map
-
నేపాల్ కొత్త కరెన్సీ నోట్లలో భారత్ ప్రాంతాలు? మరోమారు ఉద్రిక్తతలు?
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్‌తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్ ఖబర్ డాట్ కామ్’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్‌లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్‌తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.కాగా, గతంలో అప్పటి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్‌తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
వివాదాస్పద చైనా నూతన మ్యాప్.. భారత్‌తో గొంతు కలిపిన పలు దేశాలు
భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా ఇటీవల తన జాతీయ పటం కొత్త వెర్షన్‌ను ప్రచురించింది. దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ దేశంలోని భాగంగా చూపింది. భారత్ తీవ్ర నిరసన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా తన మ్యాప్‌లో చూపించడంపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సరిహద్దు వివాద పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని భారత్ పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనా వాదనలను తిరస్కరించింది. అవి నిరాధారమైనవిగా పేర్కొంది. చైనా చర్యపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ‘అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగం మీది అయిపోదు’ అని అన్నారు. మండిపడిన ఫిలిప్పీన్స్ చైనా మ్యాప్- 2023 వెర్షన్‌పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మండిపడింది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా సరిహద్దులు కలిగివుండటాన్ని చూపిస్తోంది. సముద్ర ప్రాంతాలపై చైనా తన సార్వభౌమాధికారంతో పాటు అధికార పరిధిని చట్టబద్ధం చేయడానికి ఈ కొత్త ప్రయత్నాలు చేస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా తెరెసిటా దాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ గతంలోనూ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసింది. ఫిలిప్పీన్స్ 2013లో చైనా జాతీయ పటాన్ని ప్రచురించడాన్ని నిరసించింది. దీనిలో కలయాన్ దీవులు,స్ప్రాట్లీస్‌లోని కొన్ని భాగాలను చైనా తన జాతీయ సరిహద్దులుగా చూపింది. చైనా వాదనలు ఖండించిన మలేషియా చైనా స్టాండర్డ్ మ్యాప్ ఎడిషన్ 2023లో దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న వాదనలకు వ్యతిరేకంగా రాతపూర్వక నోట్‌ను పంపనున్నట్లు మలేషియా ప్రభుత్వం తెలిపింది. మలేషియా ప్రాదేశిక జలాలను కూడా కలిగి ఉన్నట్టు చైనా తన మ్యాప్‌లో చూపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను మలేషియా గుర్తించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మ్యాప్‌పై వియత్నాం నిరసన చైనా దుశ్చర్యలపై వియత్నాం కూడా మండిపడింది. వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ మాట్లాడుతూ, హోంగ్ సా (పారాసెల్), ట్రూంగ్ సా (స్ప్రాట్లీ) దీవులపై వియత్నాం తన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటిస్తోందని, చైనా చేస్తున్న సముద్ర వాదనలను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘తైవాన్ను చైనా పాలించనేలేదు’ తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చైనా నూతన ప్రామాణిక మ్యాప్‌పై మండిపడింది. తైవాన్ను ఎప్పుడూ చైనా పాలించలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నూతన మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు! -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తమ అధికారిక మ్యాప్‌లో కలువుకుని చైనా విడుదల చేసిన మ్యాప్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ అది వారికున్న పాత ఆలవాటేనని అన్నారు. చైనా ఈరోజు విడుదల చేసిన 2023కు సంబంధించిన అధికారిక మ్యాప్‌లో కొన్ని పరాయి దేశాలకు సంబంధించిన భూభాగాలను కలిపేసుకుంది. ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ వంటి భూభాగాలతో పాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశంలో కలుపుకుంది. ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖామంత్రి జయశంకర్‌ను ప్రశ్నించగా అయన మాట్లాడుతూ దీనివలన చైనాకు ఒరిగే ప్రయోజనమేమీ లేదని చెబుతూనే అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత భూభాగమేనని అన్నారు. తమవి కాని ప్రాంతాలు తమవని చెప్పుకోవడం సరైన పధ్ధతి కాదు. మా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌పై పూర్తి స్పష్టతతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్-370 రద్దు మా ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగించడం వెనుక చాలా కారణాలున్నాయి.. దాని వలన ఆ ప్రాంతానికి కలిగిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని దీనిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఐదేళ్ళలో మేము ఏమి సాధించామంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు -
చైనా మ్యాప్ విడుదల.. సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోదీకి ఉందా?
భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను (standard map) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఆ దమ్ము ఉందా? అయితే చైనాకు పొరుగు దేశాలతో కలిసి జాతీయ సరిహద్దులను తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్ రాజకీయ దుమారానికి తెరలేపింది. తాజాగా చైనా మ్యాప్ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనాపై సర్జికల్ స్టైక్ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పింది నిజమే! ‘చైనాపై దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాలి. ఇటీవలె మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలు మా మనసులను గాయపరిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్‌లోకి చైనా ప్రవేశించిందటూ రాహుల్ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద మన భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్ చెప్పింది నిజమే’ నని వ్యాఖ్యానించారు. చదవండి: మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే! ఎన్నికలొస్తున్నాయి.. అల్లరు జరుగుతాయి 'ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల రైలుపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో ఉంది. హర్యానా అల్లర్లే ఉదాహరణ ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసమే. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులలోనూ ఈ ఆందోళన ఉంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం మన బాధ్యత. అలా జరగని పక్షంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హర్యానాలో జరిగిన అల్లర్లే దీనికి ఉదాహరణ’ అని రౌత్ పేర్కొన్నారు. రాహుల్ ఏమన్నారంటే.. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో కాంగ్రెస్ పర్యటించిన కాంగ్రెస్ నేత గాంధీ.. మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు. చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని రాహుల్ అన్నారు. -
మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే!
సరిహద్దు విషయంలో పొరుగుదేశం చైనా తీరు మారలేదు. స్టాండర్డ్ మ్యాప్ పేరుతో డ్రాగన్ కంట్రీ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ‘ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్’ పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మ్యాప్ పొరుగు దేశాలతో చైనా జాతీయ సరిహద్దులను డ్రాయింగ్ పద్దతి ద్వారా చూపుతోంది. చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ తమ భూభాగంలోనివిగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. భారత్‌లోని వివాదాస్పద భూభాగాలతోపాటు, తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడా తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. చదవండి: ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్ The 2023 edition of China's standard map was officially released on Monday and launched on the website of the standard map service hosted by the Ministry of Natural Resources. This map is compiled based on the drawing method of national boundaries of China and various countries… pic.twitter.com/bmtriz2Yqe — Global Times (@globaltimesnews) August 28, 2023 అయితే దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై చైనాతోపాటు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలకు వివాదాలు కలిగి ఉన్నాయి. కాగా 1962లో భారత్‌తో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకున్న చైనా.. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. అయినా చైనా తన తీరును మార్చుకోలేదు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. -
గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా?
నేటి రోజుల్లో గూగుల్ మ్యాప్ తెలియనివారు, వినియోగించనివారు ఎవరూ ఉండరు. ఎవరైనా సరే తాము తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ తప్పకుండా ఫాలో అవుతారు. అయితే గూగుల్ మ్యాప్‌లో రూట్లు చెప్పేటప్పుడు సుమధురమైన ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. అయితే ఈ గొంతు ఎవరిది? ఆమె పేరు ఏమిటి? ఎక్కడుంటుంది? చాలామందికి ఈ విషయాలు తెలియదు. అందుకే దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్ వెనుక గొంతు వినిపించే మహిళ పేరు కరెన్ జాకబ్సెన్. పూర్తి పేరు కరెన్ ఎలిజబెత్ జాకబ్సెన్.ఈమె ఆస్ట్రేలియాకు చెందినది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటోంది. ఆమె వృత్తి రీత్యా వాయిస్ ఓవర్ ఆర్టిస్టు. అంతేకాకుండా సింగర్, కంపోజర్, ఇన్ఫ్లుయెన్సర్గానూ రాణిస్తోంది. కరెన్‌ను పలు పురస్కారాలు వరించాయి. గూగుల్ మ్యాప్ కారణంగా ఆమె గొంతును ప్రపంచంలోని నలుమూలల జనాభా వింటున్నారు. దీనితో పాటు కరెన్ గొంతు 2011 నుంచి 2014 వరకూ ఆపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్, ఐపేడ్స్ తదిర అప్లికేషన్లలో వినియోగించారు. రెండు పుస్తకాలను కూడా రచించి.. ఆమె ఒక ఫిమేల్ ఎంటర్టైనర్ అయిన కారణంగా వన్ ఉమెన్ షోలను ప్రజెంట్ చేస్తుంటుంది. వీటిలో ది ట్రయాడ్, ది లారీ బీచ్మన్ థియేటర్ అండ్ పబ్లిక్ థియేటర్, ది డ్యూప్లెక్స్, ది బిట్టర్ ఎండ్ మొదలైనవి ఉన్నాయి. జాకబ్సెన్ రెండు పుస్తకాలను కూడా రచించింది. అవి రీకాలుక్యులేట్- డైరెక్షన్ ఫర్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ సక్సెస్, ది జీపీఎస్ గర్ల్స్ రోడ్ మ్యాప్ ఫర్ ధేర్ ఫ్యూచర్. కరెన్.. డాన్సెన్స్ ఫ్రీక్ కోసం సౌండ్ ట్రాక్ కూడా రూపొందించింది. ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర -
భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యాప్‌లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్‌ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్ చిత్రాన్ని వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap. All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022 భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్. వాట్సాప్ క్షమాపణలు.. మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది వాట్సాప్. జరిగిన తప్పుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్ ఇదీ చదవండి: స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై ‘బీఎస్ఎఫ్’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం -
వీఐపీల మ్యాప్ వచ్చేసింది.. టక్కున సమాధానం
ఈ ప్రశ్నకు మీరు బదులిచ్చినా ఇవ్వకున్నా ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ మ్యాప్ (ప్రపంచ పటం) మాత్రం టక్కున సమాధానం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులు పుట్టిన ప్రాంతాలను చిటికెలో చూపిస్తోంది. ఉదాహరణకు లండన్‌లో పుట్టిన అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? అని యూజర్లు అడిగితే చార్లీ చాప్లిన్ పేరును మ్యాప్ సూచిస్తోంది. అమెరికాలోని హోనలులులో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు వస్తోంది. అలాగే భారత్ నుంచి టిప్పుసుల్తాన్, ఔరంగజేబు వంటి నాటి రాజులు మొదలు మహాత్మాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ వంటి నేతల వరకు ఆయా వ్యక్తులు పుట్టిన ప్రాంతాలనుబట్టి మ్యాప్ చూపుతోంది. మీ ప్రాంతంలోని ప్రముఖుల వివరాల కోసం ఈ లింక్‌ను tjukanovt.github.io/notable-people క్లిక్చేయండి. గుర్తించేది ఇలా.. వికీపీడియా, వికీడేటాలోని సమాచా రం ఆధారంగా ప్యారిస్ వర్సిటీకి చెందిన పరిశోధకులు వివిధ రంగాల వ్య క్తుల ప్రాముఖ్యతను ఇటీవల లెక్కగట్టారు. దీని ఆధారంగా ప్రముఖ భూ గోళ శాస్త్రవేత్త, వార్తావెబ్సైట్లు, సంస్థలకు ఆన్లైన్ మ్యాప్లందించే మ్యాప్ బాక్స్ కంపెనీ సీనియర్ డిజైనర్ టోపీ జుకనోవ్ ఇంటరాక్టివ్ మ్యాప్‌ను రూ పొందించారు. వికీపీడియాలో నమోదైన ఎంట్రీలు, వాటి పొడవు, 2015 నుంచి 2018 మధ్య వికీపీడియాలో ఒక్కో ప్రముఖ వ్యక్తికి లభించిన సగ టు వ్యూయర్షిప్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మ్యాప్‌ను రూ పొందించినట్లు జుకనోవ్ చెప్పారు. సంస్కృతి, శాస్త్ర పరిశోధన, నాయకత్వం, క్రీడలు లేదా ఆటలు అనే నాలుగు రంగాలకు చెందిన వ్యక్తుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్‌గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్‌లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
‘రోప్మ్యాప్’తో పర్యాటకం పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకానికి ‘రోప్ మ్యాప్’ వేస్తూ ప్రభుత్వం సరికొత్త అందాలను తీసుకురానుంది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే రోప్‌వేలను రాష్ట్రంలోని 25 ప్రముఖ విహార, ఆధ్యా త్మిక కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. తద్వారా పర్యాటక రంగం అభి వృద్ధిలో కొత్తపుంతలు తొక్కనుందని భావిస్తోంది. ఇప్పటికే రెండు రోప్‌వేలకు అనుమతి.. విజయవాడలోని ఇంద్రకీలాద్రి, కృష్ణానది మీదుగా తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలానికి కొత్తగా రోప్ వేలను నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మరోవైపు గండికోటలో రోప్‌వే నిర్మాణ దశలో ఉంది. పర్వతమాల పథకంలో భాగంగా జాతీయ రహదారుల మౌలిక వసతుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వంతో రోప్‌వేల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి, ఎన్హెచ్ఎ ల్ఎంఎల్ మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం బిడ్డింగ్ నిర్వహించ నున్నారు. మిగిలిన ప్రతిపాదిత రోప్‌వేల నిర్మాణానానికి సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపాదనలు ఇలా.. గుంటూరు జిల్లా కోటప్పకొండ, విజయవాడలోని భవాని ద్వీపం–బెరంపార్క్, శ్రీకాళహస్తిలోని భరద్వాజతీర్థం, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగ మ్మ, సిద్ధేశ్వర స్వామి దేవాలయం–తలకోన జలపా తం, విశాఖ జిల్లాలోని గాలికొండ వ్యూ– అరకు కటికి జలపాతం, గంభీరం కొండ–గంభీరం డ్యామ్, లంబసింగి–అరకు కొండపైకి, తూర్పుగో దావరి జిల్లా అన్నవరం, కోరుకొండ ఆలయం– బౌద్ధస్థూపం, కొండపాదల నుంచి పైనగుడికి, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట జగతిపల్లి కొండ, హిరమండలం రిజర్వాయర్, శాలిహుండం, వైఎస్సార్ కడప జిల్లాలోని పెన్నానది మీదుగా పుష్పగి రిపట్నం – చెన్నకేశవ ఆలయం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, గుత్తి కోట, కర్నూలు జిల్లాఅహోబిలం, యాగంటి, మద్దలేటి స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్థం, తాటిపూడి, పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా రోప్‌వేలు.. రాష్ట్రానికి విదేశీయులను ఆకర్షించేంత పర్యాటక సౌందర్యం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల రోప్‌వేలు నిర్మించాలనే యోచనలో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే ఇంద్రకీలాద్రి, శ్రీశైలం రోప్‌వే పనులు చేపట్టి వేగంగా పూర్తి చేస్తాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ (చదవండి: సరికొత్త శకం) -
తెలంగాణ: 33 జిల్లాల సమగ్ర మ్యాప్ ఆవిష్కరణ.. ఇదే ఏకైక మ్యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్ర మ్యాప్ అట్లాస్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముంద్రించిన ఈ మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా శాఖ ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనని తెలిపారు. ప్రజలు. అధికార యంత్రాంగానికి ఈ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వినోద్ తెలిపారు. చదవండి: Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు -
కొత్త సీఎంకు పాత మ్యాప్ కష్టాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పుష్కర్ సింగ్ ధామికి గతంలో ఎప్పుడో షేర్ చేసిన ఒక మ్యాప్ కారణంగా తలనొప్పులు ఆరంభమయ్యాయి. ఆరేళ్ల క్రితం అఖండ్ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పటంలో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. పుష్కర్‌కు ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రావత్, పదవి చేపట్టిన కొద్దిరోజులకే చిరిగిన జీన్స్‌పై కామెంట్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! తాజాగా పుష్కర సింగ్ ధామీకి అర్ధ పుష్కర కాలం నాటి మ్యాప్ చిక్కులు తెచ్చిపెట్టింది. 2015లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అఖండ్ భారత్ కల సాకారం కావాలని పేర్కొంటూ ఒక మ్యాప్‌ను పుష్కర్‌సింగ్ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు ఆ మ్యాప్‌లో లేకపోవడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం ఆదివారం ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11మంది మంత్రులతో గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రావత్ కేబినెట్లో పనిచేసిన వారినే పుష్కర్ తన టీంలోకి తీసుకున్నారు. కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. రావత్ ప్రభుత్వంలో సహాయ మంత్రులుగా ఉన్నవారికి సైతం ఈ దఫా కేబినెట్ ర్యాంకులు దక్కాయి. పుష్కర్‌ను సీఎంగా ఎంపిక చేయడంపై అంతకుముందు రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. వీరిలో సీనియర్ మంత్రులతో పాటు 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసవచ్చినవారున్నారు. దీంతో పలువురు బీజేపీ పాతకాపులను, మాజీ సీఎంలను పుష్కర్ స్వయంగా వెళ్లి కలిశారు. అనంతరం పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని పుష్కర్ ప్రకటించారు. -
అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మంగళవారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ వరల్డ్ మ్యాప్‌ని ట్వీట్ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్ పార్టీ కలర్ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్ పార్టీ రంగు బ్లూ కలర్లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్‌కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్లో అతడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు) Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్ ట్రంప్ ఇండియాని జో బైడెన్, కమలా హారిస్ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్ పెన్సిల్ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So much for the friendship with Trump Senior. Junior has placed India firmly with @JoeBiden & @KamalaHarris though interestingly Jr. believes J&K & the NorthEast go against the rest of India & will vote Trump. Someone needs to take his colouring pencils away. https://t.co/AqVyX4ixdl — Omar Abdullah (@OmarAbdullah) November 3, 2020 అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకుడు శశి థరూర్ కూడా జూనియర్ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్ జూనియర్ భారత్‌లోని జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!) The price of Namo’s bromance: Kashmir & the NorthEast cut off from the rest of India, &the whole “filthy" place relegated by Don Jr to the realm of hostiles, along with China&Mexico. So much for the crores spent on obsequious serenading stadium events! https://t.co/fsI53aSkpv — Shashi Tharoor (@ShashiTharoor) November 3, 2020 మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. Good. Jammu and Kashmir is shown as part of Pakistan. Very encouraging. https://t.co/cAwqYniOct — Abdul Basit (@abasitpak1) November 3, 2020 -
పాకిస్తాన్ బరితెగింపు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: చైనా అండ చూసుకొని దాయాది దేశం పాకిస్తాన్ చెలరేగిపోతోంది. భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత్‌లోని కొన్ని కీలక భూభాగాలు తమవేనని చెప్పుకుంటూ ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అక్కడ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త మ్యాప్ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి బుధవారానికి ఏడాది కానుంది. అంతకంటే ఒక్కరోజు ముందు మంగళవారం దీన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్‌నకు పాక్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించింది. సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసింది. పాక్ ప్రజలతోపాటు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు సైతం ఈ మ్యాప్ ప్రతిరూపమని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇప్పటినుంచి ఇదే పాకిస్తాన్ అధికారిక పటమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం ‘బ్లాక్ డే’గా పాటించనున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాక్ చర్య హాస్యాస్పదం కొత్త మ్యాప్ అంటూ పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు. -
పాక్ దుర్నీతి : పీఓకేను కలిపేస్తూ నూతన మ్యాప్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. జమ్ము, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలనూ తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్‌కు పాక్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి బుధవారంతో ఏడాది అవుతున్న క్రమంలో పాకిస్తాన్ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. కొత్త మ్యాప్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆవిష్కరిస్తూ ఇది పాకిస్తాన్, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని, పాక్ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. కాగా, ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో అన్ని ప్రాంతాలను అధికారికంగా తమ భూభాగంగా పాకిస్తాన్ పేర్కొనడం లేదు. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను తమ భూభాగంగా పాక్ పేర్కొంటుండగా, మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్‌గా పాక్ వ్యవహరిస్తోంది. నేపాల్ సైతం భారత భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం కలకలం రేగింది.అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు నేపాల్ పాలక పార్టీలోనే తిరుగుబాటు రావడంతో భారత వ్యతిరేక చర్యలపై నేపాల్ వెనక్కుతగ్గింది. చదవండి : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య -
ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్
ఖాట్మాండు: గత కొద్ది రోజులుగా భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపాల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ రూపొందించిన నూతన మ్యాప్‌ను.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్‌ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత) ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్ మంత్రి పద్మ ఆర్యాల్ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు. అయితే, ఈ నూతన మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్‌ను జూన్ 13న నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ స్పష్టం చేసింది. -
నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును గురువారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ సంతకం చేశారు. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందింది. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెల్సిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఖండించిన భారత్: నేపాల్ ప్రయత్నాలను భారత్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని భారత్ విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంలో చర్చలు జరుపుకోవాలని గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని చెప్పారు. -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
‘నేపాల్ వివాదాస్పద మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ’
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నేపాల్ పార్లమెంట్లో సవరించిన జాతీయ మ్యాప్‌కు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. కాగా పార్లమెంట్లో జాతీయ మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ చేసే అంశంపై ఆ దేశ పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటగా ప్రతినిధుల సభలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన చర్చ జరుగుతుందని.. చర్చ పూర్తయిన వెంటనే ఓటింగ్ నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము ఓటింగ్‌లో రాజ్యంగ సవరణకు మద్దతిస్తామని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ పేర్కొంది. 1816 సుగాలీ ఒప్పందం ప్రకారం లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉంటాయని నేపాల్ ప్రభుత్వం వాదిస్తోంది. అందులో భాగంగనే సవరించిన ప్రాంతాలను కొత్త మ్యాప్‌లో పొందుపరిచామని తెలిపింది . ఇదే మ్యాప్ జాతీయ చిహ్నంలో కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి నేపాల్ వాదనలను భారత్ తిరస్కరిస్తోంది. దేశానికి చెందిన ఉత్తరాఖండ్ ప్రాంతాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో పొందుపరిచారని భారత్ విమర్శిస్తోంది. కాగా 1962 సంవత్సరంలో చైనాతో భారత్ యుద్దం జరిగిన సమయం నుంచే లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను కీలకంగా భారత్ భావిస్తోంది. మరోవైపు నేపాల్‌తో భారత్‌కు మంచి సంబంధాలున్నాయని.. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన అంశాలు ఒకే విధంగా ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే పేర్కొన్నారు. కాగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. 275 మంది సభ్యుల కలిగిన దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ రావాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. బిల్లు దిగువ సభ ఆమోదం పొందిన వెంటనే జాతీయ అసెంబ్లీకి చెరుకుంటుంది. అక్కడ కూడా దిగువ సభ అవలంభించే ప్రక్రియనే అమలు చేస్తారని పేర్కొంది.(చదవండి: చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!) -
సరిహద్దు వివాదం.. నేపాల్ మరింత ముందుకు
ఖాట్మండు: భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. మన దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్ విడుదలచేయడం తెల్సిందే. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. చదవండి: సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన -
చిచ్చురేపుతున్న నేపాల్!
మిత్ర దేశాల మధ్య చిచ్చు రేగింది. భారత్, నేపాల్ సరిహద్దు వివాదం... సరికొత్త మలుపులు తిరుగుతోంది. నేపాల్ కొత్త మ్యాపుతో మంట రేగుతోంది. ఏమిటీ వివాదం ? ఎందుకు ముదురుతోంది ? వివాదం మొదలైంది ఇలా ... జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చూపిస్తూ గత ఏడాది నవంబర్‌లో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో కాలాపానీ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ భూభాగంలో ఉన్నట్టుగానే చూపించింది. అప్పట్లోనే నేపాల్‌లో అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపించాయి. ఆ తర్వాత మానససరోవర్‌కు వెళ్లే యాత్రికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి లిఫులేఖ్ ప్రాంతంలో నిర్మించిన 80.కి.మీ. రహదారిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 8న ప్రారంభించారు. దీంతో నేపాల్ ఒక్కసారిగా కస్సుమంది. లిఫులేఖ్, కాలాపానీ, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంగా చూపిస్తూ కొత్త దేశ పటాన్ని విడుదల చేసింది. దానికి రాజ్యాంగబద్ధతను తీసుకురావడానికి పార్లమెంటులో తీర్మానం కూడా చేసింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్‌కు స్పష్టం చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేపాల్ బుసల వెనుక డ్రాగన్ ? నేపాల్‌కు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ భారత్ ఆదుకుంటుంది. ఎన్నో అంశాల్లో నేపాల్ భారత్‌పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో నేపాల్ చీటికీ మాటికీ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ నుంచి వచ్చిన వారితో విస్తరించిన కరోనా వైరస్ చైనా కంటే డేంజర్ అంటూ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పడు సరిహద్దు వివాదానికి తెరతీశారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. నేపాల్ ప్రధానమంత్రి ఓలి ఏకపక్ష నిర్ణయాలతో అక్కడ రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.. ఓలి రాజీనామా చేయాలని ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) డిమాండ్ చేసింది. ఆ సమయంలో చైనా ఓలికి అండగా నిలబడింది. నేపాల్‌లో చైనా రాయబారి ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్టుగా కథనాలు వచ్చాయి. ప్రతిఫలంగా ఓలి చైనాకు కొమ్ముకాస్తూ భారత్ రక్షణని ప్రమాదంలో పడేసే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోవిడ్–19ని అరికట్టడంలో వైఫల్యం, పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు కోల్పోతున్న ఓలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కాలాపానీ అంశాన్ని పెద్దది చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాలాపానీ చరిత్రలోకి వెళితే ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే కాలాపానీ. సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలో మీటర్లు ఉండే ఈ ప్రాంతం మహాకాలీ నది జన్మస్థావరం. ఎప్పట్నుంచో ఇది భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఈ మార్గం ద్వారానే భారతీయ యాత్రికులు అత్యంత సాహసోపేతమైన మానస సరోవర్ యాత్రకి వెళతారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్ అక్కడ 18 సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేసింది. 1969లో నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంతో కాలాపానీలో మినహా మిగిలిన సైనిక శిబిరాలన్నీ తొలగించింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలపై నిఘా పెట్టాలంటే కాలాపానీ ప్రాంతంలో సైనిక శిబిరం అత్యంత ముఖ్యం. అయితే కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలీ నది నేపాల్‌లో ప్రవహిస్తోందని చెప్పారని, ఆ నది పుట్టిన భూభాగం తమదేనన్నది ఆ దేశం వాదన. దేశ పటాన్ని మార్చడంలో నేపాల్ ఏకపక్ష నిర్ణయానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సరిహద్దు వివాదాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న భావనకు వ్యతిరేకంగా ఓలి సర్కార్ వ్యవహరిస్తోంది. సరిహద్దు రేఖల్ని తమ ఇష్టారాజ్యంగా మార్చేస్తామంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి -
డ్రోన్ మ్యాపింగ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని భవనాలు, రోడ్లు, నాలాలు, నీరు నిలిచే ప్రాంతాలు, చెత్తడబ్బాలు తదితర సమస్త వివరాల కోసం డ్రోన్ల ద్వారా జీఐఎస్ మ్యాపింగ్ సర్వే చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. చెన్నై తదితర నగరాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రక్రియ చేపట్టడంతో హైదరాబాద్‌లోనూ డ్రోన్ల ద్వారా ఈ సర్వే చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. త్వరితంగా సర్వే పూర్తయ్యేందుకు వీలుంటే ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా సర్వే చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాఫ్ట్‌కు ప్రత్యేకంగా అమర్చే హై రిజల్యూషన్ కెమెరాల ద్వారా ఈ సర్వే చేయవచ్చునని సంబంధిత అధికారి తెలిపారు. అయితే సర్వే డ్రోన్ల ద్వారానా, లేక విమానాల ద్వారానే అనే అంశానికి సంబంధించి రాష్ట్ర ఐటీ సర్వీసెస్, జేఎన్టీయూహెచ్, తదితర సంస్థలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, అందుకనుగుణంగా సర్వే చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీలోని రోడ్లు, నాలాలు, చెరువులతో సహ ఇతరత్రా అన్ని యుటిలిటీస్‌కు సంబంధించిన వివరాలతో సిటీ బేస్ మ్యాప్ అంటూ ఉంటే ఏ రకంగానైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పరిధిలో లేని భవనాలెన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఏయే భవనాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయో, ఎన్ని అంతస్తులు అదనంగా నిర్మించారో కూడా తెలుసుకునే వీలుంటుంది. తద్వారా అండర్ అసెస్డ్, అన్ అసెస్డ్ భవనాలకు సరైన ఆస్తిపన్నును నిర్ధారించడం ద్వారా జీహెచ్ఎంసీకి ఎంతో ఆదాయం పెరుగుతుంది. మానవ సర్వేలతోనే ఎలాంటి పన్ను పెంచకున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే మొత్తం ఏటికేడు పెరుగుతోంది. ఇక ఈ ఏరియల్ సర్వేతో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏరియల్ సర్వేతో నగరానికి సమగ్ర బేస్‌మ్యాప్ రూపొందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సర్వేతో మేలు... డ్రోన్ సర్వే కంటే ఎయిర్‌క్రాఫ్ట్ సర్వే చేస్తే తక్కువ సమయంలోనే పూర్తవుతుందని, డ్రోన్ ద్వారా నెలల రోజుల సమయం పట్టేది విమానం ద్వారా అయితే రోజుల్లోనే పూర్తిచేయవచ్చునని సంబంధిత అధికారి పేర్కొన్నారు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్ సర్వే చేయాలంటే కేంద్ర రక్షణ, హోమ్ అఫైర్స్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖలతో పాటు ఇతరత్రా శాఖలు, రాష్ట్రప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఒక మీటరు పరిధి వరకు చిత్రాలు స్పష్టంగా ఉంటాయని, అదే డ్రోన్‌సర్వే ద్వారా 5 సెం.మీ.ల పరిధిలో కూడా హై రిజల్యూషన్ చిత్రాలు వస్తాయని ఎయిర్‌క్రాఫ్ట్ సర్వే ద్వారా అయితే 10 సెం.మీ. పరిధిలో కచ్చితమైన వివరాలుంటాయని పేర్కొన్నారు. ఒక భవనం లేదా ఏరియాకు సంబంధించి 3డి మోడల్‌తో కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ సర్వే పూర్తయితే చెరువులు, పార్కుస్థలాల వంటివాటి పరిరక్షణతోపాటు రోడ్లు, వరద కాలువలు, వీధి దీపాలు, ఫుట్‌పాత్‌లు, ట్రాన్స్ఫార్మర్లు తదితరమైన వాటి వివరాలూ తెలుస్తాయని, విపత్తు నిర్వహణకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని అన్ని ఆస్తుల(భవనాల) కార్పెట్ ఏరియా కూడా తెలిసే సదుపాయం ఉంటుందన్నారు. -
ఈ గీతతో సముద్రం మీదే ప్రయాణం..
ఈ చిత్రంలో ఎరుపు రంగు గీతను చూశారా. ఈ గీత ఆకారం చూడటానికి అనేక వంపులు ఉన్నట్టు ఉంది కదా. అయితే నిజానికిది అచ్చంగా నిలువు గీత. అదేంటీ గీత అన్ని వంకరలు ఉంటే నిలువు గీత అంటారేంటీ అనుకుంటున్నారా.. నిజంగానే ఇది నిలువు గీతే.. ఎందుకంటే మన భూమి గోళాకారంలో ఉండటం వల్ల దానిమీద నిలువు గీసినా ఈ చిత్రంలోని మ్యాప్‌లో కనిపించినట్టుగా అనేక వంకరలు వస్తుంది. అలాగే మ్యాప్‌పై పెద్ద సరళ రేఖ గీసినా.. భూమి మీదకి వచ్చేసరికి అనేక వంకరలు వస్తుంది. ఈ గీతకు మరో విశిష్టత ఉంది. ఈ గీతను పట్టుకుని వెళితే.. ఎక్కడా భూమిపై అడుగు పెట్టకుండా కేవలం సముద్ర మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర మార్గం గుండా ప్రయాణించే అతిపెద్ద సరళ రేఖ. ఈ రేఖను ఐదేళ్ల క్రితం జార్జీయాకు చెందిన పాట్రిక్ అండర్సన్ అనే వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మ్యాప్‌పై రేఖను గీశాడు. అయితే ఇది సరైనదా.. కాదా కనుక్కునేందుకు గాను ఇటీవల ఐర్లాండ్‌లోని భౌతిక శాస్త్రవేత్త రోహన్, ఇండియన్ ఐబీఎంలో పనిచేస్తున్న ఇంజనీర్ కుశాల్ ముఖర్జీలు అల్గారీథమ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించి మ్యాప్‌పై గీసిన ఈ రేఖ సరైనదని వారు కనుగొన్నారు. బలూచిస్తాన్‌లో మొదలయ్యే ఈ అతిపెద్ద సముద్ర ప్రయాణం అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్, పసిఫిక్, సౌత్ బేరింగ్ సముద్రాల మీదుగా సాగి రష్యాలోని కమ్చట్కా తీర ప్రాంతంలో ముగుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం 32 వేల కిలోమీటర్లు ఉంటుంది. -
సముద్రలోతుల అంతు చూస్తాం...!
ప్రస్తుతం అత్యాధునిక శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకు రోజుకు నూతన ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ సువిశాల విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు తెరమరుగునే ఉండిపోతున్నాయి. చందమామ ఉపరితలం ఎలా ఉంటుంది? కుజ గ్రహంపై ఏముంటుంది ? అన్న విషయాల గురించి తెలుసు కాని సముద్రగర్భంలో ఏమేమి నిక్షిప్తమై ఉన్నాయి ? వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన సాధించలేకపోయాము. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సముద్రాల అడుగున ఏముందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడమేంటీ అన్న ప్రశ్నల నుంచే ‘ద సీ బెడ్ 2030 ప్రాజెక్టు’ రూపుదిద్దుకుంది. వివిధ ఖండాల మీదుగా ఉన్న సముద్రగర్భాన్నంతా 2030 కల్లా ‘మ్యాపింగ్’ చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సముద్రం ద్వారా 2030 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆదాయం (2010లో 1.5 ట్రిలియన్ డాలర్లు) చేకూరుతుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంచనా. 2021–30 సంవత్సరాల మధ్యనున్న కాలాన్ని ‘ఓషియన్ సైన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’గా ఐరాస తీర్మానించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దీని వెనక ఎవరు ? జపాన్‌కు చెందిన దాతృత్వసంస్థ ‘నిపాన్ ఫౌండేషన్, ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ల కింద పనిచేసే జిబ్కో (లాభాపేక్ష లేని నిపుణుల సంఘం–సముద్రం అడుగున ఏముందని అన్వేషణలు సాగిస్తున్న సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పడింది. భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు సతీంతర్ బింద్రా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తారు ? ప్రపంచవ్యాప్తంగా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాటిలోని నిపుణులు, పరిశోధకులు ఇప్పటికే విభిన్నరూపాల్లో అందుబాటులో ఉన్న వివరాలు, సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ఆ సమాచారాన్నంతటిని బ్రిటన్‌లోని నేషనల్ ఓషియనోగ్రఫీ సెంటర్లో ఆయా అంశాలను క్షుణ్ణంగా పరీక్షించి ఒకచోట చేరుస్తారు. వాణిజ్యనౌకలు, చేపలు పట్టే మర పడవలు, అండర్‌వాటర్ డ్రోన్ల ద్వారా ఇప్పటికే సేకరించిన వివరాలు, సమాచారంతో పాటు సముద్ర పరిశోధకులు నిగ్గుతేల్చిన అంశాలను ఒకచోట చేరుస్తారు వివిధ రూపాల్లో ఇప్పటికే వెల్లడైన విషయాలతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మునిగిపోయిన నౌకలపై సముద్ర అన్వేషకులు జరిపిన పరిశోధనాంశాలు, వాణిజ్య,వ్యాపార కంపెనీల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకుంటారు 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ ఎమ్మెచ్ 370 విమాన ప్రమాదం నేపథ్యంలో డచ్ దేశానికి చెందిన ఫుగ్రో సంస్థ 65 వేల కి,మీ మేర సముద్ర అడుగుభాగాన్ని జల్లెడ పట్టింది. ఈ సందర్భంగా జరిపిన పరిశోధన వివరాలు కూడా ఇందులో జతచేస్తారు మలేషియా విమానం ఆచూకీ కనుక్కునేందుకు పనిచేస్తున్న ఓషియన్ ఇనిఫినిటీ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యింది. ఎందుకోసం ? సునామీ సంభవించినపుడు అలల ఉధృతి, పయనించే గమనం ఎలా ఉండబోతుందో అంచనా వేయడం మత్స్యసంపద కదలికలు ఎటునుంచి ఎటు ఉంటాయో కనిపెడతారు కాలుష్యం ఏ మేరకు వ్యాపించింది, దానిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సముద్రగర్భంలో నిగూఢంగా ఉండిపోయిన ఖనిజ నిక్షోపాల గుట్టు తేలుస్తారు నౌకలు, ఓడల గమనం, రవాణా దారులు కనుక్కుంటారు ఎంత ఖర్చవుతుంది ? ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. -సాక్షి నాలెడ్జ్ సెంటర్