muder
-
దస్తగిరి కుమ్మక్కు డ్రామాలు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కట్టుకథ పథకం ప్రకారమే తెరపైకి వచ్చిందని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆ కట్టుకథను నిజం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని, సీబీఐ సైతం ఆరోపణలకు తగిన ఆధారాలు సేకరించలేదన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం పదే పదే వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తన తండ్రి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకాను చంపినట్లు నేరం ఒప్పుకున్న దస్తగిరిని సీబీఐ విడిచిపెట్టడం వెనుక తిరకాసు ఉందన్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులో లోపాలపై సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ లభించాకే అప్రూవర్‌గా.. డ్రైవర్ దస్తగిరి 2021 ఆగస్టు 25న 161 సీఆర్పీసీ స్టేట్మెంట్ ఇవ్వగా ఆగస్టు 31న మేజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని ప్రకారం దస్తగిరి స్వయంగా వివేకాను చంపినట్లు ఒప్పుకున్నాడని చైతన్యరెడ్డి గుర్తుచేశారు. అదే ఏడాది అక్టోబర్ 7న ముందస్తు బెయిల్ కోసం దస్తగిరి దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 22న మంజూరైంది. దస్తగిరి బెయిల్‌కు అటు సీబీఐ, ఇటు సునీత ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తయ్యేవరకు బెయిల్ లభించే అవకాశం లేదు కాబట్టి ముందస్తు బెయిల్ లభించిన తర్వాత దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ వ్యవహారం వెనుక డాక్టర్ నర్రెడ్డి సునీత, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్ ఉన్నారు. అసలు విషయం అక్కడే ఉంది.. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో క్లూస్ టీమ్‌కు లభించిన ఆధారాలు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్మెంట్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. క్లూస్ టీమ్ ఫొటోల ప్రకారం తలుపుల సేఫ్టీ లాక్, టవర్ బోల్ట్ బద్ధలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దస్తగిరి మాత్రం తన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి లోపలి నుంచి తలుపు గడియ తీయడంతో తాము ఇంట్లోకి ప్రవేశించామని చెప్పాడు. అది శుద్ధ అబద్ధం. నర్రెడ్డి సునీత దంపతులు తలుపుల లాక్‌లకు మరమ్మతులు చేయించారు. సేప్టీలాక్, టవర్ బోల్ట్ బద్దలైన విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లకుండా దాచి పెట్టారు. అక్కడే అసలు విషయం దాగి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వచ్చాÆý‡న్న విషయం బహిర్గతం అయితే దస్తగిరి కట్టుకథ తేలిపోతుందని జాగ్రత్త పడ్డారు. క్లూస్‌టీమ్ సేకరించిన ఐదు వేలి ముద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవి కాదు. అవి ఎవరివో ఇప్పటికీ సీబీఐ నిగ్గు తేల్చలేదు. పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారే హత్య చేసినట్లు నాడు తేల్చారు. ఇంటి ఉత్తరం వైపు తలుపు నుంచి ముగ్గురు బయటికి వచ్చారని, కొద్ది సేపటికి బయటకు వచి్చన ఎర్రగంగిరెడ్డిని ఏమైందని అడగ్గా కోపంగా తోసేయడంతో కింద పడ్డానని ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పాడు. దస్తగిరి తూర్పు వైపు ఉన్న మెయిన్ డోర్ గుండా బయటికి వచి్చనట్లు చెబుతుండగా ప్రత్యక్షసాక్షి రంగన్న మాత్రం ఉత్తరం వైపు డోర్ నుంచి వచ్చారని చెబుతూ పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇచ్చారు. గూగుల్ టేకౌట్ పేరిట దుష్ప్రచారం వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇళ్ల మధ్య 300 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఒక వర్గం మీడియా హత్యకు ముందు నిందితులంతా వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తెలిసిందంటూ ప్రచారం చేసింది. గూగుల్ టేకౌట్‌కు ప్రామాణికత లేదని సీబీఐనే వెల్లడించింది. ఆ అవసరం ఎవరికి ఉంది? వివేకా హత్య అనంతరం రౌండ్ సీల్ ఉన్న దస్తావేజులు తీసుకెళ్లినట్లు దస్తగిరి చెబుతున్నాడు. రౌండ్ సీళ్లు ఉన్నాయంటే అవి నోటరీ అఫిడవిట్లు లేదా వీలునామా కావచ్చు. బెంగళూరు స్థలానికి చెందిన డాక్యుమెంట్లు అన్నది శుద్ధ అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలింది. వీలునామా దస్తావేజులు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీన్నిబట్టి వివేకా రెండో భార్య షమీమ్, వారసుడు షహెన్షా పేరుతో ఉన్న విల్లును దొంగిలించినట్లు తెలుస్తోంది. అసలు ఎర్ర గంగిరెడ్డి నేరస్తులతో కలిసి లేరని దర్యాప్తు ఆధారంగా రూఢీ అవుతోంది. అంటే దస్తగిరి వాంగ్మూలం అంతా కట్టుకథేనని స్పష్టమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక నాటకమే. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని నా తండ్రి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి పేర్లను కేసులో చేర్చడం పథకంలో భాగమే. ఆ కట్టుకథ ఆధారంగా బాబు, షర్మిల, సునీత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు దర్యాప్తు అధికారిని తప్పించినా కింది స్థాయి సిబ్బందిని అలాగే కొనసాగించడంతో సీబీఐ అసలు హంతకులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై నిందలు మోపింది. సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది. -
మద్యం మత్తు గొడవ హత్యకు దారితీసింది
సాక్షి, రామగుండం(కరీనంనగర్): గోదావరిఖని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం గ్రామానికి చెందిన చెన్నూరి మధుకర్(21) మేషన్ పని చేసుకుంటూ గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. లెనిన్‌నగర్‌కు చెందిన గద్దల వంశీ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. శుక్రవారం రాత్రి గాంధీనగర్ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే తోటి స్నేహితుడైన గడ్డం అరుణ్ అలియాస్ సోను ఇంటికి వెళ్లి మద్యం తాగారు. మద్యంమత్తులో వంశీ, మధుకర్ మధ్య మాటమాట పెరగడంతో మధుకర్‌పై విచక్షణారహితంగా తలపై బరువైన ఇనుప సుత్తిలాంటి వస్తువుతో గద్దల వంశీ దాడిచేసి బాదడంతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు. సదరు సింగరేణి క్వార్టర్లో నివాసముండే అరుణ్‌తోపాటు, నిందితుడు గద్దల వంశీ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వంశీ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం
ఏలూరు టౌన్: సీరియల్ సైనైడ్ కిల్లర్ వెల్లంకి సింహాద్రి హత్యలు చేయటంలో ఆరితేరిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తినే పదార్థంలో సైనైడ్ పెట్టి తినిపిస్తే అది పోస్టుమార్టంలో సైతం తెలియదా? ఈ విషయం తెలిసే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు వంగాయగూడెంకు చెందిన ఫైనాన్స్ ఆఫీస్‌లో గుమస్తాగా పనిచేసే చోడవరపు సూర్యనారాయణ హత్య అనంతరం అతని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో సైతం అది సహజ మరణంగానే నిర్థారణ కావటం అంతుచిక్కని అంశంగా మారింది. విష ప్రయోగం ఏమీ జరగలేదని ఎఫ్ఎల్సీ రిపోర్టులో రావటం కూడా అనుమానాలకు దారితీస్తోంది. పరిచయాలతోనే బోల్తా.. సింహాద్రి చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. పైకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దురాగతాలకు పాల్పడడం ప్రారంభించాడు. ఐదేళ్ల క్రితమే ఏలూరు వచ్చిన సింహాద్రి మెల్లగా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. వ్యక్తులను మోసం చేసే సమయంలో డబ్బు, బంగారం దోచుకోవాలంటే పెనుగులాట జరిగితే, ఒంటిపై గాయాలు ఉంటే పోలీసులు అనుమానిస్తారనే విషయాన్ని గ్రహించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆఖరికి సాధారణ పోస్టుమార్టం రిపోర్టులోనూ ఏవిధమైన అనుమానం రాదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయిలో వినూత్నరీతిలో హత్యలకు ప్రణాళికలు రచించాడు. కేవలం పక్షం రోజుల వ్యవధి మాత్రమే తీసుకుంటూ అత్యంత చాకచక్యంగా హత్యలు చేయటం మొదలెట్టాడు. హత్యల్లో ఏ విధమైన అనుమానాలు రాకుండా పొటాషియం సైనైడ్‌ను ఎంచుకున్నాడు. మృతుని శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రత్యేక రీతిలో పరీక్షిస్తే తప్ప విషప్రయోగం జరిగిందనే విషయం నిర్థారణ కాదని అంటున్నారు. పీఈటీ కాటి నాగరాజు హత్య అనంతరం శవపరీక్షలో ఇదే విధమైన రిపోర్టు రాగా, ఎఫ్ఎల్సీ ద్వారానే అసలు విషయం బయటపడిందని పోలీస్‌వర్గాలు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎల్సీ రిపోర్టులో నిర్ధారణ.. ఒక వ్యక్తిపై విషప్రయోగం జరిగితే దాని మోతాదు, చనిపోయిన సమయం, పోస్టుమార్టం నిర్వహించిన సమయం ఆధారంగా రిపోర్టు ఉంటుంది. సైనైడు వినియోగిస్తే ఒక్కోసారి సాధారణ పోస్టుమార్టంలో విషప్రయోగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అప్పుడు మృతుడి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే విషప్రయోగం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుంది. వ్యక్తిపై ప్రయోగించిన విషప్రయోగం మోతాదు ఆధారంగానూ కొన్నిసార్లు నిర్థారణ చేయవచ్చు. గుండె, కాలేయం, కిడ్నీ, జీర్ణాశయం పైనా వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఒక్కోసారి మరుసటి రోజు శవ పరీక్ష నిర్వహిస్తే విషప్రయోగం నిర్థారణలో తేడాలు రావచ్చు. ఇలా విషపదార్థం, మోతాదు, శవపరీక్ష చేసే కాలం ఇలా అనేక కోణాల్లో నిర్థారణపై ప్రభావం ఉంటుంది. – డాక్టర్ హరికృష్ణ, ప్రభుత్వాసుపత్రి వైద్యుడు వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం? ఇక సీరియల్ కిల్లర్ సింహాద్రి 2018 ఫిబ్రవరిలో హత్యల పరంపర మొదలు పెట్టి వరుసగా 6 హత్యలు చేస్తూ వచ్చాడు. ఒక్కో హత్యకు సింహాద్రి కేవలం 9 నుంచి 15 రోజులు, మరో హత్యకు 20 రోజులు మాత్రమే సమయం తీసుకున్నాడు. రాజమండ్రి పురుషోత్తపట్నం ఆశ్రమంలో రామకృష్ణానంద స్వామీజిని 2018 ఏప్రిల్ 28న హత్య చేసిన అనంతరం సుమారుగా 8 నెలల వరకూ ఎక్కడా హత్యలు చేసినట్లు పోలీసు విచారణ వెల్లడి కాలేదు. అంటే ఈ 8 నెలల కాలం సింహాద్రి ఎక్కడ ఉన్నాడు.. ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా తన క్రిమినల్ కార్యకలాపాలు సాగించాడా? అనేది సందేహంగా మారింది. తరువాత 2018 డిసెంబర్ 23న 7వ హత్య, వెంటనే 20 రోజుల వ్యవధిలోనే 2019 జనవరి 12న 8వ హత్య చేశాడు. ఈ రెండు సంఘటనల అనంతరం సింహాద్రి మరోసారి 7 నెలల పాటు ఏ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడినట్లు తెలియటంలేదు. ఈ సమయంలో సింహాద్రి ఎక్కడ ఉన్నాడు ? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. నిందితుడు 2019 ఆగస్టు 30న 9వ హత్య, మళ్లీ నెలన్నరలోనే పదో హత్య అక్టోబర్ 16న చేసినట్లు పోలీసు విచారణ తేలింది. ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి. అసలు సీరియల్ కిల్లర్ సింహాద్రి కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాడా? అతను ఒక్కడే ఇన్ని హత్యలు చేశాడా? సింహాద్రి వెనుక ఏమైనా గ్యాంగ్ పనిచేస్తుందా అనేవి తెలియాల్సి ఉంది. -
భూవివాదం: గిరిజన రైతు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం సూరప్పవారంగూడెలో ఓ భూవివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం తన పొలంలో దుక్కి దున్నుకుంటున్న గిరిజన రైతు దాది గోవింద్‌పై గిరిజనేతర రైతులు దాడి చేశారు. దీంతో వారి దాడిలో గిరిజనరైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ రైతును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాది గోవింద్ హత్యకు నిరసనగా సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించారు. హత్యకు బాధ్యులైన గిరిజనేతర రైతులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...
సాక్షి, ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కావటి తేజస్విని హత్య కేసులో నిందితుడు బొల్లెదు నితిన్‌ను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందన్న కోపంతో యువతిని హత్య చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కల్లూరు ఏసీపీ వెంకటేష్ శుక్రవారం రాత్రి వీఎంబంజర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లికి చెందిన బొల్లెదు నితిన్, పెనుబల్లి మండలం, కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్వినిని మూడేళ్లుగా సత్తుపల్లిలో డిప్లొమా చదువుతున్న రోజుల నుంచి ప్రేమిస్తున్నాడని, మూడు నెలలుగా నితిన్ ఫోన్ చేసినప్పటికీ తేజస్విని సరిగ్గా మాట్లాడటం లేదని, వేరే వాళ్లతో మాట్లాడుతుందనే అనుమానంతో, పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో మాయమాటలు చెప్పి, మాట్లాడాలని ఇంటి వెనుక నుంచి తీసుకెళ్లి, ద్విచక్రవాహనంపై టేకులపల్లి వెళ్లి, అక్కడి నుంచి ముందుగా అనుకున్న నిర్మానుష్య ప్రదేశం కొత్తలంకపల్లి గుట్టల వద్దకు తీసుకువెళ్లి, మాట్లాడే పేరుతో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ.. జేబులో కర్చీఫ్‌ను తీసి, తేజస్విని మెడకు బిగించి, చేతితో నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు.ముందుగానే పెట్రోల్ కూడా తీసుకుని వెళ్లినప్పటికీ, రోడ్డు మీద వాహనాలు తిరుగుతుండటంతో బయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. కేవలం ప్రేమోన్మాదంతోనే తేజస్విని హత్య చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. హత్య అనంతరం ద్విచక్రవాహనాన్ని అక్కడి దగ్గర్లో పొదల్లో పడేసి, ఏమీ ఎరుగనట్లు బస్సు ఎక్కి ఖమ్మంలోని ప్రైవేటు హాస్టల్‌కు వెళ్లాడు. తేజస్విని తండ్రి కావటి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా విచారణ చేపట్టినట్లు శుక్రవారం లంకపల్లి పొదల వద్ద ఉన్న బండి కోసం వచ్చి, అది తీస్తుండగా పోలీసులు గుర్తించి, నిందితుడు బొల్లెద్దు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం తానే చేసినట్లు విచారణలో నితిన్ వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తనను దూరం చేస్తూ, మాట్లాడటం లేదని, తనను పెళ్లి చేసుకుంటుందో లేదోనని, తనకు దక్కనిది, వేరే వారికి దక్కకూడదనే అక్కస్సుతోనే తేజస్వినిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. కేసును చేధించిన ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్‌ను, ఎస్ఐ తోట నాగరాజును, సత్తుపల్లి రూరల్ సీఐ రవికుమార్, సత్తుపల్లి సీఐ సురేష్లను అభినందిస్తున్నట్లు, వారికి రివార్డులు అందేలా చూస్తానన్నారు. -
భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు?
టేకులపల్లి: మండలంలోని తావుర్యాతండాలో మద్యం మత్తులో నిద్రిస్తున్న వ్యక్తిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన జరిగింది. వివాహేతర సంబంధం వల్లనే హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తావుర్యా తండాకు చెందిన దారావత్ నందు (25)కి అదే గ్రామానికి చెందిన సుప్రియతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సిద్దు (3), అజయ్ (ఒకటిన్నర) ఉన్నారు. నందు కొత్తగూడెంలోని ఓ షాపులో పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. సుప్రియ కొత్తగూడెంలో టైలరింగ్ నేర్చుకునేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అనుమానించిన భర్త నందు భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితమే ఇంట్లో భర్తతో గొడవపెట్టుకుని సుప్రియ పుట్టింటికి వెళ్లింది. మృతుడి తల్లి లక్ష్మి, అన్న దేవా సుప్రియ పుట్టింటికి వెళ్లి నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించారు. గురువారం ఉదయం కొత్తగూడేనికి పనికి వెళ్లిన నందు రాత్రి 9 గంటల తరువాత ఇంటికొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించి నందు నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం సుప్రియ అన్న సుమన్ మృతుడి అన్న దేవాకు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తొంతుకు తీగతో నులిమి చనిపోయి ఉన్నాడు. గురువారం రాత్రి సుప్రియ ప్రియుడు కృష్ణ మరికొందరితో వచ్చి నిద్రిస్తున్న నందు గొంతు నులిమి హత్య చేసినట్లు చర్చించుకుంటున్నారు. తన కుమారుడిని సుప్రియ, ప్రియుడు కృష్ణ, మరి కొందరు కలిసి హత్య చేశారని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మడిపల్లి నాగరాజు, ఎస్ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మృతుడి భార్య సుప్రియ, ప్రియుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య
వేములపల్లి : మండలంలోని సల్కునూరు గ్రామంలో ఓ వ్యక్తి గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్కునూరు గ్రామానికి చెందిన తుపాకుల శ్రీను(42)కు కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల వరకు వీరి సంసారం సాఫీగా జరిగింది. అనంతరం తరచు ఇరువురి మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో భార్య తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ కూలి పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సమయంలో గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బండరాయి అరుగుపై నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు మెడపై మరణాయుధంతో పొడిచి చంపినట్లు తెలిపారు. గురువారం ఉదయం బండరాయి అరుగుపై రక్తపు మడుగులో మృతిచెందిన శ్రీనును గుర్తించిన స్థానికులు పోలీసులకు, వీఆర్ఓకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. సంఘటన స్థలాన్నిపరిశీలించిన పోలీసులు ఎస్ఐ, సీఐకు సమాచారం అందించగా సీఐ రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని జాగిలాలను తెప్పించి పరిశీలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అదేవిధంగా గ్రామస్తులు అతని తల్లి, తమ్ముడిని విచారించగా హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని తెలిపారు. వీఆర్ఓ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధీర్‌కుమార్ కేసు నమోదు చేసుకోగా సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను త్వరలో ఛేదిస్తామని పేర్కొన్నారు. -
వివాహిత హత్య.. భర్తే నిందితుడు
ధన్వాడ(నారాయణపేట): మండలంలోని కిష్టాపూర్ పంచాయతీలోని మూలతండాలో మంగళవారం ఉదయం అనిత(23) హత్యకు గురైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు... మూలతండాకు చెందిన బాల్యనాయక్‌కు అనితతో ఆరేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను నానమ్మ వద్ద ఉంచి వీరు బతుకుదెరువు కోసం పూణె వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. పిల్లలను చూసేందుకు నాలుగు రోజుల క్రితం తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో అనిత తన మేనల్లుడి(4)ని తీసుకొని పక్కనే ఉన్న తమ పొలంలో కంది కట్టెల కోసం వెళ్లింది. కొద్దిసేపటికే మేనల్లుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9గంటలైనా ఇంకా అనిత ఇంటికి రాకపోవడతో మరదలు వరసైన చిట్టెమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే అనిత మృతిచెందింది. స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. భార్యను కడతేర్చిన భర్త మృతదేహం వద్దకు చేరుకున్న ధన్వాడ ఇన్చార్జ్ ఎస్ఐ జానకిరాంరెడ్డి, అనిత మృతి విషయమై ఆమె భర్త బాల్యనాయక్ను అడిగారు. పొంతన లేకుండా మాట్లాడడంతో అనుమానం వచ్చి, విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య పూణెలో మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతోందని తెలిపాడు. అందుకే చంపానని విచారణలో వెల్లడించాడు. కర్చిఫ్ గొంతుకు బిగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తండాకు వెళ్లిపోయాడని ఎస్ఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
వెంటాడి.. వేటాడి!
మరికల్ / మహబూబ్‌నగర్ క్రైం : పాలమూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయా.. ఇటీవల, తాజాగా జరిగిన సంఘటనలను బట్టి చూస్తే నిజమేననిపిస్తోంది. బుధవారం మరికల్ సమీపంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నిరోజులుగా ప్రశాంతంగా ఉంటున్న పాలమూరు జిల్లాలో వేట కొడవళ్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా భూ తగాదాలు, పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి జరగడం సంచలనం రేకెత్తించింది. పక్కా ప్లాన్‌తో దాడి నారాయణపేట మండలం అభంగాపూర్‌కు చెందిన ఆశప్ప అలియాస్ అశోక్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం స్వగ్రామం నుంచి నారాయణపేటకు వచ్చాడు. అక్కడి నుంచి తన కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే అతని కదలికలను గమనిస్తూ వెంటాడిన దుండగులు సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో కారు మరికల్ బీసీ కాలనీ వద్దకు రాగానే అడ్డగించారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆశప్పను వెంట తెచ్చుకున్న వేట కొడవలితో తలపై నరికారు. అనంతరం కత్తిని అక్కడే పడేసి పారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సంఘటన గురించి వెంటనే ఎవరికీ తెలియరాలేదు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆశప్ప తువాల చుట్టుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐ ఇఫ్తెఖార్ అహ్మద్, ఎస్ఐ జానాకీరాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తంతో నిండిన ఆశప్పను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలే కారణం : డీఎస్పీ సంఘటన గురించి ఆరా తీసిన నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పాత కక్షల కారణంగా దాడి జరిగిందని, ఆశప్ప బతికే ఉండటంతో మళ్లీ దాడి అవకాశం ఉందని తెలిపారు. సంఘటన పునరావృతమై మరిన్ని దాడులు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులకు, పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా ఆశప్పపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. భూ సెటిల్మెంట్లు, పంచాయతీలు, పైరవీలు చేస్తుండేవాడని సమాచారం. ఈ క్రమంలో గతంలో జరిగిన పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ ముఠా సభ్యులు వెంటాడి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు గాయపడిన ఆశప్పను పోలీసులు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు చికిత్సలు అందించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. -
డిగ్రీ విద్యార్థి వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి..
తిరుమలాయపాలెం: వివాహేతర సంబంధానికి యత్నించిన ఓ యువకుడు... ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని బాలాజీనగర్ తండా పరిధిలోని రమణాతండాలో గురువారం సాయంత్రం ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ గ్రామానికి చెందిన నూనావత్ కస్నా-సుహాలీ దంపతుల కుమారుడు హరీష్(19), డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి. ఇదే తండాకు చెందిన మాలోతు చంటి భార్య సునితతో హరీష్ గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. హరీష్ పద్ధతి మారకపోవడంతో అతడిపై చంటి కోపంతో ఉన్నాడు. చంటి భార్య సునిత, తమ పంట భూమిలో పత్తి తీసేందుకు గురువారం వెళ్లింది. సాయంత్రం వేళ, హరీష్ కూడా ఆమె చేను వద్దకు వెళ్లాడు. దీనిని చంటి గమనించాడు. హరీష్‌ను చూడగానే ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగాడు. భయంతో పారిపోతున్న హరీష్‌ను, సమీపంలోగల అడవి వరకు వెంబడించి తలపై బండ రాళ్లతో కొట్టాడు. తీవ్ర గాయాలతో హరీష్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఆ తరువాత, తన భార్యతో కలిసి మోటార్ సైకిల్‌పై రమణాతండాలోకి చంటి వచ్చాడు. హరీష్‌ను తానే కొట్టి చంపినట్టు స్థానికులతో చెప్పి పరారయ్యాడు. ఇతడు, స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. హత్యాస్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్, కూసుమంచి సీఐ మురళి, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. హరీష్ మృతదేహాన్ని తండా యువకుల సహాయంతో గ్రామానికి తీసుకొచ్చారు. పోస్టుమార్టం కోసం పోలీస్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండాలో ఉద్రిక్తత హరీష్ హత్యతో ఆ తండాలో ఉద్రిక్తత నెలకొంది. చంటిని తమకు అప్పగించాలంటూ స్థానికులు కొందరు పోలీస్ వాహనాన్ని అడ్డగించారు. వారికి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి నచ్చచెప్పి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి దారుణహత్య
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో బుధవారం అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. గ్రామానికి చెందిన పండుగ లచ్చవ్వ(75)ను గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం... పండుగ లచ్చవ్వ ముగ్గురు కొడుకులు, ఇద్ద రు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు అ య్యాయి. పెద్దకొడుకు చంద్రయ్య వేములవాడలో, రెండో కొడుకు గోపాల్ గల్ఫ్ వెళ్లాడు. చిన్న కొడుకు లచ్చయ్య, తల్లి ఒక్కచోట ఉంటున్నారు. కాగా చిన్నకొడుకు కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. చిన్నకోడలు.. ల చ్చవ్వ పక్కపక్క ఇండ్లలో ఉంటున్నారు. బుధవారం రాత్రి లచ్చవ్వ నిద్రలోకి వెళ్లింది. అర్ధరాత్రి దాటా క గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మొదట కోడలు ఉంటున్న ఇంటికి గడియపెట్టారు. లచ్చవ్వ నిద్రిస్తున్న గదితలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. గుర్తుతెలియని ఆయుధంతో మొహంపై గట్టిగా మోదారు. కేకలు వినిపించిన లచ్చవ్వ చిన్నకోడలు చుట్టుపక్కలవారిని పిలిచిం ది. వేములవాడలో ఉంటున్న తనబావ చంద్రయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి లచ్చవ్వ చనిపోయింది. దుండగులు పారిపోయారు.పోలీసులు గురువారం ఉదయం డాగ్‌స్క్వాడ్‌తో ఇంటి పరిసరాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి ఎస్పీ సింధుశర్మ హత్య జరిగిన కోణాన్ని తెలుసుకున్నారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ వెంకటస్వామి ఉన్నారు. లచ్చవ్వ పెద్దకొడుకు చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య
చండ్రుగొండ: మండలంలోని దామరచర్లలో ఓ యువకుడిని దుండగులు చంపి, గ్రామ శివారులోని పంట చేల మధ్యలో పడేశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు... దామరచర్ల గ్రామ యువకుడు జోగు వెంకటకృష్ణ(22), సోమవారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజున (మంగళవారం) ఉదయం, గ్రామ శివారులోని రామక్కబంజర్ వెళ్ల మార్గంలోగల పంట చేల వద్ద శవమై కనిపించాడు. అతడి శరీరంపై బలమైన గాయాలున్నా యి. ముఖ భాగమంతా రక్తస్రావమైంది. అతడి తండ్రి బీరయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య స్థలాన్ని అన్నపురెడ్డిపల్లి ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీరాములు శ్రీను, ట్రైనీ ఎస్ఐ కె.శ్రీధర్, ఏఎస్ఐ రాంబాబు పరిశీలించారు. గ్రామంలో విచారించారు. వివాహేతర సంబంధమే కారణమా...? దామరచర్లకు చెందిన బీరయ్య, సరస్వతి దంపతుల కుమారుడైన వెంకటకృష్ణ, కొత్తగూడెం మండలంలోని సింగరేణి బొగ్గు బాయిలో ఔట్‌సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటి నుంచి వెళ్లొస్తున్నాడు. దామరచర్లకే చెందిన వివాహితతో ఇతడికి వివాహేతర సంబంధం ఉన్నదన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మంలో హమాలీగా పని చేస్తున్న ఆ వివాహిత సోదరుడు, గతంలోనే వెంకటకృష్ణను మందిలించినట్టు సమాచారం. ఆ వివాహిత కూడా మూడు నెలల క్రితం వెంకటకృష్ణపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, గ్రామ–కుల పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పారని సమాచారం. ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగిందని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. మూడు రోజుల క్రితం ఖమ్మం నుంచి గ్రామానికి ఆమె సోదరుడు వచ్చాడని, వెంకటకృష్ణ హత్య తరువాత నుంచి అతడు కనిపించడం లేదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ తర్వాత..
కమలాపూర్(హుజూరాబాద్): గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ దుస్తులు విక్రయించి జీవించే చిరు వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేసి చెరువు తూముపై పడేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యా ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన బైరి రాజనర్సు (53) గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి దస్తులు విక్రయిస్తుండగా, ఆయన భార్య చంద్రకళ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు రాజేష్, దినేష్ ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో రాజనర్సు వరంగల్‌కు వెళ్లి తన వ్యాపారానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. తాను కొనుగోలు చేసుకొచ్చిన దుస్తులు ఇంట్లో పెట్టి బయటకు వెళ్తానని చెప్పిన రాజనర్సు ఎంతకు ఇంటికి రాకపోవడంతో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా తాను వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ తర్వాత నుంచి రాజనర్సు ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బుధవారం ఉదయం కమలాపూర్ పెద్ద చెరువు కట్టపై ఒకరు హత్య చేయబడ్డారన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి రాజనర్సు శవమై కనిపించాడు. ఘటన స్థలంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అత్యంత కిరాతకంగా.. గుర్తు తెలియని దుండగులు రాజనర్సును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన దుండగులు రాజనర్సు తల నుదుటి భాగంపై గుర్తు తెలియని వస్తువుతో బలంగా కొట్టారు. దీంతో అతడి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత అతడిని కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి పెద్ద తూముపై నుంచి చెరువు లోపలి వైపు పడేయగా తూము లోపలి గచ్చుపై మెట్ల పక్కన పడి రాజనర్సు మృతి చెంది ఉన్నాడు. కాగా రాజనర్సు రాత్రి సమయంలో చెరువు పెద్ద తూము వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ందని, అతడిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ .. చెరువు కట్టపై రాజనర్సు హత్యకు గురయ్యాడన్న సమాచారం అందుకున్న కాజీపేట ఏసీపీ నర్సింగ్‌రావు, స్థానిక ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎస్సై సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి తనిఖీలు చేపట్టారు. రాజనర్సు భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
అందరు చూస్తుండగానే గొంతు కోసేశాడు
గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఆది వారం సాయంత్రం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు చూస్తుండగానే ఓ యు వకుడు వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన శివార్ల లింగయ్య(65) అనే వృ ద్ధుడు గ్రామ సెంటర్లో నడుచుకుంటూ వస్తున్నా డు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కొట్ర అనిల్ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనుమానంతో.. కోట్ర అనిల్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లింగయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానం అనిల్ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. గతంలో ఇదే విషయమై లింగయ్యపై దాడి చేయగా గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వివాదం అంతటిలో ముగిసింది. ఇటీవల అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. తన అనారోగ్యానికి లింగయ్య చేతబడే కారణమనే అనుమానంతో యువకుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. హతుడు లింగయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని మల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్‌లు పరిశీలించారు. నింది తుడు పరారీలో ఉన్నాడు. మండలంలో నాలుగో ఘటన ! గుర్రంపోడు మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27 మండలంలోని తెరాటిగూడెం గ్రామంలో చేతబడి నెపంతో గ్రామం నడిబొడ్డున ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తేనెపల్లిలోనే గ్రామంలో వృద్ధురాలు, తానేదార్పల్లి గ్రామంలో వృద్ధుడు హత్యకు గురయ్యారు. తాజాగా లిం గయ్య.. ఈ హత్యలన్నీ మంత్రాల నెపంతోనే జరిగినవే. బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లోనూ మంత్రాలు అనే మూఢనమ్మకాలతో దారుణాలు జరుగుతుండడం గమనార్హం. పోలీసులు కళా జాతా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో అవగాహక కల్పిస్తునే ఉన్నా గ్రామాల్లో మూఢనమ్మకాల జాడ్యం వీడడం లేదు. -
పిల్లలతో కలిసి భర్తను అంతమొందించిన భార్య
పొదిలి(ప్రకాశం): ఏళ్ల తరబడి భర్త పెడుతున్న చిత్రహింసలు, వేధింపులు తాళలేక ఓ భార్య తన పిల్లలతో కలిసి భర్తను కర్కశంగా అంతమొందించింది. ఈ సంఘటన పట్టణంలోని సీఐ కార్యాలయానికి కూతవేటు దూరం బుగ్గలం ట్యాంకు వద్ద ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లని ఆనందరావు (45), వసంత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆనందరావు చెక్క రిక్షా బాడుగలకు వెళ్తాడు . భార్య వసంత ఓ వైద్యశాలలో నర్సుగా పని చేస్తోంది. ఆనందరావు రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను ఆనందరావు హింసిస్తున్నాడు. ఎంత సర్ది చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. పిల్లల కోసం ఏళ్ల తరబడి ఆమె భర్త వేధింపులు భరించింది. ఇటీవల నుంచి భార్యతో పాటు పిల్లలను కూడా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆనందరావు ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. భార్య, పిల్లలు ఆనందరావును కర్రలు, రాళ్లతో కొట్టి విచక్షణా రహితంగా చంపారు. నీటి తొట్టిలో పడి చనిపోయాడని నమ్మించేందుకు మృతదేహాన్ని నీటి తొట్టిలో పడుకోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని వారు పరిశీలించారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అంకుల్.. మా నాన్నను వాడే చంపేశాడు..
‘‘అంకుల్.. మా నాన్నను చంపేశాడు. కిందపడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న మా నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదంకుల్...’’ ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. చిన్న రక్తపు చుక్కను చూస్తేనే పిల్లలు తట్టుకోలేరు. అలాంటిది, తన కన్నతండ్రి కొన ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుకోవడాన్ని చూసిన ఈ చిన్నారి ఎంతగానో వణికిపోయాడో.. చుట్టూ కళ్లప్పగించి చూస్తున్నజనాలలో నుంచి ఏ ఒక్కరూ వెంటనే ముందుకు రాకపోవడాన్ని చూసిన వాడి మనసు ఎంతగా గాయపడిందో... ఖమ్మంక్రైం: ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ఒకడు కత్తితో పొడిచి చంపాడు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకపల్లికి చెందిన కోదాటి ఉపేందర్(32). ఖమ్మంలోని రోటరీ నగర్‌లోగల పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య స్వాతి, ఇద్దరు చిన్నారులు తనీష్, త్రివేష్ ఉన్నారు. మేదర బజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో అతని అమ్మమ్మ దుర్గమ్మ నివసిస్తోంది. ఆ ప్రాంతంలోనే ఒకడున్నాడు. వాడి పేరు యర్రగాని శ్రీను. జులాయిగా తిరుగుతూ, అందరితో గొడవలు పడుతుంటాడు. దుర్గమ్మను అతడు తిట్టాడు. శనివారం ఇంటి వద్దనే ఉన్న తన మనవడైన ఉపేందర్‌తో ఆమె ఈ విషయం చెప్పింది. ఆమెను వెంటబెట్టుకుని, పక్క వీ«ధిలోనే ఉన్న యర్రగాని శ్రీను వద్దకు ఉపేందర్ వెళ్లాడు. తన అమ్మమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న శ్రీను, ఉపేందర్‌ను దుర్భాషలాడుతూ మీదకు వచ్చాడు. తన వద్దనున్న కత్తితో ఉపేందర్ గుండెల్లో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉపేందర్ కింద పడిపోయాడు. గుడ్లప్పగించి చూశారు... ఉపేందర్, యర్రగాని శ్రీను మధ్య గొడవ జరుగుతుండడంతో ఆ వీధిలోని జనం గుమిగూడారు. వారించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. చివరికి, కత్తితో పొడుస్తున్నప్పుడు కూడా అలాగే వింతగా, విభ్రాంతిగా చూస్తుండిపోయారు. అడ్డుకునేందుకుగానీ, కాపాడేందుకుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రక్తపు మడుగులో పడిపోయి, కొనఊపిరితో కొట్టుకుం టున్నప్పుడు కూడా అలా చూస్తున్నారేగానీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధపడలేదు. కొద్దిసేపటి తరువాత, కొందరు మహిళలు అడుగు ముందేకేశారు. అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. ఆ అంకుల్ చంపేశాడు... ఉపేందర్ పెద్ద కుమారుడైన చిన్నారి తనిష్, ఆస్పత్రిలో గుండె పగిలేలా రోదిస్తున్నాడు. ‘‘మా నాన్నను ఆ అంకుల్ చంపేశాడు. మా నాన్న ఇంకా రాలేదని వెళ్లాను. నాన్న పడిపోయాడు. రక్తం కారుతోంది. నాకు భయమేసింది. పరిగెత్తుకొంటూ మా అమ్మను తీసుకొచ్చాను...’’ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పిన విషయమిది. ఎలా బతకాలి...? ‘‘పొట్టకూటి కోసం... బతకటానికి ఖమ్మం వచ్చాం. మేమిప్పుడు ఎలా బతకాలి దేవుడా...?’’ అని, తన ఇద్దరు పిల్లలను పొదివి పట్టుకుని గుండె బాదుకుంటూ రోదిస్తోంది స్వాతి. ఆ ముగ్గరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. అక్కడి దృశ్యాలు.. చూపరులకు కంట తడి పెట్టించాయి. కేసు నమోదు ఉపేందర్‌ను చంపిన యర్రగాని శ్రీను, గతంలో ఇలాగే గొడవలు పడి.. కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లొచ్చాడని ఆ వీధిలోని కొందరు చెప్పారు. అతడు నిత్యం ఎవరో ఒకరితో గొడవపడుతూనే ఉంటాడని అన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి పోలీసులు తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. హత్య స్థలాన్ని సీఐ రమేష్ పరిశీలించారు. -
ప్రేమించలేదన్న కోపంతో నడిరోడ్డుపై యువతిని..
థానే : ప్రేమించలేదన్న ఆగ్రహంతో యువతిని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానేకు చెందిన ప్రాచీ జేడ్(20) అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ఆకాష్ పవార్(25) గతకొద్ది నెలలుగా ప్రేమించమని వెంటబడుతూ వేధిస్తున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోగా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పటంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆకాష్‌ను ఇకపై అలాచేయవద్దని మందలించి పంపేశారు. అయినా ఆకాష్ పద్దతిలో మార్పు రాకపోగా ఆమెపై ధ్వేషం పెంచుకున్నాడు. ఆమె తనను ప్రేమించటానికి ఒప్పుకోకపోతే హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం పక్కా ప్లాన్ ప్రకారం రెండు కత్తులను వెంటతీసుకొని వెళ్లి ఆమె ఇంటి దగ్గర వేచిచూశాడు. ఆమె ఓ పనిమీద స్కూటిపై బయటకు వెళుతున్న సమయంలో వెంబడించి ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్దకు రాగానే స్కూటిని ఆపాడు. ఆమెను తిడుతూ ప్రేమను అంగీకరించాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆమె బదులు చెప్పకపోవటంతో అందరూ చూస్తుండగానే వెంటతెచ్చుకున్న కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడి వారు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ శనివారం స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి...
కోసిగి (కర్నూలు): మండలంలోని అగసనూరు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయం అగసనూరు గ్రామానికి చెందిన వడ్డే చిన్నకర్రెప్ప పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో బావిలో వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తెలపడంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు.కోసిగి సీఐ దైవప్రసాద్, ఎస్ఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి షర్ట్ కాలర్‌పై జీఎల్ఎస్ఆర్– పీఎంఆర్ రోడ్డు పేరుతో లేబుల్ లభ్యమైంది. ఇది కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గిలకసూగురు(జీఎల్ఎస్ఆర్) గ్రామానికి చెందినది పోలీసులు గుర్తించారు. వెంటనే సదరు గ్రామంలో విచారించగా మృతుడు గ్రామానికి చెందిన బోయ మహాదేవ(28)గా తేలింది. మహాదేవ బుధవారం స్నేహితులతో కలిసి మాధవరం వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య నరసమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్య చేసి బావిలో పడేసి.. బావి పరిసరాల్లో రక్తపు మరకలు, బండరాయికి రక్తం అంటి ఉండడం , వ్యక్తిని లాకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీనికి తోడు మృతుడికి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో మొదట బండరాయితో మోది హత్య చేసిన తర్వాత బావిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం
తోటపల్లిగూడూరు( నెల్లూరు): మండలంలోని కోడూరు బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బుధవారం బయటపడింది. ఎవరో చంపి మృతదేహాన్ని ఇసుకలో కప్పిపెట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడూరు బీచ్ కుడివైపున, ఏపీ టూరిజం రిసార్ట్స్ ఎదురుగా ఉన్న ఇసుక దిబ్బల్లో ఇసుకతో కప్పబడిన ఓ మృతదేహాన్ని బుధవారం స్థానిక మత్స్యకారులు గుర్తించారు. వారి సమాచారంతో నెల్లూరు రూరల్ డీఎస్సీ రాఘవరెడ్డి, ఎస్సై శివకృష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొండం మొత్తం ఇసుకలో కప్పబడి తల మాత్రమే పైకి కనిపిస్తున్న మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది వెలికితీశారు. సుమారు పది రోజుల క్రితం యువకుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి తల పూర్తిగా కుళ్లిపోయి ఉండగా తల వెనుకభాగాన గట్టి దెబ్బ ఉన్నట్టు గుర్తించారు. యువకుడు బ్లూ జీన్స్ ప్యాంట్, నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడు. అలాగే చేతి వేలికి లవ్ గుర్తు రింగ్ ఉంది. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
డేట్‌కు వెళ్లి హత్యకు గురైన భారత విద్యార్థి
మెల్బోర్న్ : డేటింగ్ సైట్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 25 ఏళ్ల మాలిన్ రాథోడ్ ఆస్ట్రేలియాలో అకౌంట్స్ విద్యను అభ్యసిస్తున్నాడు. మెల్బోర్న్లోని మెల్బోర్న్లోని సన్బరీ సబర్బ్ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ రాథోడ్ తీవ్ర గాయాలతో ఆమె ఇంట్లో పడివున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాథోడ్ ప్రాణాలు విడిచాడు. సదరు అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరపర్చారు. జడ్జి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. రాథోడ్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
గడివేముల: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి చివరకు అత్తారింట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గడివేములలో చోటు చేసుకుంది. మృతురా లి తల్లి, పోలీసుల వివరాల మేరకు.. గడివేములకు చెందిన నారాయణమ్మ తన కూతురు శివలక్ష్మమ్మ(28)ను ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆమె చిన్నాయన కుమారుడు మౌలాలికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు రేణుక, ధరణి. అయితే మంగ సంతానం లేదని మౌలాలి తరుచుగా బాధపడేవాడు. దీనికితోడు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం సూటిపోటి మాటలతో ఆమెను వేధించేవాడు. ఇటీవలే వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. ఓర్వకల్లు పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం ఐదారు రోజుల క్రితం శివలక్ష్మమ్మ గడివేములలోని పుట్టింటికి వచ్చింది. శనివారం రాత్రి భర్త మౌలాలి కూడా గడివేముల వచ్చాడు. తెల్లవారుజాము సమయంలో అత్తారింట్లోనే భార్యను చంపి పరారయ్యాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, గడివేముల ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధమే కారణం...
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భర్త రమేశ్ పథకం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రా మానికి చెందిన ఎండీ షఫీ(32)ని హత్యచేశాడు. మృతదేహాన్ని మండలంలో తొగర్రాయి మానేరువాగు నుంచి ఆదివారం వెలికితీశారు. మంగళ వారం రాత్రి నుంచి షఫీ కనిపించకపోవడంతో అతడి తండ్రి రహీమొద్దీన్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం వాగులోమృతదేహం కనిపించింది. ఆదివారం తహసీల్దార్ రజిత సమక్షంలో పోలీసులు శవాన్ని వెలికితీశారు. దుర్వాసన వస్తుండడంతో సంఘటన స్థలంలోనే మృతదేహానికి డాక్టర్లు హుమాయూన్, స్వాతి పో స్ట్‌మార్టం నిర్వహించారు. సంఘటన స్థలాన్ని పె ద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ హబీబ్‌ఖాన్, íసీఐ రాములు, ఎస్సై రాజేశ్‌లు పరిశీలించారు. వివాహేతర సంబంధమే కారణం... కనుకుల గ్రామానికి చెందిన కురిక్యాల రమేశ్ తన భార్యతో షఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో హత్య చేయడానికి ప్రణాళిక రూపొందిచాడు. రమేశ్ అతడి స్నేహితుడు శ్రీనివాస్, షఫీ మంగళవారం రాత్రి మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం మత్తులో ఉన్న షఫీని రమేశ్, శ్రీనివాస్‌లు తొగర్రాయి గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర గుట్ట మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కిందికి తోసేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో గొం తు నులిమి చంపేశారు. పక్కనే ఉన్న మానేరువా గులో పూడ్చివేశారు. రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వెంటాడి.. కొడవళ్లతో నరికి
ఎమ్మిగనూరు : పట్టణంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గీతానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగు శ్రీనివాసులు కుమారుడు హరికుమార్ (24)ను గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి హతమార్చారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక గాంధీ నగర్‌లోని గోబీ సెంటర్ వద్ద ఉన్న హరిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో వెంబడించారు. ప్రాణ భయంతో ఆదోని బైపాస్ రోడ్డులోని సుబ్బాజి డాబాలో తలదాచుకునేందుకు వెళ్లగా.. కొడవళ్లతో నరికారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్, ఎమ్మిగనూరు, నందవరం ఎస్ఐలు హరిప్రసాద్, జగన్ మోహన్ యాదవ్‌లు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ బాలాజీకుమార్ ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగానే హరికుమార్ ఊపిరి వదిలాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న శ్రీనివాసులు దంపతులు ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్తనాదాలు చేశారు. ప్రేమ వ్యవహారమా.. లేదా ఇతర కారణాలతో హరి హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
గొడ్డలితో నరికి.. దొంగలపై నెట్టి..
పెద్దపల్లి : ‘రాత్రి నిద్రపోయిన సమయంలో ముగ్గురు దొంగలు వచ్చారు.. ఎవరని ప్రశ్నించా.. మాది రాఘవాపూర్ అని ఒకరు.. గౌరెడ్డిపేట అని మరొకరు.. ఇలా అంటూనే మా భర్తపై దాడి చేశారు.. అడ్డుకోబోయిన నా గొంతు పిసికేందుకు ప్రయత్నించారు. చివరికి గొడ్డలితో నరికి చంపి వెళ్లారు’.. కథ కుదరలేదు. పోలీసులకు అనుమానం కలిగింది. చనిపోయిన వ్యక్తి భార్యనే విచారించారు. ఇంతలో నిజం బయట పడింది. గ్రామస్తులు నివ్వెరపోయారు. ఈసంఘటన పెద్దపల్లి మండలం బందంపల్లి శివారులోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. కొక్కుల ఓదెలు (60) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు భార్య చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. రాజేశ్వరి ఉద్దేశపూర్వకంగా భర్తను వదిలించుకునేందుకు దారుణానికి ఒడిగట్టింది. ఇంటికి చుట్టాలు, బంధువులు ఎవరు వచ్చినా ఓదెలు దూషించేవాడని.. చివరికి కన్న కొడుకు, కోడలు, కూతురు, అల్లుడిని కూడా దూషించడంతో సహించలేక హతమార్చినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. గురువారం రాత్రి కుటుంబంలో గొడవ జరగడంతో ఇక ఓదెలును హతమార్చేందుకు పథకం పన్నిన రాజేశ్వరి శుక్రవారం వేకువజామున 3గంటల సమయంలో గొడ్డలితో నరికి హతమార్చినట్లు సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్ తెలిపారు. ఈ మేరకు రాజేశ్వరిపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. -
బండరాళ్లతో మోది దారుణ హత్య
సిరికొండ(బోథ్) : బండరాళ్లతో తలపై మోది ఓ గిరిజనుడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని సోన్‌పెల్లి శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాంజీగూడ గ్రామానికి చెందిన అర్క కమ్ము (48) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి రైతుబంధు డబ్బులు రూ.10వేలు తీసుకొని సొంత పనుల నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్లాడు. గురువారం ఉదయం, సాయంత్రం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. నేను బయలు దేరాను.. నా వెంట ఒక స్నేహతుడు కూడా ఉన్నాడని భార్య హీరాబాయితో చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాత్రి మరోసారి కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. శుక్రవారం ఉదయం సోన్‌పెల్లి గ్రామశివారులో శవమై తేలాడు. అటుగా వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు సిరికొండ ఇన్చార్జి ఎస్సై రాముగౌడ్, నేరడిగొండ ఎస్సై వెంకన్నతోపాటుగా పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొదట డబ్బుల కోసమే ఎవరో కమ్మును కొట్టి చంపారని నిర్ధారణకు వచ్చారు. కమ్ము షర్టు, ధోతిని విప్పి చూడగా రూ.8వేలు లభించాయి. ఇది డబ్బుల కోసం అయి ఉండదని, ఎవరో కక్షపూరితంగా హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అక్కడికి చేరుకున్నా రు. శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కమ్ము సెల్‌ఫోన్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి రాంజీగూడకు చెందిన ఆదివాసీ గిరిజనుడు అర్క కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, హంతకులను పట్టుకోవాలని ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా అధ్యక్షుడు జలైజాకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతానికి వారు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ తరుణంలో ఓ ఆదివాసీ గిరిజనుడు హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హంతకులను పట్టుకుంటాం.. కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి హంతకులను వెంటనే పట్టుకుంటామని ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతాన్ని యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కమ్ము హత్యకు కారణాలను, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో విచారణ జరిపిస్తున్నామని, ముందుగా ఇంటి నుంచి కమ్ము ఎవరితో ఎక్కడికి వెళ్లాడు..ఎవరితో తిరిగాడనే దానిపై విచారణ జరుపుతున్నాన్నారు. ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.