Malli Pelli Movie
-
మరో పెళ్లి వైపు అడుగులేస్తున్న సీనియర్ నటి
నటి వనితా విజయకుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. సీనియర్ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత అని తెలిసిందే. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది.తరువాత 2020లో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కూడా కేవలం నాలుగు నెలల్లోనే ముగిసిపోయింది. కానీ, ఆయనతో పెళ్లి జరగలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని నటి వనిత వివరణ ఇచ్చింది.వీటన్నింటి తర్వాత 43 ఏళ్ల వనిత 4వ సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందనే టాక్ తమిళ మీడియాలో వినిపిస్తోంది. అలాంటి వార్త బయటకు రాగానే ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనేది అందరి ప్రశ్న. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక సమాధానం లేదు. ఇప్పుడు పెళ్లి గురించి అడిగిన ఓ అభిమానికి వనిత బదులిస్తూ.. ఊహించని ట్విస్ట్ కోసం ఆగండి! అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నిజంగానే త్వరలో గుడ్‌న్యూస్ చెబుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు. వనిత మాత్రమే కాదు, ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'మళ్లీ పెళ్లి'.. ఆ లిస్ట్‌లో ట్రెండింగ్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈనెల 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్‌లోనే టాప్-2లో నిలిచింది. మొదటిస్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుండగా.. రెండోస్థానంలో నరేశ్, పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రెండ్ అవుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కని చిత్రాలకు ఓటీటీలో ఊహించని రీతిలో దూసుకెళ్తున్నాయి. (ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!) Thank you everyone 🙏#MALLIPELLI ranked #10 among @Binged_ OTT Top 10 Most watched movies this weekend🤩 ▶️ https://t.co/bfLWwB1Hdk#MalliPelliOnAha#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @ahavideoIN pic.twitter.com/0AmYZLX8Jv — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 25, 2023 -
నరేశ్‌పై 'మళ్లీపెళ్లి' ఎఫెక్ట్
నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (ఇదీ చదవండి: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్.. కారణాలు ఇవే) తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా (నేడు జూన్ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్‌కు రమ్య నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు. (ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) ఇప్పుడున్న పరిస్థితుల్లో OTT ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్‌ను రీచ్ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు. ఈ నోటీసుల వల్ల ఆమెజాన్ ప్రైమ్‌లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!
'ఆదిపురుష్' కాస్త తగ్గింది. ఈసారి థియేటర్లలోకి దాదాపు తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి. కానీ అందులో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏం లేవు. దీంతో ఓటీటీల్లో ఏమేం కొత్త చిత్రాలు విడుదల కానున్నాయా అని మూవీ లవర్స్ చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తి లిస్ట్ తీసుకొచ్చేశాం. ఈ సోమవారం చూసినప్పుడు 21 సినిమాలు ఉన్నాయి. గురువారం వచ్చేసరికి ఆ నంబర్ కాస్త 28కి పెరిగింది. ఈ మొత్తం జాబితాలో మళ్లీ పెళ్లి, ద కేరళ స్టోరీ, జాన్ విక్ 4 సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది చూసేద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ - ఇంగ్లీష్ సినిమా ఐ నంబర్: జోజీ గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ తీర కాదల్ - తమిళ సినిమా త్రిశంకు - మలయాళ మూవీ త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) గ్లామరస్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మళ్లీ పెళ్లి - తెలుగు సినిమా ఇంటింటి రామాయణం - తెలుగు చిత్రం జాన్ లూథర్ - తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ టీకూ వెడ్స్ షేరు - హిందీ మూవీ కళువెత్తి మూర్కన్ - తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ జాన్ విక్ 4 - ఇంగ్లీష్ చిత్రం ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది) కొండ్రాల్ పావమ్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా కేరళ క్రైమ్ ఫైల్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ మూవీ జీ5 ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ మూవీ కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ - హిందీ సినిమా సోనీ లివ్ ఏజెంట్ - తెలుగు సినిమా కఫాస్ - హిందీ సిరీస్ జియో సినిమా అసెక్ - హిందీ సినిమా అడ్డా టైమ్స్ ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ (ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!) -
ఓటీటీకి మళ్లీ పెళ్లి.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారు. (ఇది చదవండి: నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!) #MalliPelli streaming on @ahavideoIN from June 23rd. pic.twitter.com/UrBrXK475m — Vamsi Kaka (@vamsikaka) June 19, 2023 -
శారీరకంగా పర్ఫెక్ట్.. పిల్లలను కనడంపై నరేశ్, పవిత్ర బోల్డ్ కామెంట్స్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాము ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి చెప్పడానికే ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నరేశ్, పవిత్రల రిలేషన్షిప్ మాత్రం అందరికి తెలిసిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. (చదవండి: స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ ) మాములుగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న బయటకు చెప్పాలన్నా భయపడతారు. కానీ నరేశ్, పవిత్రలు మాత్రం ప్రతీది చాలా ఓపెన్‌గా చెప్పేశారు. పెళ్లి విషయమే కాదు... పిల్లలు కనడంపై తమ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేశారు. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పారు. ‘ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం. నా దృష్టిలో బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది. కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేంది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్ చెప్పుకొచ్చాడు. -
మళ్ళీ పెళ్లి కృష్ణగారికి అంకితం
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్‌ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' సక్సెస్ మీట్ ఫోటోలు
-
ఆ ఓటీటీలోకే రానున్న 'మళ్లీ పెళ్లి'
సీనియర్ నటుడు నరేశ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ హీరోయిన్గా నటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్ డిసైడ్ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ వారం రిలీజైన సినిమాలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ పెళ్లి వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2018 కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందన్న విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం 2018. మే 5న అక్కడ విడుదలైన ఈ చిత్రానికి కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేమ్ ఫేమస్ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గ్రే మూవీ ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'సత్తిగాని రెండెకరాలు' పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పవిత్ర లోకేశ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పవిత్ర లోకేశ్ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. కానీ నరేశ్‌తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని నరేశ్ బహిరంగంగా ప్రకటించాడు. ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. నరేశ్ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుందట. (చదవండి: మళ్ళీ పెళ్లి మూవీ రివ్యూ) వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్‌ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. -
మళ్ళీ పెళ్లి మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
Malli Pelli Review: ‘మళ్ళీ పెళ్లి’ మూవీ రివ్యూ
టైటిల్: మళ్ళీ పెళ్లి నటీనటులు: వీకే నరేశ్, పవిత్రా లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు నిర్మాణ సంస్థ: విజయకృష్ణ మూవీస్ నిర్మాత: వీకే నరేశ్ దర్శకత్వం: ఎమ్మెస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటర్: జునైద్ సిద్ధిక్యూ విడుదల తేది: మే 26, 2023 ప్రశ్న: ‘నరేశ్ గారు.. ‘మళ్ళీ పెళ్లి’ రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి తీశారా? జవాబు: ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం చెప్పాం. ప్రశ్న: ఎమ్మెస్ రాజు గారు.. ట్రైలర్ చూస్తే ఇది నరేశ్‌గారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తు చేస్తున్నాయి. ఇది నరేశ్‌గారి బయోపిక్ అనుకోవచ్చా? జవాబు: అలా ఎలా అనుకుంటారు? ఇది ట్రెండింగ్ టాపిక్. ట్రైలర్లో చూపించిన సీన్స్ నరేశ్ నిజ జీవితంలో జరిగినే అని ఎందుకు అనుకుంటారు? యూట్యూబ్‌లో వందల వీడియోలు ఉంటాయి. అలాంటివే ఇవి. ఇది సినిమా ప్రమోషన్స్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానం. టైటిల్.. ట్రైలర్.. అందులో చెప్పించిన సంభాషణలు అన్ని నరేశ్ జీవితానికి సంబధించినవే అయినప్పటికీ.. ఎక్కడా ఇది నా కథ అనిఆయన చెప్పలేదు. మరి ఇది ఎవరి కథ? నరేశ్-పవిత్రల బయోపికా? లేదా కల్పిత కథనా? ‘మళ్ళీ పెళ్లి’ కథేంటంటే.. టాలీవుడ్‌కి చెందిన సీనియర్ హీరో నరేంద్ర(వీకే నరేశ్)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేనపతి(వనితా విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారం అంటూ ఆమె.. సినిమా అంటూ నరేంద్ర ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతారు. అదే సమయంలో నరేంద్రకు కన్నడ నటి పార్వతి(పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. పార్వతికి ఇద్దరు పిల్లలు. భర్త ఫణింద్ర(అద్దూరి రవివర్మ)తో గొడవలు ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు నరేంద్రకు మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య గొడవలు ఏంటి? నటుడు, రచయిత అయిన ఫణింద్ర.. భార్య పార్వతికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? బెంగళూరు మీడియాను అడ్డుపెట్టుకొని సౌమ్య ఆడిన నాటకం ఏంటి? నరేంద్ర, పార్వతి కలిసి ఓ రోజు హోటల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మొత్తం ఐదు చాప్టర్లుగా సినిమాను తీర్చి దిద్దారు. మొదటి చాప్టర్లో నరేశ్-పవిత్రల పరిచయాన్ని .. రెండో చాప్టర్లో రమ్య రఘుపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూపించారు. ఇక మూడో చాప్టర్లో పవిత్రా లోకేష్ కెరీర్.. పెళ్లి సంఘటనలను చూపించారు.నాలుగు, ఐదు చాప్టర్లలో నరేశ్-పవిత్రలు కలిసి ఉండడం.. మూడో భార్య మీడియాకెక్కడం తదితర సంఘటనలను చూపించారు. అయితే సినిమా మొత్తం చూస్తే.. నరేశ్-పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్తలు అస్సలు మంచి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, కల్పితం ఎంతో చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని విషయాలను చాలా బోల్డ్‌గా చూపించారు ఎమ్మెస్ రాజు. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. అలాగే పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితానికి సబంధించి తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయాలను చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే.. నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన ఘటనలు.. వారి నేపథ్యం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ బెంగళూరులో రమ్య రఘుపతి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? నరేశ్-పవిత్ర హోటల్లో మీడియాకు ఎలా దొరికిపోయారు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్లకు మళ్లీ పెళ్లి నచ్చుతుంది. అయితే ఇదంతా నరేశ్-పవిత్రల వెర్షన్ మాత్రమే. మరి రమ్య రఘుపతి వెర్షన్ ఏంటి అనేది ఇలాగే సినిమాను తెరకెక్కించి చెబుతారా? లేదా ప్రెస్ మీట్లో చెబుతారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు మనం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నరేంద్ర పాత్రలో నరేశ్, పార్వతి పాత్రలో పవిత్రా లోకేశ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండించారు. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక సూపర్‌స్టార్ పాత్రలో శరత్ బాబు, నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక యంగ్ పార్వతిగా అనన్యా నాగళ్ల తెరపై చాలా అందంగా కలిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో కథలో భాగంగా వస్తుంటాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నరేశ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
మళ్ళీ పెళ్లితో పెద్ద హిట్ సాధిస్తాం
‘‘పెళ్లనేది పవిత్రమైనది. దాన్ని గౌరవించాలనే కోణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాం. యువతరంతో పాటు అన్ని వయసుల వారికీ కనెక్ట్ అయ్యే కథ ఈ చిత్రంలో ఉంది. పెద్ద హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు వీకే నరేశ్. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్‌కి జోడీగా పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం వీకే నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారు (విజయ నిర్మల) తన ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి 1972లో విజయకృష్ణ మూవీస్‌ని స్థాపించారు. ఈ బేనర్ స్థాపించి 50 ఏళ్లు, నా సినీ జీవితం ప్రారంభించి కూడా యాభై ఏళ్లు. ఈ సమయంలో హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా వినోదంతో పాటు షాకింగ్‌గా ఉంటుంది.. నటుడిగా థ్రిల్‌గా ఉంది. పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా ఉండరు. ఇక సినిమాలకు వస్తే.. పది మంది హీరోలే బిజీగా ఉంటారు. నేను హీరోగా హిట్స్ ఇచ్చాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. విజయకృష్ణ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్‌ని మళ్లీ తీసుకురావడం, కృష్ణ–విజయ నిర్మలగార్ల వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వడం.. ఇవన్నీ నిర్మాతగా నాకు పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజుగారిని నమ్మాను’’ అన్నారు. -
హైదరాబాద్: కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేష్ మూడో భార్య
-
మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య
సీనియర్ నటుడు నరేశ్, అతడి ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇదొక సెన్సేషన్‌గా మారింది. కారణం.. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే! ఇందులో అతడి మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమాయణం.. హోటల్లో పట్టుబడ్డ సీన్.. ఇలా అన్నీ ఉన్నాయి. పైగా ప్రమోషన్స్‌లోనూ పవిత్రతో రొమాన్స్ చేయడం, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా శుక్రవారం (మే 26న) విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీంతో మళ్లీ పెళ్లి సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: డైరెక్టర్ మాస్ వార్నింగ్ -
నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్: పవిత్రా లోకేష్
‘‘వినోదం, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో రూపొందిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ చిత్రకథ సమాజానికి అద్దం పడుతుంది’’ అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. వీకే నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా పవిత్రా లోకేష్ మాట్లాడుతూ– ‘‘ఎమ్మెస్ రాజుగారు ‘మళ్ళీ పెళ్లి’లో నరేశ్‌గారు, నేను నటిస్తేనే బాగుంటుందనడంతో చేశాం. మళ్ళీ పెళ్ళి అంటే సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది. ఇదొక్కటే కాదు.. సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. మా విషయంలో (నరేశ్–పవిత్ర) కొన్ని సంఘటనలు జరిగాయి. (చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?) కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. విజయ నిర్మల, కృష్ణగార్లతో పాటు మహేశ్బాబుగారిని కూడా కలిశాను. ఆ ఫ్యామిలీ మమ్మల్ని (నరేశ్–పవిత్ర) యాక్సెప్ట్ చేసింది’’ అన్నారు. -
నాకు.. నరేశ్‌కి ఆ అదృష్టం దక్కింది
‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్‌కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్‌లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్ ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్ మాట్లాడుతూ–‘‘నా రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను. జీవితంలో ఫస్టాప్ కంటే సెకండాఫ్ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పవిత్రా లోకేశ్. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్‌లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్ కథ’’ అన్నారు ఎమ్మెస్ రాజు. -
శరత్ బాబు నటించిన చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) రామరాజ్యం సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. సాగర సంగమం, సితార, సీతాకోక చిలక చిత్రాలతో గుర్తింపు సాధించారు. సాగర సంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్‌గా కనిపించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇలాంటి మిత్రుడు ప్రతీ ఒక్కరికి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర వేసి మెప్పించాడు. ఆస్తులు అన్ని పోయినా పరువు కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు. లోపల ఎంతో బాధ ఉన్న కూడా బయటకు మాత్రం గంభీరంగా కనిపించే క్యారెక్టర్లో అలరించాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో బంగారు మనిషి, లాయర్ విశ్వనాథం, శృంగార రాముడు, రామకృష్టుడు లాంటి సినిమాలలో నటించాడు. (ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..) కాగా.. ఆయన కెరీర్లో నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన ఇక లేడన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే!
గతవారం లాగే ఈ వారం కూడా థియేటర్స్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలతో పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే థియేటర్స్‌లో విడుదలయ్యేవి చిన్న చిత్రాలే అయినా.. మంచి బజ్‌ని క్రియేట్ చేసుకున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని హిట్ సినిమాలో స్క్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం. మళ్లీ పెళ్లి నరేశ్ వి.కె, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మేమ్ ఫేమస్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. 2018 టొవినో థామస్, కుంచకో బోబన్, అసీఫ్ అలీ, లాల్ తన్వి రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘2018’. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ మే 26న విడుదల కాబోతుంది. మెన్ టూ నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెన్ టూ. శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. వీటితోపాటు జైత్ర, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భజాగోవింద అనే చిన్న సినిమాలు కూడా ఈ వారమే థియేర్స్‌లో సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే.. జీ5 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (మే 26) సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (మే 26) జియో తోడేలు (మే 26) అమెజాన్ ఫ్రైమ్ వీడియో సిటాడెట్ చివరి ఎపిసోడ్ మిస్సింగ్ మూవీ(మే 24) ఆహా గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ -3(మే 23) సత్తిగాడు రెండెకరాలు(మే 26) డిన్నీ +హాస్ట్‌స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్ మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ మే 26 -
'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!
‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి. నా కెరీర్లో ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్ విజయ కృష్ణ మూవీస్. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్ని అడిగితే.. ‘బోల్డ్ కంటెంట్.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు. -
Naresh - Pavitra: నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు అండగా ఉంటా: నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయనుండగా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నరేశ్, పవిత్రా లోకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) నరేశ్ మాట్లాడుతూ.. 'మళ్లీ పెళ్లి అనే సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించింది కాదు. సమాజంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్లే వివాహ వ్యవస్థ ప్రస్తుతం దెబ్బతింటోంది. వివాహాబంధంపై గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. సోషల్‌మీడియాలో మాపై విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే సినిమా చేశానన్నారు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్‌లో వీడియోలు షేర్ చేయవచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లై చేశా. ఆ తర్వాత మా ఇద్దరి బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని అన్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్) పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' ఓ సినిమా షూటింగ్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. ఏ విషయంలోనైనా పాజిటివ్‌గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు.' అని అన్నారు. -
త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్‌మీడియలో తెగ ట్రెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్‌పై రెచ్చిపోయిన నరేష్ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.