Maniratnam
-
“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. -
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్‌గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్‌లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
స్టార్ డైరెక్టర్‌కు షాక్.. భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న మరో హీరో!
ఇండియన్ సినిమాలో దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడి చిత్రాల్లో పనిచేయాలని కోరుకోని నటినటులు ఉండరనే చెప్పాలి. ఇటీవల మణిరత్నం భారీ తారాగణంతో దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ హీరోగా థగ్స్ లైఫ్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కమల్‌హాసన్ నటిస్తున్న 234వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా 34 ఏళ్ల తర్వాత కమలహాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో జయంరవి, దుల్కర్సల్మాన్, త్రిష కూడా ముఖ్యపాత్రలకు ఎంపికయ్యారు. కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సెర్బియాలో జరగనుంది. అయితే నటుడు కమలహాసన్ అమెరికాలో జరుగుతున్న ఇండియన్–2 చిత్ర పనుల్లో బిజీగా ఉండడం, అదే సమయంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల తేదీ ప్రకటించడంతో, పార్టీ వ్యవహారాలలో పాల్గొనడానికి చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ సెర్బియాలో ప్రణాళిక ప్రకారం జరగకపోవడంతో దర్శకుడు చైన్నెకి చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం తదుపరి షూటింగ్‌ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీంతో కమలహాసన్ కాల్షీట్స్ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్షీట్స్ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ వైదొలిగారు. తాజాగా జయం రవి కూడా థగ్స్ లైఫ్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయంరవికి బదులుగా దర్శకుడు మణిరత్నం ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్‌లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్‌తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్‌గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్‌హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్‌బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
ఆ ఇద్దరిలో మణిరత్నం వైపే ఆసక్తి చూపిన కమల్‌హాసన్
కమల్‌హాసన్ హీరోగా తన 233వ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తన రాజమ్మ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించడానికి సన్నాహాలు చేశారు. హెచ్. వినోద్ కథను కూడా సిద్ధం చేశారు. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే చక్కని సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్ర కథపై కమలహాసన్ హెచ్ వినోద్ చాలాకాలం పని చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరిగినట్లు సమాచారం. దీని తరువాత కమలహాసన్ తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ నటించే చిత్రం విషయంలో ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం కమల్‌హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఈయన వినోద్ దర్శకత్వంలో నటించే చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై కమల్హాసన్గానీ దర్శకుడు వినోద్ గానీ స్పందించలేదు. కాగా వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్నట్లు చిత్రం తాజా సమాచారం. దీంతో వినోద్ ప్రస్తుతం నటుడు యోగిబాబు, ధనుష్‌తో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ, తెగింపు, వలిమై చిత్రాలతో హెచ్ వినోద్‌కు మంచి గుర్తింపు ఉంది. -
మణిరత్నం భారీ స్కెచ్.. మరో సూపర్ హిట్ ఖాయమేనా!
మల్టీ స్టార్ చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్ దర్శకుడు మణిరత్నం. అదేవిధంగా క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో ఈయన దిట్ట. చాలాకాలం క్రితమే రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్‌స్వామి హీరోలుగా దళపతి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్ కొట్టారు. అదేవిధంగా ఆ మధ్య శింబు, అరుణ్‌విజయ్, అరవిందస్వామి, ప్రకాష్రాజ్వంటి స్టార్ నటులతో సెక్క సివంద వానన్ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ సాధించారు. ఇటీవల విక్రమ్, జయంరవి, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులతో రెండు భాగాలుగా తెరకెక్కించిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. తాజాగా మణిరత్నం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్లో గత 37 ఏళ్ల క్రితం నాయకన్ చిత్రం రూపొందించి ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో థగ్స్ లైఫ్ అని భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే నటి త్రిష ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా నటి ఐశ్వర్యారాయ్ థగ్స్ లైఫ్‌లో నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వరుసలో ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ పేరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇది మరో పొన్నియిన్ సెల్వన్ చిత్రం కానుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కమలహాసన్ గెటప్, విడుదల చేసిన టీజర్ థగ్స్ లైఫ్ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలను పెంచేస్తున్నాయి. -
ఫిబ్రవరిలో ప్రారంభం?
‘నాయకన్’ (1987) (తెలుగులో నాయకుడు) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘థగ్ లైఫ్’. ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని టాక్. కమల్ హాసన్, మణిరత్నం, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మరోవైపు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించాల్సిన సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. -
మరో చిత్రానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్!
ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నటుడు కమల్ హాసన్. తదుపరి హెచ్.వినోద్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్ నాయకన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ, కమలహాసన్‌కు చెందిన రాజ్కమల్ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్ లైఫ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్, నిర్మాత ఆనంద్ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్ సింబల్ చూపగా కమలహాసన్ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్‌పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
మణిరత్నం గారు అంటే నాకు చాలా అభిమానం
-
17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Panniru Rajkumar (@rajkumar_sara_arjun) -
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
కమల్, నయన్ క్రేజీ కాంబో మూవీలో బోల్డ్ అండ్ బ్యూటీ..!
చెన్నై: నటుడు కమల్ హాసన్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్లు ఉండరనే చెప్పవచ్చు. కమల్ హాసన్‌కు జతగా నటిస్తే పాపులర్ అవ్వవచ్చునని చాలా మంది భావిస్తుంటారు కూడా. ఆయన చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సన్నివేశాల వల్ల మరింత పబ్లిసిటీ పొందవచ్చు అని కొందరు భావిస్తుంటారు. కాగా కమలహాసన్‌తో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేక నయనతార ఇప్పటివరకు ఆయనకు జంటగా లభించలేదని ప్రచారం కూడా జరిగింది. తాజాగా కమల్ 234వ చిత్రంలో నటించడానికి నయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. సుమారు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఇది. తాజాగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతుంది. తదుపరి ఆయన కమలహాసన్‌తో చేసే చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నయనతారతో పాటు మరో నటి కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఆమెనే నటి ఆండ్రియా. బోల్డ్ అండ్ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తుంది. ఈ బహుభాషా నటి ఇంతకుముందు కమలహాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం– 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన 234వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్ -
నయనతార చిరకాల కోరిక ఇదేనట.. నెరవేరేనా?
తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారూక్‌ఖాన్‌కు జంటగా నటిస్తున్న జవాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి తన 75వ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నారు. దీనికి దర్శకుడు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు అట్లీ దర్శకత్వంలో రాజా రాణి అనే చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. అందులో నటుడు ఆర్య, జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రం నయనతారకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే విధంగా తాజాగా నీలేష్కృష్ణ దర్శకత్వంలోనూ నయనతారతో పాటు నటుడు జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కాగా నటి నయనతార ఇటీవల ఓ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డులు కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా ముందుగా నయనతార మణిరత్నం కాళ్లకు నమస్కారం పెట్టగా ఆయన ఆమెను ఆశీర్వదించారు. ఆ వేదికన నయనతార తన చిరకాల కోరిక గురించి వెల్లడించారు. ఆమె పేర్కొంటూ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవటం గర్వంగా ఉందన్నారు. అయితే అందరూ నటీనటుల మాదిరిగానే ఆయన దర్శకత్వంలో ఓ చిత్రంలోనైనా తాను నటించాలంటూ చిరకాల కోరికను ఆ సందర్భంలో బయటపెట్టారు. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలలో నటించే అవకాశం వచ్చినా ఏదో ఓ కారణంగా అది కార్యరూపం దాల్చలేదన్నారు. కాగా అదే విధంగా రజనీకాంత్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన నయనతార ఇప్పటి వరకు లోకనాయకుడు కమలహాసన్‌తో జతకట్టలేదు. కాగా త్వరలో కమలహాసన్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నయనతారకు నటించే అవకాశం కల్పిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతోంది. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
ఆ డైరెక్టర్ స్పూర్థితోనే సినిమాల్లోకి వచ్చాను : గౌతమ్ మీనన్
పటాన్చెరు టౌన్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన నాయగన్ సినిమా తాను సినీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్న వాటిని తన సినిమాల్లో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రివైండ్ ద మిలీనియమ్ ఇతివృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్ఎక్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాను అనుకున్నది, తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. కష్టపడకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నెపుణ్యం సాధించాలంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీశ్ కొండపర్తి, సిస్సీ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రని కాబ్రా, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే
ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్- పార్ట్ చిత్రాలు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్‌లో సత్తా చాటాయి. పొన్నియిన్ సెల్వన్ 6 నామినేషన్లు, ఆర్ఆర్ఆర్ పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మార్చి 12న హాంకాంగ్‌లో జరగనున్న 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్లను శుక్రవారం ప్రకటించారు. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 ఉత్తమ చిత్రంతో సహా ఆరు విభాగాలలో నామినేట్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కూడా రెండు విభాగాల్లోకి పోటీలో నిలిచింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సౌండ్- అశ్విన్ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉత్తమ జాబితాల్లో చోటు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చేరింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 థియేటర్లలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్‌గా ఎ.ఆర్. రెహమాన్, ఉత్తమ సంగీతానికి ఏకా లఖాని, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌గా కాస్ట్యూమ్ డిజైన్ తోట తరణి విభాగాల్లో నామినేషన్స్ లభించాయి. The press conference of the 16th Asian Film Awards has ended successfully just now! The 16th Asian Film Awards will be held at 7:30pm on 12 March (Sunday) at the Hong Kong Palace Museum. The nomination list for the 16th Asian Film Awards and the jury president were announced. pic.twitter.com/l5zhegY8Tt — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 제16회 아시아 필름 어워즈 의 후보 라인업은 다음과 같습니다. 헤어질 결심 -- 10개의 후보 드라이브 마이 카 -- 8개 후보 Ponniyin Selvan : I -- 6개의 후보 ...등 여러가지 영화가 있습니다. 자세한 정보를 많이 기대해주세요~ pic.twitter.com/6gYF6ik3nn — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 -
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ కొనసాగుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 96 విజయంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మంగాత్తా, ఎన్నై అరిందాల్ వంటి హిట్ చిత్రాల తరువాత అజిత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ఆ తర్వాత విక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్ వంటి సంచలన హిట్ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్‌కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్‌కు జంటగా మన్మదన్ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. -
31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దళపతి’ చిత్రం కాంబినేషన్ రిపీట్ కాబోతుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్క చిత్రం దళపతి. ఇందులో మరో కథానాయకుడిగా మలయాళం సపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. నటుడు అరవిందస్వామి ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. నటి శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1991 నవంబర్ 5న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఇళయరాజా అందించిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. చదవండి: స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి ‘రాకవ్మ కయ్యి తట్టు’ అనే పాట ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. కాగా ఆ తరువాత మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విడుదలై విజయవంతమైంది. ఇందులో ఏదైనా పాత్రలో నటించాలని రజనీకాంత్ భావించారట. నటుడు శరత్‌కుమార్ పోషించిన పళయ పళువేట్టయార్ పాత్రలో నటిస్తానని మణిరత్నంను రజనీకాంత్ అడిగారట. అయితే అందుకు మణిరత్నం అంగీకరించలేదని స్వయంగా రజనీ ఈ చిత్రం ఆడియో వేడుకలో చెప్పారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి.. కాగా దాదాపు 31 ఏళ్ల తరువాత వీరి సంచలన కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ రజనీకాంత్‌కు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్టు–2 చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత డాన్ చిత్రం ఫేమ్ శిబిచక్రవర్తి దర్శకత్వంలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటిస్తారా? లేక ముందుగానే ఆయనతో చిత్రం చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్ చిత్రం గురిం అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు. -
పొన్నియిన్ సెల్వన్ మరో రికార్డ్.. బాలీవుడ్ సినిమాను దాటేసిన కలెక్షన్స్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?) కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!
