nanded
-
Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగాకిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని.. -
మహారాష్ట్ర: నాందేడ్‌లో భూకంపం.. 3.8 తీవ్రత నమోదు
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈరోజు (మంగళవారం) భూకంపం సంభవించింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్గావ్ తాలూకాలోని సావర్గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.భారతదేశ భూకంప పటంలో నాందేడ్.. జోన్ IIలో ఉంది. ఈ ప్రాంతంలో భూకంపం సంభావ్యత తక్కువగా ఉంటుంది. ఈ నగరం మహారాష్ట్రలోని మరఠ్వాడా డివిజన్లో గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: కమల ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు: డొనాల్డ్ ట్రంప్ -
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
మహారాష్ట్ర, అరుణాచల్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్‌లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
నాందేడ్ ఘటన: ఆసుపత్రి టాయిలెట్స్ క్లీన్ చేసిన డీన్‌పై కేసు నమోదు
ముంబై: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాల ఘటన దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నాందేడ్ శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉండటంతో మరింత వివాదం రాజుకుంది. తాజాగా ఈ వ్యవహారంలో ఆసుపత్రి డీన్‌పై పోలీసు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆసుపత్రి డీన్ డాక్టర్ ఎస్ వాకోడ్‌తోపాటు మరో వైద్యుడిపై నేరపూరితమైన హత్య కేసు నమోదైంది. మృతిచెందిన నవజాత శిశువు బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాందేడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. శిశువు మృతికి డీన్, చైల్డ్ స్పెషలిస్ట్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోవడంతో, బయట నుంచి కొనుక్కొచ్చినా.. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించలేదని ఆరోపించారు. సాయం కోసం డీన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు. వారిని దూరంగా వెళ్లగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వార్త: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 31 మంది మృతి Shiv Sena MP Hemant Patil on Tuesday made the acting dean of the government hospital in Nanded, where 31 patients have died in 48 hours, clean a dirty toilet and urinals, a video of which has gone viral. अगर ये सब करने से बच्चो की जान वापिस आ जायेगी तो हम सब ये करने को तैयार है… pic.twitter.com/ykQOJGYasb — Dr Manoj Chaudhary (@MK_Chaudhary04) October 3, 2023 కాగా తనతో ఆసుపత్రి టాయిలెట్స్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీపై డీన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం వెలుగుచూడటం గమనార్హం. నాందేడ్ శివసేన(షిండే వర్గం) ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం శంకర్రావు చావన్‌ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితని సమీక్షించారు. అక్కడి టాయ్‌లెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఆసుపత్రిలో మరుగుదొడ్ల దుస్థితిని చూసి బాధగా ఉందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇక్కడ పరిస్థితిని చూసి బాధేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లోని టాయిలెట్స్‌కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఎంపీ హేమంత్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి డీన్ ఆర్ఎస్ వాకోడ్తో టాయిలెట్ క్లీన్ చేయించారు. ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ హేమంత్ పాటిల్‌పై ఆసుపత్రి డీన్ వాకోడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీయడం వంటి సెక్షన్ల కింద ఎంపీ హేమంత్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు. #WATCH : MP Makes Dean Clean Toilet of a Hospital Where 31 children Died In 48 Hours.#Nanded #NandedHospital #NandedHospitalDeaths #India #latestnews #latest #LatestUpdate #BREAKING #Maharashtra #MaharashtraNews #MaharashtraHospitalHorror pic.twitter.com/NGE2VMj2TZ — upuknews (@upuknews1) October 3, 2023 -
ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్ శుభ్రం చేయించిన ఎంపీ
ముంబై: మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో టాయ్‌లెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడాతో శుభ్రం చేయించారు. మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య మరో 24 గంటలు గడిచేసరికి 31కి చేరింది. వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు గెలువడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం తోపాటు ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే మరణాలు జరిగాయన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వారే వైద్యానికి సరిగ్గా స్పందించడంలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కూడా అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో షిండే ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేయగా అక్కడి టాయ్‌లెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రి డీన్‌ను పిలిపించి ఆయనతోనే ఆ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయించారు. ఎంపీ అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మరణాలపై దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించామని వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డా.దిలీప్ మైసెఖర్ తెలిపారు. नांदेडमध्ये रुग्ण दगावले, त्याची जबाबदारी अधिष्ठाता यांची आहेच. त्याबद्दल डॉ.वाकोडे यांना उत्तरदायी ठरवलंच पाहिजे. पण त्यांना टॉयलेट साफ करायला लावून शिंदे गटाचे खासदार हेमंत पाटील यांनी काय साधलं? नांदेड रुग्णालयाची दुरवस्था होईपर्यंत हे महाशय कुठे होते? निव्वळ स्टंटबाजी… pic.twitter.com/scTeeoAjlh — Abhijit Karande (@AbhijitKaran25) October 3, 2023 ఇది కూడా చదవండి: అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ -
‘మహా’ జలదృశ్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్పు తేవాలనే ఉన్నత లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పనిచేస్తోందని, దేశ రైతాంగం బాగుపడేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తోందని... కృష్ణా, గోదావరి నదులకు పుట్టినిల్లయిన మహారాష్ట్రలో ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ‘మహారాష్ట్ర, తెలంగాణ వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తుండగా నదుల్లో సుమారు 70 వేల టీఎంసీల నీరు సాగు, తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 20 వేల టీఎంసీల నీటినే ఉపయోగించుకుంటున్నాం. చైనా, ఈజిప్ట్, అమెరికా, జింబాబ్వే వంటి దేశాలు భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మన దగ్గర సరైన ప్రణాళిక లేక కరువు ఎదుర్కొంటున్నాం. తెలంగాణలో సాధించిన జల దృశ్యాన్ని మహారాష్ట్రలోనూ సా«ధించేందుకు తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తూ 4–5 భారీ ప్రాజెక్టులు నిర్మిస్తాం’అని కేసీఆర్ ప్రకటించారు. మార్పునకు మహారాష్ట్ర నాంది పలకాలి... ‘చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా అభివృద్ధి చెందుతున్నా మన నాయకులు ఓట్ల కోసమే పనిచేస్తున్నారు. దేశంలో మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఏర్పాటైంది. దేశంలో మార్పు కోసం మహారాష్ట్ర నాంది పలకాలి. దేశంలో కాంగ్రెస్ 50 ఏళ్లు, బీజేపీ 16 ఏళ్లుగా పాలిస్తున్నా తాగు, సాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. విద్వేష రాజకీయాల మూలంగానే కర్ణాటకలో బీజేపీని ఓడించి అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సమస్యలను పరిష్కరించడంతో రైతులు పూర్తి విశ్వాసం, సంతృప్తితో ఉన్నారు. రైతుబంధు, రైతు బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. దళితబంధు ద్వారా 50 వేల కుటుంబాలకు లబ్ధి జరిగింది. రైతురాజ్యం కోసం బీఆర్ఎస్ దేశవ్యాప్త ప్రయత్నాలు చేస్తోంది’అని కేసీఆర్ వెల్లడించారు. కడదాకా నిలబడే సత్తా ఉంటేనే పార్టీలో చేరండి... ‘కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు, ప్రజల కోసం ఎందాకైనా పోరాడే తెగువ ఉన్నవారే బీఆర్ఎస్లో చేరండి. మన లక్ష్యం గొప్పదనే విషయాన్ని గుర్తించి నిత్యం ప్రజలతో మమేకమై చైతన్యపరచాలి. ఒకసారి అడుగు ముందుకేస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. త్వరలో పార్టీ కమిటీలు వేసుకుందాం. డిజిటల్ రూపంలో అందించే శిక్షణ తరగతుల సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరడంతోపాటు పార్టీ కమిటీలు ఉండాలి. ఆటోలు, ట్యాక్సీలపై స్టిక్కర్లు, పాటలకు విస్తృత ప్రచారం, సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టండి’అని కేసీఆర్ సూచించారు. మహరాష్ట్ర బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జిగా దేశ్‌ముఖ్ పేరును ఖరారు చేశారు. నాందేడ్‌లో ఘన స్వాగతం... నాందేడ్‌లో రెండు రోజులపాటు జరిగే బీఆర్ఎస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. నాందేడ్‌లో శిక్షణ జరిగే అనంత్లాన్స్కు చేరుకొని శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. శివాజీ, అంబేడ్కర్, ఫూలే తదితర మహనీయుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముగ్గురేసి చొప్పున ఎంపిక చేసిన నేతలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ ముగిశాక నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లను పార్టీ బాధ్యులకు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు, మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కతిక భాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేస్తామన్నారు. శిక్షణ శిబిరం వేదికగా మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
ఢిల్లీలో కూడా నీరు, కరెంట్ దొరకని పరిస్థితి: కేసీఆర్
సాక్షి, నాందేడ్: ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెడితేనే.. దేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం నాందేడ్(మహారాష్ట్ర)లో బీఆర్ఎస్ శిక్షణా తరగతుల్ని ప్రారంభించి.. ఆయన ప్రసంగించారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో నీరు కూడా దొరకడం లేదు. కరెంట్ ఉండడం లేదు. దేశంలో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు అనవసర విషయాలపై కాకుండా.. అభివృద్ధిపై దృష్టిసారించాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. దేశం ప్రబల శక్తిగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారాయన. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో MLA ఫ్లెక్సీల కలకలం -
మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్
నాందేడ్: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజలు బతుకులు మారలేదు.మహారాష్ట్రలో సాగు, తాగునీరు అందుబాటులో లేరు. తెలంగాణ మోడల్‌గా ప్రతి రైతుకు రూ. 10 వేలు ఇవ్వాలి. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండీ ఎగురవేస్తాం. రైతు బీమా ద్వారా తెలంగాణ రైతులకు రూ. 5 లక్షలు ఇస్తున్నాం. రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించాలి. రైతుల ఉత్పత్తిని ప్రభుత్వమే కొనాలి.దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే నేను మహారాష్ట్రకు రావడం మానేస్తా.మహారాష్ట్రలో మీకేం పని అని ఫడ్నవీస్ నన్ను ఉద్దేశించి అన్నారు. భారత పౌరుడిగా నేను ప్రతి రాష్ట్రానికి వెళ్తాను. దేశంలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. కానీ కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తాం. త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతుంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మహారాష్ట్రలోనూ జరగాలి. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. -
పెద్ద మనసుతో చెప్తున్నా.. బాబ్లీకి ఎత్తిపోసుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి నది నుంచి మన కళ్ల ముందే రెండున్నర వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సమస్యను అర్థం చేసుకునే శక్తి ఉంటే పార్టీలు, ప్రభుత్వాలుగా విడిపోకుండా పరిష్కరించుకుని వాడుకోవచ్చు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు సామర్ద్యం ఒక టీఎంసీ కూడా లేదు. పెద్ద మనసు చేసుకుని చెప్తున్నా తెలంగాణతో ఒప్పందం చేసుకోండి. గోదావరిలో నీటి లభ్యత ఉందనే విషయాన్ని రుజువు చేసి అవసరమైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాబ్లీ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసుకోండి’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర నాందేడ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిది పదిమార్లు మహారాష్ట్రకు వచ్చి నాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే నీటి వినియోగంలో విప్లవాత్మక ఎజెండా అమలు చేస్తామని, రాష్ట్రాల నడుమ కొట్లాటలు లేని జాతీయ విధానం తెస్తామన్నారు. అవసరానికి మించి నదీ జలాలున్న భారత్‌లో భారీ రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరముందన్నారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడంతో పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం సీట్లు రిజర్వు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 33 శాతం సీట్లు పెంచి మహిళలకు ప్రత్యేకిస్తామన్నారు. రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనపై తమ పార్టీ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. గుణాత్మక అభివృద్ధి కోసం భిన్న ఆలోచనతో దేశ ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటైందని కేసీఆర్ ప్రకటించారు. సింగపూర్, జపాన్, మలేషియా తదితర దేశాల తరహాలçో అభివృద్ధిని పరుగులు పెట్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తమ పార్టీ విధానాన్ని అనుసరిస్తే రెండేళ్లలో భారత్ అద్భుతమైన అభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ అ«ధీనంలోనే పెడతామని, రెండేళ్లలోనే దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తామని స్పష్టంచేశారు. దేశంలో సంపూర్ణ పరివర్తన కోసమే... విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు సంబంధించి తమ పార్టీ ఎజెండాపై నిపుణుల బృందం కసరత్తు చేస్తోందని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో సంపూర్ణ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఎల్ఐసీని పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించడం వాస్తవం కాదని చెప్తున్న కేంద్రం.. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న మిత్రుత్వంతోనే అదానీ ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగాడన్నారు. మతం పేరిట దేశ ప్రజల విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని తేల్చిచెప్పారు. తన తదుపరి మీడియా సమావేశం త్వరలో ఢిల్లీలో ఉంటుందని ప్రకటించారు. -
CM KCR: రైతులే పాలకులు కావాలి
నిర్మల్/భైంసా: ‘ఒక రైతు.. తన కుటుంబాన్ని, భార్యాపిల్లలను వదిలి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టి, జీవితాన్ని ప్రసాదించే రైతన్న ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం ఈ దేశంలో ఎందుకు ఏర్పడింది? దీని వెనకున్న మతలబేంటి? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? దేశం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓవైపు మన రైతులు చనిపోతుంటే, రంగు రంగుల జెండాలు, గంటలకు గంటలు ఎక్కడపడితే అక్కడ, అసెంబ్లీల్లో, పార్లమెంటులో ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు. అందుకే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏ పార్టీ ఇవ్వని విధంగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్‘ అనే నినాదంతో రైతులనే పాలకులను చేసేందుకు ప్రజల ముందుకు వచ్చింది..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్ రైల్వేస్టేషన్ సమీపంలోని గురుద్వారా సచ్‌ఖండ్ బోర్డు మైదానంలో ఆదివారం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రం బయట బీఆర్ఎస్ తొలి సభ కావడం గమనార్హం. కాగా సభలో సీఎం కేసీఆర్ రైతన్నల గోస వినిపిస్తూ, మరాఠా ప్రజల మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్, బీఆర్ అంబేడ్కర్, అన్నాబావ్ సాఠే, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయిఫూలే వంటి మహామహులకు జన్మనిచ్చిన పవిత్ర భూమికి ప్రణమిల్లుతున్నాను..’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశ భావజాలాన్ని మార్చేందుకే.. ‘బీఆర్ఎస్ కొంతకాలం క్రితమే ఆవిర్భవించింది. ఇంతకుముందు టీఆర్ఎస్ పేరుతో తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉండేది. దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నాక, దేశ భావజాలాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బయట తొలిసారిగా మహారాష్ట్ర గడ్డపై బీఆర్ఎస్ మీ ముందుకు వచ్చింది. మహారాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. నా మాటలను ఇక్కడే మర్చిపోవద్దు. మీ ఇండ్లకు, గ్రామాలకు, పట్టణాలకు వెళ్లిన తర్వాత తప్పకుండా చర్చించాలి..’ అని కేసీఆర్ కోరారు. నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ ఒక్కసారి మనం అంతా ఏకం కావాలి.. ‘దేశ గమనంలో, భావజాలంలో, దేశాన్ని నడపడంలో గొప్ప మార్పు అనివార్యం. అలాంటి మార్పునకు సమయం ఆసన్నమైంది. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు మారారు. మనమే వాళ్లందరినీ పదవుల్లో కూర్చోబెట్టాం. నేను చెప్పేది రాకెట్ సైన్స్ కాదు. చాలా సింపుల్‌గా అర్థం అవుతుంది. 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తాగడానికి, సాగుకు నీళ్ళుండవు. కరెంటు కూడా లభించదు. ఎందుకు? దేశంలో వనరుల లభ్యత లేదా? ప్రజలకు సౌకర్యాలను సమకూర్చలేమా? మరేంటి మతలబు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమయ్యాక కూడా అర్థం కానట్టు ఉండకూడదు. ఒక్కసారి మనం అంతా ఏకం కావాలి..’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీల వల్లే ఈ దుస్థితి ‘మన దేశం అమెరికా కంటే ధనిక దేశం. మన నాయకులు సమర్థవంతంగా పనిచేస్తే అంతకంటే గొప్పగా ఎదుగుతుంది. నీరు, భూమి, బొగ్గు, కష్టించి పనిచేసే 140 కోట్ల ప్రజలు దేశానికి ప్రకృతి, దేవుడు ఇచ్చిన వరాలు. భారతదేశంలో మాత్రమే 50 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలుంటే, ఇందులో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా ఉంది. దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షం కురుస్తుంది. కానీ కేవలం 20–21 వేల టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే దేశ దుస్థితికి కారణం. మహారాష్ట్ర పరిస్థితి మరీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచే గోదావరి, కృష్ణా ప్రవహిస్తున్నా.. ప్రవర, పూర్ణ, పెన్‌గంగ, వార్‌గా, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఎన్నో నదులున్నా నీటికి కటకట ఎందుకు? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్కు అండగా నిలవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. జోకిన్ ఇండియాగా మేకిన్ ఇండియా ‘ప్రధానమంత్రి మోదీ తెచ్చిన మేకిన్ ఇండియా.. జోకిన్ ఇండియాగా మారింది. దేశంలోని ప్రతి చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఉన్నాయి. పతంగుల మాంజా, దీపావళి పటాకులు, హోళీ రంగులు, దీపావళి దీపాలు, మనం పూజించే వినాయకుని ప్రతిమలు, చివరకు మన జాతీయ జెండా కూడా చైనా నుంచే వస్తాయి. మేకిన్ ఇండియా అమలైతే చైనా బజార్లున్న చోట భారత్ బజార్లు పెట్టేవారు కదా?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. బాత్, ఓ బాత్..ఇంకా ఎన్నాళ్లు? ‘నేను మీ అన్నను, మీ కొడుకును. బాధాతప్త హృదయంతో మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా. ఈ విషయాలపై బాగా ఆలోచించాలి. దేశ ప్రజలకు తాగు, సాగు నీరు, విద్యుత్ సమస్యలున్నా.. మన్ కీ బాత్, ఏ బాత్, ఓ బాత్ అంటూ ఇంకా ఎన్నాళ్లు ప్రజల్ని మభ్య పెడతారు. మన దేశం కంటే చాలా చిన్న దేశమైన జింబాంబ్వేలో ప్రపంచంలోనే అతి పెద్దదైన రిజర్వాయర్ ఉంది. దీని సామర్థ్యం 6,533 టీఎంసీలు. కానీ సువిశాల భౌగోళిక స్వరూపం, పెద్దసంఖ్యలో జనాభా ఉన్న మన దేశంలో కనీసం మూడు, నాలుగు రిజర్వాయర్లు ఇలాంటివి ఉండకూడదా? ప్రభుత్వం తలచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని సమకూర్చవచ్చు. కిసాన్ సర్కార్ వస్తేనే దేశం పురోగమిస్తుంది..’ అని స్పష్టం చేశారు. గులాబీ జెండా పట్టుకోండి.. ‘తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోటీ–బేటీ సంబంధం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమాన్ని మీరు అనుభవించాలనుకుంటే గులాబీ జెండా పట్టుకొని మీరే నాయకులుగా ముందుకు రండి..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనం నుండే నాయకులు ఉద్భవిస్తారంటూ బాల్క సుమన్‌ను ఉదాహరణగా చెప్పారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళితబంధుతోపాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో బీఆర్ఎస్ అన్ని కమిటీలు వేస్తామని, కేవలం 8 నుంచి 10 రోజుల్లో ప్రతి గ్రామానికి పార్టీ వాహనం చేరుకుంటుందని తెలిపారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన శివనేరి వేదికగా ప్రతిన బూని, మహారాష్ట్ర వ్యాప్తంగా రైతు కమిటీలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు.. జై మహారాష్ట్ర జై భారత్ జై హింద్..’’ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. రైతులు, కార్మికులు కలిస్తే చాలు.. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా మహారాష్ట్రలోనే రైతు ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడతారో ఆలోచించాలి. దేశంలో రైతుల సంఖ్య జనాభాలో 42 శాతం కంటే అధికంగా ఉంది. వ్యవసాయ కార్మికులను కూడా కలిపితే ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంతకన్నా బలం అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్లాక కేసీఆర్ చెప్పిన మాటలు నిజమా? అబద్ధమా? అని ఆలోచించండి. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టుగా ఈ విషయాన్ని వ్యాప్తి చేయాలి. ఇక రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు.. కలాన్ని పట్టి చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలి. రైతులను కేవలం మాటలు, నినాదాలకే పరమితం చేయకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది..’ అని సీఎం తెలిపారు. -
బీఆర్ఎస్ వస్తే దేశంలో కొత్త వాటర్ పాలసీ, పవర్ పాలసీ: కేసీఆర్
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు కావాలంటే బీఆర్ఎస్ను ఆదరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నాందేడ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి వనరులు లేని సింగపూర్, జపాన్, మలేషియా అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో సహజ సంపద ఉన్నా ప్రజలకు చేరడం లేదని పేర్కొన్నారు. 'దేశంలో అవసరానికి మించి జల సంపద ఉంది. చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. మా సర్కార్ వస్తే జల విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. 75 ఏళ్లుగా దేశంలో రైతుల దుస్థితి మారలేదు. రైతుల ఆత్మహత్యలు దేశానికి సిగ్గుచేటు. దేశంలో రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైళ్లు సరిగా లేవు. ఢిల్లీలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బీఆర్ఎస్ వస్తే కొత్త వాటర్ పాలసీ, పవర్ పాలసీ తెస్తాం. అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో జరగాలి.' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'సోషలైజేషన్ ఆఫ్‌ది లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్' ప్రస్తుతం కేంద్రం ఈ ఫార్ములానే ఫాలో అవుతోందని కేసీఆర్ మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయకూడదని సూచించారు. అదానీపై ఉన్న ప్రేమ దేశప్రజలపైనా ఉండాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డంగా అమ్మేస్తున్నారని, అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికవ్యవస్థకు ఇది పెనుముప్పు అని హెచ్చరించారు. చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. -
ఆ నేతల పతనం తప్పదు.. నాందేడ్ సభలో కేసీఆర్
సాక్షి, మహారాష్ట్ర: బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందన్నారు. ‘‘ప్రధానులు మారినా, పార్టీలు మారినా దేశంలో మార్పు రాలేదు. దేశంలో మార్పు తీసురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చాం. ప్రస్తుతం నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘దేశంలో పూర్తిస్థాయిలో కరెంటు, సాగు, తాగునీరు అందడం లేదు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. రైతుల ఆత్మహత్యకు కారణం ఎవరు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. భారతదేశం మేధావుల దేశం. భారత్ పేద దేశం కానేకాదు. చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికా కంటే బలంగా మారుతాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు రాకూడదు. పండించిన పంటకు రైతులే ధరలు నిర్ణయించాలి. అప్పుడే రైతు రాజ్యం సాధ్యమవుతుంది. చైనా కంటే మన దగ్గరే సాగుభూమి అధికంగా ఉంది. దేశంలో వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి’’ అని సీఎం అన్నారు. ‘‘భారత్‌లో నాయకులు గెలవడం కాదు.. రైతులు గెలవాలి. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనేదే బీఆర్ఎస్ తొలి నినాదం. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది. మాంజా నుంచి జాతీయ జెండా వరకు చైనా నుంచే దిగుమతి అవుతుంది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలి. దేశం వెనుకబాటు తనానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఒకరు అంబానీ అంటే.. మరొకరు అదానీ అంటారు’’ అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. చదవండి: TS: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? ‘‘తెలంగాణలో రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. దేశంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు పుష్కలమైన నీరుంది. కేంద్రం ట్రైబ్యునల్ వేసి చేతులు దులిపేసుకుంటోంది. రిజర్వాయర్ కట్టాలంటే అనుమతుల పేరుతో కాలయాపన, ట్రైబ్యునల్‌లో వివాదాలు 30,40 ఏళ్లు కొనసాగుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో కరెంటు కష్టాలు ఉండేవి. కానీ ఇప్పుడు నీటి, కరెంటు సమస్యలు లేవు. రైతులు 50 మోటార్లు పెట్టుకున్నా అడ్డు చెప్పడం లేదు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రమాదంలో చనిపోతే రైతు బీమా అందిస్తున్నాం. జెండా రంగులను చూసి జనం మోసపోతున్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తాం. ఫసల్ బీమా యోజన అంతా ఒక బూటకం’’ అని కేసీఆర్ మండిపడ్డారు. ముందుగా, హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదివారం మధ్యాహ్నం నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. ప్రత్యేక కాన్వాయ్‌లో సభావేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
మహారాష్ట్రలో పరువు హత్య
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వైద్య విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారంతో తమ పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను ఉరి వేసి చంపి, ఆపై దహనం చేశారు. లిబ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్) మూడో సంవత్సరం చదువుతున్న శుభాంగి జొగ్‌దండ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, తను గ్రామానికే చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని శుభాంగి వరుడికి తెలిపింది. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో పరువు పోయిందని కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 22 రాత్రి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబసభ్యులు కలిసి శుభాంగిని తమ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరివేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి, మిగిలిన ఆనవాళ్లను నీళ్లలో పడవేశారు. ఈ మేరకు ఐదుగురిపై హత్య, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ స్కెచ్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణ, జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడం లక్ష్యంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సభ విజయవంతమైందని.. ఈ ఊపులోనే మరో సభతో పార్టీలో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్‌లో మూడు రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ముందే నిర్వహించాలనుకున్నా.. నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభను ఈ నెల 29వ తేదీనే నిర్వహించాలని తొలుత భావించారు. కానీ అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫిబ్రవరి 5ని ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర శాసనమండలిలో రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 2న ఓట్ల లెక్కింపు ఉంది. దీనితో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ సభ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే సమావేశాలకు 4, 5 తేదీల్లో విరామం ఇవ్వనుండటంతో 5న నాందేడ్ సభకు అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భారీగా చేరికలు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు నాందేడ్ సభ వేదికగా మహారాష్ట్రకు చెందిన ముఖ్యనేతలు బీఆర్ఎస్లో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖమ్మం సభకు సీఎం కేసీఆర్‌తో పాటు ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం హాజరైన తరహాలోనే నాందేడ్ సభకు కూడా వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. సభ నిర్వహణ ఏర్పాట్లు, చేరికలు, ఆహ్వానితులపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. సభ కోసం ఈ నెల 5న నాందేడ్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ అక్కడి గురుద్వారాను సందర్శించనున్నారు. మంత్రులకు బాధ్యతలు!: పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభ కావడంతో ఖమ్మం సభను తలపించేలా భారీగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌తోపాటు మరికొందరు నేతల బృందానికి అప్పగించనున్నట్టు సమాచారం. నాందేడ్ సభకు తెలంగాణ సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కూడా కొంతమేర జన సమీకరణ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
నాంథేడ్–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాంథేడ్ – తిరుపతి– నాంథేడ్ల మధ్య (07633/07634) ఈనెలలో నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. నాంథేడ్ నుంచి తిరుపతికి వచ్చే రైలు ఈనెల 16, 23 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. నాంథేడ్లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు కడపకు, 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. తిరుపతి నుంచి నాంథేడ్‌కు వెళ్లే రైలు ఈనెల 17,24 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. పలు రైళ్లకు స్టాపింగ్‌లు జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలిపేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుమల, హరిప్రియ, రాయలసీమ రైళ్లను ఆపనున్నారు. ఈనెల 14 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రాజంపేట, నందలూరులో ఆపనున్నారు. ఈనెల 15 నుంచి హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను ఓబులవారిపల్లి, నందలూరులో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15నుంచి రైల్వేకోడూరు,ఓబులవారిపల్లి, రాజంపేట స్టేషన్లలో ఆపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరు నెలలు మాత్రమే ఈ అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించారని తెలిపారు. -
నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
ముంబై: నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్ఐఏ కోర్టు విధించింది. ముజామిల్, సాదిక్, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు. చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు -
లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర!
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. అందుకే మళ్లీ లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 43 వేలు దాటిన కేసులు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మృతి చెందారు. గురువారం 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం 8,646 కేసులు రికార్డయ్యాయి. 18 మంది కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ఖాయమన్న సంకేతాలను మేయర్ కిషోరి ఫెడ్నేకర్ ఇచ్చారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజేష్ టోపే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే చెప్పారు. లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. లాక్డౌన్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేదానిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామన్నారు. -
భయపెడుతున్న కరోనా.. 10 రోజుల సంపూర్ణ లాక్డౌన్
సాక్షి, ముంబై: బీడ్ జిల్లాలో కూడా రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కరోనా రోగుల సంఖ్య నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీడ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. దీంతో జిల్లాలో అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ ఉంటాయన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. నాందేడ్ పట్టణంతోపాటు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మార్చి 25 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ విపిన్ ఇటన్కర్ మీడియాకు తెలిపారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత నాందేడ్ జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయించారు. చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్) తెలంగాణకు రాకపోకలపై ప్రభావం..! లాక్డౌన్లో భాగంగా నాందేడ్ జిల్లాల్లో రవాణ వ్యవస్థపై కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై ప్రభావం పడింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలతోపాటు మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై నిషేధం విధించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులపై కూడా ఆంక్షలు విధించారు. అయితే నాందేడ్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం జిల్లా నుంచి వెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా అత్యవసర సేవలందించే వాహనాలకు కూడా అనుమతులతో మినహాయింపు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు నాందేడ్ జిల్లా మీదుగా ఇతర జిల్లాలు, తెలంగాణకు వెళ్లేవి, తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులను ఫోన్లో సంప్రదించగా జిల్లా సరిహద్దులను ఇంకా సీల్ చేయలేదని కానీ, పరిస్థితిని బట్టి పూర్తిగా సీల్ చేయనున్నట్టు తెలిపారు. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్) -
అమ్మ కల
ముంబయి, మలాడ్‌లోని ఆటో డ్రైవర్ జయకుమార్ కూతురు ప్రేమా జయకుమార్ సీఏలో టాపర్. కేరళలోని మరో వ్యవసాయ కూలీ కుమార్తె సివిల్స్ లో వందలోపు ర్యాంకు సాధించింది... ఇలా ఎన్నో విజయాలను పేదింటి ఆడపిల్లలు సొంతం చేసుకున్నారు. వాసిమా షేక్ విజయం కూడా అలాంటిదే. కానీ ఇంకా వైవిధ్యమైంది. మరికొంత అందమైనది కూడా. ఆమె పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బు కోసం వాళ్లన్న ఇమ్రాన్ చదువు మానేసి ఆటో నడిపాడు. వాసిమ్ ఎమ్‌పీఎస్‌సీ (మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్)లో మంచి ర్యాంకు సాధించింది. తాను ఉద్యోగంలో చేరి వాళ్లన్నను చదివిస్తోంది. కూతురి విజయం వాసిమా షేక్ సొంతూరు మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా, జోషి సంఘ్వి. వాసిమా తల్లి వ్యవసాయ కూలీ. తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడు. కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది. పని చేసేది మాత్రం ఇద్దరే. వాసిమా తల్లి పొలంలో పని చేస్తే, అన్న ఆటో నడిపేవాడు. వాసిమా చూసిన సమాజంలో మగవాళ్లు మద్యం తాగి ఇంటికి వచ్చి ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకోవడం, నిరక్షరాస్యత, ఆడపిల్లలకు బాల్య వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. ఆడపిల్లకు చదువు చెప్పించడం అంటే డబ్బు దండగ పని అనీ, పెళ్లి చేసి పంపించేస్తే ఒక పని అయిపోతుందనే అభిప్రాయం బలంగా వేళ్లూనుకుని పోయిన సమాజంలో ఒక విప్లవ వీచిక వాసిమా తల్లి. ఆమెకు అప్పట్లోనే బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలని ఉండేది. ఆమె కల నిజం కాలేకపోయింది. నాలుగో తరగతితో చదువాపేయాల్సి వచ్చింది. కలల రెక్కలను విరిచి బాల్య వివాహంతో అత్తింట్లో అడుగుపెట్టింది. తన పిల్లలను బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగులను చేయాలని గట్టిగా నిర్ణయించుకుందామె. వాసిమా టెన్త్ క్లాస్‌లో ‘లోహా’తాలూకాతో ఫస్ట్ వచ్చింది. వాసిమా తల్లి కలలు మళ్లీ రెక్కలు విచ్చుకున్నాయి. వాసిమా చదువును కూడా హరించి వేయడానికి బంధువులు రాబందుల్లా పొడుచుకు తింటుంటే వాళ్లను ఖాతరు చేయడం మానేసిందామె. జూనియర్ కాలేజ్ కోసం ఉస్మాన్ నగర్‌కు కాలి నడకన వెళ్లింది వాసిమా. ఆ తర్వాత ‘యశ్వంత్ రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్‌యూనివర్సిటీ’ నుంచి 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఎమ్‌పీఎస్‌సీ పరీక్షలకు తనను తాను సిద్ధం చేసుకుంది. ఆమె చదువుకు కరెంటు లేదు, కోచింగ్ లేదు. రాత పరీక్షలో గట్టెక్కింది. కానీ ఇంటర్వూ్యలో విజయం రెండు మార్కుల దూరంలో ఉండిపోయింది. రెండవ ప్రయత్నంలో 2019లో నాగపూర్‌లో సేల్స్ టాక్స్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరింది. తాను ఇంటికి సహాయంగా ఉంటానని భరోసా ఇచ్చి అన్నను తిరిగి కాలేజ్‌లో చేరమని చెప్పింది. తాజా ప్రయత్నంలో వాసిమా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి అర్హత సాధించింది. వాసిమా స్ఫూర్తితో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా ఎమ్పీఎస్సీకి సిద్ధమవుతున్నారు. 2015లో వాసిమా పెళ్లి హైదర్ సాహిబ్‌తో జరిగింది, అతడు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వాసిమా విజయానికి అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అమ్మ కలను వాసిమా సాకారం చేసింది. మిగిలిన బిడ్డలు కూడా ఆ కలను సంపూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. -
వీడిన మిస్టరీ.. డబ్బు కోసమే హత్య
సాక్షి, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని నాంధేడ్లో హత్య గురైన ఇద్దరు సాధువుల మర్డర్ మిస్టరీ వీడింది. ఈ కేసుతో సంబంధమున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా ఎల్వీలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీసుల విచారణలో పలు అంశాలు వెలుగుచూశాయి. డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి వాంగ్మూలం తీసుకుని కస్టడికి తరలించారు. కాగా శనివారం రాత్రి విగతజీవిగా పడి ఉన్న ఇద్దరు సాధువులు బాలబ్రహ్మచారి శివాచార్య, ఆయన శిష్యుడు భగవాన్ షిండే మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే హత్య కేసును పోలీసులు ఛేదించారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) -
కరోనా : నాందేడ్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 10 వేలు దాటేసింది. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మొత్తం 485 మంది మరణించారు.తాజాగా నాందేడ్‌లోని హజుర్ సాహిబ్ గురుద్వారాలో 20 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 97 మంది శాంపిల్స్‌ని పరీక్షలకు పంపించగా 20 మందికి కరోనా వైరస్ పాటిజివ్ నిర్ధారణ అయిందని నాందేడ్ ఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. 25 మందికి నెగెటివ్ వచ్చిందన్నారు. మరో 41 మంది ఫలితాల త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 20 మంది మహారాష్ట్ర వాసులేనని స్పష్టం చేశారు. నాందేడ్ హుజూర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో 296 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సిక్కుల్ని తిరిగి పంపిస్తోన్న మహారాష్ట్ర
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాందేడ్‌లోని గురుద్వారలో చిక్కుకుపోయిన సిక్కు భక్తులను మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పంపించింది. లాక్డౌన్ ప్రకటించడానికన్నా ముందు సుమారు 3000 మంది సిక్కులు ఇక్కడి గురుద్వారలో చిక్కుకుపోయారు. వీరంతా పంజాబ్, హర్యానా, తదితర ప్రదేశాలకు చెందినవారు. ఇప్పటికే లాక్డౌన్ వల్ల సుమారు నెలకు పైగా ఇక్కడే ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎలాగైనా తమను స్వస్థలాలకు పంపించాలంటూ అధికారులను వేడుకున్నారు. (న్యూసెన్సే!) పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సైతం వారిని వెనక్కు తీసుకురావడానికి కృషి చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా గురువారం రాత్రి పది వాహనాల్లో 330 మంది సిక్కులను స్వస్థలాలైన పంజాబ్, హర్యానాలకు తరలించింది. మిగతావారిని సైతం తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ముందుగా దీనికోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి అనుమతి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (వెంటాడుతోంది..@30) -
బస్సు పోయింది... బోర్డు మిగిలింది!
సాక్షి,హైదరాబాద్: మూడ్రోజుల క్రితం గౌలిగూడ బస్టాండ్‌లో అపహరణకు గురైన ఆర్టీసీ బస్సును పోలీసులు గుర్తించారు. కుషాయిగూడ డి పోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ (ఏపీ 11 జెడ్ 6254)బస్సును అఫ్జల్‌గంజ్ పోలీసులు మహారాష్ట్ర లోని నాందేడ్‌లో స్వాధీనం చేసుకున్నారు. బస్సు అదృశ్యంపై నగర పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా గౌలిగూడ నుంచి బస్సు మాయమైన తర్వాత తూప్రాన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. నేషనల్ హైవేస్ అథారిటీ సహాయంతో తూప్రాన్ టోల్గేట్ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించగా..బస్సు అదే మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. తూప్రాన్ దాటి నిర్మల్, భైంసాల మీదుగా నాందేడ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ పర్యవేక్షణలో 9 మంది పోలీసుల బృందం నాందేడ్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సును భాగాలుగా విడదీస్తున్న మెకానిక్ షెడ్‌ను స్థానిక పోలీసుల సహకారంతో గుర్తించారు. పోలీసులు రావడంతో దొంగిలించిన వ్యక్తులు పరారీ కాగా బస్సు విడి భాగాలను విప్పుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో... కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్ మధ్య రాకపోకలు సాగించే సిటీ బస్సును మంగళవారం రాత్రి ఆఖరి ట్రిప్పు తర్వాత వెంకటేశం కండక్టర్ రాహుల్‌లు అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీబీఎస్ డిపో–1లో పార్క్ చేసి పక్కనే ఉన్న విశ్రాంతి భవనంలో నిద్రపోయారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో విధులకు సిద్ధమయ్యే క్రమంలో డ్రైవర్ బస్సు కోసం వచ్చాడు. కానీ అప్పటికే తాను పార్కింగ్ చేసిన చోట బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందజేశాడు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్స్టేషన్లు, డిపోల్లో భద్రతను పెంచండి: రవాణా మంత్రి బస్సు అపహరణ ఉదంతంపై రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్స్టేషన్లు, డిపోల్లో భద్రతను పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడ భద్రతా లోపాలున్నాయో గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవీందర్, వినోద్ కుమార్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.