OTP
-
ఓటీపీ లేకుండానే రూ.1.90 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లేకుండానే రూ.1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లు ఫోన్లో మెసేజ్ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 1930 కాల్ సెంటర్లో ఏజెంట్ కాల్ రిసీవ్ చేసు కుని వెంటనే బ్యాంకింగ్ ఫాలోఅప్ బృందాన్ని అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి అక్కడున్న రూ.75,69,223లను స్తంభింప చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో రూ.35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్‌లో పెట్టించారు. ఈ విధంగా రూ.1.90 కోట్ల నిధుల్లో నుంచి రూ.1,10,70,000లను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. మిగిలిన రూ.79.30 లక్షల విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఒకట్రెండు గంటల్లోనే (గోల్డెన్ హవర్స్) ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు. -
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్‌లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్‌లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
ఇదో కొత్తరకం సైబర్ మోసం!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్‌కు ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్లో నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ తరహా మోసం ఇటీవల బిహార్‌లోని పూర్నియాలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ), బ్యాంక్ నుంచి కాల్ రాకుండా, ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా డబ్బులు దోచుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.No OTP,No phone call,No clue,But money was stolen from the bank account...(with the help of Registry papers)Case is of Purnia Bihar . #CyberFraud pic.twitter.com/jeVGqhMWmV— Pankaj Nain IPS (@ipspankajnain) July 11, 2024బిహార్‌లోని పూర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెబ్సైట్ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూరికార్డుల్లో ఆధార్‌కార్డు, బయోమెట్రిక్‌లను తారుమారు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించారు. ఈ విధంగా మొబైల్ ఫోన్‌కు కాల్, ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడ్డారు’ పోలీసులు తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్‌లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన!
దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అడిషనల్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్సైట్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్మెంట్లో దీన్ని ప్రస్తావించింది. డిజిటల్ పేమెంట్ లావాదేవీల ప్రామాణీకత కోసం మెరుగైన విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మనం ఏదైన ఆర్థిక లావాదేవీని డిజిటల్‌గా నిర్వహించినప్పుడు ఆథెంటికేషన్ కోసం ఫిన్‌టెక్ సంస్థ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తేనే లావాదేవీని పూర్తి చేయడానికి వీలవుతుంది. బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారించడానికి, చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ అడిషనల్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ( AFA ) ఒక కీలక దశ. ఆర్బీఐ నిర్దిష్ట ఏఎఫ్‌ఏని నిర్దేశించనప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్ఎంఎస్-ఆధారిత వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అనుసరిస్తోంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ప్రత్యామ్నాయ ప్రమాణీకరణ యంత్రాంగాలు వచ్చాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూత్ర ప్రాయ ప్రతిపాదనలు చేసింది. ఇక ఇదే ప్రకటనలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)కు సంబంధించిన ప్రతిపాదనలూ చేసింది. బ్యాంకులు అనుసరించాల్సిన AePS టచ్‌పాయింట్ నిర్వాహకుల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే మోసాలను నిరోధించే చర్యలను సైతం పరిగణననలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 37 కోట్ల మంది లావాదేవీలు నిర్వహించారు. -
ఆగని టీడీపీ సర్వే నాటకాలు
మార్టూరు: ప్రజలు ఎంత ప్రతిఘటించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ మోసాలను మాత్రం విడనాడటం లేదు. ‘మీకు మా పథకాలు వస్తాయి..’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ సర్వే పేరిట వారి వివరాలు సేకరించి తమ ఫోన్లలో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ఫోన్లకు వచ్చిన ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు వారిని నిలదీస్తే పారిపోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తన్నీరు రాజు, ముక్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. డేగరమూడి గ్రామంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ విప్పర్ల బాలకృష్ణ టీడీపీ కార్యకర్త. అతను రెండు రోజులుగా మరో వ్యక్తితో కలిసి తమ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, పెద్దవారిని కలిసి వారి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. కాలనీ వాసుల సెల్ఫోన్లకు వచ్చిన ఓటీపీలు తెలుసుకుని తమ సెల్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఇలా ఆది, సోమవారాలు రెండు రోజులలో 50కిì పైగా కుటుంబాల వివరాలు సేకరించారు. ఈ విషయం స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జంపని వీరయ్య చౌదరి దృష్టికి రాగా, ఆయన స్థానికులతో కలిసి ఆదర్శనగర్ కాలనీకి వెళ్లి సర్వే చేస్తున్న టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీంతో వారు బైక్‌తో పారిపోయారు. ఆ యువకులు ఏం వివరాలు అడుగుతున్నారని వీరయ్య చౌదరి స్థానికులను ఆరా తీయగా... ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో వివరాలు అడిగారని, తమ కుటుంబ వివరాలు సెల్ఫోన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా.. అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గ్రామానికి చెందిన తన్నీరు రాజు, అన్నం శ్రీను, మరికొందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డేటా చౌర్యం చేస్తున్న పచ్చమూకలు
నూజివీడు: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. బాబు ష్యూరిటీ–భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి.. అమాయకులైన ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి ఫోన్ల నుంచి సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకొని ఓటీపీలు ఎందుకు సేకరిస్తున్నారో తెలియడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గ్రామాల్లో పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో మాటలు కలిపి.. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. అనంతరం వారి ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మెసేజ్‌లు పంపించి.. ఓటీపీలు సేకరిస్తున్నారు. మెసేజ్‌లు చూడటం తెలియనివారి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలే ఫోన్లు తీసుకొని ఓటీపీలను తమ ట్యాబ్‌లలో నమోదు చేసుకుంటున్నారు. రేగుంట గ్రామంలో ఇదే విధంగా జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ మూకలను ఎవరైనా ప్రశ్నిస్తే.. టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ లింక్ పంపించి.. మీ కుటుంబం పలు పథకాలకు అర్హత పొందిందని.. 2024 జూన్ తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయంటూ మభ్యపెడుతున్నారు. నూజివీడుకు చెందిన వాసవికి ఆడబిడ్డ నిధి, ఇతర పథకాల కింద ఏడాదికి రూ.54 వేలు వస్తాయని, ఐదేళ్లకు రూ.2.70 లక్షలు లబ్ధి పొందుతారంటూ చెప్పి.. ఆమె సమాచారమంతా సేకరించారు. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకు? టీడీపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగారు. చెప్పగా.. నా ఫోన్‌కు ఏదో మెసేజ్ పంపించారు. నాకు చూడటం రాదని చెప్పగా.. వాళ్లే ఏదో నమోదు చేసుకొని వెళ్లారు. ఏదో ఓటీపీ నా ఫోన్ నుంచి తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకో అర్థం కావడం లేదు. – కె.విజయకుమార్, రేగుంట -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులకు ఓటీపీ కష్టాలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన రైతు మాదాం నర్సయ్య నెల రోజుల కింద శెట్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో 118 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాడు. అతనికి రూ.2,43,080 సొమ్ము రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సదరు రైతు నర్సయ్య మొబైల్‌కు ఓటీపీ మెస్సెజ్ రాకపోవడంతో ధాన్యం సొమ్ము ఇప్పట్లో జమ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాకాలం పంటలకు పెట్టుబడి ఎలా పెట్టాలనే సందిగ్ధంలో ఉన్న రైతు నర్సయ్యకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇది ఒక్క రైతు నర్సయ్యకు ఎదురైన సమస్యనే కాదు. ఎంతో మంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కలుగుతున్న కష్టాలు. ఓటీపీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. జిల్లాలో యాసంగి సీజనుకు సంబంధించిన ధాన్యం సేకరణ పూర్తి చేసినా రైతులను ఓటీపీ కష్టాలు వెంటాడుతుండటంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను సేకరించారు. దాదాపు 200 లారీల ధాన్యానికి సంబంధించి రైతులకు ఓటీపీ జనరేట్ కావడం లేదు. యాసంగి పంటలకు సంబంధించి క్రాప్‌బుకింగ్ సరిగా పూర్తి చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే ధాన్యం ఏ మిల్లుకు తరలించాలో అలాట్మెంట్ జరగకపోవడంతో ఓటీపీ రావడం లేదని తెలుస్తుంది. రోజుల తరబడి ధాన్యం డబ్బులు కోసం రైతులు నిరీక్షించడానికి ఓటీపీ ప్రధాన సమస్య అని వెల్లడైతుంది. యాసంగిలో సాగు చేసిన పంటలను ఏఈవోలు క్రాప్‌బుకింగ్ పూర్తి చేశారు. కొన్ని చోట్ల రైతు సాగు చేసిన విస్తీర్ణానికి నమోదైన ఎకరాలకు తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం లెక్క, రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి వీలు పడటం లేదు. కమ్మర్పల్లి సహకార సంఘం పరిధిలో క్రాప్ బుకింగ్‌లో అనేక తప్పులు దొర్లడంతో రైతులకు ఓటీపీ జనరేట్ చేయడం ఇబ్బందిగా మారింది. చివరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయాధికారులతో సంప్రదింపులు జరిపి క్రాప్ బుకింగ్‌ను సరి చేయాల్సి వస్తుంది. పంటలను సాగు చేసిన సమయంలోనే క్రాప్ బుకింగ్ పక్కాగా చేసి ఉంటే సమస్య వచ్చేది కాదని రైతులు అంటున్నారు. -
వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్న పింక్ లింక్
వైఎస్సార్: ఇటీవల వాట్సాప్‌లో వాట్పాప్ అప్డేట్ పేరుతో పింక్ లింక్ హల్చల్ చేస్తోంది. దీనిపై పోలీసులు మొబైల్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ మొబైల్ అప్లికేషన్ అయినా అప్డేట్ ప్లేస్టోర్‌లో మాత్రమే వస్తుంది. లింక్‌ల రూపంలో రాదు. లింక్ రూపంలో వచ్చిందంటే యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఆ లింక్ షేర్ అవుతుందన్నారు. పొరపాటున ఓపెన్ చేసిన వారు వెంటనే పింక్ కలర్ వాట్సాప్, ఆన్లైన్ స్ట్రీమ్‌ను అన్ ఇన్స్‌స్టాల్ చేస్తే లింక్ షేర్ అవ్వకుండా ఆపవచ్చన్నారు. -
ఇన్స్టాల్ చేసే యాప్‌తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్‌తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్‌కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్‌ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఓటీపీ..డబ్బంతా లూటీ
ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు. సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తతే రక్షా కవచం మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్) సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు : ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్) టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112 జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930 -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్‌తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
మొబైల్‌కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 'సిమ్ స్వాపింగ్' టెక్నిక్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు. -
400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!
సైబర్ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్‌ను తయారు చేశారు. ఆ యాప్స్‌ను సోషల్ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు. ఈ తరుణంలో మెటా ఆ యాప్స్‌ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్ చెప్పింది. మెటా యూజర్ల పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్ నేరస్తులు యూజర్లకు యాప్స్ నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్ వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్ వెబ్‌లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది. సేఫ్‌గా ఉండాలంటే ఈజీ మనీకోసం సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్స్ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్ సెట్టింగ్ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మార్క్ జుకర్ బర్గ్ : ‘వర్క్ కంప్లీట్ చేయకపోతే..నిన్ను ఈ కత్తితో నరికేస్తా!’ -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో 'ఓటీపీ' చిత్రం
నందితా శ్వేత, రామ్ జంటగా కల్యాణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓటీపీ’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రాన్ని యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి చిత్రనిర్మాత కుమార్తె బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీ రామచంద్ర క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ కుమార్. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శివరాత్రికి మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు గురు ప్రసాద్ రెడ్డి. ‘‘ఈ సినిమాలోని ఎమోషన్స్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి’’ అన్నారు రామ్ మిట్టకంటి. -
కొత్త దారిలో సైబర్ మోసగాళ్లు
-
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
సైబర్ దొంగ భలే స్మార్ట్ గురూ!
బనశంకరి: ఐటీ సీటీలో సైబర్ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయించి ఓటీపీ యాక్సెస్ లేకుండా సులభంగా మీ మొబైల్లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండే థర్డ్‌పార్టీ యాప్‌లైన ఎనీడెస్క్ టీమ్వ్యూవర్హాస్క్, క్విక్‌సపోర్ట్, రిమోట్డ్రైడ్, ఏర్మిరర్, రిమోట్ కంట్రోలర్ లేదా స్క్రీన్‌షేర్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్న తక్షణం ఆ సెల్‌ఫోన్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్‌బ్యాంకింగ్ సమాచారం, పాస్వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు. బ్లాక్మెయిల్.. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లను యాక్సెస్ చేసే సైబర్‌కేటుగాళ్లు మొబైల్స్‌లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్ వినియోగదారులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు: ఫోన్‌పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఫోన్‌పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు బ్యాంకింగ్ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు ప్లేస్టోర్‌లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లో పరిచయం లేని యాప్‌లను డిలిట్ చేయాలి ఎవరు ఫోన్‌చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్‌కోడ్ తెలపరాదు ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్ కాదా అని నిర్ధారించుకోవాలి. (చదవండి: -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్‌కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్‌క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్‌పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్‌ను ఓపెన్ చేయద్దు. ఫోన్‌కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్‌లు లేదా షార్ట్ లింక్‌లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్‌వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబుతున్నారా?
పిల్లల పుస్తకాలు సర్దుతుండగా ఫోన్ మోగితే తీసింది మంగ. అవతలి నుంచి ‘మేడమ్ మీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. బ్యాంకు నుంచి మీకో మెసేజ్ వస్తుంది. అందులోని కోడ్ చెప్పాల్సి ఉంటుంది చెప్పండి’ అనడంతో అలాగే అంది మంగ. వచ్చిన మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందే కాబట్టి ఫర్వాలేదులే అన్న భరోసాతో ఆ కోడ్ నంబర్ చెప్పేసింది. అవతలి నుంచి ‘సరే, మేడమ్.. థాంక్యూ’ అంటూ ఫోన్ కట్ చేశారు. మంగ ఫోన్ పక్కన పెట్టేసే టైమ్‌లో వచ్చిన మెసేజ్ అలర్ట్ చూసి ఏంటా అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి, చూసింది. బ్యాంకునుంచి మెసేజ్.. తన ఖాతానుంచి ఎవరో అకౌంట్‌కు రూ.2 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉండటంతో షాక్ అయ్యింది. ∙∙ సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు. కొంతైనా బెనిఫిట్ ఉంటుంది కదా అని కాలర్ అడిగిన సమాధానం చెబుతూ వచ్చాడు. పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ధృవీకరణ ప్రశ్నలు అడగడంతో చెప్పాడు. ‘మీ నంబర్‌కు వచ్చిన మెసేజ్ లింక్ ఓపెన్ చేసి, వివరాలు ఇస్తే, ఐదు నిమిషాల్లో మీకు రిడీమ్ పాయింట్స్ మనీబ్యాక్ వస్తుంది సర్’ అనడంతో అదే పని చేశాడు సుందర్. ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి, తినడం పూర్తయ్యాక ఆఫీసుకు బయల్దేరుతూ ఫోన్ చూసుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ ఉండటంతో సుందర్ కి ఏమీ అర్థం కాలేదు. ∙∙ ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలలో OTP/UPI మోసం ఒకటి. మధ్యవయస్కులు, వృద్ధులే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు బాధితుల నుంచి ఓటీపిని అడుగుతారు. లేదా స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా బాధితుడి ఫోన్‌పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను సాధిస్తారు. ఫోన్‌పై పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత, మోసగాడు పాస్‌వర్డ్‌లను పట్టుకుని బాధితుడి ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు. ఇటీవలి కాలంలో నగదు చెల్లింపులను సులభతరం చేసే డిజిటల్ లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేగవంతమైన ప్రక్రియగా మారింది. దీంతో UPI ప్లాట్‌ఫారమ్‌లోనూ వివిధ రకాల మోసాలు చోటుచేసుకుంటున్నాయి. మోసగాళ్ల లక్ష్యాలు బాధితుల దృష్టిని ఆకర్షించడానికి, మోసగాళ్ళు బ్యాంక్ సిబ్బందిలా నటించి, అప్డేట్లు, బోనస్ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌ల వంటి సాధారణ సమస్యల కోసం కాల్ చేస్తారు. కాల్ సహజమైనదే అనిపించడానికి వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్‌ను ధృవీకరించమని అడగడం ద్వారా బ్యాంకర్లు సాధారణంగా చేసే ప్రక్రియను అనుకరిస్తారు. ►మోసగాళ్లు ఒక కథను రూపొందిస్తారు. తద్వారా బాధితుడు సమస్యను పరిష్కరించడానికి వారికి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తారు. ►మోసగాడు బాధితుడిని వారి ఫోన్‌కు స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని అడుగుతాడు. దాంట్లో భాగంగా TeamViewer, AnyDesk వంటివిPlaystore / App store అందుబాటులో ఉన్నాయి. OTP మోసానికి మరొక పద్ధతి ►సంక్షిప్త లింక్‌లు, గూగుల్ ఫారమ్‌లతో ఎసెమ్మెస్ ద్వారా లాగిన్, పాస్వర్డ్, OTP/UPI డేటాను పూరించమని అడుగుతారు. ►ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ మొదలైన అప్లికేషన్లలో మోసగాడు (కొనుగోలుదారులా నటించి) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు చెల్లింపు అభ్యర్థనను పంపుతాడు. ►మోసగాళ్లు (కొనుగోలుదారులా నటించడం) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు త్వరగా స్పందించడానికి క్యూఆర్ కోడ్ చెల్లింపు అభ్యర్థనను పంపుతారు మోసపోకుండా జాగ్రత్తలు ►∙సురక్షిత చెల్లింపు కోసం (https://- URL) ప్యాడ్‌లాక్ సింబల్ చూడండి ►OTP / MPIN నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ భాగస్వామ్యం చేయవద్దు. ►మీరు ఫోన్‌కాల్‌లో ఉన్నప్పుడు హడావుడిగా చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకండి. ►కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. ►∙కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. ►ఫోన్ కాల్లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, ►ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫోన్లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లను అంటే టఛిట్ఛ్ఛn జ్చిట్ఛ, అnyఈ్ఛటజు, ఖ్ఛీ్చఝ Vజ్ఛీఠ్ఛీట మొదలైన వాటిని ఉపయోగించవద్దు. ►గూగుల్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం శోధించవద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ నుంచి కస్టమర్‌కేర్ నంబర్‌ను తీసుకోవడం సురక్షితం. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ బొంకు..బూస్టర్ డోస్ పేరుతో నేరగాళ్ల నయా పన్నాగం
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమతుంటే.. దీనిని సాకుగా తీసుకుని సైబర్ నేరస్తులు సరికొత్త మోసాలకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నకిలీ లింక్‌లు పంపిస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి నేరస్తుల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తాజాగా బూస్టర్ డోస్, ఉచిత ఒమిక్రాన్ పరీక్షల పేరిట మోసాలకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫలానా రోజున, ఫలానా ప్రాంతంలో బూస్టర్ డోస్ కోసం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగర ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఓటీపీతో హ్యాంకింగ్.. బూస్టర్ డోస్ ప్రచారాన్ని ప్రజలను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మెడికల్, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నంబర్లను డిస్ప్లే అయ్యేలా స్పూఫింగ్ చేయడంతో మోసగాళ్లు ఫోన్ చేసినా సరే బాధితుల ఫోన్లో ‘వ్యాక్సిన్ డిపార్ట్మెంట్’ అని సెల్ఫోన్లో కనిపిస్తుంటుంది. దీంతో అటువైపు నుంచి బాధితులు కూడా సులువుగా నమ్మేస్తారు. టీకా కోసం షెడ్యూల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మెసేజ్, వాట్సాప్, ఈ– మెయిల్స్‌కు నకిలీ లింక్‌లు పంపిస్తున్నారని తెలిసింది. తమ పేర్ల నమోదు నిర్ధారణ కోసం సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) తెలపాలని కోరుతున్నారు. ఓటీపీ తెలపగానే.. బాధితుల సె ల్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు హానికరమైన సాఫ్ట్వేర్లను పంపిస్తారు. దీంతో బాధితుడి ఎలక్ట్రానిక్ ఉపకరణం హ్యాక్ అయిపోతుంది. ఆపైన సెల్ఫో న్లోని క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఆధార్, పాన్ కార్డ్ నంబర్లు, ఈ– మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. వాటి సహాయంతో మోసాలకు పాల్పడే ప్రమాదముంది. 56 కేసులు నమోదు.. కరోనా ప్రారంభ దశలో సైబర్ నేరస్తులు కోవిడ్ మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల, కాన్సట్రేటర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే సాధనాలు వంటివి సరఫరా చేస్తామనే మాయమాటలతో ప్రజలను నమ్మించి దోచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కరోనా మందుల బ్లాక్ మార్కెట్‌పై 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తామని వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్‌లు కూడా ఓటీపీ అడగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటీపీ అడిగితే మోసమే బూస్టర్ డోస్ తీసుకుంటే సురక్షితమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో డోస్ ఇప్పిస్తామని నకిలీ మెసేజ్, ఫోన్లు, లింక్‌లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎవరైనా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు, యూపీఐ, ఓటీపీ అడిగారంటే మోసమేనని గుర్తించాలి. – డాక్టర్ లావణ్య, డీసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ -
ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డుల నుంచి నగదు లూటీ
విజయవాడకు చెందిన మల్లెల శేషగిరిరావు బెంగళూరులో ఉండే తన స్నేహితుడికి పుట్టిన రోజు బహుమతి ఇచ్చేందుకు ఓ వస్తువు కోసం ఆన్లైన్లో వెతికాడు. తన స్నేహితుడి కోరిక మేరకు ఓ వస్తువును కొనుగోలు చేసేందుకు ఓ విక్రయ కంపెనీని మెయిల్ ద్వారా సంప్రదించాడు. తన స్నేహితుడు ఉండే చిరునామాకు సదరు వస్తువును డెలివరీ ఇస్తామని కంపెనీ నుంచి హామీ వచ్చిన తర్వాత శేషగిరిరావు నగదు లావాదేవీలు ప్రారంభించాడు. అయితే రూ. 620 ఖరీదు చేసే వస్తువుకు కంపెనీ రూ. 49,999 బిల్ చేసి శేషగిరిరావును ఓటీపీ అడిగింది. దీంతో అనుమానం వచ్చిన శేషగిరిరావు నగదు లావాదేవీలను వెంటనే ఆపేసి.. వస్తు కొనుగోలును ఉపసంహరించుకున్నాడు. ఈ వ్యవహారం జరిగింది ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన. సీన్ కట్ చేస్తే.. అయితే అదే రోజు శేషగిరిరావు ఉపయోగించే క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 49,999 డెబిట్ అయినప్పటికీ మెసేజ్ మాత్రం రాలేదు. కాగా వారం క్రితం క్రెడిట్ కార్డు సంస్థ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ముంబై కేంద్రంగా నడిచే ప్రముఖ ఆన్లైన్ సంస్థ ద్వారా హరియాణా నుంచి రాజస్థాన్‌కు ఓ పార్సిల్ డెలివరీ అయ్యిందని దానికి గానూ రూ.49,999 అయినట్లు ఆ మెసేజ్ ఉంది. తనకు సంబంధం లేని వస్తు డెలివరీకి తన ఖాతా నుంచి నగదు పోవడంతో కంగారు పడిన శేషగిరిరావు వెంటనే బ్యాంక్ సిబ్బందిని, క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులను, కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజయవాడ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి బాధితులు ఎంతో మంది.. దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకుకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ఓ బ్రాంచ్ ఉంది. దీనిలో ఖాతాలు కలిగి.. క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్న 35 మంది ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిర్వాహకులే సైబర్ నేరగాళ్లకు తమ కార్డ్ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నగదు కాజేస్తున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు. పట్టించుకోని సైబర్ క్రైం అధికారులు.. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతున్నా.. కనీసం ఫిర్యాదు సైతం తీసుకోకపోవడంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారు. రూ. 2 లక్షల లోపు మోసం జరిగిన ఫిర్యాదులను తీసుకోమని సైబర్ సెల్ అధికారులు తెగేసి చెప్పడంతో లబోదిబోమంటున్నారు. బాధితులు తమ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదనివాపోతున్నారు. బాధితులు వేలల్లో.. కేసులు పదుల్లో.. బాధితులు వేలల్లో ఉంటే గడిచిన ఏడాది కాలంలో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇక పరిష్కరించిన సమస్యలు ఏడాది కాలంలో రెండు అంకెలు దాటక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే సదస్సులు కూడా అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. క్లిక్ చేస్తే ఖల్లాస్.. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజూ ఎంతో మంది సైబర్ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ యాప్స్ నుంచి ఖాతాదారులకు ‘బ్యాంక్ ఖాతా నిలిచిపోయింది’, ‘గూగుల్ పే, ‘ఫోన్ పే’ ఇకపై వాడలేరంటూ ఫోన్లకు మెసేజ్‌లు పంపి ఖాతాదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు మెసేజ్ వెబ్ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ నుంచి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతాలోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. అయితే మధ్యలో ఉన్న బ్యాంక్ అధికారులకు ఇబ్బందులు రాకుండా ఏదో ఆన్లైన్ డెలివరీ అని సృష్టించి నగదును దోచుకుంటున్నారు. ఖాతాదారులు బ్యాంకులపై న్యాయ పోరాటానికి దిగేందుకు వీలు లేకుండా సైబర్ నేరగాళ్లు బ్యాంక్‌లకు ఈ విధంగా సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అధికారులకు సంబంధాలున్నాయనే అనుమానం బాధితుల్లో తలెత్తుతోంది. సైబర్ నేరగాళ్లు తెలివి మీరారు.. పోలీసుల కంటే నేరగాళ్లే ఎక్కువ తెలివిగా, చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రూ. 2 లక్షల పైబడి మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. వాటిలో కొన్ని పరిష్కరించాం. రూ. 2 లక్షల లోపు మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ మా దగ్గరకు వచ్చిన వారి వివరాలు సేకరించి.. మరోసారి మోస పోకుండా పలు సూచనలు చేసి పంపుతున్నాం. తక్కువ మొత్తంతో మోసపోయిన వ్యక్తులు వారి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలి. – కె.శ్రీనివాస్, సీఐ, సైబర్ క్రైం, విజయవాడ