Mira Rajput
-
మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్‌పుత్‌ను 2015లో షాహిద్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన భార్య మీరా రాజ్‌పుత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్‌తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్‌ను స్వాగతించారు. -
నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్
Shahid Kapoor Recalls Wife Mira Reaction After Watching Udta Punjab: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తున్నాడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్. తాజాగా షాహిద్ నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ తనను ఓ సినిమా చూసి వదిలేద్దామనుకుందంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో తన నటనను చూసి తను రాంగ్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నానని మీరా భావించినట్లు షాహిద్ పేర్కొన్నాడు. 'మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు వివాహం జరిగిన ప్రారంభంలో నా ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్‌కు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్ గదిలో ప్రత్యేక షో వేశారు. నేను నాతోపాటు మీరాను కూడా తీసుకెళ్లాను. సినిమా చూస్తున్నంతా సేపు మీరా మాములుగానే ఉంది. కానీ మూవీ ఇంటర్వెల్ సీన్ వచ్చాకా మీరా ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. తను నా పక్క నుంచి లేచి దూరంగా వెళ్లి నిల్చుంది. నేను ఏమైందని అడిగా. దానికి తను 'నువ్ ఇలాంటి వాడివా ? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ? నువ్ ఆ టామీ సింగ్లాంటివాడివా? నీతో నేనింకా కలిసి ఉండను. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్లిపోతా.' అని చెప్పింది. తన మాటలకు ఒక్కసారిగా షాకయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత తనకు అదంతా సినిమా. అందులోనే అలా నటిస్తారని అర్థమయ్యేలా చెబితే గానీ మీరా కుదుటపడలేదు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్, మీరా 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. -
కొత్త కారు కొన్న బ్యూటీఫుల్ కపుల్.. దాని విలువ కోట్లలోనే
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది షాహిద్, మీరా. ఇటీవల షాహిద్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టా అకౌంట్లో మీరా బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ జంట పెట్టె పోస్ట్‌లను అభిమానులు #కప్గోల్స్గా పిలుస్తారు. అలాగే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుందని ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటారు. అయితే సోమవారం (ఫిబ్రవరి 28) షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ఒక కారు నుంచి దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే షాహిద్, మీరా దిగిన కారు విలువ సుమారు రూ. 2.77 కోట్లు ఉంటుందని అంచనా. వారు ఈ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.11 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల వరకు ఉంటుంది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ బ్లాక్ మెర్సిడేస్ను డెలీవరి చేసేందుకు కంపెనీ నిర్వాహకులు వచ్చారు. ఈ కారును తీసుకునేందుకు షాహిద్, మీరా వచ్చే క్రమంలో ఫొటోగ్రాఫర్లకు చిక్కారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలి.. హీరో భార్య
Shahid Kapoor Wife Mira Rajput Birthday Wishes To Him: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తోన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఫిబ్రవరి 25న షాహిద్ పుట్టిన రోజు సందర్భంగా బీటౌన్ తారల నుంచి శుభాకాంక్షల జల్లులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ ప్రేమతో కూడిన విషెస్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది. మీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఇలాంటి సాయింత్రాలు మనిద్దరం కలిసి మరెన్నో జరుపుకోవాలి' అని క్యాప్షన్ రాస్తూ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో షాహిద్ తెల్లటి టీషర్ట్, డెనిమ్ టాప్ వేసుకోగా, మీరా ఫ్లోరల్ ప్రింట్‌తో బ్లాక్ ఆఫ్ షోల్డర్ దుస్తులను ధరించింది. మీరా అందంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే షాహిద్ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. అలాగే సూర్యుడు అస్తమిస్తుండగా దిగిన మరో ఫొటోను పంచుకుంది మీరా. షాహిద్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్‌కు ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ హాజరైనట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
ఒక్క రాత్రికి మూడు లక్షలు.. ఊహల్లో తేలిపోతున్న స్టార్ హీరో భార్య
Shahid Kapoor Wife Mira Rajput Share Video: బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ భార్య సతీమణి మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. నాకెంతో ఇష్టమైన మాల్దీవుల్లో మా విహార యాత్రను చూసేయండి అంటూ వారి హాలీడే ట్రిప్ విశేషాలను పంచుకుంది. ఈ వీడియోలో తీరంలోని అందమైన విల్లాను చూపిస్తూ తాము బస చేసింది అక్కడేనని చెప్పకనే చెప్పింది. అలాగే తీరం తనకు ఎంతో దూరంలో లేదని చెప్తూ సముద్ర అలలను సైతం షూట్ చేసింది. ఈ వీడియోలో ఆమె చూపించిన విల్లాలో ఉండాలంటే ఒక్క రాత్రికే సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందట! ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ మళ్లీ ఆ రోజులు కావాలని, ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్లాలని ఉందంటూ ఊహల్లో తేలిపోయింది మీరా. కాగా గత నెలలో షాహిద్ కుటుంబం మాల్దీవులను చుట్టేసిన విషయం తెలిసిందే. ట్రిప్‌ను ఎంజాయ్ చేసి తిరిగి వచ్చినప్పుడు మీరా డ్రెస్సింగ్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇదిలా వుంటే షాహిద్, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016 ఆగస్టు 26న కూతురు మిషా జన్మించగా 2018 సెప్టెంబర్ 5న కొడుకు జైన్ జన్మించాడు. View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ భార్యపై ట్రోలింగ్
నెట్ వాడకం పెరిగి సోషల్ వాడకం విస్తృతమైన ఈ తరుణంలో ఏ పని చేసిన ట్రోలింగ్ గురవుతున్నారు సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ విపరీతంగా ట్రోలింగ్ గురైంది. ఇటీవలే ఈ జంట పిల్లలతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్ చేసింది. తాజాగా వారు ఆ టూర్ నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోని ఓ మీడియా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో షాహిద్, పిల్లలు పుల్ డ్రెస్‌లో ఉన్నారు. అయితే మీరా మాత్రం డెనిమ్ షార్ట్ వేసుకొని ఉంది. దీంతో భర్త, చివరికి చిన్న పిల్లలు కూడా పూర్తిగా బట్టలు ధరించారు కానీ భార్య మాత్రం పొట్టి బట్టలు వేసుకుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘నాకు పురుషులపై రోజు రోజుకి గౌరవం పెరిగిపోతోంది. ఎందుకంటే వారు పూర్తిగా దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. పురుషులందరికీ వందనాలు’ అంటూ తీవ్రంగా కామెంట్ పెట్టాడు మరో నెటిజన్. అయితే బాలీవుడ్ స్టార్ భార్య అయిన మీరాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ట్రోలింగ్ గురవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ స్టార్ వైఫ్‌ని ట్రోల్ చేశారు నెటిజన్లు. అయినప్పటికీ ఎప్పుడూ స్పందించలేదు మీరా. ఈసారి ట్రోలింగ్‌పై రెస్పాండ్ అవుతుందో లేక ఎప్పటిలాగే ఏం పట్టించుకోకుండా ఉండిపోతుందో.. చూడాలి. చదవండి: శృంగారం గురించి మాట్లాడాలంటే ఇక్కడి జనాలు భయపడతారు: దంగల్ నటి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య!
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తరచూ తన కుటుంబానికి సంబంధించిన విషయలను, ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెస్షన్లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్ ఏబి డివిలియర్స్ అంటే క్రష్, ఐ లవ్ హిమ్’ అంటూ మీరా సమాధానం ఇచ్చారు. క్షణం ఆలోచించకుండా ఓపెన్‌గా ఆమె చెప్పిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్-మీరాలు 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్లు ఉన్నారు. షాహిద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు రీమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్ భార్య రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్ భార్య
బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఏవైనా ప్రశ్నలు సంధించమని కోరగా నెటిజన్ల లెక్కలేనన్ని సందేహాలు ఆమె ముందు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వీటిలో పలు ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మీరు గర్భవతా? అన్న ప్రశ్నకు ఆమె లేదని చెప్పింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు సైతం కుదరదని జవాబిచ్చింది. దీంతో త్వరలోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందన్న ఊహాగానాలకు తెరదించినట్లైంది. ఇక మీరా 2018లో ఓ యాడ్ షూటింగ్లో మొదటిసారి పాల్గొన్నారు. పలు ఉత్పత్తులకు ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. (చదవండి: 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది) కాగా షాహిద్, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు మిషా, కొడుకు జైన్ ఉన్నారు. ఇక షాహిద్ సినిమాల విషయానికొస్తే.. ఆయన క్రికెట్ ప్లేయర్‌గా నటిస్తున్న జెర్సీ రీమేక్ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్ ప్రధానమైన వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్ జానర్లో ఈ సిరీస్ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. (చదవండి: నా పని గిన్నెలు కడగటం: షాహిద్) -
షాహిద్‌ను ఆట పట్టించిన మీరా..
ముంబై: బాలీవుడ్ ‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్ ప్రస్తుతం ‘జెర్సీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్య మీరా రాజ్‌పుత్‌ను మిస్ అవుతున్నానంటూ సోమవారం సోషల్ మీడియాలో వారిద్దరి ఫొటోను షేర్ చేశాడు. మీరా భుజంపై తల వాల్చి ఉన్న బ్లర్ ఫొటోను షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘మిస్ యూ’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశాడు. అయితే దీనికి మీరా తనదైన శైలిలో సరదాగా షాహిద్‌ను ఆటపట్టించింది. (చదవండి: ఆట ముగిసింది) షాహిద్ పోస్టుకు మీరా.. ‘మీరు అంతగా సంతోషంగా లేరు.. కాబట్టి నేను మిస్ యూ టూ అని పెట్టను’ అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. 2015లో వివాహం చేసుకున్న ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరూ పిల్లలు ఉన్నారు. అయితే ప్రస్తుతం షాహిద్ నటిస్తున్న తెలుగు రీమేక్ ‘జెర్సీ’ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడానికి షాహిద్ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. View this post on Instagram #imissyou ❤️ A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Nov 2, 2020 at 12:52am PST -
గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం
నా భార్యతో గొడవపడితే.. దాదాపు 15 రోజుల పాటు మాట్లాడను అంటున్నారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నేహా ధూపియా వ్యాఖ్యతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరాయ్యరు షాహిద్ కపూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంద’న్నారు. ‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుంద’న్నారు. ప్రస్తుతం షాహీద్ కపూర్ కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. -
ఒకరిని ఇక్కడే వదిలేస్తున్నా!
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారామె. ప్రస్తుతం షాహిద్‌తో కలిసి సింగపూర్ టూర్లో ఉన్న మీరా.. మేడమ్ టుస్సాడ్స్‌లో భర్త మైనపు విగ్రహంతో దిగిన ఫొటోను గురువారం షేర్ చేశారు. షాహిద్ కపూర్ మైనపు విగ్రహానికి ముగ్ధురాలైన మీరా.. ‘నా వాడిని(షాహిద్) నేను ఇంటికి తీసుకెళ్తున్నా. కానీ మీ కోసం ఇంకొకరిని ఇక్కడే వదిలేస్తున్నా మేడమ్ అంటూ క్రేజీ క్యాప్షన్ జత చేశారు. కాగా పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే లక్షన్నరకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక 2015లో షాహిద్ కపూర్- మీరా రాజ్‌పూత్‌ల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. కాగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో షాహిద్ కపూర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 21 ఈ చిత్రం విడుదల కానుంది. -
తైమూర్‌కు గట్టి పోటీ ఇస్తాడు చూడండి!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమారుడు జైన్ కపూర్‌తో సరదాగా గడుపుతున్న గూఫీ వీడియోను షేడీబాయ్స్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అమాయకపు చూపులతో.. తండ్రి చెబుతున్న మాటలు వింటూ కెమెరా వైపు చూస్తున్న జైన్ లుక్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 24 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ వీడియోను చూసి.. ‘ తండ్రీ, కొడుకులు సూపర్ క్యూట్. జైన్‌ను చూస్తుంటే తైమూర్ అలీఖాన్‌కు కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ఏదేమైనా ఒక మాట మాత్రం నిజం. మీ కంటే కూడా మీరా అక్క పోలికలే జైన్‌లో ఎక్కువగా కన్పిస్తున్నాయి’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. స్టార్కిడ్స్లో జైన్ టాప్‌లో ఉండటం ఖాయం అంటూ సంబరపడుతున్నారు. కాగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం సమయం కేటాయించడంలో షాహిద్ కపూర్ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ నటించిన కబీర్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాలీవుడ్ సెన్సేషన్ హిట్ అర్జున్ రెడ్డి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షాహిద్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. View this post on Instagram #shadyboys A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Apr 30, 2019 at 10:10am PDT -
చిన్నారి అద్భుతం; తప్పయితే క్షమించండి!!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన కుమారుడిని హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మీరా.. ‘ చిన్నారి అద్భుతం’ అంటూ క్యాప్షన్ జత చేశారు. కేరింతలు కొడుతున్న జైన్‌తో పాటు హృద్యమైన నవ్వుతో ఆకట్టుకుంటున్న మీరా ఫొటోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలో ‘మీ బంగారం చాలా అందంగా ఉన్నాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ‘తప్పైతే క్షమించండి. మీ భర్త షాహిద్ కంటే జైన్ ఎంతో అందంగా ఉన్నాడు. తనతో పాటు మీరు కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ మరొకరు చమత్కరించారు. కాగా 2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్- మీరా దంపతులు ఇటీవలే కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ చిన్నారికి జైన్ కపూర్ అని నామకరణం చేసిన ఈ జంట..అతడికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇక షాహిద్ కపూర్ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘ కబీర్ సింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. View this post on Instagram Small wonder ✨ A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Mar 29, 2019 at 10:47pm PDT -
మీరా.. ఇది దీపావళి.. హనీమూన్ కాదు!
ముంబై : టాలీవుడ్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి హిందీ రిమేక్‌లో నటిస్తున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను ఆ పాత్ర ఆవహించినట్టుంది. చిత్ర షూటింగ్లో హీరోయిన్‌కు లిప్‌లాక్స్ ఇచ్చి అలవాటైన ఈ హిందీ అర్జున్ రెడ్డి ఇంట్లోను తన భార్యకు లిప్‌లాక్స్ ఇస్తున్నాడు. ఈ ఫొటోలను అతని సతీమణి మీరా కపూర్ ‘ప్రేమ ఒక్కటే.. హ్యాపీ దీపావళి’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఇక ఈ లిప్‌లాక్ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ జంటను సమర్ధిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. ‘ఇది దీపావళి.. హనీమూన్ కాదు’ అని ఒకరంటే.. ‘ఇది థర్డ్ క్లాస్ దీపావళి.. మీ చర్యతో సిగ్గుపడుతున్నా’ అని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దేశ సంప్రదాయాన్ని గంగలో కలుపుతున్నారని, దీపావళికి, వాలెంటైన్స్‌డేకు వ్యత్యాసం లేకుండా పోయిందని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ లిప్‌లాక్‌కు 4లక్షలకు పైగా లైక్స్‌రాగా.. వేల కాంప్లిమెంట్స్ వచ్చాయి. View this post on Instagram Only love 💕Happy Diwali! A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Nov 7, 2018 at 7:03am PST -
మా రాకుమారుడి పేరెంటో తెలుసా?
బాలీవుడ్లో బెస్ట్ జోడి షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లు. వీరి ఇంట ఇప్పుడు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మీరా నిన్న సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ చిన్ని రాకుమారుడు పేరును షాషిద్ కపూర్, అందరూ ఊహించినట్టుగానే నేడు ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. తమ రాకుమారుడు పేరు ‘జైన్ కపూర్’ గా పేర్కొన్నాడు. ‘జైన్ కపూర్ ఇక్కడ. మేము పూర్తి అనుభూతి చెందుతున్నాం. అందరి అభినందనలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ టూ ఆల్’ అని ట్వీట్ చేశారు. అంతేకాక, షాహిద్ కపూర్ తన భార్య కోసం ప్రత్యేకంగా ఓ క్యూట్ బర్త్‌డే కేక్‌ను కూడా డిజైన్ చేయించారు. డఫోడిల్క్రియేషన్స్ ఈ కేక్‌ను డిజైన్ చేశారు. దానిపై హ్యాపీ బర్త్‌డే మదర్ హెన్ అని రాయించాడు షాహిద్. తన చిన్ని రాకుమారుడి పేరును రివీల్ చేస్తూ షాహిద్ కపూర్ చేసిన ట్వీట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జైన్ కపూర్ కూడా తన పేరు లాగా చాలా అందంగా ఉంటాడు. బేబి బాయ్‌ను చూడటానికి మేమందరం ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నాం’ అని డాక్టర్ ఇందిరా ట్వీట్ చేశారు. ‘జైన్ చూడటానికి మేమందరం వేచిచేయలేకపోతున్నాం. మా ప్రేమను, అభినందనలను పంపుతున్నాం’టాటాస్కై కూడా ట్వీట్ చేసింది. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు పుట్టడంతో, వారి ఫ్యామిలీ పూర్తైనట్టు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Zain Kapoor is here and we feel complete. Thank you for all the wishes and blessings. We are overjoyed and so grateful. Love to all. ❤️🙏 — Shahid Kapoor (@shahidkapoor) September 7, 2018 -
రెండోసారి తండ్రైన షాహీద్ కపూర్
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహీద్ కపూర్ ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతం షాహీద్ ఇంటికి అభిమానులు, స్నేహితులు నుంచి అభినందనలు వరుసకడుతున్నాయి. విషయం ఏంటో ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది.. అవును షాహీద్ కపూర్ మరోసారి తండ్రయ్యాడు. షాహీద్ కపూర్ - మీరా రాజ్‌పుత్‌ల ఇంటికి ఓ చిన్ని రాకుమారుడు వచ్చాడు. బుధవారం సాయంత్రం ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో మీరా రాజ్‌పుత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీరా రాజ్‌పుత్ ప్రాణ స్నేహితురాలు ప్రగ్యా యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. View this post on Instagram Biggest congratulations to all of you!!! ❤️ My darling Mira it’s been a beautiful journey and I’m so happy I got to share it with you, it’s been special! love love and more love 💖💕🌸 @mira.kapoor #itsaboy #bumpbuddies #love #kapoors A post shared by Pragya Kapoor (@pragyadav) on Sep 5, 2018 at 10:29am PDT ‘నా స్నేహితురాలు మీరా రాజ్‌పుత్‌కి కుమారుడు జన్మించాడు. తనకు నా శుభాకాంక్షలు.. ఈ సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకున్నాను’ అంటూ ప్రగ్యా యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది తెలిసిన వెంటనే అలియా భట్ తన స్నేహితుడు, సహ నటుడు అయిన షాహీద్ కపూర్‌కి అభినందనలు తెలిపారు. అలియా ‘షాన్‌దార్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాల్లో షాహీద్ కపూర్ సరసన నటించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్ర మీరా రాజ్పూత్ని హిందూజ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే షాహీద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల తల్లులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహీర్ కపూర్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 21న విడుదల కానున్నట్లు సమాచారం. -
స్టార్ హీరో భార్యపై నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనలో నటించినందుకు ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే... త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న మీరా.. తాను తొలిసారిగా నటించిన ఓ టీవీ కమర్షియల్ యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘తల్లిగా మారినంత మాత్రాన.. మీకు మీరుగా ఉండే హక్కును కోల్పోయినట్టు కాదుగా.. ఇదిగో ఇదే నా రీబార్న్ స్టోరీ’ అంటూ యంటీ ఏజింగ్‌కు క్రీమ్‌కు సంబంధించిన తన వీడియోను పోస్ట్ చేశారు. మీరా వీడియోకు స్పందనగా.. ‘ 23 ఏళ్ల యువతి.. యాంటీ ఏజింగ్ క్రీమ్‌కు ప్రచారం చేయడమేంటి.. నాన్సెన్స్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ‘నయవంచకురాలిగా ప్రవర్తిస్తున్నారు. చర్మ సౌందర్యం కోసం సహజ సిద్ధమైన ఉత్పత్తులే వాడతానంటూ ఇది వరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పారు. ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. అలాంటి పనులు మానుకోండి. మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నానంటూ’ అంటూ మరొకరు ఫైర్ అయ్యారు. Being a mother doesn’t mean you stop being yourself right? I took the #Olay #SkinTransformation #28Daychallenge Here’s my #Reborn story.. what’s yours? @olayindia A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Aug 6, 2018 at 12:11pm PDT -
ఆ వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకండి..!
‘మనస్ఫూర్తిగా హత్తుకోవాలనిపించే, ప్రేమగా ముద్దాడాలనిపించే, ఆ ప్రేమ మరీ ఎక్కువైతే కాస్త గట్టిగానే ఓ కిక్ ఇవ్వాలనిపించే వ్యక్తిని కనుగొనండి. మీకెంతో ప్రియమైన ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి ఎప్పటికీ వెళ్లనీయకండి’ అంటూ మీరా రాజ్‌పుత్ తన భర్త షాహిద్ కపూర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. త్వరలోనే రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న మీరాకు షాహిద్ ఇటీవలే సీమంతం చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన మీరా.. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ చేసిన పోస్ట్ అభిమానులను ఫిదా చేస్తోంది. ‘సో స్వీట్... నాకు ఆనంద భాష్పాలు ఆగటం లేదు.. ఈ భూమి మీద ఉన్న అందమైన జంట మీరేనని చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బేబీ ప్రాడక్ట్ యాడ్‌లో.. 2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్- మీరా దంపతులు త్వరలోనే మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ బేబీ ప్రాడక్ట్ కంపెనీ మీరాతో యాడ్ రూపొందించిందని వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా ఏమాత్రం అనుభవం లేనప్పటికీ మీరా సింగిల్ టేక్‌లోనే షాట్ ఓకే చేశారని ఓ వెబ్సైట్ పేర్కొంది. త్వరలోనే ఆ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. ఇక షాహిద్ విషయానికొస్తే.. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భట్టీ గుల్ మీటర్ చాలు’ , అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నారు. Find someone you can hug, kiss and kick. And then don’t ever let them go 💋 A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Jul 29, 2018 at 9:30pm PDT -
మరోసారి తండ్రి కాబోతున్న హీరో
ముంబై : బాలీవుడ్ తారలకు ఎంత క్రేజ్ ఉంటుందో వారి పిల్లలకు అంతకన్నా ఎక్కువ క్రేజే ఉంటుంది. తాము ఆరాధించే హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. షాహిద్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. షాహిద్- మీరా రాజ్‌పుత్‌ల ముద్దుల తనయ మిషా పక్కన బిగ్ సిస్టర్ అనే అక్షరాలు, బెలూన్లతో కూడిన ఫొటో శుభవార్తకు సంబంధించిందేనని అభిమానులు సంబరపడిపోతున్నారు. 2016లో మిషాకు జన్మనిచ్చిన షాహిద్- మీరా దంపతులు మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరా రాజ్‌పుత్ ప్రెగ్నెంట్ అంటూ బీ టౌన్లో వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఫొటో షేర్ చేయడం ద్వారా షాహిద్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ 2015లో ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. బీ టౌన్ స్టార్ కిడ్స్ అబ్రామ్, ఆరాధ్య బచ్చన్, తైమూర్లతో పాటు మిషాకు కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. పద్మావత్ సినిమాలో రతన్ సింగ్‌గా అలరించిన షాహిద్ శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భట్టీ గుల్ మీటర్ చాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ❤️ A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Apr 20, 2018 at 8:25am PDT -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో భార్య!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేయబోతోంది. సిద్ధార్థ మల్హోత్రా సరసన హీరోయిన్గా నటించేందుకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత డీహెచ్ లారెన్స్ రచించిన ‘లేడీ చాలర్ల్సీ లవర్’ నవల ఆధారంగా హిందీలో తెరకెక్కబోతున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తారని వినిపిస్తోంది. తాజాగా ‘పద్మావత్’ సినిమాతో మెప్పించిన సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నేహా ధూపియా టాక్‌షోలో పాల్గొన్న మీరా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని పేర్కొంది. అదే షోలో మాట్లాడిన షాహిద్ కూడా మీరాకు సిద్ధార్థ మల్హోత్రా నటన అంటే ఇష్టమని తెలిపాడు. భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు భావిస్తున్న ఈ ప్రాజెక్టులో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆంగ్ల సాహిత్య విద్యార్థి కావడంతో లారెన్స్ రచనల గురించి, తాను చేయబోయే పాత్ర గురించి ఆమెకు పూర్తిగా తెలుసునని సన్నిహితులు తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కూడా అతిథి పాత్ర పోషించే అవకాశముందట. మొత్తానికి మీరా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నదని, భన్సాలీ సినిమాతో ఆమె ఆరంగేట్రం చేస్తుండటం తనకు ఆనందం కలిగిస్తోందని షాహిద్ చెప్పాడు. -
మాజీ ప్రేయసికి ముందే చెప్పాడు!
సాక్షి, ముంబై: బాలీవుడ్లో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే సెలబ్రిటీలలో నటి కరీనా కపూర్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని కరీనా వెల్లడించారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకుని.. అటు కెరీర్‌ను, ఇటు వ్యక్తిగత జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇప్పటికీ షాహిద్, తాను మంచి మిత్రులమేనని కరీనా చెప్పారు. ‘తాను పెళ్లిచేసుకోబుతున్నట్లు ముందుగా షాహిద్ నాకే చెప్పాడు. వివాహానికి తాను సిద్ధంగా ఉన్నానని, మీరా రాజ్‌పుత్‌ను త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని అతడు నాకు తెలిపాడు. మీడియాకు, బహిరంగంగా ఈవెంట్లోనూ వెల్లడించక ముందే నా ఫ్రెండ్ షాహిద్ పెళ్లి చేసుకోనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పగానే చాలా సంతోషించాను. ఫెమినా ఈవెంట్ సందర్భంగా ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను షాహిద్ షేర్ చేసుకున్నాడని’ కరీనాకపూర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వీరి అభిమానులు ఈ విషయంపై రీట్వీట్లు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్, నటుడు షాహిద్ కపూర్ల వివాహం 2015 జూలై 7న అంగరంగ వైభవంగా జరిగింది. కాగా, షాహిద్ వివాహానికి మాజీ ప్రేయసి కరీనాను పిలుస్తాడా లేదా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ నటుడు మొదటి శుభలేఖతో సైఫ్ అలీ ఖాన్, కరీనా దంపతులను స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానించడం గమనార్హం. సైఫ్‌తో పెళ్లిక ముందు ఐదేళ్లపాటు షాహిద్, కరీనాలు గాఢంగా ప్రేమించుకున్నా.. ఏవో మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. -
తనను పెళ్లి చేసుకుంటాననుకోలేదు
-
తనను పెళ్లి చేసుకుంటాననుకోలేదు: హీరో
తాజా ఐఫా అవార్డుల ఉత్సవంలో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గ్రీన్కార్పెట్పై నడుస్తూ ఫొటోలకు ఫోజిలివ్వడమే కాదు.. ఈ జోడీ షో అంతటా సందడి చేసింది. ఇక 'ఉడ్తా పంజాబ్' సినిమాకుగాను ఉత్తమ నటుడు పురస్కారాన్ని సొంతం చేసుకున్న షాహిద్.. ఆ క్రెడిట్ అంత తన భార్యదేనంటూ కొనియాడాడు. 'నా బలం, నా అదృష్టం తనే' అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమై 18 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా 'బెస్ట్ యాక్టర్' అవార్డును అందుకున్న షాహిద్‌ను వ్యాఖ్యాతలు కొంచెం నాటీ క్వషన్స్ అడిగారు. 18 ఏళ్ల వయస్సులో మీరేం చేశారంటూ ప్రశ్నించగా.. 'నాకు 18 ఏళ్ల వయస్సు అప్పుడు నిజంగా అనుకోలేదు. అప్పటికీ ఐదేళ్ల వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. నిజంగా ఇది నేను చేసిన నాటీ పని అయి ఉంటుంది' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్-మీరా దంపతుల మధ్య వయసురీత్యా 13ఏళ్ల వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే. ఐఫా పురస్కారం అందుకున్న షాహిద్ భార్యతో కలిసి షోలో ఫుల్ హల్చల్ చేయడమే కాదు.. మీడియాతోనూ సరదాగా ముచ్చటించాడు. -
ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో
ముంబై: కరణ్ జోహార్ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. ఈ షోలో పాల్గొన్న షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు బోల్డ్‌గా తమ మనోభావాలను వ్యక్తం చేసి.. ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ఫటాఫట్ ప్రశ్నలకు ఈ జోడీ చాలా సరదాగా, ఓపెన్ గా సమాధానం చెప్పింది. షోలో భాగంగా కిల్-మ్యారీ-హుకప్ గేమ్‌లో భాగంగా సోనాక్షిసిన్హా, అలియా భట్, ప్రియాంకచోప్రాలలో ఎవరినీ చంపేస్తావు, ఎవరిని పెళ్లిచేసుకుంటావు, ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటావు అని కరణ్ అడుగగా.. మరో ఆలోచన లేకుండా ప్రియాంకను చంపేస్తానని షాహిద్ బదులిచ్చాడు. సోనాక్షిని పెళ్లి చేసుకుంటానని, తాను పెళ్లికి అనువుగా ఉంటుందని చెప్పాడు. అలియాతో రిలేషన్షిప్ పెట్టుకోవడం చాలా క్షేమం కాబట్టి తనతో హుకప్ అవుతానని చెప్పాడు. ఇక ద్రోహం, అత్తింటివారి జోక్యం, బ్యాడ్ సెక్స్, బోర్డమ్ ఈ నాలుగింటిలో మీ వివాహబంధం విచ్ఛిన్నానికి దారితీయడానికి అవకాశమున్న అంశాలు ఏమిటి అని.. మీరాను కరణ్ అడుగగా.. ’మా అత్తింటివారు మంచి వారు. బోర్ అన్న ప్రసక్తే లేదు. చెడు శృంగారం జోలికి మేం వెళ్లబోం. కాబట్టి అది ఛీటింగ్ కావొచ్చు’ అంటూ మీరా సమాధానమిచ్చింది. -
కూతురిపై అడిగిన ప్రశ్నకు హీరో షాక్
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కొన్ని రోజుల కిందట తండ్రిగా ప్రమోషన్ పొందాడు. షాహిద్ కపూర్, మీరా దంపతులు తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా వారి ముద్దుల కూతురుకు మిషా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. మీరా, షాహిద్ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి పాపకు మిషా అని పేరు పెట్టారు. కూతురుతో సమయం గడపాలని, చిన్నారితో ఆటలాడాలని కొన్నిరోజులు షూటింగ్స్ నుంచి ఈ హీరో విరామం తీసుకున్నాడు. కూతురు మిషా గురించి మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు షాహిద్ షాక్ తిన్నాడు. చిన్నారి మిషా ఏదో ఒకనాడు మీ వద్దకు వచ్చి 'నాన్నా నేను నటి అవుతానంటే మీరు ఎలా ఫీలవుతారు' అన్న ప్రశ్నపై షాహిద్ ఇలా స్పందించాడు. అది చాలా కష్టతరమైన పని. నిజంగానే తన కూతురు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మాత్రం చాలా భయపడతానని 'ఉడ్తా పంజాబ్' స్టార్ అన్నాడు. షాహిద్ నెక్ట్స్ మూవీ 'రంగూన్'. ఆ మూవీలో సైఫ్ అలీఖాన్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.