Nomination Files
-
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటరి్నంగ్ అధికారికి అందజేస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎలీ్ప) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్ పరిచయం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సింఘ్వి వాదనలతో రాష్ట్రానికి ప్రయోజనం: సీఎం సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునరి్వభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయ చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని, ఈ చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద మనసుతో రాజీనామా చేసిన కేకే క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని ప్రశంసించారు. త్వరలోనే రైతు కృతజ్ఞత సభ త్వరలోనే రైతు కృతజ్ఞత సభ ఉంటుందని సీఎం చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా వీలు కాలేదని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ,రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సింఘ్వి ఒకరని, ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ హక్కులపై మాట్లాడుతూనే ఉంటా: సింఘ్విసింఘ్వి మాట్లాడుతూ తనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో ఘన స్వాగతంసింఘ్వి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సింఘ్వి అక్కడి నుంచి నేరుగా మాజీ ఎంపీ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉన్న సింఘ్వి ఆ తర్వాత సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సింఘ్విని కలిసి కర్మన్‌ఘాట్ హనుమాన్ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత సింఘ్వి ప్రజాభవన్‌కు వచ్చారు. సింఘ్వి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన సింఘ్వి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.మహిళా సాధికారతే లక్ష్యం: సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికా రతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. -
12న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమవేశమయ్యారు. నేటితో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొదటి విడత ప్రచారం పూర్తి కానుంది. అభ్యర్థి ఎవరనేది కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై బేధాభిప్రాయాలు కారణంగా కూటమి నాయకులు తర్జనభజన పడుతున్నారు.కార్పొరేటర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, 12వ తేదీన నామినేషన్ వేస్తున్నానని.. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 30వ తేదీ తర్వాత తమ వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుందని బొత్స అన్నారు.మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తమకు బలం ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని.. బొత్స గెలిస్తే కౌన్సిల్లో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. బలం లేకపోయినా ప్రలోభాలతో కూటమి నేతలు గెలవాలని చూస్తున్నారు. టీడీపీకి బలం లేకపోయినా.. బలం ఉందని ప్రచారం చేస్తున్నారు. వైస్రాయ్ కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు చెల్లవు’’ అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు. -
ప్రధాని నామినేషన్
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసి నుంచి ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ దాఖలుచేశారు. మూడోసారి వారణాసి నుంచి బరిలో దిగిన మోదీకి మద్దతుగా కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్‌ను ప్రతిపాదించిన నలుగురిలో ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు ఓబీసీలు, ఇక దళితుడు ఉన్నారు. పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, బైజ్నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్‌లు మోదీ నామినేషన్‌ను ప్రతిపాదించారు. అయో« ద్యలో బాలరామాలయం ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండితుల్లో జ్ఞానేశ్వర్ శాస్త్రి కూడా ఒకరు. బైజ్నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా ఓబీసీలు కాగా, సోంకార్ బీజేపీ వారణాసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దళిత నేత.