Madhavi
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమిలో కుంపట్లు జనసేన, టీడీపీ నేతల మధ్య కుర్చీల కోసం పోరాటం..
-
భారత్ రెగ్యులేటర్లు.. భేష్
ముంబై: భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అత్యుత్తమ రీతిలో ‘‘ప్రపంచ ప్రమాణాల స్థాయి’’ విధులు నిర్వహిస్తున్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సైతం రెగ్యులేటర్లు కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా రెగ్యులేటర్లను ప్రశ్నించడానికి లేదా విమర్శించడానికి తాను వ్యతిరేకం కాదని ఆమె ఆ సందర్భంగా ఉద్ఘాటింటారు. అయితే రెగ్యులేటర్లు నిర్వహిస్తున్న అత్యున్నత బాధ్యతలు, ఎకానమీ పురోభివృద్ధిలో సహకారం పట్ల కూడా ‘అత్యంత స్పృహ‘ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్బెస్ట్ బ్యాంక్స్ అవార్డుల కార్యక్రమంలో అన్నారు.సెబీ విషయంలో బయటకు వస్తున్న వాస్తవాలను అందరూ పరిశీలించాలని కోరారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రెగ్యులేటర్లపై చర్యలు తీసుకోవాలని చర్చించే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను’’ అని సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలు బ్యాంకుల్లో పొదుపులు... పెట్టుబడుల్లోకి మారుతున్నాయన్న భయాలను ప్రస్తావిస్తూ, తక్కువ వడ్డీవచ్చే ఖాతాల వద్ద సౌకర్యవంతంగా కూర్చుండిపోకుండా, కొంత రిస్క్ తీసుకునిఎక్కువ రాబడులు పొందే వీలున్న మార్కెట్లలోకి మధ్యతరగతి భారతీయులు ప్రవేశించడానికి దోహదపడుతూ ‘‘గొప్ప సేవ’’చేస్తున్న డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో 2.31 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య సెపె్టంబరు 2024 నాటికి 17.1 కోట్లకు పెరిగాయన్న గణాంకాలను కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.బ్యాంకుల పటిష్టత అటు ఎకానమీని ఇటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటి లాభదాయకతను ప్రభావితం చేసే రుణ నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె బ్యాంకింగ్‌కు సూచించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు విద్యాపరంగా అర్హత కలిగి ఉన్నారని, అయితే పారిశ్రామిక అవసరాల గురించి వారికి పెద్దగా తెలియడం లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్‌కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
పొలం బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వమని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం
-
22న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్‌కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు, పీపీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్‌బర్గ్ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేరళ వయనాడ్ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే ‘‘స్టాక్మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్‌బర్గ్ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్భారతావనికి షాక్‌కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.కుల గణన అనేది ప్రజల డిమాండ్. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు. -
ఈ ముగ్గురి మరణం.. మిస్టరీ
సనత్‌నగర్(హైదరాబాద్): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో నిర్జీవంగా పడి ఉండటం కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేని కుమారుడికి స్నానం చేయించేందుకు బాత్రూమ్లోకి వెళ్ళిన భార్యభర్తలు.. కొడుకుతో సహా విగతజీవులుగా మారడం సంచలనం రేకె త్తించింది. అయితే వీరు విద్యుదాఘాతానికి గురయ్యారా? లేక కొడుకు మానసిక పరిస్థితి తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? అనేది మిస్టరీగా మారింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జెక్కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. జెక్ కాలనీ నాల్గో వీధిలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఫ్లా్లట్ నంబర్ 204లో ఆర్.వెంకటేష్ (59), భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) నివాసం ఉంటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. 2004 నుంచి జెక్కాలనీలోనే నివాసముంటున్నారు. కుమారుడు హరికృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దగ్గరుండి తల్లిదండ్రులే అతని బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వారే కుమారుడికి స్నానం చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ముగ్గురూ బాత్రూంలో మృత్యువాత పడగా, వారి మృతికి కారణం ఏమై ఉంటుందా? అన్నది మిస్టరీగానే ఉంది. బాత్రూమ్లో గ్యాస్ ఆధారిత గీజర్ ఉండటంతో షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడాన్ని బట్టి చూస్తే ముగ్గురూ ఒకేసారి బాత్రూమ్లోకి వెళ్లారని తెలుస్తోంది.ఇలా వెలుగులోకి వచ్చింది..ఇంట్లో పనిచేసే వరలక్ష్మి ఉదయం 11.30 గంటలకు వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ముగ్గురూ బయటకు వెళ్ళి ఉంటారేమోనని భావించి యధావిధిగా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లేకపోవడంతో అటువైపు ఆమె వెళ్లలేదు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వరలక్ష్మి మళ్ళీ రాగా..పాల ప్యాకెట్, ఉదయం తాను చూసిన ఇతరత్రా వస్తువులు అలాగే ఉండడాన్ని చూసి ఇంకా వారు రాలేదేమోనని వెళ్లిపోయింది. సాయంత్రం 6 గంటలకు తోటి పనిమనిషి విజయలక్ష్మితో కలిసి మళ్లీ వచ్చింది. అయితే అనుమానం వచ్చిన వారికి వాచ్‌మన్ సత్యనారాయణను పిలిచి బాత్రూమ్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా డోర్‌కు అడ్డంగా హరికృష్ణ బట్టలు లేకుండా పడిఉన్నాడు. ఆ పక్కనే వెంకటేష్, మాధవి మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
డివైడర్ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం!
