Naina Jaiswal
-
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పులిబిడ్డ: నైనా జైస్వాల్
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు.అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆరి్థకంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం... పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అద్భుతమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు. నవరత్నాలు.. మెరుపులు అమ్మ ఒడి పథకం వచి్చన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మ ర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభి మానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. – సాక్షి, అమరావతి -
వైఎస్ జగన్ పులిబిడ్డ
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలినినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు. అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆర్థికంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. – సాక్షి, అమరావతి ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం... పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అపూర్వమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు. నవరత్నాలు.. మెరుపులు అమ్మ ఒడి పథకం వచ్చిన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభిమానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. -
సుధామూర్తితో కలిసి డాక్టరేట్ అందుకున్న నైనా
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నైనాకు పీహెచ్డీ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్ నమోదు చేశారు. కుటుంబంతో నైనా జైస్వాల్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా జైస్వాల్.. చదువులోనూ మేటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. -
ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న నైనా జైశ్వాల్
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైనాకు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించారు. శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం నైనా జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘అలలకు అలుపు లేదు.. శిలలకు చూపు లేదు.. కాలాలకు రూపు లేదు.. మౌనానికి భాష లేదు.. కానీ, ఆ గోవింద నామాలకు అంతులేదు’’ అంటూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సర్వేజనా సుఖీనోభవంతని తాను కోరుకున్నానని ఆమె చెప్పారు. కాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్.. చదువుల తల్లి.. కుంగుబాటుకు లోనైన బలహీన మనస్కుల్లో సానుకూల దృక్పథాన్ని నింపే మోటివేషనల్ స్పీకర్.. ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా గుర్తింపు పొందారు నైనా. 17 ఏళ్ల వయసులో పీహెచ్డీ మొదలుపెట్టిన ఆమె 22 ఏళ్లకు పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. దేశంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. నైనా జైశ్వాల్ స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ -
నేను సంతోషపడిన సందర్భం అదే: నైనా జైశ్వాల్
-
Naina Jaiswal: ఎదురులేని నైనా.. తొలి భారతీయ యువతిగా సరికొత్త చరిత్ర
Naina jaiswal- రాజానగరం: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీని పొందారు. 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని పొందిన భారతీయ తొలి యువతిగా నిలిచిన ఆమెకు ఏపీ గవర్నర్, ‘నన్నయ’ వర్సిటీ చాన్సలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పీహెచ్డీ పట్టాను అమరావతిలో గురువారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ పాత్రపై ఆమె చేసిన అధ్యయనానికి ఈ పీహెచ్డీ లభించింది. పూర్వపు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో 22 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీని అందుకున్న తొలి భారతీయ యువతిని తాను కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అనుభూతి తనకు 8వ ఏట నుంచే ప్రారంభమైందని, ఆ వయస్సులోనే లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పూర్తి చేసి, ఆసియాలో పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందానన్నారు. 10వ ఏట ఇంటర్మీడియెట్, 13వ ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానన్నారు. ఎంఏ పూర్తి చేసి 22 ఏట పీహెచ్డీ అందుకున్నానని జైస్వాల్ వివరించారు. ఇకపై తన ఏకై క లక్ష్యంగా పెట్టుకున్న సివిల్స్ సాధించడమే తరువాయిగా పేర్కొన్నారు. తన మార్గదర్శకంలో పీహెచ్‌డీని అందుకున్న నైనా జైస్వాల్ భారతీయ తొలి యువతి కావడం సంతోషంగా ఉందని గైడ్‌గా వ్యవహరించిన ‘నన్నయ’ వర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య ఎం. ముత్యాలునాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో నైనా జైస్వాల్ తల్లిదండ్రులు అశ్విన్‌కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి, తమ్ముడు అగస్త్య కూడా పాల్గొన్నారు. -
Naina Jaiswal: నైనా జైస్వాల్‌కు డాక్టరేట్.. అతి పిన్న వయసులోనే..
Table Tennis Player Naina Jaiswal: దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ 22 ఏళ్ల వయస్సులోనే పీహెచ్‌డీలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వాల్.. ఏపీలోని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎం. ముత్యాల నాయుడు అభినందించారు. కాగా టీటీ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు అందుకున్న నైనా.. చదువులోనూ తనకు తానే సాటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి కంప్లీట్ చేసిన నైనా.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఈ క్రమంలో ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. మోటివేషనల్ స్పీకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నైనా.. తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీ చదువుతున్నారు. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ -
నైనా జైశ్వాల్‌ను వేధించిన పోకిరి అరెస్ట్
హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను గత కొంతకాలంగా వేధిస్తున్న శ్రీకాంత్ అనే పోకిరీని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా నైనా జైశ్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య మెసేజ్‌లు పోస్ట్ చేసి శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ మేరకు శ్రీకాంత్ అనే యువకుడ్ని హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో సిద్ధిపేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నైనా జైశ్వాల్‌కు మరోసారి అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. దాంతో నైనా జైశ్వాల్ తండ్రి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేశారు. -
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్‌కు వేధింపులు
-
నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న ఆకతాయి
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్ సోషల్ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో మెసేజ్‌లు చేశాడు. ఆ మెసేజ్‌లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్జైస్వాల్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ సుమారు 30–50 క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీలో చేరగా.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
నేనూ అమ్మ... క్లాస్మేట్స్.. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్ఎల్బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్మేట్గా తన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని... ‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్ఎల్బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం. అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు. ఫ్రెండ్స్‌లా ఉన్నాం... నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్మేట్స్గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది. చదువంటే విజ్ఞానం అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్. -
తిరుమల నాకు ఇష్టమైన ప్రదేశం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్
సాక్షి, చిత్తూరు: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న నైనా జైస్వాల్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేవారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నాకు ఇష్టమైన క్షేత్రమని అన్నారు. టీటీడీ కోవిడ్ నిబంధనలు పాటిస్తుందని, భక్తులు కూడా పాటించాలని కోరారు. త్వరలోనే నా పీహెచ్డీ పూర్తి కానుంది. అతి పిన్న వయస్సులో పీహెచ్డీ పూర్తి చేసుకోనున్నానని నైనా జైస్వాల్ అన్నారు. -
శాంతి కపోతం
చిన్నప్పుడే పెద్ద చదువులు చదివింది చిన్నప్పుడే జాతీయ అంతర్జాతీయ విజయాలను సొంతం చేసుకుంది చిన్నప్పుడే తనకంటే పెద్ద వాళ్లను చైతన్యపరిచింది.ఐక్యరాజ్య సమితి ఇరవై ఏళ్ల నైనా జైస్వాల్‌ను ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది.ఈ శాంతి కపోతం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం పని చేస్తోంది. నైనా జైస్వాల్... బాల మేధావి. తరచూ వార్తల్లో ఉంటుంది. ఎనిమిదేళ్లకు టెన్త్ క్లాసు, పదేళ్లకు ఇంటర్, పదమూడేళ్లకు గ్రాడ్యుయేషన్, పదిహేనేళ్లకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు పీహెచ్డీ చేస్తోంది. పరిశోధన పూర్తయింది, ప్రెజెంటేషన్‌కు కొరోనా అడ్డొచ్చింది. చదువుతోపాటు క్రీడాకారిణిగా కూడా రాణించింది. టేబుల్ టెన్నిస్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌లో మొత్తం పాతిక టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా తొలి ఉపన్యాసం ఇచ్చే నాటికి ఆమె వయసు ఎనిమిది, ఇప్పుడు ఇరవై. దేశవిదేశాల్లో వందలాది ఉపన్యాసాలిచ్చింది. ఇవన్నీ చూసిన ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ఈ నెల ఎనిమిదవ తేదీన ఆమెను ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా నియమించింది. ఈ కొత్త బాధ్యతల్లో నైనా జైస్వాల్ ఐక్యరాజ్య సమితి చేపట్టిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్‌గా నైనా విద్యాసంస్థలతోపాటు మారుమూల ప్రదేశాల్లో నివసించే మహిళలను కూడా చైతన్యవంతం చేస్తోంది. ఈ సామాజిక చైతన్య కార్యక్రమాలే నైనాను ఐక్యరాజ్య సమితి పీస్ అంబాసిడర్‌ని చేశాయి. ఇప్పుడేం చేయాలి? నైనా జైస్వాల్ ఇప్పటి వరకు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి పెట్టింది కీర్తికిరీటం మాత్రమే కాదు, అంతకంటే పెద్ద బాధ్యత కూడా. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన సామాజిక లక్ష్యాలు పదిహేడు. అవి ఆకలి బాధలు, దారిద్య్రం లేని సమాజ నిర్మాణం. మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, స్త్రీ పురుష సమానత్వ సాధన, అందరికీ పరిశుభ్రమైన నీటిని అందించడం, సౌర శక్తి వనరును అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, గౌరవప్రదమైన ఉద్యోగ వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక రంగాల ఏర్పాటు, అసమానత్వాన్ని తగ్గించడం, నగరాలు– నివాస ప్రాంతాల నిరంతరత, బాధ్యతాయుతమైన వినియోగం– ఉత్పాదకత, వాతావరణ మార్పులు, నీటిలోపల నివసించే జీవుల జీవనభద్రత, భూమి మీద నివసించే జీవుల పరిరక్షణ, శాంతియుతమైన, న్యాయబద్ధమైన సంస్థల నిర్వహణ, లక్ష్యాల సాధనలో ప్రజలను భాగస్వాములను చేయడం. వీటిలో ప్రతి పదం వెనుక విస్తృతమైన పరిధి ఉంది. ఎంత చేసినా తరగని గనిలా పని ఉంటుంది. ఇంతపెద్ద బాధ్యతను లేద భుజాల మీద పెట్టింది యూఎన్ఓ. ఈ బాధ్యతకు ఎంపికైన తొలి ఇండియన్ నైనా జైస్వాల్. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన బెర్లిన్ నగరం, బ్రాండెన్ బర్గ్ గేట్ వద్ద జరిగే వరల్డ్ పీస్‌డే సదస్సుకు హాజరయ్యి సదస్సులో ప్రసంగించనుంది. ఈ సదస్సులో వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారు. 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సంగీత కవాతు కూడా ఉంటుంది. ఊహించని వరమే నైనా పీహెచ్‌డీతోపాటు ఆమె ప్రవృత్తిగా ఎంచుకున్న మోటివేషనల్ స్పీకర్‌గా ప్రసంగాలు కూడా సమాజం, మహిళలు, యువత, పిల్లల అభివృద్ధి ప్రధానాంశాలుగా ఉంటాయి. ‘రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ఆమె పరిశోధనాంశం. మనదేశంలో మారుమూల ప్రదేశాల నుంచి యూఎస్‌లోని ప్రధాన నగరాల వరకు ఆమె వందకు పైగా ప్రదేశాల్లో పర్యటించి ప్రసంగించింది. ఇప్పుడు అదే పనిని మరింత విస్తృతంగా చేస్తానంటోంది నైనా. పీస్ అంబాసిడర్‌గా నేను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మీదనే దృష్టి పెడతానంటోంది. ‘‘గ్రామాలకు చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచం ఎప్పుడూ విశాలంగానే ఉంటుంది. అయితే ప్రపంచీకరణ కారణంగా దేశాలు దగ్గరైపోయాయి. డిజిటల్ యుగంలో సమాచార ప్రసారం వేగవంతమైంది. అయినా కొన్ని మారుమూల గ్రామాలు, అక్కడి మహిళలు ఆధునికత, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. యూఎన్ఓ నిర్దేశించిన లక్ష్యాలను వాళ్లకు దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖచిత్రమే మారిపోతుంది. వారిని సామాజికంగా చైతన్యవంతం చేయడంతోపాటు సాంకేతికాభివృద్ధి మీద అవగాహన కల్పిస్తే యూఎన్ఓ లక్ష్యాలు దాదాపుగా నెరవేరినట్లే. నేను ఇన్నాళ్లూ మహిళల కోసమే పని చేశాను. మహిళల సాధికారత సాధన గురించి అధ్యయనం కూడా చేశాను. ఈ సమయంలో వాళ్లకు అవగాహన ఏర్పరచడం కోసం నాకు మంచి అవకాశం వచ్చింది. నిజంగా నాకు సరైన సమయంలో మంచి అవకాశం వచ్చింది’’ అన్నది నైనా. ఈ సందర్భంగా యూఎన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పింది నైనా జైస్వాల్. – వాకా మంజులారెడ్డి -
చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
-
నైనా జైస్వాల్ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్సిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఫేస్‌బుక్‌ను గుర్తుతెలియని దుండగులు హ్యాక్ చేశారు. దీనిపై ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కాచిగూడలో నివసించే నైనా జైస్వాల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడి అనేక టైటిల్స్ కైవసం చేసుకున్నారు. దీంతో పాటు ఎనిమిదో ఏటనే టెన్త్, పదో ఏట ఇంటర్మీడియట్, 13వ ఏట డిగ్రీ, 15 ఏట పీజీ పూర్తి చేసిన ఆమె 17వ ఏట నుంచే పీహెచ్డీ చేయడం ప్రారంభించారు. తన రెండు చేతులతోనూ ఏకధాటిగా రాయగలగడంతో పాటు మోటివేషనల్ స్పీకర్‌గానూ పేరున్న నైనా జైస్వాల్ ఫేస్‌బుక్‌కు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీన్ని హ్యాక్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి పాస్వర్డ్ మార్చేశాడు. దీంతో నైనా సైతం తన ఖాతాను యాక్సస్ చేయలేకపోతున్నారు. ఈ ఖాతాలోకి సదరు దుండగుడు కొన్ని వీడియోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఆమె మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
విద్యతోనే బాలికల సంరక్షణ
యూనివర్సిటీక్యాంపస్: ‘‘విద్యద్వారానే బాలికల సంరక్షణ సాధ్యమవుతుంది. చదువులేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. బాలికలు చదువుపైనే పూర్తిస్థాయి దృష్టిసారించాలి. చదువులో విజయం సాధిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోగలరు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అవి ఓటమివైపు పయణింపజేస్తాయి. ద్వేషం, గర్వం, కోపం తదితర గుణాలకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలం. ఇందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఎనిమిదో ఏటనే పదో తరగతి పూర్తి చేయగలిగాను. 13వ ఏట డిగ్రీ, 15 సంవత్సరాలకు పీజీ పూర్తిచేశాను. ఇండియా తరఫున ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికైన తొలి యువతిని. అమ్మ ఒడినే బడిగా చేసుకుని ఈస్థాయికి ఎదగలిగాను. బాలికల సంరక్షణ అందరి బాధ్యత’’–నైనాజైశ్వాల్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్, క్రీడాకారిణి -
విద్యార్థులు చెడు దారిలో వెళ్లడానికి వారే కారణం
సాక్షి, సిద్ధిపేట: ఆడపిల్లలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిదని ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు. గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న నైనా జైస్వాల్.. యువత అనుకుంటే ఓ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులా తయారు కావొచ్చన్నారు. సిద్ధిపేట గడ్డకు పోరాటాల చరిత్ర ఉందని తెలిపారు. క్రమశిక్షణ పోరాటాలు, త్యాగం లాంటి పదాలకు యువత నాంది కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చెడు మార్గంలో నడవడానికి మొదట తల్లిదండ్రులు, తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్లే కారణమని సైకాలజిస్ట్ గంప నాగేశ్వర రావు అన్నారు. విద్యార్థులు ఎదగాలి అంటే బిడియం, మొహమాటం బద్దకం లాంటివి వదిలేయ్యాలన్నారు. మనం భూమి మీద ప్రాణం తో ఉండడమే గొప్ప విజయం... ఇక మిగతావన్నీ సాధ్యమయ్యే పనులే అన్నారు. టీవీలకు, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. -
దబంగ్ ఢిల్లీ టీటీసీ జట్టులో నైనా జైస్వాల్
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా జూలై 25 నుంచి జరుగనున్న ఈ లీగ్‌లో పాల్గొనే జట్లను గురువారం ప్రకటించారు. ఇందులో భాగంగా దబంగ్ ఢిల్లీ టేబుల్ టెన్నిస్ క్లబ్ (టీటీసీ) జట్టుకు హైదరాబాద్ ప్లేయర్ నైనా జైస్వాల్ ప్రాతినిధ్యం వహించ నుంది. నైనాతో పాటు ఈ జట్టులో భారత స్టార్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్, బెర్నాడెట్ జాక్స్, జాన్ పెర్సన్, పార్థ్ విర్మానీ, క్రిత్విక సిన్హా రాయ్ చోటు దక్కించుకున్నారు. భారత మహిళా స్టార్ ప్లేయర్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత మనికా బత్రా ఆర్పీ–ఎస్జీ మావెరిక్స్ కోల్‌కతా తరఫున బరిలో దిగనుంది. ఈ ఏడాదే లీగ్‌లో ప్రవేశించిన కొత్త జట్టు చెన్నై లయన్స్ తరఫున శరత్ కమల్ ఆడనున్నాడు. మొత్తం 6 జట్లు ఈ లీగ్‌లో తలపడనుండగా... ఒక్కో జట్టులో ఆరుగురు చొప్పున ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది మాదిరిగా ఏడు మ్యాచ్‌లతో కాకుండా కేవలం ఐదు మ్యాచ్‌లతోనే టై నిర్వహించనున్నారు. ఈసారి మ్యాచ్‌లన్నీ న్యూఢిల్లీలోనే జరుగనున్నాయి. క్రితం సారి మూడు నగరాల్లో యూటీటీ జరిగింది. జట్ల వివరాలు చెన్నై లయన్స్: శరత్ కమల్, పెట్రిస్సా సోల్జా, టియాజో అపొలోనియా, మధురికా పట్కర్, యశినీ శివశంకర్, అనిర్బన్ ఘోష్. దబంగ్ ఢిల్లీ టీటీసీ: సత్యన్ జ్ఞానశేఖరన్, బెర్నడెట్ జాక్స్, జాన్ పెర్సన్, పార్థ్ విర్మానీ, నైనా జైస్వాల్, క్రిత్విక సిన్హా రాయ్. గోవా చాలెంజర్స్: చెంగ్ చింగ్, అర్చన కామత్, అమల్‌రాజ్ ఆంథోని, సిద్ధేశ్ పాండే, శ్రుతి అమృతే, అల్వారో రోబెస్. పుణేరీ పల్టన్: చాంగ్ చిన్ యా, హర్మీత్ దేశాయ్, ఐహిక ముఖర్జీ, సెలీనా సెల్వకుమార్, రోనిత్ భాన్‌జా, సబీనే వింటర్. ఆర్పీ ఎస్జీ మావెరిక్స్ కోల్‌కతా: మనికా బత్రా, బెనెడిక్ట్ డ్యూడా, మాల్టిడా ఎకోమ్, మనుష్ షా, ప్రాప్తి షా, సనీల్ శెట్టి. యు ముంబా టీటీ: డూ హోయ్ కెమ్, మానవ్ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీ, కిరిల్ గెరాస్సిమెన్కో, జీత్ చంద్ర, మౌమితా దత్తా. -
నైనాకు రజతం, కాంస్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ జూనియర్, యూత్ జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. హరియాణాలోని సోనెపట్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె రెండు పతకాలు గెలుపొందింది. యూత్ బాలికల సింగిల్స్ కేటగిరీలో కాంస్యం నెగ్గిన హైదరాబాదీ టీమ్ ఈవెంట్లో రజతం గెలుపొందింది. యూత్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో నైనా జైస్వాల్ 1–4 గేముల తేడాతో శ్రుతి అమ్రుతే (మహారాష్ట్ర) చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1తో యశస్విని (కర్ణాటక)పై, క్వార్టర్ ఫైనల్లో 4–2తో సెలెన దీప్తి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. ఇందులో టీటీఎఫ్ఐ అడ్వైజర్ డి.ఆర్. చౌదరి పాల్గొన్నారు. -
లవ్‌ఆల్
టేబుల్ టెన్నిస్ ఆటలో పాయింట్ల లెక్క ‘లవ్ ఆల్’తో మొదలవుతుంది. అంటే... ఇద్దరి స్కోరు సున్న–సున్న అన్నమాట. ప్రతిరోజూ జీవితాన్ని అలాగే మొదలు పెడితే ఎంత బావుణ్ణు? నిన్నటి దాకా సాధించినవి వెనకేసుకుంటూ రాకుండా... వదిలేసి వస్తే... ఇవాల్టి నుంచి కొత్త బిగినింగ్... లవ్ ఆల్ తో మొదలు పెడితే! ప్రతిరోజూ ఒక కొత్త మ్యాచ్ అయితే... ఫ్యూచర్ అంతా ఒక టోర్నమెంటయితే... అబ్బ! జీవితమే ఆడుతూ పాడుతూ నలుగురికి సాయం చేస్తూ... అందర్నీ ప్రేమిస్తూ... రేపటికి ముందడుగు వేయవచ్చు కదా! నైనాజైస్వాల్లో కనిపించే గొప్ప గుణం ఇది. ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. టెన్నిస్ టేబుల్ మీద బాల్‌తో పోటీ పడి చురుగ్గా కదులుతుంటే... చూపరుల కళ్లు చేపల్లా కదలాల్సిందే. అంతేకాదు, మెదడు రెండు పార్శా్వలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతోనూ పని చేయాలంటూ నైనా రెండు చేతులతో రాసి చూపిస్తుంది. రెండు సెకన్లతో ఎ నుంచి జడ్ వరకు టైప్ చేస్తుంది. ఎనిమిదేళ్లకు టెన్త్ క్లాస్, పదేళ్లకు 12వ తరగతి, పదమూడేళ్లకు డిగ్రీ పూర్తి చేసిన ఈ అమ్మాయి పీజీ పూర్తి చేసి ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేస్తోంది. మోటివేషనల్ స్పీకర్‌గా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది. బాలిక విద్య కోసం శ్రమిస్తోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నైనా లక్ష్యం ‘2020 ఒలింపిక్స్‌లో మెడల్, సివిల్స్ క్వాలిఫై అయ్యి ఇండియాలో బాలికల పరిస్థితి మెరుగు పరచడానికి కృషి చేయడం. ప్రస్తుతం నైనా జైస్వాల్ ‘అండర్ 21, టాప్ ఎయిట్’ కేటగిరీలో ఆరవ స్థానంలో ఉంది. పాటియాలాలోని నేషనల్ ఇండియన్ క్యాంపులో శిక్షణ తీసుకుంటోంది. ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉదయం ఐదున్నరకు డైలీ రొటీన్ మొదలతుంది. రెండు గంటల సేపు ఫిట్నెస్ ట్రైనింగ్, ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటల పాటు టేబుల్ టెన్నిస్ ట్రైనింగ్‌తో బిజీగా ఉంది. ఇంత టైట్ షెడ్యూల్లో మిగిలే ఖాళీ టైమ్‌లో చదువుకోవడానికి సివిల్స్ స్టడీ మెటీరియల్‌ని వెంట తీసుకెళ్లింది. 21 ఏళ్లు వచ్చాక సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలనేది తన టార్గెట్ కాబట్టి, ఇప్పటి నుంచి సబ్జెక్ట్‌కు టచ్‌లో ఉంటే అప్పుడు ఆందోళన ఉండదని చెప్తోందామె. ‘ఒలింపిక్స్ లక్ష్యం తన కోసం దేశం కోసం. సివిల్స్ మాత్రం మహిళల కోసం’ అంటోంది. ‘పిహెచ్డి మరో ఏడాదిలో పూర్తవుతుంది. తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ టైమ్ పెంచుతాను’ అని కూడా చెప్తోంది నైనా. ఆమె తన సివిల్స్ లక్ష్యాన్ని మహిళలకు అంకితం చేయడానికి వెనుక బలమైన కారణమే ఉంది. డబ్బు పెళ్లి కోసమేనా? ‘‘రెండేళ్ల కిందట ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. ఎంట్రన్స్ పరీక్షలో టాప్ వచ్చిన విద్యార్థిని నాతో కలిసి డిన్నర్ చేయవచ్చని ప్రకటించారు. వేలమంది అమ్మాయిలు పరీక్ష రాశారు. వాళ్లలో కొంతమంది నన్ను చూడటానికే ఈ పరీక్ష రాశామని చెప్పారు. ఎక్కువ మంది ఆర్థిక కారణాల వల్ల ఇతర చదువులకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. వాళ్లలో చాలా మందికి మంచి నాలెడ్జ్ ఉంది. కానీ ఆర్థిక కారణాలే పెద్ద అడ్డంకి అవుతోంది. మహిళల చదువుకి ఇన్ని అడ్డంకులా? నిజంగా డబ్బులేకనే తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారా? అని లోతుగా అధ్యయనం చేస్తే... డబ్బును అమ్మాయిల పెళ్లి కోసం దాచి చదువుకు ఖర్చు చేయడం లేదని తెలిసి ఆశ్చర్యం వేసింది. చాలా బాధేసింది కూడా. మోటివేషనల్ స్పీకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో తుని, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ వంటి నగరాలు, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు దుబాయ్, సింగపూర్, అమెరికాల్లో కూడా పర్యటించాను. అన్ని ప్రదేశాలు, అన్ని సంస్కృతులు చూసిన తర్వాత మన దగ్గర అమ్మాయిల పట్ల వివక్ష ఇంట్లోనే ఉందని తెలిసింది. నాకు ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోవడం నా అదృష్టం. నిజానికి చాలా మంది అమ్మాయిలు తమకు ఇష్టమైన చదువుకి, ఇష్టమైన ఆటలకు కూడా నోచుకోవడం లేదు’’ అంటుంది నైనా. రోల్‌మోడల్ ‘‘గుజరాత్ అమ్మాయి మాన్యా సోలంకి, పంజాబ్ నుంచి సానీ పటేల్, రాజస్తాన్ నుంచి యాషికా జైన్లయితే వాళ్ల రాష్ట్రాల్లో నా ప్రసంగం విన్నప్పటి నుంచి ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నారు. ‘నైనా! మాకు నువ్వే రోల్‌మోడల్’ అంటారు. ‘నీ స్పీచ్ విన్న తర్వాత మా పేరెంట్స్ చాలా మారిపోయారు. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు’ అని ఫేస్బుక్లో పోస్ట్‌లు పెడుతుంటారు. మరికొంతమంది అయితే... ‘చచ్చిపోదామనుకున్నాను. కానీ నిన్ను చూశాక, నీ స్పీచ్ విన్న తర్వాత జీవితం మీద ఆశ పుట్టింది’ అని పోస్ట్‌లు పెడుతుంటారు. వాటిని చూసినప్పుడు కన్నీళ్లు వస్తాయి. అమ్మాయిల్లో ఇంత ప్రతిభ ఉంది. మంచి డైరెక్షన్ ఇస్తే ఎంత బాగా రాణిస్తారో కదా! అనిపించేది. పిహెచ్డి టాపిక్‌గా ‘మైక్రో ఫైనాన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్’ తీసుకోవడానికి కారణం ఇవన్నీ కూడా’’ అని నైనా తెలిపింది. పిహెచ్డి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వందలాది మంది స్వయం సహాయక బృందాల మహిళలను కలిసింది నైనా. ‘‘అమ్మాయిలను చైతన్యవంతం చేయడం. వాళ్ల తెలివి తేటలు ఇంటి గోడల మధ్య ఇంకి పోనివ్వకుండా కాపాడటం, దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే పౌరులుగా తమ మీద తమకు విశ్వాసం కలిగించడం’ నా ఆశయాలు. ఇప్పటి వరకు నేను కలిసిన అమ్మాయిల్లో చాలా మంది తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం గమనించాను. ముందు భయాన్ని వదిలించుకోవాలి. అవసరమైతే ఆదిశక్తిగా మారగలగాలి తప్ప, ఆత్మన్యూనతలో మగ్గిపోకూడదని చెబుతాను. వాళ్లు నన్ను రోల్‌మోడల్ అనుకుంటున్నప్పుడు నాకూ బాధ్యత పెరుగుతుంది. అందుకే నన్ను ఇష్టపడే వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నన్ను నేను మలుచుకోవాలి’’ అని చెబుతోంది నైనా. మా అమ్మానాన్నల్లా మారితే... నన్ను కలిసిన పెద్దవాళ్లలో కొంతమంది ‘మా పిల్లలు కూడా మీ అక్కాతమ్ముళ్లలాగ (నైనా, నైనా తమ్ముడు అగస్త్య. అగస్త్యకు పన్నెండేళ్లు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు) ఉంటే బావుణ్ననిపిస్తోంది’ అంటుంటారు. వాళ్లతో ‘‘మీరు మా అమ్మానాన్నల్లాగ మారితే మీ పిల్లలు మాలా మారతారు’’ అని చెబుతుంటాను. అమ్మ పీజీ చేసి కూడా ఉద్యోగం చేయకుండా మా కోసమే ఫుల్‌టైమ్ కేటాయించింది. నాన్న బయట ఉద్యోగాలకు వెళ్లకుండా సొంతంగా ట్యూషన్స్ చెబుతూ మా కోసం టైమ్ ఉండేలా చూసుకున్నారు. ఎనిమిదేళ్లకు టెన్త్ రాయడానికి నన్ను ప్రిపేర్ చేయడానికంటే ఎక్కువగా, ఆ పరీక్ష రాయడానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి కష్టపడ్డారాయన. చిన్న వయసులో కాలేజ్‌లో చేర్పించడానికి ప్రత్యేక పర్మిషన్లు... ఇలాంటివెన్నో. వాళ్ల లైఫ్‌లో ప్రతి గంటలోనూ మేమిద్దరమే ఉంటాం. అందుకే ‘పేరెంట్స్ ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు’ అని చెప్తుంటాను’’ అంది నైనా. మేధకు పని పెట్టాలి ‘‘ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు పియానో ప్లే చేస్తాను. అరగంటలో హైదరాబాద్ బిర్యానీ చేసేస్తాను. మనిషి బద్ధకంగా ఉండకూడదు, మెదడును ఒక్క క్షణం కూడా నిరాసక్తంగా ఉంచకూడదంటారు నాన్న. తెలివితేటలు, మేధా సంపత్తి పెంచుకుంటే పెరుగుతాయి. ఏమీ చేయకుండా కాలం గడిపేస్తే చురుకుదనం తగ్గి మొద్దుబారుతుందని చెబుతుంటారు. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో ఉండేట్లు చూశారు మా అమ్మానాన్న. అందుకే ఇంత చిన్న వయసులో ఇన్నింటిని సాధించగలిగాను. నా అచీవ్మెంట్స్ చూసుకుని సంతోషపడిన సందర్భాలు రెండు. ఒకటి పాకిస్తాన్లో జరిగిన సౌత్ ఏషియా చాంపియన్ షిప్లో గెలవడం, మరోటి 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం.’’ - నైనా జైస్వాల్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మహబూబ్‌నగర్ జిల్లాకు ఎలక్షన్ అంబాసిడర్! పద్దెనిమిదేళ్ల అమ్మాయి తొలిసారి ఓటు వేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అదే అమ్మాయి బహిరంగ సభలో ఓటు విలువ గురించి ప్రసంగిస్తుంటే? ఓటు వేయడం పౌరుని కనీస ధర్మం అని ప్రజలకు బాధ్యత గుర్తు చేస్తుంటే? డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లోను కాకుండా మంచి పరిపాలన అందించే నిజాయితీపరులైన వ్యక్తులకే ఓటు వేయాలని హితబోధ చేస్తుంటే... ఏమనిపిస్తుంది? ఆమె చెప్పినట్లే చేయాలనిపించదూ? అందుకే ఆ అమ్మాయిని మహబూబ్‌నగర్ జిల్లాకు ఎలక్షన్ అంబాసిడర్‌గా నియమించింది ఎన్నికల కమిషన్. ఎన్నికలంటే... సమాజహితం, దేశ భవిష్యత్తు కోసం చట్టాలు చేసే ప్రతినిధులను ఎన్నుకోవడం అని, మన అవసరాన్ని, మన గళాన్ని చట్టసభలో వినిపించడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ అని ఆమె గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసింది. - ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నైనాకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ నైనా జైస్వాల్ కాంస్య పతకం సాధించింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన యూత్ బాలికల సింగిల్స్ సెమీస్‌లో నైనా 12–10, 10–12, 11–4, 11–5, 8–11, 11–13, 10–12తో సెలీనా దీప్తి (తమిళనాడు) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో నైనా 4–3తో వన్షిక భార్గవ్ (ఢిల్లీ)పై గెలుపొందింది. -
ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం
ఇబ్రహీంపట్నంరూరల్: యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. యువత చెడు ధోరణులకు అలవాటు పడుతున్నారని, మత్తుపదార్థాల జోలికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిన్సియా– 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. రెండో రోజు ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల చేత ముఖాముఖి, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అకున్‌సబర్వాల్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో విద్యా ర్థులు డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను పా డు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ను పట్టుకుని 21 మందిని అరెస్టు చేసి 12 కేసు లు నమోదు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వం డ్రగ్స్ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. మీడియా, సెల్ఫోన్ల ప్రభావం వల్ల యువత చెడు అలవాట్లకు లోనవుతున్నా రని చెప్పారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. అనంత రం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్ర శ్నలకు అకున్‌సబర్వాల్ సమాధానం ఇచ్చారు. చదువే అన్నింటికీ సమాధానం కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్య అంటే సమాధానం, పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని జీవితకాలం చూసుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి అందరం కలిసి కృషిచేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో 300 గ్రామాలను దత్తత తీసుకొని అందులో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని వెల్లడించారు. ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం పదిహేడేళ్ల అతి చిన్న వయసులోనే పీహెచ్డీ ప్రవేశం పొందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిని నైనా జైస్వాల్, 9 సంవత్సరాల ప్రాయంలోనే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్‌లు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. తల్లిదండ్రుల తో పాటు గురువుల ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో చక్కగా మాట్లాడి అబ్బుర పరిచారు. చదువుల్లో, ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రాఘవ చిరబుడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నయనతార, వైస్ ప్రిన్సిపల్ రామశాస్త్రీ, జేఎన్టీయూ రిటైర్డ్ రిజిస్ట్రార్ కిషన్‌లాల్, కళాశాల సీనియర్ ప్లేస్మెంట్ అధికారి విజయ మేరీ, వివిధ విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. చదువులు సమాజానికి ఉపయోగపడాలి ఇబ్రహీంపట్నంరూరల్: మనం చదివిన చదువులు సమాజం కోసం ఉపయోగపడాలని సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామ సమీపంలో గల సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా సిన్సియా 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా నవీన్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికరంగంలో విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణ కనుగొనాలన్నారు. కృషి, పట్టుదలతో విద్యనభ్యసిస్తే అనుకున్నది సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నవీన్‌మిట్టల్‌ను కళాశాల చైర్మన్ రాఘవ చీరబుడ్డీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నయనతార, సీనియర్ ప్లేస్మెంట్ అధికారి విజయమేరీలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
11 ఏళ్లకే 12వ తరగతి పాస్!!
హైదరాబాద్: నైనా జైస్వాల్.. గుర్తుంది కదా.. అతిపిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించి ఔరా అనిపించింది. కేవలం 16 ఏళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి.. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన చిచ్చర పిడుగు అనిపించుకుంది. ఇప్పుడు ఆమె సోదరుడు అగస్త్య జైస్వాల్ కూడా అక్కకు తగ్గ తమ్ముడనిపించుకుంటున్నాడు. కేవలం 11 ఏళ్లకే 12వ తరగతి ఉత్తీర్ణుడై రికార్డు సృష్టించాడు. హైదరాబాద్‌లోని యూసఫ్గూడలోగల సెయింట్ మేరిస్ జూనియర్ కాలేజిలో చదువుతున్న అగస్త్య జైస్వాల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాన్ని 63 శాతం మార్కులతో పాసయ్యాడు. రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా తన కుమారుడు నిలిచాడని అగస్త్య తండ్రి అశ్వినీకూమార్ వెల్లడించారు. తొమ్మిదేళ్ల వయసులో పదోతరగతిని పూర్తిచేసిన రికార్డు కూడా ఆగస్త్య పేరుమీదే ఉంది. దీని కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు వారికి సబ్జెక్టులు, ఏ మీడియంలో రాస్తున్నారు, సెకండ్ ల్యాంగ్వేజీ ఏంటి అనేది తెలిపితే సరిపోతుందన్నారు. వయసు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బోర్డు పరీక్ష రాసేవారిని పదో తరగతి డేటా ఆధారంగా తీసుకుంటారని, అందుకే ఎటువంటి అనుమతులు లేకుండానే ఇంటర్ పరీక్షలు రాశాడని, ఉత్తీర్ణుడు కావడం గర్వంగా ఉందని అశ్వినీకుమార్ తెలిపారు. (తొమ్మిదేళ్లకే పది ఉత్తీర్ణత)