Nagasaurya
-
వైజాగ్ టు హైదరాబాద్
క్లాస్ హీరోగా కనిపించే నాగశౌర్య యాక్షన్ సీన్స్‌లో కూడా అదుర్స్ అనిపించగలరు. ‘ఛలో’ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి. ఈ కిక్‌ను మరింత అందించాలనే ఆలోచనలో ఉన్నారు నాగశౌర్య. అందుకు తగ్గట్లుగా తన తాజా చిత్రంలో రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్లోనే నాగశౌర్య కాలికి గాయమై షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కొంచెం విరామం తీసుకున్న తర్వాత షూట్లో పాల్గొన్నారు నాగశౌర్య. ఈ షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘కేజీఎఫ్’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు ఆథ్వర్యంలో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. -
నాకు స్ఫూర్తి ఆ ఇద్దరే – వెంకీ కుడుముల
‘‘నాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. సినిమాలపై ఆసక్తితో రచయిత బలభద్రపాత్రుని రమణి ద్వారా తేజ గారి వద్ద ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ తర్వాత ‘అ ఆ’ సినిమాకు త్రివిక్రమ్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ నాకు స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర ్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమాకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. నా వర్క్ నచ్చడంతో కథ రెడీ చేసుకురమ్మన్నారు శౌర్య. నేను వినిపించిన ‘ఛలో’ స్టోరీ ఆయనకు నచ్చడంతో సినిమా ప్రారంభమయ్యింది. నన్ను, నా కథను నమ్మి నాగశౌర్య పేరెంట్స్ ఈ సినిమా నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా చూశాక రష్మిక హీరోయిన్గా కరెక్ట్ అనిపించింది. నాగశౌర్యతో పాటు ఆయన పేరెంట్స్ కూడా ఓకే అనడంతో తనని తీసుకున్నాం. సంగీత దర్శకుడు సాగర్ మణిశర్మగారి అబ్బాయి అని అందరికీ తెలుసు. ‘జాదూగాడు’ టైమ్‌లో నాకు పరిచయమయ్యారు. ‘ఛలో’ సినిమాకు మంచి పాటలిచ్చారు. ఇప్పటి యువ దర్శకులపై త్రివిక్రమ్‌గారి ప్రభావం ఉంటుంది. అయితే ఆయన్ని అనుకరించకూడదు. సినిమా అవుట్‌పుట్ చూశాక టెన్షన్ లేదు. ‘ఛలో’ రిలీజ్ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభిస్తా’’ అన్నారు. -
సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నాం – నాగశౌర్య
‘‘సాయి శ్రీరామ్‌గారు ఇచ్చిన ధైర్యంతో మేం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. వెంకీ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నిర్మాతలు మా తల్లిదండ్రులే. వారి గురించి పెద్దగా మాట్లాడలేను. అయితే నిర్మాతలుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘ఛలో’ సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘ఛలో’. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాలోని రెండో పాటను సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బీఏ రాజు విడుదల చేశారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘అసోసియేట్ డైరెక్టర్ని అయిన నేను ‘ఛలో’ సినిమాతో డైరెక్టర్‌గా మారాను. ఈ కొత్త ఏడాదిలో మంచి పేరున్న డైరెక్టర్ అవుతాననే నమ్మకం ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కు మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న సినిమాని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రసాద్ మూల్పూరి. ‘‘కథ విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పా. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ రైట్స్‌తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైపోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సీనియర్ నరేశ్. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
హత్యకూ హోమానికి లింక్ ఏంటి?
గౌరవమే ఆస్తిగా భావించే కుటుంబం అది. కొత్తగా పెళ్లైన దంపతులు. అంతలోనే వాళ్లను ఓ మర్డర్ మిస్టరీ వెంటాడుతుంది. ఆపై హోమాలు. ఈ మర్డర్‌కి, హోమాలకీ సంబంధం ఏమిటి? ఈ పరిస్థితుల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడగలిగింది? అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు ‘కరు’ చిత్రబృందం. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళ, తెలుగులో రూపొందిన చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి బాగా నటించారు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ విజయ్ ఈజ్ రెడీ టు గివ్ బర్త్’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ప్రేమ్. -
తండ్రి మ్యూజిక్ బ్రహ్మ..కొడుకు మ్యూజిక్ ప్రిన్స్ – నాగశౌర్య
‘‘ఛలో’ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ చేసిన తొలి పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సాగర్ మహతి చక్కటి సంగీతం అందించారు. సాగర్ తండ్రి మణిశర్మగారు మ్యూజిక్ బ్రహ్మ అయితే, సాగర్‌కి మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెట్టాలనుకుంటున్నా’’ అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముప్పలూరి సమర్పణలో ఉషా ముప్పలూరి నిర్మిస్తున్న సినిమా ‘ఛలో’. ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి మా అమ్మ, నాన్నలే నిర్మాతలు. నాకు నచ్చిన స్క్రిప్ట్‌ను నమ్మి, వారు ఈ సినిమా చేస్తున్నారు. కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ రష్మిక మండన్నా చక్కగా నటించారు. సాయిశ్రీరామ్ ప్రతి సీన్‌ను అందంగా చూపించారు’’ అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు టైమ్‌లో నా కథ ఓకే చేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారు నిర్మాతలు. సినిమా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముప్పలూరి. -
నాలుగేళ్ల పాపకు తల్లి!
‘‘అప్పుడే అమ్మ పాత్రలా? ఏమంత వయసైపోయిందని?’’ అని అమ్మ పాత్రలకు అడిగినప్పుడు కొందరు హీరోయిన్లు అంటుంటారు. ఒకసారి అమ్మగా కనిపిస్తే.. ఆ తర్వాత అలాంటి పాత్రలకే ఫిక్స్ చేసేస్తారని భయం. కానీ, సాయి పల్లవికి అలాంటి భయాలేవీ లేవు. ‘ప్రేమమ్’, ‘ఫిదా’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారీ బ్యూటీ. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, తను చేసిన పాత్రల గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అందుకే అమ్మ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారు సాయిపల్లవి. తెలుగులో ‘కణం’, తమిళంలో ‘కురు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
రిజల్ట్ గురించి టెన్షన్ లేదు!
‘‘సినిమా రిజల్ట్ గురించి టెన్షన్ లేదు. కొత్త కథతో తీశాను. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు మహేశ్ సూరపనేని. ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజేశ్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. మహేశ్ సూరప నేని మాట్లాడుతూ – ‘‘ఇందులో నారా రోహిత్‌ది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. రాజకుమారిలాంటి అమ్మాయి లైఫ్‌లో ఈ అబ్బాయి ఎలా హీరోగా మారతాడు? అన్నది కథ. నాగశౌర్య, నందితలవి గెస్ట్ రోల్స్. అవసరాల శ్రీనివాసరావుది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక బిట్ పాటతో కలిపి ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వీటిలో హీరోయిన్ ఇంట్రో, టీజింగ్ సాంగ్‌కు ఇళయరాజాగారు స్వరాలందించారు. మిగిలినవి విశాల్ చంద్రశేఖర్ చేశారు’’ అన్నారు. ‘‘యూఎస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశాను. ఇండియా వచ్చాక ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, కోనాగారి దగ్గరా వర్క్ చేశాను. అశ్వనీదత్‌గారు నన్ను సపోర్ట్ చేశారు. రెండేళ్లుగా వైజయంతి మూవీస్ తో అటాచై యున్నాను. కొన్ని యాడ్స్ ఫిల్మ్స్ కూడా చేశాను’’ అన్నారు మహేశ్. -
స్క్రీన్ టెస్ట్
► లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో చిన్న పాత్ర పోషించిన నటుడు ఇప్పుడు టాలీవుడ్లో çసక్సెస్ఫుల్ హీరో అతనెవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) రాజ్‌తరుణ్ సి) విజయ్ దేవరకొండ డి) నాగశౌర్య ► చంద్రముఖి’ డైరెక్టర్ పి.వాసు ప్రముఖ మేకప్‌మేన్ కుమారుడు. ఆయన పేరేంటి? ఎ) మాధవరావు బి) పీతాంబరం సి) మేకప్ బాబు డి) మేకప్ శీను ► పధ్నాలుగేళ్లుగా సౌత్‌లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార మొదట ఏ హీరోతో జతకట్టారు? ఎ) మమ్ముట్టి బి) రజనీకాంత్సి) శరత్కుమార్డి) జయరామ్ ► పరుగు ఆపటం ఓ కళ..’ పేరుతో ఈ సినీ హీరో జీవిత చరిత్రను ఆకెళ్ల రాఘవేంద్ర రచించారు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) కృష్ణ బి) శోభన్బాబుసి) అక్కినేని నాగేశ్వరరావు డి) ఎస్వీ రంగారావు ► కృష్ణ నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమా 70 శాతం పూర్తయ్యాక ఆ దర్శకుడు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడా సినిమాని కృష్ణ, విజయనిర్మల పూర్తిచేశారు. 70 శాతం కంప్లీట్ చేసిన ఆ దర్శకుడెవరు? ఎ) ఆదుర్తి సుబ్బారావు బి) వి. రామచంద్రరావు సి) సాంబశివరావు డి) లక్ష్మిదీపక్ ► టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, కె.ఎస్. రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి శిష్యులు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) సాగర్ డి) ముత్యాల సుబ్బయ్య ► గాయని సునీత 800 పైచిలుకు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆమె డబ్బింగ్ ప్రస్థానం ఏ సినిమాతో మొదలైందో తెలుసా? ఎ) పెళ్లి బి) గులాబి సి) అనగనగా ఒకరోజుడి) పెళ్లి పందిరి ► ‘మిర్చి’ సినిమాలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట రాసింది రామజోగయ్యశాస్త్రి. మరి, పాడింది ఎవరు? ఎ) హరిహరన్ బి) శంకర్ మహదేవన్ సి) శ్రీరామచంద్రడి) కైలాష్ ఖేర్ ► దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. అదే రోజున ఓ ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు కూడా. అతనెవరో ఊహించండి.. ఎ) వేణుమాధవ్ బి) అలీ సి) బ్రహ్మానందం డి) జయప్రకాశ్‌రెడ్డి ► సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏ సంగీత దర్శకుని వద్ద శిష్యరికం చేశారు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) ఎమ్మెస్ విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ‘నాకు అదో తుత్తి’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్యనటుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన కామెడీతో మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఎవరు? ఎ) ఏవీఎస్ బి) కొండవలస సి) ధర్మవరపు సుబ్రహ్మణ్యం డి) ఎమ్మెస్ నారాయణ ► దాసరి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆ నటుడు ఆ తర్వాత పెద్ద రచయిత. ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా ద్వారా దర్శకుడు కాబోతున్నారు.. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) సురేందర్ రెడ్డి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీడి) కాశీ విశ్వనాథ్ ► భాష రాని కారణంగా మహేశ్‌బాబు సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ‘స్పైడర్’లో నటించే ఛాన్స్ కోల్పోయింది. ఆ అవకాశం ఎవరికి దక్కిందో ఈజీగానే చెప్పేస్తారు కదూ? ఎ) తమన్నా బి) తాప్సీ సి) పూజాహెగ్డే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు సాధిస్తున్న ఈ యువహీరో ఇద్దరు లేడీ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. అతడెవరు? ఎ) సిద్ధార్థ్ బి) నారా రోహిత్ సి) వరుణ్‌సందేశ్ డి) నాని ► ఏడుసార్లు నంది అవార్డు గెలుచుకున్న తెలుగు అగ్ర హీరో ఎవరో తెలుసా? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేష్ ► ఈ ఫొటోలోని బుడతణ్ణి గుర్తుపట్టారా? చిన్న క్లూ.. మీరు ‘గజిని’ కాదులెండి. ఎ) ధనుష్ బి) సూర్యసి) అజిత్ డి) శింబు ► హీరోలు గాల్లో పల్టీలు కొడుతూ ఫైట్ చేస్తుంటారు. థ్రిల్‌కి గురి చేసే ఈ ఫైట్ కంపోజ్ చేయడాన్ని టెక్నికల్‌గా ఏమంటారో తెలుసా? ఎ) వైర్ వర్క్ బి) రోప్ వర్క్ సి) స్ట్రింగ్ రిమూవల్డి) స్ట్రింగ్ ఫైట్ ► అల్లు అర్జున్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి చూద్దాం? ఎ) ఐయామ్ అల్లు బి) ఐయామ్ బన్నీ సి) అల్లు అర్జున్ డి) యువర్స్ బన్నీ ► ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మ కథ సి) తోడి కోడళ్లు డి) మూగ మనసులు ► మహేశ్‌బాబు ఈ సినిమాలో సుపారీ (డబ్బు) తీసుకుని, షూటర్‌గా చేస్తాడు. అదే సినిమా? ఎ) ఖలేజా బి) అతడు సి) బిజినెస్మేన్డి) పోకిరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) డి 4) బి5) బి 6) సి 7) డి 8) డి 9) బి10) డి 11) ఎ 12) సి 13) డి14) డి 15) డి 16) బి 17) సి18) సి 19) ఎ20) బి -
దీపావళికి భయపెట్టే ‘కణం’
ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద’ సినిమాలతో యువతలో మంచి పేరు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన హీరోయిన్ సాయిపల్లవి. వీళ్లిద్దరూ జంటగా నటించిన సినిమా ‘కణం’. విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘విభిన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్‌తో మా సంస్థ నిర్మిస్తున్న ‘2.0’ సిన్మాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ ‘కణం’కి పని చేశారు’’ అని లైకా సంస్థ తెలిపింది. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని సమాచారం. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్. -
నా స్వార్థంతో ఈ సినిమా చేశా
‘‘నేనిప్పటి వరకూ పలు వైవిధ్యమైన పాత్రలు చేశా. ‘కథలో రాజకుమారి’ కథ రాసిన విధానం కొత్తగా ఉంది. లైన్ వినగానే ఎగ్జయిట్ అయ్యా. పదిహేను నిమిషాల పాత్ర కోసం గడ్డం కూడా పెంచా’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య పాత్రల్లో మహేశ్ సూరపనేని దర్శకత్వంలో సౌందర్య నారా, ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘కథలో రాజకుమారి’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘నాగశౌర్య అడిగి మరీ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు. ఇళయరాజాగారు కొన్ని పాటలు కంపోజ్ చేశారు. విశాల్ కూడా మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు. ‘‘న్యూ ఏజ్ ఎమోషన్లో సాగే ప్రేమకథా చిత్రమిది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మాకు స్క్రిప్ట్ విషయంలో సపోర్ట్ చేశారు’’ అన్నారు దర్శకుడు మహేశ్. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘జ్యో అచ్యుతానంద’ తర్వాత నేను, రోహిత్‌గారు కలిసి నటిస్తే బావుంటుందని ఈ సినిమాలో నేను కూడా నటిస్తానని చెప్పా. నా స్వార్థం కోసం ఈ సినిమా చేశా. అవుట్‌పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యా’’ అన్నారు. -
కొత్త ప్రేమకథ
హీరో నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకీ కుడుముల డైరెక్షన్లో ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి ఓ చిత్రం నిర్మించనున్నారు. కన్నడ భామ రష్మిక మండన్న కథానాయిక. సాగర్ మహతి సంగీత దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత శంకర ప్రసాద్ తెలియజేస్తూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో సినిమా నిర్మించాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాం. త్రివిక్రమ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ చేసిన వెంకీ కుడుముల చెప్పిన కథ నచ్చింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త ప్రేమకథా చిత్రం ఇది. మా సంస్థలో తొలి సినిమా కాబట్టి రాజీపడకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 10న చిత్రాన్ని ఆరంభించాలను కుంటున్నాం’’ అని అన్నారు. ‘‘సినిమాలో నాగశౌర్య క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ చిత్రంలో హస్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్ర దర్శకుడు వెంకి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సాయి శ్రీరామ్. -
ఒకరు కాదు... అయిదుగురు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి హీరోలు వెనకాడడం లేదు. కానీ, ఇద్దరు మహా అయితే ముగ్గురు హీరోలు కలసి నటిస్తుంటారు. తాజాగా ఐదుగురు హీరోలతో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. తొలి చిత్రం ‘భలే మంచి రోజు’తో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందట. ఇప్పటికే నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్యలకు కథ వినిపించగా వారు ఓకే అన్నారనీ, మిగిలిన ఇద్దరు హీరోలను ఎంపిక చేసే పనిలో దర్శకుడున్నారని తెలుస్తోంది. ఐదుగురిలో ఒక పెద్ద వయస్సు ఉన్న హీరో కథకి అవసరమట. సో, ఆ హీరోని ఫైనలైజ్ చేసే పని మీద ఉన్నారట. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు భోగట్టా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
ఆ ముగ్గురితో మూడు సినిమాలు!
గోపీచంద్.. నితిన్.. నాగశౌర్య.. ఇప్పుడీ ముగ్గురు హీరోలతో విడి విడిగా మూడు సినిమాలు చేస్తున్నట్టు నిర్మాత కేకే రాధామోహన్ ప్రకటించారు. ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెలలోనే విడుదల కానుంది. జనవరిలో నాగశౌర్యతో సినిమా ప్రారంభిస్తారు. త్వరలో ఈ మూడు సినిమాల వివరాలను ప్రకటించనున్నారు. -
జ్యో... అచ్యుత... ఆనంద... జో...
నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్‌ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్‌లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా. సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్‌ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది. తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్‌లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది. ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్‌లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి. కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్‌లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్‌లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్‌లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్‌లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ -
రైటింగ్, టేకింగ్ కొత్తగా ఉంటాయి
‘‘అచ్యుత్, ఆనంద్.. అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్లయింది. వీరి జీవితాల్లోకి జ్యో అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదు’’ అన్నారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీమతి రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. అవసరాల మాట్లాడుతూ - ‘‘ఊహలు గుసగుసలాడే’ రొటీన్ చిత్రం. మళ్లీ అలాంటి చిత్రమే తీస్తే దర్శకుడిగా నాపై ఓ స్టాంప్ వేస్తారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. రైటింగ్, టేకింగ్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. అప్ కమింగ్ హీరోలు చాలామందికి ఈ కథ వినిపించా. ‘మల్టీస్టారర్ వద్దు, సోలో హీరో కథలుంటే చెప్పండి’ అన్నారు. రోహిత్ కథ వినగానే ఓకే చెప్పారు. స్క్రిప్ట్ దశలోనే శౌర్యను దృష్టిలో పెట్టుకున్నా. నాని చేసిన అతిథి పాత్ర ఏమిటనేది సస్పెన్స్. కల్యాణ్ రమణ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యింది. సాయి కొర్రపాటి గారితో రెండో చిత్రమిది. ఆయనతో మరో చిత్రం చేయాలనుకుంటున్నాను. మా వేవ్‌లెంగ్త్ అంత బాగా కుదిరింది. నా దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం చేయాలి. రెండు ఐడియాలున్నాయి. ప్రస్తుతం ‘హంటర్’ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాను. బోల్డ్ చిత్రమైనా, అందులో ఎమోషన్ నచ్చింది’’ అన్నారు. -
నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!
అప్పుడు రెజీనా వయసు 90. మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. దాంతో పాటు ఓ సినిమా చూడమని వాళ్లకు చెబుతారు. అదే ‘జ్యో అచ్యుతానంద’. ఆమె అంత బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రెజీనా చెప్పిన ముచ్చట్లు... ఈ చిత్రంలో నేను డెంటల్ డాక్టర్ని. నా పేరు ‘జో’. మీ పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఉండే అమ్మాయిలా ఉంటాను. ఈ మూవీలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు, బాధపడతారు, ఇష్టపడతారు, అసహ్యించుకుంటారు. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అవసరాలకు, సాయి కొర్రపాటిగారికి కృతజ్ఞతలు. మొన్నీ మధ్యే పాటలు విడుదలయ్యాయి. కల్యాణి రమణ (కల్యాణి మాలిక్) అద్భుతమైన పాటలిచ్చారు. నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాని మర్చిపోను. నా మనవళ్ళకు, మనవరాళ్లకు ‘జ్యో అచ్యుతానంద’ చూడమని చెప్తాను. అంతగా నా మనసుకు దగ్గరయిందీ కథ. ‘జో’గా నేను, అచ్యుత్‌గా నారా రోహిత్, ఆనంద్‌గా నాగశౌర్య నటించాం. ప్రధానంగా మా ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా? అని ఎదురు చూశా. షూటింగ్ పూర్తయ్యాక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా. నేనే ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మీకు, సాయిధరమ్ తేజ్‌కు బ్రేకప్ అయ్యిందా’ అని అడుగుతుంటారు. ‘‘మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాస్తారు. ఆ తర్వాత బ్రేకప్ అని రాస్తారు. కాసేపు రెజీనా పనైపోయింది అంటారు. ప్రస్తుతం తనకు సినిమాలు లేవు’’ అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రాసుకుంటారు. బాధగా ఉంటుంది. అయినా అందరికీ విడివిడిగా సమాధానం చెప్పలేను. చెప్పను కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘ఆంఖే-2’లో నటిస్తున్నా. అమితాబ్‌గారు, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అర్జున్ రాంపాల్.. ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మధ్య ఫోటోషూట్ జరిగింది. ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్‌లో నేను పాల్గొనలేదు. ఆ ఇమేజెస్ ఎప్పుడు బయటకు వస్తాయా? అని ఎదురుచూస్తున్నా. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో చేసిన ‘జ్యో అచ్యుతానంద’తో పాటు, ‘శంకర’ కూడా రిలీజుకు రెడీగా ఉంది. హీరోలకైతే ఆ స్టార్ ఈ స్టార్ అని బిరుదులుంటాయి... మరి అనుష్క, సమంత, రకుల్ వంటి హీరోయిన్లకు? మీరైతే ఎలాంటి బిరుదు ఇస్తారు? అనే ప్రశ్న రెజీనా ముందుంచితే - ‘‘సమంతకు సూపర్‌స్టార్, అనుష్కకు తలైవా (నాయకుడు), రకుల్‌కి జిమ్ స్టార్, రాశీఖన్నాకి క్యూట్ స్టార్, నిత్యామీనన్‌కు నేషనల్ స్టార్....నాకేమో ఫన్ స్టార్ అని ఇస్తాను’’ అని సరదాగా అన్నారు. - శివ మల్లాల -
ఒక మనసు కోసం?
మెగాబ్రదర్స్‌లో ఒక్కరైన నాగేంద్రబాబు కుమార్తె నీహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగశౌర్యతో ఆమె జతకట్టారు. మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మెగా హీరోల చేతుల మీదుగా ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వంటి విలువలను ఈ చిత్రంలో చూపించాం. నాగశౌర్య, నీహారిక నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి మనసుని ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ‘బేబీ షో’ వేడుక
ప్రముఖ హోమియో వైద్య సంస్థ ‘హోమియోకేర్ ఇంటర్నేషనల్’ సోమవారం హైదరాబాద్‌లో ‘బేబీ షో’ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటి మందికి పైగా జీవితాల్లో ఆరోగ్యం, ఆనందాలను నింపినందుకు ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో హోమియోకేర్ సంస్థ ‘1 క్రోర్ స్మైల్స్.. అండ్ స్టిల్ కౌంటింగ్’ పేరుతో ఒక అధికార లోగోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ సంతానలేమి లోపాలకు సంబంధించిన వైద్య చికిత్సలపై 30% డిస్కౌంట్‌ను ప్రకటించింది. చిత్రంలో లోగోను ఆవిష్కరిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, కథానాయకుడు నాగశౌర్య తదితరులు. -
కళ్యాణ వైభోగమే కథ చెప్పినప్పుడే ఈ రేంజ్ హిట్ ఊహించాను
‘‘సినిమా హిట్ అయితే ఆనందంగా ఉండాలి. కానీ, నాకు ఆనందంతో పాటు చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఇలాంటి విజయాలతో నాపై ఇంకా బాధ్యత పెరిగిందనిపిస్తోంది’’ అని హీరో నాగశౌర్య అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ ఈ నెల 4న విడుదలైంది. తాము ఊహించిన విధంగానే ఈ సినిమా ఘనవిజయం సాధించిందని నాగశౌర్య సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన మరిన్ని విశేషాలు... ♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమా కథ చెప్పినప్పుడే నేను ఈ రేంజ్ హిట్ ఊహించాను. కథలో ఉన్న కంటెంట్ అలాంటిది. నందినీ రెడ్డిగారు నాకు ఎంత బాగా చెప్పారో, అంతకన్నా పదిరెట్లు బాగా తీశారు. పబ్లిక్ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూశాను. ఆడియన్స్ ఈ సినిమాలోనికామెడీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ల రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ♦ షూటింగ్ సమయంలో ఓ రోజు నందినిగారిని ఏ టైటిల్ పెడుతున్నారని అడిగితే ‘కళ్యాణ వైభోగమే’ అని చెప్పారు. టైటిల్ వింటేనే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఈ సినిమాలో మాళవిక లాంటి డెడికేటెడ్ ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఓ మంచి అనుభూతి. ♦ ప్రేమ , పెళ్లి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పెళ్లికొడుకు గెటప్‌లో నన్ను చూసి చాలామంది రియల్ లైఫ్‌లో పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. కానీ, నా దృష్టిలో పెళ్లి అనేది పూర్వజన్మ సుకృతం. అదో ముఖ్యమైన ఘట్టం. ఒక అబ్బాయి, అమ్మాయి జీవితాలకు పెళ్లితోనే నిజమైన అర్థం వస్తుంది. నాకు గనక ఈ సినిమాలోలాగే ఎవరైనా అమ్మాయి నిజంగా నా మనసుకు నచ్చితే మా అమ్మకు పరిచయం చేస్తాను. కానీ, పెళ్లి మాత్రం అప్పుడే కాదు. ఇంకా రెండు, మూడేళ్లు ఆగమని చెబుతా. ♦ జనరల్‌గా ఏ సినిమా చేసినా హిట్టవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమా హిట్టయినందుకు నాకు ఆనందంగా ఉంది. అమ్మానాన్నల ఆనందానికి హద్దే లేదు. వాళ్లు ఈ సినిమా రిజల్ట్ గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం అమ్మానాన్న హైదరాబాద్‌లో లేరు. కానీ, ఇక్కడే ఉన్నట్లే ఉంది. ఎందుకంటే, సినిమా విజయాన్ని షేర్ చేసుకోవడానికి వాళ్లకి కనీసం పదిసార్లకు పైనే ఫోన్ చేసుంటా. ♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమాకు ముందు నా కెరీర్ కాస్త డౌన్ అయిన మాట నిజమే. అయినా ఒక్కోసారి మన లెక్కలు తప్పుతూ ఉంటాయి. అది సహజం. అంత మాత్రాన డీలా పడిపోతే ముందుకు సాగలేం. అందుకే, అలాంటివి ఎదురు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ♦ ఏ సినిమా అయినా ముందు నాకు కనెక్ట్ కావాలి. దర్శకుడు కథ చెప్పేటప్పుడే నేను నవ్వాలి, ఏడవాలి. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడే కథకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తా. అందుకే నా గత సినిమాల్లో నన్ను చూస్తే నేను కనబడను, నా పాత్ర మాత్రమే కనబడుతుంది. ♦ నేను హీరోగా, నాగబాబుగారి అమ్మాయి నిహారిక కథానాయికగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘ఒక్క మనసు’ సినిమా షూటింగ్ పూర్తయింది. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జో అచ్యుతానంద’ సినిమా చేస్తున్నా. ఇంకా మరికొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. -
‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు
కథే హీరో అని నమ్ముతూ సినిమాలు తీసే కొద్దిమంది నిర్మాతల్లో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దామూ) ఒకరు. ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు- ఆ తర్వాత’తో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న ఆయన తాజా ఫిల్మ్ ‘కళ్యాణ వైభోగమే’. నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 4న రిలీజ్. దామూతో స్పెషల్ ఛాట్. పోస్టర్ నిండుగా, నటీనటులతో కళకళలాడుతోంది. ఇంత మంది క్యాస్టింగ్‌తో కూడిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ 40 రోజులు చిత్రీకరణ చేశారట? సినిమా షెడ్యూల్ నటీనటుల డేట్స్, కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మేం ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళుతుంటాం. మా హీరోయిన్ చదువు వలన 40 రోజుల షెడ్యూల్ పెట్టాల్సి వచ్చింది. నందినీరెడ్డి గత చిత్రం ప్లాప్. మళ్లీ ఆమెతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా? మా కాంబినేషన్లో ‘అలా మొదలైంది’ ఎంత పెద్ద సక్సెస్సో అందరికీ తెలుసు. మా ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నందిని ‘అలా మొదలైంది’ లాంటి సక్సెస్‌తో ఎంత నేర్చుకుందో, ఆ తర్వాత వచ్చిన ఫెయిల్యూర్తోనూ అంతే నేర్చుకుంది. ‘కళ్యాణవైభోగమే’ కథను ఆమె రాసుకున్న విధానం, నాకు చెప్పిన విధానం బాగా నచ్చాయి. కథపై తనకెంత స్పష్టత ఉందో... ఆ కథ విన్నాక నాలోనూ అంతే స్పష్టత ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా చేసేశా. మీరు మిగతా దర్శకులతోనూ కలిసి పనిచేశారు. వాళ్లతో పోలిస్తే, నందినిరెడ్డిలో మీకు కనిపించే డిఫరెన్స్? నందిని కమిట్మెంట్ ఉన్న దర్శకురాలు. నిజాయతీగా నచ్చిందే చేస్తుంది. నిర్మాతగా నేనెప్పుడైనా ‘ఇది కరెక్టు కాదేమో’ అని చెబితే ఆలోచించి దానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తుంటుంది. ఒకవేళ తాను అనుకున్నదే కరెక్టనుకుంటే నన్ను కూడా కన్విన్స్ చేస్తుంటుంది. అందు కోసమని నాతో వాదించడానికి కూడా రెడీ అవుతుంది. కళ్యాణ్ కోడూరి అంతే. అందుకే వీరిద్దరితోనూ నా ప్రయాణం సాగుతోంది. చిత్రీకరణలో మీరు టెన్షన్‌కి గురైన సందర్భం ఉందా? ‘కళ్యాణ వైభోగమే’ ప్రీ క్లైమాక్స్‌లో ఓ సీన్ చిత్రానికి ఆయువుపట్టు లాంటిది. పేపర్పైనున్న డైలాగ్ వర్షన్, ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి. మరి అవి అలాగే తెరపైకి వస్తాయో, రావో అన్న భయం ఉండేది. అందుకే ఆ సన్నివేశాలు పూర్తయ్యేవరకు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నా. మేం అనుకున్నట్టుగానే ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి. నాకున్న ఒకే ఒక్క టెన్షన్ ఆరోజే తీరిపోయింది. ఇందులోని ప్రతి సీన్ రియలిస్టిక్‌గా ఉంటుంది. మీ సంస్థ నుంచి కుటుంబ కథాచిత్రాలే వస్తుంటాయెందుకు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు నన్ను. నాకు కూడా ఇలా ఒకే జానర్‌కి పరిమితం కావాలని లేదు. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ తీయాలనుంది. తీస్తాను కూడా. అయితే కుటుంబ కథలు మాత్రం అనుకోకుండానే నా దగ్గరికి వస్తుంటాయి. సుమారు 80 కథలు విన్నాక ‘అలా మొదలైంది’ కుదిరింది. ఆ తర్వాత 50 కథలు విన్నాక ‘అంతకు ముందు-ఆ తర్వాత’ చేశా. మరో 50 కథలు విన్నాక ‘కళ్యాణ వైభోగమే’ చేశా. చిన్న సినిమాలు తీస్తే విడుదల సమయంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా? పెట్టే బడ్జెట్లో తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ... కథ విషయంలో కాదు. కథ బాగుంటే చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది. అదే కథలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా వృథానే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళామన్నదే ముఖ్యం. చాలామంది పబ్లిసిటీ విషయంలో వెనకబడుతున్నారు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరమనే ది నా భావన. మీకు డ్రీమ్ ప్రాజెక్టుల్లాంటివేమైనా ఉన్నాయా? తీసే ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. ప్రతి సినిమానూ తొలి సినిమాలాగే భావిస్తుంటా. ప్రతిసారీ కొత్తవిషయాలు నేర్చుకుంటుంటా. వాటిని తదుపరి చిత్రానికి ఉపయోగిస్తా. -
మొదట ఈ విషయం ఎవరికీ తెలీదు!
- నిర్మాత దామోదర్ ప్రసాద్ ‘‘నా సినిమాలో కథకు తగ్గట్టే నటీనటులు ఉంటారు. మా బ్యానర్లో గతంలో వచ్చిన సినిమాలకు దీటుగా ఈ ‘కళ్యాణ వైభోగమే’ ఉంటుంది’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో విలేఖరులతో మంగళవారం పంచుకున్నారు. ‘‘కథ అంతా విన్నాక, స్క్రిప్ట్ రెడీ అయ్యేంతవరకు నేను ఆ సినిమా గురించి మాట్లాడను. ప్రత్యేకించి ఈ సినిమా కోసం 14 నెలలు వర్క్ చేశాను. ‘అలా మొదలైంది’ తర్వాత దర్శకురాలు నందినీరెడ్డి, నేను కలసి చేస్తున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. కళ్యాణ్ కోడూరి స్వరాలందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో పెళ్లి పాట అందరికీ కనెక్ట్ అయింది. మేం సినిమా చేస్తున్నట్టు చాలా మందికి తెలీదు. కానీ సినిమా పూర్తయి, సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చాక ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఓ అందమైన ప్రేమకథ ఇది. ఈ తరానికి తగ్గట్టు పూర్తిగా వినోదాన్ని మేళవించి, ఈ కథను తెరకెక్కించాం’’ అని దామోదర్ ప్రసాద్ తెలిపారు. -
నందినీ వైభోగమే
► సాక్షి ఫ్యామిలీ కోసం ► జర్నలిస్ట్‌ల అవతారమెత్తి, ► ఒకరిపై మరొకరు ప్రశ్నలు సంధిస్తూ... ► సరదా ‘స్టార్ టాక్’ సాగిస్తూ... ► ‘కల్యాణ వైభోగమే’ దర్శకురాలు నందినీరెడ్డి, ► యువ హీరో నాగశౌర్య మార్చి 4 నందినీరెడ్డి పుట్టినరోజు. అదే రోజు ఆమె కల్యాణవైభోగం! బ్రేకింగ్ న్యూస్ కదా! బ్రేకింగే కానీ, అది ఆమె కల్యాణం కాదు.. ఆమె తీస్తున్న కల్యాణం, ఆ కల్యాణ వైభోగం. ఇందులో బ్రేకింగ్ ఏమిటి? మూడేళ్ల బ్రేక్ తర్వాత నందిని చేస్తున్న సినిమా ఇది. హీరో... నాగశౌర్య. ఈ కాంబినేషన్ ఏమిటి? కష్టపడి పైకొచ్చిన వీళ్ల క్యాలిక్యులేషన్స్ ఏమిటి? సరదాగా సాగే ఈ ‘స్టార్ టాక్’ చదవండి. నవ్వుల నందినీ వైభోగం తిలకించండి! నందిని: శౌర్యా! నా ముందు సినిమా ‘జబర్దస్త్’ పెద్ద ఫ్లాప్. కానీ ‘కల్యాణ వైభోగమే’ ఒప్పుకొనిచేశావు. నీ నమ్మకమేంటి? నాగశౌర్య: డౌట్లకి రీజన్స్ ఉంటాయి కానీ, నమ్మకానికి రీజన్ ఉండదు. ఆ మాటకొస్తే నా 6 సినిమాల్లో ఒకటి సూపర్‌సక్సెస్, 5 ఫెయిల్యూర్స్ (నవ్వులు). మనకు కథచెప్పేటప్పుడు బాగున్నా, సెట్స్‌లో తీయడం మారిపోయిన ఫిల్మ్స్ చేశా. కానీ మీరు చెప్పినదానికన్నా బాగా తీశారు. నందిని: సినీ రంగంలో ఫెయిల్యూరంటే, పబ్లిక్‌లో చెంపదెబ్బ కొట్టినట్లు! మరి బాగా అవమానంగా అనిపిస్తుంటుందా? నాగశౌర్య: నా సినిమా హిట్టా, ఫట్టా అన్నది మీరు, దర్శకులు అవసరాల గారు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మిగతా ప్రపంచాన్ని పట్టించుకోను. నన్ను హీరోగా నిలబెట్టిన సాయి కొర్రపాటి ముందుకెళ్ళాలంటే మాత్రం సిగ్గు. నందిని: బయట సినిమాల్లో రిజర్వ్డ్గా ఉంటావట! మన సెట్స్‌లో సరదాగున్నావు. అక్కడ లేనిదీ, ఇక్కడున్నదీ ఏంటి? నాగశౌర్య: (నవ్వేస్తూ) నాకు పొగరు పెరిగిందనీ, ఎవరితో మాట్లాడననీ అనుకుంటారు. కానీ, అదేమీ లేదు. మొదట అందరితో సరదాగానే ఉంటాను. కానీ, అలా ఉండడం వల్ల కొందరు ఎడ్వాంటేజ్ తీసుకొని, ఏవో అంటారు. ఆ బాధ భరించలేక రిజర్వ్డైపోతా. కానీ మన సెట్లో మీరు, నేను, హీరోయిన్ - అంతా పిల్లలమే! సో ప్రాబ్లమ్ లేదు. నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) బేసిగ్గా శౌర్య చాలా సెన్సిటివ్. పైకలా కనిపిస్తాడు కానీ, లోపల పసిపిల్లాడున్నాడు. చాలా ఎమోషనల్! కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. గ్లిజరిన్ లేకుండానే అతను ఎమోషనల్ సీన్స్ చేసేశాడు. ఐశ్వర్య లాంటి ఆర్టిస్టులు అది చూసి, ఆశ్చర్యపోయారు. నాగశౌర్య: నన్ను చూడగానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్? నందిని: హమ్మయ్య ఇప్పటికైనా వచ్చాడనుకున్నా (నవ్వు). నాగశౌర్య: (నవ్వేస్తూ) అది కథ వినడానికొస్తానన్న రోజు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ షూటింగ్లో ఉన్నా. లేటైంది. నందిని: (‘సాక్షి’ వైపు తిరిగి...) నా అదృష్టం ఏంటంటే, ఆ రోజు తర్వాత ఎప్పుడూ షూటింగ్‌కు లేట్‌గా రాలేదు. కానీ, డబ్బింగంటే దాగుడుమూతల దండాకోర్ ఆడేస్తాడు. నాగశౌర్య: (నవ్వేస్తూ) ఏమీ లేదండీ! ఒక పట్టాన డబ్బింగ్ చెప్పనని ఆరోపణ. డబ్బింగ్ ఏదోలా చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయే టైప్ కాదు నేను. టైవ్‌ు ఎక్కువైనా ఫరవాలేదని బాగా డబ్బింగ్ చెప్పడానికి యత్నిస్తా. నందిని: నిజమే! మంచి ఆర్టిస్టులెప్పుడూ డబ్బింగ్ అంటే చిరాకు పడతారు. ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్, శౌర్య ఇద్దరూ సేమ్ కేటగిరీ కిందకు వస్తారు (నవ్వులు...). నాగశౌర్య: ఈ సినిమాలో నన్నే ఎంచుకోవడానికి కారణం? నందిని: నా సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. డ్రమాటిక్ డైలాగుల్లాంటివి పట్టుకొని యాక్ట్ చేయడానికి వీలైన డెకరేషన్ ఉండదు. అందుకే, నా కథల్లో నటించాలంటే, బై డిమాండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ నీడ్ గుడ్ యాక్టర్స్. కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు లాంటివాళ్ళు నటుల్ని తీసుకొని, శిలల్ని శిల్పాలుగా చెక్కుతారు. కానీ నాకు శిల్పమే కావాలి. దాన్ని అందంగా అలంకరించి చూపిస్తా. ‘చందమామ కథలు’ చూసినప్పుడే నీలో మంచి యాక్టర్ కనిపించాడు. ఇప్పటికి నీతో చేయడం కుదిరింది. నాగశౌర్య: మొదటనుకున్న హీరోకు ఫ్లాపొస్తే లెక్కలు... నందిని: నేను లెక్కలేయలేను. నా బలం, యాటిట్యూడ్ అది కాదు. స్క్రిప్ట్‌కు తగ్గ యాక్టర్స్ ఎంపికలో నాది, నిర్మాత దామూ గారిది ఒకటే దృష్టి, అభిరుచి. ఆ యాక్టర్లను బట్టి, కథను బట్టి బడ్జెట్నెలా తగ్గించుకోవాలో ఆలోచిస్తాం తప్ప హీరో హిట్స్‌లో ఉన్నాడో, లేడో చూడం. నాగశౌర్య: మీ రెండో సినిమా ‘జబర్దస్త్’ ఫ్లాప్. ‘బ్యాండ్ బాజా బారాత్’కి కాపీ అని యశ్‌రాజ్ ఫిల్మ్స్ కేసు! అసలేమైంది? నందిని: అసలు నా రెండో సినిమాకి చేయాల్సింది ‘కల్యాణ వైభోగమే’ కథే. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ సమంత విన్న కథా ఇదే. కానీ నిర్మాతల ఒత్తిడితో ‘జబర్దస్త్’ చేయాల్సి వచ్చింది. అప్పుడే సమంతకు ఆరోగ్యసమస్య, నిర్మాతకూ- హీరోయిన్‌కూ వివాదం వచ్చాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు వేసిన కేసింకా నడుస్తోంది. అది నేను చేయకూడదనుకున్న సినిమా. కానీ చేయాల్సొచ్చిన సినిమా! (నవ్వు) నా తప్పేమిటంటే అంతరాత్మను నమ్ముకోకపోవడం! ఆ పాఠం నేర్పింది గనకే, ‘జబర్దస్త్’ నాకు ఇష్టమైన సినిమా. నాగశౌర్య: మీకూ, నాకూ పోలికలున్నాయి. ఇద్దరి తొలి సినిమా 2011లోనే! అయిదారేళ్ళు కష్టపడి మీరైనా నేనైనా డెరైక్టర్, హీరో అయ్యాం. లేడీడెరైక్టర్గా ఎంత కష్టమైంది? నందిని: ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్సుంటాయి. లేడీ డెరైక్టర్ని కావడం వల్ల నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ లేకపోవడం’ ఎడ్వాంటేజ్. ట్రెక్కింగ్లోలా ఎప్పుడూ తర్వాత వేసే నాలుగడుగుల మీదే దృష్టి. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులను కుంటూ ముందుకెళ్ళేదాన్ని. అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు చుక్కలు చూశా. నా ఫస్ట్ ఫిల్మ్ ‘అలా మొదలైంది’(2011) నిర్మాణం, రిలీజ్‌కీ అంతే! ఆర్థిక సమస్యలు, 4 నెలల గ్యాప్! రిలీజ్‌కి ముందు అంతా పెదవి విరిచినా, రిలీజయ్యాక అంత సక్సెసవడం మర్చిపోలేను. నాగశౌర్య: ఆరేళ్ళలో మూడే ఫిల్మ్స్! నిదానమే ప్రధానమా? నందిని: అదేమీ లేదు. రెండో సినిమా దెబ్బ నుంచి కోలుకోవడానికి టైమ్ పట్టింది. కానీ, ఇప్పుడీ మూడో సినిమా రిలీజవగానే, ఫాస్ట్‌గా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నందిని: నువ్వూ, హీరోయిన్ రాశీఖన్నా బాగా క్లోజట! నాగశౌర్య: (నవ్వుతూ) అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదు బాబూ! తొలి సినిమా కలసి చేశాం కాబట్టి, కష్టసుఖాలు తెలుసు. నేనంటూ పలకరించి, మాట్లాడే హీరోయిన్ రాశీఖన్నానే! దానికేవేవో రంగులు పూసేయకండి. నాగశౌర్య: అవునూ! మీ తొలి 2 సినిమాల్లో నిత్యా మీనన్‌ని పెట్టారు. (బుంగమూతితో) నా దగ్గరకొచ్చేసరికి పెట్టలేదేం? నందిని: ఈ సినిమాలో పాత్రకు తను పెద్దదైపోతుంది. అందుకే, పెట్టలేదు. అయినా, నువ్వు గత సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ పోస్టర్స్‌లో హీరోయిన్ పలక్ లల్వానీతో క్లోజ్‌గా కనిపించావు. ఈ సినిమాలో అమ్మాయిని పట్టుకోమంటే పట్టుకోలేదు. అమ్మాయిలంటే భయమా? నాగశౌర్య: (నవ్వేస్తూ) మాళవికా నాయర్ మీద గౌరవం! నందిని: అంటే పలక్‌పై గౌరవం లేదన్న మాట! (నవ్వులు) నాగశౌర్య: అబ్బ! అది కాదు మేడమ్! ఆ సినిమా కథంతా ముద్దు సీన్ మీద నడుస్తుంది. మా డెరైక్టర్ రమేశ్‌వర్మ మంచి పోస్టర్ డిజైనర్ కూడా! మేము కొద్దిగా దూరంగా నిలబడినా, ఆయన పోస్టర్స్‌లో బాగా మేనేజ్ చేసేశారు. నందిని: (ఆటపట్టిస్తూ) డెరైక్టర్ని బట్టి రొమాన్సన్న మాట! నాగశౌర్య: అమ్మా! నన్ను వదిలేయండి! (నవ్వులు...) నందిని: చూడు! త్వరలో నీ బెండు తీసే లవ్‌స్టోరీ చేస్తా! (నవ్వు) ఏమైనా, నీకు హీరోయిన్స్‌ని పట్టుకోవడం రాదు. నాకేమో హీరోల్నీ, నిర్మాతల్నీ పట్టుకోడం రాదు. (నవ్వు) నందినీ రెడ్డి: శౌర్యా! అందరూ టెక్నాలజీతో ముందుకెళ్తుంటే, నువ్వు చేతిలో సెల్ లేకుండా గడిపేస్తున్నావేం? నాగశౌర్య: (నవ్వేస్తూ) ఒకరకంగా, డిజిటల్ డీ-టాక్సింగ్ కోసం సెల్‌ఫోన్ వాడడం లేదనుకోండి! నందిని: (ఆటపట్టిస్తూ...) గాడిదగుడ్డేం కాదూ! నిజం చెప్పు. ఎవరో, ఏదో పందెం కాసి ఉంటారు! నాగశౌర్య: (నవ్వుతూ) పందెం కాసిందెవరో మీకు తెలియదా? మీరే! (‘సాక్షి’ వైపు తిరిగి...) రెండు, మూడురోజులు సెల్‌కు దూరంగా ఉందామనుకున్నా. ఇంతలో మేడమ్ 2016 డిసెంబర్ 31 దాకా సెల్‌కు దూరంగా ఉంటే, ఇంకో సినిమాలోనూ హీరో ఛాన్సిస్తానని పందెం కాశారు. అందుకే, ఈ దీక్ష. (నవ్వు) నందిని: మార్చి 4న వచ్చే ‘కల్యాణ వైభోగమే’ తరువాతి సినిమాకు ఎలాగూ శౌర్యే హీరో. డిసెంబర్ 31 దాకా ఇలా ‘దీక్ష’లో ఉంటే, ఆ నెక్స్ట్ సినిమా కూడా ఇస్తానన్నమాట! నాగశౌర్య: చూస్తూవుండండి. దీక్షలో గెలిచి, ఛాన్స్ కొట్టేస్తా! నందిని: స్టార్ పేరు మీద సినిమా అమ్ముడవుతుంది కాబట్టి, మార్కెట్లో వాళ్ళకే శాలరీ ఎక్కువ! అది కరెక్టా, కాదా అన్నది పక్కనపెడితే, అది మార్కెట్ సూత్రం. నాగశౌర్య: నాకు తెలిసి ఆడవాళ్ళు చేసేంతపని మగవాళ్ళు చేయలేరు. ఒంటిచేత్తో కుటుంబమంతా చక్కదిద్దేవాళ్ళకు సినిమా డెరైక్షన్ చాలా ఈజీ అంటాను. నాగశౌర్య: అవును మేడమ్! ఇంతకీ నిజజీవితంలో మీరు ఎవరినైనా కట్టుకొనే సంగతేంటి? పెళ్ళి ప్లాన్ లేదా? నందిని: పెళ్ళి కంపల్సరీ కాదేమో! అలాగని నేను పెళ్ళికి వ్యతిరేకమూ కాదు. అనుకూలమూ కాదు. మన వృత్తికీ, ప్రవృత్తికీ సరిపోయేవాళ్ళు దొరకాలి. లెక్కలు కుదరాలి! సాక్షి: మీరన్నీ లవ్‌స్టోరీస్ తీశారు. మీ జీవితంలో లవ్‌స్టోరీ...? నందిని: ఓ కాలేజీ లవ్‌స్టోరీ ఉంది. ఢిల్లీలో జేఎన్టీయూలో చదువుతున్నప్పుడో అబ్బాయి నచ్చాడు. అతనికి తెలీదు. హాస్టల్‌కు వెళ్లి ఏం చదువుకుంటున్నాడు? ఏంటి అని ఆరా తీశాం. హాస్టల్ ముందు లాన్లో కింద దొర్లుతూ షర్ట్ పైకి తీసి, గోక్కుంటున్నాడు. అంతే ప్రేమాగీమా పోయాయి. నాగశౌర్య: మీకు అవతలి వ్యక్తిలో నచ్చే విషయం ఏమిటి? నందిని: నిజాయతీ. అబద్ధాలు చెబుతూ, మోసం చేసే వ్యక్తుల్ని నేను సహించలేను. నేను అబద్ధం చెప్పలేను. సినిమా మీద అభిప్రాయమైనా అలాగే చెప్పేస్తా! అందుకే, నేను ప్రివ్యూలకు పిలిస్తే వెళ్ళను. రానని కూడా చెప్పేస్తా. నందిని: నిన్నో విషయం అడగాలి! లేడీ డెరైక్టర్‌తో పనిచేయడం తొలిసారి కదా! పురుష దర్శకులకూ, నాకూ తేడా? నాగశౌర్య: మీరు మగవాళ్ళ కన్నా ఎక్కువ పనిచేస్తారు. కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే ఒక పని జరగాలీ అంటే, మీరూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తారు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేస్తారు. నందిని: ఆ మాటకొస్తే ఈ సినిమాకి నువ్వు కూడా కెమేరా అసిస్టెంట్‌లా పనిచేశావు. ఫోకల్లెన్త్లూ చూసేవాడివి. నాగశౌర్య: (నవ్వేస్తూ) 2007లో మొదలైందే అసిస్టెంట్ డెరైక్టర్‌గా! అప్పుడే హీరోని కావాలని బుర్రలో పడింది. నాగశౌర్య: మీరూ బాగా ఫుడీగా! ఆ సంగతులూ చెప్పండి! నందిని: మీరు... కాదు మనం (నవ్వులు)! నాగశౌర్య: ఆ.. మనం తిండిపోతులం! మీరిష్టపడి తినేది? నందిని: ఎవరు ఏం చేసినా తింటాను. పాస్తా నుంచి పప్పుచారు దాకా అన్నీ చేస్తా. ఇంటి వంటే ఇష్టం. షూటింగ్ లేక ఆఫీస్కొస్తుంటే, నేనే వండుకొని క్యారెజీ తెచ్చుకుంటా. (‘సాక్షి’తో) శౌర్యలో నాకు నచ్చిందే.. హీరోయిన్ సమంతకు వండిపెట్టి, ఇప్పుడితని దగ్గరున్న పండుగాడు. నాగశౌర్య: ఔట్డోర్కెళ్లినా పండు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. నేనూ పొద్దుట్నించి తింటూనే ఉంటా. నందిని: మా యూనిట్లో అందరూ ఫుడీ సే. లంచ్ బ్రేకంటే అందరూ కలిసి కూర్చొని తినడమే. అంతా ఓ ఫ్యామిలీ. నాగశౌర్య: ‘రాయలసీమ రుచులు’ అంటే ఏం గుర్తొస్తుంది? నందిని: ఇంకెవరు! మా తమ్ముడు! అది వాడి రెస్టారెంట్! మా నాన్న గారిది రాయలసీమ, మా అమ్మది తెలంగాణ. నేను పనిచేస్తున్నది ఆంధ్రాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన హీరోతో! మేరా భారత్ మహాన్! ప్రాంతాలు, భాషల తేడా లేకుండా అందరినీ కలిపే సినిమాకు జోహార్! - రెంటాల జయదేవ -
రమేశ్‌వర్మ నాకో మంచి సినిమా ఇచ్చారు - నాగశౌర్య
‘‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో జనవరి 1న రమేశ్ వర్మగారు నాకో మంచి సినిమా ఇచ్చారు. థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమా చూడండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, పల్లక్ లల్వానీ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రమేశ్ వర్మ మాట్లాడుతూ- ‘‘వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాను ఇంకా ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు. నిర్మాణ భాగస్వామి శాస్త్రి మాట్లాడుతూ- ‘‘నాగశౌర్య కెరీర్లో మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఇంకా బాగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో కథానాయిక పల్లక్ లల్వానీ, నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస్ సమ్మెట, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొడాలి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు!
‘‘ఇప్పటివరకూ నేను సున్నా. 2016లో ఓ మెట్టు ఎక్కుతాననే నమ్మకం ఉంది. జనవరి 1న ‘అబ్బాయితో అమ్మాయి’, అదే నెలాఖరున ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలు రిలీజవుతాయి. మరో రెండు సినిమాలు కూడా ఆ ఏడాదే వస్తాయి’’ అని నాగశౌర్య చెప్పారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ విడుదల సందర్భంగా ఈ యువహీరోతో చిట్ చాట్. కొత్త సంవత్సరం మొదటి రోజునే సినిమా రిలీజ్.. ఎలా అనిపిస్తోంది? చెప్పాలంటే ఇప్పటివరకూ నేను చేసినా ఐదారు సినిమాలు నాకు బేస్మెంట్ అనీ, ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో కెరీర్ స్టార్ట్ అవుతుందనీ అనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకోదగ్గ కథ ఇది. తల్లిదండ్రులందరూ ‘అభీ మన అబ్బాయి’ అని నన్ను ఓన్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. యూత్ అంతా నా పాత్రలో తమని చూసుకుంటారు. మూడేళ్ల క్రితమే దర్శకుడు రమేశ్ వర్మ మీతో ఈ సినిమా చేయాలనుకున్నారు కదా.. అప్పుడెందుకు చేయలేదు? అసలీ చిత్రం ద్వారానే నేను పరిచయం కావాల్సింది. కానీ, నిర్మాతలు సరిగ్గా కుదరలేదు. ఆ సమయంలోనే ‘ఊహలు గుసగుసలాడె’కి అవకాశం వచ్చింది. అయితే, ఈ కథను మాత్రం మర్చిపోలేదు. చివరకు మంచి నిర్మాతలు కుదరడంతో ఈ ఏడాది మొదలుపెట్టాం. రమేశ్ వర్మ కథలో కొన్ని మార్పులు చేసి, తీశారు. ఆయన టేకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇళయరాజాగారి పాటలకు కాలు కదిపే అవకాశం రావడం గురించి? ఈ చిత్రానికి ఆయన పాటలు ప్రధాన బలం. ఆడియో ఫంక్షన్లో ఇళయరాజాగారిని చూసి, థ్రిల్ అయ్యాను. ‘సినిమా బాగుందబ్బాయ్.. మంచి ఫీల్ ఉంది’ అని ఆయన ప్రశంసించడంతో పొంగిపోయాను. ఇందులో లిప్ లాక్ సీన్స్ చేశారట? లిప్ లాక్లాంటిది ఉంటుంది కానీ, ప్రాపర్ లిప్ లాక్ అయితే కాదు. ఫొటోషూట్ సమయంలో చేశాం. అయినా నేను లిప్ లాక్ సీన్స్ చేయను. ఎందుకని? ‘జాదుగాడు’ సినిమాలో లిప్ లాక్ చేశాను. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, సెంటిమెంట్‌గా లిప్ లాక్ వర్కవుట్ కాదనుకుంటున్నా. అప్పటివరకూ లవ్‌స్టోరీస్ చేసి, ‘జాదుగాడు’తో మాస్ హీరోగా నిరూపించుకోవాలనుకున్నారు.. నిరాశే ఎదురైంది కదా? అవును. నన్నింకా మాస్ హీరోగా చూడ్డానికి ప్రేక్షకులు రెడీగా లేరని ఆ సినిమా చేశాక అర్థమైంది. ‘జాదుగాడు’ ఫలితం కారణంగా.. మరో రెండు, మూడేళ్ల వరకూ మాస్ చిత్రాల జోలికి వెళ్లకూడదనుకుంటున్నా. వరుసగా లవ్‌స్టోరీలంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని వాటికే ఫిక్స్ చేస్తారేమో? నాగార్జునగారు, వెంకటేశ్‌గారు కూడా ముందు లవ్‌స్టోరీస్ చేసి, తర్వాత మాస్ మూవీస్ చేశారు. ఇప్పుడు నా ఏజ్‌కి తగ్గట్టుగా లవ్ స్టోరీసే చేయాలి. భవిష్యత్తులో మాస్ మూవీస్ చేస్తా. ఇంతకీ ‘అబ్బాయితో అమ్మాయి’ కథ ఏంటి? కొడుకు లవ్‌కి పేరంట్స్ సపోర్ట్ చేస్తారు. ఆ లవ్ తప్పని తెలిశాక ఎలా రియాక్ట్ అవుతారన్నది కథ. ఫేస్‌బుక్‌ది కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్. మీరు ఫేస్బుక్లో ఉన్నారా? ఫేస్బుక్ మాత్రమే కాదు.. ట్విట్టర్లోనూ లేను. ఫోన్ కూడా వాడను. ఫోన్ వాడరా.. మరి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే? ఫోన్ వాడి నాలుగైదు నెలలైంది. నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా మేనేజర్నూ, లేకపోతే మా అమ్మా, నాన్నకూ ఫోన్ చేయొచ్చు. ఫోన్ వాడకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు? షూటింగ్ సమయంలో ఫోన్ రింగ్ అయితే, డిస్ట్రబ్ అయిపోతుంటా. అలాగే, ఫోన్ తీయకపోతే ఫ్రెండ్స్‌కీ, ఇంట్లోవాళ్లకీ కోపం వస్తుంది. అందుకే ఫోన్ వాడకూడదని ఫిక్స్ అయిపోయా. ఎప్పుడైనా లవ్‌లో పడ్డారా.. లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి? నేను బీకామ్ వరకూ చదువుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. నేషనల్ లెవల్లో క్రికెట్, టెన్నిస్, బాస్కెట్ బాల్ వంటివి ఆడాను. కాలేజ్‌కి ఎక్కువగా వెళ్లడానికి కుదరకపోవడంతో లవ్‌లో పడే అవకాశం రాలేదు. లవ్ ఫెయిల్యూర్ అంటారా? చాలామంది అమ్మాయిలు నచ్చుతారు. అది ఆకర్షణా? ప్రేమా? పోల్చుకోలేదు. అనుష్క అంటే నాకిష్టం. ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు. ఇలాంటివాటిని లవ్ ఫెయిల్యూర్ అనలేం. మరి.. రాశీఖన్నాతో లవ్ అట? ఈ వార్త విని నవ్వుకున్నాను. రాసేవాళ్లకు హక్కు ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునే హక్కు ఇతరులకు ఉంటుంది. సో.. సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే... మాట్లాడే మాటలు ఇతరులవి.. వినే చెవులు మాత్రమే మనవి అని ప్రిపేర్ అయిపోవాలి. మా మమ్మీ మాత్రం ‘ఇలాంటి వార్తలు వస్తే... నీకు పెళ్లెలా అవుతుంది?’ అని భయపడుతుంటుంది. అలా అంటే సినిమా పరిశ్రమలో చాలామందికి పెళ్లిళ్లు కావమ్మా అంటుంటాను. పారితోషికం కూడా పెంచారట? లవ్ అట అని వచ్చిన వార్తకు మనల్ని గుర్తించారని ఆనందపడ్డాను. పారితోషికం పెంచాడట? అనే వార్త కూడా ఉపయోగపడింది. ‘కోటి రూపాయలు ఇవ్వలేం.. 70 లక్షలు తీసుకుంటారా?’ అని ఆ మధ్య ఓ నిర్మాత అడిగారు. అప్పటికి నేనంత కూడా తీసుకోవడంలేదు (నవ్వుతూ). -
‘జాదూగాడు’ మూవీ స్టిల్స్