narsampeta
-
బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి
సాక్షి, వరంగల్: బద్రినాథ్ యాత్రకు వెళ్లిన ఓ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చామర్తి ఉషారాణి(52), భర్త డాక్టర్ నందకిషోర్లు శ్రీనివాస నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఓ వైపు డాక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దంపతులిద్దరు 12 యాత్రల దర్శనంలో భాగంగా ఈ నెల 9వ తేదీన వెళ్లారు. శనివారం ఉదయం బద్రినాథ్‌లో ఉషారాణికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహం రాత్రి నర్సంపేటకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డాక్టర్ ఉషారాణి కుటుంబ సభ్యులతో ఫొన్లో మాట్లాడి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస నర్సింగ్‌హోంలో ప్రత్యేకంగా ఉషారాణి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో డాక్టర్ మనోజ్‌లాల్, డాక్టర్ భారతి, గుడిపూడి అరుణ, నల్ల భారతి, చిలువేరు రజినిభారతి, పెండెం రాజేశ్వరి, గుర్రపు అరుణ, వాసం కరుణ తదితరులు ఉన్నారు. -
ఇది ‘పది’ చోరీల కథ.. చివరికి ప్రిన్సిపాల్ ఇంటిమందున్న వాహనాన్ని కూడా
సాక్షి, వరంగల్: దొంగతనాలు జరిగాయంటే దాని వెనుకాల వయస్సును బట్టి పరిస్థితులు ఉంటాయి. అందులోనూ పదోతరగతి విద్యార్థులు పలు చోరీలకు పాల్పడ్డారంటే.. అందరూ ఉలిక్కిపడే పరిస్థితి.. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదిమంది పదో తరగతి విద్యార్థులు చోరీలకు పాల్పడుతూ కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థలోని హాస్టల్లో ఉంటున్నారు. డబ్బుల కోసం.. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ప్రహరీ దూకి వైన్‌షాపుల్లో, ఇళ్ల ముందు ఉన్న వాహనాలను, పెట్రోల్ బంకుల్లో ఉన్న వస్తువులను చోరీ చేస్తున్నారు. చివరికి పాఠశాల ప్రిన్సిపాల్ ఇంటిముందు ఉన్న వాహనాన్ని కూడా దొంగిలించారు. గమనించిన పాఠశాల యాజమాన్యం నర్సంపేట పోలీసులకు తెలియజేసింది. ఎస్హెచ్ఓ పాఠశాలను మంగళవారం సందర్శించి ఆరా తీశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిని రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
సూసైడ్ నోట్: నా చావుకు వారే కారణం..!
సాక్షి, నర్సంపేట రూరల్ : ఎక్సైజ్ పోలీసులు, వైన్స్ యజమాని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జేబులో సూసైడ్ నోట్ లభించడంతో మృతదేహంతో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన ఊడ్గుల రాజమల్లు(52) వికలాంగుడు కావడంతో గౌడ వృత్తి చేయలేక కిరాణం షాపు అందులోనే బెల్టుషాపు నడిపిస్తున్నాడు. చెన్నారావుపేటలోని వైన్స్ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకునేవాడు. కోవిడ్ మొదలైనప్పుడు లాక్డౌన్ విధించగా, అధికారులు తనిఖీలు చేపట్టి రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్యాన్ని తిరిగి ఇప్పిస్తానని ఒకరు నమ్మబలికినట్లు తెలుస్తుండగా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమల్లు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమల్లు మృతదేహం అయితే ఆయన చొక్కా జేబులో సూసైట్ నోట్‌ను కుటుంబీకులు గుర్తించారు. నా చావుకు కారణం ఎక్సైజ్ ఎస్సై, సీఐ గారు మరియు చెన్నారావుపేట బ్రాండీ షాప్ యాజమాని కృష్ణారెడ్డి గారు కారణం. వీరి మధ్యల ఇబ్బంది పడ్డాను అని ఉండడంతో ఆయన మృతదేహాన్ని తీసుకుని నర్సంపేటలోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వేసి ధర్నాకు దిగారు. సుమారు ఐదుగంటల పాటు ధర్నా కొనసాగగా, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాజమల్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎస్సై, సీఐ, కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై నర్సంపేట ఎక్సైజ్ సీఐ శశికుమారిని వివరణ కోరగా లాక్డౌన్ సమయంలో రూ.2వేల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామే తప్ప ఆయనను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుపై పోలీసులతో పాటు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. -
ఫ్రెండ్స్ పార్టీ: నర్సంపేటలో దారుణం..
సాక్షి, వరంగల్: నర్సంపేటలో దారుణం జరిగింది .. స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. రాత్రి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన ప్రేమ్ కుమార్‌ను స్నేహితుడు దిలీప్ కత్తితో పొడిచి చంపాడు. దిలీప్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ప్రేమ్ కుమార్ ఆర్మీలో సేవలందిస్తున్నాడు .. సెలవుల్లో నర్సంపేటకు వచ్చిన ప్రేమ్‌ను తోటి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు. స్నేహితుల మధ్య వచ్చిన గొడవలే మృతికి కారణంగా తెలుస్తోంది. -
నర్సంపేటలో ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్ హత్య
-
నేనేం కథలు చెప్పడం లేదు: కేసీఆర్
సాక్షి, నర్సంపేట : ఎన్నికలనగానే చాలా మంది వచ్చి చాలా చెబుతుంటారని, కానీ ప్రజలే రాష్ట్రానికి మంచి ఏదో ఆలోచించి ఓటేయాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సంపేట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలనగానే ఆగం కావద్దని, 58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు.. 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్లు బరిలో నిలిచాయన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఎవరికి ఓటేయాలో జనమే విజ్ఞతతో ఆలోచించాలి. గతంలో తెలంగాణోళ్లకు తెలివి లేదని ఎద్దేవ చేసిన సమైక్యపాలకుల రాష్ట్రం కంటే మనం అభివృద్ధి సాధించాం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏం జరిగినాయో.. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ 24 గంటల కరెంట్ లేదు. కరెంట్ యొక్క తలసరి వినియోగంలో దేశంలోనే నెం1గా ఉన్నాం. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్లతో పాటు బీడీ కార్మీకులకు, బోధకాలు బాధితులకు పెన్షన్‌లిస్తున్నాం. అధికారంలోకి రాగానే ఈ పెన్షన్లను రెండింతలు చేస్తాం. కల్యాణ లక్ష్మీ పథకం వస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణీ లక్ష్మీ పథకంతో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. నేనేం కథలు చెప్పడం లేదు. ఇవన్నీ జరుగుతున్నయే. మీరు చూస్తున్నవే. రైతు బంధులాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 10 పథకాల్లో రైతు బంధు ఒకటి. రైతు భీమాను గుంట భూమి ఉన్న రైతుకు కూడా వర్తింపజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి తీరుతాం. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం. కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బీడుభూముల సమస్యలను పరిష్కరిస్తాం. తండాలను గ్రామపంచాయితీలుగా చేసినం. దీంతో గిరిజన సోదరులు గ్రామ సర్పంచ్‌లుకానున్నారు. రిజర్వేషన్లను పెంచాలని కేంద్రంతో కొట్లాడినం. అవి కూడా సాధిస్తాం. నర్సంపేటలో గత ఎన్నికల్లో దయ చూపలేదు. అయినా అన్ని పథకాలు కొనసాగించాం. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయించాం. 2001 నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీలో ఉండి కష్టపడుతున్నారు. ఆయనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. ఈ సారి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి.’ అని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ముహూర్తం చూసుకొని అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, వరంగల్: అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. వేద శాస్త్రాల ప్రకారం నేడు తిథి నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చిచెప్పటంతో అధికార, ప్రతిపక్ష అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మెజార్టీ నామినేషన్లు సమర్పించటానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 20 మంది నామినేషన్లు వేయనున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, తరువాత రోజుల్లో భారీ ఊరేగింపులో వెళ్లి రెండోసెట్ పత్రాలు సమర్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఎవరి సెంటిమెంటు ప్రకారం వాళ్లు ముందుగా ఇష్టదైవాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేస్తుండగా మరికొంత మంది నేతలు మాత్రం కార్యకర్తలను మించిన దేవుళ్లు లేరంటూ వారి సమక్షంలోనే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధయ్యారు. భద్రకాళి మీద భరోసా..... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థులు అంతా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన తరువాతే నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్, బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్లు సమర్పిస్తున్న వారిలో ఉన్నారు. వీళ్లంతా స్వతహాగానే మహాశక్తి భక్తులు కావటంతో అందరూ ముందుగా భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు సమర్పించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి నామినేషన్ వేయనున్నారు. అంతకు ముందు వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఇతర ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేస్తార.బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. 19న మరో సెట్ నామినేషన్ ర్యాలీగా వెళ్లి దాఖలు చేయనున్నారు. బీజేపీ నుంచి ఆశావహా అభ్యర్థి, పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. కార్యకర్తలే దేవుళ్లు.... కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహా అభ్యర్థి, ఆ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అందరినీ నమ్మాడు. చివరకు ఎవరూ సాయం కాలేదు. దీంతో కాస్త నిర్వేదం, ఆగ్రహంతో ఉన్న ఆయన కార్యకర్త దేవుళ్లను నమ్ముకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటి నుంచి నేరుగా పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముందుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ నెల 15న ర్యాలీగా వెళ్లి మరోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గట్టమ్మ తల్లికి, లక్ష్మీనరసింహస్వామికి మొక్కి.. భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ నుంచి సీటు, బీ పారం రాకున్నా గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేయనున్నారు. మధుసూదనాచారి రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేయనున్నారు. గండ్ర సత్యనారాయణరావు కూడా ఇక్కడే పూజలు చేసిన అనంతరం నామినేషన్ సమర్పించనున్నారు. బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత నామినేషన్ వేయనున్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున సీతక్క, టీఆర్ఎస్ తరుపున చందూలాల్ గట్టమ్మ దేవాలయంలో దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేయనున్నారు. చందూలాల్ 1:45 గంటలకు వేయనున్నారు. కురవి వీరన్న అనుగ్రహంతో... టీఆర్ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ , డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ కురవి వీరభద్రున్ని దర్శించుకొని నామినేషన్లు సమర్పించనున్నారు. ఇక డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని ప్రతి మండల పార్టీ అధ్యక్షులను వెంటబెట్టుకొని వెళ్లి నామినేషన్ వేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని రెడ్యానాయక్ అనుచరులు చెప్తున్నారు. అన్నిటికీ రేణుకఎల్లమ్మ తల్లే.... జనగామ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆనవాయితీగా రేణుకా ఎల్లమ్మకు దండం పెట్టుకొని నామినేషన్ వేస్తున్నారు. యశ్వంతాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆయన నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేణుక ఎల్లమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేయించిన తరువాతే సమర్పించారు. ఇంట్లో నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి 1.45 గంటలకు ఆలయానికి వెళతారు. అక్కడ నుంచి రెవెన్యూ డివిజనల్(ఆర్వో) కార్యాలయానికి చేరుకుంటారు. తనతో పాటు మరో నలుగురు నాయకులను వెంట తీసుకెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకు రెండు నామినేషన్ సెట్లను ఆర్ఓకు అందజేయనున్నారు. 17వ తేదీన జనసమీకరణతో మరో సెట్టు వేయనున్నట్లు ముత్తిరెడ్డి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య సెంటిమెంట్ ప్రకారం మొదట స్థానిక చర్చిలో, అనంతరం ఘన్పూర్, శివునిపల్లి బొడ్రాయిల వద్ద, అనంతరం స్థానిక మజీద్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ర్యాలీగా ఆర్వో కార్యాలయం(తహసీల్దార్ కార్యాలయం) వరకు వెళ్లి మధ్యాహ్నం 1.45 నుంచి 2గంటల 30 నిమిషాల మధ్యలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రాముఖ్యత ఈ రోజునే ఎందుకు? వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం ఇది. శ్రావణ నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకొని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12:40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఉండడంతో పాటు మకరలగ్నంలో చంద్రుడు, కేతువు, 11వ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారితీస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఎక్కువమంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయటానికి సిద్ధమయ్యారు. నర్సంపేటలో పెద్ది... నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి దేవుళ్ల కంటే కార్యకర్తలపట్లనే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత నామినేషన్ వేస్తారు. వర్ధన్నపేట నుంచి అరూరి రమేష్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ వేస్తారు. -
అభివృద్ధి కోసం ఆదరించి గెలిపించండి
సాక్షి, నర్సంపేట: నియోజవకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తెప్పించి 30 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని చేసి చూపించానని తెలిపారు. ఈ ఎన్నికల్లో 105 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. కేసీఆర్ కుటుంబం త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి జరిగిందన్నారు. రెండు పంటలకు సరిపోను నీటిని అందించి లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రత్యేక ప్రణాళికతో నర్సంపేటను మోడల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. తాను గెలిచిన వెంటనే అన్ని రకాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, జిల్లా నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, దార్ల రమాదేవి, గంప రాజేశ్వర్‌రావు, పుట్టపాక కుమారస్వామి, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు... నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
లెక్క తప్పితే.. చిక్కే..
సాక్షి,నర్సంపేట: సార్వత్రిక ఎన్నికల పర్వం మొదలైంది. ముందస్తుగా ప్రభుత్వం రద్దు కావడం, ఎన్నికల కోడ్ అమలులోకి రావడం రెండు నెలల వ్యవధిలో జరిగిపోయాయి. టికెట్ ఖరారైన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలామునకలయ్యారు. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. వర్తమాన రాజకీయాల్లో డబ్బుల అభ్యర్థులు విజయం కోసం చేసే ఖర్చుల వద్దు కూడా పెద్దదే. అయితే ఎంత చేయాలనేది ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతి అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఆదేశించింది. వాహనాలు, భోజనాలకు, పార్టీ జెండాలకు తదితర వస్తువులకు లెక్కలను రూపొందించింది. సామగ్రి అద్దెలు ఇలా.. లౌడ్ స్పీకర్, ఆప్లిఫైర్ మ్రెక్రోఫోన్ రోజుకు రూ.800 బహిరంగ సభకు సంబంధించిన వేదికకు రూ.2,500 క్లాత్, ఫ్లెక్సీకి రూ.10, వాల్‌పోస్టర్ రూ.10 ప్లాస్టిక్ జెండా రూ.8, క్లాత్ జెండాకు రూ.12 హోర్డింగుల ఏర్పాటుకు రూ.15,000 చెక్కతో తయారుచేసిన కటౌట్‌కు రూ.8,000 వస్త్రం, ప్లాస్టిక్‌తో తయారుచేసిన కటౌట్‌కు రూ.5,000 ఫొటో, వీడియోగ్రాఫర్ (రోజుకు) రూ.3,000 స్వాగత తోరణానికి రూ.2,500 టెంట్లు (సైజునుబట్టి) రూ.400 నుంచి రూ.800 కుర్చీకి రూ.6, భోజనానికి రూ.60 కార్పెట్‌కు రూ.250, సైడ్ వాల్‌కు రూ.80 భోజనం చేసే ప్లేట్‌కు రూ.3, చాయ్‌కు రూ.6 హోర్డింగ్‌ల ఏర్పాటుకు, మునిసిపాలిటీ అనుమతి తీసుకోవడానికి రూ.500 విశ్రాంతి కోసం అద్దెకు తీసుకునే ఇంటికి (రోజుకు) రూ.2000 తలపై ధరించే టోపీకి రూ.50, కండువాకు రూ.10 ఎన్నికల గుర్తుతో ఉన్న టీషర్టులకు రూ.150 వాహనాలను నడిపే డ్రైవర్‌కు రోజుకు రూ.800 జీపు రోజుకు రూ.1,600 టెంపో, ట్రాక్టర్‌కు రూ.2,500 సుమో, క్వాలీస్ రూ.3,500 కారుకు రూ.3,000 ఆటోకు రూ.1,000 రిక్షా, ద్విచక్ర వాహనాలకు రూ.500 -
అద్దెల వెనుక..అక్రమాలు
మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెల అద్దె వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అద్దెను తక్కువకు కేటాయించి కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లోని చాపల మార్కెట్, బాలికల పాఠశాల, సెంట్రల్ బ్యాంక్, నెహ్రు పార్కు, మునిసిపాలిటీ ముందు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన మొత్తం 64 షాపులను అద్దెకు కేటాయించారు. వాస్తవానికి షాపుల అద్దెను రెన్యూవల్ ద్వారా కాకుండా టెండర్లతో కేటాయిస్తే మూడు రెట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే మూడు సంవత్సరాలకు ఒక్కసారి 33శాతం అద్దె పెంచుతూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు. అంబేద్కర్ సెంటర్లోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న మునిసిపాలిటీ షాపులకు నెలకు గతంలో రూ.2700 చొప్పున అద్దె నిర్ణయించారు. దీంతో ప్రతి ఏడాది రూ.25లక్షలు ఆదాయం వస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వాస్తవానికి అంతే విస్తీర్ణంలో ఉన్న ప్రైవేట్ షాపులకు మార్కెట్లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు అద్దె ఉంది. ఈ వ్యత్యాసం చూస్తే ప్రతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రైవేట్ షాపుల కంటే సగం అద్దెకు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో ప్రతి ఏడాది మరో రూ.25 లక్షల ఆదాయం కోల్పోతోంది. 13 ఏళ్లుగా ఇదే తంతు.. షాపింగ్ కాంప్లెక్స్‌లకు 2005 సంవత్సరంలో టెండర్ల ద్వారా అద్దెలు నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ప్రతీ సారి అద్దె 33శాతం పెంచి రెన్యూవల్తోనే కొనసాగిస్తున్నారు. దీంతో రూ.కోటికి పైగానే ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే.. మునిసిపాలిటీ పరిధిలో పనిచేసే అధికారుల కనుసన్నల్లోనే అద్దెల వ్యవహారం కొనసాగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నా యి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నర్సంపేట 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. టెండర్లు నిర్వహించిన 2005 నుంచి ఆరు సంవత్సరాల పాటు నలుగురు ఈఓపీఆర్డీలు మారారు. 2011 నుంచి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన 2018 వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. మొత్తం ఏడుగురు అధికారులు మారినా షాపింగ్ కాప్లెక్స్లకు రెన్యూవల్తోనూ అద్దెలకు కేటాయించారు. కొన్నిచోట్ల ఒక్కరికే రెండు షాపులను కేటాయించి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తక్కువ అద్దెకు షాపులు కేటాయించి సదరు యజమానులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కమీషన్లు దండుకుంటూ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ సారి కూడా రెన్యూవల్ పద్ధతిన గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 64 షాపులలో 75శాతం వాటికి గత మార్చి 31వ తేదీతో గడువు ముగిసిపోయింది. వాటికి వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి అద్దెను నిర్ణయించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మునిసిపాలిటీకి జరుగుతున్న నష్టాన్ని పాలకవర్గం అడ్డుకుని ఆదాయం పెంచుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నష్టం జరగకుండా చూస్తాం.. మునిసిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె పెంచేందుకు సర్వే చేయిస్తాం. ప్రైవేట్ షాపుల అద్దెతో పోల్చి సరాసరి అద్దెను నిర్ణయించి నష్టం జరగకుండా చూస్తాం. ఒకే వ్యక్తికి రెండు షాపులు కేటాయించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. మునిసిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారమే షాపులను కేటాయించేలా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తాం. -
మళ్లీ కొత్త జిల్లాల లొల్లి!
♦ వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంపై తకరారు ♦ కలెక్టరేట్ స్థలం ఎంపికపై వివాదం ♦ పరకాల, నర్సంపేట, మామునూరుల్లో ఆందోళనలు ♦ అధికార పార్టీ ఎమ్మెల్యేల తలోబాట.. తెరపైకి నర్సంపేట జిల్లా డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల పేచీ మళ్లీ తెరపైకి వచ్చింది. పాత వరంగల్ జిల్లా కేంద్రంగా ఈ వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న నర్సంపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ అక్కడి నేతలు తాజాగా డిమాండ్‌ను లేవనెత్తారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని.. రెవెన్యూ డివిజన్లకు సైతం సంబంధం లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఆ ప్రాంత నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పాత వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా ముక్కలైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా విడగొ ట్టారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసే ఉన్నా.. ఈ పాత జిల్లా కేంద్రాన్ని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా విడగొట్టడంపై స్థానికుల నుంచి విమర్శలు పెల్లుబికాయి. హన్మకొండ పేరును పరిగణనలోకి తీసుకోకుండా.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా పేరు పెట్టడం కూడా వివాదాస్పదమైంది. అసలు జిల్లా కేంద్రం ఎక్కడ? హన్మకొండలో సుబేదారి ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ ప్రాంతాన్ని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంగా మార్చారు. దాంతో ఇబ్బందేమీ లేకున్నా.. కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ రూరల్ జిల్లా కేంద్రమేదీ? ఎక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం కొత్త వివాదాన్ని రాజేసినట్లయింది. హన్మకొండ లోని మిషన్ కాకతీయ సూపరింటెండెంట్ కార్యాలయంలో వరంగల్ రూరల్ కలెక్టరేట్‌ను తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ఎక్కడ నిర్మిస్తే అనువుగా ఉంటుందనేది అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరీక్ష పెట్టినట్ల యింది. గీసుకొండ మండలం మొగిలిచర్లలో కలెక్టరేట్ ఏర్పాటుకు ఉచితంగా భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు ఈ నెల 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో కలెక్టరేట్ ఏర్పాటును పరకాల, వర్ధన్నపేట ప్రజలు, నాయకులు వ్యతిరేకిస్తు న్నారు. మొగిలిచర్లకు బదులుగా నర్సంపేట లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక నేతలందరూ ఆందోళనలు చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీడీపీ నేత రేవూరి అందులో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని మామునూరులోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలంటూ వర్ధన్నపేట నియోజక వర్గంలో అఖిలపక్ష నేతలు దీక్షలు చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తలోరకంగా స్పంది స్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. -
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
దుగ్గొండి, చెన్నారావుపేట(నర్సంపేట): స్థానిక ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పరీక్షా కేంద్రాల ఇన్చార్జిలకు సూచించా రు. ఎస్సై భాస్కర్‌రెడ్డి, పరీక్షా కేంద్రం సీఎస్‌లు సాల్మన్, రజాక్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావు పేట మం డలంలోని అమీనాబాద్ మోడల్‌స్కూల్, సిద్ధార్థ హైస్కూల్, జెడ్పీ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఈఓ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈ లక్ష్మీనారాయణ, సీఎస్ కొమ్మాలు, సీసీ రవిచంద్ర, రవికుమార్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కొమ్మాల జాతర
గీసుకొండ(పరకాల) : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా రెండో రోజైన సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు భక్తులు లక్ష్మీనర్సింహ స్వామి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్వామి వారిని దర్శించుకోగా అధికారులు, అర్చకులు, స్వాగతం పలికి పూజలు చేయించారు. కాగా, పోలీసులు జాతరలో రాజకీయ ప్రభలను నిషేధించినట్లు ప్రకటించినా వివిధ పార్టీల నాయకులు పలు ప్రాంతాల నుంచి జాతరకు తరలించారు. ఇక తెలంగాణ జాగృతితో పాటు కొమ్మాల సర్పంచ్ జూలూరి సంధ్య– కేదారి దంపతులు రెండు ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీటి సరఫరా చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, కొమ్మాల ఆలయం వారు సంయుక్తంగా రథశాల వద్ద భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 16వ తేదీన స్వామి వారి రథ్సోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ కమల, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబు తెలిపారు. ఈస్ట్ డివిజన్ డీసీపీ ఇస్మాయిల్, మామునూరు ఏసీపీ శోభన్‌కుమార్, గీసుకొండ సీఐ ప్రభాకర్‌రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబురెడ్డి పాల్గొన్నారు. భారీగా తరలిన దేవుని బండ్లు, ప్రభబండ్లు దుగ్గొండి(నర్సంపేట): దేవుడి బండ్లు, చక్రపుబండ్లు, గుర్రపు బాణాలు, ఏనుగ బాణాలు, మేక పోతుల బండ్లు, పాలారాపు బండ్లు ఇలా అందమైన అలంకరణలో ప్రభ బండ్లు గ్రామగ్రామాన సందడి చేశాయి. పలు గ్రామాల నుంచి అలంకరణలో ఉన్న బండ్లతో భక్తులు కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి సన్నిధికి బయలుదేరారు. కాగా, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభబండ్లను గిర్నిబావిలో సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అద్యక్షుడు ఆకుల శ్రీనివాస్, శానబోయిన రాజ్‌కుమార్, కాట్ల భద్రయ్య, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఆరె జైపాల్‌రెడ్డి, గుడిపెల్లి జనార్దన్‌రెడ్డి, నాతి వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా, కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో 2004 నుండి రాజకీయ ప్రభలపై పోలీసులు నిషేధం విధించడంతో జాతర వెలవెలబోయింది. ఈసారి ఆంక్షలు విధించినా పార్టీల ఆధ్వర్యంలో భారీ రాజకీయ ప్రభలను ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు రాజకీయ ప్రభలను పోటాపోటీగా తరలించారు. కాంగ్రెస్ ప్రభలను మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అయితే అనుమతి లేకపోవడంతో గిర్నిబావిలో ఎస్సై భాస్కర్‌రెడ్డి రెండు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు పార్టీల జెండాలు తీసివేసి అనుమతించారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన మేకపాలు
నర్సంపేట: మేకపాల విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో.. కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రతో చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
నర్సంపేట : నర్సంపేటను పాకాల జిల్లా కేం ద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సం దర్భంగా కమిటీ గౌరవాధ్యక్షుడు సాంబ రాతి మల్లేశం మాట్లాడుతూ నర్సంపేట జిల్లా కోసం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా పోరాడాలని విద్యార్థులు, యువకులకు పిలుపునిచ్చారు. నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పాటయితే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ధర్మారం వద్ద రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యాపశెట్టి రాజు, భూక్య జగ¯ŒS, ఆబర్ల రాజన్న, శ్రీశైలం, మొగిళి ప్రతాప్‌రెడ్డి, సుభాష్, అజ్మీర రమేష్, భూక్య కళ్యాణ్, మాలోతు సంతోష్, గుగులోతు మహేందర్, రవి, కట్ల రాజశేఖర్ పాల్గొన్నారు. పాకాల జిల్లా ఏర్పాటు చేయాలి : ఎల్‌హెచ్‌పీఎస్ నర్సంపేట కేంద్రంగా పాకాల జిల్లాను ఏర్పా టు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీ య కార్యదర్శి వాసునాయక్ డిమాండ్ చేశా రు. పట్టణంలో గురువారం నిర్వహించిన ఎల్‌హెచ్‌పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయుల చరిత్ర కలిగిన పాకాల పేరుతో రూరల్ జిల్లాను నర్సంపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాచేస్తే పరిపాలన పరంగా అన్నివర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. నాయకులు జాటో తు తిరుపతినాయక్, రాజేందర్, అనిల్, తిరుపతి, జన్ను శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు. -
నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలి
జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ నర్సంపేట : ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు, జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు కాకుండా రాజకీయ స్వప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటుచేస్తే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గాన్ని పూర్తిగా వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలన్నారు. ఒకవేళ గ్రామీణా జిల్లాను ఏర్పాటు చేయాల్సి వస్తే అన్ని వసతులు ఉన్న నర్సంపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో నర్సంపేటలో జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ పర్యటిస్తారని అంబటి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులతో నిర్వహించనున్న భారీ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్, కాంగ్రెస్ నాయకులు పాలాయి శ్రీనివాస్, పోలబోయి లక్ష్మయ్య, టీడీపీ నాయకులు ఎర్ర యాకుబ్‌రెడ్డి, వేముల బొందయ్య, సుధాకర్, బూర సుమన్‌గౌడ్, కల్లేపల్లి ప్రణయ్‌దీప్, షేక్ జావిద్, రుద్ర ఓంప్రకాశ్, బోనగాని రవీందర్, మాచర్ల రమేష్, సోల్తి సారయ్య, గంగిడి సాంబిరెడ్డి, అంబటి యోగేశ్వర్, సూర్యప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నర్సంపేట బంద్ విజయవంతం
నర్సంపేట : నర్సంపేటను ప్రత్యేక జిల్లా కోరుతూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వాణిజ్య, వ్యాపా ర, పెట్రోల్‌బంక్, విద్యాసంస్థలు, బ్యాం కులు స్వచ్ఛందగా బంద్ చేపట్టారు. ఉదయం అన్ని పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి శాంతియుత వాతావరణంలో బంద్ చేయించారు. అనంతరం బస్టాం డ్ మొదటి గేటు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం లో జేఏసీ డివిజన్ కార్యదర్శి అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాల్సి ఉండగా ప్రభుత్వం కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటుచేస్తున్నారే తప్పా ప్రజల అవసరాల కోసం చేయ డం లేదని విమర్శించారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేసి పాకాల జిల్లాగా నామకరణం చేయాలన్నారు. విధి విధానాలు లేకుండా చేయడం సరికాదు : పి.శ్రీనివాస్, కౌన్సిలర్ విధి విధానాలు ప్రకటించకుండా ఇష్టార్యాజంగా జిల్లాలను చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, తక్షణమే విధి విధానాలు ఏర్పాటుచేసి ఆయా పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు డాక్టర్ జగదీశ్వర్, ఎర్ర యాకుబ్‌రెడ్డి, బానోత్ లక్ష్మణ్‌నాయక్, పెండెం రామానంద్, షేక్ జావీద్, కళ్లెపల్లి ప్రణయ్‌దీప్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పాకాల జిల్లా ఏర్పాటు చేయాలి
టీవీవీ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ నేడు నర్సంపేట బంద్ నర్సంపేట : నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని అంబటి శ్రీనివాస్, తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గాన్ని కలపడాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గెనె యువరాజు, అక్కపెల్లి రమేష్, లావుడ్య రాజు, ఎర్ర యాకుబ్‌రెడ్డి, షేక్ జావిద్, ప్రణయ్‌దీప్, విజయ్, కందికట్ల వీరేష్ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటను పాకాల జిల్లాగా ప్రకటించాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ కార్యదర్శి తేజావత్ వాసునాయక్ డిమాండ్ చేశారు. ఇంకా నర్సంపేటను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడు సాంబరాతి మల్లేశం కోరారు. -
వరంగల్ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం
-
వరంగల్ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం
వరంగల్: వరంగల్ జిల్లా న ర్సంపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. స్థానిక బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సినియర్ విద్యార్థులు దాడి చేయడంతో ఓ జూనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతిన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బిట్స్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థిపై కొందరు సీనియర్ విద్యార్థులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాలుగేళ్లకే నూరేళ్లు
నీటితొట్టిలో పడి బాలిక మృతి ఆ చిన్నారికి నాలుగేళ్లకే నూరేళ్లు నిండారుు.. ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడడంతో మృత్యువాత పడింది.. నర్సరీ చదువుతున్న చిన్నారి నవ్య మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో ము నిగారు. ఈ ప్రమాదం నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నర్సంపేట : నీటితొట్టిలో పడి బాలిక వుృతి చెందిన సంఘటన నర్సంపేట వుండలంలోని నాగుర్లపల్లి గ్రావుంలో వుంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రావూనికి చెందిన వుుప్పారపు పరమేశ్, శోభ దంపతులకు ఇద్దరు కువూర్తెలు. పెద్ద కువూర్తె నవ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్న కువూర్తె వుుప్పారపు నవ్య(4) వూధన్నపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. పరమేశ్ హనువూన్ వూలాధారణతో ఉండగా.. వుంగళవారం ఇంట్లో బిక్ష చేస్తుండగా అతడి భార్య వడ్డిస్తోంది. దివ్య, నవ్యలతో పాటు వురికొంత వుంది చిన్నారులు ఇంటి వుుందు ఆడుకుంటున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు నవ్య వెళ్లి తొంగి చూస్తూ అందులో ప్రవూదవశాత్తు పడిపోరుుంది. కొద్ది సవుయుం తర్వాత చూసిన దివ్య కేకలు వేయుడంతో ఇంట్లో బిక్ష చేస్తున్న పరమేశ్, శోభ నీటి తొట్టిలో పడ్డ చిన్నారిని రక్షించే ప్రయుత్నం చేశారు. అప్పటికే నవ్య వుృతి చెందింది. దీంతో గ్రావుంలో, అవ్మువ్ము గ్రావుమైన సర్వాపురంలో విషాదఛాయులు అలువుుకున్నారుు. అప్పటి వరకు ఆడుకుం టూ ఉన్న నవ్య వుృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. -
పంబారట్టు అదిరేట్టు!
ఘనంగా అయ్యుప్ప సేవ భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి శరణుఘోషతో మార్మోగిన పట్టణం నర్సంపేటలో పంబారట్టు అదిరేట్టుగా కొనసాగింది.. అయ్యప్పస్వాముల బృందనృత్యాలు ఆకట్టుకున్నారుు.. పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగారుు.. మణికంఠుడిని రథంపై ఊరేగించారు.. వేల సంఖ్యలో స్వాములు, భక్తులు తరలిచ్చారు.. అయ్యప్ప ప్రతిమలకు చక్రస్నానాలు చేరుుంచారు.. నర్సంపేట : అయ్యప్ప శరణుఘోషతో పట్టణం మార్మోగింది. శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ కమిటీ బాధ్యులు శింగిరికొండ మాధవశంకర్, డీఎస్సార్ మూర్తి ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటలో పంబారట్టు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మనాభ నంబూద్రిస్వామి మంత్రోచ్చరణ నడుమ సుదర్శన్‌రెడ్డి అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఎత్తుకుని రథంపై ప్రతిష్టించి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభించారు. రథాన్ని పెద్ది నడిపారు. అయ్యప్ప మాలధారులు పులివేషాలు, బొమ్మాయుధాలు ధరించి పేటతుల్లి ఆడారు. స్వామి వారికి చక్రస్నానం రథం మాదన్నపేటకు చేరుకున్న తరువాత వివిధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి చక్రస్నానం చేయించారు. అనంతరం చెరువుకట్టపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప భక్తులతో పట్టణం కిక్కిరిసిసోయింది. రాత్రి అయ్యప్ప దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయు కమిటీ బాధ్యులు చంద్రశేఖర్, గోనెల రవీందర్, ఈశ్వరయ్యు, చిం తల నిరంజన్, సదానందం, భూ పతి లక్ష్మీనారాయుణ, దొడ్డ రవీందర్, గురుస్వావుులు బాబురా వు, సంజీవరావు, పానుగంటి శ్రీని వాస్, యూదగిరి, అనిల్, నాగరాజు, అంకూస్, టీఆర్ఎస్ నాయుకులు రా రుుడి రవీందర్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, మోతె జైపాల్‌రెడ్డి, గుంటి కిషన్, పుట్టపాక కువూరస్వామి, సతీష్, అప్పాల సుదర్శన్, దార్ల రవూదేవి, రాయురాకుల సారంగపాణి, వుురళీ పాల్గొన్నారు. -
కరెంట్.. కన్నీరు
నర్సంపేట : ఖరీఫ్ సాగు కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరువు పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని వణికిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో మురిపెంలా కురిసిన తొలకరి చినుకులు రైతుల్లో ఆశలు రేపి... ఆ తర్వాత మొహం చాటేశారుు. వర్షాభావం నేపథ్యంలో కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా వెనుకడుగు వేయడంతో పంట భూములన్నీ ఖాళీగా ఉన్నారుు. ఆశతో మరికొందరు రెట్టింపు పెట్టుబడి పెట్టి పలు పర్యాయూలు విత్తనాలు నాటి, బిందె సేద్యంతో పంటలు కాపాడుకున్నారు. అదును దాటిన తర్వాత కొంత నయమనిపించేలా కురిసిన వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించారుు. జిల్లాలో సాధారణ వర్షపా తం 703.09 మిల్లీమీటర్లు కాగా... 531.04 మి.మీల వర్షం కురిసింది. ఇది కూడా పంటల సాగు సవుయుం మించిన తర్వాత నమోదైన వర్షపాతమే. జిల్లా లో మొత్తం 5,02,132 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా... 4,06,558 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. కానీ.. తాజా పరిస్థితులు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. వర్షాలు కురవకపోవడానికి తోడుగా కరెంట్ కోతలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చే స్తున్నారుు. పట్టుమని మూడు గంటలు కూడా కరెం ట్ సరఫరా కాని పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పొలాలు నెర్రెలుబారుతున్నారుు. మక్క, పత్తి, సోయ, వరి పంటలు ఎండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంటలకు నీరు పెట్టాలని పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతు న్నా... విద్యుత్ సరఫరా ప్రతిబంధకంగా మారడం తో రైతులు గుండలవిసేలా రోదిస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంట్ సరఫరా గగనంగా వూరడంతో రైతన్నలు సాగుపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తు తం జిల్లాలో 70 శాతం మేర వరి అక్కరకు రాకుండా పోరుునట్లు వ్యవసాయ అధికారుల అంచనా. బోసిబోరుున ధాన్యాగారం జిల్లాలోనే ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సంపేట ప్రాంతం వరి సాగు లేక బోసిపోరుుంది. ఖరీఫ్‌లో అనుకున్న సవుయూనికి వర్షాలు కురిస్తే పాఖాల, వూధన్నపేట, రంగాయు చెరువుల్లోకి నీరు చేరుతాయుని ఆశించి రైతులు నారు వుడులు సిద్ధ చేసుకున్నారు. వర్షాలు లేక నారు వుడులు ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు. పాకాల సరస్సు కింద 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉండగా... ప్రస్తుతం ఎక్కడ చూసినా బీడు భూవుులే కనిపిస్తూ ఎండిపోరుున ఆనవాళ్లతో నారు వుడుల గుర్తులు ఉన్నారుు.