moving car
-
నడుస్తున్న కార్లో యువతిపై గ్యాంగ్‌రేప్
సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో దారుణం జరిగింది. నడుస్తున్న కారులో దాదాపు 4 గంటలపాటు యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. నగరంలోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన స్నేహితుడితో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా దగ్గర్లోనే కూర్చున్న ఓ యువకుడు పొగతో ఇబ్బందిగా ఉందంటూ వాదనకు దిగాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిన అతడు, మరో ఇద్దరు స్నేహితులతో తిరిగి వచ్చాడు. బెదిరించి యువతి స్నేహితుడి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో మరో స్నేహితుడు కారులో రాగా అందరూ కలిసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారు నడుస్తుండగానే నలుగురూ ఒకరితర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈజీపురలోనే రోడ్డు పక్క ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్ అనే 22–26 ఏళ్ల నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు కూడా ఈజీపురకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. -
బెంగుళూరులో దారుణం.. పార్కులో నుంచి యువతిని ఊడ్చుకెళ్లి..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లిన ఓ యువతిని నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఉదయం ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. మార్చి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చొని మాట్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి.. రాత్రి సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. నలుగురు కలిసి ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి తోశారు. అనంతరం ఆ వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లారు. అంతేగాక అఘాయిత్యం గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించారు. అమిnrso బాధితురాలి ఆరోగ్యం బాలేక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన ఘోరాన్నికుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు పోలీస్ అధికారి సీకే బాబా వెల్లడించారు. -
సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు. అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది Apologies for not wearing a seatbelt, but I thought that rule only applied to other people and not to us. You know, like all the other rules.#LevellingUpFundpic.twitter.com/ZzFmiHcgFL — Parody Rishi Sunak (@Parody_PM) January 19, 2023 -
మరో నిర్భయ.. షేర్డ్ ట్యాక్సీలో యువతిపై సామూహిక లైంగిక దాడి
దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతూనే ఉన్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోతూ ఆఫీసులకు వెళ్లే యువతులు, నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతి లైంగికదాడికి గురైంది. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ యువతి.. షేర్డ్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ట్యాక్సీ రాగానే లోపల కూర్చుంది. అయితే, ట్యాక్సీ కొంత దూరం వెళ్లగానే మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అనంతరం, కొద్ది దూరం వెళ్లగానే యువతిపై యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత, ఆమెను ఎత్మాద్పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా ఆగ్రా సీపీ ప్రీతింధర్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నాము. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చిక్సితలు అందిస్తున్నట్టు తెలిపారు. Uttar Pradesh | A woman gave a complaint at Etmadpur police station today. In the complaint, she said she took a shared taxi from Noida and on the way, 3 boys raped her and dropped her near Etmadpur: Preetinder Singh, CP, Agra pic.twitter.com/i1Kxn9Qlil — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2022 -
లిఫ్ట్ ఇచ్చి.. అత్యాచారం చేసి పారిపోయారు
కదులుతున్న కారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఉత్తర ప్రదేశ్ జైసింగ్‌పూర్ ఏరియా సుల్తానాపూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి.. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీద నిల్చుంది. అయితే సెలవుల సీజన్ కావడంతో ఎంతకీ బస్సులు రాలేదు. దీంతో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్‌వాహనాన్ని ఆపి లిఫ్ట్ అడిగింది. ఈ క్రమంలో ఆమెను ఎక్కించుకున్నాక.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి కారును నడుపుతుండగా.. యువతిపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుండగుడు. అనంతరం ఆమెను దగ్గర్లో ఉన్న కాలువ వద్ద పడేసి.. ఆ ఇద్దరూ పారిపోయారు. గాయాలతో కంటపడ్డ ఆమెను.. ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు పోలీసులు. వైద్య నివేదిక ప్రకారం. అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: పాపం.. వృద్ధురాలి కాలిని నరికేసి ఘోరం -
అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం
ఇంతవరకు ఎన్నో గిన్నిస్ రికార్డులు చూశాం. మీసాలతో కారుని లాగడం, ఒక్కవేలుతో పెద్దపెద్ద బరువులను ఎత్తడం వంటి ఎన్నో భయంకరమైన ఫీట్లతో చేసిన రికార్డులను చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా ఏకంగా కారు వెళ్తుండగానే కారులో ఉండే టైరు మార్చడం అంటే ఊహకందని విషయం. ఇలాంటి ఫీట్ చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్ అనుకుంటే అసాధ్య కాదంటూ చేసి చూపించి మరీ గిన్నిస్ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. వివారాల్లోకెళ్తే....ఇటలీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు. ఈ మేరకు మాన్యయోల్ జోల్డాన్ అనే వ్యక్తి కారుని డ్రైవ్ చేస్తుండగా... జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ... టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ...ఏకంగా 500 మందికి భోజనాలు) -
పోలీస్ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై....ఫేస్బుక్ స్నేహితుడే అత్యాచారం
Mathura Woman Raped In Moving Car: ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ అత్యాచారాలకు అంతే లేదన్నట్లుగా రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంటుంది. తాజాగా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న 21 ఏళ్ల యువతిపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగింది. పైగా ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో సదరు మహిళ ఎలుకలు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) అయితే నిందుతుడి ఆ మహిళకు ఫేస్బుక్లో స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు . అంతేకాదు నిందుతుడు హర్యానా వాసి ఆర్మీ వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ నిందుతుడు వివాహితుడని లడఖ్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. పైగా తాము అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...మేము ఆ కారుని కూడా స్వాధీనం చేసుకున్నాం. అయితే ఆ డ్రైవర్ ఆ నిందితుడి బంధువే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు అని చెప్పారు. ఈ క్రమంతో యూపీ యుపి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ నేరం గురించి ఆరా తీయడమే కాక మధుర పోలీసుల నివేదిక ఇమ్మని కోరింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) -
కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళపై కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడి బాధిత మహిళను ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కారు వెనక సీటులో కూర్చున్న వ్యక్తి మొదట ఆమెపై దాడి చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా నిందితులు బెదిరించినట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో కారును గుర్తించినట్లు వెల్లడించారు. దాని సహాయంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా.. -
కారుపైన యువకుడి పుషప్స్.. ఊహించని ట్విస్ట్
‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి’ అని థియేటర్లలో, టీవీలలో కనిపించే ప్రకటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ సంఘటనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రన్నింగ్ కారు పైకి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విట్స్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉజ్వల యాదవ్ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్ చేస్తూ షికారు కెళ్లాడు. రహదారిపైకి రాగానే స్టన్నింగ్ స్టంట్స్ చేద్దామని భావించి డ్రైవ్ చేస్తున్న స్టీరింగ్ వదిలేసి కారు పైకి ఎక్కాడు.. రన్నింగ్‌లో ఉన్న కారుమీదనే పుషప్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 61 వేల మంది వీక్షించడంతోపాటు వందలాది మంది కామెంట్ చేశారు. నెట్టింటా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా చివరికి ఉత్తర ప్రదేశ్‌లో పోలీసుల కంటికి చిక్కింది. ఇంకేముంది ఉజ్వల్ చేసిన ఘనకార్యానికి పోలీసులు తగిన మూల్యం విధించారు. ‘కొన్ని పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్ కదా. నీ కష్టానికి ఇదిగో బహుమతి’ అంటూ అతనికి భారీగానే చలాన్ విధించారు. డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని. ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించవచ్చు అని యూపీ పోలీసులు తమ ట్విటర్లో పేర్కొన్నారు. అలాగే ఇలా ఎవరైన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్ అధికారి అజయ్ కమార్ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక స్టంట్స్‌తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్‌కు చివరికి పోలీసులు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ.. మరోసారి రిపీట్ చేయనంటూ చెప్పడం కొసమెరుపు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..! -
పోలీసు వాహనంపై షాకింగ్ టిక్‌టాక్ వీడియో
టిక్‌టాక్ ఓపెన్ చేస్తే చాలు.. సమయం ఇట్టే గడిచిపోతుంది. అసలు బోర్ కొట్టడమనే సమస్యే ఉండదు. అందుకే ఇతర సోషల్ మీడియా యాప్‌లను తలదన్నుతూ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతుంది. ఒకవైపు ఒకవైపు ఈ యాప్‌కు జనాలు అడిక్ట్‌గా మారుతుండగా.. మరోవైపు వింతవింత వీడియోలు, స్టంట్లతో మరోవైపు దీని యూజర్లు కిర్రెక్కిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనంపై స్టంట్లు చేసి.. ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. ఢిల్లీ పోలీసు వాహనాన్ని స్లోగా నడుపుతూ.. అది నడుస్తుండగా దానినుంచి దిగి.. టాప్ మీదకు ఎక్కి.. మనోడు పుషప్ (బస్కీ)లు చేశాడు. అంతే ఈ వీడియో టిక్‌టాక్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో ఓ నెటిజన్ ఢిల్లీ పోలీసులకు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘనకార్యాన్ని చేసిన వ్యక్తిని గుర్తించి తగినరీతిలో చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఇక, ఈ కేసు విచారణ పురోగతిని బయటపెట్టాలని ఢిల్లీ పోలీసులను నెటిజన్లు డిమాండ్ చేశారు. నడిచే పోలీసు వాహనంపై సదరు వ్యక్తి చెత్త, బోరింగ్ స్టంట్లు చేశాడని ఎద్దేవా చేస్తున్నారు. -
హోమ్ వర్క్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..
-
నడుస్తున్న కారుపై హోమ్‌వర్క్, వీడియో వైరల్
హెనాన్ ప్రావినెన్స్ : ముందు రోజు క్లాస్ టీచర్ ఇచ్చిన హోమ్‌వర్క్ చేయడం మర్చిపోతే ఏం చేస్తాం.. అమ్మ బ్రేక్‌ఫాస్ట్ తినిపించే సమయంలోనో.. లేదా ఏదైనా క్లాస్ ఖాళీగా ఉన్న సమయంలోనైనా చకాచక ముగించేస్తాం. కానీ చైనాలో ఓ అమ్మాయి అయితే తన హోమ్ వర్క్ ముగించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. నడుస్తున్న ట్యాక్సీలో నుంచి బయటికి కూర్చుని, కారు టాప్‌ను డెస్క్‌గా మార్చుకుని తన హోమ్‌వర్క్ ముగించేయాలని చూసింది. డ్రైవర్ సీట్లో కూర్చుని ట్యాక్సీ నడుపుతున్న ఆ అమ్మాయి తండ్రి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఆ విషయాన్ని గమనించలేదు. పక్కనే వెళ్తున్న వారు, దాన్ని వీడియోగా తీసి సీజీటీఎన్ షోల్లో యూట్యూబ్‌లో పెట్టారు. ఆ బిజీ రోడ్డులో హోమ్‌వర్క్ కోసం ఆ అమ్మాయి చేసిన వింత సాహసాన్ని వివరించారు. తన కూతురి కారులో నుంచి బయటికి కూర్చుని అలా హోమ్‌వర్క్ చేయడం గమనించిన ఆమె తండ్రి వెంటనే అలర్ట్ అయి, కిందకి రప్పించాడు. ఆమె వెనుకాల విండో సీటులో కూర్చుని ఉందని, తాను అది గమనించకపోవడం నిజంగా తన నిర్లక్ష్యమేనని డ్రైవర్, అమ్మాయి తండ్రి ఛెంగ్ చెప్పారు. మరోసారి అలా చేయొద్దని తన కూతురికి వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. అయితే నిర్లక్ష్యపూరిత వైఖరితో ఆ విషయం గమనించకపోవడంతో, అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయింది. మరోసారి అతన్ని ట్యాక్సీలు నడుపుకుండా చర్యలు తీసుకున్నట్టు చైనా పేపర్ రిపోర్టు చేసింది. ఈ సంఘటన గత వారం సెంట్రల్ చైనా హెనాన్ ప్రావినెన్స్‌లోని షాంగ్క్యు లో చోటు చేసుకుంది. -
ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై..
ముజఫర్ నగర్ : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు పరిచయం ఉన్న ఆర్.కే మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఉద్యోగం కోసం అతను చెప్పిన చోటుకు వెళ్లగా.. తాగే కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి మెహతా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై కదులుతున్న కారులో నుంచి మూడు సంత్సరాల ఆమె కుమారున్ని కిందకు విసిరేసి ఈ అరాచకానికి ఒడిగట్టారు. రోడ్డుపై పడి ఉన్న బాలున్ని గ్రామస్తులు హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అత్యాచారం అనంతరం ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన పోలీసులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
కదులుతున్న కారులో అఘాయిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఒక మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సిటీ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ నుంచి ఒక మహిళను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. స్కారియో వాహనంలోకి బలవంతంగా ఒక వ్యక్తి అపహరించుకు వెళ్లాడు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం అఘాయిత్యానికి పాల్పడి అక్షరధామం మెట్రో స్టేషన్వద్ద వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. -
‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’
గురుగ్రామ్: ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు అక్కడ కూడా దాడికి దిగారు. దాదాపు ఐదుగంటలపాటు వారి వికృత క్రీడను కొనసాగించారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు బ్రతిమాలుకోవడంతో ఓ రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు. ఈ ఘటన శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం 26 ఏళ్ల సిక్కింకు చెందిన మహిళ ఢిల్లీలోని కనౌట్ సమీపంలోని శాదారా ఏరియాలో ఉండే తన స్నేహితుడి ఇంటికి శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వెళ్లింది. అనంతరం అతడితో కలిసి ఢిల్లీలో రాత్రి 7.30 గంటల నుంచి 10.00గంటల మధ్య అతడితో కలిసి సినిమా చేసింది. ఆ తర్వాత 1.30 నుంచి 2గంటల ప్రాంతంలో తన స్నేహితుడు ఆమె కలిసి ఓ క్యాబ్ తీసుకొని గుర్గావ్కు బయలుదేరి వచ్చారు. ఇంటికి కొద్ది దూరంలో ఆమెను దించి స్నేహితుడు వెళ్లిపోగా స్విప్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి లాగేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం 6.30గంటల ప్రాంతంలో ఆమెను వదిలేయగా ఓ బైకిస్టు సహాయంతో తిరిగి ఢిల్లీకి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడే ఇద్దరు వ్యక్తులు మాత్రం మూడో వ్యక్తిని దీపక్ అని పిలిచారని చెప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. -
కారులో తిప్పుతూ అత్యాచారం
మూడురోజులపాటు మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం అనంతపురం జిల్లా గుత్తిలో ఘటన నిందితులపై నిర్భయ–పోక్సో చట్టం కింద కేసు.. గుత్తి (గుంతకల్లు): ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి.. మూడురోజులపాటు కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. దుండగుల చెర నుంచి బయటపడిన బాలిక తల్లిదండ్రులతో కలసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు బాధ్యులైన నిందితులిద్దరిపై పోలీసులు నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గుత్తి ఎస్ఐ సుధాకర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుత్తి జంగాలకాలనీకి చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అటకాయించి, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. గుడి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జాడ కనుక్కోలేకపోయారు. ఈ క్రమంలో ఈనెల 8న (శనివారం) తెల్లవా రుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. తిప్పలు పడి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన ఉదంతాన్ని పోలీసులకు తెలియజేసింది. తనను కిడ్నాప్ చేశాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపించింది. నిందితుడు అశోక్ పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్ ఆటోడ్రైవర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరిపై నిర్భయ కేసుతోపాటు సెక్షన్ 366 (కిడ్నాప్), 342 (నిర్బంధం), 376బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), 5 లేదా 6 (పోక్సో– నిర్భయ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. -
ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు
సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న 25 ఏళ్ల మహిళను కారులో అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో పీవీఆర్ ప్రియా థియేటర్లో సినిమా చూసి, స్నేహితురాలితో కలిసి తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను అపహరించారు. కారులో తనపై ముగ్గురూ అత్యాచారం చేసి, ఆ తర్వాత పూర్వీమార్గ్ వద్ద విసిరేసి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె కిడ్నాప్ కాగానే ఆమెతోపాటు ఉన్న స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. కారు నెంబరును ఆమె గుర్తుపెట్టుకోవడంతో నిందితులను పట్టుకోవడం సులభమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించగా అత్యాచారం జరిగిన విషయం కూడా నిర్ధారణ అయ్యిందన్నారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్‌పై పడేశారు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, కదిలేకారులో ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కిలో మీటర్ దూరంలో ఫ్లై ఓవర్ దగ్గర బాధితురాలిని పడేసి పరారయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బయట కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. దుండగులు తనకు తెలియదని, వారు వాడిన కారు నెంబర్ గుర్తుందని పోలీసులకు చెప్పింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, యజమాని ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. -
కదులుతున్న కారులో.. మూడు గంటలు గ్యాంగ్‌రేప్
కదులుతున్న కారులో.. మూడు గంటల పాటు ఏకధాటిగా ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. కోల్‌కతా విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఉన్న వీఐపీ రో డ్డులో గల ఓ బారులో ఆమె పాటలు పాడుతుంది. తన షిఫ్టు ముగిసిన తర్వాత సెక్టార్ 5 లోని ఓ కేఫ్‌కు వెళ్దామనుకుంది. దాంతో మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని, సాల్ట్ లేక్ సెక్టార్ 5 లోని ఆర్డీబీ సినిమాస్ వద్ద దిగింది. నగరానికి కొత్త కావడంతో దారి అడుగుతుండగా ఒక వ్యక్తి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. కానీ అతడు ఆమెను తప్పుదోవ పట్టించాడు. ఆమె నడుస్తుండగా అతడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఓ కారు ఆమె ముందుకు వచ్చింది. అందులోనివాళ్లు ఆమెను లోపలకు లాగారు. లోపల నలుగురు ఉన్నారు. వాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై కదులుతున్న కారులోనే అత్యాచారం చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కారు ఓ కాలువ దగ్గర ఆగినప్పుడు ఆమె కారు అద్దం తెరిచి, గట్టిగా అరిచింది. దాంతో భయపడిన ఆ నలుగురూ ఆమెను కారులోంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ టాక్సీ డ్రైవర్ చూసి పోలీసులకు తెలిపాడు. వాళ్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఆమె శరీరం నిండా కోసిన గాయాలున్నాయని, ఆమె మానసికంగా కూడా బాగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అయితే గతంలో జరిగిన పార్క్ స్ట్రీట్ ఉదంతంలోలా కాకుండా పోలీసులు వెంటనే స్పందించడం ఇక్కడ విశేషం. అప్పట్లో నాలుగు రోజుల తర్వాత బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించడం తీవ్ర వివాదం అయ్యింది. -
కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్
కిడ్నాప్ ప్రయత్నం నుంచి ఓ మోడల్ తృటిలో తప్పించుకుంది. తనను ఎత్తుకెళ్లిపోవాలని చూసేవారి నుంచి తప్పించుకోడానికి ఆమె కదులుతున్న కారులోంచి దూకేసింది. దాంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన మాజీ బోయ్‌ఫ్రెండు, అతడి స్నేహితులు కలిసి తనను తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. తాను అతడితో బ్రేకప్ అయిపోవడంతో కక్ష తీర్చుకోడానికే ఇలా చేశారంది. అంతేకాక, తన ముఖం మీద యాసిడ్ పోయడానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయిఏత ఇంతవరకు ఎవరినీ అరె స్టు చేయలేదు. ఉదయం 9 గంటలకు ఆమె తన స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఇద్దరు ముగ్గురు పురుషులు ఆమెను కారులోంచి బయటకు లాగి, బలవంతంగా తమ కారులోకి తోసేశారు. ఆమెను తీవ్రంగా కొడుతూ ముఖం మీద యాసిడ్ పోస్తామని బెదిరించారు. వాళ్లలో ఒకరిపేరు ఆమిర్ అని, మరొకరు అతడి స్నేహితుడు తయ్యాబ్ అని ఆమె చెప్పింది. ఆమిర్‌తో తాను బ్రేకప్ అవ్వడంతో వాళ్లు ఇలా చేశారని తెలిపింది. -
కదులుతున్న కారులో అఘాయిత్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కదులుతున్న కారులో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్ కు వెళ్లిన బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. నిందితులు, వారు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
నిర్భయ తరహాలో.. మరో గ్యాంగ్‌రేప్
కాన్పూర్: నిర్భయ తరహాలోనే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సోమవారం సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మందులు కొనడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో నలుగురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఉన్నవో జిల్లాలోని బాంత్రా టోల్ ప్లాజా దగ్గర్లోని ముళ్ల పొదల్లోకి విసిరేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కదిలే కారులో మహిళపై గ్యాంగ్‌రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ యువతిని కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్‌లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేయడం కోసం నగరానికి వచ్చింది. సంజీవ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.అది సేవించిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కారులో తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఓ కాలువ వద్ద ఆమెను పడేసి వెళ్లారు. పెట్రోలింగ్ సిబ్బంది ఆమెను గమనించి సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
4 రోజులుగా కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్
వరంగల్: నెల్లూరుకు చెందిన ఓ వివాహితను బలవంతంగా వరంగల్ జిల్లాకు జిల్లాకు తీసుకువచ్చి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ సంఘటన వెలుగుచూసింది. ఐదు రోజుల క్రితం నెల్లూరు నగరానికి చెందిన వివాహితను అదే ప్రాంతానికి చెందిన నలుగురు దుండగులు బలవంతంగా కారులో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా కారులో తిప్పుతూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథిని వద్ద ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. దుండగులు ఆమెను కత్తితో పొడిచి కారులోంచి తోసివేసి పరారయ్యారు. ఆమె పొట్టపై కత్తిపోట్లు ఉన్నాయి. స్థానికులు ఆమెను గమనించి 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. -
కదిలేకారులో యువతిపై సామూహిక అత్యాచారం
ప్రతాప్‌గఢ్: నలుగురు దుండగులు కదిలేకారులో ఓ 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలిని అలహాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు రాణిగంజ్‌కు వెళ్లేందుకు నిందితుల్లో ఒకరిని సాయం కోరగా, అతను మరో ముగ్గురిని వెంటతీసుకెళ్లాడు. దారి మధ్యలో నలుగురూ ఆమెపై దారుణానికి పాల్పడి రోడ్డుపైకి తోసేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.