one crore
-
అమితాబ్ కోటి రూపాయల ప్రశ్న.. కంటెస్టెంట్ ఏం చేశాడంటే?
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను మెప్పించిన ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. ఆదివాసి తెగకు చెందిన కంటెస్టెంట్ బంటి వడివా కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మనం ఓ లుక్కేద్దాం.తాజా ఎపిసోడ్లో మొదటి ఆదివాసీ కంటెస్టెంట్ బంటి వడివా రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.గతంలో తాను ముంబైకి వచ్చినప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.260 మాత్రమే ఉన్నాయని బంటి వడివా తెలిపారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్లో 2024 పారిస్ ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, అమన్ షెరావత్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.కోటీ రూపాయల ప్రశ్న..ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్ను వరించిన పతకమేది?ఆప్షన్స్: ఎ. పైథాగరస్ బహుమతి బి. నోబెల్ బహుమతి సి. ఒలింపిక్ పతకం డి. ఆస్కార్ పతకంఅయితే 1948లో ఒలింపిక్ గేమ్స్‌లో కళల పోటీలు కూడా ఉన్నాయని అమితాబ్ వెల్లడించారు. అందువల్లే చింతామోని కర్ తన కళాకృతికి ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్నాడని తెలిపారు. కాగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో సోనీలివ్‌లో ప్రసారమవుతోంది. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
స్టార్ హీరో కోటి రూపాయల విరాళం.. ఎందుకంటే?
గతేడాది లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో దళపతి విజయ్. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీ స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సడన్ షాకిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా హీరో విజయ్ కోటి రూపాయల విరాళం అందించి తన ఉదారతన చాటుకున్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన కోటి రూపాయల చెక్‌ను అందించారు. కాగా.. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవనం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. @actorvijay Thank u means just two words but means a lot to a person wen he does it from his heart. Well, am talking about my favourite actor our very own #ThalapathiVijay brother for DONATING ONE CRORE towards our #SIAA #NadigarSangam building work. God bless u. Yes we always… pic.twitter.com/EzJtoJaahu — Vishal (@VishalKOfficial) March 12, 2024 -
19th EV EXPO 2023: 2030 నాటికి కోటి ఈవీలు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2030 నాటికి వార్షిక ప్రాతిపదికన ఒక కోటి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఈవీ విభాగం సుమారు 5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనాగా చెప్పారు. 19వ ఈవీ ఎక్స్పో–2023 సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వాహన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 34.54 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ నమోదయ్యాయి. ప్రపంచంలోనే నంబర్–1 ఈవీ తయారీదారుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఉన్న కాలుష్య వాహనాలను హైబ్రిడ్, పూర్తిగా ఈవీలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఖరారవడంతోపాటు సాంకేతిక ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. ప్రజా, సరుకు రవాణా వాహనాలను ఈవీలకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని మంత్రి వివరించారు. -
ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్‌లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం. దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! 2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్‌ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ..
డిజిటల్ పరికరాల్లో వ్యక్తిగత డేటాను భద్రపర్చుకోవడం, వాటి ద్వారా షేర్ చేసుకోవడం, సేకరించడం వంటి ధోరణులు గణనీయంగా పెరిగాయి. దీంతో బడా కార్పొరేట్లు మొదలుకుని సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఆన్లైన్ మోసాలు, గుర్తింపు చోరీ, మాల్‌వేల్ బారిన పడే ముప్పులూ పెరుగుతున్నాయి. ఫలితంగా బోలెడంత నష్టపోవాల్సి కూడా వస్తోంది. ఇలాంటి వాటి నుంచి సరైన సాఫ్ట్వేర్ కొంత రక్షణ కల్పిస్తుండగా, మరి కొంత భరోసానిచ్చేదే సైబర్ బీమా. 18 ఏళ్లు పైబడిన వారు దీన్ని తీసుకోవచ్చు. ఇండివిడ్యుయల్ సైబర్ పాలసీల కింద కవరేజీ రూ. 1 లక్ష మొదలుకుని రూ. 1 కోటి వరకూ ఉంటోంది. ఈ పాలసీని తీసుకునే ముందు అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. క్యూఆర్ కోడ్ వల్ల జరిగే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు మోసాలు, మనీ ట్రాన్స్ఫర్ స్కాముల సందర్భాల్లోనూ రిటైల్ కస్టమరుకు రక్షణ లభించగలదు. ‘బ్యాంకు ఖాతా, క్రెడిట్..డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాం, ఐడెంటిటీని ధృవీకరించడానికి లింక్‌పై క్లిక్ చేయండి‘ అంటూ మోసపూరిత మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆర్థిక నష్టం వాటిల్లితే పాలసీ ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. గుర్తింపు చోరీ కవరేజీ: కంప్యూటర్లో భద్రపర్చిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, చెరిపివేయడం, మార్చేయడం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీపై కేసు వేస్తే ప్రాసిక్యూషన్‌కు అయ్యే వ్యయాలకు కవరేజీ కల్పిస్తుంది. మాల్వేర్ కవర్: ఎస్ఎంఎస్, ఫైల్ ట్రాన్స్ఫర్, లేదా ఇతరత్రా ఇంటర్నెట్ .. డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ కంప్యూటర్ లేదా డిజిటల్ డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకున్న కంప్యూటర్ ప్రోగ్రాంతో మాల్వేర్ వంటిదేమేనా చొరబడి, నష్టం వాటిల్లితే ఇది భర్తీ చేస్తుంది. ఫిషింగ్ కవర్: నమ్మకంగా కనిపిస్తూనే .. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల వివరాలను (కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డబ్బు) చోరీ చేసే యత్నాల వల్ల వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, ప్రాసిక్యూషన్ ఖర్చులకు ఫిషింగ్ కవరేజీ ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ ద్వారా ప్రైవసీ, డేటా ఉల్లంఘన: మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ అనధికారికంగా బైటపెట్టినా లేదా థర్డ్ పార్టీ కంప్యూటర్ సిస్టమ్‌లో భద్రపర్చిన మీ వ్యక్తిగత డేటాకు అనధికారికంగా యాక్సెస్ పొందినా లేదా ఉపయోగించినా, తత్ఫలితంగా వాటిల్లే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ కవరేజీ పని చేస్తుంది. కౌన్సిలింగ్ సర్వీసులు: పైన పేర్కొన్న ఏ కారణాల వల్లనైనా పాలసీదారు ఒత్తిడి, ఆందోళనకు లోనై అక్రెడిటెడ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ వద్ద చికిత్స పొందితే దానికి అయ్యే వ్యయాలను భర్తీ చేసుకోవచ్చు. మాల్వేర్ దాడి జరిగిన సందర్భంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటాను రీస్టోర్ చేసేందుకు అయ్యే ఖర్చులకు సైబర్ బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు ఒకవేళ డేటా నష్టానికి థర్డ్ పార్టీ సర్వీస్ / సర్వీస్ ప్రొవైడర్‌పై దావా వేయదల్చుకుంటే అందుకయ్యే లీగల్ ఖర్చులకు కంపెనీ కవరేజీ ఇస్తుంది. వీటికి తోడు, బీమా పాలసీ కింద కౌన్సిలింగ్ సర్వీసులు, సైబర్ దోపిడీ నష్టాలు, కోర్టుకు వెళ్లేందుకయ్యే ఖర్చులు మొదలైనవి కూడా కవర్ అవుతాయి. ఇలా సైబర్ బీమాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. సైబర్ ప్లాన్ తీసుకోవడంతో పాటు మీ డిజిటల్ జీవితాన్ని భద్రంగా ఉంచుకునేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడం కూడా కీలకం. ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. సమర్ధమంతమైన యాంటీ–వైరస్ సాఫ్ట్వేర్, ఫైర్వాల్స్పై కొంత ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. సైబర్ ఎక్స్టార్షన్ కవర్: ప్రైవసీ, డేటా ఉల్లంఘన లేదా సైబర్ దాడి ముప్పులకు దీని ద్వారా కవరేజీ పొందవచ్చు. ఐటీ కన్సల్టెంట్ సర్వీసులు: వాటిల్లిన నష్టాన్ని రుజువు చేసేందుకు ఐటీ కన్సల్టెంట్ సహాయం తీసుకుంటే దానికయ్యే వ్యయాలను కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. సోషల్ మీడియా కవర్: బాధిత వ్యక్తికి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి వారి ఐడెంటిటీని చోరీ చేస్తుంటారు. ఇలాంటి సైబర్ దాడులప్పుడు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఖర్చులను పాలసీ భర్తీ చేస్తుంది. సైబర్ స్టాకింగ్ కవర్: మిమ్మల్ని వేధించడానికో లేదా భయపెట్టేందుకో డిజిటల్ మాధ్యమం ద్వారా ఎవరైనా పదే పదే వెంటబడుతూ ఉంటే, దాని వల్ల వాటిల్లే నష్టాల భర్తీకి ఈ కవరేజీ ఉపయుక్తంగా ఉంటుంది. -
షాకింగ్ ప్రైస్: మహీంద్రా థార్ 'చైనీస్ వెర్షన్' ధర రూ. కోటి!
న్యూఢిల్లీ: మహీంద్రా థార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన అప్ కమింగ్ వాహనం మహీంద్రా థార్ (5-డోర్స్)కు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపీ క్యాట్ చైనా దీన్ని కూడా కాపీ చేసేసింది. తాజాగా 'చైనీస్ వెర్షన్' పాకిస్తాన్లో తాజా థార్ తెలిస్తే షాక్అవుతారు. ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడు బోయింది. చైనీస్ వాహన తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్ వాహనాల డిజైన్‌ను కాపీ చేయడంలో ముందుంటారు. కార్లు, మోటార్ సైకిళ్లను కూడా కాపీ చేస్తారు. దీనికి పెద్ద ఉదారణ మహీంద్రా థార్, బొలెరో మిశ్రమంతో వచ్చిందే చైనీస్ థార్‌గా పిలిచే BAIC BJ40 ప్లస్. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) పాక్వీల్స్ వెబ్సైట్ ప్రకారం, పాకిస్తాన్లో BAIC BJ40 ప్లస్ ధర రూ. 1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో మహీంద్రా థార్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభం. ఇక డిజైన్ BAIC BJ40 ప్లస్ విషయానికి వస్తే, ఫీచర్లు, సైడ్ ప్రొఫైల్ ప్రముఖ రాంగ్లర్ ఎస్‌యూవీకి దాదాపు సమానం. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) BAIC BJ40 ప్లస్ వాహనంలో 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 5500 rpm వద్ద 218 hpని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజీన్ 4500 rpm వద్ద 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో ఇది లభ్యం. అలాగే ఇకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నోఫీల్డ్ 4 డ్రైవింగ్ మోడ్లతో వచ్చింది. దీంతోపాటు కొత్త తరం ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్ 4WDని కూడా కలిగి ఉంది. జీప్ రాంగ్లర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ త్వరలోనే ఇండియాలోనే లాంచ్ కానుందని అంచనా. విక్రయాల్లో సరి కొత్త రికార్డులను చేరు కుంటుందని భావిస్తున్నారు.మహీంద్రా థార్ పాకిస్థాన్‌లో అందుబాటులో లేకపోవడంతో చైనీస్ మేకర్స్ ఈ ఎత్తుగడ వేశారు. కాగా BAIC BJ40 Plus ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) -
ట్రస్‌కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు. -
Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం
సాక్షి, సిద్దిపేట జోన్: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వంద రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.కోటి విలువైన చెక్కులను ఆదివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడం, వారికి అండగా నిలిచే లక్ష్యంగా తమ సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. చదవండి: (నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన) -
Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?
న్యూఢిల్లీ: జాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్ తిరంగా పిలుపులో కేవలం పది రోజుల్లో ఆన్లైన్లో పౌరులకు 1 కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ చిరునామాకైనా ఉచిత డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఆఫర్ చేస్తోంది. ఒక్కో త్రివర్ణ పతాకాన్ని 25 చొప్పున పౌరులు 1.75 లక్షలకు పైగా జెండాలను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో, తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేశారని డిఓపి తెలిపింది. ప్రభాత్ భేరీలు, బైక్ ర్యాలీ చౌపల్స్ సభల ద్వారా, సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకెళ్లామని వెల్లడించింది. "ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీ మరియు చౌపల్స్ సభల ద్వారా, ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకువెళ్లింది. ప్రోగ్రామ్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. డిజిటల్‌గా అనుసంధానించబడిన పౌరులు" అని పోస్టల్ శాఖ తెలిపింది. కాగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో చాలామంది ప్రజలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. What is Your Excuse??.. Tiranga Merit Shan 🇮🇳 HarGharTiranga🇮🇳 pic.twitter.com/qg6n2OR0aC — ट्विटर पर उपस्थित 🙄 (@aapki_harsha) August 12, 2022 p> “I can't see the flag, but I can feel patriotism by touching the flag” - Madhuri, class IX student.@IndiaPostOffice #HarGharTiranga pic.twitter.com/XnDfS8c8Hi — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2022 -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం..
-
రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం..
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ రూ.కోటి విరాళంగా ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్‌చంద్ జైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఇన్నోవా కారులో ముగ్గురు.. ఎలాంటి లెక్కలు లేవు.. రూ. కోటి స్వాధీనం
సాక్షి, మణికొండ: ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ. కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా టీఎస్ 15ఈబీ 3993 నెంబర్ గల ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా నగదు దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం ప్రాథమిక విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్ అకౌంట్లనుంచి తస్కరించి తమకు రూ. 2 కోట్లను బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్‌కంట్యాక్స్ శాఖకు అప్పగిస్తామని, తదుపరి విచారణతో పాటు వీరి వ్యవహారాలపై మంగళవారం లోతుగా విచారణ జరుపుతామన్నారు. అప్పటి వరకు డబ్బుతో దొరికిన వారి పేర్లు.. వివరాలను ఇచ్చేందుకు నార్సింగి పోలీసులు నిరాకరించారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం -
Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్రను కోటీశ్వరున్ని చేసిన ప్రశ్న ఇదే..
Evaru Meelo Koteeswarulu 1cr Question: రాజా రవీంద్ర.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. అనుకోకుండానే 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి హాజరై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అడిగిన 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అనంతరం మంగళవారం నాటి ఎపిసోడ్లో చెక్కు అందుకున్నారు. దీంతో ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర నిలిచారు. ఈ షోలో రాజా రవీంద్ర ప్రయాణాన్ని మనం ఒకసారి గమనిస్తే.. రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి? A)న్యూయార్క్ B)ముంబయి C)దుబాయ్ D)విజయవాడ ప్రశ్న చదవగానే సమాధానం అందరికీ తెలిసినట్టు అనుకున్నా హాట్‌సీట్‌పై కూర్చొని తక్కువ సమయంలోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌కు తొలి ప్రాధాన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే సమాధానం ఇచ్చి హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆయన వరుసగా సరైన సమాధానాలు చెప్తూ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!) సోమవారం ప్రసారమైన ప్రోగ్రాంలో ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉన్న మూడు లైఫ్ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకొని 12,50,000 గెలుచుకున్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడానికి మరో మూడు ప్రశ్నల దూరంలో నిలిచారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన షోలో రాజా రవీంద్ర కోటి రూపాయల వైపు అడుగులు వేసిన ప్రశ్నలను ఒకసారి చూస్తే.. ఆట ప్రారంభం కాగానే జూనీయర్ ఎన్టీఆర్.. రాజా రవీంద్రను 25 లక్షల రూపాయల ప్రశ్న అడిగారు. ఒక్క లైఫ్ లైన్‌ను అప్పటికే ఉపయోగించడం వల్ల ఇక రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న.. 2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది? A)లాక్డౌన్ B)ఐసోలేషన్ C)క్వారంటైన్ D)పాండమిక్ ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు. ఈ షోలో పాల్గొని 50 లక్షల ప్రశ్నకు చేరుకున్న అతి తక్కువ మందిలో రాజారవీంద్ర ఒక్కరు. 50లక్షల ప్రశ్నను పరిశీలిస్తే.. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు? A)మిజోరాం B)పశ్చిమబెంగాల్ C)ఉత్తరప్రదేశ్ D)కేరళ ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్ బీ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్ సీజన్లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు? A)రంగనాథ్ మిశ్రా B)రంజిత్‌సింగ్ సర్కారియా C)బీపీ మండల్ D)ఫజల్ అలీ కమిషన్ ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్ చేసి ఉన్న మరో లైఫ్ లైన్ ఉపయోగించుకొని ఆప్షన్ డీ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు. చదవండి: (Evaru Meelo Koteeswarulu: కోటితో ఆగను.. అదే నా అసలు స్వప్నం) -
నటుడు విజయ్ సేతుపతి రూ. కోటి విరాళం
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ) భవన నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందించారు. శనివారం చెన్నైలోని స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో పెప్సీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి పాల్గొన్నారు. నిర్మాత కలైపులి ఎస్.థాను, కె.భాగ్యరాజ్, ఆర్.వి.ఉదయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి పెప్సీ భవన నిర్మాణానికి గాను కోటి రూపాయలను చెక్కు రూపంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి అందించారు. అనంతరం మాట్లాడుతూ పెప్సీ భవన నిర్మాణానికి తన సాయం కొనసాగుతుందన్నారు. ఆర్.కె.సెల్వమణి మాట్లాడు తూ భవన నిర్మాణం అన్నది పెప్సీకి చెందిన తొమ్మిదివేలమంది సభ్యుల కల అని అన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌సేతుపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు) -
ఈ అరుదైన రూ. 1 కాయిన్‌కు కోటి రూపాయలా..!
గత కొన్ని రోజులుగా పాత రూ. 2, రూ. 5, రూ.10, 25 పైసల కాయిన్స్‌ను భారీ మొత్తంలో ఆన్లైన్ మార్కెట్లో విక్రయించడం చూసే ఉంటారు. చాలా మంది తమ దగ్గరున్న అరుదైన పాత నాణేలను ఆన్లైన్లో విక్రయిస్తూ భారీ మొత్తంలో నగదును సంపాదిస్తున్నారు. కొంత మంది కాయిన్స్‌ను సేకరించే అభిరుచి ఉన్నవారు ఆన్లైన్లో వారికి నచ్చిన అరుదైన కాయిన్స్‌ను కొనుగోలు చేయడానికి ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ అరుదైన కాయిన్స్‌ను ఎక్కువగా ఇండియా మార్ట్‌లో విక్రయించడం గమనించవచ్చును. తాజాగా 1885 సంవత్సరానికి చెందిన రూ.1 కాయిన్‌ను కోటి రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కాయిన్ ప్రత్యేకత ఏమిటంటే..ఈ కాయిన్‌పై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్ కింగ్ జార్జ్-5 చిత్రం కాయిన్ ఉన్న అరుదైన కాయిన్‌కు ఆన్లైన్లో కోటి రూపాయాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరుదైన కాయిన్‌ను ఇండియా మార్ట్‌లో కొనుగోలుదారులతో చర్చించడంతో భారీ మొత్తంలో నగదును పొందవచ్చును. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే ఇండియామార్ట్‌లో రిజిస్టరై కొనుగోలుదారులతో చర్చించి భారీ మొత్తాన్ని పొందవచ్చును. అరుదైన కాయిన్స్‌ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి అధ్యయనం చేస్తారు. -
Covid Vaccination in AP: వ్యాక్సినేషన్లో ఏపీ రికార్డ్
అమరావతి: కోవిడ్ సంక్షోభ సమయం, వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలకు ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్, సెకండ్ డోసు టీకాలు అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి టీకాలు అందించింది. వ్యాక్సినేషన్లో దేశ సగటును దాటేసి ఏపీ దూసుకుపోతుంది. కోటి దాటారు ఏపీలో ఫస్ట్, సెకండ్ డోస్ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో మొదటి, రెండో తీసుకున్నవారు 1,00,17,712 మందిగా ఉన్నారు. కేవలం మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్ డ్రైవ్ ద్వారా రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 25,24,768గా ఉంది. ప్రత్యేక కృషి కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం జగన్ అప్రమత్తం చేశారు. అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తూ కొవిడ్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. కొవిడ్ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సకాలంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు వచ్చేలా వ్యూహం రచించారు. రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్లను ఆలస్యం చేయకుండా యుద్ధప్రతిపాదికన ప్రజలకు అందించారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోటి మందికి కరోనా నుంచి రక్షణ కల్పించగలిగారు. -
పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడై తిరిగొచ్చాడు..
సాక్షి, మండ్య: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. మామూలు మనిషి కాస్తా కోటీశ్వరుడు కావచ్చు. నిజంగా అలాగే జరిగింది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్ బలరామ్ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్. తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్ మొబైల్‌కు ఫోన్ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్‌మిల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
కోటి కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఏకంగా కోటిదాటింది. కొత్తగా 26,786 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. కాగా, రాత్రి 11గంటలకు అదనంగా 25,173 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,620కు చేరింది. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 145,167కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,20,827కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.40 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.14 శాతం ఉన్నాయి. గత 12 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటోంది. మరణాల శాతం 1.45గా ఉంది. ఈ నెల 18 వరకూ 15,89,18,646 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం 11,13,406 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. చికిత్స తీసుకుంటున్న ఐసీఎంఆర్ చీఫ్ భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో కోవిడ్ చికిత్స పొందుతున్నారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. కార్డియాలజిస్ట్ అయిన భార్గవ దాదాపు ఏడెనిమిది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అనంతరంకొద్ది రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరారని అధికారులు చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ట్విట్టర్ లో వెల్లడించా రు. ప్రస్తుతం కరోనా లక్షణాలేమీ లేవని, వైద్యుల సల హా మేరకు ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. దావానలంలా కోవిడ్.. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో కోవిడ్ మహమ్మారి దావానలంలా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు అభి ప్రాయపడింది. కరోనా వైరస్ చికిత్స సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తూ, ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 8 నెలలుగా వైద్యులతో సహా, ఆరోగ్యకార్యకర్తలు, నర్సులు అవిశ్రాంతంగా పనిచేయడంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, వారికి విరామాన్నిచ్చే కార్యాచరణ ఏదైనా కావాలని జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే, కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక చర్యలను పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
సాక్షి, గుంటూరు: మహమ్మారి కోవిడ్-19 సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీజీహెచ్ తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాని కోసం వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు రూ.కోటి విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు.