MVS Nagi Reddy
-
‘చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, కరువు కవల పిల్లలని ప్రజలు చెబుతారన్నారు. బాబు పాలనలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో కూడా అంతకుమించి గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని నాగిరెడ్డి అన్నారు. ఆహార ధాన్యాలు, పండ్లు ఉత్పత్తి భారీగా పెరిగింది జగన్ పాలనలోనే. భూగర్భ జలాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్టులన్నీ ప్రతి ఏటా నిండిపోయాయి. గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన పరిస్థితులు జగన్ పాలనలో ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరవు, కాటకాలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన మనుషులు వేల కోట్లు సంపాదిస్తారు. జగన్ సీఎంగా ఉంటే అన్ని వర్గాలూ బాగుపడతాయని నాగిరెడ్డి అన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
సీఎం జగన్ పాలనలో వలసల్లేవు
ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసమే రాష్ట్ర ప్రజలు బయటకు వెళుతున్నారు తప్ప, బతకడానికి పనుల కోసం వలసలు వెళ్లేవారు లేరని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలంలోని రాముడుపాళెం వచ్చారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బెంగళూరు, కేరళ, చెన్నై వంటి ప్రాంతాలకు దినసరి కార్మికులుగా వలసలు పోయారని వాపోయారు. జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 38 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారన్నారు. సీఎం చెప్పిన విధంగా ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలను నెరవేరుస్తున్నారన్నారు. రైతాంగానికి మరింత పెద్ద పీట వేశారని చెప్పారు. ప్రతి ఏటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, పునర్ నిర్మా ణం చేస్తున్నారన్నారు. గతంలో ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.2లకు ఇవ్వాలని అప్పటి ఎంపీ రాజమోహన్‌రెడ్డితో కలిసి మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో వినతిపత్రం అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ను రూ.1.50లకే ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. మూడేళ్లలో ఆక్వా రంగానికి రూ.2,400 కోట్ల ఇచ్చారన్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు సుమారు రూ.6.50 ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగనన్న కాలనీల్లో 30 లక్షల నివాసాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఎలాంటి అసమానతలకు తావులేకుండా చేశారని నాగిరెడ్డి కొనియాడారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కైలా సం ఆదిశేషారెడ్డి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, పెనుబల్లి హనుమంతరావు నాయుడు, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, షబ్బీర్, కైలాసం శ్రీనివాసులురెడ్డి, పంబాల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే
సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఎప్పుడో రాజకీయ హాలిడే ఇచ్చారని, అటువంటి వారు క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని రెచ్చగొడితే, వారి మాటలను ఎవరు విశ్వసిస్తారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అధికారంలో ఉంటే పసుపు పచ్చ కండువాలు, అధికారం పోయాక ఆకుపచ్చ కండువాలు వేసుకుని మోసంచేసే నేతలను ఎవరూ నమ్మరన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే వైఎస్సార్ వారసుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ, రైతు పక్షపాతిగా పరిపాలన చేస్తుంటే, అదిచూసి ఓర్వలేకే క్రాప్ హాలిడేల పేరుతో వారు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఆఖరికి రైతులను కూడా బాబు, పవన్‌లు స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదన్నారు. గత టీడీపీ పాలనలో ఇదే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, నిరంతరాయంగా సెక్షన్–30 అమలుచేసి, కేసులు పెడతామని రైతు సంఘాల నేతలను బెదిరించి, రైతులను అణచివేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. అదే ఈ ప్రభుత్వంలో అక్కడి రైతులకు ఏమైనా సమస్యలుంటే, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారని నాగిరెడ్డి తెలిపారు. కానీ, 2014–19 మధ్య చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. రైతులకిచ్చిన హామీలన్నీ గాలికి.. అప్పట్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన పుస్తెలను ఇంటికే తెచ్చిస్తానని.. పగటిపూటే తొమ్మది గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తానని.. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని.. మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేస్తానని చంద్రబాబు చెప్పారని నాగిరెడ్డి వివరించారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టులు వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు–నగరి పోలవరం సహా అన్నింటినీ 2018 నాటికి పూర్తిచేసి, రాయలసీమకు నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తానన్నారని.. అంతేకాక, రెయిన్ గన్లతో కరువును జయించానని.. తుపానులను, సముద్రాన్ని నియంత్రించి నీటిని పారిస్తానని కూడా చెప్పారని నాగిరెడ్డి గుర్తుచేశారు. ఇక రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, రకరకాల కోతలతో ఆ మొత్తాన్ని రూ.24 వేల కోట్లకు పరిమితం చేశారని, చివరికి అందులోనూ కోతవేశారని ఎద్దేవా చేశారు. ఆఖరి రెండు ప్రీమియంలను రైతులకు అసలు చెల్లించలేదని నాగిరెడ్డి మండిపడ్డారు. బాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయన అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయని బాబును పవన్ ఏనాడైనా అడిగారా అని నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక, 14 నెలలపాటు కోవిడ్ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా, రైతులను అన్నివిధాలా ఆదుకున్నారని.. ప్రజలకు మంచి చేయటానికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదని.. చిత్తశుద్ధని అన్నారు. ఇది సీఎం జగన్ నిరూపించారని ఆయన చెప్పారు. చెప్పిన దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఎంతో చేస్తున్నారంటూ ఆయా కార్యక్రమాల వివరాలను నాగిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు కూడా పాల్గొన్నారు. -
టీడీపీ అధికారంలో ఉంటే ఆ దరిద్రం తప్పదు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
వెదురు.. రాబడికి ఉండదు బెదురు
సాక్షి, అమరావతి: వెదురు.. సహజసిద్ధమైన ప్రకృతి వనరు. పేదవాడి కలపగా, పచ్చబంగారంగా పిలుచుకునే సిరుల పంట. ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సత్తా దీని సొంతం. ప్రస్తుతం అటవీ ప్రాంతానికే పరిమితమైన వెదురు పంటను మైదాన ప్రాంతాల్లోనూ సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 70 ఏళ్ల వరకు దిగుబడి వెదురు అన్ని నేలలకు అనువైనది. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఒకసారి నాటితే 70 ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. రకాలను బట్టి నాటిన మూడు, నాలుగేళ్ల నుంచి ఏటా 25–30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. తొలి ఏడాది ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ తర్వాత ఏటా ఎకరాకు రూ.10 వేల ఖర్చు చేస్తే చాలు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. వెదురులో 140కు పైగా రకాలున్నప్పటికీ మన ప్రాంతానికి అనువైనవి, మార్కెట్లో డిమాండ్ ఉన్నవి 14 రకాలే. వెదురు సాగును ప్రోత్సహిస్తే భూమి సారవంతమవుతుంది. సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. లంక, బీడు భూములతో పాటు పొలం గట్లు, పండ్ల తోటల చుట్టూ కంచె రూపంలో సాగు చేస్తే పంటలకు రక్షణతో పాటు రాబడికి ఢోకా ఉండదు. యాక్షన్ ప్లాన్ ఇలా.. అటవీ శాఖ అధీనంలో ఉండే వెదురు మిషన్‌ను ప్రభుత్వం ఇటీవలే ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, అటవీ, పర్యావరణ, పరిశ్రమల విభాగాల కార్యదర్శులు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. వెదురు కార్పొరేషన్ చైర్మన్, వెదురు సాగుచేసే రైతులను కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆర్బీకేల ద్వారా జిల్లాల వారీగా వెదురు సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. కనీసం మూడేళ్ల పాటు సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. తొలి ఏడాది 500 హెక్టార్లు ఆత ర్వాత ఏటా 1,500 నుంచి 2వేల హెక్టార్ల చొప్పున విస్తరించాలని సంకల్పించారు. సబ్సిడీ ఇలా.. నాటిన తర్వాత ఒక్కో మొక్కకు మూడేళ్లపాటు రూ.240 వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం, ప్రభుత్వ భూముల్లో నాటితే 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తంలో తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం చొప్పున అందిస్తారు. పంట పొలాలు, పండ్ల తోటలు, ఆక్వా చెరువుల చుట్టూ కంచె రూపంలో వెదురు మొక్కలు వేసినా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన సబ్సిడీని అందిస్తారు. రూ.7.5 లక్షలతో చిన్న నర్సరీలు, రూ.15 లక్షలతో పెద్ద నర్సరీలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 40 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక ప్రాసెసింగ్ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఫర్నిచర్, వెదురు ఉప ఉత్పత్తులను అమ్ముకునే వారికి సైతం 50 శాతం సబ్సిడీతో చేయూత ఇస్తారు. ఇలా విత్తు నుంచి విక్రయం వరకు చేయూత అందించేలా రూ.10కోట్ల అంచనాతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎరువు అవసరం లేదు రెండేళ్ల క్రితం హోసూరు నుంచి టిష్యూకల్చర్ భీమ వెదురు మొక్కలు తెచ్చి పెదకూరపాడు మండలం గారపాడులోని రెండెకరాల్లో నాటాను. ఎరువు వేయలేదు. డ్రిప్‌తో నీరందిస్తున్నా. ప్రస్తుతం గెడలు 15 అడుగులు పెరిగాయి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. – వి.వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. జూలై నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. లంక భూముల కోతను వెదురు సాగుతో కట్టడి చేయొచ్చు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?
-
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు. కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?. రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?. దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. చదవండి: (రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింది. అక్టోబర్ నెల రైతుకు చాలా కీలకం. అందుకే మూడు విడతలుగా విభజించాము. రైతులకు మేలు చేయడం కోసం రూ.12,500 నుంచి 13,500 చేశారు. కౌలు రైతులకు కూడా ఈ భరోసా అందిస్తున్నాం. చెప్పిన మాట చెప్పినట్లుగా విడుదల చేస్తున్న ప్రభుత్వం మాది. ఇంత సంక్షోభంలోనూ అమలు చేయడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. -
తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరల్లింగ్ వైట్ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్‌పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను ఆదేశించారన్నారు. ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్‌తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
ఏపీ పథకాలు దేశంలోనే ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును రైతులు ఎన్నటికీ నమ్మరని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. పైగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువే అన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పండగ చేశారని చెప్పారు. ఆ మహానేత కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును రాజును చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట వేరుశనగ. 2014–15 నుండి ఇప్పటి దాకా ఈ పంట వివరాలు తెప్పించుకుని చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి. ► రాయలసీమలో కేవలం 3 శాసన సభ స్థానాలకే టీడీపీని ప్రజలు పరిమితం చేశాక కూడా, అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తుండటం దారుణం. ► కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని.. పగటి పూటే తొమ్మిది గంటలు నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఈ విషయాలు రైతులెవరూ మరచిపోరు. ► ఇలాంటి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రకటించిన సమయానికి పథకాలు అమలవుతున్నాయి. ► క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే, ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా.. కుల, మతాల పేరుతో, అబద్ధపు ప్రచారాలతో లబ్ధిపొందేందుకు యత్నిస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడటం దేశంలో ఇదే ప్రథమం. -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
-
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది రైతు ప్రభుత్వమని, నవరత్నాల్లో కూడా మొదటిగా రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చినట్లు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటిభారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ రైతు విభాగం మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తోందని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఏదైతే కేంద్రాన్ని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారో వాటిని మన రాష్ట్రంలో పరిష్కరించామని వెల్లడించారు. రేపటి బంద్ వల్ల రైతుకు న్యాయం జరగాలని కోరుతూ.. రైతులపై, రైతుల సంఘాలపై గౌరవంతో ఈ బంద్ కి సంఘీభావం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. చదవండి: Chandra Babu Naidu బాబోయ్.. మీకో దండం! -
మీ హయాంలో ఏటా కరువే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘రైతు కోసం...’ అని పిలుపునివ్వడం ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద జోక్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. ఆయన పదవి నుంచి దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, వరుసగా ఐదేళ్లూ కరువు మండలాలను ప్రకటించడమే ఆ నిర్వాకాలకు నిదర్శనమన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, నష్టపరిహారం ఇవ్వాలని నాడు దివంగత వైఎస్సార్ కోరితే దానివల్ల మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్సార్ ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతు కోసం.. ఏం చేశావ్ బాబూ? రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క కరువు మండలం కూడా లేనందుకు, రైతులు బాగున్నందుకు చంద్రబాబు రోడ్డెక్కుతున్నారా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. 2014లో రాష్ట్రంలో 238 కరువు మండలాలు ఉన్నట్లు గత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఆ తరువాత కూడా వరుసగా నాలుగేళ్లు కరువు మండలాలను ప్రకటించారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు దండగని, పావలా వడ్డీ కూడా రాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు అధికారంలో కొనసాగి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా నిర్లిప్తంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. -
‘రైతుల కోసం చంద్రబాబు ఆందోళన చేయడం హాస్యాస్పదం’
సాక్షి, తాడేపల్లి: రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమి లేదన్నారు. గిట్టుబలు ధరలు లభించక రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2004కి ముందు రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. చదవండి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ఆత్మహత్యలు చేసిన వారికి పరిహారం ఇవ్వాలంటే అలాఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారన్న వ్యక్తి చంద్రబాబని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, ఎన్నికలొస్తే ఆయనకు మళ్లీ రైతులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు రైతు కోసం అని పిలుపునిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో ఏటా అనేక కరువు మండలాలను ప్రకటించారని, ఈ రెండున్నరేళ్లలో ఒక్క కరువు మండలం లేదని చెప్పారు. -
‘రైతుకోసం’ మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
సాక్షి, అమరావతి: రైతు పేరెత్తే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. వ్యవసాయం దండగ అంటూ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువునా ముంచేసి ఇప్పుడు రైతుల కోసం అంటూ కపటప్రేమ చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం వంటి వివిధ రకాల హామీలను ఇచ్చిన చంద్రబాబు.. వాటిలో ఒక్కటైనా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల మూలంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ రైతులు, పేదలు సహా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా దేశంలో సంపన్నమైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక రైతులకు రూ.83 వేల కోట్ల లబ్ధి చేకూర్చారని, పోలవరంతో సహా ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గత ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.17,030 కోట్లు అన్నదాతలకు ఇచ్చిందన్నారు. 18.7 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 9గంటల పగటి ఉచిత విద్యుత్‌కోసం రూ.8,353 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునికీకరణకు రూ.1,700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కమ్‌లకు రూ.20 వేల కోట్ల బకాయి ఉండగా ఇందులో రూ.8,750 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలేన న్నారు. -
మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం
తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రైతుకూ, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రోగికీ, మా పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా తల్లితండ్రులకూ, తలెత్తుకుని నడిచే సాధికారత మహిళలకూ, శేషజీవితానికి దిగుల్లేదనే భరోసా వృద్ధులకూ కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంతో బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. రెండవ హరిత విప్లవాన్ని కలగన్నారు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన సాగించారు వైఎస్. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయినా ప్రజా సంక్షేమం కోసం ఎవరూ చేయలేని పనులు చేశారు. రాజకీయ నాయకుడిగా తొలి రోజులలోనే అసెంబ్లీలో విస్పష్టంగా సాగునీటి అవసరం గురించి మాట్లాడారు. ‘నేను యువకుడిగా కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కాలువలలో పారుతున్న నీటిని చూసి కరువు ప్రాంతాలకు కూడా ఇలా నీటిని తీసుకుని వెళ్ళాలనే సంకల్పం నాలో ఏర్పడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్ళివ్వమని నేను అడిగితే, దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజున నా సంకల్పం మరింత బలపడింది’ అన్నారు వైఎస్. ఆ సంకల్పబలం నుండి ఉద్భవించిందే మహత్తరమైన జలయజ్ఞం. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని ఆయన జలయజ్ఞం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. కానీ మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేర్లు పెట్టినా ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ–నీవా సుజల స్రవంతి, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. అలాగే ఆంధ్రరాష్ట్రానికి వరం, పోలవరం. ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన కృషి మరువలేనిది. దీనికోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో– అన్ని అనుమతులు సాధించి, ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పనులు పూర్తి చేయడం ఆయన కార్య శూరత్వానికి నిదర్శనం. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి. అయినా రైతులను ఆదుకోకపోగా ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు. కానీ వైఎస్ సీఎంగా మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితిలో వైద్యనాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ.1,800 కోట్ల సాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. పైగా నిర్వహణ భారం ప్రభుత్వానిదే. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు వేయించుకోవడమో, బావి తవ్వడమో చేస్తాడు. దానికోసం అప్పు తెచ్చుకుంటాడు. దానికి అవసరమైన పూర్తి బరువు అతడే మోస్తాడు. ఈ తర్కం ఆధారంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వైఎస్ సంకల్పించారు. కానీ అది జరిగేపని కాదని కొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఆయన పట్టు వీడలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. ఆ పథకం దేశానికే ఆదర్శమై ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన చైర్మన్‌గా, సోమయాజులు వైస్ చైర్మన్‌గా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. 2006లో దాని ప్రారంభోత్సవం సందర్భంగా– ‘నీటిపారుదల, గిట్టుబాటు వ్యవ సాయ మూలంగానే రెండవ హరిత విప్లవం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ. పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే రైతుకు ఆదాయం వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడానికి కారణం వైఎస్ ప్రోద్బలమే. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యకుండా సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందించారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు భూములు అమ్ముకోవలసిన అగత్యం పట్టలేదు. వారి ఆదాయాలు పెరిగాయి. దీని ఫలితంగా వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం కూడా పెరిగింది. ప్రకృతి ప్రేమికులు పాలకులుగా ఉంటే ప్రకృతిమాత సహకారం ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఆయన పాలన సాగించిన ఐదేళ్లపాటు సకాలంలో వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. సంక్షేమ రాజ్యం సాక్షాత్కరించింది. వ్యాసకర్త: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ -
రైతును రాజును చేసిన రాజన్న
ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్ జయంతి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్ చౌదరి, కె.హెచ్.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్. నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్. రైతు భరోసా –పీఎంకిసాన్గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్సార్ కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని వైఎస్సార్ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది. ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వ్యాసకర్త వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారు
-
అన్నదాతల ఆత్మబంధువు
రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాలు రూపొందించిన మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున వారి పుట్టిన రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి సకాలంలో వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల గాక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీ యంగా తగ్గిపోయి, ఆ పండిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 దివాళా తీసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన మొదటి కార్యక్రమం–ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీవో 421 విడుదల చేసి 2 లక్షల రూపాయల పరిహారం అందిం చడం. అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులకు కూడా అందేలా చర్య తీసు కోవడం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. వైద్యనా«థన్ కమిటీ సిఫా రసులు అమలు చేసి రూ.1,800 కోట్లు సహకార సంఘా లకు సహాయం అందించి, పూర్తిగా నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. కృష్ణదేవరాయల పాలన నుండి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరా లకు సాగునీరందిస్తానని జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇందులో ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతల అయితే, మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామా బాద్‌లోని అలీసాగర్. పోలవరం ప్రాజెక్టు కోసం గోదా వరి జిల్లావాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్ట డమే కాదు, జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్ప తనం ఆయనకే సాధ్యం. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజె క్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. అదే భూగర్భ జలాలకైతే రైతు సొంత ఖర్చుతో బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఆయన సంకల్ప బలం నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శమైంది. నేడు సుమారు 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఉచిత విద్యుత్‌కు ఇదే పునాది. వ్యవసాయం రాష్ట్రప్రభుత్వం అధీనంలో ఉన్నప్ప టికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన ఛైర్మన్‌గా, పెద్దలు సోమయాజులు వైస్ చైర్మన్‌గా 2006లో అగ్రికల్చర్ టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ శేఖరరెడ్డి పోద్బలంతోనే కేంద్రప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకా లంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతుసంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షలమంది రైతులకు ఐదువేల రూపాయల చొప్పున రూ.1,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. పావలా వడ్డీకే పంట రుణాలు, 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్య లేదు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన గావించిన ముఖ్యమంత్రి వై.ఎస్. రైతుల గుండెల్లో చిరం జీవిగా మిగిలిన– ఆ మహానాయకునికి మనమిచ్చే గౌరవం ఈ రైతు దినోత్సవం. వ్యాసకర్త: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
జగన్ సంకల్పానికి ప్రకృతి సహకరిస్తోంది..
సాక్షి, అమరావతి: బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. సరాసరి దిగుబడులు కూడా పెరిగాయని తెలిపారు. కరోనా సంక్షోభం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం లేనందున, మొత్తం బడ్జెట్ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,24,789.18 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. అందులో వ్యవసాయానికి 29,159.97 కోట్లు కేటాయించారన్నారు. రెండో సంవత్సరం కూడా రెండంకెల శాతం వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
‘లోకేష్ కూడా లేఖ రాయడం హాస్యాస్పదం’
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు తన కెబినెట్లో వ్యవసాయం గురించి చర్చించలేదని ఆరోపించారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. 2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోండి
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వైఎస్సార్ సీపీ, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ ఎక్కడైనా సహాయక కార్యక్రమాలు చేసిందా అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వ్యక్తులకు ఎవరికైనా కరోనా వస్తే ఒక్క రూపాయి కూడా వాళ్లు ఖర్చు చేయకుండా అంతా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందుతున్నాయని చెప్పారు. 11 లక్షల టన్నుల ప్రత్తి కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. లక్ష క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశామని, గత ప్రభుత్వం 3 వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ఏపీ నుంచి 35-40 కంటైనర్ల చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయని, మదనపల్లి టమాటా మార్కెట్లో ప్రభుత్వమే టమాటాను కొనుగోలు చేస్తోందని చెప్పారు. -
‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!’
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? ) టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు. -
‘ఆ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసింది’
సాక్షి, తాడేపల్లి: రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా అరటి, టమాటా వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోళ్లు చేస్తేందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని ఆయన వెల్లడించారు. (సీఎం జగన్‌కు కేంద్రమంత్రుల అభినందనలు) రవాణా నిబంధనలను సడలించాం.. పంటలు చేతికొచ్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడిందని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నామని.. ఉత్పత్తులకు ఇబ్బంది లేకుండా రవాణా నిబంధనలను సడలించామని చెప్పారు. రైతుబజార్లను సీఎం జగన్ ఎక్కడికక్కడ వికేంద్రీకరించారని.. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేశారని నాగిరెడ్డి వివరించారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రధానిని ఎందుకు డిమాండ్ చేయలేదు..? ‘‘కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగుతున్నారు. ప్రధానితో ఆయన మాట్లాడినప్పుడు .. దేశమంతా రూ.5 వేలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని’’ నాగిరెడ్డి ప్రశ్నించారు రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని.. ఆయన పబ్లిసిటీ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసిందన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉంటే.. ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు.