Liquor policy
-
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
ఏపీలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
-
Gunshot: అంతం కాదిది ఆరంభం.. మూడు చీప్ లు ఆరు చీకులు. ముంపులో మేతగాళ్లు
-
ఇసుక, మద్యంలో కూటమి పెద్దల అవినీతి: కాకాణి
నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్ ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు. ... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. .. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు! -
టిడిపి ఎమ్మెల్యేలంతా లిక్కర్ మాఫియాగా అవతరించారు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
ఏపీలో కొత్త మద్యం విధానంపై ఆగ్రహావేశాలు
-
టీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి: అమర్నాథ్ మండిపాటు
సా క్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలంటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలిందని ఆయన ధ్వమెత్తారు. ఆ దిశలోనే నిన్న (14వ తేదీ) జరిగిన మద్యం షాప్‌ల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని గుర్తు చేశారు.‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉంది. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది. 2019లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశాం. అలాగే 4500 వైన్‌షాప్‌లు ఉంటే, వాటిని 2900కి తగ్గించాం. ఆ విధంగా పేద కుటుంబాలను రక్షించి, వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని చెప్పారు.నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్ ఉంటుందని, అలాగే ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారని విమర్శించారు. కీలకమైన విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టేసి, వాటికి బదులు మద్యానికి అ«ధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకే వెంటనే మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. మద్యంపై పేదప్రజలు కూడా తప్పకుండా తిరగబడతారని ఆయన అన్నారు. -
టీడీపీ నేతల సంపద పెంచేందుకే కొత్త మద్యం పాలసీ..
-
దోపిడీకి పక్కాడీల్!
-
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే మద్యం లైసెన్సులు అంటే ఇక టెండర్లు ఎందుకు
-
టీడీపీ నేతలకు వరంగా మద్యం పాలసీ: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మంత్రిగా ఉన్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఏపీలో లిక్కర్ సిండికేట్ మాఫియా నడుపుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోంది. గతంలో ప్రభుత్వ మద్యం షాప్స్ ఉంటే.. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. మద్యం టెండర్స్‌ను టీడీపీ నేతలు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. రెండు లక్షల 50వేల కోట్ల రూపాయలు గతంలో తన వారికి మద్యంలో దోచిపెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరికి చెబితే వారికి దుకాణాలు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ అధికారులకి ఆదేశాలు వచ్చాయి.మంత్రిగా పని చేస్తున్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. దరఖాస్తులు వేయకుండా మద్యం వ్యాపారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 30 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మద్యం పాలసీ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాం. పాలసీని రద్దు చేసి.. పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఏపీలాగే హర్యానా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు -
బాబూ.. ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టే: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా?.. చంద్రబాబు ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అలాగే, కేసులు మాఫీ చేసుకోవడానికేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతోందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అంబటి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగళ్లులో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి మీ మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసుకుంటారా?.చంద్రబాబు అధికారంలో అన్నీ సిండికేట్లే. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని సిండికేట్ చేసింది. ఎల్లో మీడియాను సిండికేట్ చేసి వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. నాణ్యమైన మద్యం దొరకడం లేదని చంద్రబాబు ప్రచారం చేశారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రానున్న రోజుల్లో చూస్తాం. మద్యం దుకాణానికి రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. నేడు విచ్చలవిడిగా మద్యం అమ్ముకునేందుకు తలుపులు తెరిచారు. రూ.30లక్షలు కట్టకపోతే షాపులు దక్కనివ్వబోమని బెదిరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను మళ్లీ తెరమీదకి తెస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడమే మంచి ప్రభుత్వమా?. సిండికేటుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారు. మద్యం షాపులు నడపాలని ముందుకొచ్చే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. 961 షాపులకు నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. దరఖాస్తులు పెట్టుకోవాలంటే టీడీపీ ఎమ్మెల్యేలకు జనం భయపడుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశాడు. రాష్ట్రంలో ప్రస్తుతానికి అసలు ఇసుకే దొరకడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఇప్పుడే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. టీడీపీ నేతలే సిండికేట్‌గా ఏర్పడి ఇసుకను దోచేస్తున్నారు’ అంటూ విమర్మించారు. ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ -
భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ భారీ దోపిడీకి తెర లేపిందని ఆరోపించింది వైఎస్సార్సీపీ. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. టీడీపీ భారీ దోపిడీకి తెర!రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ.ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు అని ఆరోపించింది. .@JaiTDP భారీ దోపిడీకి తెర!రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ. ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా…— YSR Congress Party (@YSRCParty) October 7, 2024ఇదే సమయంలో పోలవరంపై కూడా వైఎస్సార్సీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. ఈ గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి అంటూ వ్యాఖ్యలు చేసింది.పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన @ncbn కు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి.#YSRPolavaram pic.twitter.com/LXttcFl6QJ— YSR Congress Party (@YSRCParty) October 7, 2024మరోవైపు.. ఉచిత ఇసుకపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంబటి ట్విట్టర్ వేదికగా.. నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో.. ఉచిత ఇసుక లోని ఉచితం అంత! చంద్రబాబు.. అంటూ వ్యాఖ్యలు చేశారు. నేతి బీరకాయ లోని నెయ్యి ఎంతో ఉచిత ఇసుక లోని ఉచితం అంత !@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) October 7, 2024 -
Big Question: నారా వారి సారా.. జాతిపిత జయంతి రోజున బాబు కానుక
-
‘ఎన్టీఆర్ మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు’
