేసింది. -
భారత్ 3.. పాకిస్తాన్ 0
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్-–జీవన్ నెడుంజెళియన్ జోడీ 6-1, 6-3 తేడాతో అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వు-నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్ పేస్ జంట అద్భుతమైన స్మాష్‌లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్‌ను 6-3 తేడాతో గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ టెన్నిస్ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. పేస్ రికార్డు 44కు చేరింది.. గతేడాది డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్ పేస్ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు. 57 డేవిస్ కప్ మ్యాచ్‌లకు గాను 44 విజయాలను పేస్ సాధించగా, నికోలా 66 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేశాడు. పేస్ 44 డబుల్స్ డేవిస్ కప్ రికార్డు సుదీర్ఘ కాలం చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్న డబుల్స్ ప్లేయర్లు ఎవరూ టాప్-10లో లేరు. పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఈ పోరులో భారత్ 2–0తో ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. తాజా గెలుపుతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది. దాంతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు మార్గం సుగుమం అయ్యింది. -
పేస్ పునరాగమనం!
న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్ స్టార్, 46 ఏళ్ల లియాండర్ పేస్ ముందుకొచ్చాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా నవంబర్ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేనితోపాటు అర్జున్ ఖడే, విజయ్ సుందర్ ప్రశాంత్, శ్రీరామ్ బాలాజీ, సిద్ధార్థ్ రావత్, మనీశ్ సురేశ్ కుమార్, శశికుమార్ ముకుంద్ ఉన్నారు. -
మొన్న అర్జున్.. నిన్న పేస్‌తో ఆటాడిన ధోని
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్‌కు విరామం తీసుకున్న ధోని.. ప్రస్తుతం కూడా సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధోని సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను రితి స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో, సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌తో ధోని తలపడ్డాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోని ప్రత్యామ్నయంగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ వరుసగా విపలమవుతుండటం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. -
పేస్-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతనితో సహజీవనం చేసిన మాజీ స్నేహితురాలు రియా పిళ్లై మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ‘కుటుంబ సంరక్షణ కేసు’లో దిగువ కోర్టుకు సుప్రీం కోర్టు మరో ఏడాది గడువు ఇచ్చింది. పేస్, రియా మధ్య ఉన్న వివాద పరిష్కారానికి సంవత్సరం వ్యవధి ఇచ్చి ఆపై తీర్పునివ్వాలని ఫ్యామిలీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో పేస్పై రియా గృహ హింస కేసు పెట్టడంతో తొలిసారి వివాదం కోర్టుకు చేరింది. తమ కూతురు సంరక్షణ, భరణం అంశాల్లో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. వీరిద్దరు కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా అది సాధ్యం కాలేదు. భరణం కింద ఇల్లు గానీ డబ్బు గానీ ఇవ్వాలని రియా కోరగా... తాను అసలు ఆమెను పెళ్లే చేసుకోలేదు కాబట్టి కుదరదని పేస్ కోర్టులో మరో కేసు దాఖలు చేశాడు. -
సెమీస్‌లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
ఇంకా ఆడుతున్నాడు... గెలుస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. వయసులో ఫిఫ్టీకి చేరువవుతున్నా... వన్నె తగ్గని ఈ వెటరన్ స్టార్ టోక్యో ఒలింపిక్స్‌పై కూడా దృష్టి పెట్టాడు. 46 ఏళ్ల పేస్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో స్థానిక భాగస్వామి బెనోయిట్ పెయిర్‌తో కలిసి శుభారంభం చేశాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలయ్యాక మ్యాచ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా పేస్ నిలిచాడు. తన కీర్తి కిరీటంలో చేరిన ఈ ఘనతపై అతను మాట్లాడుతూ ‘30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా సుదీర్ఘ ప్రస్థానంలో 12 తరాల ఆటగాళ్లను చూశా. ఆల్‌టైమ్ గ్రేట్ పీట్ సంప్రాస్, ప్యాట్ రాఫ్టర్లు సింగిల్స్ ఆడితే... నేను డబుల్స్ ఆడాను. టెన్నిస్‌లో నాకంటూ గౌరవాన్ని సంపాదించుకున్నాను’ అని అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా...రాఫెల్ నాదల్, అతని మాజీ కోచ్ టోనీ ఎదురుపడినపుడు ఆసక్తికర సంభాషణ జరిగిందన్నాడు. ‘నేను నా డబుల్స్ మ్యాచ్ ముగించుకొని వస్తుంటే వాళ్లిద్ద రూ ఎదురయ్యారు. నన్ను గుర్తించిన కోచ్ టోనీ... లియో (పేస్) నీకు 46 ఏళ్ల వయసు కదా! అంటే ఔనన్నా. రొలాండ్ గారోస్‌లో 1989 (జూనియర్స్), తర్వాత సీనియర్స్ ఆడావుగా అంటే ఔననే చెప్పా. ఇన్నేళ్లయినా మళ్లీ ఇక్కడ తొలి గేమ్ గెలిచావంటా... అంటే ఔననే తల ఊపాను. వెంటనే నాదల్‌తో చూశావా నాదల్... 46 వయసులో పేస్ ఆడటమే కాదు గెలవడం కూడా చేస్తున్నాడు’ అని చెప్పారు. ఓ మేటి కోచ్ మరో దిగ్గజ ఆటగాడు (నాదల్)తో తన గురించి చెబుతుంటే ఎంతో సంతోషం కలిగిందన్నాడు. టెన్నిస్‌లో అప్పటి దిగ్గజాల నుంచి ఇప్పటి గ్రేటెస్ట్ స్టార్ల వరకు అందరూ తనను గుర్తిస్తారని, గౌరవంతో చూస్తారని పేస్ చెప్పుకొచ్చాడు. నాదల్, రోజర్ ఫెడరర్లిద్దరూ తనకు టీనేజ్ వయసు నుంచే తెలుసని చెప్పాడు. ‘నా జీవితంలో టెన్నిస్‌తో నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడైతే (ఫ్రెంచ్ ఓపెన్‌లో) నాలుగు సార్లు డబుల్స్ టైటిల్ సాధించాను. అలసట ఎరుగని నా పయనంలో ఆటను ఇప్పుడప్పుడే ఆపలేను. 2020 ఒలింపిక్స్ కూడా ఆడేస్తానేమో. ఇప్పటికే అత్యధిక ఒలింపిక్స్ (6) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాను. మరోటి ఆడితే ఆ రికార్డును మెరుగుపరుచుకుంటా’ అని పేస్ వివరించాడు. -
క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది: శ్రీశాంత్
న్యూఢిల్లీ : ‘42 ఏళ్ల వయసులో లియాండ్ పేస్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకైనా మంచి క్రికెట్ ఆడలేనా’అంటూ క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశించడంతో శ్రీశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందన్నాడు. వయసు అసలు సమస్యే కాదన్న శ్రీశాంత్.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడొచ్చన్నాడు. ఈ ఆరు సంవత్సరాలు తన జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయన్నాడు. తాను నిర్దోషినని తెలిసి కూడా బీసీసీఐ నిషేధం విధించిందన్నాడు. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (శ్రీశాంత్‌కు భారీ ఊరట) వాళ్లు టచ్‌లో ఉన్నారు.. తనపై నిషేధం విధించడంతో కనీసం క్లబ్ క్రికెట్ కూడా ఆడలేకపోయానని శ్రీశాంత్ వాపోయాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి కూడా బీసీసీఐ అనుమతి నిరాకరించిందని గుర్తుచేశాడు. క్రికెట్ ఆడకున్నా తన సహచర క్రికెటర్లతో సంబంధాలు తెగిపోలేదని వివరించాడు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, రైనాలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఈ గడ్డుకాలంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లాయర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమిండియా గెలిచిన 2007, 2011 ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ సభ్యుడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించాడు. (పోలీస్ టార్చర్ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్) అసలేం జరిగిందంటే.. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!
మొనాకో: ఈతరం భారత టెన్నిస్ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్ నంబర్‌వన్, జర్మన్ స్టార్ బోరిస్ బెకర్ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్ గుర్తు చేశాడు. ‘టెన్నిస్‌లో భారత్ గతంలో మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను తాజా ఫామ్ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్ జొకోవిచ్ అధిగమిస్తాడని బెకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్‌కు 2014–16 మధ్య బెకర్ కోచ్‌గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు.