morthad
-
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
మరో సౌదీ విషాద ఘటన: చివరి చూపూ దక్కలేదు..
మోర్తాడ్ (బాల్కొండ): కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి సౌదీ అరేబియాకు వెళ్లిన మోర్తాడ్ మండలం పాలెం వాసి షేక్ మదర్(50) అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. కరోనా వైరస్ ఉధృతితోనే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తెప్పించడం కష్టంతోపాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో సౌదీలోనే మదర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ కుటుంబ పెద్ద కడసారి చూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని మదర్ కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) ఎన్నో ఏళ్ల నుంచి మదర్ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల కింద ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లి అక్కడ సైకిల్ రిపేరింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. నెల రోజుల కిందట మదర్ అనారోగ్యానికి గురవడంతో ఈనెల 6వ తేదీన మరణించాడు. మదర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతడికి ఆజాద్ వీసా స్పాన్సర్ చేసిన సౌదీవాసి తెలిపాడు. మక్కా ఉన్న సౌదీలోనే మదర్ మృతదేహానికి ఖననం చేస్తే అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని పలువురు సూచించడంతో కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈనెల 25 ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. రావడానికి ఒక్కరోజు ముందుగానే మృతి సౌదీలో మరణించిన మదర్ ఈ నెల 7వ తేదీన స్వదేశం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మధుమేహం, బీపీ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతడు ఇంటికి రావడానికి విమాన టికెట్‌ను తీసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఒకరోజు ముందుగానే తీవ్ర అనారోగ్యానికి గురై సౌదీలోనే మరణించడం, అక్కడే అంత్యక్రియలు ముగిసిపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మదర్‌కు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
వారికి ఒమన్ ప్రభుత్వం శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): ఒమన్ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులు స్వచ్ఛందంగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఆ దేశ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020 డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల నిలుపుదల నేపథ్యంలో మొదటిసారి ఈ నెల 15 వరకు పొడిగించింది. క్షమాభిక్ష పొందేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ డైరెక్టర్ జనరల్ సేలం బిన్ సయీద్ అల్‌బాడి వెల్లడించారు. గడిచిన నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో ఇప్పటివరకు 12,378 మంది విదేశీయులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.(చదవండి: వీసా లేకుండానే ఒమన్ వెళ్లొచ్చు) ఇదిలా ఉండగా మరో 57,847 మంది క్షమాభిక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు గడువు పెంచడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లో అమలవుతున్న క్షమాభిక్ష వల్ల లబ్ధిపొందే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షమాభిక్ష పొందిన వారికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి విమాన టికెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు తెలిపారు. -
ఉపాధి వలసలు షురూ.. గల్ఫ్ పిలుస్తోంది!
మోర్తాడ్(బాల్కొండ) : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులను గల్ఫ్ దేశాలు మళ్లీ పిలుస్తున్నాయి. తిరిగి విధుల్లోకి చేరాలంటూ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. కరోనా సంక్షోభంతో గల్ఫ్ దేశాల్లోని అనేక కంపెనీలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. తమపై ఆధారపడిన వలస కార్మికులను ఇంటికి పంపేశాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తుండటంతో కంపెనీలు తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నాయి. విధుల్లో చేరాలంటూ కార్మికులకు ఫోన్లుచేసి పిలుస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, కువైట్ మినహా మిగిలిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, దోహా ఖతర్, ఒమన్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. గత అక్టోబర్ నుంచి యూఏఈ వీసాల జారీ మొదలు కాగా, బహ్రెయిన్ నవంబర్‌లో వీసాల జారీని ప్రారంభించింది. ఒమన్ వారం నుంచి కొత్త వీసాల జారీతో పాటు గతంలో ఇంటికి వెళ్లిన వలస కార్మికులను మళ్లీ రప్పించడానికి వీసాల జారీకి అనుమతినిచ్చింది. ఖతర్‌లో 2022లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు నిర్వహించడనుండటంతో వచ్చే జనవరి నుంచి కొత్త వీసాల జారీకి భారీగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈకి ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయి. నిర్వహణ రంగంలోనే ఉపాధి అవకాశాలు గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులకు నిర్మాణ రంగంలోనే భారీగా ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే, కరోనా ఉద్ధృతికి ముందే ఈ రంగం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది. కరోనాతో పూర్తిగా కుదేలవ్వడంతో కార్మికుల ఉపాధికి గండిపడింది. ఇప్పుడు లాక్డౌన్ ఆంక్షలు సడలించాక నిర్వహణ రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కంపెనీల కార్యాలయాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, ఉద్యోగులకు సహాయపడేందుకు ఆఫీస్ బాయ్స్ వంటి పోస్టులకు ఎంపికలు సాగుతున్నాయి. యూఏఈలో ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో కార్మికుల ఎంపిక కొనసాగుతోంది. బహ్రెయిన్లోనైతే హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడంతో ఇంటికి వెళ్లిన కార్మికులను మళ్లీ పిలుచుకుంటున్నారు. ఒక్కోచోట ఒక్కోలా క్వారంటైన్ యూఏఈకి సంబంధించి దుబాయ్, షార్జాలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను అమలు చేయట్లేదు. అబుదాబిలో మాత్రం ఇంటి నుంచి వచ్చిన వలస కార్మికులు 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. బహ్రెయిన్‌లో వారం రోజుల క్వారంటైన్‌తో సరిపెడుతున్నారు. ఖతర్‌లో మాత్రం కంపెనీలే వలస కార్మికులకు క్వారంటైన్ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దుబాయ్ రమ్మని కబురొచ్చింది దుబాయ్‌లోని ఓ కంపెనీలో ప్లంబర్‌గా పనిచేశాను. లాక్‌డౌన్‌తో మూడు నెలల కింద ఇంటికి పంపేశారు. కంపెనీలు మళ్లీ తెరవడంతో పనులు ప్రారంభమవుతున్నాయి. దుబాయ్‌కి రమ్మని కంపెనీ నుంచి కబురు వచ్చింది. అప్పట్లో నాతో పాటు ఇంటికి వచ్చేసిన 20 మందినీ పిలిచారు. – నందు, మోర్తాడ్ కంపెనీ యజమాని ఫోన్ చేశాడు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను చేసే మా కంపెనీకి కొన్ని కాంట్రాక్టులు వచ్చాయి. దీంతో నాకు యజమాని ఫోన్ చేశాడు. వీసా, విమాన టిక్కెట్‌ను కంపెనీయే పంపిస్తుంది. నాతో పాటు ఇంటికి వచ్చిన పొరుగు జిల్లాల కార్మికులకూ ఫోన్ రావడంతో దుబాయ్ వెళ్తున్నాం. – కస్ప రమేశ్, మోర్తాడ్ -
నిజామాబాద్ వాసికి కరోనా లక్షణాలు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. మోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (40) ఉపాధి కోసం సౌదీకి వెళ్లి, పది రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆయన.. స్వగ్రామానికి వచ్చినప్పటి నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నాడు. నాలుగు రోజులుగా ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నా తగ్గలేదు. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షించిన వైద్యుడు కరోనా లక్షణాలున్నాయని అనుమానించి గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు, సదరు వ్యక్తికి చికిత్స అందించిన గదిలో కెమికల్స్ చల్లి, ఆ రూంను సీజ్ చేసినట్లు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో తాము హైదరాబాద్‌కు రిఫర్ చేశామని పేర్కొన్నారు. సౌదీ నుంచి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేశారని, కాని ఇంటికి వచ్చినప్పటి నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు సదరు వ్యక్తి చెప్పాడని, దీంతో గాంధీకి పంపించామని వివరించారు. మరోవైపు, ఈ విషయంపై డీఎంహెచ్‌వో సుదర్శనంను ‘సాక్షి’ సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. (‘వైరస్’ మోసుకొస్తున్నారు!) -
శీలం ఖరీదు రూ.6 లక్షలు.. చెప్పులతో దాడి
సాక్షి, మోర్తాడ్: శీలానికి ఖరీదు కట్టారు కొందరు పెద్దలు! మహిళ ప్రాణంలా భావించే మానానికి రూ.6 లక్షల ధర నిర్ణయించారు. అధికార పార్టీ నాయకుడి వికృత చేష్టలకు ఓ యువతి గర్భం దాల్చగా, పెద్దరికం నెత్తికొత్తుకున్న కొందరు డబ్బుతో రాజీ కుదిర్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన ఓ నాయకుడు (49).. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (27)పై కన్నేశాడు. కూతురి వయస్సుండే ఆమెను మభ్యపెట్టి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఇటీవల సదరు యువతిని అపహరించి వారం పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పట్టించుకోని పోలీసులు.. తమ కూతురు అదృశ్యం కావడంతో బాధితురాలి తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించక పోవడంతో ఫిబ్రవరి 19న స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు నాయకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేయలేదు సరికదా యువతి ఆ చూకీ కోసం ప్రయత్నించనూ లేదు. అయితే, యువతిని అపహరించిన సదరు నాయకుడు.. రెండ్రోజుల క్రితం ఆమెను వదిలి పెట్టాడు. చెప్పులతో మహిళల దాడి.. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. యువతి గర్భం దాల్చడం, వారం పాటు కనిపించకుండా పోవడం, అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో ఈ ఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంమైంది. అయితే, ఈ వ్యవహారం బయటకు రాకూడదని భావించిన అధికార పార్టీ నాయకుడు యువతి తరఫు వారితో రాజీకి యత్నించాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో పంచాయితీ పెట్టుకున్నారు. మొదట్లో తనకే తప్పు తెలియదని బుకాయించిన సదరు నాయకుడు.. మహిళలు గట్టిగా నిలదీయడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు మహిళలు అతడిపై చెప్పులతో దాడి చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పెద్దలు కొందరు.. ఇరువురిని శాంతింపజేశారు. చివరకు బాధితురాలికి రూ.6 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిర్చి, అక్కడి నుంచి పంపించేశారు. పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం గమనార్హం. మరోవైపు, బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీరు లేక నిలిచిన ప్రసవాలు..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్‌లోని క్లస్టర్ ఆస్పత్రిలోని బోరుబావిలో సమృద్ధిగా నీరు లేక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరిపడేంత నీరు సరఫరా కావడం లేదు. దీంతో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా నిర్వహించే ప్రసవాలను నిలిపివేశారు. గర్భిణులు ఎవరైనా ప్రసవానికి వస్తే కమ్మర్పల్లి లేదా ఆర్మూర్ ఆస్పత్రులకు తరలించడానికి వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మోర్తాడ్ పీహెచ్‌సీని పదేళ్ల కిందనే 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పీహెచ్సీ నుంచి క్లస్టర్ ఆస్పత్రిగా మోర్తాడ్ ఆస్పత్రి అప్‌గ్రేడ్ అయ్యింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ తదితర ఆస్పత్రుల తరహాలో మోర్తాడ్‌లోనూ సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలను నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి మోర్తాడ్ ఆస్పత్రిలో సాధారణ, శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 200 మంది గర్భిణులకు ప్రసవాలను చేశారు. కాగా మూడు వారాల కింద మోర్తాడ్ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి ఆశించిన మేరకు నీరు రావడం లేదు. ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, భూమిలోని భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మోర్తాడ్ ఆస్పత్రి బోరుబావి ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉంది. బోరుబావి నుంచి గతంలో ఎక్కువ మొత్తంలో నీరు సరఫరా కాగా కొన్ని రోజుల నుంచి తక్కువ పరిమాణంలో నీరు వస్తోంది. దీంతో ఈ నీరు రోగులకు సరిపోవని అధికారులు గుర్తించారు. ఆస్పత్రి వైద్యాధికారి శివశంకర్ ఎత్తిపోయిన బోరుబావి గురించి జిల్లా పరిషత్ సీఈవో, మోర్తాడ్ ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌లకు విన్నవించారు. ఆస్పత్రిలోని బోరుబావి ఎండిపోవడం వల్ల రోగులకు ప్రధానంగా బాలింతలైన వారికి సరిపోయేంతగా నీరు సరఫరా కాదు. అలాగే అప్పుడే పుట్టిన చిన్నారులకు స్నానం చేయించడానికి నీరు అవసరం. శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని మినహాయిస్తే సాధారణ ప్రసవం అయిన వారికి రోజూ స్నానాల కోసం నీరు అవసరం అవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా నీరు అవసరం కావడం అందుకు అనుగుణంగా నీరు బోరుబావిలో లేక పోవడంతో ప్రసవాలను అధికారులు నిలిపివేశారు. మోర్తాడ్‌లోని క్లస్టర్ పరిధిలో మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, చౌట్పల్లి పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రసవాల కోసం గర్భిణులు ఎంతో మంది మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలివెళుతున్నారు. ఇప్పటికే సుమారు 30 మంది గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయాల్సి ఉండగా వారిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. గర్భిణులకు ఇక్కడ ప్రసవం చేయకుండా మరో ఆస్పత్రికి తరలించడంతో తీవ్ర ప్రభావం ఏర్పడి రోగుల సంఖ్య తగ్గిపోయింది. అయితే మోర్తాడ్ ఆస్పత్రిలో సంపూర్ణ వసతి ఉంటే గర్భిణుల ప్రసవాలకు ఎలాంటి ఆటంకం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావి వేయించాలని ప్రశాంత్‌రెడ్డి ఆదేశం... మోర్తాడ్ ఆస్పత్రిలోని బోరుబావి నుంచి తక్కువగా నీరు వస్తుండగా మరో బోరుబావిని తవ్వించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. బట్టాపూర్లో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో మోర్తాడ్ ఆస్పత్రి దుస్థితిని ఏఎన్ఎం అలేఖ్య ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకపోవడంతో ఆయన స్పందించి వెంటనే కొత్త బోరుబావిని తవ్వించాలని ఎంపీడీవో పీవీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. నీరు లేక పోతే ప్రసవాలు ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. మోర్తాడ్ ఆస్పత్రిలో ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉన్నతాధికారులకు నివేదించాం మోర్తాడ్ ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రం కాగా ఈ విషయాన్ని జిల్లా పరిషత్ సీఈవో ఇతర అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఆస్పత్రిలో నిధులు ఉన్నాయి. అయితే బోరుబావికి వినియోగించడానికి మాకు అధికారం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ అనుమతి కోరాం. అనుమతి రాగానే కొత్త బోరుబావిని తవ్విస్తాం. నీటి సమస్యను పరిష్కరించి ప్రసవాలను కొనసాగిస్తాం. – డాక్టర్ శివశంకర్, కమ్యునిటీ హెల్త్ అధికారి -
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
మోర్తాడ్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనను కాపురానికి తీసుకొని పోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని సుంకెట్‌లో అర్చిత అనే మహిళ తన కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో బైటాయించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సుంకెట్‌కు చెందిన ప్రశాంత్, అర్చిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి రెండేళ్ల కింద సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహాన్ని వారి పెద్దలు అంగీకరించరని గోప్యంగా ఉంచారు. అయితే రెండు నెలల కింద అర్చిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అర్చిత డెలివరి అయిన నుంచి ప్రశాంత్ సుంకెట్‌కు రావడం లేదు. అంతేకాక కనీసం ఫోన్లోనైనా మాట్లాడక పోవడంతో అర్చిత ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించింది. ప్రేమించి తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి రాకపోవడం, హైదరాబాద్‌లోనూ మకాం మార్చడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అర్చిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో తన భర్త ఇంటి ముందు బైటాయించింది. విషయాన్ని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రశాంత్ హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న మోర్తాడ్ ఎస్ఐ సురేష్ ఇరువర్గాలను స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ చేశారు. తప్పు తెలుసుకుని చక్కగా నడుచుకోవాలని ప్రశాంత్‌కు ఎస్ఐ సూచించారు. అర్చితకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా క్రిమినల్ కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
రైలు కూత పెట్టేదెన్నడు?
మోర్తాడ్ : ‘ నీవు ఎక్కాల్సిన రైలు.. జీవిత కాలం లేటు’ అన్న ఓ సినీ కవి మాటలు నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య ప్రయాణం చేయాలనుకునే వారికి అచ్చంగా సరిపోతాయి. నిజామాబాద్ ప్రాంతంలో పూర్తి కావల్సిన రైల్వే ట్రాక్ నిర్మాణానికిఅవసరం అయిన భూమి సేకరణ సక్రమంగా జరుగక పోవడంతో రైలు కూతకు ఇంకా మోక్షం లభించడం లేదు.నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య 177.49 కిలోమీటర్ల పొడవునా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రభువు కాలంలోనే ప్రతిపాదనలు జరిగాయి. 1993-94లో ఈ రైల్వే లైన్‌కు మోక్షం లభించింది. కాగా ప్రతి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయించడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి, జగిత్యాల్ మధ్యన రైలు ప్రయాణం జరుగుతోంది. మోర్తాడ్ వరకుట్రాక్ పూర్తి కాగా స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. దీంతో మోర్తాడ్ నుంచి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ల మీదుగా పెద్దపల్లి వరకు ప్యాసింజర్ రైలును నడపాలని గత మార్చిలోనే అధికారులు ప్రతిపాదనలు చేశారు. మోర్తాడ్, లక్కోర వరకు జగిత్యాల్ నుంచి రైలింజన్ ట్రయల్న్‌న్రు పూర్తి చేశారు. చిన్న చిన్న లోపాలు తలెత్తగా వాటిని సరిదిద్దారు. రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించి సర్టిఫై చేస్తే జగిత్యాల్, మోర్తాడ్‌ల మధ్య ప్యాసింజర్ రైలును నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 28 కిలో మీటర్ల రైల్వే లైన్ పూర్తి అయితే... నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం మొత్తం 177.49 కిలో మీటర్లు. ఇప్పటివరకు 149.49 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్ పరిసరాల్లో 28 కిలో మీటర్ల పరిధిలో ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ఇంకా పూర్తి కావడం లేదు. రూ. 200 కోట్ల నిధులు ఉంటే రైల్వే లైన్ నిర్మాణం, స్టేషన్ల పనులు, వంతెనల పనులు పూర్తి చేయవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో రూ. 35 కోట్లు కేటాయించింది. అవసరం ఉన్న నిధుల్లో కనీసం సగం కేటాయించినా పనులు ఒక కొలిక్కి వచ్చేవి. నిధుల కేటాయింపులో మొదటి నుంచి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. నిధుల కేటాయింపు విషయంలో ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుక రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హడావుడి... సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అప్పటి నాయకుల ఒత్తిడితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొంత హడావుడి చేశారు. మార్చి 29న జగిత్యాల్ నుంచి మోర్తాడ్, లక్కోర వరకు రైలింజన్ ట్రయల్న్ నిర్వహించారు. త్వరలోనే సేఫ్టీ బృందంతో తనిఖీలు పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును నడుపుతామని ప్రకటించారు. అప్పటి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు రైల్వే అధికారులు హడావుడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించక పోవడాన్ని పరిశీలిస్తే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ట్రయల్న్ ్రఒక ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. చివరకు ఎన్నికల ఫలితాలు కూడా అప్పటి నాయకులకు ప్రతికూలంగానే వచ్చాయి. కాగా ఇప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తనిఖీలను పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
ల్యాబ్‌లున్నా.. టెక్నీషియన్లు లేరు
మోర్తాడ్ : ప్రభుత్వ ఆస్పత్రులలో రక్తం, మూత్రం, తది తర పరీక్షలను నిర్వహించి రోగాన్ని నిర్ధారించడానికి ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా.. ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో రోగులకు సరైన సేవ లు అందడం లేదు. కొన్నేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా నే ఉంటున్నాయి. వీరి స్థానంలో ఎంపీహెచ్‌ఏలతో ల్యాబ్‌లను నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌లతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నా యి. గతంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమితులైనవారు తర్వాత సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే శిక్షణ పొందిన ల్యాబ్టెక్నిషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ల్లో డీఎల్‌ఎంటీ కోర్సు పూర్తి చేసినవారిని నియమించాల్సి ఉంది. ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోవడంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఆస్పత్రుల్లో ఎంపీహెచ్‌ఏలుగా పని చేస్తున్న కాం ట్రాక్టు వైద్య సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చి వారి తోనే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు జ్వరంలాంటి వ్యాధులకే కాకుండా మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం అవుతా యి. ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో తక్కువ సమయం లో నామమాత్రపు శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏలతో నే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. డీఎంఎల్టీ కోర్సులో రోగ నిర్ధారణ పరీక్షలను ఎలా చేయాలి, ఎలాంటి వ్యాధిని గుర్తించాలంటే ఎంత సమయం రక్తం, మూత్రం పరీక్షను నిర్వహిం చాలి, తదితర ఆంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారికి పరీక్షలను నిర్వహిస్తారు. డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేసినవారు ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకునే వీలుంది. కాగా వా రు ప్రభుత్వ ఉద్యోగంపైనే టెక్నీషియన్లు మక్కువ చూపుతారు. ప్రభుత్వం మాత్రం శిక్షణ కేంద్రాల నిర్వహణకు అనుమతులు ఇస్తున్నా.. ఉపాధిని చూపలేకపోతోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పందించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘మరుగు’న పడ్డాయి
మోర్తాడ్ : గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రవేశపెట్టిన వ్యక్తిగత మరుగుదొడ్డి(ఐహెచ్హెచ్ఎల్) పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. కొత్తగా మరుగుదొడ్డిని నిర్మించుకోవడానికి అనేక మంది చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. గతంలో మంజూరు చేసిన ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలను మాత్రం పూర్తి చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాన్ని బదలాయింపు చేయడంతో కొత్త మంజూరుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 50 వేల మంది మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో మంజూరు అయిన వాటికి మాత్రమే బిల్లులు చెల్లిస్తామని కొత్తగా మంజూరు చేసే ఆంశం తమ పరిధిలో లేదని అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకున్నవారికి ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 4,600లను, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,400లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నాయి. గతంలో జిల్లాలో 1,19,749 మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో 30,604 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి కాగా 22,442 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 66,703 మరుగుదొడ్ల నిర్మాణం మొదలు కావాల్సి ఉంది. గతంలో మంజూరు పొందని వారు కొత్త మంజూరు కోసం మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఐహెచ్హెచ్ఎల్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కాగా ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల పథకాన్ని కేంద్రం స్వచ్ఛ భారత్ పరిధిలోకి మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాటికి మంజూరు ఇవ్వలేక పోతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త మంజూరు లేక పోవడంతో ఇప్పుడు వ్యక్తి గత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలనుకునేవారికి నిరాశే ఎదురైతుంది. కేంద్రం అనుమతి ఇచ్చే వరకు దరఖాస్తు చేసుకున్నవారు ఆగాల్సిందేనని అధికారులు తెలిపారు. స్వచ్చ భారత్ పథకానికి కేంద్రం భారీ ప్రచారం ఇస్తుండగా వ్యక్తిగత మరుగుదొడ్డి పథకానికి అనుమతులను నిలుపుదల చేయడంలో అర్థం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలకు మంజూరు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
‘జనశక్తి’పై ఆరా
మోర్తాడ్: మండలంలోని ఏర్గట్లలో జనశక్తి నక్సల్స్ సంచారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రెండు రోజుల కింద ఏర్గట్లలో సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీకి చెందిన ఆజ్ఞాత కార్యకర్తలు సభ నిర్వహించి, బ్యానర్లను ఏర్పా టు చేశారు.దీంతో ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీ స్తున్నారు. జనశక్తి నక్సల్స్ కదలికలు మొదలైనట్లు ప్రచారం జరుగడంతో పోలీసులు మాజీలను విచారిస్తుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈనెల 30న నిర్వహించనున్న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాల ని కోరుతూ జనశక్తి కార్యకర్తలు ఏర్గట్లలోని స్మారక స్థూపం వద్ద బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఏర్పాటు చేస్తూ పాటలు పాడి అమరవీరులకు నివాళులు అర్పించినట్లు ప్ర చారం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యానర్లను తొలిగించినప్పటికి గ్రామానికి వచ్చిన వారు ఎవరై ఉంటారని వివరాలు సేకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ నక్సల్స్ కదలికలు కనిపించడం పోలీసులు అప్రమత్తమయ్యారు. జనశక్తి పార్టీకి చెందిన మాజీలపైనా పోలీసులు దృష్టిసారిం చారు. గ్రామంలో జనశక్తి నక్సల్స్ కదలికలు కల్లోలం రేపుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. -
ఆలయాల్లో వెలగని ‘దీపం’
మోర్తాడ్ : భక్తుల కోరికలను మన్నించే దేవుడు ప్రభుత్వ కటాక్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధూప, దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వకపోవడంతో ఆలయాల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని అర్చకులు వాపోతున్నారు. ధూప, దీప నైవేద్యాలతో పాటు అర్చకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 చొప్పున నిధులను మంజూరు చేస్తుంది. అయితే ఆరు నెల లుగా ప్రభుత్వం నిధులను కేటాయిం చక పోవడంతో ధూప దీప నైవేద్యాలకు భక్తులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు అర్చకులు పేర్కొన్నారు. 2007లో ధూపదీప నైవేద్యాల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో జిల్లాలో 189 ఆలయాలను పథకం కింద దేవాదాయ ధర్మదాయ శాఖ ఎంపిక చేసింది. ఇటీవలే మరి కొన్ని కొత్త ఆలయాలను దేవాదాయ శాఖ చేర్చింది. ఆలయ అర్చకుని వేతనం కోసం రూ. 1500, నూనె, అగర్బత్తీలు, ప్రసాద సామాగ్రి ఇతర సరుకుల కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం ఆరంభం కాక ముందు గ్రామాభివృద్ధి కమిటీలు, ఆలయ కమిటీలు ఆలయాల నిర్వహణకు నిధులను కేటాయించేవి. పథకం ప్రారంభం అయిన నుంచి గ్రామాభివృద్ధి కమిటీలుగాని, ఆలయ కమిటీలు గాని నిధులను ఇవ్వడం లేదు. అర్చకులకు వేతనం సరిపోక పోయినా పౌరోహిత్యంపై వచ్చే ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు. ఆరు నెలల నుంచి ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం లేదు. ఆలయాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయా ల్సి ఉంటుంది. దీపారాధనకు నూనె ఎక్కువగానే వినియోగం అవుతుంది. దేవునికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టాలి. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరగడంతో ప్రసాదానికి వినియోగించే సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆలయాల నిర్వహణకు ప్రభుత్వం తక్కువగానే నిధు లు ఇస్తున్నా సకాలంలో నిధులు మం జూరు చేస్తేనే నిర్వహణ సాధ్యం అవుతుందని అర్చకులు చెబుతున్నారు. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లోనూ, దసరా ఉత్సవాల సందర్భంగా ఆల యాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్బాల్లో నిధులు ఎక్కువగా అవసరం అవుతాయి. అయితే ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖకు నిధులను కేటాయించక పోవడంతో ధూప, దీప నైవేద్యాలకు నిధుల కేటాయింపు సాధ్యపడలేదు. జిల్లాకు దాదాపు రూ. 35 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. -
ఇదేమి మెలిక?
మోర్తాడ్: ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణం పై 30 శాతం రుణం హెచ్చింపు చేసి కొత్త రుణం ఇవ్వాలని ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను ఆదేశించింది. దీంతో రైతు కు ఉన్న రుణంపై 30 శాతం ఎక్కువ రుణం ఇవ్వాల్సి ఉంది. అంటే మాఫీ అయిన 25 శాతం సొమ్ముతోపాటు అదనం గా మంజూరు అయ్యే రుణం రైతుకు అందాలి. అయితే సింగిల్ విండోల అధికారులు గతంలో లేని నిబంధనలను ఇప్పుడు ఉన్నట్లు చూపుతూ రైతులకు మొండి చెయ్యి చూపుతున్నారు. రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలకు టైటిల్ డీడ్‌ను కాని, పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా ఉంచుకోకూడదు. అయిన్పటికీ టైటిల్ డీడ్లను తనఖా ఉంచాలని స ంఘాల ఉద్యోగులు పట్టుబడుతున్నారు. గతంలో ఏం జరిగింది? గతంలో సహకార సంఘాలలో రైతులు రుణాలు తీసుకున్నప్పుడు టైటిల్ డీడ్లను తనఖా ఉంచుకోలేదు. తక్కువ మొత్తంలోనే రుణం లభిస్తుండటంతో పహాణి అందించి, మరొక రైతు జామీనుతో రుణం పొందారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సహకార సంఘాలు రూ. 60 వేలకు మించి రుణం ఇవ్వలేదు. వాణిజ్య బ్యాంకులలో ఎకరానికి రూ. 50 వేల చొప్పున పంట రుణం ఇచ్చారు. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో పహాణిలను ఇచ్చి పంట రుణం తీసుకున్నారు. వాణిజ్య బ్యాంకులలో టైటిల్ డీడ్ తనఖా ఉంచి ఎక్కువ పంట రుణం తీసుకున్నారు. సహకార సంఘాలలో ఎంత రుణం ఉన్నా తమ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సింపుల్ మార్టిగేజ్ చేసి ఇచ్చారు. పంట రుణాలకు సంబంధించి సహకార సంఘాలు, బ్యాంకులు సిం పుల్ మార్టిగేజ్ చేసుకోవాలని టైటిల్ డీడ్ తనఖా పెట్టుకోరాదని రిజర్వు బ్యాంకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాం కర్లు మాత్రం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను కాదని టైటిల్ డీడ్ తనఖాకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.320 కోట్ల రుణం మాఫీ లభించింది. సర్కారు తొలి విడతగా 25 శాతం నిధు లను విడుదల చేయడంతో సహకార సంఘాలకు రూ. 80 కోట్ల మాఫీ సొమ్ము జమ అయ్యింది. అక్కడ రైతులు ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చే సుకున్నారు. దీంతో రైతులకు మాఫీ సొమ్ము చేరాల్సి ఉంది. ఎక్కువ మంది రైతులు టైటిల్ డీడ్లను తనఖా ఉంచడం లేదనే కారణంతో మాఫీ సొమ్ము రైతుల చేతికి అందకుండా రుణంలోనే మినహాయిస్తున్నారు. గతంలో లేని నిబంధనలను ఇప్పుడు సాకుగా చూపుతూ కొత్త రుణాలను ఇవ్వక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా సహకార సంఘాలలో తక్కువ పంట రుణం లభించడంతోనే తాము మళ్లీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులలో ఎంత రుణం ఉన్నా ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ చేస్తుంది. సహకార సంఘాలు రుణాలను రెన్యూవల్ చేయకపోవడంతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయం ఉన్న రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న, సన్నకా రు రైతులకు మాత్రం కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాలలో సభ్యు లైన రైతులకు కొత్త రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలు
మోర్తాడ్ :తెలంగాణ హరిత హారంలో భాగంగా విస్తారంగా మొక్కలను పెంచడం కోసం అవసరం అయిన ఏర్పాట్లను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి అక్కడ నర్సరీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తోంది. నర్సరీల నిర్వహణ బాధ్యతను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలకు అప్పగించారు. గ్రామాల్లో మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలను, జిల్లా వ్యాప్తంగా 3.60 కోట్ల మొక్కలను రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. కాగా తెలంగాణ హరిత హారం పథకాన్ని అమలు చేయడానికి ఇప్పుడు నిర్వహిస్తున్న నర్సరీల సంఖ్య సరిపోదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొత్త నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. భారీగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో అందుకు అనుగుణంగా మొక్కలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంలో, మేజర్ పంచాయతీలో నర్సరీలను నిర్వహించడం కోసం అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రి, జూనియర్, డిగ్రీ కళాశాలల స్థలాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖ అతిథి గృహాలు ఇతర ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచడానికి నర్సరీలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకానికి సామాజిక అటవీ శాఖ 75 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కింద మరో 25 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు శాఖలు నిర్వహిస్తున్న నర్సరీలకు అనుబంధంగానే కొత్త నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండలానికి పది నుంచి 15 నర్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆ మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు లేరా?
మోర్తాడ్: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున పురస్కారాలు అందించడం ఆనవాయితీ. అయితే ఈ అవార్డుల ప్రదానం కోసం సరైన కమిటీ లేక పోవడం, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఎవరికి వారు దరఖాస్తు చేసుకుని పైరవీలు చేయడంతో అవార్డుల ప్రదానం అభాసుపాలవుతోంది. జిల్లాలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా విద్యాశాఖ తరపున సత్కరించారు. అయితే ఇందులో 14 మండలాల నుంచి ఉపాధ్యాయులకు చోటు దక్కకుండా పోయింది. జిల్లాలోని 36 మండలాలకు గాను 22 మండలాల్లోని ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం లభిం చింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సరైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించడంలేదు. మం డల స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారితో సమావేశం నిర్వహిం చి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన వారు జిల్లా స్థాయి పురస్కారం కోసం దరఖాస్తు చేసుకుని తమ పలుకుబడిని ప్రయోగిస్తేనే ఉత్తమ పురస్కారం లభిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం కోసం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపక పోవడంతో అలాంటి వారికి అవార్డు లభించే అవకాశం లేదు. ప్రత్యేకంగా కమిటీ ఉంటే కమిటీ సభ్యులు ఉత్తమ ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి అవార్డుకు ప్రతిపాదిస్తే అర్హులకు పురస్కారం దక్కే అవకాశం ఉంది. కమిటీ అంటూ ఏమి లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల కనుసన్నుల్లో ఉత్తముల ఎంపిక జరగడం కొంత వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. జిల్లాలోని లింగంపేట్, నిజామాబాద్, ధర్పల్లి, నిజాంసాగర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బోధన్, ఎడపల్లి, బాల్కొండ, మాక్లూర్, బాన్సువాడ, డిచ్పల్లి, తాడ్వాయి, వేల్పూర్, సదాశివ్‌నగర్, భీమ్‌గల్, నం దిపేట్, కోటగిరి, రెంజల్, నవీపేట్, గాంధారి, కామారెడ్డి మండలాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, మాచారెడ్డి, భిక్కనూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, వర్ని, నాగిరెడ్డిపేట్ మండలాల ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం అవార్డు లభించలేదు. -
ఇక పల్లెకుపచ్చకోక
మోర్తాడ్: తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా పర్యావరణ అభివృద్ధి కోసం పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో 3.60 కోట్ల మొక్కలను నాటించాలని భావిస్తోంది. తగిన ప్రచారం లేకపోయినా అధికారులు మాత్రం మొక్కలను విస్తారంగా నాటడానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయ డంలో నిమగ్నమయ్యారు. ప్రతి ని యోజకవర్గానికి 40లక్షల చొప్పున మొక్కలను మూడేళ్లపాటు నాటించి వాటిని పరిరక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదికి 13.33 లక్షల చొప్పున మొక్కలను ప్రతి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో నాటించడానికి ప్రణాళికను సి ద్ధం చేస్తోంది. ఇంటింటికీ మొక్కలు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ల క్ష మొక్కలను నాటాలని తొలుత భా వించారు. గ్రామాల విస్తీర్ణం, భౌగోళి క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి లక్ష మొక్కలు సాధ్యం కాదని భావించి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గ్రామంలో ఎక్కువ మొక్కలు, త క్కువ నేల ఉన్న గ్రామంలో తక్కువ మొక్కలు నాటించి, వాటిని పరిరక్షించడానికి పకడ్బందీగా చర్యలు తీ సుకోనున్నారు. ప్రతి ఇంటికి రెండు, మూడు పండ్లమొక్కలు, ఉమ్మడి భూములలో పెద్ద మొత్తంలో రకరకాల మొక్కలను నాటించనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, చెరువు శిఖం భూములు, కట్టపై, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ రహదాలకు ఇరువైపులా మొక్కల ను నాటించనున్నారు. రైతులకూ పంపిణీ రైతులు తమ భూములలో పంటల ను సాగు చేయకుండా మొక్కలు నా టాలనుకుంటే వారికి పెద్ద మొత్తంలో మొక్కలను సరఫరా చేస్తారు. పొలం గట్ల వెంబడి కూడా మొక్కలను నా టించనున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నం దున స్థలాల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మన ఊరు మన ప్రణాళికలోనే తెలంగాణ హరిత హారం కార్యక్రమం భాగంగా ఉంది. ప్రజా ప్రతినిధుల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా అధికారులు మాత్రం ఈ కార్యక్రమాన్ని పక డ్బందీగా చేపట్టాలని భావిస్తున్నారు. స్థలాలను ఎంపిక చేసిన తరువాత మొక్కల సరఫరాకు ప్రత్యేకంగా నర్సరీలను ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని పరిశీలించనున్నా రు. ప్రతి గ్రామంలో ఏడాదికి 10 వేల నుంచి 30 వేల మొక్కలను నాటించా ల్సి ఉంది. అందు కోసం ఇప్పుడు ఉన్న నర్సరీలకు తోడుగా మరిన్ని నర్సరీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తెలంగాణ హరిత హారం కార్యక్రమం పకడ్బందీగా అమలు అయితే పర్యావరణానికి ముప్పు తప్పుతుందని పర్యావరణ అభిమానులు చెబుతున్నారు. అయితే ఈ పథకం గురించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. -
వలస జీవుల తంటాలు
మోర్తాడ్:మోర్తాడ్ మండలం తొర్తికి చెందిన పోచయ్య ఉపాధి కోసం ముంబాయిలో ఉంటున్నాడు. సమగ్ర సర్వే కోసం రెండు రోజుల కింద స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే, స్థానికంగా నివాసం ఉండటం లేదం టూ ఆయన వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు స్పష్టం చేశారు. దోంచందకు చెందిన సంజీవ్‌కుమార్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సర్వేలో వివరాలను న మోదు చేయించుకునేందుకు కుటుంబం సహా స్వగ్రామానికి వచ్చారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న వా రి వివరాలు సేకరించడానికి తమకు ఇబ్బంది లేదని, నిజామాబాద్‌లో ఉంటున్నవారి వివరాలను మాత్రం ఇక్కడ సేకరించమని సర్వే బృందం తేల్చి చెప్పింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా మంది నిరాశకు గురయ్యారు. ఎవరూ పట్టించుకోక సర్వే కోసం ఎన్నో తంటాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వా రి కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక ముంబాయి, పూణే, భీవండితోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లిన తెలంగాణవాసులు సర్వే కోసం సొంత ఊళ్లకు వస్తే వివరాలను న మోదు చేయక పోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం చో టు చేసుకుంది. తమ వివరాలను నమోదు చేయడం లేదంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం లే కపోయింది. అందుబాటులో ఉన్న అధికారులకు ఫో న్ చేస్తే వారు విసుక్కున్నారు. కొందరు అధికారులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో జనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్టిక్కర్ల గొడవ సర్వే నిర్వహించడానికి గుర్తింపు కోసం స్టిక్కర్లను అతికించారు. కొన్ని ఇళ్లకు అతికించలేదు. స్టిక్కర్లతో సంబంధం లేకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా, స్టిక్కర్లు లేని కారణంగా ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలను సర్వే బృందం నమోదు చేయలేదు. స్టిక్కర్లు అతికించిన రోజున సిబ్బంది నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే సర్వే రోజున వివరాలను సేకరించారు. సర్వే విధివిధానాలు అర్థం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వేపై ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రచారం చేసినా సర్వేలోని ఆంశాలు, వివరాలు సేకరించిన తీరుతో జనంలో అపోహలు మరింత ఎక్కువయ్యాయి. -
రైతులకు ‘ఇన్పుట్ సబ్సిడీ’
మోర్తాడ్ : ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ఆసరాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించారు. ఐదేళ్ల కిందట నష్టపోయిన పంటకు ఇప్పుడు పరిహారం అందడం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నష్టపోయిన పంటలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందించారు. ఆయన అకాల మరణం తర్వాత ఐదేళ్లు ఆలస్యంగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు అందుతోంది. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో సాధ్యమైంది. ఇన్పుట్ సబ్సిడీతో జిల్లావ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జిల్లాకు చేరనున్నాయి. 90రోజుల కాల వ్యవధిలో పంటలను నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ కానుంది. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదరగాలులతో నష్టపోయిన పంటలకు పరిహారం లభించనుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేసిన అంచనాల ప్రకారం *1.27 కోట్లు మంజూరు అయ్యాయి. భారీ వర్షాలు, ఈదరగాలుల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు *18.79 కోట్లు మంజూరు అయ్యాయి. పంటలు నష్టపోయిన సందర్బంలో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్ట పరిహారం అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేశారు. వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు. ప్రతి సీజనులో ఏదో ఒక కారణంగా భారీగానే పంటల నష్టం జరిగింది. నష్టం అంచనా వేయడం మినహా ప్రభుత్వం ఎలాంటి పరిహారాన్ని మంజూరు చేయలేదు. వైఎస్ హయాం తర్వాత ఐదేళ్ల నుంచి రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలంగాణ సర్కారు ఇన్పుట్ సబ్సిడీ కోసం నిధులను కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘సహకారం’ ఏది ?
మోర్తాడ్: సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం పొందిన రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం ఇంకా స్పష్టతను ఇవ్వక పోవడంతో కొత్తగా సభ్యత్వం తీసుకున్న రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని సహకార సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసుకున్నవారు, తమ తల్లి తండ్రుల పేర్లపై ఉన్న భూములను తమ పేరున మార్చుకున్న వారు ఎంతో మంది సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. కొత్తగా సభ్యులుగా చేరిన రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత సంఘాలపై ఉంది. సహకార సంఘాలను అజమాయిషీ చేసే జిల్లా సహకార బ్యాంకు నిధులను మంజూరు చేస్తేనే సంఘాలు రుణాల ప్రక్రియను ప్రారంభిస్తాయి. జిల్లా సహకార బ్యాంకులకు లీడ్ బ్యాంకుగా ఉన్న ఆప్కాబ్ కొత్త రుణాలపై ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. దీంతో సహకార సంఘాలు కొత్త సభ్యుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాయి. జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో కొత్తగా సభ్యులు చేరిన వారు 50 నుం చి 75 మంది వరకు ఉన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పం ట రుణం పొందడం కంటే సహకార సంఘాల్లో రుణం పొందడం మేలు అని భావించిన రైతులు సహకార సం ఘాల్లోనే దరఖాస్తులు చేసుకున్నారు. సహకార సంఘా ల ద్వారా రాయితీలు ఎక్కువగా ఉండటం, రుణం సుల భంగా లభిస్తుండటంతో రైతులు సహకార సంఘాలనే నమ్ముకున్నారు. ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. టీఆర్ఎస్కు మంచి మెజార్టీ స్థానాలు లభించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందు కు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇం డియా నిబంధనల కారణంగా రుణ మాఫీ ఇంకా జరుగడం లేదు. రుణ మాఫీపై ఏదైనా స్పష్టత వస్తేనే కొత్త రుణాలకు నిధులు మంజూరు అవుతాయని సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. రుణ మాఫీపై స్పష్టత రాకపోవడంతో కొత్త పంట రుణాలకు బ్రేక్ పడింది. రుణం రాక పోతే భూములను ఎలా అభివృద్ధి చేయాలి, పంటలను ఎలా సాగు చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద పంటల సాగు కోసం రుణం తీసుకుంటే వడ్దీభారం అధికం అవుతుందని రైతులు తెలిపారు. గతంలో పంట రుణం పొందిన రైతుల పరిస్థితి ఎలా ఉన్నా తమకు మాత్రం రుణం దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయని సంఘాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సహకార సంఘాల్లోని కొత్త సభ్యులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉద్యానవనం’.. ఉద్యోగులు శూన్యం!
మోర్తాడ్ : జిల్లాలో ఉద్యానవన శాఖలోని ఖాళీలను, ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే పాలకుల హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉండిపోనున్నాయని స్పష్టమవుతుంది. జిల్లాలో 36 మండలాలు ఉండగా, కేవలం ఏడుగురు ఉద్యానవన శాఖాధికారులతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులందరికీ ఉ ద్యానవన శాఖ పథకాలు అందడం లేదని వెల్లడవుతోంది. జిల్లా అంతటికీ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ఒకటి , నాలుగు ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌లో ఏడీఏ పోస్టు ఉంది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలలో ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి అధికారి బదిలీ కాగా, ఇంతవరకు భర్తీ కాలేదు. ఆ ర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో మాత్రం ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు మూడు ఉన్నాయి. ఖాళీలతో లక్ష్యాలు చేరేనా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడటం, పం టలకు గిట్టుబాటు ధరలు అంతగా లేకపోవడం తో చాలామంది రైతులు ఉద్యానవనాల పెం పుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ సంవత్సరం వంద హెక్టార్లలో పం డ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఉద్యోగులు తక్కువగా ఉండటంతో పండ్ల తోటల పెంపకం 50 శాతం కూడా సాగయ్యే సూచనలు కనిపించడం లేదు. మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ, బత్తాయి, జామ, నిమ్మ తదితర పండ్లతోటలను పెంచడంతో పాటు రైతులకు కూరగాయల విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో అందించడం ఉద్యానవన శాఖ విధి. పండ్ల తోటల పెంపకంతో పాటు వ్యవసాయ పరికరాలు, పసుపు రైతులకు తగిన సూచనలు సలహాలు, పని ముట్లను ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నారు. పైరవీలు చేస్తేనే పనులు జిల్లాల్లో 36 మండలాలకు కేవలం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఒక ఉద్యానవన అధికారితోపాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డు కన్సల్టెంట్లు ఉంటేనే రైతులకు పరిపూర్ణంగా సేవలు అందుతాయి. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ శాఖ ద్వారా అందించే పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పైరవీలు చేసిన వారికి మాత్రమే ఉద్యానవన పథకాల లబ్ధి చేకూరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖ ప్రయోజనాలు అందాలంటే ఉద్యోగుల సంఖ్యను త్వరితగతిన పెంచాల్సిన అవసర ముందని పలువురు సూచిస్తున్నారు. -
ఎలా ‘నోట్’ చేసుకోవాలి
మోర్తాడ్ : విద్యాహక్కు చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి (పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు, యూనిఫాం)ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. కేవలం యూని ఫాంలు, పాఠ్య పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో 1,573 ప్రాథమిక, 265 ప్రాథమికోన్నత, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 41 ఎయిడెడ్ , 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. ముందుగా టెండర్లను నిర్వహించి సామగ్రిని ప్రభుత్వం సేకరించకపోవడంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు విద్యార్థులకు సరఫరా కాలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో విద్యా సామగ్రి కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారిం ది. విద్యా సామగ్రి ధరలు మార్కెట్లో భారీ గానే పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల కుటుంబాల ఆదాయం పెరగలేదు. దీంతో ప్రభుత్వంపై వారు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాన్ని పాటించక పోతే ఎలా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యాహక్కు చట్టంలో విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయాలి.- సత్యానంద్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
మోర్తాడ్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేక పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. వేసవి కాలం మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. గత సంవత్సరం అతివృష్టి కారణంగా భూగర్భ జలాలు బాగానే ఉన్నా భూమి లో వేడిమి తగ్గని కారణంగా పంటల సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. సోయా విత్తితే మొలకెత్తని పరిస్థితి నెలకొంది. బోరుబావుల ద్వారా సోయా, వరి పంటలను సాగు చేయాలని రైతులు ప్రయత్నిస్తున్నా భూమి అనుకూలించక పోవడంతో విత్తనం వృథా అవుతోంది. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మిన హా అన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఉంది. సాధారణ వర్షపాతానికి కనీసం 50 శాతం కూడా నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది రైతులు సోయా విత్తనాలను రెండు మార్లు విత్తారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నా య పంటల సాగుతో రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పెసర్లు, మినుములు సాగు చేయడానికి అనుకూలంగా వాతావరణం ఉండటంతో ఈ రెండు పంటలను సాగు చేయించి రైతాంగానికి దారి చూపాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి మండలంలోను వ్యవసా య శాఖ అధికారులు ఈ ఖరీఫ్ సీజనుకుగాను సోయా, వరి పంటలకు బదులు పెసర్లు, మినుములు సాగు చేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రైతాంగానికి ఎంత మేర విత్తనాలు అవసరమో అంచనా వేస్తున్నారు. సోయా, వరి సాగులకు ఇంకా కొంత సమయం ఉన్నా ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలి యదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళి కను సిద్ధం చేస్తున్నారు. ఒక వేళ వర్షాలు కురిస్తే సోయా, వరి సాగుకు అవసరం అయిన విత్తనాలు రైతుల వద్ద రెడీగా ఉన్నాయి. రెండు, మూడు భారీ వర్షాలు కురిసే వరకు రైతులు కాస్తా ఓపిక పట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచు తున్నారు. -
ఇంకా ఏపీ సింబలేనా !
మోర్తాడ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజులు అవుతున్నా రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజ ముద్రనే దర్శనమిస్తోంది. ఆదాయం, కులం, నెటివిటీ త దితర ధ్రువీకరణ పత్రాలతోపాటు పహాని ఇతరత్రా సర్టిఫికెట్లు అన్ని మీ సేవ కేంద్రాల ద్వారానే జారీ చేయబ డుతున్నాయి. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాలలో సంప్రదించి అవసరమైన జిరాక్సు కాపీలను అందచేస్తే రెండు మూడు రోజుల వ్యవధిలో సర్టిఫికేట్లు జారీ అవుతాయి. మీ సేవ కేంద్రాలకు జారీ చేసిన స్టేషనరీ పాతది కావడంతో పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పూర్ణ కుం భం తో కూడిన రాజ ముద్రనే ఉంది. తె లంగాణ ప్రభుత్వం కొత్త రాజ ముద్ర ను ఆమోదింపచేసింది. స్టేషనరీ గతంలో ప్రింట్ చేసింది కావడంతో రాజ ముద్ర లో ఎలాంటి మార్పు లేదు. కాగా సర్టిఫికెట్లపై తెలంగాణ ప్రభుత్వం అని ఉన్నా, రాజ ముద్ర విషయంలో మా ర్పులు చేయాల్సి ఉంది. రాజ ముద్ర మారక పోవడంతో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుం టే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నెల రోజుల వుతున్నా సర్టిఫికెట్ల స్టేషనరీలో మా ర్పులు చేయక పోవడంపై నిరసన వ్య క్తం అవుతోంది. మీ సేవ కేంద్రాల నిర్వా హకులు సర్టిఫికెట్లను జారీ చేయడానికి అవసరమైన స్టేషనరీని హై దరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల కంట్రోల్ రూంకు ఆన్లైన్లో రిక్వెస్ట్ ఉంచితే, డ బ్బులు కట్ అవుతాయి. దీంతో హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి స్టేషనరీ సరఫరా అవుతుంది. ఆ తరువాత ని ర్వాహకులు తెప్పించుకోవాల్సి ఉంటుం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాైటై న వెంటనే స్టేషనరీని మార్చాల్సి ఉంది. అధికారులు పట్టించుకోక పోవడం తో ఏపీ రాజ ముద్రతోనే సర్టిఫికెట్ లు జా రీ అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారు లు స్పందించి సర్టిఫికెట్లపై తెలంగా ణ రాజ ముద్ర ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.