ncc
-
ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ఏర్పాటుకు చర్యలు
గుంటూరు (ఎడ్యుకేషన్): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఎన్సీసీ గ్రూప్ వార్షిక తనిఖీల కోసం ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా శ్యామలానగర్‌లోని ఎన్సీసీ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఎన్సీసీ గ్రూప్‌లు ఉన్నాయని, వీటిలో గుంటూరు ఎన్సీసీ గ్రూప్ అతి పెద్దదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా విద్యాసంస్థలు ఎన్సీసీ శిక్షణ గుర్తింపును కలిగి ఉండగా, మరో 1,600 విద్యాసంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఎన్సీసీ శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత, గౌరవం పెరుగుతాయని, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎన్సీసీ గ్రూప్‌లను విస్తరించి, మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్సీసీ గ్రూప్ కలిగి ఉన్నట్లు కేవలం బోర్డులకే పరిమితమై, విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇవ్వని విద్యాసంస్థలకు ఎన్సీసీ గుర్తింపు రద్దు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కడప జిల్లాలోని ఎన్సీసీ గ్రూప్ అకాడమీ స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు. విశాఖలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలన చేశామని, త్వరలోనే గవర్నర్‌తోపాటు జూన్ 4వ తేదీ తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో సీఎం, సీఎస్‌లను కలిసి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎన్సీసీ ప్లానింగ్ అండ్ కో–ఆర్డినేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ సంజయ్‌గుప్తా, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్‌లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన NCC డిప్యూటీ డైరెక్టర్ జనరల్
సాక్షి, గుంటూరు: ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. ఏపీలో ఎన్సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అదనంగా 60 వేల మంది ఎన్సీసీ క్యాడెట్లను రిక్రూట్ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్లు అందుబాటులో ఉంటారని సీఎం జగన్‌కు డీడీజీ వీఎంరెడ్డి వివరించారు. ఏపీ విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. ఎన్సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్ క్యాడెట్ల శిక్షణ కోసం అవసరమైన సహాయం చేసేందుకు సిద్దమని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఎన్సీసీ డీడీజీగా ఎయిర్ కమాండర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా ఎయిర్ కమాండర్ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు. ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ డైరెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వి.ఎం.రెడ్డి 1989లో భారత వైమానిక దళంలో చేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 35 ఏళ్లుగా పలు హోదాల్లో సేవలందిస్తున్నారు. ఎల్రక్టానిక్ వార్ ఫేర్ రేంజ్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్‌లో పైలట్ రహిత విమాన స్క్వాడ్రన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. న్యూఢిల్లీలోని ఏరోస్పేస్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ఆయన శిక్షకుడిగా పనిచేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ప్రతిష్టాత్మక హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీసీ)లో జాతీయ భద్రత, వ్యూహ సంబంధిత కోర్సును కూడా పూర్తి చేశారు. యుద్ధవిమాన పైలట్లకు శిక్షకుడిగా 2 వేల గంటలకు పైగా ఆయన గగనతలంలో పనిచేశారు. -
AP: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రీసూ్కల్, హైసూ్కల్, హైసూ్కల్ ప్లస్ స్థాయిలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యా యుల పోస్టులను బదిలీలతో భర్తీ చేసేందుకు అనువుగా సోమవారం జీవో నంబర్ 47 జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 మే 31 లేదా అంతకుముందే ఉద్యోగ విరమణ చేసేవారికి వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టనుంది. వీరుకాకుండా 2022–23 విద్యా సంవత్సరం నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్మెంట్ సరీ్వస్‌లో కొనసాగుతున్నారో.. ఆ విభాగంలోనే బదిలీ అవుతారు. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లు ఆ పోస్టులు ఉన్న చోటకే.. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా పోస్టులు ఉన్న పాఠశాలలకే బదిలీ చేస్తారు. లేదంటే అక్కడే కొనసాగుతారు. వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని, వారు ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలల్లో చేరిన తేదీ నుంచి సర్వీస్‌ను లెక్కించి అవకాశం ఉన్నవారికి బదిలీ చేసే అవకాశం కల్పించారు. 40 శాతం దృష్టి లోపం ఉన్న వారు, 75 శాతం శారీరక వైకల్యం ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. వారు బదిలీ కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పేరెంట్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లాలనుకునేవారు వాటిలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి వారి మాతృ సంస్థ లోని సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపల్ స్కూళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు పురపాలక శాఖ అ«దీనంలోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక మార్గదర్శకాలను విద్యాశాఖ జారీ చేస్తుంది. మొత్తం బదిలీ ప్రక్రియలో పాత స్టేషన్ పాయింట్ల ఆధారంగానే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రస్తుత స్టేషన్ పాయింట్లు పరిగణనలోకి తీసుకోరని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐటీడీఏ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్–ఐటీడీఏ ఉపాధ్యాయులు ఐటీడీయేతర పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, వారికి బదిలీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. పాత జిల్లాలనే యూనిట్‌గా పరిగణిస్తారు. స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, జాబితా ఖరారు, ఖాళీల నోటిఫికేషన్ తర్వాతే బదిలీ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లు - ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లను కేటాయించారు. కేటగిరీ 4 ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఏడాది సరీ్వస్‌కు 5 పాయింట్ల చొప్పున, కేటగిరీ 1, 2, 3లో పనిచేసిన వారికి ఏడాదికి 1, 2, 3 పాయింట్ల చొప్పున కేటాయించారు. - ప్రత్యేక కాంపిటెంట్ అథారిటీల ద్వారా ఉ పాధ్యాయుల సీనియారిటీ, వెబ్ ఆప్షన్స్ ఆ ధారంగా బదిలీ ప్రక్రియ ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు కూడా ఆ స్థాయిలోనే జారీ చేస్తారు. - ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు జోనల్ స్థాయిలో (విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్ జిల్లా) జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగాను, ఆయా జిల్లాల డీఈవోలు సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - జిల్లా పరిషత్ పాఠశాలల్లో హెచ్ఎం/టీచర్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్/స్పెషల్ ఆఫీసర్ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగా, జెడ్పీ సీఈవో మెంబర్, డీఈవో సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గాను, డీఈవో కార్యదర్శి/మెంబర్స్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. - ఉపాధ్యాయుల్లో భార్య/భర్త ప్రభుత్వ ఉద్యో గంలో ఉన్నా, అవివాహిత మహిళా హెచ్ఎంలు, దివ్యాంగులు మొదలైన వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించింది. బదిలీ ప్రక్రియలో ఏ ఇద్దరికి సమాన పాయింట్లు వచి్చ నా వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కూడా చదవండి: ఎల్లో మీడియా ఓవరాక్షన్ -
సీఎం జగన్‌ను కలిసిన ఎన్సీసీ డీజీ గుర్బీర్పాల్ సింగ్
-
ఎన్సీసీ ప్యానెల్లో ధోని
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ధోనిని నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్సీసీ కమిటీ చర్చిస్తుంది. -
ఒకే వేదికపై ఆనంద్ మహీంద్రా, మహేంద్ర సింగ్ ధోనీ..!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకే వేదికను పంచుకొనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ మార్పులను తేవాలని రక్షణశాఖ భావిస్తోంది. అందుకుగాను బైజయంత్ పాండా నేతృత్వంలో ఎన్సీసీపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకుగాను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని రక్షణశాఖ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాలకు కూడా చోటు కల్పించారు. చదవండి: ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ ఈ కమీటీలో వారితో పాటుగా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే, ఆర్థికశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అక్తర్, ఎస్ఎన్డీటీ వుమెన్స్ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధా కామత్ ఈ కమిటీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎన్సీసీలో చేయదల్చుకున్న మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జాతి నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు మరింత ప్రభావవంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. గతంలోని ఎన్సీసీలో ఉన్నవారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. చదవండి: Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్ లాంచ్‌పై స్పష్టత..! -
రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిల్చుకునే రాకేష్ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం ఝన్ ఝన్ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్సిసి షేర్లలో 12.84 శాతం వాటాను ఈ జంట సొంతం. జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్సిసి స్టాక్ ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది. 11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా ఎన్సీసీ షేరు ధర రూ.89.15 గా ఉండటం విశేషం. -
భవనం పైనుంచి పడి.. ఎన్సీసీ అధికారి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస బాలయోగి గురుకుల పాఠశాల ఎన్సీసీ శిబిరంలో మంగళవారం విషాదం నెలకొంది. వారం రోజుల నుంచి ఉత్తరాంధ్ర స్థాయి ఎన్సీపీ ప్రత్యేక శిబిరం ఈ పాఠశాలలో కొనసాగుతోంది. టొంపల నర్సింహులు (35) గరివిడి పట్టణం శ్రీరాంనగర్‌లో ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్రం అధ్యాపకునిగా పని చేస్తున్నారు. ఎన్సీసీ అధికారిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడి ఎన్సీసీ విద్యార్థులకు క్యాంప్ అధికారిగా దుప్పలవలస తీసుకువచ్చారు. రెసిడెన్సియల్ క్యాంపు కావటంతో ఇక్కడే ఉండి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బస చేసిన గది నుంచి రెండో అంతస్థుకు మంగళవారం వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. నిద్ర మత్తులో పిట్టగొడ పైనుంచి పైడిపోయారు. తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆయను స్థానిక అధికారులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతునిది విజయన గరం జిల్లా తెర్లాం మండలంలోని హర్షబలగ గ్రామం. ఎచ్చెర్ల ఎస్ఐ వై.కృష్ణ కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఎన్సీసీ మాస్టర్‌పై విద్యార్థులు దాడి
-
విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని..
సాక్షి, నెల్లూరు: విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఎన్సీసీ మాస్టర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి అనే నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎన్సీసీ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శ్రీహరి ఓ విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ శ్రీకాంత్ అనే విద్యార్థి సహచర విద్యార్థులతో కలిసి అతడిని చితకబాదాడు. దీంతో శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
రెండు ఇన్నింగ్స్‌లలోనూ డబుల్ సెంచరీలు
కొలంబో: ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా అరుదైన రికార్డును నమోదు చేశాడు. లంక దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో పెరీరా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. లంక క్రికెట్లో రెండు పటిష్ట జట్లు సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఎన్సీసీ జట్టుకు కెప్టెన్ అయిన ఏంజెలో తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 201 పరుగులు... రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 231 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ చరిత్రలో ఈ ఫీట్ రెండో సారి మాత్రమే నమోదు కావడం విశేషం. దాదాపు 81 ఏళ్ల క్రితం 1938లో కెంట్ బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్ ఇదే తరహాలో 244, 202 నాటౌట్ పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున 4 వన్డేలు, 2 టి20లు ఆడిన 28 ఏళ్ల ఏంజెలో 2016 ఆగస్టులో జట్టులో స్థానం కోల్పోయాడు. -
పాఠ్యాంశాల్లో త్యాగధనుల జీవితచరిత్రలు
న్యూఢిల్లీ: విద్యావ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పీజీడీఏవీ కళాశాల వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో లో పాల్గొన్న ఆయన భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువలతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఇతర గొప్ప నాయకుల త్యాగాలు, జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. విద్యాలయాలు జ్ఞానమందిరాలుగా విలసిల్లాలన్నారు. శాంతి, అభివృద్ధికి కేంద్రాలుగా మారాలన్నారు. చదువుతో సంబంధంలేని కార్యక్రమాలను విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించొద్దని సూచించారు. విద్యార్థుల్లో మంచిగుణాలు, మంచి ప్రవర్తన నింపడమే విద్యాధర్మంగా గుర్తించాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ లాంటి కార్యక్రమాల్లో పిల్లలు కచ్చితంగా భాగం కావాలని కోరారు. వీటి వల్ల వారిలో క్రమశిక్షణ, సేవాగుణం అలవడుతాయన్నారు. వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషించాలన్నారు. చదువుతో పాటు ఆటలు, యోగా వంటి అలవాట్లను సాధన చేయాలని సూచించారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జీవనశైలి వ్యాధులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కొనేలా జాగ్రత్త వహించాలన్నారు. యువతలో అంతర్జాలం పట్ల పెరుగుతున్న మోజును నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత వల్ల తలెత్తే ప్రతికూలతలను అధిగమించడంలో పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. -
సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..
