Medical experts
-
నిఫా.. ఇలా సఫా..
హెల్త్ డెస్క్: ఇటీవల కేరళలో నిఫా వైరస్‌తో పద్నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడం కలవరం రేపింది. ఆ వైరస్ వ్యాపిస్తోందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో జనంలో ఆందోళన మొదలైంది. కానీ ‘నిఫా’ విషయంలో అంత భయమేమీ అవసరంలేదని.. ప్రస్తుతం కేరళలో తప్ప మరే రాష్ట్రంలోనూ దాని ఆనవాళ్లు లేవని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే ‘నిఫా’ మన దరికి చేరే ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు.ఎప్పట్నుంచో ఉన్న వైరసే ఇది..ఆరేళ్ల కింద మన దేశంలో తొలిసారిగా ‘నిఫా’ వైరస్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇది ప్రపంచానికి కొత్తదేమీ కాదు. 1998లోనే మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిఫా’ అనే ప్రాంతంలో తొలిసారిగా మనుషులకు సంక్రమించింది. ఆ ప్రదేశం పేరిటే దీన్ని ‘నిఫా’గా పిలుస్తున్నారు. తర్వాత 2004లో బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించింది. కాస్త అరుదుగానైనా అప్పుడప్పుడూ (స్పొరాడిక్గా) భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.వ్యాపించేది ఇలా..» ‘నిఫా’ ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే (జూనోటిక్) వ్యాధి.» తాటి, ఈత, ఖర్జూర జాతికి చెందిన చెట్ల పండ్లను తినే ఫ్రూట్ బ్యాట్స్ రకం గబ్బిలాల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. వీటితోపాటు జామ వంటి ఇతర పండ్లనూ అవి తింటుంటాయి. ఆ పండ్లలో ‘నిఫా’ వైరస్ ఉండే ప్రమాదం ఎక్కువ.» చిలక కొట్టిన పండు అంటూ సగం కొరికి ఉన్న ఏ పండ్లనూ తినకపోవడం మంచిది.» కొన్నిచోట్ల పందుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదముంది. అప్పటికే వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకూ సంక్రమిస్తుంది.నిర్ధారణ చేసేదిలా..‘నిఫా’ లక్షణాలున్న బాధితుల నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. ప్రస్తుతం దేశంలో ‘నిఫా’ వైరస్‌ను కచ్చితంగా గుర్తించే సదుపాయాలు అక్కడే ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్‌లో ఎలిసా టెస్ట్,క్వాంటిటేటివ్ పీసీఆర్ (పాలిమరేజ్ చైన్ రియాక్షన్), సెల్ కల్చర్ (వైరస్ ఐసోలేషన్) తదితర టెస్టుల ద్వారా వైరస్‌ను గుర్తిస్తారు.నిఫా నుంచి రక్షణ ఇలా..» ఏదైనా కొరికినట్టు కనిపించిన ఏ పండునూ కూడా తినకపోవడం.» పందుల ఫామ్స్కూ, పందుల పెంపకందార్లకు కొద్దిరోజులు దూరంగా ఉండటం.» ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి దూరంగా ఉండటం.» వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. శానిటైజర్లను వాడటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు..నిఫా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కచ్చితమైన చికిత్సా విధానం, మందులు లేవు. లక్షణాల తీవ్రతను బట్టి ఉపశమనం కోసం మందులు ఇస్తుంటారు. కొన్నిరకాల యాంటీ వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తారు. వ్యాక్సిన్‌ను రూపొందించినా అది అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని తేలింది. ‘నిఫా’ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. – డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ -
AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. -
గుండె సడెన్ స్టాప్.. కారణలెన్నో!
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి మరీదు రాకేశ్ గుండెపోటుతో మృతి. రాజస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల సచిన్ హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ ఆవరణలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన షేక్ అహ్మద్ (36) ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అతనికి ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కూడా ఇవి సంభవించడం కలవరపరుస్తోంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఆలస్యంగా అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్టు అనేక తాజా అధ్యయనాల్లో వెల్లడౌతోంది. మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా రక్తం గడ్డకట్టే గుణం పెరిగేందుకు దోహదపడేలా జీవనశైలి అలవాట్లు మారడం ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న యువత ఆలస్యంగా నిద్రించడం, ఎలాంటి శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా సామాజిక మాధ్యమాల్లో, సెల్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇలా వివిధరకాల డిజిటల్ పరికరాలతో కాలక్షేపం చేస్తూ మానసిక ఒత్తిడికి గురికావడం, తదితరాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆకస్మిక గుండెపోట్లకు ఎన్నో కారణాలు ఆకస్మిక గుండెపోట్లకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా సోకినవారికి కార్డియో వాస్క్యులర్ జబ్బులు వచ్చే అవకాశాలు అధికమయ్యాయి. కోవిడ్ సందర్భంగా తీవ్రంగా జబ్బుపడినవారికి ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతం అనేకమందిలో రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుండడం ఆందోళనకరం. గుండె జబ్బులకు అనేకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో కారణమౌతున్నాయి. మానసిక, పని ఒత్తిళ్లు, వాతావరణంలో వివిధరకాల కాలుష్యాలు పెరగడం, జీవనశైలి అలవాట్లు, హైప్రొటీన్ పిజ్జాలు, బర్గర్లు వంటి తిండి ఎక్కువవడం, జిమ్‌లలో అధికంగా శ్రమించడం వంటి వాటితో యువతరం గుండెపోట్ల బారిన పడడం ఇటీవల పెరిగింది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం ‘మయోకార్డియల్ డిస్ఫంక్షన్’కు కారణమవుతోంది. యువత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం, అర్ధరాత్రిళ్లు, తెల్లారేదాకా మెలుకువగా ఉండడంతగ్గించాలి. ఇలాంటి వాటితో ‘సర్కాడియల్ రిథమ్’లో మార్పులొచ్చి హార్మోన్లు, మెటబాలిజమ్‌లో మార్పులొస్తున్నాయి. కుటుంబంలో గుండె సంబంధిత సమస్యలున్న వారుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. –డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ బీపీ, షుగర్ కంటే స్ట్రెస్ డేంజర్ పోస్ట్ కోవిడ్‌లో సడెన్ కార్డియాక్ మరణాలు కొద్దిగా పెరిగాయి. దీనితో పాటు యువకుల్లో, ముఖ్యంగా కాలేజీ చదువుతున్న వారిలో ‘డ్రగ్స్ అడిక్షన్’అనేది పెరిగింది. కొకైయిన్, గంజాయి వంటి మాదకపదార్థాల వాడకం ‘కరోనరీ వాసెస్ ప్లాజె మ్’కు దారితీస్తుంది. కరోనా బారిన పడటం, డ్రగ్స్ వినియో గం వంటి వాటితో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాట్లు, డ్రగ్స్ తీసుకోవడం వంటి వల్ల హార్ట్ అటాక్‌కు ఎక్కువ అవకాశాలుంటాయి. యంగ్ జనరేషన్ ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటు పడడం, వాయు కాలుష్యం వంటివి కూడా తోడై గుండెపోటుకు కారణమౌతున్నాయి. గతంలో 40, 50 ఏళ్లకు పైబడిన షుగర్, బీపీ వంటివి ఉన్నవారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లలోపు వారికే ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నాయి. యువతరం కాలేజీల్లో చదువుపరంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. షుగర్, బీపీ వంటి వాటి కంటే కూడా స్ట్రెస్ అనేది యువకుల్లో మరింత ప్రమాదకరమైనదిగా మారింది. గుండె జబ్బులకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. క్రీడలు ఆడేటప్పుడు ఛాతీనొప్పిగా అనిపించినా, బాగా చెమటలు పట్టినా, ఊపిరాడకపోయినా, కొంచెం అసౌకర్యంగా అనిపించినా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయాలి. యోగ వంటివి అలవాటు చేసుకోవడం, ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, డాక్టర్ల ద్వారా సందేహాల నివృత్తి చేసుకుంటే ఇది పెద్దసమస్యగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. – డా. ఓరుగంటి సాయి సతీష్, ఫ్రొఫెసర్, కార్డియాలజీ హెడ్, యూనిట్ 1, నిమ్స్ -
థర్డ్‌వేవ్ నుంచి గట్టెక్కినట్టే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి గట్టెక్కినట్టేనని అధికారులతో పాటు వైద్యనిపుణులూ భావిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఎంత ఉధృతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు మృతుల సంఖ్య ఎక్కువే. మొదటి, సెకండ్ వేవ్‌లలో తీవ్ర భయాందోళన సృష్టించిన కరోనా.. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపించకపోవడంతో జిల్లాలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వేవ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల్లో 14.4 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. సెకండ్‌వేవ్‌లో ఈ సంఖ్య 17 శాతానికి పెరిగింది. థర్డ్‌వేవ్‌లో మూడు శాతం వరకు మాత్రమే వెళ్లింది. ఈ నెల మూడో తేదీ నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,095గా ఉంది. 12వ తేదీ నాటికి 610 కేసులు మాత్రమే. దీన్ని బట్టి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పుకోవచ్చు. జిల్లాలో 15 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా శనివారం నాటికి ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. అయినా అప్రమత్తంగానే... మొదటి వేవ్, సెకండ్‌వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదనేది తెలిసిందే. అయినా సరే ఏమరుపాటుగా ఉండకూడదని, మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో కోవిడ్ భయం పోయిందని, వైరస్ ప్రభావం లేదు కదా అని ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోస్, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్, 15–18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక టీకా డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. -
'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'
సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత) రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. -
ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఈ నాలుగు అంశాలు కీలకం: ఐసీఎంఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ మరియు అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకేఅవకాశం ఉందని తెలిపారు.అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని విషయాలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ రానుంది, కానీ కేసుల ఉధృతి మాత్రం రెండో వేవ్ కంటే తక్కువగానే ఉంటుందని డాక్టర్ పాండా ఎన్డీటీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణిస్తే అది థర్డ్ వేవ్ విస్తరణకు దారి తీస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా దాటేసే పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే కొత్త వేరియంట్‌ను రోగనిరోధక శక్తి నిరోధించినా, వేగంగా విస్తరించే లక్షణంతో లాంటి రెండు కారణాలు థర్డ్‌వేవ్‌కు కారణంగావచ్చు అని పాండా తెలిపారు. ఇక నాలుగవ కారణంగా కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే, అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని డాక్టర్ పాండా చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ ఇప్పటికే దేశాన్ని తాకాయి కనుక డెల్టా వేరియంట్ వలన ముప్పు ఉండకవపోచ్చని అభిప్రాయపడ్డారు. కాగా థర్డ్‌వేవ్ అనివార్యమని ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్ విస్తరణ ద్వారా కోవిడ్ -19 మూడో దశ "ప్రారంభ దశలో" ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. సుమారు 111 కి పైగా దేశాలలో దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్ఫెక్షన్ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇలా వస్తే టీకాల్లో లోపం వల్లనో.. వేసేటపుడు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లనో ఇలా జరుగుతోందని అనవసర అనుమానాలు, భయాలు పెట్టుకోవద్చని చెబుతున్నారు. ‘బ్రేక్ థ్రూ’ఇన్ఫెక్షన్ల కారణంగా చాలా తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారని, అయితే లక్షణాలు తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో దాదాపు 75 శాతం పోలీసులకు రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 6 వేల మంది కోవిడ్ బారినపడ్డారు. అందులో దాదాపు 30 మంది వరకు మరణించారు. ఈ విషయంలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. టీకా వేసుకున్నా మాస్కు తప్పనిసరి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్కులు పెట్టుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని కాపాడుకోవాలి. అందుకోసం పోషక విలువలున్న సమతుల ఆహారం, మంచినిద్ర, తగిన వ్యాయామం మేలు చేస్తాయి. కొన్ని వైరస్లలో ఇమ్యూనిటీని చాకచక్యంతో తప్పించుకునే స్వభావంతో పాటు అదను చూసుకుని దాడిచేసే తత్వం ఉంటుంది. ఇమ్యూన్ ఎస్కేప్ లేదా వ్యాక్సిన్ ఎస్కేప్ వేరియెంట్ కూడా ప్రస్తుతం కోవిడ్ ఉన్నా లేదా గతంలో వచ్చి తగ్గినా ఈ వైరస్ శరీరంలోని రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకుంటోంది. కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు కొత్త మార్గాలు, పద్ధతులు వెతుక్కుని దాడి చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా సమర్థత, సామర్థ్యంతో పాటు వైరస్ దాని కంటే పైచేయి సాధించే పరిస్థితుల్లో, రోగ నిరోధకశక్తి సరిగా లేని వారు, మాస్కులు ఇతర జాగ్రత్తలు పాటించకపోతే రెండు డోసులు వేసుకున్నా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అవయవాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశాలు తక్కువ. – డా.సతీశ్ ఘంటా, నియోనేటల్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ నిపుణులు, లిటిల్ స్టార్స్ ఆస్పత్రి 30% మందికి ఇన్ఫెక్షన్ రావొచ్చు.. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత కూడా దాని సామర్థ్యం 70–80 శాతమే. టీకా తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మందికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. టీకా తీసుకున్నాక వైరస్ సోకినా 95 శాతం మందిలో సీరియస్‌గా మారదు. ప్రస్తుతం వచ్చిన టీకాలన్నీ మోనోవాలెంట్, స్పైక్ ప్రోటీన్ ఆధారితమైనవే. మోనోవాలెంట్ అంటే సింగిల్ వైరస్‌ను కేంద్రంగా చేసుకుని చేసినవి. నాలుగైదు వేరియెంట్లను కలిపి తయారు చేస్తారు. స్పైక్ ప్రోటీన్లు ఒక్కటే కాకుండా యాంటీబాడీస్ చాలా ఉంటాయి. వాటి లక్ష్యంగానూ టీకాలు వాడాల్సి ఉంది. అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ ‘మొదటి తరం’వ్యాక్సిన్లు. ఇవి అత్యవసర వినియోగానికి, మరణాలు తగ్గించే ఉద్దేశంతో తెచ్చినవి మాత్రమే. – డా. కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి,మెడికల్ కాలేజి జాగ్రత్తగా లేకపోతే ఎవరికైనా సోకొచ్చు వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ రాదని, వైరస్ సోకదని అనుకోవద్దు. తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాల్సిందే. జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా వేసుకున్నా ఇన్ఫెక్షన్ సోకుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరణాలు సంఖ్య తగ్గుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మాస్కుల ధరించకపోతే ఎవరికైనా ఇది సోకవచ్చు. ఇప్పటికే టీకాలు తీసుకున్న వారిలో చాలా తక్కువ మందికే సోకుతోందని, ఒకవేళ సోకినా కూడా చాలా తక్కువ మందే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందోనని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కాలేదంటే వివిధ వైరస్ వేరియెంట్లు, మ్యుటేషన్లపైనా ఇది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఎలాంటి సందేహాలు లేకుండా అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలి. – డా.వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి... ► రెండు డోసులు వేసుకున్నా ఆ వ్యక్తికి వ్యాక్సిన్ నుంచి తక్కువ రోగనిరోధక స్పందన శక్తి లభిస్తే ‘బ్రేక్ థ్రూ’ ఇన్ఫెక్షన్ సోకచ్చు. అన్నిరకాల టీకాల్లోనూ ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ సోకినా లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. ► ఏ వ్యాక్సిన్‌తో అయినా వందకు వంద శాతం రక్షణ ఇవ్వదన్న విషయాన్ని గ్రహించాలి. ► రెండోడోస్ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే రక్షణ ఏర్పడుతుంది. ఆ లోగా ఇన్ఫెక్షన్ సోకొచ్చు. ► సెకండ్‌వేవ్‌లో డబుల్ మ్యుటేషన్ వైరస్ వ్యాప్తి తీవ్రత దీనికి కొంత కారణమై ఉండొచ్చు. ► మాస్కు, భౌతికదూరం పాటించడం, గుంపుల్లో చేరకపోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఇళ్లలో విస్తారంగా గాలి వీచేలా చూసుకోవడం కొనసాగించాలి. చదవండి: డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా? Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ -
‘వ్యాక్సిన్ల మధ్య విరామం ఎక్కువైతే ముప్పే’
వాషింగ్టన్: కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇదే జరిగిందని చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం టీకా వేయాలని సూచించారు. గత నెలలో భారత ప్రభుత్వం టీకాల మధ్య విరామ సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకరులు దీనిపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఫౌసీ ఈ విధంగా స్పందించారు. ఇక అమెరికాలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ బలంగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ఫౌచీ సూచించారు. వ్యాక్సిన్ల మోతాదుల మధ్య అనువైన విరామం సమయం.. ఫైజర్‌కు మూడు వారాలు, మోడర్నాకు నాలుగు వారాలుగా తెలిపారు. విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు. టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.ఇటీవల భారత్‌లో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు పెంచిన ప్రభుత్వం ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా? -
కోవిడ్-19 : మరోసారి పాజిటివ్ వస్తే!
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా, చైనాల తర్వాత భారత్‌లోనూ కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులు కొందరు తిరిగి ఇన్ఫెక్షన్కు గురైన కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. మొహాలీ ఆస్పత్రి నుంచి ఈ వారంలో డిశ్చార్జి అయిన 10 మంది రోగులకు తిరిగి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మహమ్మారి నుంచి కోలుకున్న ఓ రోగికి తిరిగి పాజిటివ్ రాగా, కేరళలోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. రక్తంలో తగినస్ధాయిలో యాంటీబాడీలు కలిగిన కోలుకున్న రోగులు తిరిగి ఎందుకు వైరస్ బారినపడుతున్నారనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. చండీగఢ్‌లో కోవిడ్-19 ఆస్పత్రిని నిర్వహిస్తున్న వైద్య నిపుణులు దీనిపై స్పందించారు. ఇన్ఫెక్షన్, వ్యాధి రెండూ వేర్వేరని, వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుందని, వైరస్ ఎన్నో రెట్లు పెరిగి, వ్యాధినిరోధక శక్తిని అధిగమిస్తే వ్యాధికి దారితీస్తుందని పీజీఐ చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ అశిష్ భల్లా పేర్కొన్నారు. రోగి వ్యాధినిరోధక శక్తి వైరస్‌ను అధిగమించినా కరోనా వైరస్ శరీరంలో ఉంటుందని, లక్షణాలు లేనంతవరకూ శరీరంలో వైరస్ కొద్దిపాటిగా ఉంటే అది వ్యాధి కాబోదని వివరించారు. వైరస్ చాలా వేగంగా స్వభావం మార్చుకుంటుందని, కొత్త స్ట్రెయిన్ అభివృద్ధి అయితే తిరిగి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని..చైనా, దక్షిణ కొరియాల్లో ఇదే జరిగిందని ప్రొఫెసర్ భల్లా పేర్కొన్నారు. కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగులు పదిరోజులు ఐసోలేషన్‌లో ఉంటే ఆ తర్వాత వ్యాధి వారి నుంచి మరొకరికి వ్యాపించదని అకడమిక్ డీన్ ప్రొఫెసర జీడీ పూరీ వివరించారు. కోవిడ్-19 సంక్రమణను అడ్డుకుంటేనే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటి మూడు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి : ఒడిశాలో మళ్లీ లాక్డౌన్ -
ప్రతి ఏడాది కరోనా పలకరింపులు!
బీజింగ్: కోవిడ్-19ను పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు కారణమైన సార్స్-కోవ్-2 సీజనల్ ఫ్లూ మాదిరిగా ప్రతియేడు ఉనికి చూపెడుతుందని వెల్లడించారు. మనిషి జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జిన్‌కి పేర్కొన్నారు. ఇక ఇదే అభిప్రాయాన్ని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్చువస్ డైరెక్టర్ ఆంథోని ఫాసీ కూడా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: ఆకాశంలో అంతు చిక్కని వస్తువు!) లక్షణాలు లేని కేసులతోనే చిక్కు... భారత్‌లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా ప్రపంచ మానవాళిపై సార్స్-కోవ్-2 తిష్ట వేసుకు కూర్చుందని చెప్తున్నారు. అత్యధిక ట్రాన్స్మిషన్ రేటు కలిగిన కోవిడ్ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుందని, వారి ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలున్నాయిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్లంకర్ తెలిపారు. వైరస్‌కు గురైన వ్యక్తుల్లో తొలివారం పాటు పెద్దగా లక్షణాలు బయటపడకపోవడంతో.. దాదాపు 44 శాతం వైరస్ వ్యాప్తి అలాంటి కేసుల వల్లే జరగుతుందని పలు అధ్యయనాలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఎపిడెమాలజిస్టు డాక్టర్ లలిత్ కాంత్ అభిప్రాయపడ్డారు. అయితే, సమర్థవంతమైన వ్యాక్సిన్‌తో కోవిడ్ చెక్ పెట్టొచ్చునని తెలిపారు. (చదవండి: భారత్‌లో వెయ్యి దాటిన కరోనా మరణాలు..) -
పిల్లలు జాగ్రత్త
సాక్షి,అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో పిల్లలను వృద్ధులకు దూరంగా ఉంచితేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 6.4 శాతం మంది 15 ఏళ్ల లోపువారే ఉండడంతో పెద్దలే జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఇలాంటి చిన్నారులకు కరోనా పాజిటివ్ అయినప్పుడు పెద్దగా లక్షణాలు కనిపించవని, దీనివల్ల ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో వచ్చిన కేసులను పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని తేల్చారు. ఈ నేపథ్యంలో పెద్దలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వారు ఏం అంటున్నారంటే... ► 15 ఏళ్లలోపు చిన్నారుల్లో కరోనా సోకినా తొందరగా లక్షణాలు కనిపించవు ► వీరు బయట తిరిగినా, అపరిచిత వ్యక్తులతో తిరిగినా మనమే వారికి నిర్ధారణ చేసి గుర్తించాలి ► వీలైనంత వరకూ వారిని బయటకు పంపించకుండా ఉండాలి ► మన రాష్ట్రంలో 37 మంది 15 ఏళ్లలోపు చిన్నారులు కరోనా పాజిటివ్‌గా నమోదయ్యారు ► వీరిలో 90% మందికి ఢిల్లీనుంచి వచ్చిన వారి ద్వారా సోకినవే ► ఇందులో పలువురు చిన్నారులు తమ గ్రాండ్ పేరెంట్స్ (అమ్మమ్మ, తాతయ్య)లకు అంటించారు ► చిన్నారులకు పాజిటివ్ వస్తే ఇంట్లోనే కోలుకోవచ్చు కానీ పెద్దవాళ్లకు సోకితే చాలా ఇబ్బందులు వస్తాయి ► చిన్నారులున్న ఇంట్లో పెద్ద వాళ్లు ప్రత్యేక గదుల్లో ఉండాలి పెద్దలే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో చిన్నారులది తప్పుకాదు. పెద్దలే జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను, వృద్ధులను వేరు వేరు గదుల్లో ఉండేలా చర్యలు తీసుకోండి. –డా.కె.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, అదనపు సంచాలకులు, వైద్య విద్యా శాఖ -
కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేత, పాక్షికంగా ఆంక్షల సడలింపు ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా అందరూ కరోనా నుంచి రక్షణకు సుదీర్ఘకాలం పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఈ మహమ్మారి నుంచి సురక్షితులమని, తమకు మినహాయింపు ఉంటుందని ఎవరూ భావించొద్దు.. ప్రతి ఒక్కరూ అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాల్సిందే. మాసు్కలు కట్టుకోవడం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి కనీసం ఏడాది పాటు కొనసాగించాల్సిందే. సాధారణ జలుగు, దగ్గు రూపంలో మామూలు ఫ్లూ మాదిరిగా సోకినా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కనీసం మనకు సోకిందని తెలియకుండా ఈ వైరస్ వెళ్లిపోయేందుకు, దానికి అందరూ అలవాటు పడటానికి మరికొంత కాలం (మరో సంవత్సరం) పడుతుంది. కరోనా మహమ్మారి గురించి నిష్ణాతులైన వైద్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడమే కాకుండా పలు హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా కేన్సర్, కిడ్నీ, ఇతర రోగులు ఎలాంటి పద్ధతులు పాటించి సురక్షితంగా ఉండాలన్న దానిపై వివిధ రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది. వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. షుగరున్న వారికి సమస్యలు ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్‌తో పాటు గుండె, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి. వేళకు మందులు వేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మనుషుల మధ్య దూరాన్ని పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలి. లాక్‌డౌన్‌తో 60 ఏళ్లకు పైబడిన వారు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇళ్లలోనే కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉన్న వారిలో కాంప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర పశి్చమ దేశాల్లోని డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న పెద్ద వయసు్కల్లో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకినట్లు, ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తేలింది. – బెట్రైస్ ఆనీ, నిమ్స్ హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్ మరో రెండేళ్లు ఇదే పరిస్థితి ‘మరో రెండేళ్ల దాకా ఏదో ఒక రూపంలో ఈ వైరస్ బయటపడుతూనే ఉండే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ రావడానికి ఏడాది, ఏడాదిన్నర పట్టొచ్చు. అందరూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. లాక్డౌన్ ఎత్తేశాక కూడా సినిమా హాళ్లు, మాల్స్ వంటివి ఉండవు కాబట్టి మతపరమైన అంశాలతో పాటు సమూహాలు ఒక్కచోట గుమికూడకుండా, విదేశీయాత్రలు, విహార యాత్రలకు వెళ్లకుండా, పెళ్లిళ్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూసుకోవాలి. యువత, ఆరోగ్యవంతులైన వారి ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తున్నందున వారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా వారి ఇళ్లలో, బయటా పెద్ద వయసున్న వారు, ఏదైనా జబ్బు బారిన వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.’ – డా.యలమంచిలి రవీంద్రనాథ్, జనరల్ సర్జన్ (ఖమ్మం) కిడ్నీ పేషెంట్లు బయటకు రావొద్దు ‘కిడ్నీ పేషెంట్లు ఎవరూ అస్సలు బయటకు రావొద్దు. మందులు అస్సలు మానేయొద్దు. ఇళ్లలోనూ క్వారంటైన్ పాటించాలి. ఎవ్వరినీ కలవొద్దు. జలుబు, దగ్గు, విరేచనాలు వంటివి ఉన్నా, వైరస్ సోకడంపై ఏ మాత్రం అనుమానం అనిపించినా బ్లడ్‌టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. మాసు్కలు, శానిటైజర్లు వాడుతూ.. పరిశుభ్రంగా ఉండాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ మారి్పడి చేయించుకున్న వారు.. డాక్టర్ల సూచనల మేరకు తమకు సూచించిన ఆహారాన్ని, పండ్లను, కూరగాయలు, నాన్‌వెజ్, పండ్ల రసాలు తీసుకోవాలి.’ – డా.భూషణ్‌రాజు, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ కళ్ల కలక వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి ‘కంజెక్టివిటీస్/మద్రాస్ ఐ వంటి కళ్ల కలక ఎవరికి వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దగ్గు, జలుబుతో పాటు కంటి ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటు కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలతో కూడా ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. కళ్ల కలక వచి్చన వారు వెంటనే ఐసోలేషన్ పాటించాలి. చేతులతో కళ్లను తాకినప్పుడు, ఎదుటివారి తుంపరలు (డ్రాప్‌లెట్లు) పడినప్పుడు, అప్రయత్నంగా కళ్లు నలుపుకున్నపుడు చాలా వేగంగా ఇది వ్యాపిస్తుంది. అయితే దీని నుంచి రికవరీ కూడా బాగానే ఉంది. దీని వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు కూడా దోహదం చేస్తున్నందున, వర్షాకాలంలో ఇది మరింత తీవ్రరూపం తీసుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం తర్వాత చలికాలం కూడా దీని విజృంభణకు తోడ్పాటునిచ్చే అవకాశాలున్నందున అందరూ కచి్చతమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.’ –డా. దీప, కంటి వైద్య నిపుణురాలు ఒక్కరోజు కూడా మందులు మానొద్దు గుండె జబ్బున్న వారు ముఖ్యంగా స్టెంట్ వేసిన వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు రొటీన్‌గా వేసుకునే మందులు ఒక్కరోజు కూడా గ్యాప్ రానివ్వొద్దు. స్టెంట్ పడిన వారు ఒక్కరోజు మందులు మానినా దాని ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇళ్లలోనే ఉండటం వల్ల కాలక్షేపానికి ఏదో ఒకటి తినడం, వ్యాయామం చేయకపోవడం కూడా ప్రభావం చూ పే అవకాశాలున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, పండ్లు, తాజా కూరగాయాలు వంటివి తీసుకోవాలి. యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురికాకూడదు. ధ్యానం, మంచి సంగీతం వినాలి. గుండెనొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్ లేదా టెలీ మెడిసిన్ ద్వారా డాక్టర్ల సలహా ప్రకారం మందులు మార్చడం, డోస్‌ను పెంచడం చేయాలే తప్ప సొంతంగా డోస్ పెంచుకోవద్దు. – డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ గర్భిణులకు 4 విజిట్స్ చాలు ‘వైరస్ సొకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు నాలుగు విజిట్లకు వస్తే సరిపోతుంది. ఇంట్లో కూడా వారు మనుషుల మధ్య 4 అడుగుల దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఆన్ లౌన్, బయటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇళ్లలో వండిన వేడి వేడి ఆహారాన్నే తీసుకోవాలి. ప్రతి అర గంటకు ఒకసారి చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇళ్లలోని డోర్ నాబ్ లను స్పిరిట్‌తో శుభ్రం చేస్తుండాలి. మ హిళలు, వృద్ధులు, మధుమేహం, హైపర్ టెన్ష న్ ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.’ – డా.కృష్ణవేణి, గైనకాలజిస్ట్ కేన్సర్ రోగులూ.. ఫ్రిడ్జ్లోనివి తినవద్దు ‘కేన్సర్ పేషెంట్లు చల్లటి పదార్థాలు ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వేళకు వేడి వేడి సూప్‌లు, ప్రోటీన్లున్న తాజా ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు 3,4 సార్లు బట్టలు మార్చుకోవాలి. వారి బట్టలను ఉతికాక ఎండలో ఆరేలా చూడాలి. ఈ వైరస్ వ్యాప్తి గురించి అనవసర భయాందోళనలకు గురికావొద్దు. వేడి నీటితో తరచుగా పుక్కిలించాలి. ప్రతిరోజూ శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. వీరికి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. మా ఆస్పత్రిలో ఇన్పేషంట్లకు ప్రతిరోజూ చెకప్‌లు నిర్వహించి ఏ కొంచెం అనుమానమున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం.’ – డా.జయలత, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ చదవండి: కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో.. చైనా పీపీఈ కిట్లు నాసిరకం! -
ఇవాంకా వెంట అమెరికా వైద్య బృందం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్న ఇవాంకా వెంట ఆ దేశానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తోంది. పర్యటనలో భాగంగా ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే తగిన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు వేదిక వద్ద ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసి.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో కూడిన మూడు బృందాలను అందుబాటులో ఉంచనుంది. అందులో కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, అనెస్థీషియన్ సహా నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ప్రతినిధుల్లో ఎవరికైనా ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ఇక సదస్సు ప్రాంగణం బయట మూడు అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేలా.. హైటెక్‌సిటీ సమీపంలోని కిమ్స్, పంజాగుట్ట నిమ్స్, అపోలో ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు సంబంధించి కూడా వైద్య సేవల కోసం ఏర్పాట్లు చేశారు. -
నెలలు నిండకముందే..నూరేళ్లు నిండుతున్నాయి!
- రాష్ట్రంలో నెలలు నిండకుండా జన్మిస్తున్న శిశువుల మరణాలు 54 శాతం - దేశ సగటు 35 శాతం కంటే ఎంతో అధికం - యునిసెఫ్ సదస్సులో నిపుణుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నవజాత శిశు మరణాలు ఆందోళనకర స్థారుులో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల మరణాల శాతం 54. జాతీయ స్థారుులో ఈ సగటు 35 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 35 లక్షల మంది శిశువులు నెలలు నిండకుండా జన్మిస్తున్నారు. దీని ఫలితంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో వీరిలో 31 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 1.5 కోట్ల మంది శిశువులు పుడుతుంటే... వారిలో పది లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం... నెలలు నిండకుండానే పుట్టడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తంగా నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం అత్యావశ్యకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎన్ఎఫ్ సెక్రటరీ డాక్టర్ సురేందర్‌నాథ్ తెలిపారు. ‘ప్రపంచ ప్రి మెచ్యూరిటీ డే’సందర్భంగా నగరంలో గురువారం యునిసెఫ్ సదస్సు నిర్వహించింది. ఇందులో వైద్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అతిచిన్న వయస్సులోనే గర్భందాల్చడం, మలేరియా లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, పౌష్టికాహార లోపం, దాని కారణంగా వచ్చే రక్తహీనత, తీవ్రమైన మధుమేహం, బీపీ లాంటి కారణాలతో నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు. ఇందుకు కారణమైన ఇన్ఫెక్షన్సని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు నివారించగలిగినట్టు తమ పరిశోధనలో వెల్లడైందని యునిసెఫ్ హెల్త్ చీఫ్ డాక్టర్ యరోన్ వాల్మన్ తెలిపారు. నివారణ ఎలా? తెలంగాణలో 13 నుంచి 15 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నారుు. ఫలితంగా చిన్న వయస్సులోనే గర్భధారణ జరిగి, నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని, దానితో పాటు పౌష్టికాహార లోపం, రక్తహీనతలను నివారించే దిశగా చర్యలు తీసుకోవడం అత్యవసరంగా డాక్టర్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. సరైన మోతాదులోనే యాంటీనాటల్ స్టెరాయిడ్సని వాడటం కూడా నెలల నిండకుండా సంభవించే శిశుజననాలను అరికట్టవచ్చునని అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ఎంసీహెచ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమా సింఘ్ తెలిపారు. ఈ విషయమై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రంలో విస్తృతంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేష్‌కుమార్ చెప్పారు. అతి చిన్న ప్రయత్నాలతోనే నెలలు నిండకుండా సంభవించే శిశువుల జననాలను, అలాగే మరణాలను 75 నుంచి 80 శాతం తగ్గించే అవకాశాలున్నాయని యునిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజీవ్ ఉపాధ్యాయ అన్నారు. యునిసెఫ్ పర్యవేక్షకులు ప్రసూన్ తదితరులు పాల్గొన్నారు. -
‘జంక్’తో జాగ్రత్త!
పిజ్జాలు, బర్గర్లతో అధిక కొవ్వు తగ్గించకుంటే ఆరోగ్యసమస్యలు తప్పవు నేడు ప్రపంచ జంక్‌ఫుడ్ డే మహబూబ్‌నగర్ క్రైం: ఆహార పదార్థాలను తినేముందు వాటి రుచి, ధరలు ఎంత అని మాత్రమే చూస్తాం. ధరకే పరిమితం కాకుండా అందులో కేలరీలను చూడమంటున్నారు వైద్యులు. విదేశాల్లో హోటళ్లలో వంటకంతో పాటు ఎన్ని కేలరీలు అనే విషయం కూడా మెనూలో ఉంటుంది. మన పట్టణాల్లోనూ హోటళ్లలో వీటిని పొందపరిస్తే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. రోజువారీ తీసుకునే ఆహారంలో మనకు కావాల్సిన కేలరీల కంటే పట్టణవాసుల్లో చాలామంది అదనంగానే తీసుకుంటున్నారు. వీటిని ఏ రోజుకారోజు కరిగించాల్సిందే. కానీ ఆ పని చేయకుండా మరిన్ని అదనపు కేటరీలను ఒంట్లోకి చేర్చుకుంటున్నారు. జంక్ అంటే చెత్త. జంక్ ఫుడ్ అంటే చెత్తతిండి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్, తదితర వాటిని జంక్‌ఫుడ్ అంటారు. ఇష్టం వచ్చినట్లు చెత్తతిండి తిని, దానికి తగ్గ వ్యాయామం చేస్తున్నామా అంటే చాలా మంది వద్ద సమాధానం ఉండదు. కేలరీల రూపంలో ఒంట్లో కొవ్వు పెరిగిన తర్వాత చింతించే బదులుగా మూడు పదుల వయస్సు నుంచే ఎదురుదాడి చేస్తే మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను నిత్యం వ్యాయామం చేయడంతో తరిమికొట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో అధిక సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. క్షణాల్లో తయారయ్యే వంటకంతో వచ్చే రుచికి అలవాటు పడి ఆరోగ్యం క్షీణించే విధంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా 13నుంచి 40ఏళ్ల వయస్సువారు ఇలాంటి ఫుడ్‌కు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఫాస్ట్‌పుడ్ సెంటర్స్‌తో పాటు బేకరీలలో పిజ్జా, బర్గర్లలో అధిక రసాయనాలు కలపడం వల్ల తక్కువ కాలంలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. జీర్ణం కాదు.. జంక్‌ఫుడ్‌లో ఎక్కువ కేటరీలు ఉండటం వల్ల త్వరగా జీర్ణం కాదు. దానికి తోడు ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఎవరూ కూడా కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం లేదు. దీనివల్ల పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు చేరుతుంది. ఆ తర్వాత రక్తపోటు, మధుమేహం, షుగర్, ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వారంలో రెండుమూడుసార్లు జంక్‌ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు తయారవుతుంది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లో అయిల్ ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. దానివల్ల కొత్త రోగాలు వస్తాయి. నెల రోజులు క్రమం తప్పకుండా బేకరి, ఫాస్ట్‌ఫుడ్ తింటే మనిషి శరీరంలో చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పెరిగి దానివల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌లో ఉప్పు, కారంతో పాటు రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తుంది. – డాక్టర్ వనం శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్, జిల్లాసుపత్రి -
జంక్జబ్బు
జూలై 21 జంక్‌ఫుడ్ డే ‘జంక్‌ఫుడ్ తింటే జబ్బులొస్తాయి...’ అని ఎవరైనా సలహాగా చెప్పబోతే ‘మాకు తెలీదేంటి’ అని వెంటనే బదులిస్తారు చాలామంది. జంక్‌ఫుడ్ తినడం వల్ల వచ్చే జబ్బులు, ఆ జబ్బులు కలిగించే తిప్పలు, ముప్పుల గురించి వైద్య నిపుణులు పత్రికల్లో రాసే వ్యాసాలను మాత్రం ఇలాంటి జనాలు శ్రద్ధగా చదువుతారు. అదంతా చదివేసి పత్రికను పక్కన పడేశాక మళ్లీ జంక్‌ఫుడ్ కోసం ఆవురావురుమంటూ అర్రులు చాస్తారు. జంక్‌ఫుడ్ తింటే వచ్చే జబ్బుల సంగతి అలా ఉంచితే, ఇటీవలి కాలంలో జంక్‌ఫుడ్ తినడమే పెద్ద జబ్బుగా మారిపోయింది. అగ్రరాజ్యాలు ‘జంక్’తున్నాయి జంక్‌ఫుడ్ అనర్థాలను గుర్తించిన అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే మేలుకొంటున్నాయి. ‘జంక్’జబ్బును వదలగొట్టుకోవడానికి నడుం బిగిస్తున్నాయి. పిల్లలను ఇలాంటి పనికిమాలిన ఆహారానికి దూరంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్థిక సరళీకరణల తర్వాత ‘అప్రాచ్య’దేశాల ‘జంక్’జబ్బు మన దేశాన్నీ పట్టుకుంది. మొదట్లో మహానగరాల్లోకి దిగుమతైన ‘జంక్’జబ్బు ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడ్డ పిల్లలు వయసుకు మించిన సైజుకు పెరిగిపోతున్నారు. అసలే ఆటలకు అవకాశం లేని చదువుల భారం... ఆట మైదానాలే లేని ప్రైవేటు స్కూళ్లు... ఇక ఇళ్లకొచ్చాక టీవీలతో లేదా కంప్యూటర్లలో వీడియోగేమ్‌లతో కాలక్షేపం. కదలకుండా కానిచ్చే ఈ కాలక్షేపానికి తోడు నోటికి పనిచెప్పడానికి ప్లేటులో జంక్‌ఫుడ్, చేతిలో కూల్‌డ్రింక్ సీసా... ఇదీ పరిస్థితి. భావి భారత పౌరులు కాస్తా భావి భారత భారీకాయులుగా ‘ఎదుగు’తున్నారు. పొగాకు ఉత్పత్తుల మీద భయంకరమైన బొమ్మలు ముద్రించేలా చర్యలు తీసుకున్న మన ప్రభుత్వం ఫాస్ట్‌ఫుడ్ ప్యాకేజీలపై ఆరోగ్య హెచ్చరికలు ముద్రించేలా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు. ఆ పేరు ఎలా వచ్చిందంటే..? ‘జంక్’ అంటే చెత్త. మరి ‘జంక్‌ఫుడ్’ అంటే చెత్తతిండి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని ఆహారాన్ని పవిత్రంగా పూజించే దేశం మనది. అలాంటి దేశంలో తిండికి చెత్త విశేషణాన్ని తగిలించడం తగునా! అయితే, నానా అనర్థాలను కొని తెచ్చే ‘అప్రాచ్య ఆహారాన్ని’... అదేనండీ! పడమటి దేశాల తిండిని చెత్తతిండి ఉరఫ్ జంక్‌ఫుడ్ అనడంలో తప్పేమీ లేదని వాదించేవారు లేకపోలేదు. ఆవిరి కుడుములు, దిబ్బరొట్టెల దగ్గరే ఆగిపోయిన అలాంటి సనాతనుల టేస్టు ఈనాటి పిజ్జా, బర్గర్ల హైటెక్కుటమార తరానికి రుచించదనుకోండి. అది వేరే విషయం. నాలుకకు రుచి తప్ప పదార్థంలో పనికొచ్చే పోషకాలేవీ లేకపోగా, ఒంటికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటివి మితిమీరి ఉండే ఆహార పదార్థాలనే స్థూలంగా జంక్‌ఫుడ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే..? పడమటి దేశాల్లో 1960ల కాలంలోనే ఇలాంటి పనికిమాలిన తిండిని జంక్‌ఫుడ్ అనడం మొదలైంది. పాప్ హోరుకు కుర్రకారు ఉర్రూతలూగే కాలంలో ‘జంక్‌ఫుడ్ జంకీ’ అనే పాట 1976లో విపరీతంగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి పిజ్జాలు, బర్గర్లు, హాట్‌డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీములు, కార్బొనేటెడ్ కూల్డ్రింకులు వంటి సమస్త పదార్థాలను జంక్‌ఫుడ్ అనడం ప్రాచుర్యంలోకి వచ్చింది. దిల్మాంగే మోర్ ≈ జంక్‌ఫుడ్‌లో మోతాదుకు మించి ఉండే కొవ్వులు నేరుగా మెదడుపై విపరీత ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి తింటే ఆ ప్రభావం రోజుల తరబడి ఉంటుంది. దానివల్ల మరింతగా తినాలనే కోరిక రేకెత్తుతుంది. ఆ కోరికను అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. దాంతో ఆకలితో నిమిత్తం లేకుండానే అతిగా తినేయడం జరుగుతుంది. ≈ జంక్‌ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార వ్యూహాలు పిల్లలను ఈ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేదే జంక్ ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార సూత్రం. ఈ సంస్థలు తమ ప్రకటనల్లో 80 శాతం ప్రకటనలను వారాంతం రోజైన శనివారమే టీవీల్లో పిల్లల కార్యక్రమాలు వచ్చేటప్పుడు ప్రసారం చేస్తున్నాయి. టీవీల్లో వాటిని చూసిన పిల్లలు మారాం చేయడం, సముదాయించలేని తల్లిదండ్రులు కొనివ్వడం అసంకల్పితంగానే జరిగిపోతున్నాయి. ≈ జంక్‌ఫుడ్ తినే అలవాటు అమెరికాలో 1920ల నాటికే మొదలైంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టీవీ ప్రకటనలు పెరగడంతో అమెరికాలో జంక్‌ఫుడ్‌పై జనాలకు వేలంవెర్రి పెరిగింది. ≈ జంక్‌ఫుడ్ తయారీలో వాడే ప్రమాదకర రసాయనాలు నానా అనర్థాలను కలిగిస్తాయి. ఉదాహరణకు జంక్‌ఫుడ్‌లో ఎక్కువగా వాడే సోడియం బెంజోయేట్ పిల్లల్లో అతి చురుకుదనం (హైపర్ యాక్టివిటీ) వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఇవీ అనర్థాలు స్థూలకాయం జంక్‌ఫుడ్‌లో అతిగా ఉండే కొవ్వుల వల్ల ఒంటి బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే తిప్పలు షరా మామూలే! రక్తపోటు జంక్‌ఫుడ్‌లో ఉప్పుతో పాటు సోడియం రసాయనాలు ఎక్కువగా వాడతారు. వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం జంక్‌ఫుడ్‌లో అతిగా వాడే చక్కెర, పిండి పదార్థాల వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తలెత్తుతుంది. గుండెజబ్బులు జంక్‌ఫుడ్‌లో రుచి కోసం అతిగా వాడే కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెజబ్బులకు దారి తీస్తాయి. అతిగా ఉండే పదార్థాలు ఉప్పు మితంగా తింటేనే హితవు చేసే పదార్థం ఇది. జంక్‌ఫుడ్ నిల్వ ఉండేందుకు ఉప్పును మితిమీరి ఉపయోగిస్తారు. చక్కెర రుచికి తీపిగానే ఉంటుంది. అతిగా తింటే బతుకే చేదెక్కిపోతుంది. కూల్డ్రింకులు, ఐస్‌క్రీముల్లో మోతాదుకు మించి వాడతారు. కొవ్వులు జంక్‌ఫుడ్ పదార్థాలను ఎక్కువగా నూనెలో వేపుతారు. అందువల్ల అవి తింటే ఒంట్లోకి అనవసరపు కొవ్వులు చేరుతాయి. పిండిపదార్థాలు - అనవసర రసాయనాలు జంక్‌ఫుడ్‌లో ముఖ్యమైన ముడిసరుకు పిండి పదార్థాలే. రంగు, రుచి కోసం అనవసర రసాయనాలనూ వాడతారు. -
నీటిలోనే ఉందా.. ఎవరికైనా సోకిందా?
- రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూడటంపై ప్రజల ఆందోళన - 20 నుంచి 26 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సాక్షి, హైదరాబాద్: మహానగర డ్రైనేజీ నీటిలో బయటపడిన పోలియో వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ మురుగునీటిలోనే ఉండిపోయిందా... లేక అక్కడి నుంచి తాగునీటిలో కలసి పిల్లలెవరికైనా సోకిందా... అన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్నారు. పిల్లల్లో ఉంది కాబట్టే అది మలం ద్వారా డ్రైనేజీలోకి వెళ్లి ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వారం రోజులపాటు ప్రత్యేకంగా పోలియో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. నోటి ద్వారా వ్యాక్సినేషన్ వల్లేనా? అమెరికా వంటి దేశాల్లో పోలియో వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. పోలియో వైరస్ ద్వారానే తయారైన వ్యాక్సిన్‌ను మన వద్ద ఎక్కువగా చుక్కల రూపంలో అందిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి వైరస్ రాకుండా నిరోధిస్తుంది. అయితే చుక్కల రూపంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి వైరస్ బతికుండే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన పిల్లలు మలం విసర్జిస్తే డ్రైనేజీ ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలుంటాయంటున్నారు. అదే ఇంజెక్షన్ల ద్వారా ఇస్తే వైరస్ విస్తరించే అవకాశాలుండవంటున్నారు. ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాత్రం 2 రూపాల్లోనూ ఇచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలియో రహితంగా ఎలా ప్రకటించారు? నూటికి నూరు శాతం పోలియో రహిత దేశంగా 2014 మార్చి 27న భారత్‌ను ప్రకటించారు. పూర్తి స్థాయిలో నిర్మూలించకుండా ఇలా ప్రకటనలు చేయడం వల్ల పోలియో నిర్మూలనకు సంబంధించిన చర్యలు తగ్గాయన్న విమర్శలూ ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఢిల్లీలో వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత బిహార్, గుజరాత్‌లోనూ ఇది కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలియో రహిత దేశంగా ఎలా చెప్పుకోగలం? వాస్తవానికి తెలంగాణలో పోలియో వ్యాక్సినేషన్‌తోపాటు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా కూడా వ్యాక్సిన్ వేశారు. అయినా వైరస్ వెలుగు చూసిందంటే నిర్లక్ష్యం ఎవరిది.. కారణం ఏమిటి.. అన్నదానిపై చర్చ జరుగుతోంది. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష.. పోలియో వైరస్ సోకిందన్న నిర్ధారణతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులతో చర్చించారు. అంబర్‌పేట, బార్కస్, కంటోన్మెంట్, డబీర్‌పురా, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట్, మలక్‌పేట్, నాంపల్లి, పానిపురా, సీతాఫల్మండి, సూరజ్భాన్ తదితర ప్రాంతాల్లో పోలియో వైరస్ ఉండే అవకాశముందని గుర్తించారు. ఈ 12 ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ఈ ప్రాంతాల్లో 2.82 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాల్సిన అవసరం ఉందని అధికారులు నిర్ధారించారు. అపోహలు వద్దు.. పోలియో వైరస్‌పై ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలూ అక్కర్లేదు. వైరస్ వల్ల ఇతరులకు సోకిందన్న అనుమానాలు అవసరం లేదు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
ఫెయిలైన వారిని పాస్ చేసేశారు!
పాలకమండలి నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసిన ఎన్టీఆర్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా ప్రమాణాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాతరేసింది. పీజీ మెడికల్ - 2016 పరీక్షలు ఈనెల 24 న నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో.. కేవలం నాలుగు రోజుల ముందు (ఈనెల 20న) రహస్యంగా గ్రేస్ మార్కులు కలిపేసింది. తద్వారా వైద్యవిద్యలో ప్రతిభ, నైపుణ్యం లేని ఆ 8 మందిని పరీక్షల నుంచి గట్టెక్కించింది. ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు, వైద్య విద్యా ప్రమాణాలకు పాతరేయడమేనని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. ప్రభు త్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో గ్రేస్ మార్కులు కలిపేం దుకు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ నెల మూడో తేదీన ‘సాక్షి’ బట్టబయలు చేసింది. -
అంతా మా ఇష్టం!
అవసరానికి మించి పోలియో వ్యాక్సిన్ కొనుగోలు ఈ నెల 25తో ముగియనున్న వ్యాక్సిన్ గడువు గ్రేటర్లో మూడో విడత పల్స్‌పోలియో? ఇప్పుడెలా సాధ్యమంటున్న వైద్య నిపుణులు సిటీబ్యూరో: డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం వ్యాపారసూత్రం.. ఎంత అవసరమో అంత కొనడం ఓ పద్ధతి.. అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అవసరం లేకపోయినా 27వేల డోసుల పోలియో వ్యాక్సిన్‌ను అధికారులు కొనుగోలు చేసి వృథా చేశారు. ఈ ఒక్క ఉదంతం చాలు అధికారులకు పాలనపై ఎంతశ్రద్ధ ఉందో. అవసరం లేకపోయినా వాక్సిన్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత దాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకునేందుకు పథకం పన్నడం మామూలైపోయింది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 27 వేల డోసుల పోలియో వాక్సిన్ మిగిలిపోయింది. ఈ విషయం గమనిస్తే చుక్కల మందు వేసే కార ్యక్రమం ఎంత శ్రద్ధగా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకో వచ్చు. ఒక్కోడోసుకు రూ.110 ఖర్చవుతుంది. అంటే రూ. 29.70 లక్షల విలువైన వ్యాక్సిన్ మిగిలిపోతుందన్నమాట. ఈ నెల 25లోగా దీన్ని వినియోగించపోతే వ్యాక్సిన్ మొత్తం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు 9.9 లక్షల మంది ఉండగా, వీరిలో హైదరాబాద్ జిల్లాలో 5.84 లక్షల మంది, రంగారెడ్డి అర్బన్‌లో 4.95 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఏటా రెండుసార్లు పిల్లలకు వాక్సిన్ వేస్తారు. తొలివిడత కార్యక్రమంలో భాగంగా జనవరి 17 నుంచి 20 వరకు, రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 20-23 వరకు పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ పిల్లల నిష్పత్తికి మించి వాక్సిన్ కొనుగోలు చేయడమే కాకుండా మిగిలిన దాన్ని వదిలించుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో మూడోసారి పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించాలని అధికారులు చూస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యూపీహెచ్సీల కేటాయింపులోనూ.. హైదరాబాద్ జిల్లాలో 85 యూపీహెచ్‌సీలు ఉండగా ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 40-55 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో మెడికల్ ఆఫీసర్‌కు ఒక యూపీహెచ్సీ కేటాయించాలి. కానీ జిల్లాలో ఒక్కో అధికారికి రెండు మూడు కేంద్రాలు కేటాయించడం వివాదాస్పదమైంది. అంతేకాదు పోలియో కార్యక్రమ ప్రచారం కోసం ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు నుంచి ఐదు ఆటోలు ఏర్పాటు చేసి వీటికి మైక్‌లు అమర్చి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏ రోజు వేస్తున్నారు? ఎక్కడ వేస్తున్నారో వివరించాలి. ఇందు కోసం ఒక్కో వాహనానికి రోజు కు రూ.1200 చొప్పున అద్దె చెల్లిస్తుంది. కొంత మంది మెడికల్ ఆఫీసర్లు ప్రచార వాహనాలు ఏర్పాటు చేయకుండానే బిల్లులు బొక్కేశారు. అంతేకాదు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ స్టూడెంట్స్‌కు నిర్దేశించిన దానికంటే అతితక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడెలా సాధ్యం పిల్లల నిష్పత్తికి తగిన మోతాదులో వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉండగా, అధికారులు పిల్లల సంఖ్య కంటే ఎక్కువ వ్యాక్సిన్ కొనుగోలు చేశారు. దీంతో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోనూ వ్యాక్సిన్ భారీగా మిగిలిపోయింది. మిగిలిన వాక్సిన్లతో పోలిస్తే పోలి యోవాక్సిన్ హీట్సెన్సీవ్ మెడిసిన్. మైనస్ 15-25 డిగ్రీల వ ద్ధ భద్రపరచాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు ఇలాంటి పరిస్థితుల్లో మూడో విడత వాక్సినేషన్ చేపట్టాలనుకోవడం ఎంత వరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమ నిబంధనల ప్రకారం ఏటా రెండు సార్లు మాత్రమే వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడోసారి వాక్సినేషన్ చేపట్టాలను కోవడమంటే మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనని పలువురు సీనియర్ వైద్యులు స్పష్టం చేస్తునా ్నరు. -
కూర్చుని గడిపేస్తే చక్కెర చిక్కు
పరిపరి శోధన గంటలకు గంటలు కూర్చున్న చోట నుంచి లేవకుండా గడిపేస్తూ ఉంటే ఒంట్లోకి చక్కెర జబ్బు చేరడానికి ఎంతోకాలం పట్టదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చుని గంటల కొద్దీ గడిపేసే వారు ఆ తర్వాత కఠిన వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదని వారు చెబుతున్నారు. మెలకువగా ఉన్న స్థితిలో తొమ్మిది గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం కూర్చున్న స్థితిలోనే గడిపేసే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు తప్పదని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 2,500 మంది నడి వయస్కులపై నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందని వారు చెబుతున్నారు. -
నేటి నుంచి పెడికాన్ ఆసియా పసిఫిక్ సదస్సు
♦ శిశు మరణాలు.. భ్రూణ హత్యల నిరోధం... ♦ దేశ, విదేశాల నుంచి10 వేల మంది పిల్లల వైద్యులు, శాస్త్రవేత్తల హాజరు ♦ {పారంభించనున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: శిశు మరణాలు, భ్రూణహత్యలు, చిన్నపిల్లల్లో వ్యాధులు తదితర సమస్యల పరిష్కారం, పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహక కమిటీ కో-చైర్మన్ డాక్టర్ జగదీశ్చంద్ర, ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్, డాక్టర్ రంగయ్య తదితరులు సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 10 వేలమంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సులో 22 దేశాల నుంచి రానున్న 100 మంది ప్రసిద్ధ పిల్లల వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ప్రసంగిస్తారు. యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. సార్క్ దేశాలు, యూరోపియన్ యూనియన్, అమెరికా తదితర దేశాల నుంచి నిపుణులు హాజరుకానున్నారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా బాలికలకు అనుకూలంగా ఈ సదస్సు కీలక నిర్ణయం తీసుకోనుంది. శిశుమరణాల తగ్గింపు, భ్రూణ హత్యల నిరోధానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఈ పెడికాన్ సదస్సు రూపొందించనుంది. సదస్సు ప్రారంభం నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హెల్పింగ్ బేబీస్ సర్వైవ్’ అనే కార్యక్రమాన్ని వారంరోజులుగా నిర్వహిస్తున్నారు. హైటెక్స్‌లోని 12 హాళ్లల్లో నాలుగు రోజులపాటు ఏకధాటిగా సదస్సులు జరుపనున్నారు. 23 ఏళ్ల తర్వాత భారత దేశంలో దీనిపై అంతర్జాతీయస్థాయిలో సదస్సు జరుగుతోంది. పెడికాన్ సదస్సుకు ముందు ఉదయం ఏడు గంటలకు శిల్ప కళావేదిక నుంచి రెండు కిలోమీటర్ల మేరకు హెల్త్‌వాక్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హెచ్ఐసీసీలో పెడికాన్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పెడికాన్-2016ను ప్రారంభిస్తారని డాక్టర్ జగదీశ్చంద్ర తెలిపారు. -
నిద్ర సమస్యలతో డయాబెటిస్ ముప్పు!
పరిపరిశోధన నిద్ర సమస్యలతో డయాబెటిస్ ముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర మరీ తక్కువైనా ఇబ్బందేనని, మరీ ఎక్కువైనా ఇబ్బందేనని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో పురుషుల కంటే మహిళలకు డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సగటున రోజుకు ఆరుగంటల నిద్ర అవసరమని, అంతకంటే రెండు గంటలు తక్కువగా గానీ, రెండు గంటలు ఎక్కువగా గానీ నిద్రపోతే టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలు 15 శాతం మేరకు ఎక్కువవుతాయని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని పలువురు మహిళలపై పద్నాలుగేళ్ల పాటు తాము జరిపిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం తేలిందని అంటున్నారు. -
వైద్య శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకునేందుకు ఆ శాఖలోని వివిధ విభాగాల అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఉద్యోగ ఖాళీల వివరాలు ఇస్తే సీఎం ఆమోదం తీసుకొని నియామకాలకు అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశించిన వెనువెంటనే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అదే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబ ఆరోగ్య సంక్షే మం, వైద్య విద్య, నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెం టివ్ మెడిసిన్ (ఐపీఎం), టీఎస్ఎంఎస్ఐడీసీ, డ్రగ్స్ సహా వివిధ చోట్ల ఖాళీలపై ఆయా విభాగాల అధిపతులు ఇప్పటికే తుది అంచనాకు వచ్చినట్లు తెలిసింది. తమ శాఖలో ఖాళీల వివరాలతో సోమవారం సీఎస్‌కు నివేదిక ఇస్తామని రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. అన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే... వైద్య శాఖలో భారీగా ఖాళీలున్నాయి. గతంలో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం... నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు, అక్కడే 158 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ ఖాళీలున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, 205 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా 1,330 పోస్టుల భర్తీని కాంట్రాక్టు పద్దతిలో చేపట్టారు. 391 ఆయుష్ పోస్టుల భర్తీకి కూడా సర్కారు ఆమోదం తెలిపింది. అవి పోను మిగిలిన ఖాళీల వివరాలు అందజేశాక నియామకంపై ప్రభుత్వం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. భర్తీ చేయబోయే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే నియమిస్తారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 3 వేలకు పైనే పోస్టుల భర్తీ చేపట్టే అవకాశాలున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఇంటర్వ్యూలుండవు.. ప్రతిభ ఆధారంగానే భర్తీ వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీలను ఎలా భర్తీ చేయాలన్న దానిపై వైద్యాధికారులు మేధోమధనం చేస్తున్నారు. నియామక మండలి ఏర్పాటు చేసి భర్తీ చేయాలని గతంలో అనుకున్నా అది సుదీర్ఘ ప్రక్రియ అని భావించి ఆ ఆలోచనను పక్కనపెట్టారు. వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. ఇంటర్వ్యూల జోలికి పోకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని యోచిస్తున్నారు. -
డెంగీ ఫీవర్
కలవరపెడుతున్న డెంగీ... జాగ్రత్తలు పాటించకుంటే డేంజర్ విశాఖ మెడికల్: నగరంలో డెంగీ వ్యాధి అవహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది మురికివాడ ప్రజలు జ్వరాలతో కదలేని పరిస్థితుల్లో మంచాన పడుతున్నారు. జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు గత నెలలో చేపట్టిన సమ్మెకారణంగా నగరంతోపాటు జిల్లాలోని పట్టణాల్లోనూ దోమలు వ్యాపించాయి. శిథిలమైన డ్రై న్లు, గెడ్డల్లో ఉన్న నిల్వ నీటిలో దోమలు స్వైర్యవిహారం చేయడం,మరోపక్క రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలు పడటం వంటి కారణాలతో దోమకాటు పెరిగింది. ఫలితంగా జ్వరాలతో బాధపడివారి సంఖ్య పెరుగుతున్నారు. జ్వరం వచ్చి, నీరపడిపోవడం, విపరీతమైన ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతోఎక్కువమంది బాధతపడుతున్నారు. ఈ తరహా లక్షణాలు కేవలం డెంగీ వ్యాధిగ్రసులలో ఎక్కువగా ఉండచ్చని వైద్యులు సూచిస్తున్నారు. విశాఖ నగరంతోపాటు గ్రామీణ జిల్లాలోనూ ఈ వ్యాధిలక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి లక్షణాలపై ప్రత్యేక కథనం... డెంగీ ప్రాణాంతకమైన వ్యాధికాకపోయినా నిర్లక్ష ్యం చేస్తే ప్రాణాలకు ముప్పుతప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి డెంగీ జ్వరం అన్ని వైరల్ జ్వరాల్లాగా మామూలుదే. చాలా మందికి ఈ జ్వరం వచ్చి బయటపడుకుండానే దానికేదే తగ్గిపోతూ ఉన్న సందర్భాలూ ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని ‘సబ్ క్లినిక్ల్ ఇన్ఫెక్షన్’అంటారు. డెంగీ వ్యాధి ‘గ్రూప్-బి ఆర్టోవైరస్’అనే వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ప్రస్తుతం అపరిశుభ్రత నెలకొన్న మురికివాడ ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒకపక్క వర్షాలు, మరోపక్క పెంటకుప్పల్గా పేరుకుపోతున్న చెత్తచెదారాలతో దోమల బెడద నగరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దోమకాటుద్వారా వచ్చే డెంగీ నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వ్యాధి ఉన్న రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి..ఇంకొకరికి వ్యాధి వ్యాపిస్తోంది. నిల్వ నీళ్లలో వాలే ఎడిస్ ఈజిపై ్లఅనే దోమ కుడితే డెంగీ వ్యాధి ప్రబలుతోంది. దోమకుట్టిన 4 నుంచి 15రోజుల్లో వ్యాధి బయటపడుతుందని వైద్యులంటున్నారు. కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటికుండీలు, అండర్ గ్రౌండ్ ట్యాంకులు ఇలా ఎక్కడ నీళ్లు నిలవ ఉండటానికి అవకాశముంటే అక్కడంతా ఈ దోమగుడ్లు పెడుతుంది. పాతటైర్లు, పనికిరావని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాల్లో నీళ్లు నిల్వ ఉంటే ఆనీట్లో కూడా ఈ దోమలు గుడ్లు పెడతాయి. వారం పదిరోజుల్లో లక్షలాది పిల్లదోమలు పుడతాయి. దోమలు చల్లని, నీడ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొని అవి మన ఇళ్లలో కర్టెన్ల వెనకా, తలుపుల వెనకా, గోడల మాటున విశ్రమిస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కుట్టడం ప్రారంభిస్తాయి. డెంగీ హేమరేజిక్ ఫీవర్ రెండోదశ ఇది. ఇది ప్రమాకరమైన జ్వరం. శరీరంలోని ఏ భాగంనుండైనా రక్తస్రావం జరగడం దీని లక్షణం. రక్తపోటును చూసిన విధంగానే బీపీ పనిముట్లు గుడ్డపట్టినీ చేతికి కట్టి, పీడనం పెంచితే కూడా ఎర్రటి మచ్చలు చర్మంపై ఏర్పడతాయి. నిజానికి డెంగీలో రక్తస్రావం జరుగుతుందా? లేదా తెలుసుకోవడానికి ఇదొక పరీక్షకూడా. సాగదీస్తే రక్తం కారడం, పళ్ల నుంచి రక్తం, రక్తవాంతులు, నల్లటి మలం, ముక్కు నుంచి రక్తం కారడం, ఇవన్నీ కూడా ఈ జ్వరంలో కన్పించవచ్చు. డెంగీ హెమరేజిక్ ఫీవర్ ముదిరితే ‘రక్తప్రవసరణ వైఫల్యం’ ఉంటుంది. నాడీ బలహీనపడటం, లోబీపీ, కాళ్లు, చేతులు చల్లబడటం, తీవ్రమైన దాహం, స్థిమితంగా ఉండకపోవడం లాంటిలక్షణాలు బహిర్గతమవుతాయి. లక్షణాలు విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి ..మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు,మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగీ ప్రధాన లక్షణం.ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి తరహాలో బాధ ఉంటడటం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అని అంటుంటారు. ఇందులో మూడు దశలున్నాయిమొదటిది సాధారణ డెంగీ జ్వరం, రెండోది హెమరేజిక్ జ్వరం, మూడోది షాక్ సిండ్రోం.చాలా మందిలో మొదటి దశ నుండే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేస్తారు. కొద్ది మంది రెండోదశకు, మరికొద్దిమంది మూడో దశకు చేరుకుంటారు. రెండు, మూడుదశలు ప్రమాకరమైన దశలు. మరణాలు ఎక్కువగా మూడోవ దశలో జరుగుతాయి. ఎలా గుర్తించాలి? మొదటి దశలో వాధిని గుర్తించటం కష్టమే. డెంగీ జ్వరాలు జూలై నుండి డిసెంబరు మాసాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలుఉన్నాయి. ఈ సమయంలో విపరీతంగా ఒళ్లునొప్పులుండే జ్వరాలన్నింటికీ డెంగీగా భావించి రక్తపరీక్ష చేయించడం మంచిది. బ్లడ్‌సెల్స్ తగ్గి ఉంటే డెంగీగా నిర్ధారిస్తారు.రక్త సెల్స్ తగ్గినంత మాత్రన డెంగీ అని భావించనక్కరలేదు. వైరల్, మలేరియా లాంటి ఇతర వ్యాధులు సోకినప్పుడు కూడా ఈ సంఖ్య తగ్గొచ్చు. ప్రతేకమైన నిర్ధారిత పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది.రెండవ దశలో, మూడోదశలో లక్షణాలు స్ఫష్టంగా ఉంటాయి. అందువల్ల వ్యాధిని నిర్థారించడటం సులభం. నివారణ మన చేతుల్లోనే.. డెంగీ వ్యాధికి ఇప్పటి వరకు టీకా మందు లేదు. దోమల నివారణ ఒక్కటే సాధ్యం. దోమలు అధిక సంఖ్యలో పుట్టకుండా, పుట్టిన దోమలు కుట్టకుండా చూసుకోవడమే నివారణ మార్గం.ఇంటిలోపల ఏ ప్రాంతంలోనైనా మంచినీరు ఐదు రోజులు మించి నిల్వ ఉంచకూడదు.ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో వారానికి ఒకసారి నీటిని మార్చుకోవాలి.పగటిపూట పొడవాటి చేతుల చొక్కాలు, లాగులు తొడుక్కోవాలి.దోమలు కుట్టకుండా లేపనాలుపూసుకోవాలిఇంటి కిటికీలకు దోమతెరలు కట్టించుకోవాలిడెంగీ జ్వరాలున్న ప్రాంతాలలో వారానికి ఒక్కరోజు డ్రైడే పాటించాలి. దండిగా బాధితులు వైద్య ఆరోగ్యశాఖ వీటి తీవ్రతను తక్కువచేసి చూపుతున్నాయి. కొన్ని కేసులను మాత్రమే అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ, అధిక సంఖ్యలో కేసులు అనధికారికంగానే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఇటీవల జీవీఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా క్షీణించిన పారిశుధ్య పరిస్థితులు, ఎండల తీవ్రత వల్ల ఎడిస్ దోమల ఉత్పత్తి పెరిగి డెంగీ జ్వరం నగరంపై దాడిని పెంచింది. నగర పరిధిలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రి కేజీహెచ్‌లో కూడా డెంగీ జ్వరబాధితులు ఎక్కువ సంఖ్యలో చికిత్సలు పొందుతున్నారు. కేజీహెచ్‌లోని మెడిసిన్, పిల్లల వార్డుల్లో డెంగీ జ్వరబాధితుల సంఖ్య రోజురోజుకూ పెరగడమే ఈ విషయాన్ని రుజువుచేస్తోంది. కేజీహెచ్ పిల్లల వార్డులో 7 కేసులకు పైగా నమోదుకాగా, మెడికల్ వార్డుల్లో కూడా జ్వరబాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి గత పది రోజులుగా డెంగీ జ్వరబాధితులు మెరుగైన వైద్యంకోసం నగరానికి తరలివస్తున్నారు. ఎక్కువ మంది ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్లేట్లెట్ల వ్యాపారం జోరు.. ప్లేట్లెట్ల వ్యాపారం ఊపందుకుంది. పలు బ్లడ్‌బ్యాంక్‌లు ప్లేట్లెట్ల జారీని ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి రోగులను అధికంగా వసూలుచేన్నాయి. పరోక్షంగా కొంతమంది వైద్యులు కొమ్ముకాయడం విమర్శలకు తావిస్తోంది. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల విషయానికిఒస్తే ఒక్కో ఆస్పత్రిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ డెంగీ కేసులు నగరంలో నమోదవుతున్నాయి. మురికివాడ ప్రాంతాల నుంచి ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను నగరంలో విస్తృతంగా చేపట్టాం. ఇళ్లలో నిల్వ చేసుకుంటున్న నీటి నుంచే దోమలు వృద్ధి చెందే అవకాశాలున్నాయని గుర్తించి వాటిపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. డెంగీ కేసులు నమోదయ్యే మురికావడలతో పాటు అనుమానిత ప్రాంతాల్లో పైరిత్రం మందును స్ప్రే చేస్తున్నాం. ఫాగింగ్ ఆపరేషన్ మొదలెట్టాం. - డాక్టర్ మురళీమోహన్ ముఖ్య ప్రజారోగ్య శాఖాధికారి, జీవీఎంసీ -
ఉదయాన్నే కాఫీ అంత మంచిది కాదు..
కొత్త పరిశోధన మనలో చాలామందికి కాఫీతో దినచర్య మొదలుపెట్టే అలవాటు ఉంటుంది. పొద్దున్న నిద్రలేవగానే కాఫీ పడకుంటే బండి కదలదనేంతగా ఆ అలవాటు ఉంటుంది. కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నా, ఉదయాన్నే కాఫీ తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాఫీ తీసుకోవడానికి ఉదయం అంత సానుకూలమైన సమయం కాదని, పొద్దున్నే ఏదైనా కడుపులో పడేసుకున్న తర్వాత కాసేపటికి కాఫీ తీసుకుంటే ఫర్వాలేదని అంటున్నారు. యూట్యూబ్ సైన్స్ చానల్ ‘ఏఎస్ఏపీ సైన్స్’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కాఫీ తీసుకునేందుకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తగిన సమయమని తేల్చారు. ఉదయం నిద్రలేస్తూనే శరీరంలో కార్టిసాల్ విడుదల అధిక స్థాయిలో ఉంటుందని, అలాంటి సమయంలో కాఫీకి దూరంగా ఉండటమే మేలని ఈ నిపుణులు చెబుతున్నారు.