mekapati rajamohan reddy
-
చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అతి సామాన్య కుటుంబంలో జన్మించి, రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో సాగించిన మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం గుర్తుంచుకోదగ్గ ఒక్క పనిచేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారనే అంశం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.దివంగత సీఎం వైఎస్సార్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రజల పక్షాన మూడు దశాబ్దాలకుపైగా పోరాటాలు చేసి ఆయన సీఎం అయిన అంశాన్ని ప్రస్తావించారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తిరుగులేని ప్రజానేతగా వైఎస్సార్ అవతరించారన్నారు. వైఎస్సార్‌తో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశానని, ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతోపాటు కోట్లాది అభిమానుల మనోభావాల్లో అనూహ్యమైన మార్పొచి్చందని తెలిపారు. జగన్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర చేయాలని భావిస్తే, కొందరి మాటలను విని పార్టీ అధిష్టానం అడ్డుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము ఆయనకు అండగా నిలిచామన్నారు. జగన్‌తో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం తాను ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డి బరిలో దిగారని, ఆయనకు మద్దతుగా అప్పటి రాష్ట్ర, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి తనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన అంశాన్ని గుర్తుచేశారు. అయినా తాను 2.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందానని తెలిపారు. ప్రజల గుండెల్లో జగన్‌కు సుస్థిర స్థానం వివిధ సంక్షేమ పథకాలు, నూతన ఒరవడితో ప్రజల హృదయాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లోనే ఆయన్ని సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అయితే పచ్చమీడియా, టీడీపీ దు్రష్పచారంతో ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెల్చుకుని అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం మరింత ఎక్కువైందని, వై నాట్ 175 అనే పిలుపు అక్షరసత్యం కానుందని పేర్కొన్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం సభలకు అశేష ప్రజాదరణ లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించనుందనే అంశం దీని ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. చరిత్రహీనులుగా మిగలడం ఖాయం ప్రజాబలం లేని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వంటి వారు సీఎంపై దాడులకు ఉసిగొల్పి చరిత్రహీనులుగా నిలిచిపోనున్నారని ధ్వజమెత్తారు. సీఎంపై ఇటీవల రాయితో దాడిచేశారని, ప్రజాశీస్సులు మెండుగా ఉన్న కారణంగా ఆయనకు పెనుప్రమాదం తప్పిందన్నారు. ఈ హత్యాయత్నం వెనుక అసలు దోషి చంద్రబాబు కాదా అని ప్రశి్నంచారు. సంక్షేమసారథి జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నుంచి తన కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి నుంచి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించనున్నారని చెప్పారు. నెల్లూరు లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. -
పవన్ కళ్యాణ్ వెళ్లి సినిమాలు చేసుకో: రాజమోహన్ రెడ్డి
-
బయటపడ్డ మోడీ మనసు బాబు కు ఇదే ఘోర అవమానం
-
తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్, ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్‌ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్‌లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డి అప్పట్లో మాల్ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండ్‌ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు. ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్‌ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైలెవల్ కెనాల్ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్, తల్లి మణిమంజరి పాల్గొన్నారు. -
‘పోలవరం, వెలిగొండ పూర్తి కావాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలి’
సాక్షి, నెల్లూరు: ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ లోకేష్ నవ్వులపాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు.. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఘాటుగా రాజమోహన్‌రెడ్డి బదులిచ్చారు. నెల్లూరులో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైఎస్సార్, జగన్ పుణ్యమేనని చెప్పారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆర్ధిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉంటే.. జగన్‌కు మాత్రం ప్రజా బలం ఉందన్నారు. లోకేష్ బుజ్జి బాబు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేకపాటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ -
సీఎం జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా.. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం: మేకపాటి
ఉదయగిరి: ఉదయగిరి టికెట్ నిర్ణయం పూర్తిగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారమే ఉంటుందని, ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆదివారం నెల్లూరులో మేకపాటి నివాసంలో రాజమోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా కోణాల్లో పరిశీలించి చేస్తారని తెలిపారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మేకపాటి కుటుంబం వారికి పూర్తి సహకారం అందిస్తుందని, అందరం కలిసికట్టుగా వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకునేలా పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో అభ్యర్థి విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ తర్వాత ఉదయగిరిలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మాట్లాడి చిన్ని చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఉదయగిరికి మేకపాటి కుటుంబానికి నలభై ఏళ్ల అనుబంధం ఉందని, చంద్రశేఖరరెడ్డి వ్యవహారంతో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. అందుకు మేకపాటి కుటుంబం తరపున ఉదయగిరి ప్రజలకు రాజమోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పా రు. మాజీ ఎంపీని కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు రావెళ్ల నాగేంద్ర, పావులూరు మాల్యాద్రిరెడ్డి, నాయకులు అండ్రా బాలగురవారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గంగవరపు పుల్లయ్య, గుంటుపల్లి నాగభూషణం, ఏనుగు వెంకటేశ్వరరెడ్డి, ఉండేల సుబ్బారెడ్డి, పెండ్యాల తిరుపతయ్య, బొమ్ము వెంకటరెడ్డి, బోగ్యం విజయ, వెంకటేశ్వర్లు, పి.విజయభాస్కరరెడ్డి, చెన్నారాయుడు, మధు, బాలచంద్ర, వెంగయ్యనాయుడు, రవి, రమేష్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మా కుటుంబానికి కళంకం తెచ్చాడు..
-
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు. ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
పేదల పట్ల జగన్ తీరును దగ్గరగా చూసిన వ్యక్తి నేను
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్‌రెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
'గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు'
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్ 2న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో అనుకోని విషాదం జరిగింది. విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టాం. గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు అని మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉంది. సీఎంకి ఉన్న జనాదరణ, గౌతమ్ అన్నపై ఉన్న అశేష అభిమానం భారీ విజయానికి సోపానాలు కానున్నాయని విక్రమ్‌రెడ్డి తెలిపారు. చదవండి: (2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?: మంత్రి జోగి రమేష్) -
రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం
ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు. సాక్షి, నెల్లూరు: మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. మేకపాటి కుటుంబం దాతృత్వం మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. మహర్దశ పట్టించేలా.. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్ కెనాల్ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఔన్నత్యానికి నిదర్శనం మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. – షేక్ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి హర్షదాయకం ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. – డాక్టర్ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్‌రెడ్డి పేరుతో.. మెరిట్స్ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్ఎస్ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్‌రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన మేకపాటి విక్రమ్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి ప్రజాసేవలో పాలు పంచుకోనున్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్‌రెడ్డితో కలసి గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గ పర్యటనకు ముందుగా ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకునేందుకు విక్రమ్‌రెడ్డి వచ్చినట్లు రాజమోహన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే విక్రమ్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలసినట్లు తెలిపారు. విక్రమ్ ప్రజాసేవలో నిమగ్నం కానున్నట్లు రెండు వారాల క్రితమే సీఎం జగన్‌కు తెలియజేశామన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు. పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తొలుత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగనన్న నాకు ఆదర్శం: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇన్నాళ్లూ వ్యాపార రంగంలో నిమగ్నమైన తాను రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు గౌతమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి గౌతమ్‌రెడ్డి చేయాలనుకున్నది చేసి చూపిస్తానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకుంటానన్నారు. జగనన్న ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని చెప్పారు. రాజకీయాల్లో తనకు ఆయనే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించి సీఎం జగన్ ఆదేశించినట్లుగా సచివాలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. -
సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి
నెల్లూరు (సెంట్రల్): కుమారుడిని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తమ హృదయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు మనోధైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్‌కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి తపన పడిన ప్రతి అంశాన్ని పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. తాను కోరిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తానని ప్రకటించడం తమ కుటుంబంపై వైఎస్ జగన్‌కు ఉండే అభిమానానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. జగన్‌కు వెన్నంటి ఉన్న గౌతమ్‌రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
మెరిట్స్‌లో కర్మక్రియలు.. మార్చి 3న మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ
సాక్షి, నెల్లూరు(ఉదయగిరి/సంగం): దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కర్మక్రియలను శుక్రవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తండ్రి గౌతమ్‌రెడ్డికి ఆయన తనయుడు మేకపాటి కృష్ణార్జునరెడ్డి సంగంలోని పెన్నానదిలో త్రివేణిలో పిండ ప్రదానం చేశారు. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి మణిమంజీరి, గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తి, కుమార్తె సాయి అనన్య ఇతర కుటుంబ సభ్యులు దుఃఖాన్ని భరిస్తూ కర్మక్రతువులు పూర్తి చేశారు. అర్జన్రెడ్డిని ఓదార్చుతున్న మేకపాటి దంపతులు ఈ సమయంలో తండ్రిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో రోదిస్తున్న మవవడు అర్జన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి తమ దుఃఖాన్ని అణుచుకుంటూ ఓదార్చుతుండడం అందరిని కంట తడి పెట్టించాయి. బిడ్డలు వేదనను చూసిన బంధువులు, పలువురు అధికారులు కంట చెమ్మ పెట్టారు. గౌతమ్‌రెడ్డి చితాభస్మంను దేశంలోని ఏడు పుణ్యనదుల్లో కలిపే నిమిత్తం ఏడు పాదుకుల్లో సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి, మేకపాటి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, పృధ్వీరెడ్డి, విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ) మార్చి 3న మంత్రి పెద్ద కర్మ మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ శాస్త్రీయ ప్రకారం కాలం చేసిన 11వ రోజు మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకర్మకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అ«ధికారులు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్‌యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్‌యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యంత శాస్త్రోక్తంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దహన సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం వేదపండితుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా ఆయన కుటుంబ సభ్యులు జరిపించారు. ముందుగా గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జునరెడ్డి చేత పండితులు గణపతి హోమంతో పాటు అగ్నిప్రతిష్టంభన హోమం చేయించారు. గౌతమ్‌రెడ్డి చెవిలో కుటుంబ సభ్యులతో నారాయణ మంత్రం జపించారు. దహన సంస్కారాలు కూడా రాహుకాలం రాక ముందే సంప్రదాయ రీతిలో నిర్వహించారు. వేలాది మంది మేకపాటి అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతుల సమక్షంలో వేదపండితులు మధ్యాహ్నం 12 గంటలలోపే కృష్ణార్జునరెడ్డి చేత చితికి నిప్పంటించారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని గంధపు చెక్కలతో దహనం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చితికి నిప్పంటించినన ఆనంతరం పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. గౌతమ్‌రెడ్డి పాడె మోస్తున్న మంత్రి అనిల్ గుండెలలిసేలా.. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఆయన తనయుడు కృష్ణార్జునరెడ్డి గుండెలవిసేలా రోదించాడు. ఆయన విదేశాల్లో విద్యభ్యాసం చేస్తున్న సమయంలో తన తండ్రి మరణవార్త విని హటాహుటినా బయలు దేరిన మంగళవారం రాత్రి 11 గంటలపైన నెల్లూరులోని స్వగృహనానికి చేరుకున్నారు. అప్పటి వరకు మంత్రి మేకపాటి పార్థివదేహన్ని ప్రజల దర్శనార్థం బయట ఉంచిన కుటుంబ సభ్యులు ఆయన తనయుడు రాక ముందే మంత్రి అధికార కార్యాలయ గదిలోకి మార్చారు. ఇంటికి చేరుకున్న కృష్ణార్జునరెడ్డి తండ్రి భౌతికకాయాన్ని చూసి రోదించాడు. అక్కడున్న అందరిని కాసేపు బయటకు వెళ్లమని చెప్పి తానొక్కడే తండ్రి దేహం వద్ద కూర్చొని చాతి నిరుముతూ బోరున విలపించాడు. తనయుడు బాధను చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖంతో గుండెలవిసేలా విలపించారు. చదవండి: (తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి) తండ్రి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి మౌనంగానే ఉంటూ.. తన ముద్దుబిడ్డ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇకపై తమబిడ్డ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందరో మేకపాటి ఆప్తులు, ప్రముఖులు, అభిమానులు వేలాది మంది తరలివచ్చి ఆయన్ను ఓదార్చుతున్న వారందరితో మౌనంగానే చేయేత్తి నమస్కరిస్తూ బరువెక్కిన హృదయంతో లోలోపల కుమిలిపోయాడు. తన బిడ్డ పార్థివదేహన్ని తదేకంగా చూస్తూ మౌనంగానే రోదించారు. గౌతమ్‌రెడ్డికి తండ్రి రాజమోహన్‌రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. ప్రతి రోజు ఎక్కడున్నా రోజుకు పదిసార్లయినా తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఆ రోజు తాను చేసిన పనులను చెప్పేవాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంఈఓలు కుదిరాయని తండ్రికి ఫోన్లో చెప్పడంతో కుమారుడిని అభినందించారు. అంతలోనే పుత్రశోకం మిగలడంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేక మౌనంగా రోదిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
సాక్షి, నెల్లూరు: వ్యాపారంలో, రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డిని చూసి తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయేవారు. తన కుమారుడి గురించి ప్రతిఒక్కరూ గొప్పగా చెప్తుంటే రాజమోహన్‌రెడ్డి ఆనందంతో చిరునవ్వులు చిందించేవారు. ఇక గౌతమ్‌రెడ్డికి తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. తండ్రి భావాలను పుణికిపుచ్చుకుని.. వ్యాపారంలో, రాజకీయాల్లో అడుగులు వేశారు. మరోవైపు తాను ఏ పని చేయాలన్నా తల్లి ఆశీస్సులు తీసుకునేవారు. ఆమె మాట జవదాటేవారు కాదు. ఇప్పుడు చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రాజమోహన్‌రెడ్డి దంపతులు కుమిలిపోతున్నారు. వారి వేదనను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గౌతమ్‌రెడ్డి మరణంతో చిన్నాన్న, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చదవండి: (హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ..) చదవండి: (Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..) -
అజాత శత్రువు
