Model School
-
Heart Attack: అయ్యో పాపం ‘వెంకటస్వామి’
జగదేవ్‌పూర్(గజ్వేల్): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్ మోడల్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్‌పూర్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అలిరాజ్‌పేట గ్రామం నుంచి గజ్వేల్‌కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మోడల్ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్‌లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు.. వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు. నేత్రదానం.. వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు. -
21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో రాయవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్‌ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
మోడల్ స్కూల్లో బోరు నీరే దిక్కు
జనగామ రూరల్: ఆంగ్ల బోధన.. మెరుగైన వసతులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిచా లన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అయితే అన్ని రకాల వసతులతో ముందుకెళ్లాల్సిన ఆదర్శ పాఠశాలలో కనీసం మంచి నీరు కూడా లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మండల పరిధి చౌడారం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 450 మందిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ మోటారు కొన్ని రోజుల క్రితం పాడైపోయింది. దానికి మరమ్మతు చేయించడానికి సైతం నిధులు లేకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు బోరు నీటితో కాలం వెల్లదీస్తున్నా రు. మూడేళ్ల నుంచి పాఠశాలకు రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చుల మేరకు నిధులు కేటాయించకపోవడంతో అరకొర వసతులతో నెట్టుకు వస్తున్నారు. దీనికితోడు పాఠశాలకు రావాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు సమయాని కి చేరుకోలేక పాఠాలు కోల్పోతున్నారు. ఈ విషయ మై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ‘వాటర్ ఫిల్లర్ మోటారు పాడైందని, బాగు చేయించాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతుంది, అలాగే కరెంటు బిల్లు రూ.8 వేల వరకు వస్తున్నది.. చెల్లించలేని పరిస్థితి ఉంది.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు దరఖాస్తు చేశామని’ తెలిపారు. -
మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2023–24 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్‌ను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం విడుదల చేశారు. 6వ తరగతితో పాటు, 7–10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుండగా, ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహిస్తారు. ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, 7–10 తరగతుల్లో మరికొన్ని ఖాళీ సీట్లున్నాయి. విద్యార్థులు http:// telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజుగా జనరల్ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, ఈడబ్లూŠఎస్ విద్యార్థులు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రవేశాలు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. ప్రవేశాల షెడ్యూల్ ►ఆన్లైన్లో దరఖాస్తు: 10–01–2023 నుంచి 15–02–2023 ►హాల్‌టికెట్ల డౌన్లోడ్: 08–04–2023 ►పరీక్షతేదీ: 16–04–2023 ►సమయం: 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ►7–10 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ►ఫలితాల ప్రకటన 15–05–2023 ►పాఠశాలల వారీగా ఎంపికైనవారి జాబితా ప్రకటన 24–05–2023 ►సర్టిఫికెట్ వెరిఫికేషన్ 25–5–2023 నుంచి 31–5–2023 వరకు క్లాసుల నిర్వహణ 1–6–2023 -
అయ్యో టీచరమ్మ! స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్‌నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్‌తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్‌దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
అవసరమే ఆవిష్కరణ..
బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్ టైమ్‌కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్ టైమ్ టేబుల్ బ్యాగ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్ అంబరిల్లా రూమ్‌ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేస్తా మేం తయారు చేసిన మినీ పోర్టబుల్ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. – రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్‌స్కూల్, మహబూబాబాద్ సంతోషంగా ఉంది ఎగ్జిబిట్‌ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది. – కీర్తన, 6వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్ అమ్మ తిప్పలు చూడలేక... సైన్స్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెంటర్ శివకృష్ణ సర్ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్ కోర్సు చేశాం. ఇందులో ఆన్లైన్లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా. నాన్న గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. – జి. శివాని అంధులకు సైతం ఉపయోగపడాలని... తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ కోసం మేము అబ్దుల్ కలాం అనే గ్రూప్‌గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్‌తో పంచుకున్నాను. మా సర్ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్‌లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్‌గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం. ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్‌కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. – బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
మోడల్ స్కూల్ ఎదుట క్షుద్రపూజల కలకలం
జైనథ్( ఆదిలాబాద్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి మోడల్ స్కూల్ గేటు ఎదుట మట్టి బొమ్మలకు పసుపు పూసి, నిమ్మకాయలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యార్ధులు కొంతమంది పాఠశాలకు రావడంతో క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫోన్లో సమాచారం అందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ క్షుద్రపూజల సామగ్రిని అక్కడి నుంచి తొలగింపజేసి వాటిని కాల్చి వేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. సోమవారం అవగాహన సదస్సు.. క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలను నమ్మరాదని తహసీల్దార్ రాఘవేంద్రరావు గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సోమవారం పాఠశాలలో మూఢనమ్మకాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు. -
Telangana: 11న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్ (కరీంనగర్), అశోక్‌నగర్ (నర్సంపేట్) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ చూడాలని సూచించాయి. ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జయపురం: ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో శుక్రవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆ పాఠశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపడంతో పాటు భయాందోళన రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి. భయాందోళనకు గురైన హాస్టల్ విద్యార్థినులు మధ్యాహ్న భోజనాల సమయానికి ఆ విద్యార్థిని రాక పోవడంతో సహచర విద్యార్థినులు ఆమెను పిలిచేందుకు వెళ్లారు. ఎంత పిలిచినా జవాబు లేదు. అంతేకాకుండా తది తలుపులకు లోన గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీ లోంచి స్నేహితులు చూడగా దూలానికి వేలాడుతున్న విద్యార్థిని మృతదేహం కనిపించింది, అది చూసిన వారు భయపడి పరుగుతీసి ఉపాధ్యాయులకు విషయం తెలిపారు. వెంటనే ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చందన పట్నాయక్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని బొయిపరిగుడ సమితిలోని రామగిరి గ్రామానికి చెందిన బింగుచారి కుమార్తె విలాసిని చారి. 9 వ తరగతి చదువుతూ ఆదర్శపాఠశాల హాస్టల్లో ఉంటోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. హాస్టల్ సూపర్వైజర్, ఉపాధ్యాయిని సరోజ నాయక్ మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విలాసిని రాసి సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల అదుపులో టీచర్ కొద్ది రోజుల కిందట ఉపాధ్యాయురాలు సరోజ నాయక్ ఇష్టం వచ్చినట్లు తిట్టి మానస క్షోభకు గురిచేసిందని అందుచేతనే తన కుమార్తె విలాసిని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై మృతురాలి సోదరుడు డొంబురు దొర చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మిడ్డే మీల్స్ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..!
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా వండి విద్యార్థులకు అందించాల్సిన వంట నిర్వాహకులు కొద్ది రోజులుగా అరకొరగా వంటలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పాల్జేస్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా గమనిస్తూ వస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం నిర్వాహకులను నిలదీశారు. మాటమాట పెరిగి ఈ వివాదం కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం మోడల్ స్కూల్ భోజన నిర్వాహకులపై పేరెంట్స్ కమిటీ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం వారి మధ్య వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణ శివారుల్లోని ఏపీ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహణ సక్రమంగా లేదని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం వండటం లేదని ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భోజన నిర్వాహకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఆ సందర్భంగానే వారి మధ్య మాటల వివాదం చోటుచేసుకంది. మధ్యాహ్నం భోజన వంటకాలు సరిపడక పోవడాన్ని కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. కమిటీ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు 2 గంటల సమయంలో భోజనం అందని విద్యార్థులకు తిరిగి వంట చేయించారు. ప్రతి రోజూ కనీసం పది కేజీల బియ్యాన్ని మిగిల్చడం వల్లే వంటకాలు చాలడం లేదని కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్‌చైర్మన్ స్వాతి భోజన నిర్వాహకులను నిలదీశారు. కమిటీ ఆధిపత్యాన్ని జీర్జించుకోని భోజన నిర్వాకురాలు శ్యామల, స్రవంతి, భర్త సంతోష్ వారితో వాగి్వవాదానికి దిగారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాజీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి రోజూ చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత వంటకాలు వండకుండా బియ్యం, గుడ్లు మిగుల్చుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్వాహకులు మంగళవారం కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వండకపోవడంతో కమిటీ సభ్యులు నిలదీశారని వివరించారు. మాటల యుద్ధంతో జరిగిన ఈ వివాదం ముదిరి టూ టౌన్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరువురి వాదన విన్న పోలీసులు సర్ది చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం ఒకే సారి వండి బోధన సమయానికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. -
‘మోడల్’ కష్టాలు!
నారాయణఖేడ్: జిల్లాలోనే వెనుకబడిన మండలమైన నాగల్గిద్ద మండల పరిధిలోని మోర్గి మాడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం సమస్యలతో సమతమతం అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దున మోర్గి గ్రామంలో మోడల్ పాఠశాల నిర్మించిన నాటి నుంచి విద్యార్థులు నిత్యం నరకమే అనుభవిస్తున్నారు. మోర్గి మోడల్ స్కూల్, మరియు కళాశాలల్లో కలిపి మొత్తం 600మంది విద్యార్థుల వరకు నిత్యం విద్యాభ్యాసం చేస్తారు. దీంతో వివిధ ప్రాంతా నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాహన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులుల ఎదుర్కొంటున్నారు. నాగల్గిద్ద మండలానికి మోర్గి మాడల్ పాఠశాల వచ్చిన కాడినుండి ఇబ్బందులు తప్పడంలేదు. గత పాలకుల తప్పిదమే.. మెర్గి మాడల్ స్కూల్‌ను నాగల్గిద్ద నుంచి మోర్గికి మార్చడంతో ఈ ఇబ్బందులు విద్యార్థులుకు శాపంగా మారినాయి. రూ కోట్లు వెచ్చింది మారుమూల గ్రామంలో భవనం నిర్మించడంతో ఇలాంటి పిరిస్థతులు నెలకొన్నాయి. నాటి పాలకుల తప్పిదం నిర్ణయంవల్లె నాగల్గిద్ద నుంచి పాఠశాలను మోర్గికి మార్చారు. అక్కడ అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కెటాయించారు. రూ.కోట్లు వెచ్చించి భవనం నిర్మాణం చేపట్టారు. కాని విద్యార్థులకు మాత్రం సమస్యలు తీరండలేదు. కలెక్టర్ హామీ ఇచ్చినా తీరని రోడ్డు సమస్య.. గత ఏడాది ప్రారంభంలో విద్యార్థులు తమ పాఠశాలకు నాగల్గిద్ద పీడబ్యూడీ రోడ్డునుండి మోర్గి వరకు నాలుగు కిలోమీటర్ల బీటి రోడ్డు అవసరం ఉంది. గతంలో వేసిన పీఎంజీఎస్‌వై రోడ్డు పూర్తిగా చిద్రం కాగా గోతులు ఏర్పడినాయి. రోడ్డుకు మద్యన ఉన్న భారి కల్వర్టు సైతం శిథిలమై కూలిపోయింది. దీంతో వాహనాలు సైతం సక్రమంగా వెళ్లడం లేదు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. మోర్గి మాడల్ పాఠశాలకు నాగల్గిద్ద మండలంలోని కరస్‌గుత్తి, కారముంగి, ఔదత్పూర్, శేరిదామర్‌గిద్ద, గుడూర్, నారాయణఖేడ్, తదితర గ్రామాలనుండి నిత్యం వందాలాది విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి, దీంతో వారు వివిద ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక నారాయణఖేడ్నుండి ఆర్టీ అధికారులు ఒక్క పూట బస్సును రెండు ట్రిప్పులుగా ఎమ్మెల్యే చొరవతో వేసిన ఫలితం అగుపించడంలేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు సైతం తీరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): ఆదర్శ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని తీరుతో మానసిక వేదనకు గురై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గిన్నె భార్గవి ఆత్మహత్యకు యత్నించింది. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయిని కక్ష కట్టి ఎన్నో విధాలుగా వేధిస్తునట్లు తమ కుమార్తె అనేకసార్లు వాపోయినట్లు మండలంలోని గోసాం గ్రామానికి చెందిన గిన్నె అసిరినాయుడు (పాలు రెడ్డి) తెలిపారు. శనివారం ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ప్రవేశం లేదని ఉపాధ్యాయిని కరాఖండిగా చెప్పడంతో భార్గవి మానసిక ఆందోళనకు గురైనట్లు తండ్రి తెలిపారు. శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రి చెప్పారు. అయితే తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని జె.ఆర్.పురం ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ దుర్ఘటనపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కె.మహేశ్వరరావును వివరణ కోరగా.. ఆదర్శపాఠశాల వసతి గృహం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైందని, ఆమె ప్రథమ సంవత్సరం చివరిలో ఒక నెలరోజులపాటు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల హాస్టల్‌కు రాలేదని, హాస్టల్లో ఉన్నప్పుడే ఒకసారి కడుపులో నొప్పి అని చెబితే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి వసతి గృహంలో ప్రవేశాలకు శనివారం దరఖాస్తులు కోరామన్నారు. గతంలో అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని హాస్టల్ మెయింటినెన్స్ చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మికి చెప్పామని ప్రిన్సిపాల్ మహేశ్వరరావు తెలిపారు. -
ఫలితాలు రాకముందే ప్రవేశాలా?
కర్నూలు సిటీ: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కాకముందే మోడల్ స్కూళ్లలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. అలాగే మే రెండో వారంలో పది ఫలితాలు రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తులకు ఆఖరు ప్రకటించడం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఫలితాలు రాకముందే ఎలా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీని ఎలా ముగిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పది మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఆలస్యం కావడంతో ఈనెల 15వ తేదీనుంచి మొదలైంది. ఇలా పది రిజల్ట్ ప్రకటించక ముందే దరఖాస్తు తేదీని ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు గత నెల 31వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలను విడుదల చేశారు. 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఫలితాలు రాకముందే ఈనెల 15న షెడ్యుల్ జారీ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 7,8,9 తరగతుల ప్రవేశాలపై స్పష్టత కరువు.. జిల్లాలో ఉన్న 36 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు మొదట ప్రకటించిన ప్రకారం నేడు ఆఖరి రోజు. అయితే ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు జూన్‌లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెడితే బాగుంటుందని విన్నవించడంతో డీఈఓతో చర్చించి ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ ఇటీవల సూచించారు. ప్రవేశ పరీక్షను ముందు తరగతిలోని అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఐచ్ఛిక విధానంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు అయితే ఈ నెల 20న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆరోజు సమ్మెటివ్–2 పరీక్షలు ఉండడంతో 21వ తేదీ జరపాలని నిశ్చయించినా కుదరకపోవడంతోనే ప్రవేశ పరీక్ష ఏర్పాటుపై నేటికీ స్పష్టత రాలేదు. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. ఆన్లైన్లో దరఖాస్తూలు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీలు రూ.60, ఇతరులు అయితే రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 30వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో కానీ, మీ సేవ ద్వారా దరఖాస్తు పంపించాలి. మే 25న ఎంపిక జాబితా ప్రదర్శించి, 26వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ‘మోడల్’లో అందుబాటులో ఉండే కోర్సులివే.. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో విభాగానికి 20 సీట్ల చొప్పున ఒక ఆదర్శ పాఠశాలలో నాలుగు విభాగాలకు మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటి ప్రవేశాలకు విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
పర్వతగిరి: మండల కేంద్రం మోడల్ స్కూల్లోని వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం మడ్డి ప్రసన్న (16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ప్రసన్నను పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు వ్యక్తిగత కారణాలతో తోటి విద్యార్థుల ముందు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై వసతి గృహంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు తెలపటంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసన్నను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు తెలుపటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి ప్రసన్న మృతుదేహన్ని తరలించారు. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ప్రసన్న మృతితో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రసన్న అందరితో కలివిడిగా ఉండేదని, అందరి మన్ననలు పొందుతూ చదువులో రాణించేదని విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. -
ఆదర్శం.. సువర్ణావకాశం
విశాఖపట్నం ,ఆరిలోవ(విశాఖ తూర్పు): గ్రామీణ ప్రాంతంలో ప్రతిభా వంతులైన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు చక్కని అవకాశం ఉంది. ఉచిత వసతి, భోజనం, విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ విద్యాలయాల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించేందుకు ఈ ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారు. జిల్లాలో ఐదు ఆదర్శ విద్యాలయాలు 2013లో రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా మన జిల్లాలో నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, చీడికాడ మండలం మంచాల, కశింకోట మండలం తేగాడ, మునగపాక మండలం పాటిపల్లిలో ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 80 మంది వంతున 5 పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. వారికి ఇంటర్ వరకు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యను అందిస్తారు. దరఖాస్తు చేసుకోండిలా.. ఏపీ ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీపీ.జీవోవీ. ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకుని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి. ఆధార్, కులం, ఆదాయం, తదితర ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి. రిజర్వేషన్లు ఇలా.. ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 29శాతం బీసీలకు(బీసీ‘ఎ’–07, బీసీ‘బీ’–10, బీసీ‘సీ’–01, బీసీ‘డీ’–07, బీసీ‘ఈ’–04శాతం) కేటాయించారు. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33శాతం సీట్లను కేటాయించారు. నిర్దేశించిన గ్రూపుల్లో అర్హులైన వారు లేని పక్షంలో ఇతర విభాగాల్లోని వారితో భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 50శాతం సీట్లను ఇతర కులాలకు నిర్దేశిస్తారు. మార్చి 31న ప్రవేశ పరీక్ష ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలి. 2019 మార్చి 31న ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. అర్హులు ఎవరంటే.. ♦ ఓసీ, బీసీ విద్యార్థులు 2007 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2005 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ♦ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2018–19లో మాత్రం ఐదో తరగతి చదివి ఉండాలి.. రాత పరీక్ష ఇలా.. మార్చి 31న ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఐదో తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ పాఠ్యాంశాలపై 25 మార్కుల వంతున ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హతగా 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు విధిగా సాధించాలి. -
మోడల్ స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, మఠంపల్లి (హుజూర్‌నగరర్) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవారిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్రూం వెంటిలేటర్‌కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్‌కుమార్ ఘటన స్థలా న్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. నీరజ మృతిపై అనుమానాలు నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. రఘునాథపాలెంలో విషాదఛాయలు .. ఇంటర్ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. -
ప్లీజ్ సార్..వెళ్లొద్దు
అనంతపురం, కళ్యాణదుర్గం: ఉపాధ్యాయుడంటే...ఏ విద్యార్థికైనా భయమే..కానీ ఆ ప్రిన్సిపాల్ అంటే మాత్రం ఆ పాఠశాలందరికీ గౌరవం..కాదు..ప్రేమ...ఆ ప్రిన్సిపాల్‌కు కూడా విద్యార్థులంటే ప్రాణం..తండ్రిలా బిడ్డలపై వాత్సల్యం. అందుకే బదిలీపై ఆ ప్రిన్సిపాల్ పాఠశాల వదిలివెళ్తుంటే విద్యార్థులంతా చుట్టుముట్టారు..వెళ్లవద్దు సార్..ప్లీజ్..అంటూ అడ్డుపడిపోయారు. దీంతో ఉద్వేగానికిలోనైన సదరు ప్రిన్సిపాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్లలేకపోయారు..ఈ ఘటన గురువారం కళ్యాణదుర్గంలో మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితం ఎఫ్ఏసీపై వచ్చి... ఐదేళ్ల క్రితం కళ్యాణదుర్గంలో మోడల్ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్‌గా వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అరకొర వసతులతో మొదట్లో పాఠశాలను నడుపుకొచ్చారు. విద్యార్థులను తండ్రిలా చూశారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించారు. బాలురకు భోజన వసతి లేకపోతే... సొంత డబ్బులతో భోజనం పెట్టారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందు నెలరోజులు ప్రత్యేక స్టేడీ హవర్స్ నిర్వహించి భోజన వసతి కల్పించారు. సుదూర ప్రాంతాల్లో రెజ్లింగ్, జూడో, హ్యాండ్‌బాల్ లాంటి పోటీలకే వెళ్లే క్రీడాకారులకు ఖర్చులు భరిస్తు సౌకర్యాలు కల్పించారు. అందువల్లే వరప్రసాద్‌తో విద్యార్థులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంతటి అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రిన్సిపాల్ వరప్రసాద్‌ను పామిడి ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులందాయి. దీంతో గురువారం ఆయన ఈ విషయం విద్యార్థులకు చెప్పడంతో వారంతా అడ్డుపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్లీజ్‌సార్...వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థిని, విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. భావోద్వేగానికి గురైన వరప్రసాద్ కూడా కంటతడి పెట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదంటూ ధర్నా అనంతరం విద్యార్థులంతా తమ ప్రిన్సిపాల్‌ను మరోచోటకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ పాఠశాల దాటకుండా అడ్డుకుని చుట్టుముట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదూ... ఉండాలి ప్రిన్సిపాల్ ఇక్కడే ఉండాలి... అంటూ నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం 1.00 గంట నుంచి 4.30గంటల వరకు ఆందోళన జరిగింది. అనంతరం ర్యాలీగా విద్యార్థులంతా ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఇంటికి వెళ్లి ప్రిన్సిపాల్ బదిలీ ఆపాలని విజ్ఞప్తి చేశారు. నాకు అన్నం పెట్టాడు నాకు తల్లిలేదు. మా నాన్న సురిబాబు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వసతి గృహం సౌకర్యం లేనప్పుడు ప్రిన్సిపాల్ సార్ భోజన సౌకర్యం కల్పించారు. – మాతశ్రీ, 8వ తరగతి విద్యార్థిని లోటు లేకుండా చూసుకున్నారు 8వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నా. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించారు. మా సార్‌ను బదిలీ చేయకూడదు.– బాలాంజలి, ఇంటర్ విద్యార్థిని క్రీడాకారులకు ప్రోత్సహించారు రాష్ట్రంలో ఏ ప్రాం తానికి వెళ్లినా క్రీడకారుల ఖర్చంతా సారే భరించేవారు. విజయం తో తిరిగి రావాలంటూ ఉత్సాహపరిచేవారు. అలాంటి సార్‌ను బదిలీ చేయడం అన్యాయం.–మౌర్య, 9వ తరగతి విద్యార్థి -
విద్యార్థిని చితకబాదిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్ స్కూల్ ఓ విద్యార్థి్థని ప్రిన్సిపాల్ చితకబాదారు. విద్యార్థి తండ్రి వివరాల మేరకు..నాగపుల్లయ్య కుమారుడు దేవేంద్ర మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఎవరో విద్యార్థి తరగతి గదిలోని డెస్కులపై బురదకాళ్లతో తొక్కారు. ఈ విషయం ప్రిన్సిపాల్ హుసేన్‌వలికి తెలియటంతో ఎలాంటి విచారణ చేయకుండా దేవేంద్రను కర్రతో వీపు, చెయ్యి, కాళ్లపై చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల వద్దకు వెళ్లి కుమారుడిని తీసుకుని గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన నోడల్ అధికారి వెంకటరమణయ్య, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ శివరాముడుకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయకపోయినా విద్యార్థుల మాట విని ప్రిన్సిపాల్ తనను చితకబాదాడని విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రిన్సిపాల్‌ను పిలిపించి మందలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థి తండ్రి శాంతించాడు. విద్యార్థి అల్లరి చేయటంతో కాస్త మందలించినట్లు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. -
బదిలీ(ల)లు..!
రాజకీయ ఒత్తిళ్లకు అనుకూలంగా విద్యాశాఖ పనిచేస్తోందా అన్న సందేహం తలెత్తుతోంది. ఓ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల విషయంపై అధికారపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెరవెనుక పావులు కదుపుతుండమే దీనికి కారణం. వేసవి సెలవుల్లో జరగాల్సిన సాధారణ బదిలీలు పాఠశాలలు ప్రారంభమయ్యాక జరగడమే వివాదానికి అసలు కారణం. ఉపాధ్యాయులను బదిలీ చేయాలంటూ ఒకరు, ఇప్పుడు బదిలీ చేస్తే మా ప్రాంత పాఠశాలల అభివృద్ధి కుంటుపడుతుందని మిగతా ఇద్దరు శాసనసభ్యులు అంటున్నట్లు సమాచారం. ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు కాంక్షిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అసలు కారణం ఏమై ఉంటుందా అని, అధికార పార్టీలో ఈ పట్టు విడుపులు ఎటుదారితీస్తాయో.. అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నతాధికారి ఆదేశాలు అమలు చేయకుండా ఉండలేక.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు బేఖాతరు చేయలేక మధ్యలో హెచ్ఎంలు నలిగిపోతున్నారు. మార్టూరు: చీరాల పట్టణం వేటపాలెం మండల పరిధిలోని కొత్తపేట ఐఎల్టీడీ కాలనీ సమీపంలో ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మోడల్ పాఠశాలను ప్రారంభించింది. స్థాయికి మించి అర్జీలు వచ్చినప్పటికీ 1200 మందికి పైగా విద్యార్థుల ప్రవేశాలు మెదటి సంవత్సరమే పూర్తయ్యాయి. సాక్షాత్తూ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన కుమారుడిని సైతం ఇక్కడ చేర్పించటంతో ఈ పాఠశాల వార్తల్లో నిలిచింది. గతవారం చీరాలలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా అధికారికంగా ఈ స్కూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పాఠశాలను ప్రారంభించకుండానే మంత్రి లోకేష్ వెనుతిరిగిన సంఘటన తెలిసిందే. ఈ పాఠశాలకు అవసరమైన ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణంగా బదిలీపై రావాల్సి ఉండగా ఈ వేసవిలో ప్రభుత్వం సాధారణ బదిలీలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న, చీరాల పరిసర ప్రాంతాలకు చెందిన ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై చీరాల మోడల్‌స్కూల్‌కు వెళ్లవల్సిందిగా డీఈఓ కార్యాలయం నుంచి అనధికార ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. సహజంగానే తమ ప్రాంతమైన చీరాల వైపు వెళ్లటానికి ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవటం వారిని రిలీవ్ చేయమని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ కార్యాలయం నుంచి అధికార ఉత్తర్వులు జారీ కావటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక్కడ నుంచే అసలు కథ ప్రారంభం.. తమకు ఏలాంటి సమాచారం లేకుండా తమ నియోజకవర్గంలోని పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించటానికి పర్చూరు, అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు అంగికరించడం లేదనేది విశ్వసనీయ సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు, పర్చూరు, అద్దంకి ఎమ్మెల్యేలు కూడా అధికారపార్టీకి చెందిన వారే. ఆధిపత్య పోరో లేక మరొకటో తెలియదు కానీ తమకు తెలిమకుండా తమ నియోజవర్గ ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపవద్దని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. డిప్యూటేషన్ బదిలీల కోసం పర్చూరు నియోజవర్గంలోని మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు మండలాల నుంచి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా వారిని రిలీవ్ చేయాల్సిందిగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీ చేశారు. మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఒకరు విరమించుకున్నట్లు సమాచారం. మరొక ఉపాధ్యాయురాలిని ప్రధానోపాధ్యాయుడు దుడ్డు డేవిడ్ రిలీవ్ చేయకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌తో వచ్చే ఎన్నికల్లో చీరాలతో పాటు పర్చూరు, సంతనూతలపాడు నియోజవర్గాల్లో కూడా పార్టీ గెలుపుకోసం కృషి చేయవల్సిందిగా సూచించిన నేపథ్యంలో బదిలీలు ఆగి ఉండవచ్చనే కోణంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఉత్తర్వులను బేఖాతరు చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం డీఈఓ ఆదేశాలను ఉల్లంఘీస్తూ రిలీవ్ చేయకుండా ఉండటాన్ని చూస్తే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లే అని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. బదిలీ కోసం వచ్చిన అర్జీల్లో ఒకరిని అక్కడి ప్రధానోపాధ్యాయురాలు రిలీవ్ చేయగా మిగతా వాటిపై ఏం చేయాలో తెలియక హెచ్ఎంలు సతమతమవుతున్నారు. డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే.. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై చీరాల పంపవల్సిందిగా డీఈఓ ఉత్తర్వులు వచ్చిన మాట నిజమే. ఈ సంవత్సరం సాధారణ బదిలీలు లేనందున రిలీవ్ అయిన వారి స్థానంలో మరొకరు వచ్చే అవకాశం లేదు. మధ్యంతర బదిలీలతో పాఠశాల అభివృద్ధి కుంటు పడుతుందని ఆ ఉపాధ్యాయురాలిని రిలీవ్ చేయలేదు. దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు లేవు.దుడ్డు డేవిడ్, ప్రధానోపాధ్యాయుడు డీఈఓ ఆదేశాల మేరకు రిలీవ్ చేశా.. పాఠశాల సైన్సు ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్‌పై పంపవలసిందిగా డీఈఓ ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సోమవారం రిలీవ్ చేశాను. రాజకీయ వత్తిళ్ళు ఏమీ లేవు. ఎమ్ నిర్మల,వలపర్ల ప్రధానోపాధ్యాయురాలు -
మోడల్ బ్యాంకింగ్
