NCLAT
-
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్ఈడీ లైట్స్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.సిస్కా ఎల్ఈడీ లైట్స్ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్ నందాను ఎన్సీఎల్టీ నియమించింది. సన్‌స్టార్ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనఎస్ఎస్కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్ ఇండస్ట్రీస్ 60 రోజుల క్రెడిట్ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్వాయిస్లను చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో సన్‌స్టార్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
ఎన్సీఎల్ఏటీకి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా జాతీయ కంపెనీ చట్ట అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించింది. గ్రూప్ కంపెనీలను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు(విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన 11 రుణదాత సంస్థలు చర్యలు ప్రారంభించడంతో రక్షణ కలి్పంచమంటూ అపీలేట్కు అత్యవసర దరఖాస్తు చేసుకుంది. రుణదాతలను నిలువరించమని అభ్యరి్థస్తూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కొత్త బోర్డు ఎన్సీఎల్ఏటీకి ఫిర్యాదు చేసింది. బ్యాంకులు ఎన్సీఎల్ఏటీ గత ఆదేశాలను పాటించకపోవడం వల్ల నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ముసుగులో గ్రూప్ కంపెనీల డైరెక్టర్లను బ్యాంకులు వేధిస్తున్నాయని తెలిపింది. విల్‌ఫుల్ డిఫాల్టర్ గుర్తింపు కమిటీముందు వ్యక్తిగత హాజరుకు డిమాండు చేస్తూ బ్యాంకులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు బెదిరించడంతోపాటు .. ప్రస్తుత డైరెక్టర్లు గ్రూప్ కంపెనీలను విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. -
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్‌పై జిందాల్ పవర్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్‌కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్‌తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్‌షిప్‌కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్‌కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్‌కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్‌లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్‌కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్‌కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
NCLAT జ్యుడీషియరీ సభ్యుడిగా రాజీనామా
-
NCLAT సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు
ఢిల్లీ: దేశసర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులిద్దరికి సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీన వాళ్లిద్దరిని తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్ 13వ తేదీన ‘స్టేటస్ కో’(యధాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా.. ఎన్సీఎల్ఏటీ జ్యూడీషియల్ సభ్యుడు రాకేశ్ కుమార్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవలు ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీల్‌పై తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు చైర్పర్సన్ ముందు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు చైర్పర్సన్. అయితే దర్యాప్తు నివేదిక ఇవాళ సుప్రీం కోర్టుకు చేరింది. దానిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పు వెల్లడించినట్లు ప్రాథమికంగా ధర్మాసనం గుర్తించింది. ఆ ఇద్దరు సభ్యులను అక్టోబర్ 30వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు సుప్రీం స్టేటస్ కో ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ ఎన్సీఎల్ఏటీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సైతం పక్కనపెట్టేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశాన్ని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ముందుకు బదిలీ చేసింది. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
ఎన్సీఎల్ఏటీకి గో ఫస్ట్ లీజుదార్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్‌కు 9 విమానాలు, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
Google vs CCI: గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ..కానీ..!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) విధించిన జరిమానాను సమర్ధించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై గూగుల్‌పై విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను సమర్థించింది. ఈ పెనాల్టీ మెుత్తాన్ని చెల్లించేందుకు ట్రైబ్యూనల్ గూగుల్‌కు 30 రోజుల పాటు గడువిచ్చింది. అయితే ఈ తీర్పుపై గూగుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) అయితే మరో భారీ ఊరట కూడా లభించింది.ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, సభ్యుడు (టెక్నికల్) డాక్టర్ అలోక్ శ్రీవాస్తవతో కూడిన బెంచ్ సీసీఐ జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలను పక్కన పెట్టింది. సీసీఐ ఆర్డర్‌లోని 617.3, 617.9, 617.10 617.7 పేరాల్లో జారీ చేసిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులను(OEM) 11 అప్లికేషన్ల మొత్తం Google సూట్‌ను ప్రీ ఇన్స్టాల్ చేయమని గూగుల్ కోరడం అన్యాయమని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోర్క్‌లను అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం నుంచి OEMలను నిషేధించే యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ షరతులను తప్పుపట్టింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) మరోవైపు కంపెనీ ఒప్పందాల కార్యాచరణతో పోటీ యాప్‌లను ముందే ఇన్స్టాల్ చేయకుండా నిరోధించ లేదని పేర్కొంది. మార్కెట్లో ఆధిపత్యం పొందడమంటే ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని, వినియోగదారుల్లో గూగుల్ ప్రజాదరణ పొందడమని గూగుల్ వాదిస్తోంది. సీనియర్ న్యాయవాది అరుణ్ కథ్పాలియా Google LLC తరపున వాదించారు. -
సింటెక్స్ మాజీ ఎండీకి ఎన్సీఎల్ఏటీలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై కార్పొరేట్ దివాలా ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను ఆమోదిస్తూ, 2021 ఏప్రిల్ 6న ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్ బెంచ్ గతంలో సింటెక్స్‌పై ఐసీఆర్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ అరుణ్‌ప్రసాద్ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్ కనిపించలేదని బెంచ్ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై సీఐఆర్‌పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ సంయుక్తంగా వేసిన బిడ్‌కు 98.88 శాతం వోటింగ్ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్సీఎల్టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. -
‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్సీఎల్ఏటీ భారీ ఊరట
ముంబై: మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై స్టే విధించింది. జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది. గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి ఉన్నామన్నారు. కాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్ వ్యవహారంలో సంజీవ్ కుమార్ జలాన్‌ను, సిటీ నెట్వర్క్స్ విషయంలో మోహిత్ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్ కోరినప్పటికీ ఎన్సీఎల్టీ బెంచ్ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్ప్రైజెస్ ఎండీ పునీత్ గోయెంకా .. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్వర్క్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్ఇండ్ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్సీఏల్ఏటీ తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. -
మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కొత్త యజమాని– జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్ జలాన్– ఫ్లోరియన్ ఫ్రిచ్) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్‌కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించలేదు. ‘‘ఎవరైనా ఏదైనా డీల్‌లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు. చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కన్సార్టియం వాదన ఇది... కన్సార్టియం తరఫున సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) కార్పొరేట్ రుణగ్రహీత (జెట్ ఎయిర్వేస్) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్‌ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం సుప్రీం రూలింగ్‌తో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్‌కు వెళుతుందన్న అభిప్రాయంతో జెట్ ఎయిర్వేస్ అగ్రివ్డ్ (బాధిత) వర్క్‌మెన్ అసోసియేషన్ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక ఆశాకిరణం’’ అని అడ్వకేట్ ఛటర్జీ విలేకరులతో అన్నారు. రికార్డ్ తేదీ... 2019 జూన్ 20 ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్‌తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్ ఎయిర్వేస్ కార్మికులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. -
సుప్రీంలోనూ గూగుల్‌కు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు.. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట దక్కలేదు. గూగుల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) కొనసాగించిన దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్ల లేవని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు(స్టే ఇచ్చేందుకు) నిరాకరించిన సుప్రీం కోర్టు.. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గరే తేల్చుకోవాలని గూగుల్‌కు సూచించింది. మరోవైపు గూగుల్ దాఖలు చేసిన అప్పీల్‌పై మార్చి 31వ తేదీలోగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీ NCLAT ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు సీసీఐ విధించిన జరిమానాలో పది శాతాన్ని వారంరోజుల్లోగా డిపాజిట్ చేయాలని గూగుల్‌కు స్పష్టం చేసింది. భారత్‌లో గూగుల్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌కు పాల్పడుతోందని, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని గుర్తించిన సీసీఐ.. గూగుల్‌కు రూ. 1,337 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది గూగుల్. అయితే.. సీసీఐ ఆదేశాలపై ఇంటీరియమ్ స్టేకు ఎన్సీఎల్ఏటీ కూడా నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించింది గూగుల్. ఇక గూగుల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ బెంచ్‌కు తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అయితే ఎన్సీఎల్ఏటీకి మాత్రం మరోసారి పంపొద్దన్న ఆయన విజ్ఞప్తిని మాత్రం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు గూగుల్.. CCI ఆదేశాల వలన భారతదేశంలో పరికరాలు మరింత ఖరీదైనవిగా మారతాయని తెలిపింది. తద్వారా సురక్షితంకానీ యాప్స్ ద్వారా వినియోగదారులకు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్ల వచ్చని వాదించింది. ఇదిలా ఉంటే.. సీసీఐ గూగుల్ రెండు వేర్వేరు కేసుల్లో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి సంబంధించిన వ్యవహారంలో రూ.1,300 కోట్ల జరిమానా విధించింది. అంతేకాదు.. యాప్ డెవలపర్ల ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం ఆపేయాలని, గూగుల్ ప్లే స్టోర్ బయటకూడా వాళ్ల యాప్‌లు అప్లోడ్ చేసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అయితే గూగుల్ ఈ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీసీఐ ఆదేశాలను గనుక పాటిస్తే.. యాప్ డెవలపర్లు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుందని తెలిపింది. -
‘అది కుదరదు’.. గూగుల్‌కు ఊహించని ఎదురుదెబ్బ!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించిన కేసులో టెక్ దిగ్గజం గూగుల్‌కు ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో ఎదురుదెబ్బ తగిలింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించేందుకు ఎన్సీఎల్ఏటీ బుధవారం నిరాకరించింది. అలాగే జరిమానాలో 10 శాతాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అటు సీసీఐకి నోటీసులు ఇవ్వడంతో పాటు మధ్యంతర స్టేపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి దేశీయంగా గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలపై సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసేందుకు, తమకు కావాల్సిన సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పించాలని గతేడాది అక్టోబర్‌లో సూచించింది. సీసీఐ ఆదేశాలు జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, వీటిపై తక్షణం స్టే విధించాలంటూ ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించింది. భారతీయ యూజర్లు, డెవలపర్లు, తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్‌తో గణనీయంగా ప్రయోజనాలు చేకూరాయని, భారత్ డిజిటల్‌కు మారడంలో ఇది తోడ్పడిందని పిటిషన్లో వివరించింది. బుధవారం జరిగిన విచారణలో గూగుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. గూగుల్ గుత్తాధిపత్య దుర్వినియోగానికి పాల్పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
దివాలా తీసిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్.. ఆ 25 వేల మంది పరిస్థితి ఏంటి?
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ కంపెనీ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నేడు ప్రకటించింది. సూపర్‌టెక్ సంస్థ బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. హితేష్ గోయల్'ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఏఎల్‌టీ)లో అప్పీల్ దాఖలు చేస్తామని రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ పేర్కొంది. ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల వల్ల పలు సంవత్సరాలుగా కంపెనీలో తమ ఇళ్లను బుక్ చేసుకున్న 25 వేల మంది గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన కంపెనీ.. "అన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నందున, ఏ పార్టీకి లేదా ఆర్థిక రుణదాతకు నష్టం కలిగించే అవకాశం లేదు. ఈ ఆదేశాల వల్ల మరే ఇతర సూపర్‌టెక్ గ్రూప్ కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేయదు" అని రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత 7 ఏళ్లలో 40,000 కంటే ఎక్కువ ఫ్లాట్లను అందజేసిన గొప్ప రికార్డు మాకు ఉంది. మా 'మిషన్ కంప్లీషన్ - 2022' కింద మా కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడం కొనసాగిస్తాము, 2022 డిసెంబర్ నాటికి 7,000 యూనిట్లను డెలివరీ చేయాలనే లక్ష్యాన్ని మేము చేపట్టాము అని సంస్థ తెలిపింది. సూపర్‌టెక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ అరోరాను ఈ విషయమై ప్రస్తావించగా.. "సూపర్‌టెక్ లిమిటెడ్‌లో దాదాపు 11-12 హౌసింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వాటికి సంబందించి దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు రూ.150 కోట్ల రుణాలు తీసుకుంటే, సూపర్‌టెక్ లిమిటెడ్ రుణాల మొత్తం దాదాపు రూ. 1,200 కోట్లు అని ఆయన తెలిపారు. అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్టీలో లగ్జరీ ప్రాజెక్ట్ సూపర్నోవా సహా పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్న గ్రూప్‌లో మూడు, నాలుగు ఇతర కంపెనీలు ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద కంపెనీల దివాలా పరిష్కార ప్రక్రియపై ఎన్సీఎల్టీ అథారిటీ ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఎన్‌సీఏఎల్‌టీలో అప్పీల్ చేయవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లను మే 22న కూల్చివేస్తామ నోయిడాని అధికారులు ప్రకటించారు. (చదవండి: కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!) -
దివాలా తీసిన వీడియోకాన్.. ఆపై మరిన్ని సమస్యలు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌పై దివాలా కోడ్ కింద చర్యల పక్రియ మొత్తం ఈ చట్టంపై లొసుగులను, వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోంది. తాజా పరిణామాన్ని పరిశీలిస్తే.. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సవాలు చేసింది. పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ. 2,962 కోట్ల టేకోవర్ బిడ్‌ను అనుమతిస్తూ ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని టెలికం శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది. టెలికం శాఖ వాదనలు ఇవీ... తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. జనవరి 11కు విచారణ వాయిదా.. కాగా, ఇందుకు సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్యుపై జూలై 19వ తేదీన ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చిన అంశాన్ని ముగ్గురు సభ్యుల బెంచ్ ప్రస్తావించింది. యథాతథ పరిస్థితిని కొనసాగిస్తూ దివాలా చట్ట నిబంధనలకు అనుగుణంగా వీడియోకాన్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలను నిర్వహించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణాంశాల్లోకి తక్షణం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే రెండు వారాల్లో ‘రిప్లై అఫిడవిట్లు’ మరో వారంలో ఏదైనా అవసరమైతే ‘రీజాయిండర్’లు వేయాలని వీడియోకన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా మిగిలిన ప్రతివాదులను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. దివాలా కోడ్‌పై విమర్శల తీరిది... రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ ఇటీవలే దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ లిమిటెడ్‌లు జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
వీడియోకాన్ కొనుగోలుపై వేదాంతాకు బ్రేక్స్!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను అతి తక్కువకు సొంతం చేసుకోవాలన్న వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రణాళికలు ఫలించేట్లు కనబడ్డం లేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తాజాగా యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఈ నెల 27న జస్టిస్ జరాత్ కుమార్ జైన్, జస్టిస్ కాంతి నరహరి నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టి, తగిన ఉత్తర్వులు ఇవ్వనుంది. అప్పటికల్లా తన సమాధానం తెలియజేయడానికి బెంచ్ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ అనుమతి ఇచ్చింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. జరిగింది ఇదీ... ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. బిడ్డింగ్ విషయంలో తమ పునరాలోచనకు ఆయా పరిణామాలు, వ్యాఖ్యలు, ఈ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు కూడా కారణమని తాజాగా ఎస్బీఐ నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ లిమిటెడ్‌లు కూడా జూన్ 19నే అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. దివాలా కోడ్‌పై విమర్శల తీరిది రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్సీఎల్ఏటీ చైర్మన్‌గా చీమా విధులు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్మన్‌గా జస్టిస్ ఏఐఎస్ చీమా యథావిధిగా శుక్రవారం విధులు నిర్వహించారు. చీమాను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ద్విసభ్య ధర్మాసనం విచారించాల్సిన ప్రధాన కేసుల జాబితా (కాజ్ లిస్ట్) వెలువడింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అయితే ఎన్సీఎల్ఏటీ వెబ్సైట్ మాత్రం జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ఆయన ఫొటోను ఫోస్ట్ చేయడం గమనార్హం. వివాదంలోకి వెళితే.. గడచిన ఒకటిన్నర సంవత్సరాలుగా ఎన్సీఎల్ఏటీకి శాశ్వత చైర్మన్ నియామకం జరగలేదు. ఎన్సీఎల్ఏటీ జ్యుడీషియల్ మెంబర్‌గా సెప్టెంబర్ 2017 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ చీమా 2021 ఏప్రిల్ 19న అధికారిక ఛైర్‌పర్సన్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. అయితే ఆయన పదవీకాలం సెప్టెంబర్ 20తో ముగిసిపోతుంది. అయితే ఈ లోపే అర్థంతరంగా ఆయనను సెప్టెంబర్ 10న కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది. 11వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను నియమించింది. దీనిని సవాలుచేస్తూ, చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసును విచారణకు చేపట్టింది. చైర్మన్లను తొలగించే అధికారం ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం– 2021 కింద కేంద్రానికి ఉందని కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. అలా అయితే ఆ చట్టం అమలు చేయకుండా సుమోటోగా స్టే విధిస్తామని అత్యున్నత స్థాయి ధర్మాసనం హెచ్చరించింది. దాంతో ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు అరగంట సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. అనంతరం అన్ని అధికారాలతో జస్టిస్ చీమా పదవిని పునరుద్ధరించడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. బాధ్యతల్లో నియమించిన వారిని వెంటనే తప్పించడం సబబుకాదుకనుక, జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను సెప్టెంబర్ 20వ తేదీ వరకూ సెలవుపై పంపనున్నట్లు కూడా ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీనితో వివాదానికి తెరపడినట్లయ్యింది. -
మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. 100కి పైగా విమాన సేవలు గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!) విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి "విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..) 1000కి పైగా ఉద్యోగాలు పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు. -
ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ దివాలా కేసు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ దివాలా విషయంలో జలాన్ కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలును నిలిపివేయాలని ఆ విమాన సంస్థ క్యాబిన్, గ్రౌండ్ సిబ్బంది ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. ఈ పరిష్కార ప్రక్రియలో తమ వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజన అంశాలు లేవని వివరించింది. తమ వాదనలు విని, తుది తీర్పు వెలువరించేంతవరకూ జూన్‌లో ఎస్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్ ఆమోదించిన కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించింది. రుణ భారాల్లో కూరు కుపోయిన జెట్ ఎయిర్వేస్ రెండేళ్లుగా కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అద్దె యంత్రాల కోసం సోనాలికా యాప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా గ్రూప్ ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్’ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు, ట్రాక్టర్ల వంటివి అద్దెకిచ్చే వ్యక్తులను ఈ యాప్ ద్వారా రైతులతో అనుసంధానిస్తారు. రైతులు సైతం తమ వద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్పీ గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్‌తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్‌పై... టాటా గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్‌గా తొలగించారు. మార్చి, ఏప్రిల్‌లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు టాటా గ్రూప్‌నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్‌పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్‌గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్‌గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)లో ఊరట లభించింది. సంస్థపై దివాలా పక్రియ ప్రారంభానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన రూలింగ్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. ఎన్సీఎల్టీ నియమించిన తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కి కీలక ఆదేశాలిస్తూ, కేసు రికార్డులను, కంపెనీ అసెట్స్‌ను తక్షణం ప్రమోటర్‌కు స్వాధీనం చేయాలంది. ఫ్లిప్‌కార్ట్‌కు ఆపరేషనల్ క్రెడిటార్‌గా ఉన్న క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ గతేడాది అక్టోబర్ 24న అనుమతించింది. (సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్) దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఇండియా డైరెక్టర్ నీరజ్ జైన్ అప్పీల్ చేశారు. దిగుమతి చేసుకున్న ఎల్ఈడీ టీవీల సరఫరాల లావాదేవీకి సంబంధించి రూ.26.95 కోట్లు ఫ్లిప్‌కార్ట్ బకాయి పడినట్లు క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిని ఎన్సీఎల్టీ ఆమోదించడాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేస్తూ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ (ఐబీసీ) సెక్షన్ 8 (1) కింద పంపిన నోటీసు ‘‘తగిన విధంగా లేదు. అసంపూర్తిగానూ ఉంది’’ అని తన ఉత్తర్వులో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి తగిన డాక్యుమెంట్లనూ క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ సమర్పించలేకపోయినట్లు తెలిపింది. తగిన ఇన్వాయిస్లు, దివాలా పిటిషన్లో పేర్కొన్న డాక్యుమెంట్ నకళ్లనూ ట్రిబ్యునల్ ముందు ఉంచలేకపోయినట్లు పేర్కొంది.