కలెక్టరేట్ నిండా ప్రముఖులేబీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, హర్దీప్సింగ్ పురీ, అనుప్రియా పటేల్, రాందాస్ అథవాలే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందుస్తానీ అవామ్ మోర్చా(ఎస్) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ, రాష్ట్రీయ లోక్‌మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్, సుహేల్దేవ్ భారతీయ సమాజ్‌పార్టీ చీఫ్ ఓంప్రకాశ్ రాజ్‌భర్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అన్బుమణి రాందాస్, తమిళ మానిల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్, బీజేపీ నేత దేవనాథన్ యాదవ్, భారతధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, అసోమ్ గణపరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరాలు వారణాసి కలెక్టరేట్లో మోదీ నామినేషన్ కార్యక్రమా నికి హాజరయ్యారు. మోదీ నామినేషన్ వేయడానికి వస్తున్నారని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో వారణాసి కలెక్టరేట్‌కు వచ్చారు. నామినేషన్ వేశాక మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ఎన్డీఏ నేతలు మద్దతు గా ఇక్కడకు రావడం నాకు గర్వకారణం. దేశ ప్రగతికి, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి కంకణబద్దమైంది. భవిష్యత్తు లోనూ ఇలాగే దేశ ప్రగతికి పాటుపడతాం’ అని మోదీ అన్నారు. దశశ్వమేథ్ ఘాట్‌లో పూజలునామినేషన్ వేయడానికి ముందు మోదీ మంగళవారం ఉదయం కాశీలో గంగా తీరాన దశశ్వమేథ్ ఘాట్‌లో పూజలు చేశారు. ఘాట్ వద్ద వేదమంత్రాల మధ్య గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పడవలో నమో ఘాట్‌కు వెళ్లారు. అక్కడి కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లారు. బూత్‌కు ‘370’ ఓట్లు ఎక్కువ పడాలినామినేషన్ తర్వాత కాశీలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో కాశీ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమయ్యారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో రద్దయిన ఆర్టికల్ 370కి గుర్తుగా కాశీలోని ప్రతి బూత్‌లో గతంతో పోలిస్తే నాకు 370 ఎక్కువ ఓట్లు పడేలా చేసే బాధ్యత మీదే’ అని మోదీ అన్నారు. కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మరింతగా ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు మోదీ విజయమంత్రాలను ఉపదేశించారని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నేత అథ్హర్ జమాల్ లారీ మోదీకి పోటీగా బరిలో నిలబడ్డారు.సొంత ఇల్లు, కారు లేదు మోదీ అఫిడవిట్మోదీ తన స్థిరచరాస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం.. మోదీకి సొంత భూమి, ఇల్లు, కారు లేవు. చేతిలో రూ.52,920 నగదు ఉంది. రూ.3.02 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2018–19లో రూ.11,14,230గా ఉన్న ఆదాయం 2022–23 వచ్చేసరికి రూ.23,56,080కు పెరిగింది. గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచీలో రూ.73,304, వారణాసి ఎస్బీఐ బ్రాంచీలో రూ. 7,000 నగదు ఉంది. ఎస్బీఐలో రూ.2.85 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. రూ.2.67 లక్షల విలువైన, 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.9.12 లక్షల విలువైన నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. నామినేషన్ పత్రాల్లో భార్య పేరును జశోదాబెన్గా పేర్కొన్న మోదీ ఆమె ఆస్తుల వివరాలు తనకు తెలియదని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఆయనకు అప్పులు కూడా లేవు. 1967లో ఎస్ఎస్సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక ప్లాట్ ఉందని పేర్కొన్న మోదీ ఈసారి దానిని ప్రస్తావించలేదు. -
నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్‌కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్‌ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్‌కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
Lok sabha elections 2024: ముహూర్తం మించిపోయింది...
నవ్సారి(గుజరాత్): ‘గురువారం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలు. దివ్యమైన ముహూర్తం. సరిగ్గా ఈ సమయానికి ఏది ప్రారంభించినా విజయం ఖాయం’ఇది పూజారి జిగర్ జానీ చెప్పిన మాట. ముహూర్త బలాన్ని బలంగా నమ్మే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నవ్సారి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేయాలనుకున్నారు. సీఎం భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు వెంటరాగా నవ్‌సారిలోని పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉదయం రోడ్ షోతో కలెక్టరేట్‌కు బయలుదేరారు. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో అనుకున్న సమయానికి ఆయన కాన్వాయ్ కలెక్టరాఫీసుకు చేరుకోలేకపోయింది. విజయ ముహూర్తం మించిపోవడంతో పాటిల్ నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. మళ్లీ అదే పూజారి నిర్ణయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం అదే 12.39 గంటలకు పాటిల్ నామినేషన్ దాఖలు చేస్తారని సన్నిహితులు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు 6.89 లక్షల ఓట్ల తేడాతో పాటిల్ ఘన విజయం సాధించారు. -
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్
-
అంబులెన్సులో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
-
ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్ ఇవ్వండి
కరీంనగర్ టౌన్: అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరు సాగిస్తున్నానని బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్‌సింగ్‌తో కలసి కరీంనగర్ కలెక్టరేట్‌లోకి కారు నడుపుకుంటూ వెళ్లిన సంజయ్.. ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటివరకు ప్రజలు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకట్రెండు పథకాలు అమలు చేసి అదేదో గొప్ప పని చేసినట్లు భూతద్దంలో చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు వైపా లేక ధర్మం వైపా ప్రజలు తేల్చుకోవాలి: రాజాసింగ్ కరీంనగర్ ప్రజలు ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ పక్షాన ఉంటారో లేక అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ. 20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్లో సంజయ్ పోటీ చేస్తున్నారని తెలియగానే గంగుల కమలాకర్ దారుస్సలాం వెళ్లి ఎంఐఎం అధినేతకు సలాం చేశారని... అయినా సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ట్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీయేనని మైనారిటీలు గుర్తించాలన్నారు. బండి సంజయ్‌పై 35 కేసులు.. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై పలు సందర్భాల్లో 35 కేసులు (గత అసెంబ్లీలో కేవలం 5 కేసులు) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు. సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూములు, గృహాలు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద సంజయ్ దంపతుల ఆస్తుల విలువ రూ.79.51 లక్షలు మాత్ర మే. ఇక తనకు రూ.5.44 లక్షల రుణాలు, తన భార్యకు రూ.12.40 లక్షల రుణాలు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఏపీ: నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వారిలో పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తొలుత సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ ఫారమ్స్ అందజేశారు. అనంతరం వారు అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ► నామినేషన్ సందర్భంగా అభ్యర్థులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, నంబురి శంకర్ రావు, ఉండవల్లి శ్రీ దేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, జంగా కృష్ణ మూర్తిలు ఉన్నారు. -
చిత్తూరు కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
-
గద్దర్‌ను బెదిరించారు.. చిత్ర, విచిత్రాలెన్నో జరుగుతున్నాయి
చండూరు : మునుగోడులో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆయన శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో నాటి నుంచి చిత్ర, విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలలో గద్దర్ ప్రజా శాంతి పార్టీ తరుఫున పోటీ చేయకుండా కొంతమంది బెదిరించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఆనాటి నుంచి నేటి వరకు అనేక విధాలుగా వెనుకబడి పోయిందన్నారు. తాను ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృషి పెట్టనున్నట్లు ప్రకటించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ హూజూరాబాద్ తర్వాత మళ్లీ మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు అగ్రకుల పార్టీలు సిద్ధమయ్యాయని, ఓట్లను అత్యధిక రేటుకు కొనేందుకు ముందుకువస్తున్నాయని డీఎస్పీ (దళితశక్తి ప్రోగ్రాం) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ మండిపడ్డారు. శుక్రవారం చండూరులో డీఎస్పీ అభ్యర్థి వేల్పుల గాలయ్య నామినేషన్ తరువాత నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. వేల కోట్ల సంపద ఉన్న అగ్రకుల అభ్యర్థులకు దీటుగా అట్టడుగు నిరుపేద అయిన వ్యక్తి గాలయ్యను బరిలో నిలుపుతున్నట్లు చెప్పారు. ఓట్లను అమ్మడం కొనడం పెద్ద నేరమని, గ్రామాల్లో మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు రెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. మునుగోడులో ఉన్న రెండు లక్షల పది వేల ఓట్లున్న బీఎస్పీ, ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చును కేవలం రూ.40 లక్షల వరకు మాత్రమే పరిమితి విధిస్తే ఈపాటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాయకుల పై చర్యలు ఏవని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, హరీష్ గౌడ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!) -
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాజగోపాల్ రెడ్డి
-
ఆదిలాబాద్ ఎంపీకి అరుదైన అవకాశం
ఆదిలాబాద్ టౌన్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. -
ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ కమాండోల 'జెడ్ ప్లస్' భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్ర అధికారులు బుధవారం వెల్లడించారు. జెడ్ ప్లస్ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ. 24న నామినేషన్ ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. (క్లిక్: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ) -
ఈపీఎఫ్ అలెర్ట్: ఈ-నామినేషన్ దాఖలు చేశారా? చేస్తే మీకే లక్షల్లో ప్రయోజనం!
ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బంపరాఫర్ ఇచ్చింది. ఈ నామినీ ప్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఖాతాదారులు ఈ- నామినీని పూర్తి చేయాలని సూచించింది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్‌ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్లైన్ సేవలు, ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు. Benefits of filing e-Nomination. ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD — EPFO (@socialepfo) March 22, 2022 "ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?" సభ్యుడు మరణించిన తర్వాత ఆన్లైన్ లో క్లయిమ్ చేసుకోవచ్చు. పేపర్‌లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్. పీఎఫ్, పెన్షన్ ఆన్లైన్ చెల్లింపు. అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా. -
బర్రె మీదొచ్చి ఎన్నికల నామినేషన్
-
West Bengal Bypolls: నామినేషన్ దాఖలు చేసిన దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలయ్యింది. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీదీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో మమత తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. (చదవండి: మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ) పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌తో పాటు శంశేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా.. 16వ తేదీ ఉపసంహరణ. అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. చదవండి: మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
హుజూరాబాద్‌లో వేయి మందితో నామినేషన్
హుజూరాబాద్: హుజూరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్ వేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పత్యం యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి తెలిపారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్‌లోని హైస్కూల్ క్రీడా మైదానంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో సర్క్యులర్ నెంబర్ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించారని తెలిపారు. 16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోకపోతే పోటీకి దిగుతామని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షులు రమేశ్, శ్రీనివాస్, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క సీటు గెలిచినా టీడీపీకి ఒరిగేదేమీ లేదు: పనబాక
సాక్షి, నెల్లూరు(అర్బన్): ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ తరఫున మాజీ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో కలసి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలతో కలసి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు రెండు సెట్ల నామినేషన్లను అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాడాలంటే తమను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎమ్మెల్సీ బరిలో సుభాష్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమైంది. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చెందిన పీసీసీ డెలిగేట్ సుభాష్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఆయన పదవీచ్యుతుడు కావడంతో రెండేళ్ల కాలపరిమితి కోసం ఎన్నిక జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పారీ్టలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగాలని ఇటీవల జరిగిన సమా వేశంలో నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మానాల మోహన్‌రెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన సుభాష్‌రెడ్డి పేర్లను ఆ పార్టీ నాయకత్వం పరిశీలించింది. అయితే సుభాష్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేయడంతో ఆయన సోమవారం నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. పత్రాలను సిద్ధం చేసిన తరువాత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై సుభాష్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పార్టీ నిర్ణయం మేరకు తాను పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు దాదాపు 150 మంది ఉండడం, వారితో పాటు మరికొన్ని ఓట్లు సంపాదించి పార్టీ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయతి్నస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపుతున్నారని భావిస్తున్నారు. టీఆర్ఎస్లో పెరుగుతున్న ఆశావహులు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి పలువురు నేతలు ఆసక్తి చూపగా, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కచ్చితమైన హామీ లభించినట్లు సమాచారం. దీంతో ఆయన నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. కామారెడ్డికి చెందిన టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన మాజీ ఎంపీ కవిత, కేటీఆర్‌లను కలిసి విన్నవించారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మూడు రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని విన్నవించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థిని ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఒకరోజు ముందు అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నామినేషన్ దాఖలు చేసిన గరికిన గౌరి
-
లక్నోలో రాజ్‌నాథ్‌సింగ్ నామినేషన్