సాక్షి, అమరావతి/నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా వెలుగొందారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఆద్యంతం వివాద రహితుడిగానే మెలిగారు. ఆర్థికంగా స్థితిమంతుడు.. సీనియర్ రాజకీయ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కుమారుడైనా గౌతమ్‌రెడ్డి అత్యంత సాధారణంగానే వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారు. వ్యాపారవేత్తగా ఉంటూ తనకేమాత్రం సరిపడని రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మృదుస్వభావిగానే కొనసాగారు. ప్రత్యర్థులపై ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం హుందాతనానికి నిదర్శనం. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి ప్రజా సమస్యలపైనే దృష్టి సారించేవారు. అందుకే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా ఆయనతో గౌరవ ప్రదమైన సంబంధాలనే కొనసాగించారు. గౌతమ్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం దుందుడుకుగా వ్యవహరించలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఏనాడూ అహంకారం ప్రదర్శించలేదు. ప్రతిపక్ష నేతగా ఆనాడు ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే స్పందించారు తప్ప వివాదాస్పదుడు కాలేదు. అందుకే ఆయన విమర్శలను కూడా ఆనాటి ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయేవి. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికే ప్రాధాన్యమిచ్చేవి. మంత్రిగానూ హుందాగానే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కీలక మైన పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా నియమితులైన తరువాత కూడా గౌతమ్‌రెడ్డి హుందాతనంతో కూడిన రాజకీయాలే నెరిపారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అసెంబ్లీ సమావేశాల్లోగానీ బయట గానీ గౌతమ్‌రెడ్డిని విమర్శించే సాహసం చేయలేకపోయింది. మంత్రిగా సమర్థవంతమైన పనితీరు కనబర్చిన ఆయన తనను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఓ సారి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానమిస్తూ.. గౌతమ్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వాటి సత్ఫలితాలను వివరించారు. ఎక్కడా ప్రతిపక్ష టీడీపీని ఒక్క మాట అనకుండా.. ఎదురుదాడి చేస్తున్నట్టుగా కాకుండా ఆయన సవివరంగా ఇచ్చిన సమాధానంతో టీడీపీ మిన్నుకుండిపోయింది. వర్గ రాజకీయాలు లేవు.. అవినీతి మరకా లేదు ఎత్తులు, జిత్తులతో నిత్యం వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నెల్లూరు జిల్లాలో గౌతమ్‌రెడ్డి తనదైన శైలిలో వివాద రహితుడుగా గుర్తింపు పొందడం విశేషం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్నప్పటికీ దానిని అవకాశంగా చేసుకుని జిల్లాపై రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు యత్నించలేదు. ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను కలుపుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోని అరుదైన రాజకీయ నేతగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. కనీసం రాజకీయ ప్రయోజనాల కోసమైనా ప్రతిపక్షాలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సాహసించలేదు. గౌతమ్‌రెడ్డి ఎవర్నీ ఏకవచనంతో సంభోదించే వారు కాదు. -
అరుదైన ఆత్మీయుడు.. స్నేహం కోసమే రాజకీయాల్లోకి
సాక్షి, అమరావతి/నెల్లూరు: రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అందుకు పూర్తి మినహాయింపు. స్వప్రయోజనాల కోసం ఆయన స్నేహం చేయలేదు. స్నేహం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్ని కష్టాలు ఎదురైనా స్నేహితుడి వెన్నంటి నిలిచారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన బాంధవ్యం నేటి రాజకీయాల్లో అరుదైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. చిన్నప్పుడే చిగురించిన స్నేహబంధం.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గౌతమ్‌రెడ్డి విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలినాళ్లలో రాజకీయ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆయన తమ్ముడు పృథ్వీరెడ్డి హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లాస్మేట్ కావడంతో స్నేహబంధం ఏర్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఆత్మీయ అనుబంధం మరిం త బలపడింది. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం నాడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రపోటీ నెలకొనగా వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డికే అవకాశం దక్కింది. ఆర్థికంగా అణచివేసినా వెరవలేదు.. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆయన అండదండలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా కష్టకాలంలో మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ వెన్నంటే నిలిచింది. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహణలో పాలు పంచుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచేందుకు తన ఎంపీ పదవిని త్యజించేందుకు సైతం మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెనుకాడ లేదు. వైఎస్ జగన్ వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబాన్ని నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించింది. అయినప్పటికీ గౌతమ్‌రెడ్డి వెరవక వైఎస్ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం కొనసాగించారు. -
ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారం
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు) : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంపసముద్రంలో సోమవారం ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుందని, ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆత్మకూరులోని తమ కార్యాలయంలో ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని ఓఎస్డీ చెన్నయ్య చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు చెప్పాలన్నారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలసి మెలసి ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యాలయం సచివాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చెన్ను శ్రీధర్‌రెడ్డి, యర్రమళ్ల చిన్నారెడ్డి, గోపవరం కాంతారెడ్డి, బాబునాయుడు, కొండ్రెడ్డి రమణారెడ్డి, హజరత్ రెడ్డి, చిన్నమాచనూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.