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించేందుకుగాను పట్టణంలోని మోడల్ స్కూల్లో సోమవారం మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సాయిబాబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. బ్యాంకు లో జరిగే లావాదేవీలు, సేవల గురించి విద్యార్థులకు తెలియజేశా రు. మనీ ట్రాన్స్ఫర్, డిమాండ్ డ్రాఫ్ట్సŠ, చెక్కుల వినియోగం, ప్రభుత్వ చాలాన్లు చెల్లింపు, ఆర్టీజీఎస్, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకునకు డబ్బుల బదిలీ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యతులో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు మోడల్ బ్యాంకింగ్, మోడల్ ఎలక్షన్స్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు. మోడల్ బ్యాంకింగ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, స్రవంతి నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ సేవలపై పూర్తి అవగాహన వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శశిశంకర్, ఉపాధ్యాయులు శక్తిరాజ్, నాగరాజ్, గంగాప్రసాద్, విద్యార్థులు ఉన్నారు. చాలా నేర్చుకున్నాను.. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే విధానంపై ఉపాధ్యాయులు వివరించారు. డబ్బులు జమ చేసేందుకు వినియోగించే వోచర్, డ్రా చేసేందుకు వినియోగించే ఓచర్.. డిడి, తదితర వివరాలన్నింటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ విధానం నేర్చుకున్నాను. – పావని, విద్యార్థిని చెక్కుల వినియోగం తెలుసుకున్నా.. మాలాంటి విద్యార్థులకు బ్యాంకు లావాదేవీల గురించి అవగాహన ఉండదు. అయి తే ఉపాధ్యాయులు నిర్వహించిన మోడల్ బ్యాంకింగ్ ద్వారా అవగాహన వచ్చింది. చెక్కులను వినియోగించడం గురించి తెలుసుకున్నాను. మోడల్ బ్యాంకింగ్‌పై ఉపాధ్యాయులు తెలిపిన వివరాలు బాగున్నాయి. – గాయత్రి, విద్యార్థిని మనీ ట్రాన్స్ఫర్ సులువుగా ఉంది.. డబ్బులను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసే విధానం సులువుగా ఉంది. ఆన్లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే విధానం గురించి తెలుసుకున్నాను. – భానుప్రసాద్, విద్యార్థి -
మోడల్ స్కూల్ పిలుస్తోంది
పొందూరు: తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని ఎంతోమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. మధ్యతరగతి వారు అప్పోసొప్పో చేసి ఫీజులు చెల్లించి కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. నిరుపేదల పిల్లలకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ.. ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ప్రారంభించింది. ఉచితంగా విద్యతో పాటు పక్కా భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీ సదుపాయాలు అందుబాటులో ఉంచుతోంది. ఆరో తరగతిలో ప్రవేశిస్తే ఇంటర్మీడియట్ వరకు అదే పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 2018–19కు గాను ఆరో తరగతిలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16తో దరఖాస్తులు చేసుకొనేందుకు గడువు ముగుస్తుంది. దరఖాస్తులు ఇలా ఆదర్శ పాఠశాలల్లో 2018–19కి గాను ఆరో తరగతిలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2018 ఏప్రిల్ 8వ తేదీన ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు చేరే పాఠశాలలోనే దీనిని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2006, సెప్టెంబర్ 1 నుంచి 2018, ఆగస్టు 31 మధ్య జన్మించాలి. వయసు 10 నుంచి 12 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు 2006 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31, 2018 మధ్య జన్మించాలి. 10 నుంచి 14 ఏళ్లు దాటకూడదు. విద్యార్థి ప్రాథమిక వివరాలతో ప్రవేశ పరీక్ష రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి చెల్లిస్తే జనరల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబరు ఆధారంగా విద్యార్థి పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసిన దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతి సిలబస్ మేరకు తెలుగు – 25, ఇంగ్లీష్ – 25, గణితం – 25, పరిసరాల విజ్ఞానం –25 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్షలో ఓసీ, బీసీలు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు పొందాలి. ప్రవేశాలు ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉంటాయి. జిల్లాలో 1120 సీట్లు జిల్లాలో ఉన్న 14 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు 1120 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఆదర్శ పాఠశాలలో 80 మందిని మాత్రమే చేర్చుకుంటారు. పొందూరు, కుప్పిలి, రణస్దలం, లావేరు, జి.సిగడాం, పోలాకి, జలుమూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, భామిని, పాతపట్నం, కంచిలి, ఓవిపేట(బూర్జ) ఆదర్శ పాఠశాలల్లో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్య, క్రమ శిక్షణ, నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిషులపై బోధన ఉంటుంది. అన్ని సదుపాలతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న బోధన సదుపాయం ఉంది. విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఈ–లెర్నింగ్, సీసీఈకు అనుగుణంగా విద్యాబోధన చేస్తారు. బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నాం తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లల కోసం ఆరో తరగతిలో బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తున్నాం. ఏడో తరగతికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. ఈ పాఠశాల నుండి రిలీవైన పిల్లలు ఉన్నత విద్యను పూర్తి చేసుకొన్న తర్వాత ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలరు. – మార్తా తిలకం, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, పొందూరు -
‘మోడల్’ విద్య అందని ద్రాక్షేనా..?
సారంగాపూర్ : మండలంలోని విద్యార్థులకు ‘మోడల్’ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలకు మోడల్ పాఠశాలలు మంజూరైనా సారంగాపూర్‌లో మాత్రం ఏర్పాటు కాలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో మండల విద్యార్థులకు అడ్మిషన్లు దక్కడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మోడల్‌స్కూల్ ప్రత్యేకత మోడల్‌స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసినప్పటిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వీటి నిర్వాహణ కొనసాగుతుంది. ఇక్కడి విద్యార్థులకు బోధన పరంగా ఉన్నత ప్రమాణాలతో విద్య అందుతుండడంతో విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీపడుతున్నారు. కానీ సారంగాపూర్ మండల విద్యార్థులకు అవకాశం దక్కడం లేదు. మండల విద్యార్థులకు నో అడ్మిషన్లు ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి తరగతిలో 100 సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడానికి నిర్వహించే పరీక్షల్లో, స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి 1100 మంది పరీక్షలు రాశారు. ఇందులో కేవలం అడ్మిషన్లు పొందినది 100 మంది విద్యార్థులు మాత్రమే. మంజూరైనా.. ఏర్పాటు కాలేదు సారంగాపూర్‌కు మోడల్‌స్కూల్ మంజూరైనా స్థల సేకరణ జరిపినా, సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో మోడల్‌స్కూల్ ఏర్పాటు రద్దైయింది. ఇప్పటికైనా మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్ష రాసినా పట్టించుకోలేదు గతేడాది తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందడానికి పరీక్ష రాసినా, మాకు కనీసం ఫలితం ఏమి అన్నది అధికారులు సమాదానం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాదానం రాలేదు. మాకు మోడల్స్కూల్లో చదవాలని ఉంది. అధికారులు మాకు అవకాశం కల్పించాలి. – యశ్వంత్, సారంగాపూర్ మాకు అడ్మిషన్లు ఇవ్వాలి మాకు మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలి, మా దగ్గర మోడల్‌స్కూల్ లేదు. మాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలించాలి. – కస్తూరి వెంకటేష్, సారంగాపూర్ ప్రభుత్వం సీట్లు పెంచితే అడ్మిషన్లు ఉన్న సీట్లకోసం విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మరిన్ని సీట్లు పెంచితే కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి పరిశీలిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈవో -
ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
డెంకాడ: అక్కివరం గొల్లపేట వద్ద ఉన్న మోడల్ స్కూల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.స్వర్ణలత ప్రకటనలో తెలిపారు. బీసీ, ఓసీ విద్యార్థులు 01.09.2006 నుంచి 31.8.2008 సంవత్సరాల మధ్యలో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2004 నుంచి 31.8.2008 మధ్యలో పుట్టి ఉండాలన్నారు. బీసీ విద్యార్థులకు వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు పరీక్షా రుసుం చెల్లించాలన్నారు. ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే సెల్ నంబర్లు 70329 96542, 99493 49598కు సంప్రదించాలన్నారు. -
విద్యార్థిని చితకబాదిన పీఈటీ
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గంలోని మోడల్ స్కూలులో ఏడో తరగతి చదివే తమ కుమారుడు మహమ్మద్ ఆదిల్ అనే విద్యార్థిని పీఈటీ దివాకర్ చితకబాదినట్లు తండ్రి హెచ్.కె.బాషా ఆరోపించారు. మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత ప్రార్థన చేసేందుకు వెళ్తుండగా, ఐడీ కార్డు ఎందుకు వేసుకొని రాలేదంటూ చేతులు, కాళ్లపై విపరీతంగా కొట్టినట్లు ఆయన వివరించారు. తమ బిడ్డతో పాటు మరో ఇద్దరు విద్యార్థులనూ అతను కొట్టినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం(రోజా) ఉన్న తమ కుమారుడ్ని కొట్టడంతో బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మోడల్ స్కూలు ప్రిన్సిపల్ ప్రకాశ్నాయుడుకు ఫోన్లో వివరిస్తే సరైన సమాధానం చప్పకపోగా.. ‘కొట్టేదే.. ఏం చేసుకుంటావో చేసుకోపో...’ అంటూ దురుసుగా మాట్లాడినట్లు ఆయన వాపోయారు. గతంలోనూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొట్టాడని తెలిపారు. ఇప్పుడు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాషా తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. ఘటనపై విచారిస్తామని చెప్పారు.