MAA Elections 2021 Results
-
చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు
Manchu Vishnu Talks In Press Meet Over MAA Bylaws: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్‌లో విష్ణు తన ప్యానల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్‌ను మార్చాలనుకుంటున్నానన్నారు. చదవండి: ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్ బైలాస్ మార్చడమంటే అంత ఈజీ కాదని, దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్‌కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ -
ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్
‘మా’ ఎన్నికలు ముగిసినప్పటికీ రోజుకో ట్విస్ట్‌తో ఎన్నికలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గుడుస్తున్నా మా ఎన్నికల్లో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్, విమర్శలు, దాడులతో చివరికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎన్నికల రోజున జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించి సంగతి తెలిసిందే. ఇక ప్రకాశ్ ఆరోపణలపై నేడు తిరుపతిలో జరిగిన మీడియాలో సమావేశంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. చదవండి: ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే అలాగే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన సీనియర్ నటుడు బాబూ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన.. ‘మా’లోని ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే అన్నారు. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని, ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా గెలుస్తారని పేర్కొన్నారు. అందరు మంచు విష్ణుకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆవేశం తగ్గించుకోవాలని, తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్లో చదివారన్నారు. కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అంటూ వ్యాఖ్యానించారు. -
ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా లేఖలు అందలేదు: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు తన టీంతో కలిసి నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి మోహన్ బాబు, ‘మా’ నూతన కార్యవర్గంతో కలిసి విష్ణు సోమవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని వీఐపీ దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి ఈ సందర్భంగా మోహన్ బాబు మంచు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ‘మా’కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత... గౌరవ ప్రధమైన హోదా అన్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకన్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామన్నారు. మెజారిటీ సభ్యులు తమ ప్యానల్ నుంచే గెలిచారని తెలిపారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలపై విష్ణు స్పందిస్తూ.. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పారు. -
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఈ రోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! అలాగే ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తరువాత రోజు ప్రకాశ్ రాజ్‌తో పాటు ఆయన ప్యానల్ నుంచి గెలిచిన, ఓడిన సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీనిపై మంచు విష్ణు స్పందించారు. చదవండి: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం ‘‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం పత్యర్థి ప్యానల్ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం. అయితే ‘మా’ అభివృద్ధి కోసం వారిని కలుపుకోనిపోతాం. ‘మా’ అసోసియేషన్ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టిన వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తాను, తన టీం కానీ ‘మా’ ఎన్నికల గురించి మీడియాలో మాట్లాడమని, కేవలం తాము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతామంటూ విష్ణు వ్యాఖ్యానించారు. -
‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! కాగా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నటుడు మోహన్ బాబు, నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా బాలకృష్ణ రావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. శుక్రవారం బాలయ్య ఇంటికి వెళ్లి ఆయనను మోహన్ బాబు, విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Unstapable Talk Show: ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య షాకింగ్ రెమ్యునరేషన్ కాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోగా, ఆయన ప్యానల్ నుంచి 11 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలైన తర్వాత రోజు ప్రకాశ్ రాజ్‌తో పాటు ఆయన ప్యానల్లో గెలిచిన సభ్యులు అనూహ్యంగా విష్ణు ప్యానల్‌తో కలిసి తాము పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానల్ సభ్యులెవరూ హాజరు కాలేదు. మరోవైపు, ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో చిరంజీవి కానీ.. మెగా హీరోలెవరు కనిపించకపోవడం గమనార్హం. -
విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే. చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్, పవన్ కల్యాణ్‌ను ఓ సినిమా సెట్లో కలిశారు. అక్కడ పవన్ అరగంట పాటు చర్చిన మనోజ్ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్ ద్వారా ఆహ్వానం పంపింది. -
‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు
సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నటుడు బాలకృష్ణను కలిసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టిన తర్వాత విష్ణు.. రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా? అని ఆసక్తిగా చూస్తున్న క్రమంలో బాలకృష్ణను కలిసి అందరికి ట్విస్ట్ ఇచ్చారు. చదవండి: ‘రాత్రి గెలిచి ఉదయమే ఎలా ఓడిపోయామో’ ఈ భేటీలో ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం, సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న అంశాలపై బాలయ్యతో విష్ణు చర్చినట్లు తెలుస్తోంది. అయితే ‘మా’ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు భేటీ ఆనంతరం మీడియాతో విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. ఈ ఎన్నికల్లో ఆయన నాకు మొదటి నుంచి సపోర్ట్ చేశారు. త్వరలోనే చిరంజీవిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ ఇక ‘ఈ నెల 16న మా అధ్యక్ష పదవి నేను, నా ప్యానల్ ఎన్నికల అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నాం. ఆ తర్వాత ఈసీతో చర్చించి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటా. సినీ పెద్దలందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలయ్య అన్నకు ధన్యవాదాలు. ఈ రోజు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ‘మా’ కోసం ఎప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ‘మా’ కుటుంబాన్ని ఒకచోట చేర్చమని ఆయన నాకు సూచించారు’ అంటూ మంచు విష్ణు తన ట్వీట్లో రాసుకొచ్చారు. Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx — Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021 -
రాత్రి గెలిచి.. ఉదయమే ఎలా ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలి: హేమ
సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై నటి హేమ తాజాగా స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు(గురువారం) ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు ఈ మేరకు ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన వరుస ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికలు జరిగిన రోజు అక్టోబర్ 10న రాత్రి వీరిద్దరూ గెలిచినట్లు ప్రకటించి.. మరుసటి రోజు వారు ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ‘మా’ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు -
ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి ఎన్నికైన మంచు విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందిస్తాడా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో.. విష్ణు మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. బుధవారం అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పెన్షన్ ఫైల్‌పై సంతకం చేశాడు. ఇక తర్వాత ఏం జరగనుంది.. ఎవరూ ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తుండగా ఆసక్తిగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ రోజు నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యాడు. చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై బాలయ్యతో చర్చించినట్లు సమాచారం. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం అనంతరం విష్ణు మొదటి సారిగా బాలకృష్ణను కలవడం చర్చకు దారి తీసింది. భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చానని స్పష్టం చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తానని కూడా చెప్పాడు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పాడు. ఇక రాజీనామాలపై ఈసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విష్ణు పేర్కొన్నాడు. అనంతరం మోహన్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో విష్ణుకు బాలకృష్ణ అండగా నిలిచారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చామని తెలిపాడు. -
ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...
గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠను రేపిన మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై 107ఓట్ల తేడాతో విష్ణు మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అందరి కంటే ముందుగా చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యక్షంగా మెగా బ్రదర్ నాగబాబే ప్రకాశ్‌రాజ్‌కు క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గత కారణాలు ఏంటి అని ఓసారి పరిశీలిస్తే.. ► ప్రకాశ్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష బరిలో ఉన్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. మొదట్లో ఈ విషయంపై ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలబడినా.. ఆ తర్వాత మా అసోసియేషన్‌కు తెలుగు వాళ్లు కాకుండా, వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు ఎలా పాలిస్తారు అంటూ వచ్చిన విమర్శలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టకపోవడం ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌కు మారింది. ►. కెరీర్ పరంగా ప్రకాశ్‌రాజ్ చాలా బిజీ ఆర్టిస్ట్. సంవత్సరానికి ఇతర భాషలతో కలిపి సుమారు 7-8 సినిమాల్లో నటిస్తారు. అలాంటి బిజీ ఆర్టిస్ట్ మా అసోసియేషన్‌కు ఎలా సేవ చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎక్కడో తమిళనాడులో ఉండి ఇక్కడి ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేంత సమయం ఎలా కేటాయిస్తారనే కామెంట్స్ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించాయి. ► మంచు విష్ణుకు మోహన్ బాబు చేసిన క్యాంపెయిన్ ప్రకాశ్‌రాజ్‌కు మైనస్ అయిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఆయనతో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్ బాబు చెబితే కాదనలేం అనే సినీ ప్రముఖులు కూడా ఉండటంతో ప్రకాశ్‌రాజ్‌కు ఓట్లు తగ్గాయన్నది మరో కారణంగా చెప్పుకుంటున్నారు. ►చాన్నాళ్లుగా ఉన్న మా బిల్డింగ్ సమస్యపై దృష్టి పెట్టకపోవడం. అటు మంచు విష్ణు మా బిల్డింగ్ కోసం తన సొంత డబ్బులు ఖర్చుపెడతానని నమ్మకం కలిగించడం కూడా ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌గా మారింది. ► మా అధ్యక్షుడిగా ఎన్నికైతే చేసే కార్యక్రమాలు, సంక్షేమం వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడం.. మంచు విష్ణు తర్వాత కూడా ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం అతి పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తుంది. ► నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్షంగా ఎవరూ మద్ధుతు ప్రకటించకపోవడం ► ఎన్నికలకు రెండు రోజులు ముందు నాకు పెద్దల మద్దతు అవసరం లేదు అంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్ నెగిటివిటిని పెంచేశాయి. ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదంటూ ప్రకాశ్‌రాజ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టిందనే చెప్పాలి. ►ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను మా ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధం చేయకపోవడం. ఎలక్షన్స్ రోజు ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొందరు వేసిన ఓట్లు మంచు విష్ణుకు అనుకూలంగా మారాయి. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు -
‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుండేది: రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపై స్పందించారు. ఈ సారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తూ రాజకీయ రణరంగాన్ని తలపించాయన్నారు. ఆయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం(అక్టోబర్ 11) విశాఖపట్నం వెళ్లారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు. ‘ఎన్నికల్లో ఇంత అలజడి సృష్టించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సినీ పెద్దలు అంతా కలిసి మా అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుని.. ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది. నిజానికి అదే మంచి పద్దతి. ఇక అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని ఆయన అన్నారు. చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి -
తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Nagababu Resignation: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్ రాజ్‌కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: MAA Elections 2021 Results: మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా అలాగే 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్నట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తను రాజీనామాకు గల కారణాలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు. చదవండి: నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్‌రాజ్ అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్ రాజ్‌కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. Membership Resignation from MAA Association. pic.twitter.com/l4WlNaZlvx — Naga Babu Konidela (@NagaBabuOffl) October 11, 2021 -
నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్‌రాజ్
Maa Elections 2021: ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు.. అది నా తప్పు కాదు.. వారి తప్పూ కాదు’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. సోమవారం విలేకరులతో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘పరభాషా నటులు ‘మా’ సభ్యులుగా ఉండొచ్చు కానీ పోటీ చేయడానికి అనర్హులుగా బైలాస్‌లో మార్పులు తీసుకొస్తామని ఇటీవల ‘మా’ ఎన్నికలకు ముందు తెలిపారు. ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు.. ‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావుగార్లు, రవిబాబు వంటివారు మాట్లాడారు.. అందుకే అతిథిగానే ఉంటా. ‘మా’ సభ్యుడు కాకున్నా నన్ను పిలిచి తన సినిమాలో చేయమని మంచు విష్ణు అడిగినా నటిస్తాను. తెలుగు ఇండస్ట్రీవారితో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుంది. ‘మా’ ఎన్నికల తర్వాత కొందరు ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అని మాట్లాడే అబద్ధాలను నేను నమ్మను’’ అన్నారు. అంతేకాకుండా సోమవారం రాత్రి ఓ ట్వీట్ చేశారాయన. ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’ అని ట్వీట్ చేశారు. చదవండి: నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు: మోహన్ బాబు -
అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా'
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్ 😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ok. Lesson learnt. 😊 pic.twitter.com/2PSFh2AlMW — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ante mari ninna yevaro election rules ki bhinnanga ballot papers ni intiki kuda teeskellarani .. aha ante bayata talku.. 🙊 nenatledu https://t.co/tAM8MVVhxV — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. -
'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..
MAA Elections 2021 Winners List : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలు వీళ్లే.. ►మా అధ్యక్షుడు - మంచు విష్ణు (383 ఓట్లు) ప్రకాశ్‌రాజ్ (274 ఓట్లు)109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. ► జనరల్ సెక్రటరీ - రఘుబాబు (341 ఓట్లు) ►ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్ (375 ఓట్లు) ► జాయింట్ సెక్రటరీలు - ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు) ►వైస్ ప్రెసిడెంట్స్ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు) ► ట్రెజరర్ - శివబాలాజీ (360 ఓట్లు) గెలుపొందిన ఈసీ మెంబర్లు వీళ్లు.. 18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ శివారెడ్డి (362 ఓట్లు) ♦ బ్రహ్మాజీ (334 ఓట్లు) ♦ ప్రభాకర్ (319 ఓట్లు) ♦ తనీష్ (306 ఓట్లు) ♦ సురేశ్ కొండేటి (294 ఓట్లు) ♦ కౌశిక్ (269 ఓట్లు) ♦ సుడిగాలి సుధీర్ (279 ఓట్లు) ♦ సమీర్ (282 ఓట్లు) మంచు విష్ణు ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ గీతా సింగ్ (342 ఓట్లు) ♦ అశోక్ కుమార్ (336 ఓట్లు) ♦ శ్రీలక్ష్మీ (330 ఓట్లు) ♦ సి.మాణిక్ (326 ఓట్లు) ♦ శ్రీనివాసులు (296 ఓట్లు) ♦ హరనాథ్‌బాబు (296 ఓట్లు) ♦ ఎన్.శివన్నారాయణ (290 ఓట్లు) ♦ సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు) ♦ శశాంక్ (284 ఓట్లు) ♦ బొప్పన విష్ణు (271 ఓట్లు) -
నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు
MAA Elections 2021 Manchu Vishnu Press Meet: నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను తాను ఆమోదించనని మంచు విష్ణు అన్నారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో తనను విత్ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్ననని పేర్కొన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. ఇక రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడు అయినప్పటికీ తండ్రి మాటకు కట్టుబడి ప్రకాశ్‌రాజ్‌కే ఓటేసి ఉండేవచ్చన్నారు. రామ్‌చరణ్ స్థానంలో ఉంటే తాను కూడా ఇదే చేసి ఉండేవాడినన్నారు. ఇక తన గెలుపుకు వంద శాతం కారణం తన తండ్రి మోహన్ బాబు అని చెప్పారు. అనంతరం నరేష్ తన గెలుపుకు ఎంతో కష్టపడినట్లు తెలిపారు. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. గెలుపొందేందుకు మా ప్యానల్ అందరం కష్టపడ్డాం. కానీ మా ప్యానల్లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలిచిన వారిని కలుపుకొని పోతాం. మేమంతా ఒక్కటే. ఇక ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి, అవేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతా. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాను కూడా ఆమోదించను. ఆయన సలహాలను కూడా స్వీకరిస్తా' అని పేర్కొన్నారు. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాంతం, జాతీయ వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామాపై ప్రకాశ్ రాజ్ తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు వాట్సప్‌లో సమాచారం అందించారు. చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా ఈ మేరకు ఆయన మెసేజ్ చేస్తూ ‘‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు విష్ణు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తి నికు కలగాలని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ... ప్రకాశ్‌రాజ్’’ అని మెసేజ్ పంపారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ.. మీ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను అంకుల్ అంటూ రాసుకొచ్చారు. ‘అంకుల్ మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. గెలుపు, ఓటములు అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు ముఖాలు. రెండింటిని మనం సమానంగా చూడాలి’ అని అన్నారు. చదవండి: MAA Elections 2021 Results: అది నా దురదృష్టం: ప్రకాశ్ రాజ్ ఆవేదన అలాగే ‘మీరు మా కుటుంబంలో ఒక భాగం. అది మీకు కూడా తెలుసు. ప్లీజ్ మీరు భావోద్యేగానికి లోనవకండి. నాకు మీ సలహాలు, సూచనలు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. దీనిపై చర్చించుకుందాం. అప్పటి వరకు మీరు తొందర పడకండి’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికల పోలింగ్ జరిగిందని, ఇక ఇలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండాలని లేదంటూ ప్రకాశ్ రాజ్ భావోద్యేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
అలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగలేను: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిన నెరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం, సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు’ అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం(అక్టోబర్ 11) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా చైతన్య వంతంగా జరిగాయి. గెలిచిన మా సభ్యులకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ మీకు, నాకు తెలుసు. హామీలు అన్నింటినీ పూర్తి చేయడం ముఖ్యం. నా ప్రాంతం, జాతీయ వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. నేను తెలుగు బిడ్డనే, నేను ఒక కళాకారుణ్ణి’ అంటూ చెప్పిన అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం
‘‘ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ‘మా’లోని సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్లే. అందరి ఆశీస్సులు ఉన్నాయి. నా బిడ్డ(మంచు విష్ణు), అతని జట్టు సభ్యులు గెలిచారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదు. భయంకరమైన ప్రామిస్‌లు చేసేశారు. వాటన్నింటినీ నా బిడ్డ వందశాతం సాధిస్తాడు. నా బిడ్డ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... జరిగింది... జరిగిపోయింది.. అందరం కళామతల్లి బిడ్డలం అని గుర్తుపెట్టుకోవాలి. నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టండి. ఆ ప్యానల్ వారు కావొచ్చు.. ఈ ప్యానల్ వారు కావొచ్చు.. నా సోదరులు, నా ఆడపడుచులు.. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా మీడియా ముందుకు వెళ్లవద్దని కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు నా బిడ్డకు, అతని జట్టు సభ్యులకు ఉండాలి. వారు అనుకున్నది విజయవంతం అవుతుంది. నా తమ్ముడు నరేశ్ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్ అధికారికి, సహకరించిన కొందరు ‘మా’ సభ్యులకు ధన్యవాదాలు. ఇది అందరి విజయం. కృష్ణ, కృష్ణంరాజు, నా సోదరుడు బాలయ్య, నా ఆత్మీయుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్.. ఇలా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అని మోహన్‌బాబు అన్నారు. దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు వైస్‌ప్రెసిడెంట్స్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లతో పాటు 18 మంది ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులతో కూడిన 26 మంది ‘మా’ (2021– 2023) ప్యానల్ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. సమయాభావం వల్ల మిగతా వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అన్నారు. ‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఆ ప్యానల్, ఈ ప్యానల్ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అన్నారు మంచు విష్ణు. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘నేను వెళ్లేటప్పుడు మంచి వారసుడిని ఇచ్చి వెళతాను అని చెప్పాను. మంచు విష్ణు రూపంలో మంచి వారసుడు వచ్చాడు. ‘మా’ మసకబారలేదు.. మెరుగుపడింది’’ అన్నారు నరేశ్. ఇదిలా ఉంటే... మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారని తెలిసింది. అలాగే ఈసీ మెంబర్స్‌గా ప్రగతి, పూజిత, శశాంక్, జయవాణి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, మాణిక్, హరినాథ్‌బాబు, బొప్పన విష్ణు, శ్రీనివాసులు, సంపూర్ణేష్ బాబు, శివారెడ్డి, కౌశిక్, అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం గెలిచారనే వార్త బయటికొచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రికార్డు పోలింగ్ ‘మా’ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్ నమోదు అయ్యింది. గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయాన్ని పొడగించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ‘మా’ సభ్యులు కూడా ఉత్సాహంగా ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి కారణాలు పోలింగ్ శాతం పెరగడానికి కారణం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్! ‘మా’ ఎన్నికల పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లో హడావిడి చేస్తున్న ఓ అజ్ఞాతవ్యక్తిని నటుడు వీకే నరేశ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు ప్యానల్ సభ్యుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి, కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఇరువర్గాల అభ్యర్థులు ఆరోపించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో తమ ప్యానల్స్ తరఫున ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా శివబాలాజీ, సమీర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ తర్వాత