Maharashtra Navnirman Sena (MNS)
-
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఠాక్రేకు హెచ్చరిక.. బ్రిజ్ భూషణ్ సింగ్ రాకతో ఏం జరగనుంది?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ ఈ నెల 15న పుణే పర్యటనకు రానున్నారు. పుణేలో మహారాష్ట్ర కేసరీ కుస్తీ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఆయన పుణేకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనపై ఎమ్మెన్నెస్ ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, బ్రిజ్‌భూషణ్ పర్యటనను వ్యతిరేకించబోమని పుణేకు చెందిన ఎమ్మెన్నెస్ నేత వసంత్ మోరే తెలిపారు. బ్రిజ్‌భూషణ్ సింగ్ పుణే పర్యటనపై ఎమ్మెన్నెస్ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు దూకుడు తగ్గించి, మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఠాక్రే పర్యటనపై సవాళ్లు..ప్రతిసవాళ్లు.. రాజ్ ఠాక్రే ఈ ఏడాది జూన్ ఐదో తేదీన అయోధ్య పర్యటనకు వెళతానని, అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రకటించగానే.. ఆయనను అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని బ్రిజ్‌భూషణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాజ్ ఠాక్రే అయోధ్యకు రావాలనుకుంటే అప్పట్లో రైల్వే ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముంబై వచి్చన ఉత్తరభారతీయులపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే అడుగుపెట్టాలని బ్రిజ్‌భూషణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో రాజ్‌ఠాక్రే అయోధ్యకు వస్తే విమానాశ్రయంలో, రైల్వే స్టేషన్లో, రోడ్డు మార్గంలో ఇలా ఎక్కడైనా సరే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. రాజ్ ఠాక్రేను వ్యతిరేకించినప్పటికీ జూన్‌లో ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలు కొందరు అయోధ్య వెళ్లి రామున్ని దర్శించుకున్నారు. తాజాగా బ్రిజ్‌భూషణ్‌సింగ్ పుణే పర్యటనతో గత పదేళ్లు సద్దుమణిగిన ఉత్తరభారతీయుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ముంబైలో ఎమ్మెన్నెస్– ఉత్తరభారతీయు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. బ్రిజ్‌భూషణ్‌సింగ్ విసిరిన సవాలుకు ఎమ్మెన్నెస్ నేతలు అంతే దీటుగా సమాధానమిచ్చారు. ఇక అప్పట్నుంచి ఎమ్మెన్నెస్ నేతలు, బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. చిచ్చుపెట్టేందుకే బ్రిజ్ పర్యటన! ఎమ్మెన్నెస్‌కు బ్రిజ్‌భూషణ్ మధ్య చిచ్చుపెట్టేందుకే బ్రిజ్‌భూషణ్ పుణె పర్యటనకు వస్తున్నారని, ఇందులో ఎన్సీపీ నేత శరద్‌పవార్ హస్తం కూడా ఉండొచ్చని అనుమానం ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సింగ్ మేక లాంటి వారు. పులిని వేటాడేందుకు మేకను ఎరవేసినట్లు పవార్ మా మధ్య చిచ్చు పెట్టేందుకు సింగ్‌ను పుణేకు ఆహ్వానించి ఉండొచ్చు’’అని దేశ్‌పాండే ఆరోపించారు. విభేదాలు తాత్కాలికమే: బ్రిజ్‌భూషణ్ తనకు రాజ్‌ఠాక్రేకు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు, విభేదాలు లేవని, అప్పట్లో ఉన్న విభేదాలు తాత్కాలికమేనని బ్రిజ్‌భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. 15న రాజ్ ఠాక్రే పుణేలో ఉంటే, ఆయన తనను కలిసేందుకు ఇష్టపూర్వకంగా ఉంటే తప్పకుండా ఆయనను కలిసి వెళ్తానని చెప్పారు. ఎవరీ బ్రిజ్‌భూషణ్ సింగ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని కేసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1991లో గోండా లోక్‌సభ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థిపై 1.31 లక్షల ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. అంతేగాకుండా భారతీయ కుస్తీగీర్ సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయోధ్యలో వివాదస్పద కట్టడాన్ని కూల్చిన ఘటనలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వాని సహా 40 మందిపై నమోదైన కేసులో బ్రిజ్‌భూషణ్ సింగ్ ఒకరు. 2020 సెప్టెంబరు 30న వెలువడిన తీర్పులో సింగ్‌ను నిర్ధోషిగా గుర్తించిన కోర్టు విడుదల చేసింది. కుస్తీ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సింగ్ అందరికీ సుపరిచితులే కావడంతో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
ముంబైలో రెచ్చిపోయిన రాజ్ థాక్రే వర్గం.. మహిళకు ఘోర అవమానం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్ థాక్రే అనుచరులు ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఆగస్టు 28వ తేదీన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) నాయకుడు వినోద్ అర్గిలే నేతృత్వంలో ముంబా దేవి ఆలయం వద్ద ఎంఎన్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగ్ నిమిత్తం వెదురు కట్టెలను పాతారు. ఈ క్రమంలో ప్రకాశ్ దేవీ అనే మహిళ వారిని అడ్డుకుని తన షాపు ఎదుట వారి పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టవద్దని చెప్పింది. అయితే, సదరు మహిళ మాటలను లెక్కచేయకుండా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అనుచరులు.. హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దీంతో, సదరు మహిళ, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఆమెపై దాడి చేసి, చెప్పులతో కొట్టి, తోసిపడేశారు. అంతటితో ఆగకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. కాగా, వారి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, జరిగిన విషయంపై బాధితురాల పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. An elderly woman was assaulted and abused by MNS workers in Mumbai. A woman namely Prakash Devi, runs a medical shop, MNS workers installed wooden poles in front of her medical which led to an argument. She requested to remove but MNS started assaulted her. pic.twitter.com/PNji8DxrIR — Meenu Thakur (@JournoMeenu) September 1, 2022 -
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసమైన సాగర్ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్‌కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్ ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్‌ను ప్రశంసించారు. అనంతరం రాజ్ ఠాక్రే నివాసమైన శివ్ తీర్ధ్ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజ్ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్ ఠాక్రే ఫడ్నవీస్‌తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది. చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా) ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్వడ్, ఉల్లాస్‌నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్‌పూర్, చంద్రాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి. ఇటీవల ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది. -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్‌పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్‌థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్‌కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్‌పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సేన అధ్యక్షుడిగా అమిత్ ఠాక్రేకు నియమించనున్నారని తెలిసింది. ఇదివరకు విద్యార్థి సేన అధ్యక్ష పదవిలో కొనసాగిన ఆదిత్య శిరోడ్కర్ ఎమ్మెన్నెస్ నుంచి బయటపడి శివసేనలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో పార్టీ చీఫ్ రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేను నియమించేందుకు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ పార్టీలో పలువురు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ అమిత్ ఠాక్రేను నియమించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో ఈ పదవీ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాసిక్‌లో చర్చలు.. ఎమ్మెన్నెస్ ప్రధాన కార్యదర్శి, విద్యార్థి సేన అధ్యక్షుడు ఆదిత్య శిరోడ్కర్ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆదిత్య అకస్మాత్తుగా శివసేనలో చేరడం వల్ల ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది. వచ్చే సంవత్సరం బీఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆదిత్య ఇలా అకస్మాత్తుగా పార్టీని విడటం రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాజ్‌ఠాక్రే నాసిక్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చర్చించేందుకు అమిత్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు వెంటనే నాసిక్‌కు రావాలని సందేశం పింపించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో అధిక శాతం అమిత్‌నే నియమించడానికి ఇష్టపడినట్లు తెలిసింది. ఒకవేళ ఈ పదవిలో అమిత్ ఠాక్రేను నియమిస్తే నేటి యువ కార్యకర్తల్లో నవ చైత్యనం నూరిపోసినట్లవుతుంది. దీంతో అమిత్‌నే నియమించాలని పదాధికారులు, కార్యకర్తలు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఎమ్మెన్సెస్ సినెట్ సభ్యులు సుధాకర్ తాంబోలి, అఖిల్ చిత్రే, గజానన్ కాళే తదితర సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ, ముందువరుసలో అమిత్ ఠాక్రే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో విద్యార్థి సేన అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగం గా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరిం త దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నా రని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ విద్యార్థి సేన పగ్గాలు అమిత్‌కు దక్కితే పార్టీలో నూతనోత్తేజం రావడం ఖాయమని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తోంది. -