నిజామాబాద్: సంప్రదాయం ప్రకారం గోదావ రి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి.. మార్గమధ్యలో డివైడర్‌పై ఉన్న పూలను తెంపి, వాహనం వద్దకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. వివరాలిలా ఉన్నా యి. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన కొమిరె మాధవి(25) ఐదు నెలల గర్భిణి. ఐదు నెలల సమయంలో గంగమ్మ పూజలు చేయడం వారి కుటుంబంలో ఆనవాయితీ. శుక్రవారం ఉదయం మాధవి భర్త గంగసాగర్, కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల గోదావరిలో స్నానాలు ఆచరించడానికి ఆటోలో బయలుదేరారు. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద ఆటోను ఆపి జాతీయ రహదారి డివైడర్ మధ్యలోనున్న పూలను తెంపడానికి మాధవి వెళ్లింది. పూలను తెంపి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఓట్ల కోసం టీడీపీ చిల్లర రాజకీయం..!
-
ఎంపీ మాధవి కుమార్తెకు సీఎం నామకరణం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్‌ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల కల్చరల్/వేములవాడ: న్యాయవాద వృత్తి లో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, ని రంతర అధ్యయనంతోనే రాణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.మాధవీదేవి పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఏజేసీజే) కోర్టు భవనాన్ని హైకోర్టు మ రో న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులకు దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో అమలులో ఉన్న వ ర్చువల్ విధానాన్ని రానున్న రోజుల్లో అన్ని కోర్టు లకూ విస్తరిస్తామన్నారు. జిల్లా కోర్టులోనూ ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కోర్టు సముదాయం కోసం కేటాయించిన స్థలం విషయంలో బార్ కౌన్సిల్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ జె.శ్రీనివాసరావు మాట్లాడు తూ కఠోరశ్రమ, నిజాయితీతో కొనసాగితే న్యాయ వృత్తిలో రాణించడం సులువేనన్నారు. సిరిసిల్ల, జగి త్యాల జిల్లాల న్యాయమూర్తులు ఎన్.ప్రేమలత, నీలిమ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ మాధవిదేవి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కాజా శరత్ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇప్పటికే ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉన్నప్పటికీ.. సుమారు 3,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి సంబంధించి సత్వర తీర్పు వెలువరించేందుకే మరో కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. భద్రాచలం బార్ అసోసియేషన్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను అందించిందని, బార్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో ఫ్యామిలీ కోర్టు ప్రారంభం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టు సము దాయంలో ఫ్యామిలీ కోర్టును హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అదేవిధంగా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ నూతన సంవత్సర కేలెండర్‌ను ఆవిష్కరించారు. హైకోర్టు జడ్జికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు స్వాగతం పలకగా.. పలువురు జడ్జిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొద టి అదనపు జిల్లా జడ్జి తిరుపతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.వేణు పాల్గొన్నారు. సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తా: జస్టిస్ పుల్లా కార్తీక్ చివ్వెంల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో నెలకొన్న సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హైకోర్టు జడ్జి, సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ అన్నారు. ఆయన శనివారం సూర్యాపేట జి ల్లాకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కార్తీక్ మాట్లాడారు. అంతకుముందు ఆయన పిల్ల లమర్రి శివాలయాన్ని, అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
Madhavi Kattekola: జై జవాన్‌కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్
వెండితెరపై అలరించిన అలనాటి తారలేందరో ప్రస్తుతం కనుమరుగయ్యారు. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. 80,90లో తమ అందం, అభిమనయంతో ఆకట్టుకున్న ఎంతో స్టార్ హీరోయిన్స్ వెండితెరకు దూరమై పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో సీనియర్ నటి, ‘మాతృదేవోభవ’ ఫేం మాధవి ఒకరు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లలతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు. చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్‌లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
హెచ్ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్‌బుక్‌లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్‌లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్‌సీఎల్‌లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్‌తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్‌గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్‌లు, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్‌లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్‌లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్‌తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్) -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. స్కూల్‌తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్‌కుమార్ -
ఎవరీ మాధవీ పురీ.. కీలక పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారి ఒక మహిళ నాయకత్వం వహించనున్నారు. కేబినెట్ ఎంపికల కమిటీ.. మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్‌ను సెబీ కొత్త చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీకాలం సోమవారం(28న) ముగియనుంది. దీంతో నేటి(మార్చి1) నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. వెరసి సెబీ నిర్వహణకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించడం గమనార్హం! 30 ఏళ్ల అనుభవం.. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల కెరీర్‌ను సొంతం చేసుకున్న మాధవీ పురీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా. త్యాగి ఐదేళ్లు...: 1984 బ్యాచ్ హిమాచల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్ త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు. మాధవీ పురీ కెరీర్... సెబీకి తొలి మహిళా సారథిగా బాధ్యతలు చేపట్టనున్న మాధవీ పురీ ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రైవేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఓ హోటల్‌పై టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా ఉన్నారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెకండరీ మార్కెట్ల రక్షణ, సామర్థ్యం, పారదర్శకత తదితర అంశాల మెరుగుపై సలహా కమిటీ ద్వారా సెబీకి సేవలందించారు. -
మిద్దె తోటల మాధవి.. ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో
తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్‌కి తనదైన వాణీ వినిపిస్తోంది. ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్‌ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్‌డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని. ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు.. పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్ మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్‌లో గార్డెన్‌కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను. ఫోన్‌తోనే షూట్.. ఏ సీజన్లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్లోనే గార్డెనింగ్‌కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను. కాలక్షేపం... పేరు, ఆనందం టైమ్ పాస్‌కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది. బంగాళదుంప.. పసుపు నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్‌ని పెట్టుకున్నాను. ఘనమైన రుచి.. ఆరోగ్యం.. ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది. ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్‌గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal)