Madapur
-
'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' : ఆర్ట్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు
కళల కాణాచి హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వేదిక కానుంది. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌లు తమ ప్రత్యేకమైన కళాఖండాలను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. చిత్రకళా రంగంలో సరికొత్త కోణాన్ని కళా ప్రేమికుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆస్వాదించడమే ఈ పదర్శన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో ఆకట్టుకుంటారనీ, అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుబడ్డ భవనాలు చిత్రాలు ప్రత్యేకంతా నిలువనున్నాయి. ధృవ్ పటేల్ లంగూర్ల చిత్రలతోనూ, ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో వాటర్ కలర్స్ చిత్రాలను వీక్షకులను బాగా ఆకర్షించ నున్నాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటిలిజెన్స్ ఐజీ సుమతి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ హాజరు కానున్నారు. వివరాలు : 2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలు.వేదిక: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ,ప్రదర్శన వివరాలు : సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు. -
డ్రగ్స్ దందాలో రాజస్తాన్ వ్యాపారులు
గచ్చిబౌలి: నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినీత్ ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్కు చెందిన దినేశ్‌చౌదరి, మంగళారంచౌదరి హెరాయిన్ పేస్ట్ కోసం రాజస్తాన్‌కు చెందిన సవర్‌ఝట్‌కు రూ.48 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.ఈ నెల 7వ తేదీన రాజస్తాన్ నుంచి ఓ కారులో సైనిక్‌పురికి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని ఓ హోటల్లో మంగరామ్, దినేశ్, గణేశ్‌లు రమేశ్‌చంద్, సురేశ్‌చంద్‌లను కలిశారు. హెరాయిన్ ఎలా విక్రయించాలో వివరించారు. ఆ తర్వాత మరో కారులో గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ప్రకాశ్ లైట్‌హౌస్‌లో హెరాయిన్ పేస్ట్‌ను దాచేందుకు తీసుకొచ్చారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంలో ఎస్ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు 14న రాత్రి 11 గంటల సమయంలో లైట్‌హౌస్‌పై దాడి చేశారు.హెరాయిన్ పేస్ట్‌తోపాటు పెడ్లర్స్ మంగళారంచౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరిలతోపాటు వినియోగదారులు నితిన్‌గుర్జార్, ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని ప్రకాశ్ చౌదరితోపాటు అమీన్‌పూర్‌కు చెందిన జైవత్రం వసనారం దేవసి, సైనిక్‌పురికి చెందిన ప్రకాశ్æచౌదరి, భువనగిరికి చెందిన బానారాం చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సవర్‌ఝట్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్, రెండు కార్లు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా అందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని మధ్యప్రదేశ్‌లోని ఓ పీఎస్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాజస్తాన్‌కు చెందిన ప్రధాన పెడ్లర్ సవర్‌ఝట్ ఎక్కడి నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ తెలిపారు. నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్ సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, వాడుతున్నట్టు తెలిసినా డయల్ 100, 9490617444 ఫోన్నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీలు జయరాం, శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ విక్రయించే రాజస్తానీ అరెస్ట్8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం స్వాధీనంపటాన్చెరు టౌన్: మాదకద్రవ్యాలు విక్రయించే ఓ రాజస్తానీ వ్యక్తిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ సంజీవరావు ఆ వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్ రాధమ్మ కాలనీలో మాదకద్రవ్యాలు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు టీనాబ్, ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడులు చేశారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజస్తాన్‌కు చెందిన రెయిలింగ్ పనులు పనిచేసే బుధారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీఎల్‌లో ఉంటున్న చిన్నాన్న కొడుకు కోశాలరామ్ డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడని, తొలుత తమకు అలవాటు అయ్యిందని, ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకున్నట్టు నిందితుడు తెలిపాడు. అతని నుంచి 8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
మాదాపూర్ మెరీడియన్ స్కూల్లో స్యాహి ప్రతిబింబ్–2024 వేడుకలు (ఫొటోలు)
-
గుండె సమస్యలపై అవగాహన అవసరం
మాదాపూర్: గుండె సమస్యలపై అందరికీ అవగాహన అవసర మని అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం 3 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గుండె సమస్యల నుంచి ఉపశమనానికి అనేక కొత్త పద్ధతులున్నాయ న్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియా లజీ రోగిని గాయం, అనారో గ్యం, మరణాల నుంచి కాపాడు తుందని తెలిపారు.గతంలో ధమనులు పూర్తిగా బ్లాక్ అయిన ప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారన్నారు. ఇప్పుడు ధమ నులను క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయ న్నారు. రోగులు కోలుకోవడా నికి సాధ్యమైనంత వరకు చౌకగా ఉండే తాజా పద్ధతులపై ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్డియాలజిస్టులు కార్డియోథొ రాసిక్ సర్జన్లతో కూడిన 1,200 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులో ఇంట్రాకోరోనరీ ఇమేజింగ్, కాల్షియం మేనేజ్మెంట్, టీఏవీఆర్, ఇతర కొత్త ఆవిష్కరణల వంటి వివిధ సెషన్లు జరుగనున్నట్లు తెలిపారు. -
మాదాపూర్‌లో రేవ్ పార్టీ.. ఐదుగురు అరెస్ట్
హఫీజ్‌పేట్: మాదాపూర్‌లో రేవ్ పారీ్టపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు దాడి చేశారు. ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కె.వై.ఖురేషి, ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు గురువారం శేరిలింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ (31) ఆధ్వర్యంలో మాదాపూర్ సైబర్ టవర్స్ వెనక ఉన్న క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో జన్మదిన వేడుకల్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ నెల 12న నాగరాజు గోవా నుంచి 3 గ్రాముల కొకైన్‌ను తెప్పించి మోకిలకు చెందిన నితిన్ (24)కు అందించాడు. బేగంపేటకు చెందిన సాయికుమార్ యాదవ్ (27) విదేశాల నుంచి మద్యం తీసుకురాగా, బంజారాహిల్స్‌కు చెందిన సీహెచ్ కిషోర్ (28) రేవ్‌పార్టీకి కోసం సరీ్వస్ అపార్ట్మెంట్ బుక్ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి ఎస్ఐలు బాల్‌రాజ్, సంధ్యల బృందం రేవ్‌పార్టీపై దాడి చేసి 14 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులోకి తీసుకుంది.వారి నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే కొకైన్ (1 గ్రాము), ఎండీఎంఏ (2 గ్రాములు), ఓజీ కుష్(1 గ్రాము)తోపాటు 12 విదేశీ మద్యం సీసాలు, 36 బీర్ సీసాలు, ఒక ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహించిన నాగరాజుతోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేసిన సాయికుమార్ యాదవ్, ఇమాన్యుల్, సీహెచ్ కిషోర్, నితిన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మిగతా 15 మందిని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. రేవ్‌పారీ్టలో పట్టుబడ్డ ఐదుగురు యువకులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎబాన్ యూరిన్ టెస్ట్ అనే నూతన పరికరంతో పరీక్షలు చేశారు. ఈ పరీక్షతో కేవలం 5 నిమిషాల్లోనే సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకోవచ్చు. -
ఎలినోర్ 1.0 ఫ్యాషన్..
మాదాపూర్: మోడల్స్, సినీతారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తు హోయలోలికించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఎలినోర్ 1.0 ఫ్యాషన్ ఫర్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్‌షోను వినూత్న పద్ధతిలో సంగీతం, నృత్యం, పాఠశాల విద్యార్థులతో థియోటర్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్‌కుమార్ థీమ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారతీయ ఫ్యాషన్ వర్ణచిత్రాన్ని ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనలో, స్వదేశీ ఉద్యమం తరువాత, రేగల్ వర్గాల వైభవంతో, ఆధునిక భారతదేశం వరకూ వస్త్రధారణ ధోరణులను ప్రదర్శించారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో 700 మంది చిన్నారులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వెచి్చంచనున్నట్లు శ్రవంతి కందారు తెలిపారు. ర్యాంప్‌వాక్‌లో సినీతారలు సంయుక్తమీనన్, ఫరియా అబ్దుల్లా, మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినిగుప్త, సిమ్రాన్ చౌదరి, యుక్తిథారేజా, సాన్వే మేఘన, శివాతి్మక రాజశేఖర్, పావని కరణం, దీప్తివర్మ, భరత్ గార్లపాటి, రాహుల్ విజయ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
మాదాపూర్ కేరీర్ ఫేయిర్‌లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
Hyd: చిట్టీల పేరుతో రూ.200 కోట్ల స్కామ్
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ ప్రాంతంలో చిట్టీల పేరుతో రూ.200 కోట్లు ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. సమతా మూర్తి చిట్ ఫండ్ ఫండ్ కంపెనీ పేరుతో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుల చేతిలో మోసానికి గురైన వందలాది మంది బాధితులు రెండు నెలల క్రితమే మాదాపూర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదని తెలుస్తోంది. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. సీపీ ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చిట్‌ఫండ్ కంపెనీతో సంబంధమున్న శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రాకేష్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గణేష్, జ్యోతిలు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదీచదవండి.. మియాపూర్ సస్పెన్షన్.. కారణమిదే -
టీఎస్ఐపాస్ ద్వారా 24000 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం
మాదాపూర్: టీఎస్ ఐపాస్ ద్వారా గత 8.5 ఏళ్లలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్లాస్టిక్ ఎక్స్పో, హిప్లెక్స్ 2023 ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయిందని, రెండోదాని ఏర్పాటుకు టీఎస్ఐఐసీ స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ లకు వసతి కల్పించేందుకు వీలుగా టీఏపీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమకు హబ్‌గా ఉందన్నారు. ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ 60 ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయాన్ని అందించిందన్నారు. హెచ్‌కె గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్ పెట్రోకెమికల్స్) శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. నేడు యూఎస్ఏ, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా ఉందన్నారు. 6 శాతం నుండి 7శాతం సీఎజీఆర్ వద్ద నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. గెయిల్ అమ్మకాల్లో దక్షిణ ప్రాంతం 18శాతం వాటాను అందిస్తుందన్నారు. చైనా జనాభా పెరిగినప్పటికీ మన తలసరి ప్లాస్టిక్ వినియోగం చైనాకంటే చాలా తక్కువ అన్నారు. 11 కేటీల వద్ద చైనా తలసరి వినియోగం, 46కేజీ, యూఎస్ఏ 170 కేజీ, ప్రపంచ సగటు 28 కేజీలు వాటి కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. ప్లాస్టిక్‌పై విధించిన 18శాతం జీఎస్టీని తగ్గించాలని ఆప్మా, తాప్స్ తరఫున ఆయన కోరారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై విధించిన జీఎస్టీని తగ్గించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా)నాలుగురోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తాప్మా అద్యభుడు విమలేష్గుప్త తెలిపారు. దశాబ్దం క్రితం 9 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 18 మిలియన్ టన్నుల వినియోగం స్ఠాయికి చేరుకున్నామని ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం తెలిపారు. పర్యావరణ సంక్షోభానికి కేవలం ప్లాస్టిక్ పరిశ్రమనే నిందించలేమని సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ అవసరమన్నారు. భారతదేశంలో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో కేవలం 30శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతుందన్నారు. కీలకమైన వృద్ధి రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలను అందించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. స్పెషాలిటీ కెమికల్స్, మాస్టర్బ్యాచ్లు, ప్రాసెస్ మిషనరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రామెటీరియల్స్, మోల్డ్స్, డై, పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, క్వాలిటి టెస్టింగ్ ఎక్విప్మెంట్, ఫినిస్ట్ ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్ఎంఈఎల్ ఎండి ప్రభుదాస్,ఆలిండియా ఇండియా ప్లాస్టిక్ మానుప్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ పాల్గొన్నారు. -
హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: హరిత భవనాలలో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో 1,027 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 11 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందాయి. తెలంగాణలో 112 కోట్ల చ.అ.లలో 700లకు పైగా ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించాలని ఐజీబీసీ నిర్ణయించింది. జూలై 28-30 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈమేరకు మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్‌రావులు ప్రాపర్టీ షో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణ బాధ్యత, ఆవశ్యకతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిర్వహణ వ్యయం, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపులతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. 75కి పైగా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్రీ-సర్టిఫైడ్ నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్‌లతోపాటు హరిత నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతికత, సేవల సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకోనున్నారని వివరించారు. -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, సురారం, గాజులరామారం, కూకట్పల్లి, చింతల్, బాలానగర్, నార్సింగి, కోకాపేట్, కొండాపూర్, కొంపల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, నిజాంపేట, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. View in Gachibowli pic.twitter.com/3Ume7WqYOL — Suman Amarnath (@sumanva) June 4, 2023 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. Heavy winds and rains in Gachibowli side of Hyderabad. pic.twitter.com/GhC2msC98D — N Jagannath Das_TT (@dassport_TT) June 4, 2023 మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది. Storm! #Hyderabad #Hyderabadrains pic.twitter.com/AUbuVyhlmv — krishna karthik (@krishnakarthik1) June 4, 2023 @balaji25_t @HYDWeatherMan HeavyRains at alwal #Hyderabad #Rains pic.twitter.com/G2SacYLIbM — Mahesh MK (@ursmaheshmk) June 4, 2023 -
గుడ్ స్కూల్ యాప్‌ను ప్రారంభించిన అడివి శేషు
సైన్స్ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్లో గుడ్ స్కూల్ యాప్‌ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు. ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : హైటెక్స్‌లో పెటెక్స్–2023 ప్రదర్శన (ఫొటోలు)
-
పెటెక్స్..అదుర్స్
మాదాపూర్: వివిధ దేశాలు...50 విభిన్న జాతులకు చెందిన 500 శునకాలు.. 700 రకాల చేపలు...క్యాట్ షో...అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు...నగరంలో మొదటిసారిగా ఏర్పాటైన పెటెక్స్–2023 ప్రత్యేకతలివీ. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఎనిమిది మంది అంతర్జాతీయ నిపుణులు పోటీల్లో న్యాయనిర్ణేతలుగా పాలుపంచుకుంటున్నారు. ఇక ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ క్యాట్ షోను నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమలో భారత్ ఒకటి అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. పెంపుడు జంతువుల ప్రాముఖ్యతను వివరించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆకట్టుకుంటున్న 700 రకాల చేపలు హైటెక్స్‌లో పెటెక్స్లో భాగంగా ఆక్వా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 700 రకాల చేపలు ప్రదర్శనలో ఉంచారు. చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ అక్వేరియమ్, మాన్స్స్టార్, సెమీ అగ్రెసివ్ అక్వేరియమ్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో సిల్వర్ డెరోడో చేప ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.3.50 లక్షల రూపాయలు. దీని ప్రత్యేకత..నీటిలో 12 అడుగుల లోతులో గంటకి 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో చివరి రోజు రెడ్‌చిల్లీ అర్వాన చేపను సందర్శకులు తిలకించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని ధర. రూ.42 లక్షలు. దీని ప్రత్యేకత..నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, అందంగా ఉంటుందని, ఇంట్లో ఉంటో వాస్తుపరంగా బాగుంటుందని జపనీయుల నమ్మకం. ఆకట్టుకుంటున్న 120 రకాల పిల్లులు ప్రదర్శనలో దాదాపు 120 రకాల పిల్లులను ఉంచారు. కొన్ని రకాల పిల్లులు చూడడానికి పులులుగా ఉన్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హేయిర్, హిమాలయన్, బ్రీటీస్ సార్ట్ హేయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్, మెన్కున్ లాంటి బ్రీడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 50 వేల నుండి రూ.3 లక్షల వరకు ఉన్నాయి. పక్షులు సైతం.. ఆస్ట్రేలియాకు చెందిన మోలుకన్ కొకాటో పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి ధర రూ.50 నుండి ప్రారంభం. నెల ఖర్చు రూ.5 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. గృహాలలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు బ్లూగోల్డ్ మకావ్, రామచిలుకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు అందంగా తయారు చేస్తా.. నా దగ్గర ఉన్న చిన్న డాగ్ షెడ్జి. దీని ధర రూ.28 వేలు. దీనికి నెలఖర్చు రూ.10 వేల వరకు అవుతాయి. ప్రతి నెల డాక్టర్ వద్ద చెకప్ చేయిస్తా. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత ప్రేమగా చూసుకుంటాను. ప్రతి రోజు అందంగా తయారు చేస్తాను. – రమన్, జుంతుప్రేమికురాలు కుక్కలకు రక్తం అవసరం ప్రమాదాలు వాటిల్లినప్పుడు మనుషులకు రక్తం ఎలా అవసరం ఉంటుందో కుక్కలకూ అలాగే అవసరం. ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు, రక్తం మార్చవలసిన పరిస్థితి కలిగినప్పుడు మాకు సమాచారం అందిస్తే సంబంధించిన ఇతర కుక్కలను తీసుకువచ్చి రక్తాన్ని ఇస్తాం. – కౌశిక్, జంతుప్రేమికుడు కేరింగ్ తీసుకోవాలి పెంపుడు జంతువులను పెంచాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే వాటిని పెంచగలం, పెండుపు జంతువులను పెంచేవారు డాక్టర్ల సలహాలను, నిపుణులతో సంప్రదించాలి. వాటికి కావాల్సిన ఆహారాన్ని తగినంత మొతాదులో పెట్టాలి. వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. – గణేశ్, వెటర్నరీ డాక్టర్ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తాం.. బ్లాక్ల్యాబ్రో డాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెంచుతున్నా. కుటుంబంలో ఒకరిగా చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ సైతం చూడడానికి ఇంటికి వస్తారు. దీని ధర రూ.20 వేల నుండి ప్రారంభం అవుతుంది. దీనికి నెల ఖర్చు రూ.6 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. – జాగృతి, జంతు ప్రేమికురాలు -
అభినవ అన్నమయ్య పద్మశ్రీ ‘శోభారాజు’ 40 ఏళ్ల సంకీర్తనా ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తిరుపతి వేదికగా 1978లో ఒక గొంతుక ‘అదివో అల్లదిహో’ అనే పాటను తొలి సారిగా ఆలపించింది. ఆ గానంతో యావత్ తెలుగు జాతి అంతా ఒక్క సారిగా అన్నమయ్య సంకీర్తనల పై దృష్టిసారించింది. తెలుగు ప్రజలు ‘అభినవ అన్నమయ్య’గా పిలుచుకునే శోభారాజుది ఆ స్వరం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసి, భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే ధ్యేయంతో 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించింది. మాదాపూర్ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించగా అక్కడ అన్నమయ్యపురాన్ని నిర్మించి సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నిబద్ధత, కృషికి ఫలితంగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇలాంటి విశేష సేవలందిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ ఈ నెల 30న 40 వసంతాలకు చేరువ కానుంది. అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి తొలి కళాకారిణిగా.. సినిమాలకు పాటలు పాడాలనే కలలు కన్న శోభారా జు భవిష్యత్ కాలంలో అన్నమయ్య సంకీర్తనలకు ముగ్దురాలై, కేవలం అన్నమయ్య రచనలు, సంకీర్తనల ను తెలుగు ప్రజలకు దగ్గర చేయడమే లక్ష్యంగా మా ర్చుకుంది. నేదునూరి కృష్ణమూర్తి తదితర మహా విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సాధించి, 1976లో తిరుమల తిరుపతి దేవస్థాన ‘అన్నమాచార్య ప్రాజెక్ట్’లో తొలి కళాకారిణిగా స్కాల ర్ షిప్ అందుకున్నారు. ఆమె అంకితభావమే తిరుమ ల తిరుపతి క్షేత్రంగా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి శోభారాజును తొలి కళాకారిణిగా నియమించేలా చేసింది. 1978లో టీటీడీ తొలి సారిగా నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవంలో శోభారాజు స్వయంగా తాను రూపొందించిన ‘అన్నమయ్య కథ’ అనే సంగీత రూపకాన్ని అన్నమయ్యకు తొలి కానుకగా సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమయ్యకు సంబంధించి ఏ విషయం కావాలన్నా తన కళా రూపమే మాతృకగా నిలుస్తుంది. ఆమె ఆలపించిన ‘కొండలలో నెలకొన్న’, ‘చాలదా హరినామ సౌఖ్యామృతము’, ‘గోవిందాశ్రిత గోకులబృంద’, ‘ఏమొకో చిగురటధరమున’, ‘శిరుత నవ్వులవాడు శినెక’, ‘కులుకక నడువరో’ తదితర సంకీర్తనల ఆల్బమ్‌లు ప్రతి తెలుగు ఇంటా మారు మోగాయి. జీవితమంతా సంకీర్తనం... 1983 నుంచి హైదరాబాద్ వేదికగా తను నిర్వహించిన కార్యక్రమాలు తన జీవితానికి పరమార్థంగా నిలిచాయని ఆమె తెలిపారు. దేశ విదేశాల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఔత్సాహికులకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పారని, ఆరు వేలకు పైగా సంకీర్తనా కచ్చేరీలు ఏర్పాటు చేశానని అన్నారు. మానసికంగా సాంత్వన చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఉపశమన సంకీర్తన’ కార్యక్రమాన్ని ప్రారంభించి చంచల్ గూడ జైల్లో 1200 ఖైదీలకు సంకీర్తనా సేవలందించినట్లు తెలిపారు. అనారోగ్య సమయంలో సంగీతం, సాహిత్యం కోలుకునేలా చేస్తుందని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ‘సంకీర్తనౌషధం’ పేర నాద చికిత్సా కార్యక్రమాన్ని, ఏటా ‘నాద బ్రహోత్సవ్’ పేర నవరాత్రులలో కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహించి కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అన్నమయ్య కృషిని భారత ప్రభుత్వానికి తెలియజేసి 2004లో అన్నమయ్య తపాలా బిళ్లను విడుదలయ్యేలా చేశానన్నారు. అన్నమయ్య పైన తన పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు చాలా మందికి తెలియని 39 అన్నమయ్య సంకీర్తనలను తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ నుంచి సేకరించి ‘అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం’ అనే పుస్తకంగా ప్రచురించాం. దూరదర్శన్ సహకారంతో రచన, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించిన ‘శ్రీ అన్నమాచార్య’ టెలీ సీరియల్‌ను కూడా రూపొందించామన్నారు. తమ క్షేత్రంలో అన్నమయ్య జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఇద్దరికి కలిపి ఒకే ఆలయాన్ని నిర్మించి అన్నమయ్య పురంగా తయారు చేశానని, దేశ ప్రధాన మంత్రులు పీవీ, వాజ్ పాయి, ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, రామారావు, రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంఎస్ సుబ్బు లక్ష్మి , ఏఎన్నార్ తదితర ప్రముఖులు సందర్శించారన్నారు. వైఎస్‌ది కళా హృదయం.. తన కృషికి గుర్తించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తెలియకుండానే రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారని తెలిపారు. కళలకు, కళాకారులకు వైఎస్ అందించిన గౌరవం ప్రత్యేకమైనదని ఆమె కొనియాడారు. అమెరికా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో నిర్వహించిన సంకీర్తనా కార్యక్రమాలకు గాను ఎన్నో అవార్డు, డాక్టరేట్లు, బిరుదులు పాందానని, తానా ఆధ్వర్యంలో అన్నమయ్య పదకోకిల బిరుదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నట్లు ఆమె వివరించారు. -
టీటా ఆధ్వర్యంలో బోనాలు
మాదాపూర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ 2లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆదివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల మట్లాడుతూ దేశీయ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ 21 బోనాలను మాదాపూర్‌లోని చిన్నపెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద సమర్పించినట్లు తెలిపారు. పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, కోలాటాల మధ్య బోనాలను అమ్మవారికి సమర్పించినట్టు తెలిపారు. టీహబ్2 నుండి సైబర్ వద్ద ఉన్న దేవాలయం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతతౌటం, టీహబ్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
మాదాపూర్: కూచిపూడి నృత్యాంశాలతో కళాకారిణి ప్రణయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేధికలో అదివారం కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనను నిర్వహించారు. కళాకారిణి ప్రణయ గూడిపాటి చేసిన నృత్యాలు సందర్శకులను అలరించాయి. అన్నమాచార్య కీర్తనలు, దశావతారాలు, తరంగం, థిల్లాన తదితర అంశాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. కూచిపూడి నృత్యగురువు పొనూర్ క్రాంతి కిరణ్ సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నటువాంగం క్రాంతికిరణ్, వోకల్ మంతశ్రీనివాస్, మృదంగం నాగేశ్వరరావు, వయోలిన్ అనిల్‌కుమార్, ప్లూట్ ఉమావేంకటేశ్వర్లు , శ్రీధరాచార్యులు సంగీత సహకారాన్ని అందించారు. ప్రదర్శనకు పొట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్, ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత భాగవతుల సేతురామ్, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత కళాక్రిష్ణ తదితరులు హాజరై అభినందించారు. -
ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఆఫీస్ వైపు క్రమంగా మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగుల రాక పెరిగిపోయింది. ఇదే సమయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కల్పించేందుకు సైబరాబాద్ షీ టీమ్ బృందాలు సిద్ధమయ్యాయి. బృందాల సంఖ్యను పెంచడంతో పాటు, మఫ్టీలో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. విదేశీ సంస్థలకు సేవలందించే చాలా వరకు ఐటీ కంపెనీలు 24 గంటలు పని చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకునే అల్లరి మూకల ఆగడాలను కట్టించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా వీకెండ్ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. పెరిగిన షీ టీమ్స్.. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు గతంలో నాలుగు షీ టీమ్స్ ఉండగా.. వాటి సంఖ్యను 11కు పెంచారు. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్ ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వీకెండ్ షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మహిళలను కామెంట్ చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్‌కు తోడుకు పెట్రోలింగ్ సిబ్బంది ఉంటూ అర్ధరాత్రి హల్చల్ చేసే పోకిరీల ఆటకట్టిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఫోకస్.. ఐటీ కారిడార్‌లో షీ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్ ప్రాంతాల్లోని ఫుడ్ కోర్ట్లు, లేడిస్ హాస్టల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు ప్రాంతాలలో షీ టీమ్స్ ప్రత్యేక దృష్టిసారించాయి. (క్లిక్: ఆమ్నీషియా పబ్ కేసు.. మరో అమ్మాయిపైనా వేధింపులు!) -
హైదరాబాద్‌లో వర్క్ ఫ్రం ఆఫీస్.. బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’
సాక్షి, హైదరాబాద్: దశల వారీగా ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత... ► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్) ► ఐటీ కారిడార్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్‌లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా మూడు సెక్టార్లు.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ట్రాఫిక్ పీఎస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో కొత్తగా మూడు ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోటీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ► మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్ ► గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్ ► కూకట్పల్లి పీఎస్ పరిధిలో కేపీహెచ్‌బీ సెక్టార్‌ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ► ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ) -
కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నానని.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, మాదాపూర్: కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోతున్నానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ పోచంపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు లక్ష్మి, వానదేవుడు దంపతులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బొల్లిపోగు స్నేహ (19) చదువుకుంటోంది. నెల రోజుల క్రితం తండ్రికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పటి నుంచి స్నేహ మానసిక వేదనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి స్నేహ బలన్మరణానికి పూనుకుంది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మ’ను గెలిపించిన మెడికవర్ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: పుట్టుకతోనే తక్కువ బరువు (550 గ్రాములు)తో జన్మించి..మృత్యువుతో పోరాడుతున్న ఓ శిశువుకు మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 140 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు. ప్రస్తుతం శిశువు బరువు 2.5 కేజీలకు చేరుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు చికిత్స సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. నెలలు నిండక ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం.. నగరానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ గతేడాది నవంబర్ ఆరో తేదీన తొలి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. 24 వారాల ఐదు రోజులకు శిశువు జన్మించింది. ఈ సమయంలో శిశువు బరువు కేవలం 550 గ్రాములే. సాధారణంగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బతకడం చాలా కష్టం. కానీ మెడికవర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, డాక్టర్ నవిత, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ జనార్దన్‌రెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేష్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును ఎలాగైనా బతికించాలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత ఎన్ఐసీయూకు తరలించి సీపీఏపీతో శ్వాసను అందించారు. పుట్టిన రెండో రోజు నుంచే శిశువుకు ఐవీప్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ట్యూబ్ ద్వారా పాలు అందించారు. ఇదే సమయంలో శిశువుకు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫీడింగ్ ఆపేసి..యాంటిబయా టిక్ డోస్‌ను పెంచారు. శిశువు కోలుకున్న తర్వాత నేరుగా పాలు పట్టడంతో పాటు సీపీఏపీ ప్రక్రియను నిలిపివేసి, స్వయంగా శ్వాసతీసుకునే విధంగా చేశారు. ప్రస్తుతం శిశువు 2.5 కేజీల బరువు పెరిగింది. శ్వాస తీసుకోవడంతో పాటు స్వయంగా పాలు తాగుతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. దీంతో శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. -
ఆదివారాలూ ఆధార్ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డులో మార్పుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆఫ్‌లైన్‌లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఆధ్వర్యంలో నగరంలోని మాదాపూర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రం ఆదివారం కూడా పనిచేస్తుంది. భారత ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసే ఈ కేంద్రాన్ని మాదాపూర్ విఠల్‌రావునగర్‌లోని రిలయన్స్ సైబర్విల్లే ప్లాట్ నంబర్ 17–24 లలో ప్రారంభించారు. యూఐడీఏఐ వెబ్సైట్ uidai.gov.in ద్వారా ప్రజలు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఈ కేంద్రంలో తమకు కావాల్సిన సేవలను పొందవచ్చని ఆధార్ రాష్ట్ర డిప్యుటీ సెక్రటరీ గడ్డం వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే మనస్తాపంతో ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పొగాకు హరిణి(24) అనే యువతికి రెండున్నరేళ్ల క్రితం గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో బస చేస్తూ.. మాదాపూర్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్తుండేది. కాగా తను పనిచేస్తున్న సంస్థతో ఉన్న రెండున్నర ఏళ్ల ఒప్పందం డిసెంబరు నెలతో ముగియనుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో తాను ఉంటున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ అని సమాచారం. -
సాక్షి ప్రాపర్టీ షో నేడే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు అంత ఆషామాషీ పనేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడుందో వెతకాలంటే కష్టమే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. అదే ‘సాక్షి ప్రాపర్టీ షో’! ప్రాజెక్ట్ ఎంపిక నుంచి గృహ రుణం వరకూ నిర్మాణ సంస్థలను, బ్యాంక్‌లను ఒకే చోటికి తీసుకొచ్చి కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది సాక్షి. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ముఖ్య అతిథిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెరా చైర్మన్ సోమేశ్ కుమార్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. 40కి పైగా స్టాళ్ల ఏర్పాటు.. నగరానికి చెందిన 20కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. ఇలా అన్ని రకాల గృహ ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? సొంతింటి కొనుగోలు నిర్ణయంలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. మరి ఆలస్యమెందుకు? వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి.. నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి. ప్రధాన స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేటెడ్ స్పాన్సర్: రాంకీ ఎస్టేట్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ ఇంజనీర్స్, మ్యాక్, ఎన్సీసీ అర్బన్, స్పేస్ విజన్ పాల్గొనే సంస్థలు: ఈఐపీఎల్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, గిరిధారి హోమ్స్, శ్రీ ఆదిత్య హోమ్స్, ప్రణీత్ గ్రూప్, ఆర్వీ నిర్మాణ్, కపిల్ ప్రాపర్టీస్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్స్, పేరం గ్రూప్, వర్టుసా లైఫ్ స్పేసెస్, చరణ్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).