దుండిగల్: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాదా రమేష్. సాహసమే ఊపిరిగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్ సికింద్రాబాద్‌లోని ఎస్డీఎస్ కళాశాలలో 2టీ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నేషనల్ క్యాడెట్ క్రావ్స్ గ్రూప్‌లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) కోర్స్లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. రెండు పర్వతాల అధిరోహణ ఎన్ఐఎంఏఎస్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్ 2018లో మొదటి సారి అరుణాచల్ ప్రదేశ్‌లోని 16,414 అడుగుల మీర్తంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్‌లోని మచాయ్ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అన్ని అంశాల్లో తర్ఫీదు.. పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్‌లో భాగంగా స్పైడర్ వెబ్‌తో పాటు రివర్స్ క్రాసింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్‌లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్‌లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్ రివర్స్ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్‌స్టాప్ క్లైంబింగ్ పోటీల్లో రమేష్ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్ వెంటాడుతున్న పేదరికం తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్‌లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. రమేష్‌కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మేరా భారత్ మహాన్
-
వక్రించిన విధి
దేశానికి సేవ చేయాలన్న లక్ష్యం మదిలో మెదులుతుండగా.. అందుకోసం అహర్నిశలు శ్రమించేందుకు సిద్ధమయ్యాడు కామిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది.. దేశానికి సేవలందించాలన్న కల చెదిరిపోయింది.. కరెంటుషాక్ తగలడంతో కుప్పకూలిపోయాడు.. గల్ఫ్‌దేశాల్లో పనిచేసుకుంటూ శ్రీకాంత్‌రెడ్డిని చదివించుకుంటున్న తల్లిదండ్రుల బాధ ఇక వర్ణనాతీతం. కడప అర్బన్/వైవీయూ : కడపలోని ఎన్సీసీ నగర్లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఎన్సీసీ కేడెట్ కె.శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందాడు. టి.సుండుపల్లె మండలం వాయిల్పాటి వాండ్లపల్లెకు చెందిన కె. రాజగోపాల్‌రెడ్డి, సుజాత దంపతుల కుమారుడైన ఇతను ప్రస్తుతం కడపనగరంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్నాడు. అనంతరం ఎన్సీసీలో ప్రవేశం పొంది త్వరలో బీ సర్టిఫికెట్ పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే ఈనెల 25వ తేదీన నగరంలో ఎన్సీసీ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఎన్సీసీ కేడెట్స్ నగరంలోని (తెలుగుగంగ కాలనీ) ఎన్సీసీ నగర్‌లోని 30 ఆంధ్రా బెటాలియన్‌లో సాధన చేస్తున్నారు. దీంతో పాటు కేడెట్స్‌కు సంబంధించిన ఎన్రోల్మెంట్లో తప్పులు ఉన్నాయని వచ్చి సరిచేసుకోవాలని ఎన్సీసీ అధికారులు సూచించడంతో ఇందులో భాగంగా శుక్రవారం కె. శ్రీకాంత్‌రెడ్డి, పాలకొండ్రాయుడు, హర్షవర్ధన్‌రెడ్డి, హేమంత్లు కలిసి బెటాలియన్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బంది వంటగది సమీపంలోని ఓ గదిని శుభ్రం చేసేందుకు ఇనుప నిచ్చెన తీసుకెళ్లేందుకు కేడెట్స్‌ను సహాయం కోరారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి, పాలకొండ్రాయుడు, ఆర్మీ సిబ్బంది హవల్దార్ ఉపేంద్రకుమార్ ఇనుప నిచ్చెన పట్టుకుని వెళ్లే సమయంలో వర్షం పడుతుంది. అందరూ కలిసి నిచ్చెనను పైకి ఎత్తారు. విద్యుత్ తీగలు తగిలి ఇనుప నిచ్చెనకు తాకడంతో షాక్ తగిలి శ్రీకాంత్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. అతను కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. కాగా పాలకొండ్రాయుడు, ఉపేంద్రకుమార్ కాళ్లకు బూట్లు వేసుకుని ఉండడంతో వీరిద్దరికి ప్రాణాపాయం తప్పింది. పాలకొండ్రాయుడు స్వల్పగాయాలతో బయటపడగా.. హవల్దార్ ఉపేంద్రకుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని ఎన్సీసీ వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ శ్రీకాంత్‌రెడ్డి(19) మృతి చెందాడు. ఉపేం ద్రకుమార్‌ను మెరుగైన చికిత్స కోసం నగరంలోని కొమ్మా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. పలు ఆరోపణలు కేడెట్ మరణవార్తను తెలుసుకున్న ఎన్సీసీ కమాం డింగ్ ఆఫీసర్ కల్నల్ రవిచంద్రన్ క్యాంపు నుంచి తిరుగుపయనమైనట్లు సమాచారం. కాగా ఎన్సీసీ కేడెట్స్‌ను ఎన్సీసీ నగర్లో పనిచేయించుకునేం దుకు తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిం చాయి. అయితే దీనిపై ఎన్సీసీ సూపరింటెండెంట్ శంకర్‌ను వివరణ కోరగా సంఘటన దురదృష్టకరమన్నారు. ఈనెల 25వ తేదీన ఎన్సీసీ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేడెట్స్‌ను సాధన చేసేందుకు పిలిపిస్తున్నామన్నారు. అదే విధంగా నామినల్రోల్స్లో వివరాలు తప్పుగా ఉండడంతో సరిచేసుకునేందుకు వీరిని పిలిపించామన్నారు. అదే సమయంలో నిచ్చెన పట్టేందుకు సహాయం కోరగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. మరణించిన కేడెట్ శ్రీకాంత్‌రెడ్డికి ఎన్సీసీ కేడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఆర్థికసాయం అందిస్తామని, ఇందుకోసం సీఓ సూచనల మేరకు రిపోర్ట్ పంపామని తెలిపారు. కాగా చనిపోయిన శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని రిమ్స్‌లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ ఎం. రామచంద్రారెడ్డి పరిశీలించారు. అదే విధంగా కొమ్మా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హవల్దార్ ఉపేంద్రకుమార్ను ఆయన పరిశీలించారు. రిమ్స్ వద్ద ఆందోళన, ఉద్రిక్తత.. ఎన్సీసీ కేడెట్ కె. శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి ఉదయం 11.30 గంటల ప్రాం తంలో తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతుని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కుటుంబాన్ని ఆదుకోవాలని తాము ప్రతిపాదించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. అలాగే ఎక్స్‌గ్రేషియా రూ.20లక్షలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా ఆధ్వర్యంలో సీఐలు నాయకుల నారాయణ, నాగరాజరావు, పద్మనాభన్, ఎస్ఐ లు హేమకుమార్, కుళ్లాయప్ప, నాగార్జున, కొం డారెడ్డిలు, స్పెషల్‌పార్టీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా మోహరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు తిరుమలేష్, దస్తగిరి, సుబ్బరాయుడు, మధుబాలాజీ, శివశంకర్, రాజ్‌కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు మద్దిలేటి, ఈశ్వరయ్యలు పోలీసులు, ఎన్సీసీ సిబ్బందితో చర్చలు జరిపారు. శ్రీకాంత్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పిలిపించుకునే ముందు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే శ్రీకాంత్‌రెడ్డి మృత్యువాత పడ్డాడని.. 19 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తీవ్రంగా రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసినప్పటికీ అంబులెన్స్‌ను అక్కడి నుంచి వెళ్లకుండా తమ సమస్య తీరేదాకా ఒప్పుకోమని అడ్డుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో ఎన్సీసీ ముఖ్య అధికారులతో మాట్లాడి తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. తీవ్ర గందరగోళం మధ్య ఎట్టకేలకు ఎన్సీసీ అధికారులు చెప్పిన మాటలకు అంగీకరించిన బంధువులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామం వాయల్పాటివాండ్ల పల్లెకు తీసుకెళ్లారు. కేసు నమోదు సంఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డ సహచర ఎన్సీసీ కేడెట్ పాలకొండ్రాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. శ్రీకాంత్‌రెడ్డి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ హేమకుమార్ తెలిపారు. కోమా నుంచి తిరిగివచ్చి.. సుండుపల్లె: విద్యుదాఘాతంలో మృతిచెందిన శ్రీకాంత్‌రెడ్డి గత ఏడాది సుండుపల్లె మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఉన్నత చదువులకోసం కడప ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. శుక్రవారం విద్యుత్ఘాతంతో శ్రీకాంత్‌రెడ్డి మృతిచెందాడని విషయం కుటుంబసభ్యులకు తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, సుజాత బతుకుదెరువుకోసం కువైట్‌కు వెళ్లారు. వీరికి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితోపాటు ఒక కూతురు ఉంది. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు గల్ఫ్ నుంచి స్వగ్రామం బయలుదేరారు. -
ఎన్సీసీ అధికారులే కారణం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో అర్హులైన పలువురు విద్యార్థులకు ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు దక్కకపోవడానికి ఎన్సీసీ అధికారుల తీరే కారణమని హైకోర్టు తేల్చింది. ఇప్పటికే ప్రవేశాలు ముగిసిన నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఆ విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎన్సీసీపై ఉందన్న హైకోర్టు, ఒక్కో పిటిషనర్‌కు రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులకు నష్టం జరిగేలా వ్యవహరించిన అధికారులను గుర్తించి, వారి నుంచి ఈ సొమ్మును రాబట్టుకోవాలని, వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చని ఎన్సీసీ ఉన్నత వర్గాలకు హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల అత్యుత్సాహానికి ఎన్సీసీ అధికారుల సాయం తోడు కావడంతో ఎన్సీసీ కోటా కింద అడ్డదారుల్లో సీట్లు పొందుతున్నారని ధర్మాసనం తెలిపింది. క్రీడల కోటాలో అడ్డదారుల్లో సీట్లు పొందిన వ్యవహారం ఏసీబీ దాడులతో బట్టబయలైందన్న ధర్మాసనం, ఎన్సీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో అక్రమాలు బయటపడేందుకు ఆస్కారం లేకుండా పోయిందని పేర్కొంది. ఇంజనీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు పొందేందుకు తాము అర్హులమైనప్పటికీ తమకు ప్రవేశాలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఈ కేసును ధర్మాసనం విచారించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న వారికి కూడా సీట్లు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్సీసీ ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్సీసీ ఉన్నతాధికారి, అర్హులైన పలువురు పిటిషనర్లకు సీట్లు దక్కలేదని తేల్చారని వెల్లడించింది. ఎన్సీసీ అధికారుల తీరు వల్లే అర్హులైన వారికి ప్రవేశాలు దక్కలేదని, అయితే ఇప్పటికే ప్రవేశాలు ముగియడంతో పాటు పిటిషనర్లకు రావాల్సిన సీట్లలో ఇతరులు చేరినందున పిటిషనర్లకు సీట్లు కేటాయించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అంగీకరించదని తెలిపింది. అదేవిధంగా సీట్ల సంఖ్యను పెంచాలని ఆదేశాలివ్వలేమని పేర్కొంది. -
నిష్పాక్షిక విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఎన్సీసీ కోటా కింద భర్తీ చేసిన సీట్ల విషయంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ రోవిన్ను విచారణాధికారిగా నియమించే విషయంలో ఎన్సీసీ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. సీట్ల భర్తీకి సంబంధించి ఎన్సీసీ అధికారులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరపండి. పిటిషనర్లు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. మాకు విశ్వాసం కలిగించేలా విచారణ జరగని పక్షంలో పిటిషనర్లు కోరిన ప్రత్యామ్నాయంవైపు మేం మొగ్గు చూపుతాం. ఈనెల 10వ తేదీ కల్లా విచారణను పూర్తి చేసి నివేదికను మా ముందుంచాలి’’అని విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు ఈ విచారణ గురించి తెలియజేయాలని, వారికి ఇచ్చిన ప్రవేశాలు తాత్కాలికమని, విచారణ నివేదిక ఆధారంగా వారి కొనసాగింపు ఉంటుందని స్పష్టంగా చెప్పాలని ఉభయ రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల తీరు సరికాదు..: ‘‘ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందేందుకు మేం అర్హులమైనప్పటికీ, ఎన్సీసీ అధికారుల తీరు వల్ల మాకు అన్యాయం జరిగింది. ప్రాధాన్యత ఖరారు.. సర్టిఫికెట్ల ఆమోదం.. క్రీడల్లో పాల్గొన్నా గుర్తించకపోవడం.. స్పాన్సర్షిప్ తదితర విషయాల్లో ఎన్సీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి మా జీవితాలతో ఆడుకున్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి’’అని కోరుతూ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం.. అభ్యర్థుల పట్ల ఎన్సీసీ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఎన్సీసీ డైరెక్టరేట్ విశ్వసనీయతను తాము శంకించడం లేదని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్సీసీ అధికారులు పరస్పర విరుద్ధ వైఖరి గమనిస్తే, వైద్య విద్య ఎన్సీసీ కోటా సీట్ల భర్తీలో అంతా సవ్యంగానే జరిగిందని అనిపించడం లేదని ఆంది. అవకతవకలను గుర్తించడమే పరిష్కారం ‘‘కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఆ సమయం ఇంకా రాలేదని మేం భావిస్తున్నాం. పిటిషనర్లు కోరుతున్నట్లు వారికి ప్రవేశాలు కల్పిస్తే ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు పొందిన వారిని బయటకు పంపాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ పిటిషనర్లకు ప్రవేశం కల్పించి వారి సీట్లలో ఉన్న వారిని బయటకు పంపితే దానిపై అభ్యంతరం తెలియచేసేందుకు వారికి పూర్తి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు వారు కోరుతున్న విధంగా ప్రవేశాలు కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అవకతవకలను గుర్తించడమే ఈ సమస్యకు పరిష్కారం. అందువల్ల ఎన్సీసీ కోటా కింద జరిగిన సీట్ల భర్తీపై విచారణకు ఆదేశిస్తున్నాం. విచారణాధికారిగా బ్రిగేడియర్ రోవిన్ పేరుకు ఆమోదం తెలుపుతున్నాం. ఎన్సీసీ కోటా కింద ఉన్న క్రీడలు, వ్యక్తిగత, బృంద క్రీడలు, ఎన్సీసీ స్పాన్సర్ చేసిన, గుర్తించిన క్రీడల వివరాలు, ఇప్పటికే ఈ కోటా కింద ప్రవేశాలు పొందిన వారి వివరాలు, వారు శిక్షణకు వెళ్లింది నిజమా? కాదా? వారు పొందిన సర్టిఫికేట్లు నిజమైనవేనా? కావా? అన్న విషయాలను తేల్చాలి’’అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సెల్ఫీ కోసం స్టేజ్ దిగిన రాహుల్
మైసూర్: నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికీ నరేంద్ర మోదీ అవివేక నిర్ణయాలేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని పేర్కొన్నారు. శనివారం మైసూర్లో పర్యటించిన ఆయన మహారాణి కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. నీరవ్ దోచేసిన సొమ్ముతో..: ‘‘చక్కటి నైపుణ్యం ఉన్నా ఆర్థిక తోడ్పాటు లేకపోవడం వల్లే యువత అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. నిన్నిటి నీరవ్ మోదీ కుంభకోణమే తీసుకోండి.. 22వేల కోట్లను ఆయన కాజేశారు. అదే సొమ్మును మీలాంటి యువతకు రుణంగా ఇచ్చిఉంటే ఎన్ని అద్భుతమైన వ్యాపారాలు చేసేవారో కదా!’ అని రాహుల్ అన్నారు. ‘సీ సర్టిఫికేట్ పరీక్షను పూర్తిచేసుకున్న ఎన్సీసీ క్యాడెట్లకు మీరు ప్రభుత్వంలో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు?’ అన్న ఓ విద్యార్థిని ప్రశ్నకు.. ‘‘నాకు ఈ ఎన్సీసీ గురించి పెద్దగా తెలియదు. ఆ శిక్షణ, వ్యవహారాల గురించి అవగాహనలేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’ అని రాహుల్ అన్నారు. సెల్ఫీ కోసం స్టేజ్ దిగి..: ప్రశ్నావళిలో భాగంగా ‘రాహుల్జీ.. మీతో ఓ సెల్ఫీ దిగాలనుంది..’ అని ఓ విద్యార్థిని అడగ్గానే చకచకా స్టేజ్దిగిన రాహుల్.. ఆమెతో సెల్ఫీ దిగడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఎన్నికల రాష్ట్రం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిపెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు విరివిగా పర్యటనను చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగేఅవకాశముంది. -
సెల్ఫీ కోసం స్టేజ్ దిగిన రాహుల్
-
లిఫ్ట్ ఫెయిల్: ఇద్దరు మృతి
హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఎన్సీసీ కార్పొరేట్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఫెయిల్ అవడంతో ఇద్దరు సాంకేతిక సిబ్బంది మృతిచెందారు. 11వ అంతస్తులో లిఫ్ట్‌ను నిలిపి గొలుసుతో వేలాడ దీసి మరమ్మతులు చేస్తుండగా గొలుసు తెగిపోయింది. దీంతో లిఫ్టు కిందకు పడిపోవడంతో అందులో ఇరుక్కుని వారిద్దరు మృతి చెందారు. సేఫ్టీ బెల్టులు లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులను జాన్సన్ కంపెనీకి చెందిన లిఫ్ట్ మెకానిక్‌లు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరుకు చెందిన రమేష్(21), ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన నాగరాజు(28)గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సకాలంలో పనులు చేయలేకపోయిన ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురైంది. సకాలంలో పనులు చేస్తామని ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకునేందుకు గాయత్రి సంస్థ చేసిన ప్రయత్నాలను ఎన్సీసీ సవాల్ చేయటం తెలిసిందే. ఈ మేరకు ఎన్సీసీ చేసిన అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనితో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించింది. 2,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్ధేశించిన పనుల్ని చేసేందుకు ఎన్సీసీ, గాయత్రి పవర్ మధ్య డీల్ కుదురింది. ఇందుకు రూ.8.5 కోట్లు, రూ.4.25 కోట్ల చొప్పున రెండు బ్యాంక్ గ్యారెంటీలను ఎన్సీసీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఎన్సీసీ సకాలంలో పనులు చేయలేదని గాయత్రి ఆ గ్యారెంటీలను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. దీనిని ఎన్సీసీ హైదరాబాద్‌లోని కింది కోర్టులో సవాల్ చేస్తే ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో ఎన్సీసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన ధర్మాసనం.. ఎన్సీసీ బేషరతు గ్యారెంటీ ఇచ్చిందని, పైగా గాయత్రి ఒప్పం దాన్ని ఉల్లంఘించినట్లుగా నిరూపించలేకపోయిం దని తెలిపింది. ఈ పరిస్థితుల్లో గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు గాయత్రికి హక్కు ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఎన్సీసీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని కోరగా... ఆ వినతిని పరిగణనలోకి తీసుకుని రెండు వారాలపాటు గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకోవద్దని గాయత్రికి తన తీర్పులో సూచించింది. -
పెద్దాపురంలో ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
–జాతీయ సమైక్యతకు ఎన్సీసీ దోహదమన్న వక్తలు పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కమాండెంట్ మునీష్‌గౌర్ ఆధ్వర్యంలో క్యాంపు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సిక్స్ నేవల్ కమాండ్ అధికారి కెప్టెన్ వివేకానంద, కల్నల్ నీలేష్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, శ్రీ ప్రకాష్ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య ముఖ్యఅతిథలుగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు ఎన్సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్యాంపు ఎన్సీసీ అధికారులు ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యంలో క్యాడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాడెట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, మాజీ ప్రిన్సిపాల్ ప్రభాకరరావు, ఎన్సీసీ అధికారులు కృష్ణారావు, సతీష్, సత్యనారాయణ, పిలిఫ్‌రాజు, వీవీవీ రమణమూర్తి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. -
వికటించిన అల్పాహారం
9 మంది ఎన్సీసీ క్యాడెట్లకు అస్వస్థత మందులు లేవన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం పెద్దాపురం : కాకినాడ 18 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఆదివారం ఉదయం 9 మంది ఎన్సీసీ మహిళా క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. శిబిరం వద్దకు ఉదయాన్నే వండిన అల్పాహారం వికటించడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్సిసి అధికారులు మనీష్‌గౌర్, యు.మాచిరాజు, కృష్ణారావు, సతీష్‌లు హుటాహుటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబులు క్యాడెట్ల ఆరోగ్య సమస్యపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది మందులు బయట నుంచి తీసుకు రమ్మన్నంటున్నారని క్యాడెట్లు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని పిలిచి వారిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత లేదంటూనే మందులు లేవని సమాధానం చెప్పడమేమిటని మండిపడ్డారు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి గానీ రోగులపై సమాధానం చెప్పడం బాగోలేదని, ఇలా అయితే చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. వెంటనే వైద్యులను రప్పించి క్యాడెట్లకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్డీవో ఆదేశించారు. మంత్రి రాజప్ప ఆరా ఎన్సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాడెట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్డీవో విశ్వేశ్వరరావు, వైద్యాధికారులకు సూచించారు. క్యాడెట్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.