mountains
-
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్‌లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్తంగ్ పాస్‌తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా -
18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ
కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులోఅధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్ థౌజెండర్స్’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జని్మంచిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెపె్టంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి. -
పక్షులకు చీమల గండం!
పర్వత ప్రాంతాల్లోని పక్షి జాతుల మనుగడకు పెను ముప్పు ఎదురవుతోంది. ఎవరి నుంచో తెలుసా? చీమల నుంచి! వాటి దెబ్బకు తీవ్ర ఆహార కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. దీనివల్ల పర్వత ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాంతో కష్టమే అయినా, విధిలేని పరిస్థితుల్లో చీమలు ఎక్కి రాని పర్వత పై ప్రాంతాలకు పక్షులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం విశేషమని అధ్యయనం పేర్కొంది.భూమి ఉపరితలంపై 25 శాతం మాత్రమే ఉండే పర్వతాలు ఏకంగా 85 శాతం పక్షి, క్షీరద జాతులకు నిలయాలు. పర్వతాల్లోని పలు పక్షి జాతులు తరచూ పై ప్రాంతాలకు వలస వెళ్తుండటాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి వాతావరణ మార్పులు తదితరాలే ప్రధాన కారణాలని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని ఐఐఎస్సీ అధ్యయనం తేల్చింది. మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నివసించే పక్షులకు ఓషియోఫైలా జాతి చీమలు పెద్ద ముప్పుగా మారినట్టు వెల్లడించింది. పర్వత ప్రాంతల్లో మొత్తం జీవావరణ వ్యవస్థనే అవి ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయన బృందానికి సారథ్యం వహించిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమేశ్ శ్రీనివాసన్ తెలిపారు. వాటితో నెలకొన్న ఆహార పోటీని తట్టుకోలేక పక్షులే తమ ఆవాసాలను మార్చుకోవాల్సి వస్తోందని వివరించారు. ఓషియోఫైలా చీమలు దూకుడుకు పెట్టింది పేరు. కీటకాలు తదితరాలను తిని బతుకుతుంటాయి. ఇవి ప్రధానంగా పర్వతాల పాద ప్రాంతాల్లో విస్తారంగా ఉంటాయి. దాంతో అక్కడ కీటకాల కొరత నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ ప్రధాన ఆహారమైన కీటకాల అలభ్యతతో పక్షులు అల్లాడుతున్నాయి. చీమల బెడదను తప్పించుకోవడానికి వాటి ఉనికి అంతగా ఉండని పర్వత పై ప్రాంతాలకు వలస పోతున్నాయి. ‘‘ఫలితంగా ప్రధానంగా కీటకాలను తినే పక్షి జాతుల వైవిధ్యం 900 మీటర్లు, అంతకంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే విస్తారంగా కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఓషియోఫైలా చీమలుండే పర్వత ప్రాంతాలన్నింట్లోనూ ఈ ధోరణి కొట్టొచ్చినట్టుగా ఉంది. పళ్లు, పూలలోని మకరందం ప్రధాన ఆహారమైన పక్షి జాతులు మాత్రం పర్వత పాదప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉండటం గమనించాం. ఆహారం విషయంలో ఓషియోఫైలా చీమలతో వాటికి పోటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం’’ అని శ్రీనివాసన్ వెల్లడించారు. పక్షి జాతుల పరిరక్షణ ప్రయత్నాలను ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ప్రభావితం చేయనున్నాయి. వాటిని ఎకాలజీ లెటర్స్‌లో తాజాగా ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసాధ్యం కాస్త సుసాధ్యం.. ముచు ఛిష్‌ను జయించారు
ఢిల్లీ: ఈ భూమ్మీద మనిషి ఇప్పటికీ అధిరోహించని పర్వతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటిగా మన పొరుగున పాకిస్తాన్‌లోని ముచు ఛిష్ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు దానిని కూడా జయించేశారు.తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువైంది. కారకోరం రేంజ్‌లోని 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తైన ముచు ఛిష్ పర్వతాన్ని ఎట్టకేలకు అధిరోహించారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం.. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ ఘనత సాధించింది. డెనెక్ హక్, రాడోస్లావ్ గ్రోహ్, జరోస్లావ్ బాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు.గతంలో ఎందరో పర్వతాహరోహకులు దీనిని అధిరోహించే ప్రయత్నంలో భంగపడ్డారు. కిందటి ఏడాది ఓ బృందం.. 7,200 మీటర్ల దాకా వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కి తిరిగి వచ్చేసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన పర్వతారోహకులు.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. అయితే ఈసారి అదే దేశానికే చెందిన బృందం ఒకటి ఎట్టకేలకు ఆ ఘనత సాధించింది. -
ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!
సరైన సౌకర్యాలు ఉంటే ఏ పర్యాటక ప్రాంతమైనా, పుణ్యక్షేత్రమైనా ఎంతో అభివృద్ధి చెందుతుంది, అందులో ముఖ్యమైనవి రవాణా, వసతులు. అగ్రరాజ్యం, అన్నింటా అభివృద్ధి చెందిన అమెరికాలో ఇలాంటి మౌలిక/ఆధునాతన సదుపాయాల గురించి చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏరియల్ ట్రాంవే గా ప్రసిద్ధి గాంచింది కాలిఫోర్నియా రాష్ట్రం ఐడిల్ వైల్డ్ దగ్గరున్న ‘ పామ్ స్ప్రింగ్స్ ఏరియల్ ట్రామ్ వే ’. సందర్శకుల శ్రమ, సమయం తగ్గించి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్శించడానికి దీన్ని 1963 లో నిర్మించారట. ఇది చేసే పని ఏంటంటే.. పర్యాటకులను కొచెల్లా లోయ నుంచి సముద్రానికి 8500 అడుగులకు పైగా ఎత్తులో నున్న ‘ మౌంట్ సాన్ జెసంటో శిఖరం ’ హిల్ స్టేషన్‌కు ఏరియల్ వే ద్వారా తీసుకుపోవడం. దాదాపు 80 మంది ఒకేసారి ప్రయాణించగలిగిన ఒక పెద్ద రూం టైపు బాక్స్ ను ఈ రోప్ వే కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2.5 మైళ్ళ దూరం పైకి చేర్చుతుండడం విశేషం. రోప్‌వే బాక్సులోని అద్దాల నుంచి పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. లాస్ఎంజెల్స్ నుంచి మౌంట్ సాన్ జెసింటో స్టేట్ పార్క్ కు తీసుకెళ్ళినప్పుడు ఈ రోప్ వేలో ప్రయాణం చేసే అవకాశం లభించింది. పామ్ స్ప్రింగ్ ఏరియల్ ట్రామ్‌వేగా పిలిచే ఈ రోప్‌వే.. కొండలు, గుట్టల మధ్య నుంచి ప్రయాణం చేస్తుంది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న ఈ రోప్‌వే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదట. ఒక్కొక్కరికి ఒక ప్రయాణానికి 29 డాలర్ల ఖరీదు. మన రుపాయలతో పోలిస్తు దాదాపుగా రూ.2300. మన రోప్‌వే బాక్స్ అంతా అద్దాలతోనే ఉండడం వల్ల ఎటువైపైనా చూడొచ్చు. పది నిమిషాలే కాబట్టి నిలబడి ప్రయాణం చేసినా.. అలిసిపోకపోగా.. మంచి అనుభూతి కలుగుతుంది. దాదాపుగా ఎడారిమయమైన ఈ ప్రాంతంలో రాళ్ల గుట్టలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా ఉంటాయి. వాటి మీదుగా రోప్‌వేలో అద్దాల గదిలో ప్రయాణం చేసినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. పైన హిల్ స్టేషన్ లో థియేటర్లు, రెస్టారెంట్లు, షాపుల వంటివి కూడా చాలా ఉన్నాయి. హిల్ స్టేషన్‌లోని వ్యూపాయింట్ నుంచి అగ్గిపెట్టెల్లాంటి భవనాలు, చిన్నదైపోయిన నగరం.. మనం ఎంత ఎత్తుకు వచ్చామా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇలాంటి రోప్ వేలను మన హిల్ స్టేషన్ల వద్ద, పుణ్యక్షేత్రాల వద్ద నిర్మిస్తే పర్యాటకులకు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా అనిపించింది. మనదేశం ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాలకు ఇప్పటికే ఇలాంటి రోప్ వే లు ఉన్నాయి, అలాంటివాటిలో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మానసాదేవి ఆలయం ఒకటి. అలాగే నైనా దేవి ఆలయానికి కూడా రోప్‌వే వేశారు. యాదగిరిగుట్ట ఆలయానికి వేయాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. తిరుపతి కేంద్రంగా ఒకటి బస్ స్టాండ్ నుంచి, రెండవది రైల్వే స్టేషన్ నుంచి తిరుమల పైకి వెళ్లడానికి రెండు రోప్ వే లు నిర్మించే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వార్తలు. తిరుమల ఘాట్ రోడ్డు మీద ప్రయాణాల రద్దీ తగ్గించడానికి , కాలుష్యాన్ని అరికట్టడానికి, ఇటు భక్తులు అటు వన్యప్రాణులు రెండింటి రక్షణకు కూడా ఈ ఏరియల్ రోప్ వే లు ఉపయోగపడేవి. వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు) -
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్‌లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్‌లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్‌లో కరాటే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్‌కు కోచ్‌గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్‌లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
ప్రేతాత్మకు ఆవాసం
చూడటానికి రాచప్రాసాదంలా కనిపించే ఈ పురాతన హోటల్ భయానకమైన కట్టడంగా పేరుమోసింది. మామూలుగా చూస్తే ఇందులో భయపెట్టే వస్తువులేవీ కనిపించవు గాని, ఇది ప్రేతాత్మకు ఆవాసంగా మారిందని జనాలు చెప్పుకుంటారు. స్టీమ్ ఇంజిన్‌తో నడిచే కారును కనుగొన్న ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ క్షయవ్యాధికి లోనైనప్పుడు కొలరాడోలోని రాకీ పర్వత ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నాడు. స్వచ్ఛమైన గాలి, ధారాళంగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప అప్పట్లో క్షయవ్యాధికి పెద్దగా మందులు లేవు. ఇక్కడ ఉంటూ స్టాన్లీ వ్యాధి నుంచి కోలుకున్నాడు. తర్వాత క్షయ రోగులకు ఆవాసంగా ఉపయోగపడేలా ఇక్కడ 1907లో 48 గదుల హోటల్ నిర్మించాడు. తర్వాత హోటల్‌ను 140 గదులకు విస్తరించాడు. ఈ హోటల్లోనే స్టాన్లీ భార్య మరణించింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఇందులోనే సంచరిస్తోందని, రాత్రివేళ హోటల్ హాలులో ఉన్న పియానోను వాయిస్తోందని ప్రచారం మొదలైంది. ఈ హోటల్లో దిగిన కొందరు అతిథులు కూడా ఇక్కడ ఆత్మను తాము స్పష్టంగా చూసినట్లు చెప్పడంతో ఇది హాంటింగ్ హోటల్‌గా పేరుమోసింది. -
Nepal earthquake: నేపాల్‌ను కుదిపేసిన భూకంపం
కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన తీవ్ర భూకంపంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని కఠ్మాండుకు పశి్చమాన 500 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు. అనంతర ప్రకంపనలు 159 వరకు నమోదైనట్లు చెప్పారు. జాజర్‌కోట్‌తోపాటు రుకుమ్ జిల్లాపైనా భూకంప ప్రభావం చూపిందని పేర్కొన్నారు. తీవ్రతకు కఠ్మాండుతోపాటు భారత్ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. నేలమట్టమైన ఇళ్ల శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవరోధం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య జాజర్కోట్, రుకుమ్ జిల్లాల్లో కలిపి 157కి చేరుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదేవిధంగా, క్షతగాత్రుల సంఖ్య 160 దాటిందని పేర్కొంది. మృతుల్లో జజర్కోట్ జిల్లా నల్గధ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు దెబ్బతినడంతోపాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం జనం చిమ్మచీకట్లోనే తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’శనివారం ఉదయం వైద్య బృందంతో భూకంప ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. సుర్ఖెట్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. నేపాల్ భూకంపంలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించడంపై భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేర నేపాల్ ప్రజలకు సాయం అందిస్తామని ప్రకటించారు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉన్న నేపాల్‌కు భూకంపాల బెడద ఎక్కువగా ఉంటోంది. 2015లో నేపాల్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 9వేల మంది చనిపోగా మరో 22 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 8 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో నేపాల్‌లో మూడుసార్లు భూకంపం సంభవించింది. -
ఐదేళ్ల పాటు చీకట్లోనే జీవితం, వీల్ చెయిర్‌కే పరిమితం.. అయినా
‘‘ఏదో ఒక దశలో పరిస్థితులు మనల్ని పడిపోయేలా చేస్తాయి. అలాగే ఉండిపోకుండా గెలవడానికి ప్రయత్నం చేయి’’ అంటారు హైదరాబాద్ కాచిగూడలో ఉంటున్న స్వీటీ బగ్గా (బల్జిత్ కౌర్) ఇరవై ఏళ్ల వయసులో బస్సు ప్రమాదానికి గురై వెన్నుపూస దెబ్బతిని, నిలబడే శక్తి లేక వీల్ చెయిర్‌కే పరిమితమైంది స్వీటీ బగ్గా. అయినా, గెలవడానికి ప్రయత్నం చేసింది. వీల్ చెయిర్ స్పోర్ట్ మారథాన్ రన్నర్‌గా నిలిచింది. నేషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణించింది. స్విమ్మింగ్ నేర్చుకొని, నీటి అడుగు వరకు వెళ్లొచ్చింది. పారామోటరింగ్ చేసి ఔరా అనిపించింది. తనలాంటి వారికి వీల్చెయిర్లు పంపిణీ చేస్తూ తన సహృదయతను చాటుకుంటుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా దివ్యాంగులు జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తోంది. ‘‘ఇప్పుడు నా వయసు 60. యాభై నాలుగేళ్ల వయసులో సిమ్మింగ్ నేర్చుకున్నాను. పారామోటరింగ్ చేశాను. నేలమీద నడవలేను. కానీ, ఆకాశంలో ఎగిరాను, స్కూబా డైవింగ్‌తో నీళ్ల అడుగుకు వెళ్లొచ్చాను. అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతల్లోనూ ΄ాలు పంచుకున్నాను. ఐదేళ్లు చీకట్లోనే.. వీల్‌చెయిర్‌కి పరిమితమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మొత్తం జీవితమే కోల్పోయాను అనిపించింది. రేపు అనే దానిపైన ఏ మాత్రం ఆశ ఉండేది కాదు. ఆరు నెలల పాటు డిప్రెషన్ నన్ను చుట్టుముట్టింది. నలభై ఏళ్ల క్రితం ఓ రోజు నేనూ, మా బ్రదర్ స్కూటర్ మీద వెళుతుండగా బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. చికిత్స తీసుకొని ఇంటికి వచ్చానే కానీ, మెడ నుంచి శరీరం కదల్చలేని పరిస్థితి. అప్పటికే పద్దెనిమిదేళ్లకే పెళ్లి, ఇరవై ఏళ్లకు ఇద్దరు పిల్లల తల్లిని. నన్ను నేనే చూసుకోలేను, ఇక పిల్లల్నేం చూడగలను? కూర్చోబెడితే కూర్చోవడం, పడుకోబెడితే పడుకోవడం... ఐదేళ్ల పాటు సూర్యకాంతి కూడా చూళ్లేదు. కొంత ప్రయత్నంతో చేతులు, తల మాత్రమే పనిచేసేవి. జీవితం ఎంత దుర్లభమో పదేళ్ల పాటు అనుభవించాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్, బెడ్‌సోర్స్.. ఒక సమస్య అని చెప్పలేను. కానీ, మా అమ్మనాన్నలు, మా వారు, అత్తింట్లో అందరూ నన్ను ఓపికగా చూసుకున్నారు. పదేళ్ల తర్వాత చెన్నైలో స్పైనల్‌కార్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి తెలిసి, అక్కడకు తీసుకెళ్లారు ఇంట్లోవాళ్లు. అప్పుడు వాళ్లిచ్చిన సలహాలతో నన్ను నేను మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టాను. నన్ను నేను మెరుగుపరుచుకున్నా... ఉమ్మడి కుటుంబం కావడంతో మా ఇంట్లో పిల్లలు ఎక్కువ. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను కాబట్టి, పిల్లలందరికీ చదువు చెప్పేదాన్ని. క్రొచెట్ అల్లికలు నేర్చుకున్నాను. బొమ్మలు, స్వెటర్లు తయారుచేస్తుంటాను. బంధుమిత్రుల పుట్టిన రోజున వాటిని కానుకగా ఇస్తుంటాను. గార్డెనింగ్ చేస్తాను. నాకు తెలుసు, జీవితంలో కాలినడక ఉండదని.అయినా, నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం తపించేదాన్ని. ఒకప్పటితో పోల్చితే నాలాంటి వారికి ఇప్పటి రోజులు కాస్త సులువు. వీల్‌చెయిర్ సాయంతో నా పనులు నేను చేసుకోవడం వరకు చాలా దశలు దాటాను. పదేళ్లుగా వాలీబాల్, స్విమ్మింగ్ చేస్తున్నాను. పారా అథ్లెటిక్ పోటీలలో పాల్గొంటున్నాను. పాండిచ్చేరి వెళ్లినప్పుడు అక్కడ స్కూబా డైవింగ్ కూడా చేశాను. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలోకి ఎగిరాను. స్ట్రాంగ్ విల్‌పవర్ కావాలంటే నన్ను నేను నిరంతరం మార్చుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాను. వీల్‌చెయిర్.. పవర్ స్పైనల్ కార్డ్ దెబ్బతిని, బెడ్‌కు పరిమితమైన వారి గురించి అక్కడక్కడా వార్తలు తెలుస్తుండేవి. సోషల్‌మీడియా ద్వారా ఇంకొంతమంది పరిచయం అయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల క్రితం వీళ్లందరికీ వీల్చెయిర్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇదే విషయాన్ని మా ఇంట్లోవాళ్లతో చె΄్పాను. ‘ఐయామ్ పాజిబుల్’ పేరుతో ఫౌండేషన్‌ని రిజిస్టర్ చేయించాను. ఇంట్లోవాళ్లనే ఒక్కొక్కరూ ఒక్కో వీల్‌చెయిర్ కొనిమ్మని చెప్పాను. అలా, తొమ్మిది వీల్ చెయిర్లు వచ్చాయి. మరికొన్ని నా బంధువులు, మిత్రులతో కొనిపించాను. మొదటి ఏడాది 33 మందికి వీల్ చెయిర్లు ఇచ్చాను. కోవిడ్ టైమ్‌లో ఇవ్వలేకపోయాను. కిందటేడాది వీల్‌చెయిర్ ర్యాలీ చేశాం. సీనియర్ సిటిజన్స్, పోలియో వచ్చినవారికీ వీల్చెయిర్లు ఇస్తున్నాం. స్పైనల్‌కార్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏడాదికి ఒకసారి ఏర్పాటు చేస్తున్నాను. దీనిద్వారా తగినంత స్ఫూర్తి అంది, వారి జీవితాలను బాగు చేసుకుంటారనేది నా ఆశ. వీడియోల ద్వారా అవగాహన.. వెన్నుపూస దెబ్బతిన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోజూ ఎలా ఉండాలి.. అనే విషయాల మీద వీడియోలు చేసి సమస్య ఉన్నవారికి పోస్ట్ చేస్తుంటాను. యూట్యూబ్ ద్వారా దివ్యాంగుల కోసం నన్ను నేను ఉదాహరణగా చూపుతూ వీడియోలు చేస్తుంటాను. ఏ కారణంగానైనా వీల్‌చెయిర్‌కి పరిమితమైనవారు ఇంట్లోనే ఉండిపోకుండా తమకు తాముగా స్వయం ఉపాధి పొందమని చెబుతుంటాను. ఉదాహరణకు.. ఇంటి ముందు చిన్న టేబుల్ వేసుకొని చాయ్ బిస్కెట్ లేదా కూరగాయలు అమ్మమని చెబుతుంటాను. రోజుకు వందో, రెండు వందలో ఆదాయం వచ్చినా వారికెంతో ఆదరువు అవుతుందంటూ చిన్న చిన్న సూచనలు చేస్తుంటాను. చదువుకున్నవారైతే ట్యూషన్లు చెప్పమని, కుట్లు అల్లికల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని వివరిస్తుంటాను. ఇప్పటివరకు తెలంగాణలో 180, ఆంధ్రప్రదేశ్‌లో 200 మందిదాకా స్పైనల్ కార్డ్ సమస్య బాధితులు ఉన్నారని తెలిసింది. ఇంకా మన దృష్టికి రానివారు ఎందరున్నారో. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వీల్ చెయిర్ కావాలని అడిగిన వారున్నారు. సెప్టెంబర్ నెలలో స్పైనల్‌కార్డ్ ఇంజ్యూరీ సర్వీస్ డే ఉంది. దీనిని పురస్కరించుకొని ప్రతి ఏటా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాను. ఆ విధంగా ఈ ఏడాది డెబ్భైమూడు మందికి వీల్చెయిర్లు పంపిణీ చేస్తున్నాను. దీనికి ఎంతోమంది తమ సహకారాన్ని అందించారు. ఈ నలభై ఏళ్ల జీవితం నన్ను మానసికంగా ఎంతో బలవంతురాలిని చేసింది. యుద్ధంలో పోరాడాలంటే యోధుడిలాగే ఉండాలి. గాయాలు అయినా, పడిపోయినా.. నిరంతరం మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ, ఆవిష్కరించుకుంటూ ఉండాలి. ఇదే విషయాన్ని తరచూ చెబుతూ నాలాంటి వారిని మోటివేట్ చేస్తుంటాను’’ అని వివరించారు స్వీటీ బగ్గా. – నిర్మలారెడ్డి -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!
మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్కోర్ట్ కుటుంబం నివశిస్తుంది. వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు. సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా! అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!
వాషింగ్టన్: దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్హెచ్ఎస్ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడుతున్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్ చొప్పున వేసేస్తోందట! పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్హెచ్ఎస్ 475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది. -
కేదార్నాథ్ ఆలయాన్ని చుట్టుముట్టిన భారీ హిమపాతం: వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లోని పవిత్రక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం చుట్టూతా ఉన్న పర్వతాలపై భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి గ్లేసియర్ పరీవాహక ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనివల్ల రుద్రప్రయాగ్‌లో ఎలాంటి నష్టం జరగలేదని, ఈ తాము ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్‌లోని జాతీయ రహదారిని బ్లాక్ చేసిన కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం. ఈ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి తర్సాలి గ్రామ సమీపంలోకి దొర్లిపడ్డాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అంతేగాక మధ్య ఉష్ణమండల పశ్చిమాలలో ఒక ద్రోణి ఏర్పడిందని, ఇది పశ్చిమంగా కదలడంతో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఆ తదనంతరం ఈ ద్రోణి వాయువ్య భారతదేశం వైపుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #Avalanche in #Kedarnath #flood pic.twitter.com/sAgLU3TTJn — Amit Shukla (@amitshuklazee) September 23, 2022 (చదవండి: ఏరులై పారుతున్న రహదారులు..ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ) -
కొండలపై పెరిగిన ఔషధమొక్కలతో.. ఊరంతా..
కొండలపై పెరిగిన ఔషధమొక్కలే ఆయన వైద్యానికి ఆధారం. ఏ మొక్క ఏ రోగాన్ని నయం చేస్తుందన్నది తండ్రి నుంచి నేర్చుకున్నారు. వనమూలికా వైద్యంపై పట్టుసాధించారు. ప్రకృతితో మమేకమవుతూ పచ్చనికొండల్లో వనమూలికలతో కూడిన వైద్యం అందిస్తున్నారు. ఎముకల వైద్యంలో సిద్ధహస్తుడిగా పేరుపొందారు. ఆయనే.. సంగంవలస సత్యనారాయణ. ఆయన అందిస్తున్న ఉచిత ప్రకృతి వైద్యసేవలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. పార్వతీపురం టౌన్: సంగంవలస.. పార్వతీపురం జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరం. ఆ ఊరి పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ గ్రామంలో అందించే వనమూలికలతో కూడిన వైద్యసేవలు. ప్రకృతి వైద్యంతో ఎముకలు సరిచేయడంలో ఆ గ్రామ ప్రకృతి వైద్యుడు బడే సత్యనారాయణ పేరుపొందారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన.. తన తండ్రి స్వామినాయుడు నుంచి నేర్చుకున్న వైద్యాన్ని వారసత్వంగా స్వీకరించారు. మానవ శరీరంలోని ఎముకల అమరికపై పట్టుసాధించారు. ఆ జ్ఞానంతోనే కట్లు వేస్తున్నారు. కొండలపై లభించే వనమూలికలతో తయారుచేసిన మందులను రోగులకు అందజేస్తున్నారు. ఆయన వద్దకు వైద్యం కోసం వచ్చేవారికి ఉచిత సేవలతో సాంత్వన కలిగిస్తున్నారు. ఇప్పుడు ఆయన సేవలు ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రతిరోజు ఆయన వద్దకు వివిధ వైద్యసేవల కోసం సుమారు వందమంది వస్తుండడం గమనార్హం. రోగుల నమ్మకమే దీనికి ప్రధానం. ఇతర ప్రాంతాల నుంచి.. సత్యనారాయణ వద్ద వైద్యం పొందేందుకు జిల్లా వాసులే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా రోగులు వస్తున్నారు. ప్రతిరోజు రోగుల తాకిడి ఉంటుంది. ఆది, బుధవారాల్లో అధికమంది వైద్యం కోసం ఆశ్రయిస్తున్నారు. వెదురు బద్దలతోనే... విరిగిన ఎముకలకు వెదురు బొంగులను బద్దలుగా చీల్చి దన్నుగా నిలుపుతారు. వనమూలికలతో తయారుచేసిన పసర నూనెలో దూది ముంచి విరిగిన ప్రాంతంలో వేసి గుడ్డతో గట్టిగా కట్టుకడతారు. నొప్పి తగ్గేందుకు కొండలపై దొరికే ఔషధ మొక్కల ఆకులు, వేర్లుతో తయారుచేసిన మాత్రలు అందజేస్తారు. ఇలా నాలుగు పర్యాయాలు కట్లువేసి విరిగిన ఎముకలు అతికేలా చేస్తున్నారు. చదవండి: HYD: ప్రధాని మోదీ సభ ఎఫెక్ట్.. ఓయూలో ఉద్రిక్తత -
మేఘం వన్నె చిరుత.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: మేఘం వన్నె చిరుతలు బయట కనిపించడం ఇప్పటి వరకు బహు అరుదు. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్‌లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతా ల్లో కనిపించింది. 2020 జనవరి–జూన్ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్‌లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుండటం తో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్‌లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్ కమ్యూనిటీ అటవీ ప్రాంతం లోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్‌లైఫ్‌ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీఎస్ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్ఐ పేర్కొంది. -
వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!
బ్రిటన్: వర్షాలు మావనాళి మనుగడకు ఎంతో అవసరం.. అదే ఉగ్రరూపం దాలిస్తే.. ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో గత వారం రోజులుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఏటా వర్షాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టాని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాలకు నదులు కోసుకుపోవడం.. వరద బీభత్సం వంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వర్షాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వర్షాలు భారీ శిఖరాలను సైతం కదిలిస్తాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలకు పర్వతాలపై వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో సమర్థవంతంగా అధ్యయనం చేయడంలోనే కాకుండా, వందల ఏళ్ల క్రితం శిఖరాలు, లోయలు ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహకరిస్తాయి. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది) పీర్-రివ్యూ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ‘క్లైమెట్ కంట్రోల్స్ ఆన్ ఎరోషన్ ఇన్ టెక్టోనికల్లీ యాక్టీవ్ ల్యాండ్‌స్కేప్స్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనాన్ని డాక్టర్ బైరాన్ ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించింది. ఇందుకు గాను, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన బృందం తూర్పు హిమాలయాల్లో భాగామైన భూటాన్, నేపాల్‌లో అధ్యయనం నిర్వహించింది. బ్రిస్టల్ క్యాబోట్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ రాయల్ సొసైటీ డోరతీ హోడ్కిన్కి చెందిన డాక్టర్ బైరాన్ ఆడమ్స్ ఈ అధ్యయనం కోసం అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ఏఎస్యూ), లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు. నదులు వాటి క్రింద ఉన్న రాళ్ళను క్షీణింపజేసే వేగాన్ని కొలవడానికి వారు ఇసుక రేణువుల లోపల విశ్వ గడియారాలను ఉపయోగించారు. టెక్టోనిక్స్పై వాతావరణం ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఈ స్టడీ ప్రధాన లక్ష్యం. (చదవండి: 'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు') ఈ స్టడీ ప్రధాన రచయిత, డాక్టర్ బైరాన్ ఆడమ్స్ మాట్లాడుతూ, భూటాన్, నేపాల్ అంతటా గమనించిన "ఎరోషన్ రేట్ ప్యాటర్" ను పునరుత్పత్తి చేయడానికి బృందం అనేక సంఖ్యా నమూనాలను పరీక్షించింది. కోత రేటును ఖచ్చితంగా అంచనా వేయగల ఒక నమూనాను వారు గుర్తించగలిగారు. ఆ తర్వాత, వర్షపాతం "కఠినమైన భూభాగాలలో కోత రేటు" ను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు ఈ నమూనాను ఉపయోగించారు. -
పదేళ్ల శ్రమ.. బంగారు ముద్దలు, నాణేలు
వాషింగ్టన్: వేల కోట్ల విలువైన నిధినిక్షేపాలను ఎక్కడో దాచడం.. దాన్ని చేరుకోవడానికి రెండు గ్రూపులు పోటీ పడటం.. చివరకు హీరో దాన్ని దక్కించుకోవడం.. ఇలాంటి సినిమాలు దాదాపు అన్ని భాషల్లోను వచ్చాయి. సూపర్‌హిట్ అయ్యాయి కూడా. అయితే అచ్చంగా ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా 2 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నిధిని గుర్తించాడో వ్యక్తి. ఉత్తర అమెరికాలోని రాకీ పర్వత ప్రాంతాల్లో ఈ నిధిని కనుగొన్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి దీనిని గుర్తించాడు. వివరాలు.. న్యూ మెక్సికోకు చెందిన ఫారెస్ట్ ఫెన్ అనే పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి తనకు కిడ్నీ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఈ నిధి వేటను(ట్రెజర్‌హంట్) రూపొందించాడు. జబ్బు నయమైన తర్వాత కూడా ఫెన్ ఈ అలవాటును కొనసాగించాడు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఓ రాగి పెట్టెలో బంగారు ముద్దలు, నాణేలు, వజ్రాలు, ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన కళాకళాఖండాలు, ఇతర విలువైన వస్తువులను దాచాడు ఫెన్. తర్వాత నిధి వేటకు అవసరమైన క్లూస్‌ని ‘ది థ్రిల్ ఆఫ్ ది చేజ్’ పేరుతో ప్రచురించాడు. 24 లైన్ల నిగూఢ పద్యంలో నిధి ఉన్న తావుని వర్ణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి రాకీ పర్వతాల్లో సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో దాగి ఉన్న ఈ నిధిని కనుగొన్నట్లు ఫెన్ తెలిపాడు. సదరు వ్యక్తి నిధిని గుర్తించిన ఫోటొను తనకు పంపినట్లు ఫెన్ ‘ది శాంటా ఫే న్యూ మెక్సికన్’ వార్తాపత్రికకు తెలిపాడు. అయితే నిధిని కనుగొన్న వ్యక్తి పేరును ఫెన్ వెల్లడించలేదు. నిధి ఉన్నవస్తువు బరువు 9 కిలోలు ఉంటే దాని లోపల ఉన్న వస్తువులు మరో 10 కిలోల బరువు ఉంటాయని ఫెన్ తెలిపాడు. గత దశాబ్దంలో పదివేల మంది అన్వేషకులు ఈ నిధి జాడను కనుగొనేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. చాలామంది తమ ఉద్యోగాలను వదిలి పెట్టి.. ప్రమాదకరమైన భూభాగాల్లోకి ప్రవేశించారు. నివేదికలను అనుసరించి కనీసం ఇద్దరు మరణించారు. దాంతో ఫెన్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారనే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరు ఈ నిధి వేట ఒక బూటకమని కొట్టి పారేశారు. -
రిప్ వాన్ వింకిల్
హడ్సన్ నది మీద ఎగువకు ప్రయాణం చేసిన వారంతా కాట్స్ కిల్ పర్వతాలను చూసి ఉంటారు. హడ్సన్ నదికి పశ్చిమంగా ఎత్తుగా హుందాగా నిలబడిన ఈ పర్వతాలు ఆ పరిసర ప్రాంతాన్నంతా పరిపాలిస్తున్నట్లుగా ఉంటాయి. ఈ దేవతా పర్వతాల పాదతలం వద్ద నీలిరంగు మెరక నేలలూ, సమీపంలో కనిపించే పచ్చని బయళ్ళూ కలిసే చోట చెట్ల గుబురుల మధ్య తెల్లని ఆవిరిపొగలు కక్కే ఒక పల్లె ఉన్న సంగతి ఈ ప్రాంతాన్ని చూసి వచ్చిన యాత్రికులకు గుర్తు ఉంటుంది. ఆ పల్లె అతి ప్రాచీనమైన ఒక చిన్న వలస. అమెరికాకు యూరోపియన్లు మొట్ట మొదట వలస వచ్చిన రోజులలో డచ్ వలసదారులు ఆ పల్లెను కట్టుకున్నారు. ఆ పల్లెలోనే చాలా కాలం క్రిందట, పరమసాధువైన ఒక నిరాండబరమైన వ్యక్తి ఉంటుండేవాడు. అతని పేరు రిప్ వాన్ వింకిల్. ఇతడి వంశం కీర్తి ప్రతిష్ఠలు గలది.అయితే రిప్కి తాతముత్తాతల ప్రచండ శౌర్య సాహసాలు మాత్రం అబ్బలేదు. భార్య పట్ల భయభక్తులతో ప్రవర్తించే పరమసాధు భర్త. ఈ గుణమే అతని విశ్వవిఖ్యాతికి ముఖ్య హేతువేమో! గయ్యాళి భార్య కూడా ఒక విధంగా అదృష్టవంతులకు భగవద్దత్తంగా లభించే వరప్రసాదమనే చెప్పాలి. ఈ విషయం ఒప్పుకుంటే, రిప్‌వాన్ వింకిల్ మహా అదృష్టవంతుడన్న మాట కూడా ఒప్పుకున్నట్టే!ఆ గ్రామంలోని ఇళ్ళ వాళ్ళందరికీ అతడంటూ అమితమైన ఆదరభావం. అతని జీవితంలో ఒక లోపం ఉంది. తనకు లాభసాటి పని ఏదన్నా అతనికి ఎంతమాత్రం గిట్టేది కాదు. ఎంత కష్టమైన పనిలో అయినా సరే, ఇరుగుపొరుగు వారికి సాయపడేవాడు. తన ఇంటిపని తప్ప మరెవరి పనైనా సరే అతి శ్రద్ధగా చేసిపెట్టేవాడు.ఇక అతని బిడ్డలు: చింకి దుస్తులు కట్టుకొని గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటారు. కొడుకు చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రి నోట్లోంచి ఊడి పడ్డట్టు ఉంటాడు. ఎప్పుడూ తల్లి వెంటబడి తిరుగుతూ ఉండేవాడు. రిప్ వాన్ వింకిల్ ఈ ప్రపంచంలో దేనికీ ఉబ్బితబ్బిబ్బు అయ్యే రకం కాదు. రూపాయి కోసం నానా గడ్డి కరిచే కంటే బటానీ గింజలతో కాలక్షేపం చేస్తూ నిశ్చింతగా బతకవచ్చుననే బాపతు మనిషి. లోకం అతని బతుకు అతనిని బతకనిస్తే, జీవితమంతా అంతులేని తృప్తితో ఈల వేసుకుంటూ గడిపి వేయగలడు. కాని, ఇంట్లో భార్యే అతనికి అవకాశం ఇవ్వడం లేదు. భర్త సోమరితనం, నిర్లక్ష్యం గురించీ అస్తమానం అతని చెవిలో జోరిగలాగ అరవడం ఆమెకు అలవాటైపోయింది. ఇంట్లో రిప్ని కనికరంతో చూసేది అతని కుక్క సర్దార్ ఒక్కటే! దానికి కూడా, దాని యజమానికిలాగే ఆ గృహిణి అంటే హడలు. బహుశా ఇదే ఈ స్నేహానికి కారణం అయి ఉండవచ్చు. సోమరితనంలో వీళ్ళిద్దరూ సహాధ్యాయులని ఆమె నిశ్చితాభిప్రాయం.పాపం! రిప్ జీవితం నిరాశమయమైపోయింది. పొలంలో పనినించీ, తన భార్య తిట్ల నుంచీ తప్పించుకోవడానికి ఇక అతనికి ఒక్కటే ఉపాయం మిలిగింది. తుపాకీ చేతబట్టుకుని వేటకు చల్లగా అడవికి పోవడం. అలాంటి ఒక స్వేచ్ఛా వనవిహరం సందర్భంలో రిప్ యాథాలాపంగా కాట్స్కిల్ పర్వతాలలోని ఒక అత్యున్నత ప్రదేశానికి ఎక్కి వెళ్లాడు. తిరిగి, తిరిగి, చివరికి అలసి ఆయాసపడుతూ పోయి ఒక గుట్ట మీద పచ్చగడ్డి పెరిగి ఉన్న దిమ్మ మీద కూలబడ్డాడు. రిప్ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు. చీకటి పడేలోగా తాను ఇంటికి చేరుకొనవలెననే విషయం రిప్కు చప్పున స్ఫురణకు వచ్చింది. దాంతో మళ్లీ ఇంటివద్ద తన గృహిణి చేయబోయే హంగామాను గురించి ఆలోచించుకుంటూ ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాడు. కిందికి దిగడానికి లేచేసరికి, ఎక్కడో దూరం నించి ‘రిప్ వాన్ వింకిల్!’ అంటూ పెద్ద కేక వినిపించింది. చుట్టూ తిరిగి చూశాడు. పర్వతం మీదుగా ఒంటరిగా ఎగిరిపోతూన్న ఒక కాకి తప్ప ఎక్కడా ఎవరూ కనిపించలేదు. భ్రమ పడ్డానేమో అనుకుని, మళ్లీ కొండ దిగడం మొదలు పెట్టాడు. మళ్లీ అదే పిలుపు! ఒక విచిత్ర వ్యక్తి వీపు మీద పెద్ద బరువుతో కృంగిపోతూ తన వంకకే ఎక్కి వస్తున్నాడు. ఒత్తుగా పెరిగిన తెల్లగడ్డం అతని ముసలితనాన్ని బయట పెడుతోంది. భుజం మీద పెద్ద సారా జాడీ ఉంది. ఈ బరువు మోసుకుని పోవడానికి కొంచెం సహాయపడతావా? అన్నట్లుగా రిప్కి సంజ్ఞ చేశాడు. ఈ నూతన మిత్రుని గురించి కొంత అనుమానం ఉన్నప్పటికి అంగీకరించాడు రిప్. ఆ జాడీని చెరి కాసేపు మోస్తూ, మెల్లగా ఆ లోయ వెంట ఇంచుమించు పాకుతూ ఇద్దరూ పైకి ఎక్కారు. కొండపైకి ఎక్కిన కొద్ది ఆగి ఆగి ధణధణమంటూ పెద్ద చప్పుడు ఏదో వినబడుతూంది. ఆ కొండల్లో ఎక్కడో ఉరుములు మెరుపులతో హఠాత్తుగా కురిసే వర్షపు చప్పుడు అయి ఉండవచ్చునని సమాధానం చెప్పుకుని మళ్ళీ ముందుకు సాగాడు. సర్కస్ వలయంలాంటి పల్లపు ప్రదేశానికి చేరగానే వింత వింత దృశ్యాలు కనిపించినయి. చదునుగా ఉన్న ఒకచోట కొతమంది విచిత్రవ్యక్తులు ‘తొమ్మిది మేకుల బంతాట’ ఆడుతున్నారు. వారి నడుముకి బిగించి ఉన్న పట్టాల నించి పొడవాటి పట్టా కత్తులు వేలాడుతున్నాయి. వారి ముఖాలు అదో మాదిరి ఉన్నాయి. రంగురంగుల గడ్డాలు ఉన్నాయి. ఈ వ్యక్తులంతా కులాసాగా ఆడుకుంటున్నప్పటికీ వారి ముఖాలన్నీ అతి గంభీరంగా ఉండడం, ఎవరూ ఏమీ మాట్లాడకపోవడం రిప్కి ఆశ్చర్యంగా తోచింది. మధ్యమధ్య వాళ్లు బంతులు దొర్లించినప్పుడు అయ్యే శబ్దం మాత్రం ఉండుండి పెద్ద ఉరుములాగ ఆ లోయ అంతటా మారుమోగుతూంది. రిప్, అతని సహచరుడు వారిని సమీపించే సరికి, వాళ్లు ఆట మానేసి, ప్రతిమలాగ నిలబడి కళాకాంతులు లేని ముఖాలతో వికృతంగా చూస్తున్నారు. దాంతో రిప్ గుండెల్లో మోత ప్రారంభమైంది. ఈలోగా అతని అనుచరుడు ఆ జాడీలోని సారాను కూజాల్లో నింపాడు. గోష్ఠిలోని వ్యక్తులందరూ మాటా పలుకు లేకుండానే మస్తుగా సారా తాగేసి మళ్లీ ఆట మొదలుపెట్టారు. ఎవరూ తనవైపు చూడకుండా ఉన్నప్పుడు కొంచెం పానీయం రుచి చూశాడు రిప్. అది హాలెండ్ దేశపు అమృతంలాగ ఉంది. కొసరి కొసరి దఫాల వారీగా ఆ కూజాలను వంపి కడుపు నింపేశాడు. క్రమంగా మైకం క్రమ్మడం ఆరంభించింది. ఎన్నడూ ఎరగని గాఢనిద్రలో మునిగిపోయాడు. నిద్రలేచి చూసేసరికి, పర్వతం మీది పచ్చికతిన్నె మీద పడుకుని ఉన్నాడు. కళ్లు నులుముకొని చుట్టూ చూశాడు. వెచ్చవెచ్చగా పొద్దెక్కుతున్న ఉదయసమయం. తెల్లవార్లూ ఇక్కడే నిద్రపోయి ఉంటానా? ఉండను బహుశా అనుకున్నాడు. ‘‘ఆ కూజా మందే నా కొంప తీసింది! ఏం జవాబు చెప్పుకొని ఏడవను, మా ఇంటావిడకి?’’ అనుకున్నాడు. తుపాకి కోసం కలయ చూశాడు. ఎప్పుడూ నిగనిగలాడే తన తుపాకీకి బదులు తుప్పు పట్టిన తుపాకీ ఒకటి తన కంటపడింది. ఆ లోయలోని రాక్షసులు తనను మంత్రించి, ఆ సారాతో స్మృతి లేకుండా చేసి తన తుపాకి కాజేశారని రిప్ అనుమానం. పైగా, తన సర్దార్ కూడా కనిపించడం లేదు. ఈల వేసి పిలిచాడు. ‘సర్దార్’ అని అరిచాడు. సర్దార్ జాడలేదు. కష్టం మీద ఎల్లాగో కాళ్లూ చేతులూ స్వాధీన పరుచుకుని నిమ్మళంగా ఆ లోయలోకి దిగాడు. ఉదయం ఆహారమేమీ లేకపోవడంతో చాలా నిస్సత్తువగా ఉంది. కుక్కా, తుపాకీ పోవడం అతని మనస్సు మనస్సులో లేదు. మరొక వంక ఇంటికి పోయి, భార్య ఎదుట పడడానికి దమ్ములు లేవు. అలా అని ఇంటికి వెళ్లకుండా ఈ కొండల మధ్య ఆకలితో మాడి చచ్చిపోవడమెలాగు? తుప్పు పట్టిన తుపాకీ తీసి భుజాన పెట్టాడు. ఆందోళన, ఆవేదనతో ఇంటిదారి పట్టాడు. ఊరు సమీపిస్తున్న కొద్దీ అతనికి చాలామంది ఎదురవుతున్నారు. కాని వారిలో పరిచితుడొక్కడూ కనిపించకపోవడం ఆశ్చర్యం వేసింది. వాళ్ల దుస్తులు కూడా ఏమిటో కొత్తగా ఉన్నాయి. ఎదురైన ప్రతి వ్యక్తి తన వంక ఆశ్చర్యంగా ఎగాదిగా చూసి, తన గడ్డాన్ని నిమురుకుని చూసుకుంటున్నాడు. అందరూ అలా చూస్తూండడంతో అప్రయత్నంగా రిప్కి కూడా చెయ్యి తన గడ్డం మీదికి పోయింది. దాంతో తనకు పొడుగైన గడ్డం పెరిగిందని గ్రహించి ఆశ్చర్యపోయాడు. ఊరి పొలిమేరల్లోకి వచ్చేశాడు. వింత వింత దుస్తులు వేసుకున్న కుర్రవాళ్లంతా తెల్లగా నెరిసిన అతని పెద్ద గెడ్డాన్ని చూసి నవ్వుతూ, నానా హంగామా చేస్తూ వెంటబడ్డారు. ఎటు చూసినా, ఏది చూసినా, ఇంద్రజాలంలోలాగ మారిపోయింది. ఆ క్రిందటి రోజే తానక్కడి నించి వెళ్లాడు. ఇంతలోనే గ్రామమంతటా ఏమిటీ మార్పు! మొత్తం మీద అది తన గ్రామమే! అందులో సందేహమేమీ లేదు. కష్టం మీద దారి గుర్తు తెచ్చుకుంటూ, ఏ క్షణంలో ఎటు నుంచి తన భార్య కఠోర కంఠస్వరం వినిపిస్తుందో అని ప్రాణాలు బిగపట్టుకుని తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇల్లంతా పాడుపడి ఉంది. తిండి లేక మాడి చావడానికి సిద్ధంగా ఉన్న సర్దార్ పోలికలున్న కుక్క ఒకటి అక్కడ తారట్లాడుతూంది. ‘సర్దార్’ అని పిలిచాడు. కాని, ఆ కుక్క పళ్లు బిగబట్టి మూల్గుతూ ప్రక్కకు తొలిగిపోయింది. ‘‘నా కుక్క కూడా నన్ను మరిచిపోయిందా?’’ అని నిట్టూర్చాడు.స్వగృహంలోకి ప్రవేశించాడు రిప్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎంత చాకిరీ చేసినా రిప్ భార్య ఆ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేది. ఇప్పుడు ఇల్లు దెయ్యాలకొంపలాగ ఉంది. గొంతు సవరించుకొని భార్యాపిల్లలను పేరు పేరునా పిలిచాడు. ఆ పాడు గోడల మధ్య అతని కంఠస్వరమే వినిపించింది. మళ్ళీ ఎప్పటి నిశ్శబ్దమే! ఏమీ బోధ పడక అక్కణ్ణించి తాను మాములుగా రోజూ వెళ్లి కాలక్షేపం చేసే సత్రం దగ్గరకు వెళ్ళేసరికి, ఆ సత్రం అక్కడ లేనే లేదు. దాని స్థానంలో, కలప చెక్కలతో కట్టిన పాత ఇల్లొకటి ఉంది. ఆ ఇంటి తలుపు మీద ‘యూనియన్ హోటల్ –ప్రొప్రయిటర్: జొనాథన్’ అని రాసి ఉంది. ఆ హోటలు ద్వారం వద్ద జనం గుంపుగా మూగి ఉన్నారు. అందులో ఒక్క ముఖమూ రిప్ గుర్తు పట్టలేదు. అతిగా పెరిగిపోయి గడ్డంతో, మకిలి దుస్తులతో, వెంటబడి వస్తూన్న పిల్లమూకతోను, కొందరు ఆడవాళ్లతోను అక్కడికి రిప్ వచ్చేసరికి గ్రామీణ రాజకీయవేత్తలందరి దృష్టులు ఒక్కసారిగా అతనిపై పడ్డాయి. వాళ్లంతా ఆయన చుట్టూ మూగారు. ఆశ్చర్యంతో ఎగాదిగా చూశారు. ఉపన్యాసకుడు అతని జబ్బ పట్టుకొని కొంచెం పక్కకు తీసుకెళ్లి ‘‘ఇంతకీ తమరు ఏ పక్షానికి ఓటు చేయదలుచుకున్నారు?’’ అని రహస్యంగా అడిగాడు. రిప్ ఆ మాటలకి అర్థం తెలియక అయోమయంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. పొట్టివాడొకడు రిప్ చెవిలో మెల్లగా ‘‘తమరిది ఫెడరల్ పక్షమా? డెమోక్రాట్ పక్షమా?’’ అని అడిగాడు. రిప్కు ఈ ప్రశ్న మరింత అయోమయంగా తోచింది. ఒక టోపీ పెద్దమనిషి జనాన్ని నెట్టి దారి చేసుకుంటూ రిప్ ఎదుటికి వచ్చి ‘‘ఎవరయ్యా నువ్వు? తుపాకి భుజాన పెట్టుకుని, అల్లరి మూకని వెంటబెట్టుకుని ఎన్నికల కేంద్రానికి రావడంలో నీ ఉద్దేశమేమిటి? ఈ గ్రామంలో తిరుగుబాటు లేవదీద్దామనా?’’ అన్నాడు. ‘‘అయ్యో! ఖర్మా! నేనో నిర్భాగ్యుణ్ణి. నాది ఈ ఊరే. నేను చక్రవర్తి ప్రభుత్వానికి పూర్తిగా విధేయుణ్ణి’’ అన్నాడు. ఈలోపు ‘‘చక్రవర్తి గూఢచారి, కాందీశికుడు. పట్టుకోండి. తన్నండి’’ అంటూ కేకలు బయలుదేరాయి. ‘‘అసలు నువ్వేం పనిమీదొచ్చావయ్యా ఇక్కడికి? ఎవరి కోసం?’’ అని మళ్ళీ రిప్ని ప్రశ్నించాడు టోపీ పెద్దమనిషి. ‘‘నేను ఎవ్వరికీ ఏ విధమైన హాని కలిగించడానికి రాలేదు. వెనక ఇక్కడ ఉండిన సత్రం అరుగు మీద రోజూ కలుసుకుంటూ ఉండిన మా ఇరుగు పొరుగు స్నేహితుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరా స్నేహితులు చెప్పు?’’ రిప్ ఒక్క నిమిషం ఆలోచించి ‘‘నికోలస్ వెడ్డర్గారు ఎక్కడ ఉన్నారు?’’ అని అడిగాడు. ‘‘ఆయన మరణించి అప్పుడే పద్దెనిమిదేళ్లయిందిగా!’’ అన్నాడు ఒక వృద్ధుడు. ‘‘పోనీ, బ్రూమ్ డచ్చర్గారు ఉన్నారా?’’ ‘‘స్టోనీపాయింట్ దగ్గిర యుద్ధంలో చచ్చిపోయాడంటారు’’ తన ఇల్లూ, స్నేహితులూ, గ్రామం ఇంతలో ఇంత దారుణంగా మారిపోయి, ప్రపంచంలో తాను ఒంటరివాడయిపోవడం రిప్కి అమిత విచారం కలిగించింది. నిస్పృహతో ‘‘పోనీ, ఇక్కడ ఎవరైనా రిప్ వాన్m వింకిల్ని ఎరుగుదురా?’’ అని అడిగాడు. ‘‘ఎరక్కేం?’’ అన్నారు వెంటనే ఇద్దరు ముగ్గురు ఒకేసారి. ‘‘అడుగో! ఆ ఎదురు గుండా ఉన్న చెట్టునానుకుని కూచున్నాడు చూడు, ఆ అవతారమే రిప్ వాన వింకిల్!’’ రిప్ అటుకేసి చూశాడు. సరిగా ముమ్మూర్తుల తనలాగే, తాను పర్వతం మీదికి వెళ్లే రోజున ఉన్నట్టే కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆ చెట్టునానుకుని కూచొని ఉన్నాడు. అసలు తా నెవరు? రిప్ వాన్ వింకిల్ కాదా? ఏమిటీ మాయ? ఈ కంగారంతా చూసి, టోపీ పెద్దమనిషి మళ్లీ కలిపించుకుని, అతని ఊరూ పేరూ అడిగాడు. ‘‘ఏమో! ఆ భగవంతుడికే తెలియాలి’’ అన్నాడు పిచ్చివాడిలాగ రిప్. ‘‘వాడెవడో నా వేషం వేసుకుని బతుకున్నాడు. నిన్న రాత్రి దాకా మామూలుగానే ఉన్నాను. రాత్రి ఆ పాపిష్టి పర్వతం మీద పడుకొని నిద్రపోయాను. వాళ్లు నా తుపాకీ మార్చేశారు. అంతా మారిపోయింది. నేను మారిపోయాను. ఇప్పుడు నా పేరేమిటో, నే నెవర్నో చెప్పలేను....చెప్పలేను’’ అన్నాడు. ఒక స్త్రీ చంకలో పిల్లవాడి నెత్తుకొని ఈ పొడుగు గడ్డం ముసలాన్ని తేరిపార చూడడానికి బాగా దగ్గిరికి వచ్చింది. తెల్లగడ్డం తాతను చూసి పసివాడు ఏడవడం మొదలు పెట్టాడు. ఆ పాపడి పేరూ, ఆ తల్లి రూపం, ఆమె కంఠస్వరం రిప్ మనస్సులో మరొక తుఫాన్ కెరటాన్ని రేపినయి. ఆయనకు ఏవేవో జ్ఞాపకానికి వస్తున్నయి.‘‘తల్లీ! నీ పేరేమిటమ్మా?’’ అని అడిగాడు.‘‘జూడిత్ గార్డెనీర్’’‘‘మీ తండ్రి పేరు?’’‘‘అయ్యో! మా తండ్రా? మా నాయన పేరు రిప్ వాన్ వింకిల్. ఇరవయేళ్ళ క్రిందట తుపాకి పట్టుకుని, వేటకని ఆ పర్వతాల్లోకి వెళ్ళాడు. ఇంత వరకు తిరిగి రాలేదు. మా నాన్నతో పాటు వేటకి వెళ్లిన కుక్కమాత్రం ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడో, లేక ఎర్ర ఇండియన్లే ఎత్తుకు పోయారో తెలియదు. అప్పటికి నాకు బాగా చిన్నతనం’’ అంది.రిప్ అడగదలుచుకున్న ముఖ్యమైన ప్రశ్న ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. నసుగుతూ, తొట్రూపడుతూ అడిగాడు ‘‘అయితే మీ అమ్మ...ఇప్పుడెక్కడుంది?’’‘‘తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ కూడా చచ్చిపోయింది. న్యూ ఇంగ్లండ్ నించి వచ్చిన ఒక వర్తకుడిపైన కోపం వచ్చి అరుస్తూ, ఆ ఉద్రేకంలో ఒక రక్తనాళం పగడలం వల్ల చనిపోయింది. ఈమాట విన్న మీదట రిప్ ముఖంలోని ఆరాటం కొంత ఉపశమించింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ‘‘తల్లీ! నేనే మీ నాన్ననమ్మా! గుర్తు పట్టలేవా?’’ అని అరిచాడు. దాంతో, అంతా దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఇంతలో ఒక మూడు కాళ్ల ముసలి అవ్వ కళ్లకి చెయ్యి అడ్డుపెట్టుకొని చూస్తూ ‘‘అయ్యో! ఇంకా సందేహమేమిటి? రిప్ అన్నయ్యే! రా అన్నయ్యా! రా....ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనపడ్డావ్ అన్నయ్యా! ఇంతకీ ఎక్కడున్నావు ఇన్నాళ్లనించీ’’ అంటూ ఆయాసం వచ్చేటంత సంభ్రమంతో అనేసింది.‘‘ఆ ఇరవై సంవత్సరాలు నాకు ఒక్క రాత్రి నిద్రలో గడిచిపోయినయి’’ అంటూ రిప్ నిట్టూర్చి తన కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడి వాళ్లంతా, కళ్ళింతవి చేసుకుని ఆ చిత్రకథంతా విన్నారు.ఒకరి ముఖాలొకరు చూసుకునే వాళ్లు కొందరు, ఈ పారవశ్యం కొంచెం ఉపశమించిన పిమ్మట ఆ టోపీపెద్దమనిషి కొంచెం నిదానించి చూశాడు. అదే సమయానికి రోడ్డు మీదనించి పోతున్న వృద్ధుడు పీటర్వాండెర్ డాంక్ అభిప్రాయం కనుక్కొని అలా చెయ్యడానికి అంతా తీర్మానించారు. అతడు ఆ రాష్ట్ర ప్రాచీన చరిత్ర రచించిన పీటర్ వాండెర్ డాంక్ వంశస్థుడు. ప్రస్తుతం అతడే ఆ గ్రామానికి వృద్ధ పితామహుడు. ఆయన రిప్ని తేలికగా గుర్తు పట్టాడు. అతడు చెప్పిన విషయాలన్నింటిని సంతృప్తికరగా ధ్రువపరిచాడు. కాట్స్ కిల్ పర్వతాలలో చిత్రవిచిత్ర వ్యక్తులు కనిపించేవారన్నమాట తాను తన పూర్వుల దగ్గర చాలాసార్లు విన్నట్టు ఆయన చెప్పాడు. అచటి హడ్సన్ నదినీ, ఆ ప్రాంతాన్నీ మొదట కనిపెట్టిన హెండ్రిక్ హడ్సన్ అనే మహా పురుషుడు ఇరవయేళ్ళ కొకసారి ఆ ప్రాంతానికి వచ్చి పోతూ ఉంటాడనీ, వచ్చి ఆ నదినీ, ఆ నది పేరుతోనే దాని ఒడ్డున ఏర్పడిన నగరాన్నీ సందర్శించడానికి హెండ్రిక్కీ, ఆయన ‘హాఫ్ మూన్’ పరివారానికీ అనుమతి ఉన్నదని కూడా తాను విన్నాడు. ‘‘ఇదంతా ఎందుకు? ఒక వేసవి సాయంకాలం పెద్ద ఉరుముల్లా వినిపించే వాళ్ల బంతులు దొరలిన చప్పుళ్లు నేనే స్వయంగా వినడం కూడా తటస్థించింది’’ అన్నాడు. ఇక కథ క్లుప్తంగా చెప్పేస్తాను. క్రమంగా ఆ గుంపులో జనమంతా చెదరిపోయి, అంతకంటే ఎక్కువ ముఖ్యమైన తమ ఎన్నికల పని చూసుకోటానికి వెళ్లిపోయారు. రిప్ కూతురు తండ్రిని వెంట బెట్టుకొని పోయి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆమెకు సంపన్నుడూ అయినా పెనిమిటీ, సర్వ సౌకర్యాలు గల మంచి ఇల్లూ ఉన్నాయి. తన అల్లుడు చిన్నతనంలో తన భుజాల మీద ఎక్కి ఆడుకున్న పొరుగు పిల్లలలో ఒకడని తెలిసి రిప్ సంతోషించాడు. రిప్ కొడుకూ, వారసుడూ అయినా చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రికి నకలుగా తయారయ్యాడు. ఒకచోట పొలం పనికి కుదిరాడు. అయితే, పూర్తిగా తండ్రికి పోలిక రావడం వల్ల, అతడు తన పని మినహా తక్కిన పనులు మాత్రమే చేస్తున్నాడు. రిప్ యథాప్రకారం పూర్వపు షికార్లు, ఇతర దైనందిన కార్యక్రమాలు ప్రారంభించాడు. వెనకటి స్నేహితులలలో మిగిలి ఉన్న వారందరితో మళ్ళీ తన పరిచయాలు పునరుద్ధరించుకున్నాడు. కాని వాళ్లందరిలో కాలం చాలా మార్పు తెచ్చింది. అందువల్ల అంతకన్నా కొత్త తరం వాళ్ళే మేలని,. కొందరు కొత్త స్నేహితుల్ని సంపాదించాడు. ఈ ముఠా అంతటికీ రిప్ గురువు. ఇంటి దగ్గర చేసేందుకు పని ఏమీ లేక పోడవం వల్లనూ, సోమరితనం దోషం కాని సుఖమయిన వయస్పు వచ్చినందువల్లనూ ఈ తడవ నిశ్చింతగా అతడు రోజూ సత్రం అరుగు మీద కొలువు తీర్చి గోష్ఠులు నడుపుతున్నాడు. ఆ గ్రామస్థులంతా అతణ్ణి ఆ గ్రామ పితామహుల్లో ఒకడుగా గౌరవిస్తున్నారు. యుద్ధానికి పూర్వపు రోజుల్లో సంగతులు వినడం కోసం వచ్చే పనీ పాటా లేని పడుచు వాళ్ళంతా ఆయనకు నిత్యసభాసదులు. అయినా, అతని ‘నిద్రాయుగం’లో జరిగిన విచిత్ర సంఘటనలన్నీ విని గ్రహించి, ఆనాటి మానవులలో ఒకడుగా చలామణీ అవడానికి అవసరమైన ప్రాతిపదిక పరిజ్ఞానం రిప్కి అటు తరువాత కొంత కాలానికి గాని అలవడలేదు. దేశంలో చిన్న సంఘర్షణగా బయలుదేరిన విప్లవం క్రమంగా చినికి చినికి గాలివాన అయి పెద్ద యుద్ధంగా ఎలా పరిణమమించినదీ, దాని ఫలితంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పాత ఇంగ్లండు దేశీయుల పరిపాలన ఎలా తప్పిపోయిందీ తెలుసుకున్నాడు. వెనకటిలాగ, తాను జార్జి చక్రవర్తి ప్రజలలో ఒకడు కాడనీ, అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వతంత్ర పౌరుడనీ లీలగా గ్రహించాడు. రిప్ రాజకీయవేత్త కాడు.అందువల్ల రాజ్యాలు, సామ్రాజ్యాలూ తారుమారైనా ఆయనలో వచ్చే మార్పు ఏమీ లేదు. కాని, ఒక అధికార దౌర్జన్యాన్ని మాత్రం సహించలేక పోయేవాడు. అది ఎంతటి బాధాకరమో వెనక ఆయన స్వగృహంలో అనుదిన స్వానుభవ పూర్వకంగా గ్రహించినవాడు. అదృష్టవశాత్తు ఇప్పుడా దుర్దశ తప్పిపోయింది.‘పులి–మేక’ సంసారపు అగచాట్లు తప్పిపోయి, ఇప్పుడు భార్య ప్రళయ తాండవ భీతి లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాడు. అడపాదడపా ఆమె పేరు విన్నప్పుడు మాత్రం ఇప్పటికీ ఉలిక్కిపడి, భుజాలు కుంచించుకుని, కొంతసేపు అలాగే పైకి చూస్తూ ఉండిపోతాడు. మరి, అది తన విధిని తలచుకొని విచారపడడమో! జీవితంలో తనకు విమోచనం కలిగినందుకు ఆనందించడమో మాత్రం అర్థం కాదు.‘డూ లిటిల్’గారి హోటల్ దగ్గరికి వచ్చిన కొత్తవాళ్లందరికీ రిప్ తన కథంతా పూస గుచ్చినట్లు చెప్పేవాడు. మొదటి రోజుల్లో కొత్తగా కథ చెప్పినప్పుడల్లా కొద్ది కొద్ది మార్పులు ఉండేవి. చివరికి ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రూపంలోకి వచ్చి స్థిరపడిపోయింది. ఆ చుట్టప్రక్కలు ప్రాంతంలోని ఆబాలగోపాలనికీ ఈ కథ కంఠస్థం అయిపోయింది. ఇదంతా వాస్తవంగా జగలేదేమో అనీ, రిప్కి బహుశా మతిపోయి ఉండవచ్చుననీ, అతడు వెర్రిబాగుల వాడులాగ తిరుగుతుండడానికి అదే కారణమై ఉండవచ్చుననీ భావించే సంశయాత్ములు కూడా కొందరు లేకపోలేదు. ప్రాచీన డచ్ వలసదారులు మాత్రం ఈ కథంతా పూర్తిగా నిజమని నమ్మేవారు. ఎప్పుడు ఉరుములు వినిపించినా కాట్స్ కిల్ పర్వతాలలో హెండ్రిక్ హడ్సనూ, ఆయన పరివారం ‘నైన్ పిన్స్’ బంతాట ఆడుతున్నారని వారు పిల్లలకు చెపుతూండడం మామూలు. ఆ ప్రాంతంలో గయ్యాళి భార్యలతో బాధ పడే భర్తలంతా మరీ కష్టం తోచినప్పుడు, ‘‘రిప్ వాన్ వింకిల్ తాగిన డచ్ సారా నాకో గ్లాసెడు దొరికితే బ్రతికి పోదును’’ అని విలపిస్తూ ఉండటం కూడా పరిపాటి అయింది. రెడ్ ఇండియన్ జానపద సాహిత్యం మూలం : వాషింగ్టన్ ఇర్వింగ్ అనువాదం: బీ.వి.సింగరాచార్య -
ఆరావళిలో 31 కొండలు మాయం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆరావళి పర్వత శ్రేణిలో 31 కొండలు అదృశ్యం కావడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం, ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న అక్కడి మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణిలో కొనసాగుతున్న గనుల తవ్వకంపై రాజస్తాన్ ప్రభుత్వం అందజేసిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలన ప్రకారం దాదాపు 31 కొండలు మాయమైనట్లు తేలింది. మైనింగ్‌తో ఏడాదికి రూ.5వేల కోట్ల రాబడి వస్తున్నందున ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం సరికాదని వ్యాఖ్యానించింది. కొండలను తవ్విపోస్తుండటంతో దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోయిందని పేర్కొంది. ఇందుకు కారణమైన 115.34 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను 48 గంటల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ‘దాదాపు 31 కొండలు మాయమయ్యాయి. దేశంలో కొండలు ఇలా మాయమైతే ఏమవుతుంది? హనుమాన్ మాదిరిగా ప్రజలు కొండలను ఎత్తుకుపోతున్నారా? రాష్ట్రంలోని 15 నుంచి 20 శాతం కొండలు కనిపించకుండా పోయాయి. ఇది కాదనలేని వాస్తవం. దీనికి బాధ్యత ఎవరిది?’ అని ధర్మాసనం రాజస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. -
ఆస్ట్రేలియా పీక్స్‌పై తెలుగోడి సత్తా
ఎస్.రాయవరం (పాయకరావుపేట): బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకుడు కారే సత్యారావు ఆస్ట్రేలియా దేశంలో ప్రతిభ చాటాడు. 10 పీక్స్ (పర్వతాలు) అధిరోహించి సత్తా చాటాడు. ఇప్పటికే దేశ విదేశాల్లో సాహసాలు చేసి భారత్‌లో ఎత్తయిన పర్వతం ఎవరెస్టు, సౌతాఫ్రికాలో కిలిమంజారో పర్వతాలను ఎక్కి భారత దేశ ప్రతిభను చాటాడు. తాజాగా ఆస్ట్రేలియా దేశం వెళ్లి 10 పీక్స్, కోసియాజోకో, టౌన్సెండ్, టౌయినేమ్, రామ్స్హెడ్, ఎధిరిడ్జి రైడ్, రామ్స్హెడ్ నార్త్, అలీస్రౌసన్, బైట్స్ కమ్ సౌత్, అబ్బోట్ పీక్, కర్త్రర్ పీక్స్ అనే పర్వతాలను అధిరోహించి భారత్ జెండాను ఎగురవేశాడు. ప్రస్తుతం ఈ సాహసాల సత్యారావు ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. తాను సాధించిన ఘనతను ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంగారమ్మపాలెం గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
గోడమీద బల్లి... వ్యాయామానికి స్ఫూర్తి
క్లైంబింగ్ అనేది తొలుత పర్వతాలతో ప్రారంభమైంది. పర్వతారోహణ (మౌంటెనీరింగ్), రాక్‌క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ .. ఇలా విస్తరించింది. రాక్ మీద ఐస్ ఫామ్ అయితే దాన్ని మిక్స్డ్ క్లైంబింగ్ అంటారు. క్లైంబింగ్ అద్భుతమైన వ్యాయామంగా ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఇప్పుడ బౌల్డరింగ్ అంటున్నారు. వ్యాయామ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం ఆర్టిఫిషియల్ వాల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనిని స్పోర్ట్స్ క్లైంబింగ్ అంటారు. దీనిలో కూడా 3 విభాగాలున్నాయి. వాల్ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. లీడ్ క్లైంబింగ్లో గోడ 30–40 అడుగుల ఎత్తు పైన ఉంటుంది. భయం లేకుంటేనే లీడ్ క్లైంబింగ్. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. వేగం ప్రధానంగా సాగేది స్పీడ్ క్లైంబింగ్. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. ఫిట్నెస్ సాధనం... లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు మౌంటెనీరింగ్‌ను సీరియస్ హాబీగా తీసుకున్నవారికే పరిమితం. పైగా అంత కాంపిటీటివ్ వాల్స్ కూడా నగరాల్లో అందుబాటులో లేవు. దీంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఇప్పటికే బౌల్డరింగ్ని ఒక వినోద సాధనంగా. వ్యాయామ మార్గంగా జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ సాధన కోసం అమర్చిన వాల్స్ ఉన్నాయి. హై ఎనర్జీ... హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ అద్భుతమైన హాబీ. గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే అన్ని కేలరీలు బర్న్ కావాలంటే వేరే వర్కవుట్‌లో కనీసం 2గంటలు చేయాలి. అంతేకాకుండా మంచి ఫన్ కూడా ఉండడంతో అలసట ఎక్కువగా రాదు. అంతేకాకుండా బ్యాలెన్సింగ్ చేసుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది. కోర్ మజిల్స్ శక్తిమంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్ టోనప్ అవుతాయి. ఇంట్లోనూ... వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ వాల్ని ఫైబర్‌తో చేసి సపోర్ట్ స్ట్రక్చర్ సాలిడ్ వుడ్, లేదా స్టీల్ ఉంటుంది. అయితే వుడ్ ఖరీదు ఎక్కువ కాబట్టి... స్టీల్ బెటర్. క్లైంబింగ్ సర్ఫేస్‌గా ప్లైవుడ్ లేదా ఫైబర్ గ్లాస్ గాని వాడి చేసే 8విడ్త్ 12 ఫీట్ హైట్ వాల్కి రూ.1లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24ఫీట్ వాల్కి అయితే రూ.4లక్షలు వరకూ అవుతుంది. అయితే దీన్ని తయారు చేసేవారు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో లేరు. పూనె లాంటి నగరాల్లో చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం అయితే 8, 9 అడుగుల వాల్ సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాల్కి దీన్ని సెటప్ చేస్తారు. బెడ్రూమ్ ఉంటే ఒక కార్నర్లో క్లైంబింగ్ వాల్ పెడతారు. – ఎస్.సత్యబాబు -
మరణం లేని వీరుడు చేగువేరా
అర్జెంటీనా క్యూబా గుండెల కొండల నడుమ నుంచీ ప్రభవించిన సూర్యగోళం! కొన్ని ప్రమాద విపత్కర సన్నివేశాల్లో నీ సాహసానికి పర్వతాలు సైతం సాగిలపడాల్సిందే ఆస్తమాని -యజమాని మాట వినే పెంపుడు వేటకుక్కే గదా! పాము కుబుసం విడిచినట్టు సామ్రాజ్యవాదుల గుండెల్లో భయం రైళ్లు పరుగెట్టించావ్ క్షతగాత్రులైన వారిని ఆయుధాలుగా మలిచావ్ గెరిల్లా పోరుదారిలో పచ్చ రక్తనాళాల్లో ఎర్రరక్త ప్రవాహాలు పుట్టించావ్ ఏకాకులైన ప్రజలకి నీ ఆత్మీయతను జతచేశావ్ మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతాం నీకు చావంటే భయంలేదు మరణం అంచున పరిహసిస్తావ్ చావు నీ దగ్గర దగా పడి ముఖం తిప్పుకుంది నీ విషయంలో మృత్యువు వాయిదా పద్ధతిలోకొచ్చింది. మాలో మేం బ్రతుకుతాం నా వృత్తి పిల్లలకు బొమ్మలు నేర్పటం ఏదో నెలకు ఆరు రాళ్లు, పద్దెనిమిది కొమ్ములు... తరువాత నీళ్లొదిలేయటం ఇంతటితో మా తెలుగు సినిమా పూర్తవుతుంది నీ అనన్యత అలాంటిది కాదుగదా చే నువ్వు మరణంలో కూడా ఎదగగలవ్ అందరికీ మేలు చేసే వృత్తివిప్లవకారుడవు నువ్వు నీ త్యాగానికి హద్దులు లేవు, నీ కార్యాలు అల్పమైనవి కావు..యుద్ధంలో వీరుడ్ని చంపలేరు మహా అయితే కుట్రతో తప్ప! జనం అశ్రుధారలతో, జ్వలించే గుండెనెత్తురులతో నీ మరణం ప్రాణప్రతిష్ట పొందింది నువ్వు అమరుడవు నీ అమరత్వం బహు రమణీయం (నేడు చేగువేరా వర్ధంతి సందర్భంగా...) ‘‘సరిశాసి’’ (ఎన్.సర్వేశ్వర్రావ్), కంచికచర్ల, మొబైల్: 9391996005 -
పాముచర్మం ఆకృతిలో పర్వతాలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన న్యూహారిజాన్స్ వ్యోమనౌక ప్లూటో గ్రహానికి సంబంధించి తాజాగా పంపిన అత్యధిక రెజల్యూషన్‌తో కూడిన చిత్రాలు ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్లూటోపై పర్వతాలు పాము చర్మం ఆకృతిలో ఉన్నట్లు నాసా తెలిపింది. దీంతో పాటు చిత్రమైన ఆకారాల్లో నీలం-గోధుమ రంగుల్లో మిట్టలు ఉన్నట్లు ఈ కలర్ ఫొటో స్పష్టం చేస్తోందని 'న్యూహారిజాన్స్ జియోలజీ, జియోఫిజిక్స్ అండ్ ఇమేజింగ్' బృందానికి డిప్యూటి హెడ్ అయిన విలియమ్ మెకినన్ తెలిపారు. మల్టీస్పెక్ట్రల్ విజువల్ ఇమేజింగ్ కెమెరా(ఎంవీఐసీ) ద్వారా సుమారు 530 కిలోమీటర్ల మేర ప్లూటో ఉపరితల ప్రాంతాన్ని జూలై 14న న్యూహారిజాన్స్ వ్యోమనౌక చిత్రించిందని చెప్పారు. దీంతో పాటు లాంగ్ రేంజ్ రీకనెసైన్స్ ఇమేజర్(ఎల్ఓఆర్ఆర్ఐ) ద్వారా తీసిన చిత్రం సెప్టెంబర్ 20న భూమికి చేరిందని, ప్లూటో భౌగోళిక వివరాలు ఇది స్పష్టం చేస్తోందని వివరించారు. -
అమ్మో.. అద్దాల బ్రిడ్జి..
చైనాలో ఇటీవల ప్రారంభించిన ఈ వంతెన ప్రస్తుతం అక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఇది గ్లాస్ బ్రిడ్జి.. అంటే కింద అంతా గ్లాసుతో పారదర్శకంగా ఉంటుందన్నమాట. పింగ్జియాంగ్లో రెండు పర్వతాల మధ్య 984 అడుగుల మేర నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిపై నడవాలంటే చాలా మంది భయపడతారు. 590 అడుగుల ఎత్తులో లోయ మధ్య ఉన్న ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు కిందకు చూస్తే.. కళ్లు తిరగడం ఖాయం. అందుకే.. అలా భయపడేవారి కోసం ఈ బ్రిడ్జి మీద అక్కడక్కడా సహాయకులు కూడా ఉంటారు. వారు దగ్గరుండి బ్రిడ్జిని దాటిస్తారు. ఈ బ్రిడ్జిలో ఎక్కువ భాగం అద్దాలతో పారదర్శకంగా.. కొంత దూరం మామూలుగా ఉంటుంది.