Parliament Budget sessions
-
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... రేపు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు అప్డేట్స్
Updates.. ► తమిళనాడు ఎంపీ సురేష్ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఖర్గే సీరియస్ కామెంట్స్. రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరైనా మాట్లాడితే సహించబోము. అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే. భారత్ అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక్కటే. #WATCH | Congress president and LoP Rajya Sabha Mallikarjun Kharge speaks on Congress MP DK Suresh's "...forced to demand a separate country" statement. "...If anyone speaks about breaking the country, we will never tolerate it - irrespective of whichever party they belong to.… pic.twitter.com/LuR3cNjXaT — ANI (@ANI) February 2, 2024 ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ►లోక్‌సభ నుంచి ఇండియా కూటమి సభ్యుల వాకౌట్ ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం ►భారత కూటమి నేతలు పార్లమెంటులో జార్ఖండ్ సమస్యను లేవనెత్తాలని నిర్ణయం. ► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగనుంది. ► నేడు రాజ్యసభలో పలు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు ► మత్స్యకారుల సంక్షేమ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ► మత్స్య పరిశ్రమ రంగం అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహకం, మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లు ► సాక్షుల రక్షణ కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న ఎంపీ నిరంజన్ రెడ్డి ► క్రిమినల్ కేసుల్లో సాక్షుల రక్షణ కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు కోసం బిల్లు ► నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం ► ఉదయం 10 గంటలకు ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్లో సమావేశం ► పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాష్ట్రపతి ప్రసంగం ఇదే..
Live Updates.. ►రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన ద్రౌపది ముర్ము.. #WATCH | President Droupadi Murmu departs from the Parliament for Rashtrapati Bhavan after concluding her address to the joint session of both Houses on the first day of Budget Session. pic.twitter.com/VKweTcdlBB — ANI (@ANI) January 31, 2024 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. ►కొత్త పార్లమెంటులో నా తొలి సంతకం ►భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది ►శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ►భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్నాం ►ఆదివాసీ యోధులను సర్మించుకోవడం గర్వకారణం ►చంద్రుడి దక్షిణధ్రువం పై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు ►ఆదిత్య ఎల్-1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించింది ►భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించింది. #WATCH | President Murmu speaks on the potential of India's growing tourism sector "Tourism is a sector that provides employment opportunities to the youth. A record number of tourists are reaching the northeast region. There is excitement among people about the Andaman Islands… pic.twitter.com/6ugt4VzHwU — ANI (@ANI) January 31, 2024 ►జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది ►ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 107 పతకాలు సాధించింది ►ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించింది ►భారత్ లో తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించుకున్నాం. ►నారీశక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయింపు ►పేదరికి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది ►తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం ►అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం ►ఎన్నో ఏళ్ల భారతీయుల కల.. రామమందిర నిర్మాణం సాకారమైంది. #WATCH | Budget session | President Droupadi Murmu says, "My Government is working towards making India, a major space power of the world. This is a mode to make human life better. This is also an effort to increase India's share in the space economy. Important decisions have… pic.twitter.com/ejZ9VHzCgG — ANI (@ANI) January 31, 2024 ►దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది ►దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చాం ►ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో ముందుకెళ్తున్నాం ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ►రెండు లక్షల అమృత్ వాటికలను నిర్మించాం ►లక్ష కోట్లకు డిఫెన్స్ ఉత్పత్తులు చేరాయి ►డిజిటల్ ఇండియా నిర్మాణం గొప్ప విషయం ►డిజిటల్ ఇండియాలో 46 శాతం అభివృద్ధి సాధించాం ►డిజిటల్ ఇండియాతో బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరమయ్యాయి ►రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ►ఆయుష్మాన్ భారత్ లో 57 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు ►జాతీయ రహదారుల్లో లక్షా 40 వేల కిలో మీటర్లు నిర్మించాం ►39 వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాం ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ►10 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం ►తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేస్తున్నాం ►కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. ►ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం భారత్ ►దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించుకుంటున్నాం ►ప్రపంచంలో అత్యంత వేగంగా భారత ఎకానమీ అభివృద్ధి ►రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి ►రైల్వే శాఖలో పలు సంస్కరణలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు ►విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లతో వేగంగా ప్రయాణికుల రాకపోకలు ►దేశంలో ప్రస్తుతం పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►దేశంలో 10 లక్షల కి.మీల గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాం ►ముంబైలో అటల్ సేతు నిర్మించుకున్నాం. ►రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం ►సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం. ►2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు ►4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం ►కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం ►కరోనా, యుద్దాల ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం #WATCH | Budget Session | President Droupadi Murmu says, "In the past years, the world witnessed two major wars and faced a pandemic like Corona. Despite such global crises, my government kept inflation under control in the country and did not let the burden on common Indians… pic.twitter.com/N2aL6sRma8 — ANI (@ANI) January 31, 2024 ►యువతకు లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం ►25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం ►ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది ►లక్షకు పైగా స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేశాం ►డీబీటీ కింద రూ.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం ►గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ తో 46 శాతం మనదే ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి #WATCH | President Droupadi Murmu says, "My Government believes that the grand edifice of a developed India will stand on four strong pillars – youth power, women power, farmers and the poor." pic.twitter.com/u8C4opfICx — ANI (@ANI) January 31, 2024 ►ఆవాస్ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం ►పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం ►ఆదివాసీ గ్రామాలకు శుద్దజలాలు అందిస్తున్నాం ►ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం ►దేశ అభివృద్ధి నాలుగు స్తంభాల పై ఆధారపడి ఉంది ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది. #WATCH | Budget Session | President Droupadi Murmu addresses a joint session of both Houses at the new Parliament building. She says, "...In the last 10 years, India saw the completion of several works towards national interest that had been awaited by the people of the country… pic.twitter.com/ERbVcaSI7P — ANI (@ANI) January 31, 2024 ►రష్యా-ఉక్రెయిన్, పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్దాల వేళ ద్రవ్యోల్భణాన్ని అదుపుచేశాం ►ఎన్నో సమస్యలున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాం ►గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం ►సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నాం ►సికిల్ సెల్, ఎనీమియతో బాధపడుతున్న గిరిజనుల కోసం జాతీయ మిషన్ ►జాతీయ మిషన్ కింద ఇప్పటివరకు 1.40 కోట్ల మందికి పరీక్షలు చేయించాం ►ఇంజినీరింగ్, మెడిసన్ కూడా మాతృభాషల్లో చదివే అవకాశం కల్పించాం ►వైద్య కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాం. #WATCH | 'Make in India' and 'Aatmanirbhar Bharat' have become our strengths, says President Droupadi Murmu. The President also lauds defence production crossing the Rs 1 lakh crore mark. pic.twitter.com/KDkEKZZ3kA — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. ►పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | Budget Session | President Droupadi Murmu arrives at the Parliament for her address to the joint session of both Houses. Sengol carried and installed in her presence. pic.twitter.com/vhWm2oHj6J — ANI (@ANI) January 31, 2024 ►కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ►ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ నుంచి పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | President Droupadi Murmu departs from Rashtrapati Bhavan for the Parliament building. The Budget Session will begin with her address to the joint sitting of both Houses. This will be her first address in the new Parliament building. pic.twitter.com/I5KmoSRcKV — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పార్లమెంట్ వద్దకు చేరుకున్న సోనియా. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament on the first day of the Budget session. pic.twitter.com/pFyrQ11Utp — ANI (@ANI) January 31, 2024 ►నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్లో తొలిసారిగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది. బడ్జెన్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తికి నిదర్శనం. ప్రతీసారి సభను అడ్డుకుంటున్న సభ్యులు.. ఈసారైనా సహకరించాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. గత పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. #WATCH | Budget Session | PM Narendra Modi says, "...At the end of the first session that was convened in this new Parliament building, the Parliament took a graceful decision - Nari Shakti Vandan Adhiniyam. After that, on 26th Jan we saw how the country experienced the… pic.twitter.com/Oa84GNftCX — ANI (@ANI) January 31, 2024 ►ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ►తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. -
రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు. సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. -
parliament session 2024: 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయని సమాచారం. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి ఒకటిన ఆరి్ధక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆరి్ధక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. -
Budget Session: జనవరి 31 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. Parliament Budget Session will be held from 31st January to 9th February. — News Arena India (@NewsArenaIndia) January 11, 2024 -
పార్లమెంట్లో అదే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై ఏమాత్రం పట్టువీడడం లేదు. బుధవారం సైతం ఎంపీల నినాదాలు, నిరసనల కారణంగా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులతో హాజరయ్యారు. అదానీ ఉదంతంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేశారు. దాంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉభయ సభల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ప్రమాదంలో ప్రజాస్వామ్యం బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు జేపీసీ కోసం నినాదాలు ప్రారంభించారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 దాకా వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమయ్యాక సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు–2023ను ప్రవేశపెట్టారు. తర్వాత కాంపిటీషన్(సవరణ) బిల్లు–2022 ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి ప్రకటించారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కాగా, పలువురు సభ్యుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం సభ నిర్వహించవద్దని నిర్ణయించారు. అదానీ–మోదీ భాయి భాయి రాజ్యసభలోనూ ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ‘మోదీ–అదానీ భాయి భాయి’ అంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణపై విచారణకు జేపీసీకి డిమాండ్ చేశారు. దాంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అటవీ(సంరక్షణ) సవరణ బిల్లు–2023పై జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు అశోక్ బాజ్‌పాయ్, అనిల్ బలూనీ, సమీర్ ఓరావాన్, సీఎం రమేశ్, ఏఐటీసీ ఎంపీ జవహర్ సిర్కార్, బీజేడీ ఎంపీ ప్రశాంత్ నందా, ఎడీఎఫ్ ఎంపీ హిషే లాచూంగ్పా, ఏజీపీ ఎంపీ బిరేంద్ర ప్రసాద్ భైష్యాను సభ్యులుగా నియమించారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. -
20 సెకన్లకే.. లోక్‌సభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇవాళ(మంగళవారం) మొదలైన కాసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 20 సెకండ్లకే లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడడం విశేషం. అదానీ వ్యవహారంపై జాయింట్‌పార్లమెంటీ కమిటీని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డిపై పేపర్లు చించివేశారు విపక్షాల సభ్యులు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారాయన. మరోవైపు పెద్దల సభ(రాజ్యసభ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. #BudgetSession: #LokSabha adjourned till 2:00 PM pic.twitter.com/qZksUIX54s — SansadTV (@sansad_tv) March 28, 2023 -
వెనక్కితగ్గని విపక్షాలు.. ఉభయసభలు మంగళవారానికి వాయిదా..
► విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కూడా మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది. సాయంత్రం 4:00 గంటలకు సభ తిరిగిప్రారంభమైనా విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనా.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో ఛైర్మన్ సభను మంగళవారం ఉదయం 11:00 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభ సాయంత్ర 4:00 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. ఢిల్లీ: మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభం కాగా మళ్లీ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ►విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా చేసిన తీరుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో ఇవాళ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగించనుంది. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టనున్నారు. ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పటికే ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు నిరసనల్లో కొందరు నల్ల దుస్తులతో కనిపించారు కూడా. ఇదిలా ఉంటే.. ఖర్గే ఆదేశిస్తే తాము రాజీనామాలకు సైతం సిద్ధమని భువనగిరి(తెలంగాణ) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. ఇవాళ్టి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఉభయ సభల కాంగ్రెస్ సభ్యులు విడిగా సమావేశం కానున్నారని సమాచారం. ఇదీ చదవండి: మోదీ.. అధికారం వెనుక దాక్కుంటున్నాడు! -
దద్దరిల్లిన పార్లమెంట్.. అదే ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ నుంచి విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని కించపర్చారని, క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం స్తంభించాయి. లోక్‌సభ మంగళవారం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో స్పీకర్ బిర్లా జోక్యం చేసుకున్నారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విన్నవించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర ప్రకటించారు. రాహుల్ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయొద్దని సభ్యులకు రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ హితవు పలికారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా లోక్‌సభ స్పీకర్ మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. సమస్యను పరిష్కరించే విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అఖిలపక్ష సమావేశం విఫలమైంది. లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి పలువురు కేంద్ర మంత్రులు లోక్‌సభలో తనపై పూర్తి నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాటిపై సభలో సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. కారిడార్లలో విపక్షాల నిరసన అదానీ గ్రూప్ నిర్వాకంపై విచారణకు జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు మంగళవారం పార్లమెంట్ హౌస్ కారిడార్లలో నిరసన చేపట్టారు. జేపీసీ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. అదానీ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు. రూ.లక్ష కోట్ల కుంభకోణంలో భాగస్వామి అయిన అదానీని రక్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అంతకంటే ముందు విపక్ష నేతలు సమావేశమయ్యారు. జేపీసీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం, ఆప్ తదితర పార్టీల నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. రూ.1.48 లక్షల కోట్ల అనుబంధ పద్దుకు ఆమోదం న్యూఢిల్లీ: ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.48 లక్షల కోట్ల అదనపు నిధుల ఖర్చుకు సంబంధించిన అనుబంధ పద్దుకు మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అదానీ షేర్ల వివాదంపై విపక్ష పార్టీల నిరసనల నినాదాల మధ్యే ఈ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మొత్తం రూ.2.7 లక్షల కోట్ల అదనపు పద్దును 13వ తేదీనే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. అదనపు పద్దుకు సంబంధించి రూ.36,325 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చుచేయనుంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సంబంధిత మాజీ సైనికులకు కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.33,718 కోట్ల బకాయిలను ప్రభుత్వం మొత్తం పద్దులో కలిపింది. -
పార్టీల ఎజెండాలదే పైచేయి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అధికార, ప్రతిపక్షాలు మెట్టు దిగకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమైనప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం అరుపులు కేకలతో ఉభయసభలు దద్దరిల్లాయి. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై కించపర్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు, అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ చేశారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో అర్థవంతమైన చర్చలకు తావు లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాల అజెండాలదే పైచేయిగా మారింది. దాంతో మరో దారిలేక ఉభయ సభలను సభాపతులు సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఐదురోజులుగా లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలేవీ సాగలేదు. స్పీకర్ విజ్ఞప్తి బేఖాతర్ లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. అధికార బీజేపీ సభ్యులు తమ సీట్ల వద్దే లేచి నిల్చున్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో దాదాపు 20 నిమిషాలపాటు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు సహకరించాలంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే కోరినప్పటికీ ఎవరూ శాంతించలేదు. అలజడి సృష్టించడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపించలేదు, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలి అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభ్యులెవరూ వినిపించుకోకపోవడంతో సభను ఈ నెల 20వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పునరావృతం ఎగువ సభలోనూ గందరగోళం కొనసాగింది. కార్యకలాపాలేవీ సాగకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు కోరగా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇరుపక్షాల ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. రూల్ 267 కింద 11 వాయిదా తీర్మానాల నోటీసులు వచ్చాయని, వాటిని అనుమతించడం లేదని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సభలో తాను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా, చైర్మన్ నిరాకరించారు. అధికార, విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సభలో ఒక ప్రకటన చేశారు. ఈ నెల 20 నుంచి రాజ్యసభలో వివిధ కీలక శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. అదొక కొత్త టెక్నిక్: థరూర్ సంసద్ టీవీలో సౌండ్‌ను మ్యూట్ చేయడం ఒక కొత్త టెక్నిక్ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎద్దేవా చేశారు. సభలో ఇకపై ఒక్కో సభ్యుడి మైక్రోఫోన్‌ను ఆపేయాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష ప్రసారంలో శబ్దాలను మ్యూట్ చేస్తే సరిపోతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్‌సభలో తమ పార్టీ సభ్యుల గొంతు నొక్కేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. సభలో వారు చేసిన నినాదాలు ప్రత్యక్ష ప్రసారంలో వినిపించకుండా చేశారని విమర్శించారు. అయితే, సాంకేతిక సమస్యల వల్లే సభ్యుల నినాదాలు వినిపించలేదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. మోదీ, అదానీ బంధమేంటి?: ప్రియాంక ప్రధాని మోదీకి, అదానీకి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా నిలదీశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. మోదీ, అదానీ బంధంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ మౌనం పాటిస్తోందని తప్పుపట్టారు. గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా అదానీ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ఉమ్మడిగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ అంశంపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తర్వాత జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), జేఎంఎం, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ధర్నా కంటే ముందు ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. ప్రభుత్వంపై ఉమ్మడిగా నిరసన తెలపాలని నిర్ణయించారు. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఖర్గే ట్విట్టర్లో కోరారు. -
పేదరికరహిత భారత్
న్యూఢిల్లీ: ‘‘కేంద్రంలో నిర్భీతితో కూడిన సుస్థిరమైన, నిర్ణాయక ప్రభుత్వముంది. మన ఘన వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశాభివృద్ధికి, అన్ని వర్గాల వారి అభ్యున్నతికి నిష్పాక్షికంగా పాటుపడుతోంది. విప్లవాత్మక నిర్ణయాలతో ప్రతి విషయంలోనూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె తొలిసారి ప్రసంగించారు. 2047కల్లా పేదరికరహిత దేశంగా భారత్ స్వావలంబన సాధించేలా చూడటమే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అతి పెద్ద శత్రువైన అవినీతిపై నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ఫలితంగా అవినీతిపరులపై ఎలాంటి సానుభూతీ చూపొద్దన్న సామాజిక స్పృహ పెరుగుతోందన్నారు. ఆత్మనిర్భర భారతాన్ని సాకారం చేసేందుకు వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో ప్రజలంతా తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాలను రంగాలవారీగా గణాంకాల సాయంతో వివరిస్తూ రాష్ట్రపతి గంట పైగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు... ►మోదీ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, సానుకూల మార్పులు సాధించింది. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో ఇనుమడింపజేయడం వాటిలో ముఖ్యమైనది. ►సమున్నత ఆకాంక్షలతో గొప్ప లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. నిజాయతీకి పెద్దపీట వేస్తోంది. భారీ కుంభకోణాలు, ప్రభుత్వ పథకాల అమలులో అంతులేని అవినీతికి మంగళం పాడాలన్న జనాకాంక్షలను నిజం చేసి చూపిస్తోంది. ►పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి వారిని సాధికారపరిచేందుకు కృషి చేస్తోంది. ►ఇన్నొవేషన్, టెక్నాలజీలను ప్రజా సంక్షేమానికి సమర్థంగా వినియోగిస్తూ కనీవినీ ఎరగని వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా పేదలకు రోజుకు 11 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 55 వేల గ్యాస్ కనెక్షన్లు అందుతున్నాయి. ఒక్క ముద్రా పథకం ద్వారానే రోజూ రూ.700 కోట్లకు పైగా రుణాలందుతున్నాయి. 300 పై చిలుకు పథకాల ద్వారా లబ్ధిదారులకు ఖాతాల ద్వారా నేరుగా నగదు అందుతోంది. ►ప్రజలకు దశాబ్దాల పాటు కలగానే మిగిలిన మౌలిక సదుపాయాలెన్నో పరిపూర్ణంగా అందుతున్నాయి. ►అటు సాంకేతికంగా, ఇటు సాంస్కృతికంగా దేశంలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుంటోంది. మన డిజిటల్ ప్రగతి అభివృద్ధి చెందిన దేశాలకూ ఆదర్శంగా మారింది. ►అవసరాలకు అనుగుణంగా సత్వరం విధానాలను, వ్యూహాలను సమూలంగా మార్చుకునే ప్రభుత్వ సంకల్ప శక్తికి సర్జికల్ దాడులు మొదలుకుని ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్‌ల రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, నియంత్రణ, వాస్తవాధీన రేఖల వద్ద శత్రువుల ప్రతి దుస్సాహసానికీ దీటుగా బదులివ్వడం వంటివన్నీ తార్కాణాలుగా నిలిచాయి. సైన్యాన్ని ఆధునీకరించేందుకు పెద్దపీట వేశాం. ►ఫలితంగా విధాన వైకల్యంతో కుంగిపోయే రోజులు పోయి శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా రాణిస్తూ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ►అంతర్జాతీయ వేదికపైనా తనదైన కీలక పాత్ర పోషించేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల వైపు చూసే స్థితి నుంచి ప్రతిష్టాత్మక జి–20 కూటమి సారథిగా ప్రపంచ సమస్యల పరిష్కారానికి నడుం బిగించే స్థాయికి ఎదిగింది. ►రక్షణ, వైమానిక రంగాల్లోనూ గొప్ప ప్రగతి సాధించాం. అగ్నివీర్ పథకం యువతకు దేశ సేవ చేసేందుకు గొప్ప అవకాశంగా మారింది. ►మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది. ఫలితంగా సైన్యంతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. తొలిసారిగా మహిళల జనాభా పురుషులను మించిపోయింది. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లోనూ 3 లక్షలకు పైగా మహిళలే! ►బంజారాలు, ఇతర సంచార జాతుల సంక్షేమానికి తొలిసారిగా బోర్డు ఏర్పాటైంది. ►అటు అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇటు అత్యాధునిక పార్లమెంటు భవన నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక, యాత్రా స్థలాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. ►మన యోగ, ఆయుర్వేదం ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. ►శిలాజేతర వనరుల ద్వారా 40 శాతం విద్యుదుత్పాదన లక్ష్యాన్ని తొమ్మిదేళ్లు ముందే చేరుకున్నాం. ►ఉగ్రవాదంపై మనం తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచమంతా స్వాగతిస్తోంది. ►ఆయుష్మాన్ భారత్ ద్వారా జనాభాలో ఏకంగా 50 కోట్ల మందికి ఉచిత చికిత్స అందింది. ప్రజలకు రూ.80 వేల కోట్లు మిగిలాయి. కొత్తదనం కొరవడింది రాష్ట్రపతి ప్రసంగంపై ఖర్గే బీజేపీ సర్కార్ ఎప్పుడూ చెప్పే విషయాలనే మళ్లీ రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా పునరుద్ఘాటించారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ‘దేశం అద్భుతంగా పురోగమించిందని రాష్ట్రపతి ప్రసంగం ద్వారా కేంద్రం చెప్పించింది. అదే నిజమైతే అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పేదలు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? పథకాల ఫలాలు ఎందుకు అణగారిన వర్గాల దాకా చేరడం లేదు? కొత్త కాలేజీలు, స్కూళ్లన్నీ ప్రైవేటురంగంలో వచ్చినవే. వాటి భారీ ఫీజుల వల్ల పేదలకు ఎలాంటి లబ్ధిచేకూరలేదు’ అని ఆరోపించారు. అవినీతి అంతమైతే ఒకే వ్యక్తి రూ.1 లక్ష కోట్ల విలువైన షేర్ల పెట్టుబడుల ద్వారా ఎల్ఐసీ/ఎస్బీఐలను ఎలా మభ్యపెట్టగలిగాడు? మోదీకి ఆప్తుడైన ఆ ఒక్కడి చేతిలోకే తమ పెట్టుబడులు తరలిపోయాయని 30 కోట్ల మంది గగ్గోలు పెడుతున్నారు’’ అంటూ ఖర్గే విమర్శించారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. ఇదీ చదవండి: ఒడిశాలో మిస్టరీ మరణాల కలకలం.. మరో రష్యా పౌరుడు మృతి -
పార్లమెంట్ వేదికగా మహిళా ఎంపీపై దాడి.. వీడియో వైరల్
డాకర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధికార కూటమి బెన్నో బాక్ యకార్(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS — Daniel Marven (@danielmarven) December 2, 2022 ఇదీ చదవండి: మస్క్లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు -
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
బడ్జెట్ సమావేశాలపై వెంకయ్య, ఓం బిర్లా సమాలోచనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా ఎలా చేపట్టాలనే అంశంపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమాలోచనలు జరిపారు. సుమారు 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరిపి రానున్న బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంకయ్య, ఓం బిర్లా ఉభయసభల సెక్రటరీ జనరళ్లను ఆదేశించారు. ఈ మేరకు పార్లమెంట్ భవన సముదాయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తృతంగా డిస్ ఇన్ఫెక్షన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు కాకున్నా, సాధారణంగా జనవరి చివరి వారంలో ఈ సెషన్ ప్రారంభమవుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తూ 2020 వర్షాకాల సెషన్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. -
విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్
ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పలు స్టార్టప్‌లు (యూనికార్న్‌లు) నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. ‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) సెక్యూరిటీలను లిస్ట్ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది. ధరల స్పీడ్‌కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్ బజాబ్ పేర్కొన్నారు. మార్కెట్లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
బడ్జెట్ రైలు ఏపీలో ఆగేనా!
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత కేంద్ర బడ్జెట్లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. -
ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి
సాక్షి , న్యూఢిల్లీ: కరోనాసంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మెగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. దీంతో లోక్‌సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే : 2020-21 2020-21పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను వీ షేప్ రికవరీ ఉంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 - మార్చి 2022 వరకు) జీడీపి వృద్ధి 11 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని సర్వే సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు, ప్రైవేటు రంగం ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే సిఫారసు చేసింది. కాగా కోవిడ్-19 విస్తరణ, పలువురు సభ్యులకు కరోనా సోకిన ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలను కుదించారు. అలాగే శీతాకాల సమావేశాలను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వే-2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది. రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. ► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ► ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవి. ► స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పుడు మనం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం. ► రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు ► ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలు విజయవంతం. ► పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. ► వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం. ► కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో, ప్రతీసభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా మెరుగైన సౌకర్యాలు పొందుతారు. ► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ యాదృచ్చికంటగా స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరానికి చేరుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరం. ► జాతి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► భారతదేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడటం కోసం వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించాం. ► గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్ల వీరమరణం మరువలేనిది. ► దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకుంటారు. ► కరోనా మహమ్మారి నుంచి ప్రతి పౌరుడిని కాపాడుకుంటూ, ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం. ► ఈ కరోనా టైంలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది. ► కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13వేల కోట్లు బదిలీ ► ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది ► రెండు వ్యాక్సిన్లు కూడా భారత్‌లోనే రూపొందించారు ► కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగం ► కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు ► రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చాం ► కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం ► ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి కోవింద్ ► క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర ప్యాకేజీ వరంగా మారింది ► గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ ధ్యేయం ► రైతుల అభివృద్ధి కోసం కిసాన్ రైలు తీసుకొచ్చాం ► మత్స్యకారుల కోసం కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ► దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు ► జనఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు చౌకగా ఔషధాలు ► వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ► మత్స్యకారుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయం ► 3 వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది ► గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం. దేశానికి ఎంతో పవిత్రమైన జాతీయ జెండాకు అవమానం జరిగింది. ► భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును కల్పించడంతోపాటు చట్టాలను గౌరవించాలని కూడా రాజ్యాంగం బోధిస్తుంది ► ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ► తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ► కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారత్ నిలిచింది. ► ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం. ► సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. ► కరోనాపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. ► సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. ► మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించాం. ► పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమలు చేశాం. ► జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ► ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్ కల్యాణ్ యోజన అమలు చేశాం. ► 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ► దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ► దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి ► ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. ► సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ► కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్. ► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ► దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను పొందవచ్చు. ► దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు. ► కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో చాలా మంది పౌరులను కోల్పోయాము. ప్రధానంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాలంలోనే కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం. కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో 2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం, వాక్సినేషన్, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
వేడెక్కనున్న పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలకు సంఘీభావంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడికి సిద్ధం కావడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా కాంగ్రెస్, ఆప్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన సమావేశాలు వాడీవేడిగా సాగనున్నట్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఉదయం ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగిత రహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్, ఎకనామిక్ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రయివేటు మెంబర్స్ బిజినెస్ కూడా పునరుద్ధరించారు. వర్షాకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సాగగా.. బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు. బడ్జెట్ సమావేశాల్లో వచ్చే బిల్లులు ఇవే.. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆర్డినెన్స్ 2020, మధ్యవర్తిత్వం; సయోధ్య (సవరణ) ఆర్డినెన్స్–2020, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్–2021 తదితర ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్దులను పరిగణనలోకి తీసుకుని స్థాయీ సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15న వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి ప్రహ్లాద్ రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ సహా 16 ప్రతిపక్షాలు ప్రకటించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు అడిగితే దేనిపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన సమయం మేరకు చర్చించేందుకు మేం సిద్ధం. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. ఇలా బహిష్కరించడం అవాంఛనీయం..’అని పేర్కొన్నారు. -
29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.(చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?) కాగా, గత సెప్టెంబర్ 14న ప్రారంభమయిన వర్షాకాల సమావేశాలు ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ముగిసిన సంగతి తెలిసిందే.. ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) -
ఇక ఏకంగా బడ్జెట్ సమావేశాలే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే రైతు నిరసనలకు సంబంధించి వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలతో పాటు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ లేఖకు ప్రతిస్పందనగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి అధిర్ రంజన్ చౌదరికి లేఖ రాశారు. అందులో శీతాకాల సమావేశాల విషయంలో అందరు ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను నిర్వహించరాదని ఏకగ్రీవంగా అందరు నాయకులు అంగీకరించారని పేర్కొన్నారు. జనవరిలో బడ్జెట్ సమావేశాలు.. 2021 జనవరిలో బడ్జెట్ సమావేశానికి అనుకూలమని ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్ చివర్లో కానీ డిసెంబర్ నెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు.