Ombudsman
-
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్బీఐ–సమీకృత అంబుడ్స్‌మన్ స్కీము (ఆర్బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్‌మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్‌మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది. -
భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న సేవల్లో పారదర్శకత, వినియోగదారులకు మరింత జవాబుదారీగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంబుడ్స్‌మన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద 2022-23లో 7.03 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 68% పెరిగాయి. మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎమ్/డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్స్, పారా బ్యాంకింగ్ తదితరాలకు సంబంధించి ఈ ఫిర్యాదులు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్(ఆర్బీ-ఐఓస్)-2021 కింద ఆర్బీఐకి చెందిన 22 అంబుడ్స్‌మన్ కార్యాలయాలు(ఓఆర్‌బీఐఓలు), సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్(సీఆర్పీసీ), కాంటాక్ట్ సెంటర్లకు వచ్చిన ఫిర్యాదులతో తొలి స్టాండలోన్ వార్షిక నివేదిక(2022-23) వెలువడింది. ఈ నివేదిక ప్రకారం.. 2022-23లో మొత్తం 7,03,544 ఫిర్యాదులు వచ్చాయి. ఓఆర్‌బీఐఓల్లో సగటున 33 రోజుల్లో ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. అంతక్రితం ఏడాది (2021-22) ఇది 44 రోజులుగా ఉంది. ఆర్బీ-ఐఓస్ కింద పరిష్కరించిన ఫిర్యాదుల్లో మెజారిటీ(57.48%) భాగం మ్యూచువల్ సెటిల్మెంట్, మధ్యవర్తిత్వం ద్వారానే జరిగాయి. చండీగఢ్, దిల్లీ, హరియాణ, రాజస్థాన్, గుజరాత్ నుంచి అత్యధిక ఫిర్యాదులు అందగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి అతి తక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఏంటీ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్? బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇప్పటి వరకు మూడు వేర్వేరు అంబుడ్స్‌మన్ పథకాలు పనిచేస్తున్నాయి. బ్యాంకింగ్ సంబంధించిన ఫిర్యాధుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (బీఓఎస్) 1995 నుంచి పని చేస్తోంది. బ్యాంకింగ్-యేతర ఆర్థిక సంస్థల కోసం.. ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018 నుంచి, డిజిటల్ లావాదేవీల కోసం.. ద అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 నుంచి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడింటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మెన్’ వ్యవస్థగా ఏకీకృతం చేసి సేవలు అందిస్తున్నారు. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లున్న నాన్-షెడ్యూల్డ్ ప్రాథమిక సహకార బ్యాంకులూ ఈ వ్యవస్థ కిందకే వస్తాయి. వినియోగదారుడు ఆర్థిక సంస్థ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానంతో సంతృప్తి చెందకపోతే అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. అక్కడా పరిష్కారం కాకపోతే అప్పిలేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్పిలేట్‌లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌తో కూడిన బృందం ఉంటుంది. ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ https://cms.rbi.org.in లో వినియోగదారులు వారి ఫిర్యాదులను ఫైల్ చేయవచ్చు. చండీగఢ్‌లోని సెంట్రలైజ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్‌కి ఇమెయిల్ లేదా భౌతికంగా లేఖను పంపడం ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఇదీ చదవండి: అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం! అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబరు - 14448 ద్వారా కాల్ సెంటర్‌కు కాల్ చేసి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర భారతీయ భాషలలో త్వరలోనే ఈ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు ఆర్బీఐ గతంలో తెలిపింది. -
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం.. మాజీ క్రికెటర్‌కు ఊరట
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో మాజీ స్పిన్నర్ అజిత్ చండీలాకు ఊరట లభించింది. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో భాగమైన అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మన్ వినీత్ శరణ్ ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. 2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న చండీల, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడు. బుకీ నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నాడని అజిత్ చండీలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. చండీల ఆ బుకీ చెప్పినట్టుగా చేయనుందుకు అతడికి రూ.20 లక్షలు తిరిగిచ్చేశాడు. మిగతా రూ.5 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. ఈ క్రికెటర్ బుకీ నుంచి డబ్బులు తీసుకున్నాడనే విషయాన్ని పోలీసులు ఢిల్లీ కోర్టులో నిరూపించలేకపోయారు. దాంతో, కోర్టులో తీర్పు అజిత్ చండీలాకు అనుకూలంగా వచ్చింది. అందుకని అతను తనపై జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ తలుపు తట్టాడు. తనపై విధించిన నిషేధాన్ని తగ్గించాలని అతను విన్నవించుకున్నాడు. అతని అభ్యర్థనను స్వీకరించిన అంబుడ్స్‌మన్ నిషేధాన్ని తగ్గిస్తూ నిర్ణయం వెల్లడించాడు. ఇప్పటికే అంకిత్ చవాన్, శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే. కెరీర్లో రెండు ఫస్ట్‌క్లాస్, తొమ్మిది లిస్ట్-ఏ, 28 టి20 మ్యాచ్‌లు ఆడిన అజిత్ చండీలా ఐపీఎల్లో 2013 వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ ఐదో ఎడిషన్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా అజిత్ చండీలా నిలిచాడు. ఐపీఎల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. తనపై ఏడేళ్ల నిషేధం తగ్గించడంపై అజిత్ చండీలా స్పందించాడు. ''ఎంత సంతోషంగా ఉన్నాననేది చెప్పలేను. నా పొరపాటు ఏం లేకున్నా కూడా ఇన్నాళ్లు నేను, నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విధిని ఎవరు తప్పించగలరు. అయితే.. దేవుడు నా వైపు ఉన్నాడు. నాపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దగ్గరి వాళ్లు కూడా దూరం అయ్యారు. అలాగని నేను బాధ పడడం లేదు. ఎందుకంటే మనందరం చనిపోయేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తాం'' అని చండీలా అన్నాడు. చదవండి: కేఎల్ రాహుల్ విషయంలో మాజీల మధ్య తిట్ల పురాణం 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్‌మన్.. సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. -
‘హెచ్‌సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్‌సీఏ, బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు మర్యాదిస్తాం.. అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ జస్టిస్ దీపక్‌వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఇతర కౌన్సిల్ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్‌మన్‌కు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు. అంబుడ్స్‌మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్‌కు అజహార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్‌మెన్‌గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు. -
హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం అజారుద్దీన్‌కు naహైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్ కౌన్సిల్ స్థానంలో అజహర్ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్‌మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్‌మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
బీమా బ్రోకింగ్ సంస్థలు...
న్యూఢిల్లీ: బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా అంబుడ్స్‌మన్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పాలసీదారులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలను సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. అంబుడ్స్‌మన్‌కి కేవలం వివాదాలపైనే కాకుండా బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతరత్రా మధ్యవర్తులు అందించే సేవల్లో లోపాలపైన కూడా ఫిర్యాదు చేసే విధంగా కంప్లైంట్ల పరిధిని విస్తృతం చేసినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలు–2017కి ఈ మేరకు సమగ్రమైన సవరణలు చేసినట్లు పేర్కొంది. నిర్దిష్ట సవరణల ప్రకారం.. పాలసీదారులు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునేలా ప్రత్యేక మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా అంబుడ్స్‌మన్ విచారణ నిర్వహించవచ్చు. అంబుడ్స్‌మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్వతంత్రంగా, సమగ్రంగా జరిగే విధంగా తత్సంబంధ నిబంధనలను సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేసిన వారిని కూడా సెలక్షన్ కమిటీలో చోటు ఉంటుందని పేర్కొంది. -
కస్టమర్ల ఫిర్యాదుల హోరు : టాప్‌లో ఏ బ్యాంకు?
సాక్షి, ముంబై: బ్యాంకు సేవలపై కస్టమర్ల ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. 2020 జూన్ 30తో ముగిసిన సంవత్సర కాలంలో ఫిర్యాదులు 58 శాతం పెరిగి 3.08 లక్షలకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూలై నుంచి జూన్ కాలాన్ని ఆర్బీఐ పాటిస్తుంటుంది. కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతం ఏటీఎంలు లేదా డెబిట్ కార్డులకు సంబంధించి ఉంటుండగా, తర్వాత మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌కు సంబంధించి 13.38శాతం ఉంటున్నట్టు ‘అంబుడ్స్‌మన్ పథకం’పై ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. క్రెడిట్ కార్డులు, నోటీసుల్లేకుండా లెవీ చార్జీలు విధించడంపై గత సంవత్సరంలో ఫిర్యాదులు పెరిగాయి. బ్యాంకులపై ఫిర్యాదులు అంతకుముందు ఏడాది 195,901 లతో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకులపై మొత్తం 308,630 ఫిర్యాదులందాయి. వీటిల్లో 48,333 ఫిర్యాదులతో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టాప్‌లో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్‌పై 15,004, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌పై 11,844, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌పై 10,457, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై 9,928 ఫిర్యాదులను అంబుడ్స్‌మన్ పరిష్కరించింది. ఎన్బీఎఫ్సీలపై ఫిర్యాదులు ఎన్బీఎఫ్సీలపై ఖాతాదారుల ఫిర్యాదులు ఏకంగా 387శాతం పెరిగాయి. గతేడాది 3991తో పోలిస్తే మొత్తం 19,432 ఫిర్యాదులొచ్చాయి. వీటిల్లో అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్‌పై నమోదయ్యాయి. కంపెనీపై అంబుడ్స్‌మన్‌కు ఏకంగా 4,979 ఫిర్యాదులు వచ్చాయి వాటిలో 1968 నిర్వహించదగినవి. 300 ఫిర్యాదులతో ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ రెండో స్థానంలో ఉంది. ఇక ఆ తరువాత హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (252 నిర్వహించదగిన ఫిర్యాదులు), టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (217 నిర్వహించదగిన ఫిర్యాదులు) ఫుల్లెర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ (235 నిర్వహించదగిన ఫిర్యాదులు) ఉన్నాయి. -
శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. అసంతృప్తి ఎక్కువే 48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు. రెన్యువల్ ప్రీమియం భారం పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం. క్లెయిమ్ సెటిల్మెంట్ 60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు. ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. పరిష్కారాలకు మార్గాలు పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం. ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. -
అంబుడ్స్‌మన్ ఎదుట హాజరైన సచిన్, లక్ష్మణ్
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చేందుకు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం బీసీసీఐ అంబుడ్స్‌మన్–నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యారు. మూడు గంటలకు పైగా వీరిద్దరూ తమ వాదన వినిపించారు. ఈ అంశం లేవనెత్తిన మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా సైతం విడిగా జస్టిస్ జైన్‌ను కలిసి వివరణ ఇచ్చాడు. వాదనలన్నిటినీ లిఖితపూర్వంగా సమర్పించాలని జస్జిస్ జైన్ వీరిని ఆదేశించారు. బీసీసీఐ నియమిత క్రికెట్ సలహా మండలి సభ్యులుగా ఉన్న సచిన్, లక్ష్మణ్... ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. తాము స్వచ్ఛందంగానే ఈ సేవలు అందిస్తున్నామని ఇద్దరూ చెబుతున్నారు. గతంలో తాను సమర్పించిన వివరణలోనూ బీసీసీఐ ఇదే విషయం స్పష్టం చేసింది. కాగా, ఇదే అంశంపై సచిన్, లక్ష్మణ్ మే 20న మరోసారి అంబుడ్స్‌మన్‌ను కలవనున్నారు. -
వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై సెటైర్లు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చర్యపై అభిమానులు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పంటినొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్ తన చిరకాల మిత్రుడు, డెంటిస్ట్ పార్థ సాల్వేకర్ వద్ద మంగళవారం చికిత్స చేయించుకున్నాడు. పాడైపోయిన దవడ పన్ను తీయించుకున్నాడు. అనంతరం.. ‘నొప్పి అనేది రెండు రకాలు. ఒకటి శారీరమైనది. రెండోది మానసికమైనది. కానీ, పంటి సమస్య ఈ రెండు సమస్యల్ని తట్టిలేపుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోతోపాటు.. తొలగించిన పన్ను ఫొటో కూడా పోస్టు చేశాడు. (చదవండి :అంబుడ్స్‌మన్ ముందుకు సచిన్, లక్ష్మణ్! ) అయితే, అభిమానులు కొందరు లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయగా.. మరికొందరు మాత్రం.. యాక్ ఛీ..! రక్తంతో కూడిన మీ పన్ను చూపిస్తున్నారేంటి అని చీదరించుకుంటున్నారు. ఈ ఫొటో అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. మరొక అభిమాని.. ‘మీరు ఇలాగే మరిన్ని పళ్లు పీకించుకునేందుకు మీ ఫ్రెండ్‌ను తలచూ కలవాలి’ అని సెటైర్ వేశారు. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందావంటూ నోటీసులు వచ్చాయి. కదా.. బీసీసీఐకి ఈ ఎర్రటి ‘పన్ను’ పంపించు. లెక్క సరిపోతుంది’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్‌గా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని అంబుడ్స్‌మన్ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని అంబుడ్స్‌మన్‌కు లక్ష్మణ్ సంజాయిషీ లేఖ రాశాడు. Some pains are physical, some are mental, the one that is both is dental. Was having severe tooth pain & had to get my wisdom tooth extracted by my childhood friend @ParthSatwalekar who was my school & college captain and now is a successful dentist in Hyderabad. Blessed 🙏🏼 pic.twitter.com/BVBAGs2r6z — VVS Laxman (@VVSLaxman281) April 30, 2019 -
మాకే తెలియదు మా పాత్రేమిటో!
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌గానే సుపరిచితుడు. మైదానంలో, వెలుపల ఎక్కడా ఆగ్రహించిన దాఖలాలు లేవు. సహనం కోల్పోయిన సందర్భాలు లేవు. అలాంటి లక్ష్మణ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు రాసిన సంజాయిషీ లేఖలో పరిపాలక కమిటీ (సీఓఏ) వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లో తమ బాధ్యతలేంటో ఇప్పటికీ తమకే తెలియదని వెల్లడించాడు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారి రిటైర్డ్ జస్టిస్ జైన్ పంపిన నోటీసుకు స్పందనగా రాసిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నాడు. అసలు పరిధి, పదవీకాలం తెలియని సీఏసీ సభ్యుడిని అవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సలహాదారుగా ఉండటం ఏ రకంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందో చెప్పాలన్నాడు. ఇందులో అసలు ప్రయోజనాలే ఉంటే ఏ సవాలుకైనా సిద్ధమన్నాడు. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని లేఖలో తీవ్రస్థాయిలో లక్ష్మణ్ ప్రస్తావించాడు. తన అనుభవం, ఆలోచనలతో భారత క్రికెట్‌కు అర్థవంతమైన మేలుచేయగలననే నమ్మకంతో కమిటీ సభ్యుడయ్యేందుకు అంగీకరించానని... భారత క్రికెట్ సూపర్‌పవర్‌గా వెలుగొందాలనే లక్ష్యంతోనే బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతిఫలాన్ని నిరాకరించానని వివరించాడు. నోటీసులపై ముందుగా సచిన్ ఆదివారం సంజాయిషీ లేఖ పంపాడు. ముంబై ఇండియన్స్ సలహాదారుగా తాను ఎలాంటి లబ్ధి పొందనపుడు విరుద్ధ ప్రయోజనాలెలా అవుతాయన్నాడు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని చెప్పాడు. నిజానికి సీఓఏ మహిళా జట్టు కోచ్ ఎంపిక క్రతువులో తమ ముగ్గురు సభ్యులకు అసలు సమయమే ఇవ్వలేదని లక్ష్మణ్ అన్నాడు. -
రాహుల్, పాండ్యాలకు భారీ జరిమానా
ముంబై: టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు రూ. 20 లక్షల చొప్పున బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ జరిమానా విధించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పారా మిలటరీ అమర జవానుల కుటుంబాలకు ఇద్దరూ లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు చెరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించారు. నాలుగు వారాల్లోగా వీరిద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాలన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే వీరికి ఇచ్చే మ్యాచ్ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్‌మన్ ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి వెనక్కు వచ్చేయడంతో ఇప్పటికే రూ. 30 లక్షల చొప్పున ఆదాయం కోల్పోయారని తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు రోల్ మోడల్స్‌గా ఉండాలని, వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలన్నారు. తాము చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే హార్దిక్, రాహుల్ క్షమాపణలు చెప్పారు. -
తనపై వచ్చిన ఆరోపణలపై గంగూలీ క్లారిటీ
న్యూఢిల్లీ: లాభదాయక జోడు పదవుల్లో కొనసాగుతున్నాడంటూ తనపై వచ్చిన ఆరోపణలకు టీమిండియా మాజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగూలీ ప్రస్తుత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా నియమితుడైన సంగతి తెలిసిందే. ఇలా రెండు లాభదాయక పదవుల్లో ఉండడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ముగ్గురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గంగూలీకి అంబుడ్స్‌మన్ సంజాయిషీ నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ అంబుడ్స్‌మన్‌కు గంగూలీ సుదీర్ఘ లేఖ రాశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా తాను నిర్వహిస్తున్న బాధ్యత బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలోగానీ, వాణిజ్య రీత్యా కానీ లాభదాయక పదవి కాదంటూ ఆ లేఖలో వివరించాడు. ‘ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న బాధ్యత బీసీసీఐ అనుబంధ సంఘం/ బీసీసీఐ ఆఫీస్ బేరర్లోకి రాదు. అంతేకాదు బీసీసీఐ నిర్వహిస్తున్న క్రికెట్ కమిటీలు/ ఐపీఎల్‌కు సంబంధం లేదు. అయితే, బీసీసీఐ సాంకేతిక కమిటీ, ఐపీఎల్ టెక్నికల్ కమిటీ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఒకప్పుడు సభ్యత్వం ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటికి రాజీనామా చేశాను. బీసీసీఐ అధీనంలో ఉన్న ఏ కమిటీలోనూ సభ్యున్ని కాదు. అందువల్ల ఢిల్లీ సలహాదారుగా నేను నిర్వహిస్తున్న పోస్ట్ బీసీసీఐ లాభదాయక జోడు పదవుల కిందకురాదు’ అంటూ గంగూలీ ల -
శ్రీశాంత్‌కు శిక్ష ఎంత?
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేసర్ శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ శిక్ష విషయంలో బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ నిర్ణయం తీసుకుంటారని శుక్రవారం సుప్రీం కోర్టు వెల్లడించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. దీనిపై అతను కోర్టుకెక్కగా... ఇటీవలే శిక్ష తగ్గించే విషయం ఆలోచించాలని బీసీసీఐకి సుప్రీం కోర్టు సూచించింది. -
ఇక బ్యాంకుల చెంతనే ‘అంబుడ్స్‌మన్’
ముంబై: బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. 10 బ్రాంచ్‌లకు మించి కార్యకలాపాలున్న వాణిజ్య బ్యాంకులన్నీ ఇకపై కచ్చితంగా అంతర్గత అంబుడ్స్‌మన్‌ను (ఐఓ) నియమించుకోవాలని సోమవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీని నుంచి రీజినల్ రూరల్ బ్యాంక్స్‌కు (ఆర్ఆర్బీ) మినహాయింపునిచ్చింది. ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌కు మరిన్ని స్వతంత్ర అధికారాలను కల్పించడం, ఐఓ యంత్రాంగం విధి నిర్వహణ తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకుగాను ‘అంతర్గత అంబుడ్స్‌మన్ స్కీమ్–2018’ పేరుతో తాజా చర్యలను చేపట్టినట్లు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు సేవల్లో లోటుపాట్లపై కస్టమర్ల ఫిర్యాదులను(పాక్షికంగా లేదా పూర్తిగా తిరస్కరణకు గురైనవి) ఓఐ పరిశీలించి తగిన పరిష్కారాన్ని చూపుతారని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఓఐ నియామకం, పదవీకాలం, బాధ్యతలు, విధులు, విధానపరమైన నిబంధనలు, పర్యవేక్షణ యంత్రాంగం వంటివన్నీ ఈ స్కీమ్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.దీని అమలును ఆర్బీఐతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్ యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తుంది. కాగా, ఫిర్యాదులపై 30 రోజుల్లోగా తగిన పరిష్కారాన్ని చూపని బ్యాంకులపై ప్రస్తుతం ఆర్బీఐ నియమించిన అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే అవకాశం కస్టమర్లకు ఉంది. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కార్యాలయాలున్నాయి. -
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఎదురుదెబ్బ
-
మాజీ ఎంపీ వివేక్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. తీర్పును స్వాగతిస్తున్నాము : అజారుద్దీన్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారన్నారు. -
వివేక్ అనర్హుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఉత్తర్వులు జారీచేయడం సంచలనం సృష్టించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ఎన్నిక కూడా చెల్లదని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏసీబీ చార్జిషీటులో శేష్‌నారాయణ్ నిందితునిగా ఉన్నందున కార్యదర్శి పదవికి ఆయన అర్హుడు కాదని అంబుడ్స్‌మన్ తేల్చారు. వారిని పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శుల కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతవరకు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు. -
బ్యాంకింగ్ ఫిర్యాదులు పెరిగాయ్
♦ ఆర్బీఐ కార్యక్రమాలు ఫలితాన్నిస్తున్నాయి ♦ ఎస్‌బీఐపైనే ఫిర్యాదులెక్కువ: అంబుడ్స్‌మన్ కృష్ణమోహన్ సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌పై చైతన్యం పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంబుడ్స్‌మన్, ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎన్.కృష్ణమోహన్ చెప్పారు. సంప్రదింపులు, సలహాల ద్వారా ఫిర్యాదుల్ని పరిష్కరించటంలో అంబుడ్స్‌మన్ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఏడాదికి సంబంధించి అంబుడ్స్‌మన్ పురోగతిని వెల్లడించారు. 2014-15తో పోలిస్తే 2015-16లో అంబుడ్స్‌మన్‌కు వచ్చిన ఫిర్యాదులు 35.36 శాతం మేర పెరిగాయన్నారు. ‘‘మొత్తం 5910 ఫిర్యాదులు అందాయి. వీటిలో 2801 ఏపీ నుంచి, 3109 తెలంగాణ నుంచి వచ్చాయి. వీటిలో 94.41 శాతం ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించాం. సలహాలు, సూచనలు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాం. 2015-16 ఫిర్యాదుల్లో అత్యధికంగా ఎస్బీఐకి చెందినవి 26.2 శాతం, అనుబంధ బ్యాంకులవి 9% ఉన్నాయి. ఎస్బీఐ కార్డులకు సంబంధించి 3.8 శాతం ఫిర్యాదులొచ్చాయి’’ అని వివరించారు. గతంతో పోలిస్తే నగరాల్లో ఫిర్యాదులు ఒక శాతం తగ్గుముఖం పట్టగా.. పట్టణాల్లో 32 నుంచి 37 శాతానికి పెరిగాయన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందినవి 27 శాతం మేరకు ఉన్నాయన్నారు. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులకు చెందినవే 25.5 శాతం ఉన్నాయన్నారు. అంబుడ్స్‌మన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్, వరంగల్, వివిధ జిల్లా కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు, పాఠశాలలు, విద్యాలయాల్లో ఆర్థిక అవగాహన సదస్సులు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించినట్లు కృష్ణమోహన్ చెప్పారు. -
టెలికంలోనూ ఇక అంబుడ్స్‌మన్!
♦ త్వరలో ట్రాయ్ నిర్ణయం ♦ ప్రస్తుత ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగ్గాలేదన్న ట్రాయ్ చైర్మన్ శర్మ న్యూఢిల్లీ : టెలికం సేవల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో పరిష్కారం కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం తగిన నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్న ఫిర్యాదుల పరిష్కార విధానం ప్రభావవంతంగా లేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ అన్నారు. ఇందుకు సంబంధించి సంస్థాగత ఏర్పాటుపై రెండు వారాల్లో సంప్రదింపుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సైతం తెలుసుకుంటామన్నారు. ఆటోమేటెడ్ విధానం లేదా టెక్నాలజీ ఆధారిత వేదిక ఏర్పాటు చేయాలా అన్నది పరిశీలించాల్సి ఉందని, దీనిపై సలహా తీసుకుంటామని శర్మ చెప్పారు. పరిస్థితి ఇదీ...: టెలికం వినియోగదారుల సంఖ్య 100 కోట్లుగా ఉండడంతో ఫిర్యాదుల సంఖ్య భారీగా ఉంటోంది. ఎక్కువ శాతం ఫిర్యాదులు బిల్లులు, విలు వ ఆధారిత సేవలను యాక్టివేట్ చేయడం, టారిఫ్‌ను మార్చడంపైనే ఉంటున్నాయి. అనవసర వ్యయం ఎందుకన్న భావనలో ఎవరూ కోర్టుల వరకు వెళ్లడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల వినియోగదారుల ఫోరం టెలికం ఫిర్యాదులను స్వీకరించడం లేదు. దీంతో ప్రస్తుతం వినియోగదారులు ట్రాయ్, టెలికం శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని ఆయా విభాగాలు సంబంధిత ఆపరేటర్‌కు పంపించి ఊరుకుంటున్నాయి. దీంతో పరిష్కారం లభించడం లేదు. -
ఇక బ్యాంకింగ్ అంతర్గత అంబుడ్స్‌మన్: ఆర్బీఐ
ముంబై: బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల తక్షణ పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్ఘాటించింది. ప్రభుత్వ రంగంతో పాటు దిగ్గజ ప్రైవేటు రంగ, విదేశీ బ్యాంకులు అంతర్గత అంబుడ్స్‌మన్ నియామకాలు చేసుకోవాలని ఆదేశించింది. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌ను చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (సీసీఎస్ఓ)గా వ్యవహరిస్తారు. కాగా బ్యాంక్ నియమించిన అంబుడ్స్‌మన్, అంతకుముందు అదే బ్యాంకులో పనిచేసి ఉండకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. ఫిర్యాదు సత్వర, నాణ్యతాపూర్వక పరిష్కారం లక్ష్యంగా ఈ చొరవ తీసుకుంటున్నట్లు (అంతర్గత అంబుడ్స్‌మన్) ఆర్బీఐ తెలిపింది.