తాడేపల్లి, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు.‘‘ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీజయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు?. మహిళల పసుపు, కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామంటున్నారు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడమని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా?. షాపింగ్ కాంప్లెక్స్ లాగా లిక్కర్ కాంప్లెక్సులు తేవటం ఏంటి?. జగన్ హయాంలో మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అందుకే ఎలాంటి సమస్యా ఆనాడు రాలేదు. ఇప్పుడు తన మనుషులకు ఆదాయం సమకూర్చేందుకు చంద్రబాబు మద్యం షాపులు ఇస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు. తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వటం దారుణం. ఈ మద్యం పాలసీని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. వీటన్నిటిపై మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం’ అని అన్నారామె.చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఇంక పండగే పండగ! చౌక మద్యం.. అడిగినోళ్లకు అడిగినంత. ఐదేళ్లుగా జనావాసాలకు దూరంగా.. ఊరిబయట ఉన్న మద్యం దుకాణాలిప్పుడు వీధి వీధికి రానున్నాయి! ఇప్పటివరకూ మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వమే రీటెయిల్ మద్యం షాపులు నిర్వహిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు రంగంలోకి దిగబోతున్నారు. అయినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త మద్యం పాలసీ విపరిణామాలు ఇవి. లిక్కర్ సిండికేట్ల దాదాగిరీ.. గతంలో చంద్రబాబు కాలంలో మాదిరిగా లిక్కర్ సిండికేట్లు, అధికార పార్టీ నేతల మధ్య అక్రమ సంబంధాలు మళ్లీ జోరందుకోనున్నాయి. కొత్త మద్యం పాలసీ దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా ఉపయోగపడవచ్చు.మద్య నిషేధమే లక్ష్యంగా ఉద్యమించి 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో మద్యం ఏరుల్లా పారించేందుకు భూమికను సిద్ధం చేసిందన్నమాట. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి 1996లోనే చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి మద్యనిషేధాన్ని ఎత్తివేసిన సంగతి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. చంద్రాబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కింది కూడా మద్యం లాబీ పెద్దల అండతోనే అన్న చర్చ కూడా అప్పట్లో జోరుగానే నడిచింది. బాబు హయాంలో లిక్కర్ స్కాములు కూడా బోలెడన్ని చోటు చేసుకోవడం వార్తల్లోకి ఎక్కిన అంశాలే.ఇక మద్య నిషేధ ఉద్యమానికి ఛాంపియన్లమని ప్రచారం చేసుకున్న ఈనాడు మీడియా ప్రస్తుతం వారి పత్రికలో పెట్టిన హెడ్డింగ్ ఏమిటంటే ఇక నాణ్యమైన మద్యం రాబోతోందని. ప్రపంచ దేశాల సంగతి తెలియకపోయినా, బహుశా దేశంలో ఎక్కడా తాము తక్కువ ధరకే మద్యం అందిస్తామని ప్రచారం చేసిన ఏకైక నేత చంద్రబాబు నాయుడే కావచ్చు. ఈ సంద్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సెటైర్ ఆసక్తికరంగా ఉంది. ఇంతకాలం ''మద్యం తాగడం హానికరం" అని మద్యం బాటిళ్లపై రాస్తున్నారు. ఇక దాన్ని తొలగించి చంద్రబాబు ప్రభుత్వం 'నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తున్నాం ఎంతైనా తాగండి" అని స్టిక్కర్ అంటిస్తారేమోనని చమత్కరించారు.ఇదీ చదవండి: తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుకనిజంగానే మద్యం నిత్యం తాగడం ప్రమాదకరం. సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాల్సింది పోయి సాయంత్రం వేళ ఒక పెగ్గేసుకోండని ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం రావడం లేదని ఆరోపించారు. నిజానికి జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లేమి తేకపోయినా చంద్రబాబు టైమ్‌లో ఇచ్చిన పది పదిహేను బ్రాండ్లను కొనసాగించినా అవన్నీ జగన్ బ్రాండ్లుగానే ప్రచారం చేయడంలో చంద్రబాబుతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కృషి చేసిన సంగతి తెలిసిందే. అవి నాణ్యత లేనివని అప్పట్లో ఆరోపించారు. ఈ వందరోజుల పాలనలో ఆ బ్రాండ్లను రద్దు చేసినట్టు కనిపించలేదు. ఈ మూడు నెలల్లో మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తినలేదని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారా? తాజాగా మద్యం మానిపించే బాధ్యత ఆయన మందుబాబుల భార్యల మీద పెట్టారు. తానేమో షాపులు పెంచి, వారికి మార్జిన్లు పెంచి, ఇళ్ల మద్య షాపులు ,బార్లు, ఎలైట్ షాపులు పెడతారట. కాని మద్యం తాగవద్దని భార్యలే చెప్పాలట. జగన్ తాను హామీ ఇచ్చినట్టు మద్య నిషేధం చేయలేకపోయి ఉండవచ్చు. మద్య నియంత్రణ ద్వారా ఆ దిశగా కృషి చేశారనేది వాస్తవం. అంతకుముందు నాలుగు వేలకు పైగా ఉన్న షాపులను 2,600కు తగ్గించడం, బార్లను తగ్గించడం, అమ్మకం వేళల్ని కుదించడం, ధర పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన లాంటి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక దళాల్ని నియమించారు. సిండికేట్లు లేకుండా, మద్యం మాఫియాలు లేకుండా జగన్ చేయగలిగారు. అయినా చంద్రబాబు అండ్ కో విపరీతమైన దుష్ఫ్రచారం చేసింది. ఇప్పుడు సహజంగానే మద్యం మాఫియాల అండ టీడీపీకి లభిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతమున్న పలు బార్ల యజమానులను బెదిరించి వాటిని స్వాధీనం చేసుకున్నారట.స్థూలంగా చూస్తే కొత్త మద్యం విధానం ప్రైవేట్ సిండికేట్లు, అధికార కూటమి నేతలకు ఎంత వీలైతే అంత దోపిడి చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే పలు చోట్ల షాపుల టెండర్లలో తమకు పోటీ రావద్దని టీడీపీ కూటమి నేతలు ఇతర మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మద్యం క్వార్టర్ రూ.99లకే ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరీ అంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం వస్తుందా అన్న సందేహం కొందరిలో ఉంది. భక్తితో తిరుమలకు కొన్ని సంస్థలు తక్కువ ధరకే నేతిని సరఫరా చేస్తే అందులో నాణ్యత ఉండదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు మద్యంలో మాత్రం తక్కువ ధరకు ఇస్తే నాణ్యత ఉంటుందని చెబుతున్నారు.రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు రాబోతున్నాయి. అంటే సుమారు వేయి పెరుగుతాయి. పన్నెండు ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేస్తారట. వాకిన్ లిక్కర్ స్టోర్లు రాబోతున్నాయని అంటున్నారు. యథాప్రకారం బెల్ట్ షాపులను నిరోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014-19 మద్య మద్యం ఎంత అరాచకంగా ఏపీలో పారిందో అది తిరిగి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారనేది కూటమి నేతల అభిప్రాయం కావచ్చు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి పత్రికలు చాలా సంతోషపడుతూ నాణ్యమైన మద్యం రాబోతున్నదని ప్రచారం చేస్తున్నాయి. ఈ మద్యం తక్కువ ధరకే వస్తుంది కదా అని అధికంగా తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కారా అన్న వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నకు సమాధానం దొరకదు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని విపరీతంగా తాగించి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఈ మద్యం విధానంపై పెద్దగా స్పందిస్తున్నట్టు కనపడ్డం లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్ది పాటి నిరసనలు జరిగాయి. ఇంతకాలం ఊళ్లకు దూరంగా వున్న లిక్కర్ షాపులు ఇకపై నివాసాల మధ్యలోనే ఏర్పాటైతే వచ్చే దుష్ప్రరిణామాలపట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. బెల్టు షాపులు యథేచ్ఛగా వచ్చే అవకాశం ఉండడంతో రోజులో ఏ సమయంలోనైనా మద్యం సరఫరా ఉండవచ్చు.జగన్ ప్రభుత్వం ఇంటింటికీ పౌరసేవలు అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ మద్యం సరఫరా చేసేటట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల్ని బాగు చేసి సీబీఎస్ఈ, ఆంగ్ల మీడియం, ట్యాబులు వంటి సంస్కరణలు ప్రవేశపెడితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విద్య కన్నా మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మద్యం విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పోటీపడేలా ఉన్నారు. చంద్రబాబు అనుభవం చిట్టచివరికి ఆంధప్రదేశ్ ప్రజలు మద్యానికి బానిసలు అయ్యేలా చేసేలా ఉంది.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు హయాంలో 'మద్యాం 'ధ్రప్రదేశ్ గా మారిన ఏపీ
-
మద్యం పేరుతో ఓట్లు అడుక్కునే దరిద్రం ఏపీలోనే ఉంది..
-
లిక్కర్ సిండికేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహం
సాక్షి,అమరావతి : లిక్కర్ సిండేకేట్కి ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10 శాతం ఉన్న రిటైలర్ మార్జిన్‌ను.. తాజాగా 20 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20 శాతం రిటైల్ మార్జిన్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా.. సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది . -
AP: కొత్త మద్యం పాలసీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నోటిఫికేషన్లో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజును నిర్ణయించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లిక్కర్ మాల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ముడుపులు తేలక మల్లగుల్లాలు
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీ అటు సర్కారు ఖజానా నింపడమే కాదు.. కూటమి నేతలకూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో జరుగుతున్న సీఐ బదిలీలే ఇందుకు కారణం. ఈ వారంలోనే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకుముందే ఎక్సైజ్ సీఐల బదిలీలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో మద్యం అమ్మకాల్లో రాష్ట్రస్థాయిలోనే పేరున్న సర్కిళ్ల కోసం అధికారులు పోటీపడుతున్నారు. ఎందుకంటే.. మద్యం అమ్మకాలు బాగా జరిగితేనే సిండికేట్ల ఏర్పాటు, ఎమ్మారీ్పకి గండి కొట్టడం సాధ్యమవుతుంది.ఈ పనులన్నీ జరగాలంటే తాము చెప్పిన సీఐ ఉంటేనే సాధ్యమని ప్రజాప్రతినిధులు ఈ బదిలీల్లో తలదూరుస్తున్నారు. కానీ, రాయలసీమలోని జోన్–4 పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల సీఐల బదిలీలు కొలిక్కిరాలేదు. నాయకులకు ముట్టాల్సిన ముడుపులు ముట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలకపోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం బదిలీల ఉత్తర్వులు ఇచ్చేయడానికి సిద్ధపడింది. అయితే, సీమలోని కూటమి నేతల నుంచి కమిషనర్ కార్యాలయానికి హెచ్చరికలు వెళ్లినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు.తేలని సీఐల పోస్టింగ్లుఇక రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, కృష్ణాలోని మూడు జోన్లలో శనివారం రాత్రి బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలింది జోన్–4 మాత్రమే. మూడు జోన్లతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీఐల బదిలీల ఉత్తర్వులు సైతం శనివారమే విడుదల కావాల్సింది. కానీ, కూటమి నేతలు తమకు అనుకున్న స్థాయిలో ముడుపులు రాలేదన్న కారణంతో సీఐల పోస్టింగులపై తేల్చలేదు. ప్రధానంగా తిరుపతి అర్బన్, చంద్రగిరి, డిస్టిలరీ, పలమనేరు, నగరి, గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు భారీ ధర పలుకుతోంది. ఇక కడప అర్బన్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కర్నూలు అర్బన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి, ధర్మవరం, ఉరవకొండ సర్కిళ్లకు సైతం డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి పలువురు సీఐలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.ఫలితంగా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్లకు కావాల్సింది తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు లేఖలపరంగా.. కొన్నిచోట్ల మంత్రులు వాటికి అడ్డుకట్ట వేస్తూ తమ సిఫార్సు లేఖలు ఇచ్చేశారు. దీంతో ఎవర్ని ఎక్కడ వేయాలో తెలీక కమిషనర్ కార్యాలయం తల పట్టుకుంటోంది. ఇప్పటికే అనంతపురంలోని ఓ ఎమ్మెల్యేను కమిషనర్ కార్యాలయంలోని ఓ అధికారి సంప్రదించి, మంత్రి చెప్పిన వాళ్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అగ్గిమీద గుగ్గిలమైన ఆ నేత, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని చీవాట్లు పెట్టినట్లు సమాచారం.దీంతో.. రాయలసీమలోని బదిలీల వ్యవహారం తేల్చడం తమవల్ల కాదంటూ కమిషనర్ కార్యాలయం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి వెళ్లినా ఆయన మాట కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు వినడంలేదని తెలుస్తోంది. మరికొన్ని సర్కిళ్లలో నేతల రేటుకు సీఐలు సరితూగకపోవడంతో బదిలీల్లో సందిగ్థత నెలకొంది. ఆదివారం ఈ పంచాయతీ చినబాబు వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్కిళ్లకు నిర్ణయించిన ధరలు తగ్గుతాయా, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖల్లో ఎవరివి చెల్లుతాయో అన్న దానిపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తి నెలకొంది. -
అడ్డగోలు దోపిడీకి అధికారిక సిండికేట్
అందులో ఉన్నవి నాలుగు ఐటీ ఆధారిత సేవల సంస్థలే ఏ శాఖ అయినా.. ఏ పనికైనా వాటి సేవలను పొందాల్సిందే కొత్త మద్యం విధానం సహా అన్నింటికీ అవే వీటిద్వారా దోపిడీకి రాచబాట వేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలుసాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్‌కు తెరతీసింది. అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టింది. టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకూ వర్తింపజేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తోంది.వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో–86 ప్రభుత్వ పెద్దల దోపిడీ పన్నాగానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు, ప్రొక్యూర్మెంట్, కొత్త విధానం, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు, పౌర సేవలు వంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం దారులు దాదాపుగా మూసివేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్విసెస్ (ఎన్ఐసీఎస్ఐ)లో ఎంపానల్ అయిన కన్సల్టెన్సీలనే ఎంపిక చేయాలని షరతు విధించింది.ఎన్ఐసీఎస్ఐ జాబితాలో ఈ అండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ అనే నాలుగు కంపెనీలే ఉన్నాయి. ఏ శాఖ అయినా ఈ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి. అయితే, అసలు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకే వీల్లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుందనే సంకేతాలిచ్చింది. మరోపక్క వివిధ శాఖలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైదొలగాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అన్ని శాఖలు ఈ నాలుగు కంపెనీలతోనే సేవలు పొందేలా రాచబాట వేసింది. పారదర్శకతకు పాతర ఈ నాలుగూ ప్రధానంగా ఐటీ కంపెనీలు. ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజ్, పర్యాటక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం.. ఇలా అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ 2021లో జారీ చేసిన ప్రొక్యూర్మెంట్–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు 30 శాతం మించకూడదు.ఆర్థికపరమైన అర్హతలు ఎక్కువ ఉండాలి. బాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి, కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు 70 శాతం లేదా 60 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే ఆర్థిక అర్హతలు 30 లేదా 40 శాతం ఉంటే సరిపోతుందని చెప్పింది. సిండికేట్‌లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున, వాటికి సాంకేతిక అర్హతలే ఎక్కువ ఉంటాయనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. భారీ దోపిడీకి పక్కా పన్నాగం ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధివిధానాలను అనధికారికంగా రూపొందిస్తారు. అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థను నియమించి, తాము రూపొందించిన విధానాన్నే దాని ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది. తద్వారా యథేచ్చగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు.ఇన్నర్ రింగ్ రోడ్డు దోపిడీ తరహాలోనే..రాష్ట్ర విభజన అనంతరం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో దోపిడీకి పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు ఏకంగా అన్ని శాఖలకు వర్తింపజేస్తోంది. అప్పట్లో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కెచ్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను అనధికారికంగా ఖరారు చేసింది.చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకుని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీని నియమించారు. తాము రూపొందించిన అలైన్‌మెంట్‌నే ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు ఆ అలైన్‌మెంట్‌కు అటూ ఇటూ కొన్న భూముల విలువ అమాంతం పెరిగింది. తద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. అదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది. -
నియంత్రించాల్సింది మద్యం ధరలు కాదు: విజయ సాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో మద్యం ధరల అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నిర్ణయాలు ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నాయని మండిపడ్డారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడిసిన్ ఖర్చులు, విద్యా సంస్థల ఫీజులను పరిమితం చేయడానికి బదులుగా.. మద్యం ధరను రూ.99కి పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోంది?. చంద్రబాబు ప్రభుత్వం చర్యలు మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. అలాగే, ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతోంది. అనవసర అంశాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.Instead of capping the cost of medicines or fees of educational institutions, the TDP govt. in AP has chosen to cap the price of liquor at ₹99/180ml. What message are they sending? This step will increase alcoholism, domestic violence, and worsen public health. Dubious…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 23, 2024 ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు! -
ఇదేం పని చంద్రబాబు..
-
Delhi liquor scam: కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.కేజ్రీవాల్‌కు షరతులివే...మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి) ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.పంజరంలో చిలుక కావొద్దు సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు ఈడీ కేసులో బెయిల్ షరతులను తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఏమన్నారంటే... → ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? → బెయిల్‌ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది. → ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. → సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది. → బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు కచ్చితంగా చట్టవిరుద్ధమే.→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం. → సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. → సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే → సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు!నా పోరు ఆగదు జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్ ‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు.