Mithun Chakraborty
-
ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున మిథున్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈయన పాల్గొన్న సభలో దొంగలు చేతివాటం చూపించారు. ఏకంగా ఈయన పర్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)పర్స్ పోయిందనే విషయాన్ని గుర్తించిన మిథున్ చక్రవర్తి.. నిర్వహకులకు చెప్పగ వాళ్లు మైక్‌లో, పర్స్ తిరిగిచ్చేయమని చాలాసేపు బతిమాలాడారు. అయినా సరే ఎవరూ పర్స్ తిరిగివ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన మిథున్ చక్రవర్తి.. ఉండాల్సిన టైమ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.బాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తి.. కొన్నాళ్ల క్రితం నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ 'గోపాల గోపాల' మూవీలో చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు. ఏదేమైనా ఈయన పర్స్ పోవడం, తిరిగిచ్చేయమని నిర్వహకులు బతిమాలడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
బాలీవుడ్ సీనియర్ హీరో తొలి భార్య కన్నుమూత
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తొలి భార్య హెలెన ల్యూక్ కన్నుమూసింది. అమెరికాలోనే చనిపోయినట్లు ఈమె ఫ్రెండ్, నటి కల్పన అయ్యర్ ధ్రువీకరించింది. ఇండో-అమెరికన్ సిటిజన్ అయిన హెలెన్.. గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నాలుగు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎవరి దాని వాళ్లు చూసుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)మిథున్ చక్రవర్తితో పెళ్లి గురించి అప్పట్లో ఓసారి మాట్లాడిన హెలెన్.. తనని మిథున్ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత అతడి నిజస్వరూపం బయటపడటంతో విడిపోయానని చెప్పింది. ఈమె విడాకులు ఇచ్చేసిన తర్వాత యోగిత బలిని మిథున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన హెలెన్.. అక్కడి ఉండిపోయింది. తాజాగా ఈమె మరణవార్త తెలిసి పలువురు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే హెలెన్.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫీలింగ్ వీర్డ్. మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ నో క్లూ' అని రాసుకొచ్చింది. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల గురించే ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని, కానీ అకస్మాత్తుగా మరణించడం మాత్రం షాక్‌కి గురిచేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్‌ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్‌స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్‌తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్‌స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్‌కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
మిథున్ చక్రవర్తిని వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్'
భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో మిథున్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది. 1976లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన మిథున్ తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరియర్లో మొత్తం మూడు నేషనల్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో టాలీవుడ్‌కు మిథున్ చక్రవర్తి పరిచయం అయిన విషయం తెలిసిందే.'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే వెంటనే మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. సుమారు 45 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకుని. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా మిథున్ చేశారు.మిథున్‌తో నటించేందుకు ఓకే చెప్పిన తొలి హీరోయిన్ జీనత్ అమన్మిథున్ సినీ జర్నీలో మొదట పెద్ద హీరోయిన్స్ తన వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అలా ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆయనతో కలిసి నటించడానికి ఇష్టపడేవారు కాదు. ఒకరకంగా చెప్పాలంటే తనను హీరోగానే వాళ్లు చూడలేదు. ఆయనతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా అలాంటి సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని మిథున్ సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి తన కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఈ వషయాన్ని కూడా ఓ వేదిక మీదు మిథున్ చక్రవర్తి పంచుకున్నారు.మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. బాలీవుడ్లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించిన మిథున్.. తన కెరియర్లో సుమారు 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. గతేడాదిలో 'కాబులివాల' అనే బెంగాళి చిత్రంలో ఆయన నటించారు. -
నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోలో రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరో అల్లర్ల ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్నాపూర్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపుపై గాజు సీసాలు, రాళ్లు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర అధికార టీఎంసీ కొట్టిపారేసింది. కాగా ఈ ఘటనలో చక్రవర్తి, పాల్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు.మిడ్నాపూర్ కలెక్టరేట్ మలుపు నుండి ప్రారంభమైన రోడ్ షో కెరనిటోలా వైపు వెళుతుండగా వందలాది మంది బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్ర పాల్ జనానికి అభివాదాలు తెలిపారు. ఈ రోడ్ షో షేక్‌పురా మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపక్కన నిలుచున్న కొందరు ఊరేగింపుపై రాళ్లు, సీసాలు విసిరారు. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగడంతో ఘర్షణ చెలరేగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి గూండాయిజానికి పాల్పడుతోందని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. మిథున్ చక్రవర్తి లాంటి ప్రముఖ నటుడిని అవమానించేలా వారు ప్రవర్తించారన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య బీజేపీ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రోడ్ షో ఫ్లాప్ కావడంతో బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. -
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్‌గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్‌ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు. -
హాస్పిటల్లో ఉంటే ప్రధాని ఫోన్ చేసి తిట్టారు: నటుడు
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి! అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించినవాళ్లు కూడా సడన్‌గా ఛాతీ నొప్పి, గుండెపోటు, ఇలా రకరాకల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారు. మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. బాగానే ఉన్నా.. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవలే పద్మ భూషణ్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాలు చేశాడు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇతడికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. చదవండి: సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే. -
ఖాళీ కడుపుతో రోడ్లపై నిద్రించి.. తిండి కోసం పార్టీలో డ్యాన్స్ చేసిన హీరో..
ఇష్టమైనది సాధించేవరకు ఎంతైనా కష్టపడుతుంటారు. విజయాలు అందుకోవాలంటే కష్టాలను దాటుకుని ముందుకు రావాల్సిందే! ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు పొందిన ఎంతోమంది కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు వచ్చినవారే! అందులో నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఉన్నాడు. జీరో నుంచి హీరోగా మారిన ఇతడి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శకనీయం. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఇతడు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.నన్నెవరు హీరోగా తీసుకుంటారులేఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపేశాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుందా? నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు.. ఇలా ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో.. చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీదే నిద్రపోయాను. అయితే ఇండస్ట్రీలో నన్నెవరు హీరోగా తీసుకుంటారని అనుకునేవాడిని. అందుకే, విలన్ అవ్వాలనుకున్నాను.తిండి దొరుకుతుందని పార్టీలో డ్యాన్స్..అది కూడా మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్‌గా! పని ఎక్కడ దొరికితే అక్కడికి నడుచుకుంటూ వెళ్లేవాడిని. నాలుగు మెతుకుల కోసం పార్టీలలో డ్యాన్స్ చేసేవాడిని' అని తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు మిథున్. 'నేను అనుకున్నది సాధించలేనేమోనని భయపడేవాడిని. తిరిగి కోల్‌కతాకు కూడా వెళ్లలేకపోయాను. ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నాను.బ్లాక్‌బస్టర్ హిట్స్కానీ అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే.. ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి.. పోరాడండి. నేనూ ఫైట్ చేశాను.. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో 'గోపాల గోపాల' సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు.చదవండి: మరికాసేపట్లో పెళ్లి.. హల్దీ ఫంక్షన్లో కాబోయే భార్యతో స్టెప్పులేసిన మానస్ -
నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో
'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే హిందీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. 40 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారట. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడు. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. డ్యాన్స్ వల్ల నా కలర్ పక్కనపెట్టారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. నా కొడుకును కూడా హీరో చేసేయొచ్చు అనుకున్నారు. నేను సామాన్య ప్రజల హీరోగా మారాను. కామన్ మ్యాన్‌కు సూపర్‌స్టార్ అవడం అనేది నాకు గొప్ప విషయం. నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్ చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను. అదే నిజమైంది. నా డ్యాన్స్ వల్ల నా కలర్‌ను మర్చిపోయారు. ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది. ఏడ్చేవాడిని కూడా! ఆ హీరోయిన్ ఒక్కరే నన్ను పొగిడారు పెద్ద హీరోయిన్స్ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.. నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు. నన్నసలు వాళ్లు హీరోగానే చూడలేదు. నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని నన్ను పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి నా కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది' అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి. చదవండి: చై మంచివాడు, సామ్ ఆ ఫోటో డిలీట్ చేసినందుకు నాపై ద్వేషం: ప్రీతమ్ -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
డిసెంబర్లో బెంగాల్ సర్కార్ కూలిపోనుందా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ కమలం కీలక నేతలంతా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ సైతం ఇదే కామెంట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమ’ని ప్రకటించారు. ‘‘టీఎంసీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడింది అంటూ వ్యాఖ్యానించారామె. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్లో పెద్ద ఆట చూడబోతున్నారంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. ‘‘వ్యూహమేంటో మేం చెప్పం. కానీ, ఏదో జరగబోతోంది. డిసెంబర్లో పెద్ద ఆట ఉండనుందని మా నాయకత్వం పదే పదే చెబుతోంది. రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంది. ఇది(టీఎంసీని ఉద్దేశించి..) దివాలా తీసిన ప్రభుత్వం. వాళ్ల(ప్రభుత్వం) వద్ద డబ్బు లేదు. ఖాళీ ఖజానాతో ఎలా పని చేస్తారు? రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లలో 50 శాతం మంది జైలుల్లోనే ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది కూడా జైలుకు వెళ్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు?.. అంటూ వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, మమతా బెనర్జీ సైతం జైలుకు వెళ్తారంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతేకాదు డిసెంబర్ బెంగాల్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి కూడా టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. వ్యక్తిగతంగా తనకే 21 మంది ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం టీఎంసీ ఎమ్మెల్యేలు కాంటాక్ట్‌లో ఉన్నారని చెబుతూ.. డిసెంబర్లో దీదీ సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలను చూసి.. మరికొందరిలో భయం నెలకొందని, వాళ్లు పార్టీ మారేందుకు ఆస్కారం ఉందని చెప్పారు సువేందు. అయితే బెంగాల్ అసెంబ్లీ సంఖ్యా బలం చూసుకుంటే.. టీఎంసీ ఫుల్ మెజార్టీతో ఉంది. మరోవైపు బెంగాల్ పంచాయితీ ఎన్నికల వేళ.. ఎలాగైనా భారీ విజయం సాధించాలని బీజేపీ పరితపిస్తోంది. స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించిన బీజేపీ.. ఇప్పటికే టీఎంసీ పట్టున్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే యత్నం చేస్తోంది. ఇదీ చదవండి: రామారావు పార్టీ మారితే నేను మారతానా? -
21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోనే ఉన్నారు
కోల్‌కతా: ప్రముఖ నటుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఇంకా తనతో నేరుగా టచ్‌లోనే ఉన్నారని చెప్పారు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పానని, మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కోల్‌కతాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మిథున్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై తమ నాయకులు కొందరు అభ్యంతరాలు తెలిపారని మిథున్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులు తమకు అవసరం లేదని సూచించారని చెప్పారు. అయితే తనకు ఈ విషయంపై అవగాహన ఉందని, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మిథన్ చక్రవర్తి గతంలోనూ ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చి వార్తల్లో నిలిచారు. 20మందికిపైగా టీఎంసీ ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతురాని రెండు నెలల క్రితమే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ నాయకులు అప్పుడు తోసిపుచ్చారు. మిథున్‌కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. ఓసారి వైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి మళ్లీ తన వ్యాఖ్యలకు కట్టుబటి ఉన్నానని చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
మిథున్ చక్రవర్తికి మెంటల్.. టీఎంసీ కౌంటర్..
కోల్‌కతా: బెంగాల్లో మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టీఎంసీ. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఈమేరకు స్పందించారు. 'మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారని విన్నాము. బహుశా ఆయనకు శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అదే సమస్య' అని శాంతను సేన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. #WATCH | I heard that Mithun Chakraborty was admitted to a hospital a few days back. I think he was mentally ill & not physically... The problem is that he does not know politics: TMC MP Santanu Sen on Mithun Chakraborty's remarks pic.twitter.com/5FUKkM7RIQ — ANI (@ANI) July 27, 2022 అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ చక్రవర్తి. మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత టీఎంసీలో తుఫాన్ మొదలైందని, ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బెంగాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు! -
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్‌కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు. అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
మంత్రి పార్థ అరెస్ట్ తర్వాత టీఎంసీలో తుపాను చెలరేగింది: మిథున్
-
ఇక నావల్ల కాదు, చచ్చిపోదామనుకున్నా..
మిథున్ చక్రవర్తి.. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. అయితే తన జీవితం ఏమీ పూలపాన్పు కాదంటున్నాడు మిథున్. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. 'సాధారణంగా ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. నా లైఫ్‌ను మరీ అంత కష్టంగా నెట్టుకొచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. పైగా నేను పడ్డ కష్టాలను చెప్తే నటుడిగా ఎదగాలనుకుంటున్న కొత్త తరాన్ని నేను నిరాశపర్చినట్లు అవుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నా జీవితంలో అలాంటివి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు నేను నా లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని భయపడ్డాను, అంతేకాదు ఆ భయంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ ఆ ఆలోచనను విరమించుకునేవాడిని. నేను మీకిచ్చే సలహా కూడా ఇదే.. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచననే మానేయండి.. ప్రతిదానితో పోరాడండి. అలా పోరాడాను కాబట్టే నేనీ స్థాయిలో ఉన్నా. రానురానూ మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియాను పాజిటివ్ అంశాలకంటే కూడా నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మేము షూటింగ్ అయిందంటే అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లిపోయి ఫోన్లతో బిజీ అవుతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ బెంగాలీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అవ్జిత్ సేన్ ప్రజాపతి సినిమాలో అతడు నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరో భార్య నన్ను శారీరకంగా, మానసికంగా హింసించింది: హీరోయిన్ కేటీఆర్ గారూ, కాలక్షేపం కావాలంటే ఈ షోలు చూసేయండి -
రాజ్యసభకు మిథున్ చక్రవర్తి!
కోల్‌కతా: ప్రముఖ నటుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. రూపా గంగూలీ స్థానంలో ఆయన్ని పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించేసినట్లు సమాచారం. నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా పని చేశారు. అయితే ఆ తర్వాత నుంచి అనారోగ్యం రిత్యా ఆయన బెంగాల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ తెర మీదకు వచ్చిన ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే.. చర్చనీయాంశంగా మారాయి. ‘నా అనారోగ్య కారణాల వల్ల నేను చాలా కాలం ప్రజల ముందుకు రాలేకపోయాను. రాజకీయాలను రాజకీయాల్లాగే ఉంచాలి. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్లో అశాంతి నెలకొందన్న వార్త చాలా బాధించింది’ అంటూ పొలిటికల్ రీఎంట్రీ సంకేతాలను అందించారాయన. రాజ్యసభలో రూపా గంగూలీ, స్వపన్ దాస్‌గుప్తాల పదవి కాలం ముగియనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఖాళీ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బెంగాల్‌కు చెందిన ఈ రెండు ఖాళీలను బెంగాల్‌కు చెందిన వాళ్లతోనే భర్తీ చేయాలని ఇప్పటికే బీజేపీ కీలక ప్రకటన చేసింది కూడా. ఈ తరుణంలో.. ఢిల్లీ నుంచి సోమవారం అఘమేఘాల మీద కోల్‌కతా చేరుకున్న మిథున్ చక్రవర్తి.. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖంత మజుందార్‌తో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని మిథున్ చక్రవర్తికి ఆహ్వానం అందిందని, ఈ మేరకు ఆయన సైతం అందుకు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ కీలక వర్గాలు ప్రకటించాయి కూడా. లోక్‌సభ బరిలో ఛాన్స్!.. ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ బరిలోనూ మిథున్ చక్రవర్తిని దించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీదీ(మమతా బెనర్జీ) టీఎంసీకి చెక్ పెట్టేందుకు.. మిథున్ చక్రవర్తినే సరైన వ్యక్తిగా భావిస్తోంది ఆ పార్టీ. బాలీవుడ్, బెంగాలీ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మిథున్ చక్రవర్తి.. ఆ తర్వాతి రోజుల్లో రాజకీయాల్లోనూ రాణించారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రణబ్ ముఖర్జీకి దక్కడంలో కీలక పాత్ర పోషించింది మిథున్ చక్రవర్తినే. టీఎంసీ తరపున గతంలోనూ(2014 నుంచి) ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు కూడా. అయితే 2016లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. కిందటి ఏడాది మార్చిలో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సమక్షంలో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. -
ఆసుపత్రి పాలైన మిథున్ చక్రవర్తి, బయటికొచ్చిన ఆస్పత్రి ఫొటో
Mithun Chakraborty Hospitalised Photos Goes Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆసుపత్రిలోని ఆయన ఫొటోలను ట్వీట్లో షేర్ చేశారు. దీంతో ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడయా వైరల్‌గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఇండియా టూడేతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్ చక్రవర్తి. ఇక చివరగా మిథున్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. Get well soon Mithun Da ❤️ তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf — Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
ప్రముఖ నటుడి నివాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్‌ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్‌ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగాల్‌కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: 2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
మిథున్ చక్రవర్తి ప్రేయసిగా శ్రుతీహాసన్
శ్రుతీహాసన్, మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో హిందీలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ‘ది బెస్ట్ సెల్లర్ షీ రోట్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఓ సూపర్ స్టార్ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. ఇందులో సూపర్‌స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి, అతని ప్రేయసిగా శ్రుతి కనిపిస్తారని టాక్. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన హిందీ చిత్రం ‘మిస్సింగ్’ని తెరకెక్కించిన ముకుల్ అభ్యంకర్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా నిర్మాత. ఉత్తరాఖండ్‌లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్‌ను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే