Maruti
-
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
Prabhas New Look: ప్రభాస్ లేటేస్ట్ లుక్.. వీడియో చూశారా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు ది రాజాసాబ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రభాస్ సరికొత్త హెయిర్ కట్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు రెబల్ స్టార్‌పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రబాస్ మిర్చి సినిమాలో లాగా స్టైలిష్‌గా ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో సరికొత్త వింటేజ్ లుక్‌లో ప్రభాస్ సందడి చేశారు. Latest Look of our Rebel star #Prabhas 🥵😍🔥🔥 pic.twitter.com/YtTByjybJ5 — Prabhas FC (@PrabhasRaju) April 17, 2024 Darling😘🖤#Prabhas pic.twitter.com/nkFUzITdwa — Ashhu🖤 (@PrabhAshhu) April 18, 2024 -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. క్రేజీ హింట్ ఇచ్చిన బేబీ నిర్మాత!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. భాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. అయితే మూడు నెలలుగా ది రాజాసాబ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన నిర్మాత ఎస్కేఎన్ హింట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్వీట్‌కు డైరెక్టర్ మారుతి రిప్లై ఇవ్వడంతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 👑🎵🎶💖🔥❤️🔥💥 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 16, 2024 -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
వరుస షూటింగులతో ఫుల్ బిజీ బిజీగా ప్రభాస్
‘సలార్’, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ వీలైనప్పుడుల్లా ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ అని టాక్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మళ్లీ ‘సలార్’ సెట్స్‌లో జాయిన్ అవుతారట ప్రభాస్. కాగా ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న, ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈ జూన్ 16న రిలీజ్ కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రూపొందనుంది. ఈ సినిమాల వరుస షూటింగ్‌లు, వాటి తాలూకు ప్రమోషన్స్‌తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆసక్తి రేపుతున్న ఆది సాయికుమార్ 'టాప్ గేర్' టీజర్
ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్ తాజాగా సినిమా టీజర్‌ను వదిలారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్‌తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్‌లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
ప్రభాస్-మారుతి రెగ్యులర్ షూటింగ్ అప్పుడే
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా లుక్ టెస్ట్ నిర్వహించారట మారుతి. వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అయితే ఈ వారంలోనే రెగ్యులర్ షూట్ జరిపేందుకు అంతా సిద్ధం చేశారట మారుతి. ఫస్ట్ షెడ్యూల్లో వారం రోజులు మాత్రమే ప్రభాస్ పాల్గొంటారట. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే తాత–మనవడి కథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ప్రభాస్-మారుతి చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదోక రూమర్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. చదవండి: ‘వరహరూపం..’ కాంతార లిరికల్ సాంగ్ రిలీజ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించనున్నాడని అంటున్నారు. ఇందులో ఆయన ప్రభాస్ తాతగా కనిపించనున్నారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా బొమన్ గతంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవన్ కల్యాణ్ తాత, బడా వ్యాపారవేత్తగా కనిపించారరు. దీంతో ఈ చిత్రంలో కూడా ప్రభాస్ తాతగా కనిపించనున్నాడని తెలిసి మరిన్ని అంచనా నెలకొన్నాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు -
పక్కా కమర్షియల్ అంటున్న గోపీచంద్
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్ల, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
మారుతి జోరులో టాటా పంచ్‌లు !?
కరోనా తీసుకొచ్చిన సెమికండక్టర్ చిప్‌ల కొరత ఉక్రెయిన్ మోసుకొచ్చిన సప్లై చైయిన్ ఇబ్బందుల మధ్య ఇండియాలో కార్ల అమ్మకాలు మార్చిలో చెప్పుకోతగ్గ రీతిలోనే జరిగాయి. ఎప్పటి లాగే టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో అధిక భాగం మారుతి సుజూకివే ఉన్నాయి. మరోవైపు భారత్ మార్కెట్లో మారుతికి సమీప ప్రత్యర్థిగా ఎదిగేందుకు టాటా దూసుకొస్తోంది. Maruti Wagon R - 2022 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి వ్యాగన్ ఆర్ నిలిచింది. గతేడాది వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కె్ట్లో దూసుకుపోతోంది. గతేడాది టాప్ సెల్లర్‌గా నిలిచిన వ్యాగన్ ఆర్ ఈ మార్చిలోనూ హవా కొనసాగించింది. 2022 మార్చిలో 24,636 మారుతి వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.5.18 లక్షలుగా ఉంది. Swift Dezire - మారుతిలో అత్యంత సక్సెస్ఫుల్ మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ డిజైర్ మార్చిలో తన ప్రతాపం చూపించింది. మారుతి స్విఫ్ట్‌ని క్రాస్ చేసి ఏకంగా 18,623 కార్లు సేల్ అయ్యాయి. స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలుగా ఉంది. Suzuki Baleno - సూజుకి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్లో ఎక్కువ ప్రభావం చూపించిన కారుగా బాలేనోకి గుర్తింపు ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా 14,520 కార్లు అమ్ముడయ్యాయి. సగటున 22 కి.మీ మైలేజ్ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకత. ప్రారంభ ధర రూ. 9.49 లక్షలుగా ఉంది. Tata Nexon - ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో టాటాకి సిరుల పంట పండించిన మోడల్‌గా నెక్సాన్ నిలిచింది. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో మార్కెట్ లీడర్లుగా ఒక వెలుగు వెలిగిన బ్రెజా విటారా, క్రెటాలను నెక్సాన్ వెనక్కి నెట్టింది. ఇదే ఊపులో మార్చిలో 14,315 కార్ల అమ్మకాలు సాగాయి. ఈ కారు ధరలు రూ.7.42 లక్షల నుంచి మొదలు. Maruti Swift - ఇండియాలో ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లిన కనిపించే కారుగా మారుతి స్విఫ్ట్ గురించి చెప్పుకోవచ్చు. పదేళ్లుగా ఈ మోడల్ రారాజుగా వెలుగుతోంది. కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ వాటా స్విఫ్ట్‌దే అన్నట్టుగా పరిస్థితి ఉంది. 2022 మార్చిలో 13,623 కార్ల అమ్మకాలు జరిగాయి. ప్రారంభ ధర రూ.5.90 లక్షలు Maruti Brezza Vitara - ఇండియాలో ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్ సత్తా ఎంటో ప్రపంచానికి చాటిన మోడల్ మారుతి విటారా బ్రెజా. సగటున 17.5 కి.మీ మైలేజీ ఇవ్వడం ఈ ఎస్యూవీ ప్రత్యేకత. మార్చిలో 12,.439 కార్లు రోడ్లపైకి వచ్చాయి. Hyundai CRETA - వివిధ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నా ఇప్పటికీ హ్యుందాయ్‌కి మార్కెట్లో మేజర్ షేర్ ఉండటానికి కారణం క్రెటా మోడల్. మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో క్రెటా రారాజుగా వెలుగుతోంది. మార్చిలో 19,532 కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 10.23 లక్షలు TATA PUNCH - ఊహించనదానికి కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారు. ఈ కారు విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకోగా.. తర్వాత కూడా అదే జోరు చూపించింది. చిప్సెట్ల సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ దేశ్యాప్తంగా ఏకంగా 10,526 పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.5.67 లక్షలు. చదవండి: హాట్ కేకుల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు.. మరీ ఈ రేంజ్‌లోనా! -
చేతులు కలిపాయ్..దుమ్ము దులిపేస్తున్నాయ్! దేశీయ రోడ్లపై ఎస్యూవీ చక్కెర్లు!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్యూవీ వెహికల్స్‌కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్యూవీ మార్కెట్‌ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్యూవీ వెహికల్స్ టెస్ట్‌లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వెహికల్ ఒక్కటే.. కోడ్లు మాత్రం రెండు మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్యూవీ వెహికల్స్‌ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్యూవీ కోడ్ వైఎఫ్జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్‌లను విడగొట్టి.. అదే ప్లేస్‌లో బంపర్, ఎల్ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి. అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్‌ల్యాంప్‌తో ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. రెండు ఎస్‌యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు. మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్లో ఉండనున్నాయి. చదవండి: ఉద్యోగులకు బిగ్‌షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
బ్రాండ్ మారుతి.. విదేశాల్లో పెరిగిన డిమాండ్
ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది(2021)వాహన ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. అన్ని విభాగాల్లో కలిపి కిందటేడాది మొత్తం 2.05 లక్షల యూనిట్లను విదేశాలకు పంపింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఈ స్థాయి ఎగుమతులను సాధించడం ఇదే తొలిసారని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ 15 మోడళ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటిలో 2021 ఏడాదిలో బాలినో, డిజైర్, సిఫ్ట్, ఎస్–ప్రెస్సో, బ్రెజా మోడళ్లు టాప్–5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ కంపెనీ 1987లో తొలిసారి హంగేరీకి కార్లను పంపింది. ఈ 34 ఏళ్లలో మొత్తం 21.85 లక్షల కార్లను ఎగుమతి చేసింది. నాణ్యత, సాంకేతిక, భద్రత, డిజైన్, విషయంలో మారుతీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందునే రెండు లక్షల అమ్మకాల మైలురాయిని అందుకోగలిగామని కంపెనీ ఎండీ కెనిచి అయుకవా తెలిపారు. ఉత్పత్తి తగ్గింది వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ గత నెలలో మొత్తం 1,52,029 యూనిట్లు ఉత్పత్తి చేసింది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల అని కంపెనీ సోమవారం ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాలు 1,53,475 నుంచి 1,48,767 యూనిట్లకు వచ్చి చేరాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సో 27,772 నుంచి 19,396 యూనిట్లుగా ఉంది. కాంపాక్ట్ కార్స్ వేగన్–ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వాహనాల సంఖ్య 85,103 నుంచి 86,696 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వెహికిల్స్ జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, వితారా బ్రెజ్జా, ఎక్స్ఎల్6 వాహనాలు 28,006 నుంచి 31,794 యూనిట్లకు చేరుకున్నాయి. ఈకో వ్యాన్ ఉత్పత్తి 11,219 నుంచి 9,045 యూనిట్లుగా ఉంది. తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీ తయారీ దాదాపు రెండింతలై 3,262 యూనిట్లకు ఎగిసింది. చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..! -
సైన్స్ ఫిక్షన్ డ్రామా "రామ్ అసుర్" ట్రైలర్ విడుదల
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ నటీనటులుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా పీనట్ డైమండ్". మాస్ ఆడియోన్స్‌కు రీచ్ అయ్యేలా టైటిల్‌ను ''రామ్ అసుర్'' గా మార్చిన సంగతి తెలిసిందే. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్19న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి, బుచ్చిబాబు, బెల్లంకొండ సురేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. మారుతి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. -
హలో హాలీవుడ్ అంటున్న రాజ్ దాసిరెడ్డి
ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ’తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు. ఆ మూవీ తర్వాత హాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. నేడు రాజ్ దాసిరెడ్డి బర్త్‌డే.ఈ సందర్బంగా ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రధాని నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు రాజ్ దాసిరెడ్డి. మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని చెప్పారు. -
ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా? -
కార్ల ధరలు పెంచిన మారుతి.. ఏ మోడళ్లపై అంటే?
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది. రూ. 15,000 మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మోడళ్లపై ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్మార్కెట్లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి. -
బంపర్ ఆఫర్ : భారీగా తగ్గిన అంబులెన్స్ వాహనాల ధర
ముంబై: మారుతీ సుజుకీ తన అంబులెన్స్ వెర్షన్ ‘‘వ్యాన్ ఎకో’’ వాహన ధరలను రూ.88 వేలు తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.6.16 లక్షలుగా ఉంది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీ రేటును 28% నుంచి 12 శాతానికి తగ్గిస్తూ గతవారంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబులెన్స్ మోడళ్ల ధరలపై కోత విధించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తగ్గింపు ధరలు జూన్ 14 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. చదవండి: పబ్జీ లవర్స్‌కు మరో షాక్, ఊపందుకున్నబ్యాన్ డిమాండ్ -
మారుతీ సేల్స్13,865 యూనిట్లు..షేర్లు 3% అప్
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి మే నెలలో 13,865 యూనిట్లను దేశీయంగా విక్రయించినట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమలుచేస్తోన్న లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో హర్యాణాలోని గురుగావ్,మానేసర్ కేంద్రాల్లో ఉత్పత్తి పునరుర్దరించింది. పునరుద్దరణ తరువాత మే నెలలో 13,865 యూనిట్ల వాహన విక్రయాలు జరిపినట్లు ఈకంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెలలో 125,552 యూనిట్ల వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు మారుతీ పేర్కొంది. ముంబై పోర్ట్ ద్వారా 4,651 యూనిట్ల వాహనాలను, టయోటాతో కలిసి మరో 23 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొన్ని షోరూంలను తెరిచామని, కంటైన్మెంట్ లేని జోన్లలో కూడా ఆ ప్రాంత నిబంధనలను అనుసరించి మిగతా వాటిని కూడ తెరుస్తామని ఒక ప్రకటనలో మారుతీ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో మారుతీ సుజుకీ ఇండియా షేరు 2.7 శాతం పెరిగి రూ.5763.70 వద్ద ట్రేడ్ అవుతోంది. -
‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!
కరచాలనం వద్దు నమస్కారాం చేద్దాం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా కడుక్కుందాం, సామాజిక దూరం పాటిద్దాం.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పద్దతులు తప్పక పాటించాలని అటు ప్రభుత్వాలు ఇటు నిపుణులు పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే గతంలోనే ‘మహానుభావుడు’ చిత్రంలో పై నియమాలను ప్రస్తావిస్తూ కాస్త హాస్యం జోడించి ప్రజలకు చూపించారు డైరెక్టర్ మారుతి. హీరో(శర్వానంద్)కు ఉన్న అతి ఓసిడి(ఓవర్ క్లీనింగ్ డిజార్డర్)తో వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. అయితే గతంలో ఈ సినిమా చూసి నవ్వుకున్నాం కానీ ఇప్పుడు అలాంటి పద్దతులు పాటించక తప్పడం లేదు. మెగాస్టార్ చిరంజీవి మాదిరి ఆలస్యంగా సోషల్‌మీడియాలో అడుగుబెట్టాడు హీరో శర్వానంద్. ఈ క్రమంలో ఆదివారం ట్విటర్ ఆకౌంట్ ఓపెన్ చేసిన శర్వా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్టూన్ రూపంలో తెలిపాడు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతీ ఒక్కరు ‘మహానుభావుడు’గా మారాలి, మారదాం’అంటూ శర్వా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వ్యక్తిగత పరిశుభ్రత గురించి ‘మహానుభావుడు’అప్పట్లోనే చెప్పాడు.. అప్పుడు నవ్వుకున్నాం ఇప్పుడు పాటిద్దాం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Be a Mahaanubhaavudu for our people, for our country, for the world 😊 pic.twitter.com/D1YkpGDZW9 — Sharwanand (@ImSharwanand) March 29, 2020 #StayHome #StaySafe pic.twitter.com/hOr1RJayKG — Sharwanand (@ImSharwanand) March 29, 2020