‘దయచేసి పెద్ద మనసు చేసుకోండి బిగ్‌బి’
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని నివాసం ప్రతీక్ష ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు మధ్యలో ఆయన బంగ్లా ఉందని, ఇంటి గోడను కూల్చివేయాలంటూ బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) గతంలో నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ అమితాబ్ దీనిపై స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ పెద్ద మనసు చాటుకోవాలని కోరుతూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు ప్లకార్డుల ప్రదర్శనకు దిగారు. ‘బిగ్‌బి.. దయచేసి.. పెద్ద మనసు చేసుకోండి’ అంటూ బుధవారం రాత్రి జుహులోని ప్రతీక్ష ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఎంఎన్ఎస్ నేత మనీష్ ధురి మాట్లాడుతూ ‘ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డు విస్తరణ కోసం బీఎంసీ 2017లో అమితాబ్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం అందరు సహకరించినా అమితాబ్ మాత్రం సహకరించడం లేదు. దీనిపై ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఈ మేరకే ఆయన ఇంటి ఎదుట ప్లకార్డుల ప్రదర్శనకు దిగాము’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ఈ విషయంలో బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, బిగ్‌బి దీనిపై స్పందించకపోయినా బీఎంసీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. అయితే ట్రాఫిక్ సమస్యను పరిష్కారించేందుకు రోడ్డు విస్తరణలో భాగంగా అమితాబ్ బంగ్లా ప్రతిక్ష గోడను పడగొట్టాలని బీఎంసీ ప్రణాళిక వేసింది. ప్రస్తుతం ఈ రోడ్డు 45 అడుగులు ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. -
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?
ముంబై: అక్రమంగా భారత్‌లో నివాసముంటున్న పాకిస్తానీయులు, బంగ్లాదేశీలను తిప్పి పంపాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా ఆదివారం ముంబైలో గిర్గావ్ చౌపట్టి నుంచి ఆజాద్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆజాద్ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ప్రశ్నించారు. నిరసనలు ఇలాగే కొనసాగితే.. నిరసనలకు నిరసనలతో, రాళ్లకు రాళ్లతో, ఖడ్గాలకు ఖడ్గాలతోనే జవాబిస్తామని హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉన్న ముస్లింలను ఎవరూ వెలివేయబోవడంలేదని, వారెందుకు నిరసనలు చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులు తమ బలాన్ని ఎవరికి, ఎందుకు చూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ఏమైనా ధర్మసత్రమా అని ఆయన ప్రశ్నించారు. -
‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’
ముంబై: బంగ్లాదేశీయులు వెంటనే భారత దేశాన్ని విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే వెళ్లగొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు.. ‘‘బంగ్లాదేశీయులు మీరు దేశాన్ని విడిచివెళ్లిపోండి. లేదంటే ఎమ్ఎన్ఎస్ స్టైల్లో మేమే గెంటేస్తాం’’అంటూ రాయ్‌గఢ్ జిల్లాలో ఎమ్ఎన్ఎస్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫొటోతో పాటు కొత్తగా రాజకీయాల్లో చేరిన ఆయన కుమారుడు అమిత్ ఫొటోను కూడా బ్యానర్లో చేర్చారు. కాగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్ఎన్ఎస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీతో కలిసి హిందుత్వ జెండాతో ముందుకు సాగేందుకు పార్టీ నిర్ణయించింది. ఇక పార్టీ జెండాలో సైతం పలు మార్పులు చేసింది. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా జెండాను పూర్తిగా కాషాయ రంగులోకి మార్చి... మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. కాగా ఎమ్ఎన్ఎస్ స్థాపించిన సమయంలో.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఎమ్ఎన్ఎస్ ఈ విధమైన పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్ఎన్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!) -
ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేల కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా గురువారం గోరెగావ్‌లో ఎమ్మెన్నెస్ మహా సభ నిర్వహించింది. ఈ వేదికపై నుంచే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అమిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘పార్టీ స్థాపించిన 14 ఏళ్లలో తొలిసారిగా నేను ఓ బహిరంగసభలో మాట్లాడుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ తల్లి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెన్నెస్‌లో అమిత్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎమ్మెన్నెస్ యూత్ వింగ్ బాధ్యతలను అమిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ జెండాలో కూడా మార్పులు చేశారు. హిందూత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలతో పూర్తిగా కాషాయం రంగుతో పార్టీ కొత్త జెండాను రూపొందించారు. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. ఎమ్మెన్నెస్ స్థాపించినప్పుడు.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. కాగా, శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్‌ను స్థాపించారు. అనంతరం 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఎమ్మెన్నెస్.. 13 సీట్లలో గెలుపొందింది. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో పోటీచేసిన ఎమ్మెన్నెస్.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో పలు మార్పులు చేయాలని ఆలోచనకు వచ్చారు. మరోవైపు ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే.. వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దీంతో శివసేనకు, బీజేపీకి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. -
110 స్థానాల్లో పోటీ.. ఒక్క చోట విజయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లలో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుండగా, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకబడింది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) ఘోరంగా చతికిలపడింది. 110 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీ కేవలం ఒకచోట గెలిచింది. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా పేరుపొందిన 51 ఏళ్ల రాజ్ థాకర్ తన పార్టీని మాత్రం గెలుపుబాట పట్టించలేకపోయారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 13 సీట్లు గెలిచింది. 2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ, బీజేపీ వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే ప్రచారం నిర్వహించారు. అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 42 చోట్ల గెలిచి సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. కేంద్రం ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించేంత వరకు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని కాంగ్రెస్, ఎన్సీపీలను కోరారు. శరద్ పవార్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో రాజ్ ఠాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఎన్నికల ఫలితాల అప్డేట్స్) -
ఈడీ ఎదుటకు రాజ్ ఠాక్రే
సాక్షి, ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8.15 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఆయన్ను విచారణకు పిలిచేదీ లేనిదీ ఈడీ వెల్లడించలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) నుంచి కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీకి రూ.450 కోట్ల రుణాలు ఇప్పించడంలో రాజ్‌ఠాక్రే అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
నానా పటేకర్ అలాంటోడే కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు. -
భారత్ బంద్‌కు రాజ్ థాకరే మద్దతు
సాక్షి, ముంబై : ఇంధన భారాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం పట్ల సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, భారత్ బంద్‌లో తమ పార్టీ చురుకుగా పాల్గొంటుందని రాజ్ థాకరే ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పెట్రో ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో మరింత భారమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దేశ విధానాలు ఉండటం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నోట్ల రద్దు పర్యవసానాలను చక్కదిద్దుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు వడ్డించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలకు సామాన్యుడిపై భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలంతా రాజకీయ, సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బంద్‌లో పాల్గొనాలని కోరారు. -
థియేటర్లో అధిక రేట్లు.. మేనేజర్‌ను చితక్కొట్టారు..
పూణే : మల్టీఫ్లెక్స్‌లో ఆహార పదార్థాలను అధిక రేట్లకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలు అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేశారు. అధిక రేట్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతన్ని చావబాదారు. ఈ ఘటన శుక్రవారం పూణేలోని ఓ మల్టీఫ్లెక్స్‌లో చోటు చేసుకుంది. కాగా, థియేటర్లో అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేసిన వారిలో మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేనాపతి బాపత్ రోడ్‌లోని పీవీఆర్ ఐకాన్ మల్టీఫ్లెక్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన మాజీ కార్పొరేటర్ షిండే.. థియేటర్లలో అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్మడంపై హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు. అధిక రేట్లకు ఆహారపదార్థాలను అమ్ముతున్నారని, అలా చేయకుండా అరికట్టాలని ప్రభుత్వానికి కోర్టు చేసిన సూచనలను షిండే గుర్తు చేశారు. అన్ని థియేటర్లకు వెళ్లినట్లే పీవీఆర్ ఐకాన్‌కు కూడా వెళ్లామని తెలిపారు. అధిక రేట్ల గురించి మల్టీఫ్లెక్స్ అసిస్టెంట్ మేనేజర్‌తో మాట్లాడగా ఆయన ’డబ్బులు ఉన్నవాళ్లే థియేటర్‌కు రావాలి. భరించలేని వాళ్లు థియేటర్‌కు రావొద్దు.’అని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్‌తో వాగ్వాదం జరిగిందని, దీంతో కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు అతనిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు. కాగా, ముంబైలో సినిమా టికెట్ల రేట్ల కంటే అక్కడ అమ్మే ఆహార పదార్థాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. -
ముంబైలో కలకలం; గుజరాతీల షాపులపై దాడి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన మోదీ ముక్త్ భారత్ నినాదం సెగలు రేపుతోంది. ముంబయి శివాజీ పార్క్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబయి శివార్లలోని వసాయ్‌లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేసి సైన్బోర్డులను ధ్వంసం చేశారు. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై పలు గుజరాతీ దాబాలపై కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. మహారాష్ట్రలో గుజరాతీల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎంఎన్ఎస్ చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ దాదర్‌లోని ఓ జ్యూవెలరీ షాపుపై, ముంబయిలోని మహీంలో ఓ హోటల్పైనా హింసాత్మక దాడులకు తెగబడ్డారు. గుజరాతీలో ఉన్న సైన్బోర్డులను లాగిపడవేశారు. అప్పట్లో దాదార్‌లోని పీఎన్ గాడ్గిల్ జ్యూవెలర్స్ ఎదుట ఆందోళనకు దిగిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు మేనేజ్మెంట్ దిగివచ్చి సైన్‌బోర్డును తొలగించడంతో శాంతించారు. నగరంలోని మహీం వద్ద గుజరాతీలో ఉన్న హోటల్ శోభ సైన్‌బోర్డును కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా తొలగింపచేశారు. -
గుజరాత్ ఎన్నికలు.. గెలిస్తే వాటి మహిమే!
సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటమి తప్పదని రాజ్ థాక్రే అంటున్నారు. శనివారం ఓ బహిరంగ సభలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేశారు. ’’గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోతుంది. ఇది నేను చెబుతుంది కాదు.. తాజా నివేదికలు, సర్వేలు చెబతుతున్నాయి. మోదీ మాట్లాడుతుంటే ప్రజలు లేచివెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇది ఆయన పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నటానికి సంకేతమనే భావించవచ్చు. ఒకవేళ వాళ్లు(బీజేపీ) చెబుతున్నట్లు 150 సీట్లు గెలవాలంటే ఓ అద్భుతం జరగాలి. అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)ల మహిమన్నది నేను బలంగా నమ్ముతా" అని రాజ్ థాక్రే అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాహుల్ తప్పిదాల వల్లే మోదీ అధికారంలోకి వచ్చారని.. మోదీ ఛరిష్మా కేవలం 15 శాతం మాత్రమే పని చేసిందని రాజ్ థాక్రే చురకలంటించారు. పరిస్థితులు దారుణంగా మారిపోయానని.. బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్‌లోని 182 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
‘విపక్షం సత్తా అప్పుడు తెలుస్తుంది’
సాక్షి,ముంబయి:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే అన్నారు. ‘ప్రతిపక్షం కొంత బలహీనంగా ఉందనేది వాస్తవం..అయితే గుజరాత్ ఎన్నికల తర్వాత బలోపేతమవుతుంది..విపక్షంలో గణనీయ మార్పు గమనిస్తార’ ని థాకరే అన్నారు. కేవలం ఒకే రాష్ట్ట్రంలో ప్రధాని సహా పలువురు మంత్రులు ర్యాలీలు నిర్వహిస్తుండం ఆశ్యర్యకరమన్నారు. ప్రధాని సొంత రాష్ట్రమే అయినా దేశాధినేత ఒకే రాష్ట్రంలో అంతగా దృష్టి కేంద్రీకరించడం సరైంది కాదని ఆక్షేపించారు. గుజరాత్లో పాలక బీజేపీ ప్రజలకు మేలు చేకూర్చి ఉంటే ఇంతమంది మంత్రులు పార్టీ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నోట్లను ముద్రించిందని, ఇది బీజేపీకి లాభం చేకూర్చిందని ఆయన ఆరోపించారు.బీజేపీ మినహా మరే రాజకీయ పార్టీకి అన్ని నిధులు లేవని, బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా సమకూరాయని థాకరే ప్రశ్నించారు. -
ఠాక్రేతో రాందేవ్ భేటీ.. మతలబేంటి?
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రేను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కలిశారు. ముంబైలోని ఆయన నివాసమైన 'కృష్ణ కుంజ్'లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరూ ఈ భేటీలో ఏం చర్చించుకున్నారో తెలియలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం రాందేవ్ బాబాను రాజ్ ఠాక్రే పొగడ్తల్లో ముంచెత్తారు. హిందూ సంప్రదాయం, యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాందేవ్ మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని తెలిపారు. రాందేవ్‌ను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి రాందేవ్ వైపు నుంచి గానీ, పతంజలి గ్రూపు నుంచి గానీ ఎలాంటి సమాచారం విడుదల కాలేదు. -
చదువుతో పేదరికాన్ని జయించాలి
పర్వతగిరి(వర్ధన్నపేట): పేదరికాన్ని అనుభవిస్తూ కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు చదువుతో పేదరికాన్ని జయించాలని కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు తాగునీటి సౌకర్యం కోసం గురువారం కావ్య ఫ్రిజ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థినీల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. వందేమాతరం షౌండేషన్ వ్యవస్థపకుడు రవీందర్రావు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎంఎన్ఎస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కార్పొరేట్ స్థాయిని మించి గణితం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ నజీర్ మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు కావ్యకు బహుమతులు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కక్కెర్ల శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వాళ్లందరినీ దేశం నుంచి తరిమేయండి
కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీవ్రంగా మండిపడింది. జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పాక్ జాతీయుడిని దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేసింది. ''పాకిస్తానీలు అందరినీ చితక్కొట్టి దేశం నుంచి తరిమేయండి. వాళ్లు ఎవరైనా సరే. కొట్టి కొట్టి తరమాలి'' అని ఎంఎన్ఎస్ చెప్పింది. కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు ఇది కొనసాగాలని, ఈ విషయంలో తమ నిర్ణయం చాలా పక్కాగా ఉందని ఎంఎన్ఎస్ సీనియర్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే అన్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు, అతడి కుటుంబానికి తాము అండగా ఉంటామని, అతడు విడుదలయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. భారతదేశంలో ఉన్నవాళ్లు పాకిస్తానీ పౌరులైనా, వ్యాపారవేత్తలైనా, కళాకారులైనా.. ప్రతి ఒక్కరినీ తరిమి తరిమి కొట్టాలన్నారు. గతంలో కూడా బాలీవుడ్ సినిమాలలో పాకిస్తానీ కళాకారులు పనిచేయడాన్ని ఎంఎన్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో ఆ సినిమాను ఎంఎన్ఎస్ తొలుత నిషేధించింది కూడా. ఆ తర్వత చర్చల ఫలితంగా నిషేధాన్ని ఎత్తేశారు. -
శివసేన విజయానికి బ్రేకులు!
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు. అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు. -
అంతరార్థం ఏమిటి?
విశ్లేషణ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి. పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్ యాదవ్ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్‌వాదీ పార్టీలుండేవే. పదేళ్ల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను ఏర్పాటు చేయడంతో శివసేన చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్ ఠాక్రే నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్ మేనబావ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్ఎన్ఎస్ ఏర్పడింది. ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్ తన బావ ఉద్ధవ్‌కు ఏడు సార్లు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. ఉద్ధవ్ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్ పంపిన దూతను సైతం ఉద్ధవ్ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది. ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్ఎన్ఎస్ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్ఎన్ఎస్ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది. ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్ఎన్ఎస్లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్‌కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్ఎన్ఎస్ అంగీకరించడం కూడా. అయితే రాజ్ ఇలా ఉద్ధవ్‌కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని గాయపరచేది మరొకటి ఉండదు. ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ను అది తక్కువగా చేసి చూపింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com