దేశంలో ఎంతమంది దర్శకులున్నా వారిలో కొందరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు అందరూ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించారు. వెయ్యి ఏళ్లు వెనక్కి వెళ్లి చోళ రాజుల చరిత్రను తెరపై చూపించాడు. అందుకే ఆ వైబ్రేషన్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తోంది. మణిరత్నం మేకింగ్‌పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి మనమూ పొన్నియిన్ సెల్వన్ లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా ట్రెండ్‌కు ప్రాణం పోసింది. ఏ సినిమా తీసినా, ఎంత పెట్టి తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బాహుబలి సిరీస్ నిరూపించింది. ఆ ధైర్యంతోనే మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను పట్టాలెక్కించారు. మణిరత్నం 40 ఏళ్ల కల సాకారం అయిందంటే అందుకు కారణం మన బాహుబలి సినిమానే! ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చు అని ఈ సినిమాతో నిరూపితమైంది. అందుకే 5 భాగాలుగా ఉన్న పెద్ద నవల పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం. మొదటి భాగం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండవ భాగం సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారట. తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియిన్ సెల్వన్. 1899 నుంచి ఈ నవల ప్రాచుర్యంలో ఉంది. కల్కి మ్యాగజీన్లో ఈ నవలను ప్రచురిస్తూ వచ్చారు. అంతకు ముందు వచ్చిన ది చోళాస్, హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, పల్లవాస్ ఆఫ్ కంచి పుస్తకాలను ఆధారంగా చేసుకుని పొన్నియిన్ సెల్వన్ నవలను రాసుకొచ్చారు కల్కి కృష్ణమూర్తి. 1958 నుంచే పొన్నియిన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1980లో, 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2010లో పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనుకున్నాడు మణిరత్నం. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కించాలనుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్‌తో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది 2018లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 240 ఏళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మణిరత్నం తెరకెక్కిస్తున్నారని తెలిసి తమిళనాట ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వీరుడిగా నటించాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు మిగతా హీరోలు లీడ్ రోల్స్ తీసుకోవడంతో కనీసం ఒక చిన్న పాత్రైనా ఇవ్వండి అని అడిగారట. సినిమాలో పెరియ పజువెట్టరాయర్ పాత్ర చేస్తానని అడిగితే రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌కు ఆ పాత్ర సరితూగదని వద్దన్నారట. సినిమాలో ఇదే పాత్రను శరత్ కుమార్ చేసారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించి ఉంటే కనుక, ప్రస్తుతం కార్తి చేసిన పాత్రను రజనీకాంత్ చేసి ఉండేవారట. అలాగే జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్, విక్రమ్ కనిపించిన పాత్రను విజయ్ కాంత్‌తో చేయించాలి అనుకున్నారు. ఐశ్వర్యారాయ్ పాత్రలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను, త్రిష క్యారెక్టర్ లో శ్రీదేవిని, ముందుగా అనుకున్నారట. ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ కోసం రజనీ, కమల్ చేతులు కలిపి ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేది. ప్రతీ మేకర్‌కు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ కావాలంటే అందుకు సరైన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం 40 ఏళ్లు ఎదురు చూశారు మణిరత్నం. సుహాసినితో పెళ్లికి ముందు నుంచే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన బుక్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారంటే మీరు ఆశ్చర్యపోకమానరు. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది. ఆ విషయాన్ని మొదటి భాగం క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక పాత్ర నెగిటివ్ మరొకటి పాజిటివ్. రెండో భాగంలో ఐశ్వర్యారాయ్ పాజిటివ్ క్యారెక్టర్ కు సంబంధించిన స్టోరీని రివీల్ చేయబోతున్నారు. పొన్నియిన్ లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందట. విక్రమ్ రూ.15 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట. రియల్ లొకేషన్స్ షూటింగ్స్‌కు ప్రాధ్యానతనిచ్చారు మణిరత్నం. అందుకే ఇంత భారీ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో కేవలం 150 రోజుల్లో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగలిగారు. రెండు భాగాలకు కలసి 300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మణిరత్నం రెహమాన్‌ను బాలి తీసుకువెళ్లి అక్కడ ట్యూన్స్ కంపోజ్ చేయించారట. వెయ్యేళ్ల కాలం నాటి ట్యూన్స్ ఎలా ఉండేవో అలా కావాలన్నారట. చదవండి: గాడ్ ఫాదర్‌తో మరోసారి ఆ విషయం రుజువైంది చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? -
పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల సునామీ.. వారం రోజుల్లో రూ.325 కోట్లు వసూల్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొడుతోంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోేంది. తమిళంలో గతంలో విడుదలైన రోబో 2.0, విక్రమ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ మూడోస్థానంలో కొనసాగుతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజైంది. పదో శతాబ్దంలోని చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో చిత్రీకరించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలోనూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును అధిగమించింది. (చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్) పొన్నియిన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ ధృవీకరించారు. మణిరత్నం కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్, యష్ కేజీఎఫ్- 2తో పోలిస్తే తక్కువగానే వసూళ్లు సాధించిందని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు రూ.600 కోట్ల కంటే ఎక్కువ నికర వసూళ్లు సాధించాయన్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. -
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.