శివబాలాజీ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మరోవైపు ‘మా’ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ‘మా’ ఎన్నికల జయాపజయాలపై బెట్టిం గ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్ నడుమ ఎన్నికలు జరిగాయి. ఓటుకు దూరం కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికల గురించి హీట్ నడుస్తున్నప్పటికీ కొందరు ప్రముఖ నటీనటులు ఎన్నికల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్, రానా, మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్, సుశాంత్ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిసింది. ఇంకా మహేశ్‌బాబు (స్పెయిన్‌లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్లో ఉన్నారు) ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముంబయ్ నుంచి జెనీలియా, ఢిల్లీ నుంచి జయప్రద హైదరాబాద్‌కు వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం. చెల్లని ఓట్లు ఈసీ మెంబర్స్ కోసం పోలైన 665 ఓట్లలో 44 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. అయితే ‘మా’ సభ్యులకు పోలింగ్‌పై అవగాహన లేకపోవడం వల్ల చెల్లని ఓట్లు నమోదయ్యాయా? లేక సభ్యులకు ఇష్టం లేక చెల్లని విధంగా ఓట్లు వేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యర్థుల ఆలింగనం ‘మా’ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదివారం ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌తో తాను ఉన్న ఫోటోను షేర్ చేశారు మంచు విష్ణు. ఈ ఫోటో, ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారాయన. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు. నా రాజీనామాను 48 గంటల్లో ‘మా’ కి నా సిబ్బంది ద్వారా పంపిస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు నాగబాబు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. -
MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం
MAA Elections 2021 Results: మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు' అంటూ ట్వీట్ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా మా ఎన్నికల్లో నాగబాబు మొదటి నుంచీ ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయనను విజయతీరాలకు చేర్చేందుకు మెగా బ్రదర్ ఎంతగానో కష్టపడ్డారు. కానీ అంతిమంగా ఈ పోరులో మంచు విష్ణు విజయాన్ని ముద్దాడారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు. - నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq — Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021 -
‘మా’ విజయం: ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన విష్ణు
MAA Elections 2021 Results: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేశాడు. గెలుపు ప్రకటన అనంతరం విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్‌బాబుకు అంకితమిచ్చారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టండి మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ సహా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశీస్సులు విష్ణుకు ఉంటాయి. నా బిడ్డ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడు. మా అభివృద్ధికి విష్ణు కట్టుబడి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. వివాదాలకు ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టండి. ఎవరూ ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు' అని సూచించారు. -
అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి: చిరంజీవి
MAA Elections 2021 Results: చివరి వరకు ఉత్కంఠగా సాగిన 'మా' పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. భారీ మెజారిటీతో ప్రకాశ్ రాజ్‌ను ఓడించి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు హీరో విష్ణు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'పెళ్లిసందD' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మా ఎన్నికలను ఉద్దేశిస్తూ.. పదవులు తాత్కాలికమని, అల్లర్లతో 'మా' పరువు తీయొద్దని కోరారు. మన ప్రభావాన్ని చూపించడానికి వేరేవారిని కించపరచవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు. మనమంతా వసుధైక కుటుంబం అని చెప్పిన చిరు, ఇలాంటి ఘటనల వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని నొక్కి చెప్పారు. -
టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ
MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ! అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