Million March
-
ఉద్విగ్న జ్ఞాపకం
మహోన్నత తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన భాగ్యనగరంతొలి, మలిదశ పోరాటాలకు వేదికైన వేళ నాలుగు వందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర కలిగిన భాగ్యనగరంలో కోటి గొంతుకల ఉద్యమ ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ మహానగరం ఎలుగెత్తి చాటింది. ‘జై తెలంగాణ’ నినాదమై మార్మోగింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నెన్నో వీరోచితమైన పోరాటాలు ఇక్కడే ఊపిరిపోసుకున్నాయి. రహదారులు మానవ హారాలై, మిలియన్ మార్చ్లై హోరెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నేల నెత్తురోడింది. ఉద్యమకారులు పోలీసు తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. ప్రాణాలను తృణప్రాయంగా సమరి్పంచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అగ్నికీలలై ఎగిసిపడ్డారు. ఉరితాళ్లను ముద్దాడారు. పాతబస్తీ, అలియాబాద్, చార్మినార్, రాజ్‌భవన్, గన్‌పార్కు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎల్బీనగర్, తార్నాక తదితర ప్రాంతాలు తొలి, మలిదశ ఉద్యమాలతో దద్దరిల్లాయి. నగరమంతటా భావోద్వేగాలు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. వందలాది మంది అమరుల బలిదానాల కలలను సాకారం చేస్తూ పదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గైర్ ముల్కీ గో బ్యాక్... 👉 తెలంగాణేతరులు ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టుకొనిపోవడాన్ని నిరసిస్తూ మొదటిసారి 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదం నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధుల ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. పోలీసుల దమనకాండను నిరసిస్తూ పాతబస్తీలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అలియాబాద్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. 👉 1952 సెప్టెంబర్ 4వ తేదీన సిటీకాలేజీ నుంచి విద్యార్థులు భారీ ఊరేగింపు చేపట్టారు. గైర్ ముల్కీ గో బ్యాక్ నినాదాలు మార్మోగాయి. ఈ ఊరేగింపును నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు పోలీసులు మరోసారి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు నేలకొరిగారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్ నగరమంతటా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు పత్తర్‌గట్టి పోలీస్‌స్టేషన్‌ను దహనం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు 16 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అదేరోజు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ముల్కీ నిబంధనలపై శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు బూర్గుల కారుకు సైతం నిప్పుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఆందోళనల్లో మరో నలుగురు ఉద్యమకారులు పోలీసు తూటాలకు బలయ్యారు. ‘జై తెలంగాణ’ ఒక్కటే పరిష్కారం.. 👉 ముల్కీ వ్యతిరేక ఉద్యమాలు క్రమంగా చల్లారాయి. ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ఏకైక పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే అనే స్పష్టమైన లక్ష్యంతో 1969 జనవరి నుంచి ‘జై తెలంగాణ’ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఏడాది జనవరి 13వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ ఏర్పాటైంది. ఉస్మానియా వర్సిటీ నుంచి అన్ని ప్రాంతాలకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు విస్తరించుకున్నాయి. జనవరి 24వ తేదీన సదాశివపేటలో చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు. శంకర్ అనే 17 ఏళ్ల యువకుడు చనిపోయాడు. 👉మార్చి 11వ తేదీన హైదరాబాద్ అంతటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు నిరవధిక సమ్మెకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించారు. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. మార్చి 15వ తేదీన ఉస్మానియా వర్సిటీ స్వరో్ణత్సవాల్లోనూ ప్రత్యేక రాష్ట్రం నిరసనకారులు తమ ఆందోళన కొనసాగించారు. ఆ నెల ఉద్యమం ఉద్ధృతమైంది. ఏప్రిల్ 5న కమ్యూనిస్టులు సికింద్రాబాద్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా భారీ బహిరంగసభను నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 👉1969 మే 1న హైదరాబాద్ చరిత్రలో మరో అత్యంత విషాదకరమైన రోజుగా నిలిచిపోయింది. మే డేను ‘డిమాండ్స్ డే’గా పాటించాలని కోరుతూ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. చారి్మనార్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రదర్శనకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఉద్యమకారులు కొందరు సాధారణ స్త్రీ పురుషులుగా చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు చేసేందుకు కొబ్బరికాయలతో చేరుకున్నారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ నినాదంతో చారి్మనార్ మార్మోగింది. ఆ ప్రాంతమంతా జన సంద్రాన్ని తలపించింది. భారీ ప్రదర్శన మొదలైంది. ఈ ఊరేగింపుపైన పోలీసులు ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. లాఠీలు విరి గా యి. తూటాలు పేలాయి. అయినా ప్రదర్శన ముందుకు సాగించింది. మొత్తం 20 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 👉 గాందీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ ఆస్తుల్లో నమోదైన రికార్డుల ప్రకారమే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. ప్రపంచం చూపు.. తెలంగాణ వైపు.. 👉మహత్తరమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనించాయి. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వివిధ కులవృత్తులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు సకలజనులు ఏకమై సాగించిన వైవిధ్యభరితమైన ఉద్యమంగా చరిత్రకెక్కింది. 2009 నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పరిణామాలు జరిగాయి. అన్నింటికి హైదరాబాద్ వేదికైంది. ఎంతోమంది యువతీ యువకులు బలిదానాలు చేశారు. 👉 2009 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ శిఖరమై నిలిచింది. వేలాది మంది విద్యార్థుల ఆందోళనలు, నినాదాలతో విశ్వవిద్యాలయం హోరెత్తింది. భగ్గుమన్న ఓయూ.. 👉ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ సారథి కేసీఆర్ తన దీక్షను విరమించినట్లు వార్తలు రావడంతో ఉస్మానియా ఒక్కసారిగా భగ్గుమన్నది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న కన్నుమూశాడు. దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారింది. 👉 తెలంగాణ విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచి్చంది. పోలీసులు పెద్దఎత్తున ఉద్యమాన్ని అణచివేశారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా అనేక మంది గాయపడ్డారు. ఈ దమనకాండను నిరసిస్తూ ఎన్సీసీ గేటు వద్ద సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేణుగోపాల్‌రెడ్డి అనే మరో విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోరెత్తిన మిలియన్ మార్చ్.. 👉 ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో ఉద్యమం మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ మహా జనసంద్రాన్ని తలపించింది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 144వ సెక్షన్ విధించినా, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసినా లెక్కచేయకుండా జనం తరలివచ్చారు. 👉 అదే సంవత్సరం 42 రోజుల పాటు తలపెట్టిన సకల జనుల సమ్మెలో బడి పిల్లలు మొదలుకొని యావత్ తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంటా వార్పు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ, రవాణా ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగించారు. 👉 2012 సెప్టెంబర్ 30న జరిగిన సాగరహారం మరో అద్భుతమైన పోరాటం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు నెక్లెస్‌రోడ్డు జనసాగరమైంది. గన్‌పార్కు, ఇందిరాపార్కు, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాలన్నీ భారీ ప్రదర్శనలతో హోరెత్తాయి. తెలంగాణ నినాదమై పిక్కటిల్లాయి, 👉 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసే వరకు తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా అనేక మలుపులు తిరిగింది. -
దమ్ముంటే మిలియన్ మార్చ్ ఢిల్లీలో పెట్టు: హరీశ్‌రావు
కొత్తగూడెం అర్బన్ /సత్తుపల్లి/సూర్యాపేట: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేస్తామని చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు తరలివచ్చి పోరాటం చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు పాల్వంచ నర్సింగ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విలేకరుల సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఇచ్చిందెవరు.. ఇవ్వనిదెవరు? బీజేపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చిందెవరు, ఇవ్వనిదెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరి గిందో, నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుం దో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, వివిధ శాఖల్లో 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 60 వేల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి, 317 జీవోను విడుదల చేస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని.. తద్వారా తెలంగాణలో స్థానిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్బీ ద్వారా రైల్వేలో 1.03 లక్షల పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరిలో కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే దాదాపు కోటి మంది నిరుద్యో గులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే మూడేళ్లయినా ఇంతవరకు పరీక్ష నిర్వహించలేదని హరీశ్ విమర్శించారు. ఆర్మీ, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సంజయ్‌కు హితవు పలికారు. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసిన కేంద్రం, ఎయిరిండియాను సైతం టాటాలకు అప్పగించిందని.. ఇలాంటి పనులతో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్ నుంచి బయటపడతామని అన్నారు. కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దపెద్ద కాంగ్రెస్ నేత లున్నారని.. అయినా ఫలితం శూన్యమని, వారు జిల్లాకు చేసింది ఏమీ లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసినా మంజూరు కాలేదని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందడమే కాకుండా.. మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ నల్లగొండకు ఐదు, సూర్యాపేటకు మరో ఐదు డయాలసిస్ మిషన్లు మంజూరు చేస్తామన్నారు. ఇక నుంచి 3 షిఫ్ట్‌లలో 24 గంటలూ కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తామని చెప్పారు. -
హైదరాబాద్ మిలియన్ మార్చ్
-
కదం తొక్కిన హైదరాబాదీలు
-
హైదరాబాద్; ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ పతకాలు చేబూని వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ-ముస్లిం భాయీ-భాయీ, చౌకీదార్ చోర్’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకారులు కదం తొక్కారు. భారీగా సంఖ్యలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైకి చేరుకుని సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇందిరాపార్కు, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల ఆందోళనకారులన పోలీసులు చెదరగొట్టారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆందోళన కార్యక్రమంలో ఇంత భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనడం ఇదే మొదటిసారి అని నగరవాసులు అంటున్నారు. ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. -
మిలియన్ మార్చ్‌పై ఉక్కుపాదం!
సాక్షి, వరంగల్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం జరగనున్న మిలియన్ మార్చ్ విజయవంతం కాకుండా చూసేందుకు పోలీసు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లు కిటకిటలాడాయి. పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతో నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రణాళికాబద్దంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులతో పాటు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులపై కన్నేశారు. కదలికలను ఎప్పటికప్పుడు పోలీసు నిఘా బృందాలు ఉన్నతాధికారులకు చేరవేశాయి. ఈ మేరకు నేతలను అదుపులోకి తీసుకోగా వారిని ఉంచేందుకు స్థలం సరిపోకపోడంతో ఫంక్షన్ హాళ్లలో ఉంచారు. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల విధానాలపై శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఆధ్వర్యాన హన్మకొండలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య నేతలు, నాయకులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు రాత్రి వేళ గృహ నిర్బంధం చేశారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని హన్మకొండ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా సుబేదారి పోలీసులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పీసీసీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి క్రాంతి, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్‌ను సైతం గృహాల్లో నిర్బంధం చేశారు. కమిషనరేట్‌లో రాత్రి సమావేశం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ రాత్రి 10 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మిలియన్ మార్చ్‌కు కమిషనరేట్ పరిధి నుంచి ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ముందుస్తు అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా నేతల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు అరెస్టులు కొనసాగాయి. మహిళా కార్మికులను సైతం.. మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా ఆర్టీసీ మహిళా కార్మికులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని వారు ఎంత మొర పెట్టుకున్నా పోలీసులు వినలేదు. మహిళా కార్మికులను ఉదయమే ఏకశిలా పార్కులోని దీక్షా శిబిరంలో అదుపులోకి తీసుకుని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. ఇక కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అయా విద్యార్థి సంఘాల నేతలను అదుధుపులోకి తీసుకున్నారు. హన్మకొండ పోలీసులు బస్టాండ్ వద్ద పికెటింగ్ ఏర్పాటుచేయగా నగర నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు తనిఖీలు చేశారు. హసన్‌పర్తి: మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా హసన్‌పర్తి పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. హసన్‌పర్తి జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు గురుమూర్తి శివకుమార్, మారపల్లి రాంచంద్రారెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, విద్యాసాగర్, జ్ఞానేశ్వర్, తంగళపల్లి రమేష్, సత్యప్రకాష్‌ను అరెస్టు చేయగా, హసన్పర్తికి చెందిన మేడిపల్లి మదన్‌గౌడ్, కుమారస్వామి, ఆకుల అశోక్, బాబు, లక్ష్మణ్ తదితరులను కేయూ పోలీసుస్టేషన్‌కు తరలించారు. హన్మకొండ : హన్మకొండ బాలసముద్రం ఏకశిల పార్కులోని ఉద్యమ శిబిరంలో నిరసన తెలుపుతున్న కార్మికులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బీఆర్.కుమార్ గౌడ్, ఎల్ఎన్.రావు, జీ.పీ.రెడ్డి, సత్తయ్య, ఎన్.రాధ, కె.అరుణ, కె.పద్మ, పి.విజిత, ఈ.సరిత, జి.విజయ, సీ.హెచ్.మమత, టి.అనిత, బి.శ్రీవాణి, ఎ.సరస్వతిని పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. కేయూ క్యాంపస్ : కేయూకు చెందిన విద్యార్థి సంఘాల నేతలు బొట్ల మనోహర్, మంద నరేష్, దులిశెట్టి మధును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. -
ఛలో ట్యాంక్ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్..!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలు మగ్దూం భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినా కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్‌ను కోరితే.. నిరాకరించారని వారు వెల్లడించారు. ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్టులపై ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు చర్చించారు. కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కె.నారాయణ, తమ్మినేని వీరభద్రం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఛలో-ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు ఇవ్వడం లేదు. ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. ఏదేమైనా శనివారం మధ్యహ్నం చలో ట్యాంక్ బండ్ జరిపి తీరుతామని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపోకుండా.. విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్ ఆర్టీసీకి లేదని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదని వెల్లడించారు. కార్మికులకు మద్దతుగా సామూహిక నిరసన దీక్షలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. -
ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటలు చేసినా, మంత్రులు కార్మికులకు నచ్చజెప్పినా 300 మంది కూడా ఉద్యోగంలో చేరలేదని వెల్లడించారు. జాయిన్ అయినవాళ్లకు కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గుర్తింపు సంఘం ఆమోదం తీసుకోవాలనే చట్టముంది. చర్చల ప్రక్రియమొదలుపెట్టండని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’అన్నారు. కేసీఆర్ ఇష్టారాజ్యం కాదు.. ఉద్యోగ సంఘాలను కలిసి రేపో, ఎల్లుండో పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా దగ్గరికి ఆర్టీసీ ప్రతినిధులు వెళ్లి సమస్యను వివరించారని తెలిపారు. 33 రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్య పరిష్కరానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే నడవదు. కోర్టులు ఉన్నాయి. మేం సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లం’అని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు ఉద్యోగాల్లో చేరడం లేదని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు అందరూ కలిసినా కార్మికులను ఉద్యోగంలో చేర్చలేకపోతున్నారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైందని రాజిరెడ్డి స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు శనివారం అఖిలపక్ష నేతలతో భేటీ అవుతోంది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె నివారణకు ఏవైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయని అంతా భావించారు. కానీ తదుపరి విచారణ ఈనెల ఏడో తేదీకి వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తనంతట తానుగా సమ్మె ముగింపునకు చర్యలు తీసుకునే అవకాశం లేదని కార్మికులు భావిస్తున్నారు. ఫలితంగా తదుపరి కోర్టు విచారణ జరిగే వరకు సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సిద్ధం చేసిన కార్యాచరణ పూర్తి కావటంతో కొత్త ప్రణాళిక రూపొందించాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్ష నేతలతో సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. మరోవైపు శనివారం సీఎం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చి పెద్ద సంఖ్యలో రూట్లు కేటాయించే అంశం ఉంటుందని చెబుతున్నారు. అదే నిర్ణయం వెలువడితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. అలాగే మిలియన్ మార్చ్ నిర్వహించే అంశాన్ని యోచిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో, శనివారం సమావేశంలో దీనిపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారులూ అబద్ధాలు ఆపి.. సమ్మెకు రండి ఆర్టీసీలో పనిచేస్తూ సంస్థకు నష్టం జరిగేలా అధికారులు హైకోర్టుకు తప్పుడు వివరాలను అందించటం సిగ్గుచేటని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంలో పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైకోర్టు వెలుపల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ శాఖ నుంచి ఆర్టీసీకి నిధులు రావాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ అధికారులు మున్సిపల్ శాఖకు అనుకూలంగా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికారులు వాస్తవాలు వదిలేసి ప్రభుత్వం చెప్పినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు తప్పుడు వివరాలు ఇస్తున్నారని జడ్జి గుర్తించి అక్షింతలు వేసినా వారిలో మార్పు రాకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
21న గుంటూరులో మిలియన్ మార్చ్
వేపాడ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఈ నెల 21న రాష్ట్ర రాజధాని గుంటూరులో నిర్వహించే మిలియన్ మార్చ్‌ను జయప్రదం చేయాలని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ ఆతవ ఉదయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పు దళిత ఆదీవాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై పాలక ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. భారత్ బంద్‌లో 11 మంది దళిత యువకులు చనిపోయారని, ఇది కేంద్రంలోని కాషాయ పాలకులకు కనిపించకపోవడం విచారకరమన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి వరకు నిర్వహించే మిలియన్‌మార్చ్‌కు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత నేతలు కెర్రి దేముడు, డప్పురాజు, ఎ.నాగరాజు, సీహెచ్ నూకరాజు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు
తాడితోట(రాజమహేంద్రవరం): ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీలు హనుమంతరావు, జీవీ హర్షకుమార్లు పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా హనుమంతరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఆయుధంగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు సుప్రీం కోర్టు ద్వారా తీర్పు ఇప్పించిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్న తరుణంలో అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే వారికి రక్షణ ఎక్కడా? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దళిత, గిరిజన, బీసీలు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ఆద్వర్యంలో ఈ నెల 18న గుంటూరులో జరగనున్న మిలీనియం మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని, ఈనెల 27న వరంగల్‌లో మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగనున్న సింహగర్జన మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలకు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో కేసీఆర్‌లను అనుమతులు ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో ఉవ్వెత్తున ఉద్యమం చేశారని పేర్కొన్నారు. ఈనెల 18న ఎస్సీ, ఎస్టీ సంఘాలతో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మిలీనియం మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ విధానం ఏమిటో తెలియజేయలేదన్నారు. ప్రజాస్వామ్యం ఉందా? వేమగిరిలో దళితుల ఇళ్ల పక్కనే మాజీ సర్పంచ్ వెంకటా చలం అనుమతులు లేకుండా 120 అడుగులు లోతు కిందకు తవ్వేస్తే ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని మాజీ ఎంపీలు హనుమంతరావు, హర్షకుమార్లు అన్నారు. కరెంటు స్థంబాలనుసైతం తవ్వేసినా విద్యుత్ అధికారులు కేసులు నమోదు చేయలేదంటే వారికి ఎంత నిర్లక్ష్యమో తెలుస్తుందన్నారు. రూ.4.50 కోట్లతో ఇళ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ కడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇళ్లు వేరే ప్రాంతానికి తరలిస్తామనడమేంటని వారు ప్రశ్నించారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు యర్రా రామకృష్ణ, దళిత సంఘాల నాయకులు దొనిపాటి అనంత లక్ష్మి, అంగటి సరళ, మామిడి ప్రియ, శైలజ, చిన్నారావు తదిరులు పాల్గొన్నారు. ఆ ముఖ్యమంత్రులిద్దరూ దళిత ద్రోహులే.. కడియం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు దళిత ద్రోహులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. మండలంలోని వేమగిరిలో అక్రమ క్వారీయింగ్ జరిగిన ప్రాంతాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దళితుల ఇళ్లు కూలిపోయేలా అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం రక్షణ గోడ నిర్మించాలని, అంబేడ్కర్ పేరిట బాధితులకు కాలనీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేమగిరి అక్రమ క్వారీయింగ్ బాధితుల తరఫున ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అక్రమ క్వారీయింగ్ కారణంగా నష్టపోయిన బాధితులు ఆయనకు తమ ఆవేదనను వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి బడుగు ప్రశాంతకుమార్, విప్పర్తి ఫణికుమార్, కాగిత విజయకుమార్, కాపు సంఘం నాయకులు రామినీడి మురళి, ఫిషర్మెన కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శీలి జాన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కంట కన్నీరు ఆగదా?
లాంగ్‌మార్చ్ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు. వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే. 2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, పంజాబ్, హరియాణాలో రైతుల అలజడి, మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం. రైతాంగానికి సంబంధించిన వార్తలు పత్రికల పతాకశీర్షికలలో కనిపించడం అరుదు. ఇటీవల మహారాష్ట్ర రైతాంగం, ఆదివాసీలు సుమారు 30 వేల మంది నాసిక్ నుంచి ముంబై వరకు 10 రోజులు ఎర్రజెండాలు పట్టుకొని కదం తొక్కిన చారిత్రక ఘటన దేశంలోని యావత్ మీడియాకు ప్రధాన వార్త కావడం గమనార్హం. లాంగ్‌మార్చ్‌గా పిలుచుకున్న మహారాష్ట్ర రైతుల ఉద్యమంలో అనేక ప్రత్యేకతలు కనిపించాయి. అడుగడుగునా ప్రజల మద్దతు లభించింది. మంచినీరు, ఆహారం స్వచ్ఛందంగా అందించి వారు సంఘీభావాన్ని ప్రదర్శించారు. చిన్న అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా దేశ ప్రజల మన్ననలను, సానుభూతిని రైతులు పొందగలిగారు. న్యాయమైన డిమాండ్లు ‘లాంగ్‌మార్చ్’ వెనుక అనేక కారణాలున్నాయి. ప్రదర్శన ద్వారా అవన్నీ ప్రజల్లో చర్చకు వచ్చాయి. రైతుల డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల ‘లాంగ్‌మార్చ్’ విజయవంతం అయిందని చెబుతున్నారు. కానీ, ఆ హామీ అమలైనప్పుడే విజయమని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతాంగం ఏడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. రుణమాఫీ అమలు, ఆదివాసీలకు అటవీభూములపై యాజమాన్య హక్కులు; స్వామినాథన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరల అమలు; కరవు, వరదలు, చీడపీడలవల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లింపు, సూపర్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులకు బలవంతంగా భూముల సేకరణ నిలుపుదల చేయడం, విద్యుత్ బిల్లుల బకాయిల రద్దు మొదలైనవి వారి డిమాండ్లలో ప్రధానమైనవి. రుణమాఫీ హామీని మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలోనే బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు పూర్తిగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా రుణభారాన్ని కుదించి విడతల వారీగా నిధులు కేటాయించి బకాయిలు రద్దు చేసిందో, అదేబాటలో మహారాష్ట్ర ప్రభుత్వం నడిచింది. రూ. 34,000 కోట్ల రుణమాఫీ చేస్తే 89 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది. ప్రధానంగా తొలివిడత చేసిన రుణమాఫీలో కౌలు రైతులు లేరు. రుణమాఫీ ప్రకటించి 6 నెలలు అయినా 10% రైతులకు మాత్రమే అమలైంది. మహారాష్ట్రలో అధిక శాతం పోడు వ్యవసాయం చేసే రైతులున్నారు. వారికి రుణమాఫీ వర్తింపజేయడం లేదు. మహారాష్ట్ర రైతుల ఆందోళనకు మరో కారణం నకిలీ విత్తన సమస్య. హైబ్రీడ్ రకాల విత్తనాల బదులుగా దేశీయంగా తయారుచేసే విత్తనాలే ఉపయోగించాలనీ అది దేశభక్తికి సంకేతమనీ ఆరెస్సెస్ ప్రచారం చేయడం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వంతపాడటంతో రైతులు దేశవాళీ విత్తనాలే కొనుగోలు చేస్తున్నారు. వాటికి చీడపీడల్ని తట్టుకొనే శక్తిలేదు. ఫలితంగానే 84% వ్యవసాయ భూముల్లో రైతులు పత్తిసాగు చేస్తే పింక్‌బోల్ వర్మ్ వ్యాధి సోకింది. రైతులు నిలువునా మునిగిపోయారు. దీనికితోడు జనవరి చివరివారంలో కురిసిన అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో పంటను దెబ్బతీశాయి. మరఠ్వాడా, నాగ్‌పూర్, అమరావతి, యవత్మల్, నాసిక్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా కరవు ఏర్పడింది. వీటన్నింటి కారణంగా 2017–18లో మహారాష్ట్రలో సాధారణ పంటకంటే 37% పంట దిగుబడి తగ్గింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మహారాష్ట్రలో వ్యవసాయాభివృద్ధి రేటు 8.3% తగ్గి నెగటివ్ గ్రోత్ నమోదయింది. దీనికితోడు ఫడ్నవీస్ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, ఎక్స్‌ప్రెస్‌వే, నదుల అనుసంధానం పేరుతో బలవంతపు భూసేకరణ చేపట్టింది. దీనివల్ల అనేక ఆదివాసీ, గిరిజన గ్రామాలు విధ్వంసానికి గురవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే గత రెండు దశాబ్దాలలో 65,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ ఏడాది సగటున రోజుకు 9 మంది రైతులు తనువులు చాలించిన దయనీయస్థితి నెలకొంది. రైతుల ఆందోళనకు మరో కారణం అటవీ భూమి హక్కుల బదలాయింపు. పుష్కరం క్రితమే, ఆనాటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చేసింది. అటవీశాఖ పరిధిలో ఉన్న గిరిజన భూములపై యాజమాన్య హక్కును వారికే బదలాయించాలని చట్టంలో ఉంది. కానీ, నేటివరకు దేశంలో అమలు జరగడం లేదు. అందుకే మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో 25.61%; థానేలో 13.9% మంది ఉన్న గిరిజనులు లాంగ్‌మార్చ్‌లో ముందువరుసలో నిలిచారు. హైవేల నిర్మాణాలు, నదుల అనుసంధానం ప్రాజెక్టులు మొదలైన ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో అధిక సంఖ్యలో నష్టపోతున్నది గిరిజనులే. రైతులు, గిరిజనుల్లో చైతన్యాన్ని రగలించి లాంగ్‌మార్చ్‌కు సమాయత్తం చేసింది అఖిల భారత కిసాన్ సభ. ఆర్నెల్ల గడువు కోరిన ప్రభుత్వం 30 వేల మందితో సాగిన లాంగ్‌మార్చ్‌కు ఫడ్నవిస్ ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఆర్నెల్లు గడువుకోరింది. ఆరుగురు మంత్రుల కమిటీ రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం రాత పూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపైకి మళ్లింది. ప్రభుత్వం ఇటీవల ఏడో వేతన కమిషన్ నివేదిక అమలుకు ఒప్పుకొంది. అర్బన్ మెట్రో ప్రాజెక్టు, శివాజీ విగ్రహ ఏర్పాటు మొదలైన భారీ వ్యయంతో కూడుకొన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతుల డిమాండ్లను తీర్చడానికి నిధుల సర్దుబాటును ఏవిధంగా చేయగలదన్న అనుమానం అందరిలో కనిపిస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలు ప్రకటించడం కేంద్రం పరిధిలో ఉంది. అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందించిన అఫిడవిట్లో ఉత్పత్తి వ్యయానికి 50% పెంచి కనీస మద్దతు ధరలు ఇస్తామని పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చేది సందేహమే! నిజానికి దేశ వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాల్సింది కేంద్రమే. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చాటుకోవడం కోసం 2015లో అప్పటివరకూ ఉన్న ‘వ్యవసాయ మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్)’ను ‘వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ’ అని మార్చింది. అలాగే ఈ శాఖకు గతంలో ఉన్న ‘ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రైతు శ్రేయస్సు’ అనే లక్ష్యాలను మార్చుకొని 2022– 23 నాటికల్లా రైతు ఆదాయం రెట్టింపు చేయడాన్ని లక్ష్యంగా ఏర్పరచుకుని ప్రచారం చేస్తుంది. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం రైతుల ఆదాయం 2022–23 నాటికి రెట్టింపు కావాలంటే, ఏడేళ్ల పాటు రైతుల ఆదాయం ఏటా 10.4% మేర పెరగాలి. గత దశాబ్దన్నర కాలం అనుభవాలను విశ్లేషించి చూస్తే 1993–94 నుంచి 2004–05 వరకు అంటే దశాబ్దాల కాలంలో రైతుల ఆదాయంలో కనిపించిన వృద్ధి 3.3% మాత్రమే. 2004– 05 నుంచి 2011–12 మధ్యకాలంలో రైతుల ఆదాయాభివృద్ధి 5.52% మేర పెరిగింది. మద్దతు ధరల్లో గణనీయమైన పెరుగుదల లేకుండా రైతుల ఆదాయం రెట్టింపు కాజాలదని స్వామినాథన్ నిరూపించినప్పటికీ కేంద్రం కనీస మద్దతు ధరలను శాస్త్రీ యంగా పెంచడానికి సిద్ధంగా లేదు. కారుణ్య మరణాలకు అనుమతి కోరిన రైతులు జీవించడం సాధ్యం కాని పరిస్థితులలో రోగులు కారుణ్య మరణాలు కోరుకోవడంలో తప్పులేదంటూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు చనిపోయేందుకు అనుమతినివ్వాలని గవర్నర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లకు లేఖలు రాయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పండించిన పంటకు సరైన ధర లభించక.. అప్పుల బారిన పడ్డామని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం సేకరించిన తమ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని రైతులు పేర్కొంటూ తమ కుటుంబాలను పోషించుకొనే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని వారు వేడుకొన్నారు. లాంగ్‌మార్చ్ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు. వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే. 2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో పోలీసు కాల్పుల్లో రైతులు హతం అయిన దారుణ ఉదంతం; పంజాబ్, హరియాణాలో రైతుల ఆందోళన, తాజాగా మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయవృత్తి లాభసాటిగా లేకపోవడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వలసలను నివారించాలంటే వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా రూపొందించడం మినహా మరోమార్గం లేదు. కేంద్రం, రాష్ట్రాలు అభివృద్ధి మంత్రం జపిస్తూ పట్టణాలు, నగరాల్లో ఫ్లైఓవర్లు, 4 లైన్ల రహదారులు, బుల్లెట్ ట్రైన్లు మొదలైన ఆకర్షణీయమైన ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే. కానీ వ్యవసాయరంగంపై అధికశాతం ఆధారపడిన వారి సౌకర్యాలు, సంక్షేమాన్ని విస్మరించడం వల్లనే నేడు రైతులు రోడ్లెక్కుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్టు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లాంటి ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకూడదు. డా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
‘స్ఫూర్తి సభ’ భగ్నం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపునిచ్చిన ‘మిలియన్ మార్చ్’ను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకోవడానికి.. తెలంగాణ జేఏసీ చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌ను, పరిసర ప్రాంతాలను పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్లతోపాటు టీజేఏసీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, న్యూడెమోక్రసీ, అరుణోదయ, పీవోడబ్ల్యూ, తదితర వామపక్ష ప్రజాసంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు తరలివస్తున్న వారిని హైదరాబాద్ శివార్లలోనే అదుపులోకి తీసుకున్నారు. ముళ్ల కంచెలు.. బారికేడ్లు.. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, అయినా సభ జరిపి తీరుతామని టీజేఏసీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, అరుణో దయ తదితర పార్టీలు, ప్రజాసంఘాలు ప్రకటించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరూ వెళ్లకుండా మార్గాలన్నింటినీ మూసేశారు. అన్ని చోట్లా ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా లిబర్టీ, ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దూసుకొచ్చిన ఉద్యమకారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. పలువురు టీజేఏసీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, పీవోడబ్ల్యూ సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, పీవోడబ్ల్యూ నగర అధ్యక్షురాలు సరళ తదితరులు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో మరోవైపు నుంచి పీడీఎస్యు విద్యార్థులు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. టీజేఏసీ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యంగౌడ్, న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన రాష్ట్ర నాయకురాలు రమ, ఎస్ఎల్ పద్మ, అరుణ తదితరులను తెలుగు తల్లి విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేశారు. కోదండరాం నివాసం వద్ద హైడ్రామా టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో.. పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు. పరిసర ప్రాంతాల్లో మోహరించారు. కోదండరాంను కలసి స్ఫూర్తి సభకు వెళ్లేందుకు అక్కడికి వచ్చిన జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కోదండరాంను అరెస్టు చేసేందుకు హైడ్రామా నడిపించారు. కోదండరాం నివాసం పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి కోదండరాం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులను దారి మళ్లించేందుకు టీజేఏసీ కార్యకర్త ఒకరు కోదండరాం ఇంటి ప్రహరీ గోడ దూకి వెళుతున్నట్టుగా పారిపోయారు. అది చూసి హైరానా పడిన పోలీసులు.. ఆయనను పట్టుకునేందుకు పరుగులు తీశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడిన కోదండరాం.. పలువురు జేఏసీ నాయకులతో కలసి తన ఇంటికి తాళం వేసుకుని స్వీయ నిర్బంధం ప్రకటించుకున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు రావడంతో అరెస్టు చేశారు. నిరంకుశ పాలనకు నిదర్శనమిది టీజేఏసీ చైర్మన్ కోదండరాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా నిర్బంధిస్తూ, అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. కోదండరాం అరెస్టుకు ముందు తన నివాసంలో, అరెస్టు తర్వాత బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మేమే తెలంగాణ తెచ్చినం, మా ఇష్టమున్నట్టుగా పాలన సాగిస్తాం..అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలపై ఇంత నిర్బంధమా.? 2011లో ఎన్ని ఆంక్షలున్నా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేశాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇంతకాలం ఎదురుచూశాం. ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే.. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఏర్పాటు చేశాం. కానీ ప్రభుత్వం ఈ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరించడం నిరంకుశ పాలనకు నిదర్శనం..’’అని కోదండరాం మండిపడ్డారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి çసభ సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే రెండు రోజుల నుంచి ముందస్తు అరెస్టులు చేశారని చెప్పారు. వేల మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని.. అప్రజాస్వామికంగా కొనసాగుతున్న అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామని, పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు. మాకూ అలాంటి స్వేచ్ఛ ఉంది సీఎం కేసీఆర్ తొలి నుంచీ తనను ప్రశ్నించే వారిపట్ల నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేసేందుకు ముఖ్యమంత్రికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో.. స్ఫూర్తి సభలో పాల్గొనేందుకు తమకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేయడానికి తాము తలపెట్టిన స్ఫూర్తి సభ విజయవంతమైందన్నారు. 2011లో తనను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, ఇప్పుడూ అక్కడికే తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. నియంత పాలన: చాడ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఆయనను.. పార్టీ కార్యాలయం మగ్దూంభవన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ నిర్బంధాలతో ఏం సాధిస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సీపీఐ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారని.. వారికి రాత్రి నుంచి తిండి కూడా పెట్టకుండా బాధ పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవసరమైన సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవసరం లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్బంధం విధించినా.. నైతికంగా సీపీఐ టీజేఏసీలే గెలిచాయన్నారు. నన్నెందుకు అరెస్టు చేశారు? పోలీసులను నిలదీసిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ శనివారం మగ్దూంభవన్ వద్ద సీపీఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏదో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయన పోలీసులను నిలదీశారు. ‘‘మా పార్టీ ఉమ్మడి కార్యాలయం ఇక్కడే ఉంది. ఓ పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..’’అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణలో పోలీసు నిర్బంధం ఇంతగా ఉండడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ పెద్ద ఉద్యమం జరుగుతోందని.. దేశంలోని పలు పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. టీడీపీ ఎన్డీయేతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకుని బయటకు వచ్చి.. హోదాపై పోరాటం చేయాలని పేర్కొన్నారు. -
‘బూటు కాలుతో తన్నిన ఏసీపీ, విచారణ’
సాక్షి, హైదరాబాద్: నగరంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకి అనుమతి ఇవ్వకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ట్యాంక్ బండ్‌ను మూసివేశామని పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. సిటీలో ఇప్పటి వరకు 200 మంది ఆందోళకారులను అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం సిటీ మొత్తం ప్రశాంత వాతావరణం ఉందన్నారు. టీజేఏసీ కార్యకర్తలపై ఓ మహిళ ఏసీపీ బూటు కాలుతో తన్నిన ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. కాగా, మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరిపి తీరుతామని తెలంగాణ జేఏసీ ప్రకటించిడంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. -
బొల్లారం పోలీస్‌స్టేషన్‌కి ప్రొఫెసర్ కొదండరామ్
-
కోదండరామ్ అరెస్ట్; టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్ మార్చ్ సభకు బయలుదేరుతుండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వాహనాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన చాలాసేపు కారులోనే ఉండిపోయారు. తర్వాత ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డిని పార్టీ కార్యాలయంలోనే అరెస్ట్ చేశారు. కాగా, ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ సభకు అనుమతి లేదని, ఇటువైపు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇటువైపు వచ్చే దారులను మూసివేసినప్పటికీ కొంత ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సాయంత్రం సభ నిర్వహించి తీరతామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
పోలీసుల అదుపులో కొదండరామ్
-
ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్ మార్చ్’ ట్రాఫిక్ ఆంక్షలు
-
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలా?
-
కోదండరాం వర్సెస్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై నేడు (శనివారం) తలపెట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ తీవ్ర ఉద్రిక్తతలు రేపుతోంది. తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించేందుకు ఆయా పక్షాల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు జేఏసీ చైర్మన్ కోదండరామ్ సిద్ధమవుతుండగా.. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున జేఏసీ నేతలు ఒక్కొక్కరుగా కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలా? ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వకపోవటంపై కోదండరాం తీవ్రంగా మండిపడ్డారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయని, నాడు ప్రజలు ఉవ్వెత్తున తరలివచ్చి విజయవంతం చేశారని గుర్తుచేసుకున్నారు. 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నామన్నారు. ‘ప్రస్తుతం తెలంగాణాలో సమస్యలు చాలా ఉన్నాయ్. నిరుద్యోగం, రైతు సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని అన్నారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఇంతకాలం ప్రభుత్వం నిర్వహిస్తుందేమోనని ఎదురుచూశామని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలు ఉంటాయనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమతోపాటు తెలంగాణ ఇంటి పార్టీ , సీపీఐ, న్యూడెమోక్రసి, టీపీఎఫ్, అరుణోదయ సంస్థ , విద్యాసంఘాల నేతలు స్పూర్తి సభకు తరలి వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అన్నివర్గాల వారు వేలాదిగా మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు హైదరాబాద్ తరలి వస్తున్నారని చెప్పారు. జిల్లాల్లో హైదరాబాద్‌లో ఎన్ని అక్రమ అరెస్టు చేసినా, నిర్బందాలు విధించినా స్పూర్తి సభ విజయవంతం అవుతుందనే నమ్మకం తనుకందన్నారు. మరోవైపు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌కు దారితీసే మార్గాలన్నింటినీ ముళ్లకంచెలతో మూసివేశారు. ఇందిరాపార్కు సమీపంలోని కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. గోశాల వద్ద కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద రోడ్డు మూసివేసి లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు. అటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ‘మిలియన్ మార్చ్’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్‌బండ్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ♦ సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్ దాటి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్–కవాడిగూడ–డీబీఆర్ మిల్స్–కట్టమైసమ్మ–అంబేడ్కర్ విగ్రహం–తెలుగుతల్లి–రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు. ♦ నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. వీటిని గగన్‌మహల్–ఇందిరాపార్క్ మీదుగా పంపిస్తారు. ♦ నిరంకారి, పాత సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఇక్బాల్ మీనార్ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను మింట్ కాంపౌండ్/సెక్రటేరియేట్–ఎన్టీఆర్ మార్గ్–నెక్లెస్ రోటరీ–సంజీవయ్య పార్క్–నల్లగుట్ట–సికింద్రాబాద్ మీదుగా మళ్లిస్తారు. ♦ లిబర్టీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీఆర్కే భవన్–తెలుగుతల్లి –నెక్లెస్ రోటరీ–వీవీ స్టాట్యూ లేదా నెక్లెస్ రోడ్–సంజీవయ్యపార్క్–సికింద్రాబాద్ మీదుగా పంపిస్తారు. ♦ బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోర్ మెడికల్ హాల్–బాలాజీ గ్రాండ్ బజార్–క్రిస్టల్–తెలుగుతల్లి–ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు. నేడు పార్కులకు సెలవు తార్నాక: మిలియన్ మార్చ్‌ను పురస్కరించుకుని హెచ్ఎండీఏ పరిధిలోని పార్కులకు శనివారం సెలువు ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలు గమనించాలని హెచ్ఎండీఏ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. -
మిలియన్ మార్చ్ : ట్యాంక్‌బండ్ అష్ట దిగ్బంధం
-
అరెస్టులపై కోదండరాం ఫైర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఘట్టం ‘మిలియన్ మార్చ్’ వార్షికోత్సవాలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. మార్చి 10న కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీజేఏసీ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. కాగా, ఈ అరెస్టులను కోదండరాం ఖండించారు. నిర్బంధాల ద్వారా ప్రజాస్వామిక ఆకాంక్షలను అణిచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే జేఏసీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిలియన్ మార్చ్ సందర్భంలోనే కోదండరాం నూతన రాజకీయ పార్టీ ప్రకటన చేయాలని భావించడం తెలిసిందే. మార్చ్‌కు అనుమతి లేదు : ఈ నెల 10వ తేదీన ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహణకు అనుమతించాలి టీజేఏసీ, సిపిఐలు ఇప్పటికే పోలీసులను కోరాయి. ‘ఆట, పాట, మాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ జెఏసి తరఫున చాడ ఈ నెల 2న నగర సెంట్రల్ జోన్ డిసిపికి దరఖాస్తు చేశారు. అయితే, నగరం నడిబొడ్డున కార్యక్రమం చేపట్టడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, పైగా పరీక్షలు కూడా జరుగుతుండటంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారని, అందుకే అనుమతి ఇవ్వడం కుదరదని డిసిపి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో సంఘ విద్రోహశక్తులు చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన అనుభవాన్ని కూడా పోలీసులు గుర్తుచేశారు. ఆ సందర్భంగా చాలా మందికి గాయాలు కావడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఆప్పట్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. -
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు తరలిరండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సభకు భారీగా తరలిరావాలని ప్రజలకు టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై శనివారం ఇక్కడి మఖ్దూం భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వానికి గుర్తుచేసేందుకే స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని మూడేళ్లు ఎదురు చూశామని, కానీ వాటిని పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మిలియన్ మార్చ్ చారిత్రక ఘట్టమని, విద్యార్థులు ఉద్యమంలో దెబ్బలు తిని జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ మాట్లాడుతూ మిలియన్ మార్చ్‌లో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. జిల్లాల్లో మిలియన్ మార్చ్‌కు స్ఫూర్తిగా అమరుల విగ్రహాల వద్ద స్ఫూర్తి సభలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా స్ఫూర్తి సభలో పాల్గొన వచ్చన్నారు. -
మరాఠాల ‘మిలియన్ మార్చ్’!
రిజర్వేషన్ల డిమాండ్‌తో ముంబైలో భారీ ప్రదర్శన హాజరైన 3 లక్షల మంది ఉద్యమకారులు వెంటనే స్పందించిన ‘మహా’ ప్రభుత్వం ఉపకారవేతనాలు ఇచ్చేందుకు అంగీకారం ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మరాఠా ప్రజలు చేపట్టిన భారీ ర్యాలీతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం బుధవారం కాషాయ సంద్రమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు పెట్టుకుని, అదేరంగు జెండాలు పట్టుకుని ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. గట్టి భద్రత మధ్య బైకుల్లాలోని జీజామాత ఉద్యానవనం నుంచి ర్యాలీ ప్రారంభమై 10 కి.మీలు సాగిన అనంతరం ఆజాద్ మైదానం వద్ద ముగిసింది. ఉద్యమంలో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించిన మరాఠాలు తమ ర్యాలీకి మద్దతుగా శివసేన పార్టీ కట్టిన బ్యానర్లను చించేశారు. 12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. అటు రాష్ట్ర శాసనసభలోనూ మరాఠాలకు రిజర్వే షన్లు కల్పించాలంటూ అధికార, విపక్ష సభ్యు లు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన నిర్వహిం చారు. సభ 45 నిమిషాల్లో 3 సార్లు వాయిదా పడింది. ర్యాలీతో వెంటనే దిగొచ్చిన మహా రాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం...మరాఠా సమాజం నాయకులు, ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, బీసీలకు ఉన్నట్లుగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించేందుకు ప్రతి జిల్లాలోనూ అవసరమైన భూమిని, రూ.5 కోట్ల నిధిని ఇస్తామన్నారు. రిజర్వేషన్ల అంశా న్ని బీసీ కమిషన్ పరిశీలిస్తుందన్నారు. మరాఠా ల కోసం ఉద్దేశించిన వివిధ పథకాల అమలు ను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొపర్ది హత్యాచారం కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామనీ, నిందితుల తరపు న్యాయవాదులు కేసు విచారణను ఆలస్యం చేయాలని చూస్తున్నారన్నారు. అలాగే 3 లక్షల మంది మరాఠా విద్యార్థులకు అన్నాసాహెబ్ పాటిల్ అభివృద్ధి సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణను అందిస్తామనీ, రూ.10 లక్షలలోపు విద్యారుణాలు తీసుకునేవారికి వడ్డీలో రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిలో 58వ ర్యాలీ గత ఏడాది కాలంలో మరాఠా ప్రజలు చేపట్టిన 58వ ర్యాలీ ఇది. 2016 జూలైలో అహ్మద్‌నగర్ జిల్లాలోని కొపర్దిలో 14 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక హత్యాచారం జరిగింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని కోరుతూ ఔరంగాబాద్‌లో గతేడాది ఆగస్టు 9న తొలిసారి మరాఠా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుంచి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నివారణ చట్టానికి సవర ణలు, రైతు రుణమాఫీ, పంటలకు మద్దతుధర కల్పించడం తదితర డిమాండ్లపై ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు. సకల మరాఠా సమాజ్ అనే సంస్థ వివిధ మరాఠా సంఘాలను ఒకచోట చేర్చి ఈ ర్యాలీలను నిర్వహిస్తోంది. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించాల నడాన్ని 2014లో బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003–04లోనూ మరాఠాలోనూ ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది.