Pedakakani
-
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం ఎదురైంది. అక్రమంగా మైనింగ్ జరుగుతుందంటూ మీడియాను తీసుకొని పెదకాకాని మండలం అనుమర్లపూడికి వెళ్లిన దూళిపాళ్లను అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతితో మట్టి తవ్వుతుంటే అక్రమ క్వారీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గొడవ పెట్టేందుకే ఇక్కడకు వచ్చారా అంటూ దూళిపాళ్లను నిలదీశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో అంతులేని అక్రమాలు చేశారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన) -
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
అక్షరాస్యత, స్వశక్తి ద్వారానే ఆర్థికాభివృద్ధి
పెదకాకాని (పొన్నూరు): అక్షరాస్యత, స్వశక్తిపై జీవనం సాగించేలా ప్రోత్సహించడంపైనే ప్రజల ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ప్రాంగణంలో ప్రొఫెసర్ ఎంఏ విన్‌డ్లీ లీగల్ సర్వీస్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దురదృష్టవశాత్తు పలు విధానాల వల్ల పేదలు ఎటువంటి పరిపుష్టి సాధించకుండా పేదలుగానే మిగిలిపోయారన్నారు. న్యాయ సహాయం కోసం పేదలు ఇప్పటికీ ప్రాధేయపడటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. వీఆర్వో సంస్థ ఆధ్వర్యంలో స్థాపిస్తున్న లీగల్ సర్వీస్ సెంటర్ ద్వారా వాస్తవ లబ్ధిదారులకు అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందాలన్నారు. తొలుత జస్టిస్ బట్టు దేవానంద్ చేతుల మీదుగా శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో వీఆర్వో సంస్థ గ్రామ శాఖ ప్రెసిడెంట్ సిస్టర్ క్లీటస్‌డైసీ, సెక్రటరీ ఫాదర్ ధన్పాల్, విశ్రాంత ఐఏఎస్, గవర్నింగ్ బోర్డు సభ్యుడు డాక్టర్ టి.గోపాలరావు, నందిగామ సివిల్ జ్యుడిషియల్ జడ్జి జేసురత్నం, సంస్థ ట్రెజరర్ కవితా డేవిడ్, బాలస్వామి పాల్గొన్నారు. -
ఇన్స్టాగ్రామ్ ఆధారంగా దారి దోపిడీ దొంగ అరెస్టు
పెదకాకాని: జాతీయ రహదారిపై దారిదోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. పెదకాకాని పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన నామాల సతీష్ అతని తండ్రి రామకృష్ణారావులు నవంబరు 18న తెనాలి మండలం కొలకలూరి గ్రామంలో మేనత్త ఇంట జరుగుతున్న కార్తీకవ్రతం కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో ఇరువురూ స్కూటీపై బయలు దేరారు. తక్కెళ్ళపాడు మానస సరోవరం సమీపంలో హైవే ఎక్కేందుకు స్పీడ్ బ్రేకర్లు దాటుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన యర్రంశెట్టి శివకోటేశ్వరరావు, షేక్ షరీఫ్‌లు వారి పల్సర్ బైక్‌తో స్కూటీని ఢీ కొట్టారు. స్కూటీపై ఉన్న వారు కింద పడి దెబ్బలు తగలడంతో వారిని బెదిరించి రామకృష్ణారావు వద్ద ఉన్న రూ. 4000 రూపాయలు నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారీ అయ్యారు. ఈ సమయంలో సతీష్ బైక్ నంబరు గుర్తించడంతో పాటు నిందితుణ్ణి పరిశీలించాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సతీష్‌ను విదేశాలకు పంపించే ప్రయత్నంలో పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే విరమించుకున్నారు. ఇన్స్టాగ్రామ్ చూడడం అలవాటు ఉన్న సతీష్‌కు ప్రెండ్ రిక్వెస్ట్‌లో నిందితుణ్ణి గుర్తించాడు. తండ్రికి చూపించడంతో అతనేనని ధృవీకరించాడు. ఈనెల 10వ తేదీన పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన వివరించాడు. బాధితుడు సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన నిందితుడు యర్రంశెట్టి శివకోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని అతను ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. హైవేలపై చీరీలకు పాల్పడుతున్న నిందితుడు శివకోటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని సీఐ బి సురేష్‌బాబు తెలిపారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ రాజేంద్ర, కానిస్టేబుళ్లు టి శ్యాంసన్, యానాదిలను అభినందించారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
తల్లితో సహజీవనం.. కుమార్తెపై ఘాతుకం
సాక్షి, పెదకాకాని(పొన్నూరు): ఓ కామాంధుడు కూతురు వరసైన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు, బాలి క తల్లి కథనం మేరకు.. పెదకాకాని ఎన్టీఆర్ కాలనీకి చెందిన దానమ్మ తన కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. కుమార్తెను తన వద్దే ఉంచుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుమారు పదేళ్ల క్రితం దానమ్మకు రాయపూడి జోజిబాబుతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటికే పెళ్లయి భార్యాపిల్లలను వదిలివేసిన జోజిబాబు దానమ్మతో సహజీవనం ప్రారంభించి ఎన్టీఆర్ కాలనీలోనే కాపురం పెట్టాడు. జోజిబాబు, దానమ్మకు మరో ఇద్దరు సంతానం కలిగారు. దానమ్మ మొదటి సంతానం కుమార్తె ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది. ఆ బాలికపై కన్నేసిన జోజిబాబు మాయమాటలుచెప్పి ఆదివారం ఎన్టీఆర్ కాలనీకి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన పాప జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో దానమ్మ తన కుమార్తెపై జోజిబాబు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆదివారం రాత్రి బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. చదవండి: (సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య) -
పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు. -
రూ.10 కోట్ల భూకుంభకోణం.. జనసేన నాయకుడి అరెస్ట్
గుంటూరు: పెదకాకాని మండలం అగంతవరప్పాడులో 10 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం కేసులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టివాసు సహా ఏడుగురిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా మరో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. అగతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. 2012లో నారాయణమ్మ చనిపోగా, శివసాగర్ కూడా కొద్దికాలానికి మరణించాడు. ఇదే అదునుగా భూమిని కాజేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజం కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొబ్బా వెంకటేశ్వరరావు, కోమలి, రాఘవ పాత్ర ఉన్నట్టు తెలడంతో వారిని అరెస్ట్ చేశారు. -
పదవి భార్యది.. సర్పంచ్ కుర్చీ భర్తది!
పెదకాకాని (పొన్నూరు): గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్ మండే మాధవీలతకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆమె భర్త నాగేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో డీపీవో కేశవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు గెలుపొందిన పంచాయతీల్లో వాళ్లే సర్పంచ్ స్థానాల్లో కూర్చోవాలని.. ఎట్టిపరిస్థితిలోనూ వాళ్ల భర్తలకు పెత్తనం ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా చెప్పారు. అయితే అధికారుల ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయకుండా పెదకాకాని పంచాయతీలో మహిళా సర్పంచ్ అధికారాన్ని ఆమె భర్త లాక్కోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. -
మంచినీళ్లు అడిగి బాలుడిని ఎత్తుకెళ్లారు
పెదకాకాని (పొన్నూరు): దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు అడిగిన ఆగంతకులు ఇంట్లో బాలుడిని ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో బుధవారం చోటుచేసుకుంది. నంబూరు శివదుర్గ కాలనీ (యానాది కాలనీ)లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తొలుత కత్తి సీమోన్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి వెళ్లి కారు టైర్ పంక్చరైందని.. దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇవ్వాలని అడిగారు. వారికి చెంబుతో నీళ్లు ఇచ్చిన సీమోన్ ఆ తరువాత ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తరువాత కొద్దిదూరంలో ఉన్న మాణికల బాల ఇంటికి వెళ్లి తాగడానికి నీరు ఇవ్వాలని వాటర్ బాటిల్ ఇచ్చారు. బాల ఇంట్లోకి వెళ్లి వాటర్ బాటిల్లో నీరు నింపుతుండగా.. ఆమె రెండేళ్ల కుమారుడు జీవా ఆడుకునేందుకు బయటకు వచ్చాడు. ఆగంతకులు ఆ బాలుడిని తీసుకుని కారులో పారిపోయారు. బాల ఏడుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమికూడారు. సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ యు.శోభన్‌బాబు, ఎస్ఐ వై.వినోద్‌కుమార్ కాలనీకి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవనం సాగించే మాణికల ముసలయ్య, బాల దంపతులకు రెండేళ్ల జీవా, ఏడేళ్ల పాప ఉన్నారు. -
బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం
గుంటూరు: టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సీతారావమ్మ(80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె... గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో మరణించారు. కాగా శనివారం సీతారావమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక మాస్ మహారాజ్ రవితేజ.. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను అనతికాలంలోనే మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తులసి, సింహ, దమ్ము, లెజెండ్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. గతేడాది వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో బోయపాటి బిజీగా ఉన్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
సాక్షి, అమరావతి: దళితుల వల్లే దరిద్రం అని అహంకారంగా మాట్లాడిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న చినకాకాని మహిళా ఎస్సై అనూరాధను ఉద్దేశించి అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజా ప్రతినిధులు దళితులపై రకరకాల పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, వ్యంగ్యంగా మాట్లాడినా చర్యలు తీసుకున్న సందర్భాలు లేనందునే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎస్సైకి తగిన రక్షణ కల్పించి, భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మల దగ్ధం తెనాలి : దళిత ఎస్ఐ విధులను ఆటంకపరుస్తూ ‘దళితుల వలన ఈ దరిద్రం పట్టింది’ అంటూ దళితులను కించపరచేలా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలకు నిరసనగా, దీనిని ఖండించని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మలను పట్టణ గాంధీచౌక్‌లో గురువారం దహనం చేశారు. టీడీపీ పల్నాడులో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం, న్యాయవిభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లాలోని పెదకాకాని ఎస్ఐ అనూరాధ విధుల్లో ఉండగా, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి వనితలు పరుష పదజాలంతో దూషించి దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని మండల తహసీల్దార్, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో అందజేశారు. పార్టీ ఎస్సీ విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు కనపర్తి అనిల్, రాష్ట్ర కార్యదర్శి కె.దేవయ్య, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎం విల్సన్, డి.మల్లికార్జునరెడ్డి, జె.ఎలిజబెత్ రాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాదరావు, కొమ్ము రాయల్ పాల్గొన్నారు. దళితులకు క్షమాపణ చెప్పాలి తెనాలి టౌన్ : దళిత ఎస్ఐ విధులకు ఆటకం కలిగిస్తూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావూరి రవిబాబు (జెవీఆర్) గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. రాజకుమారి దళితులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దేవయ్య డిమాండ్ చేశారు. రాజకుమారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మహిళా ఎస్ఐని అవమానించిన మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంతేటి యలమందరావు డిమాండ్ చేశారు. గురువారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీఐ యు.శోభన్‌బాబును కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐపై రాజకుమారి బృందం వేలు చూపిస్తూ అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కుక్కల రాంప్రసాద్, కూరపాటి సరస్వతి, బెజ్జం గోపి, బండి ప్రసాద్, బండ్లమూడి బానుకిరణ్, పాటిబండ్ల విల్సన్‌బాబు తదితరులు ఉన్నారు. ఆళ్లమూడిలో నిరసనలు భట్టిప్రోలు: నన్నపనేని రాజకుమారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతర రాజకుమారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యదర్శి పంతగాని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సాటి మహిళ అని చూడకుండా పెదకాకాని మహిళా ఎస్ఐ అనూరాధపై దుర్భాషలాడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాంచారయ్య, ప్రవీణ్‌కుమార్, వెంకట్రావు, అశోక్, ప్రశాంత్‌రాజ్, చంటి పాల్గొన్నారు. పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని కోళ్లపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో నాగరాజు, చీకటి నాగేశ్వరరావు, బుస్సా మణేశ్వరరావు, ఎన్ నాగరాజు, దోవా సంసోన్, సూర్యచంద్రరరావు పాల్గొన్నారు. రాజకుమారి ఇలా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: నోరు పారేసుకున్న నన్నపనేని) -
బెట్టింగ్‌లో ఓటమి.. గుండెపోటుతో మృతి
సాక్షి, గుంటూరు(పెదకాకాని) : గుంటూరులో పెదకాకాని రోడ్డులోని హెచ్ఆర్సీ క్లబ్లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందేల నిర్వహణ క్లబ్లో బెట్టింగ్ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి పెదకాకాని వెళ్లే రోడ్డులో గత కొన్నేళ్లుగా గుర్రపు పందేలు (హార్స్ రేసింగ్ క్లబ్) ఆడుకునే సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రధాన నగరాలలో నిర్వహించే గుర్రాల పందేలు ఈ క్లబ్లో ఏర్పాటు చేసిన డిస్ప్లేపై కనిపిస్తుంటాయి. తమ డబ్బులను కాయిన్లుగా మార్చుకుని పందేలు కాసుకుంటూ ఉంటారు. తెనాలి తాలూకా చినరావూరు గ్రామానికి చెందిన శ్రీదర్ అలియాస్ రమేష్ గుర్రుపు పందేంలో రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి పెదకాకాని ఎస్ఐ కె. ఆరోగ్యరాజు సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
పత్తిగోదాంలో అగ్నిప్రమాదం: భారీగా ఆస్తినష్టం
గుంటూరు జిల్లా: పెదకాకానిలోని వాసవీనగర్‌లో ఉన్న ఓ పత్తి గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల్లో దాదాపుగా పత్తి బేళ్లన్నీ దగ్ధమవుతుండటంతో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండవచ్చునని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం
పెదకాకాని: పేదవాళ్లు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని సీఎం ఎన్. చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని స్వస్థిశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెదకాకాని స్వస్థిశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఇక్కడ మంచి సందేశంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడమే నిజమైన సేవన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మదర్ థెరిస్సా, సిస్టర్ నిర్మల చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలని క్రిస్మస్ కానుక అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. క్రిస్టియన్ సంక్షేమం కోసం రూ.57 కోట్లు కేటాయించామన్నారు. బెత్లెహోం వెళ్లేవారికోసం ప్రస్తుతమిచ్చే రూ.20 వేలను రూ.40 వేలకు పెంచినట్టు ప్రకటించారు. అలాగే చర్చి నిర్మించుకునే వారికిస్తున్న రూ.లక్షను రూ.3 లక్షలకు పెంచినట్టు తెలిపారు. అందరూ శాంతి, దయ, ఆప్యాయత కలిగి ఉండాలని సూచించారు. ఆ యేసుప్రభువు ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నారు. ‘యెహోవా నేను బ్రతికియుండు దినములన్నియు కృపాక్షేమములే’’ అని బైబిల్ వాక్యాన్ని ఆయనీ సందర్భంగా భక్తులకు చదివి వినిపించారు. తిరుపతిలో 99వ ఆర్థిక సంఘం సదస్సు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జాతీయ స్థాయిలో జరిగే 99వ భారత ఆర్థిక సంఘం (ఐఈఏ)వార్షిక సదస్సులకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు శ్రీవేంకటేశ్వర వర్సిటీలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో ఈ సదస్సులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, అంతర్జాతీయ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ కౌశిక్‌బసు ఈ సదస్సులను ప్రారంభించనున్నారు. -
సెల్ టవర్ దిగిన సంజీవరావు
-
సెల్ టవర్ దిగిన సంజీవరావు
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా పెదకాకానిలో సెల్ టవర్ ఎక్కిన ఎం. సంజీవరావు ఎట్టకేలకు మెత్తబడ్డారు. జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో సంజీవరావు ఆదివారం రాత్రి సెల్ టవర్ దిగాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ సంజీవరావు శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కారు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రి నుంచి ప్రయత్నించినా అతడు కిందకి దిగలేదు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. సంజీవరావు ఓ వేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు పోలీసులు వలలు ఏర్పాటు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో సంజీవరావు కిందకి దిగారు. -
ప్రత్యేక హోదా కోసం సెల్ టవర్ ఎక్కాడు
గుంటూరు : 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే కిందకు దిగి వస్తా... ఎవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే దూకేస్తా' ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఓ వ్యాపారి డిమాండ్. గుంటూరు నగరంలోని సీతానగరంకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ శనివారం నగరం సమీపంలోని వాసవీనగర్‌లో ఓ సెల్ టవర్ ఎక్కాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే దిగుతానని పెకైక్కి కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. టవర్‌పైనున్న వ్యక్తి కిందకు దూకితే కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. (పెదకాకాని) -
రోకలిబండతో మోది భార్య హత్య
పెదకాకాని అనుమానం పెనుభూతమైంది. కసిపెంచుకున్న భర్త నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో మోది కిరాతకంగా హతమార్చిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రం పెదకాకానిలోని అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో పల్లె ఉలిక్కిపడింది. ఏంజరిగిందో తెలుసుకునేసరికే మంచంపై రక్తపుమడుగులో పిచ్చమ్మ(50) శాశ్వత నిద్రలోకి జారుకోగా.. ఆమె భర్త నిరంతరావు ‘నేనే చంపానంటూ’ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌నగర్‌లో మాతంగి నిరంతరావు, పిచ్చమ్మ అలియాస్ సౌభాగ్యమ్మ దంపతులు నివశిస్తున్నారు. నిరంతరావు ఆటోనగర్‌లో బల్ల రిక్షా బాడుగకు తిప్పుతుండగా, పిచ్చమ్మ కూలి పనులకు వెళుతుంది. వారికి ఇద్దరు కుమారులు మరియదాసు, నరసింహారావు, ఇద్దరు కుమార్తెలు చంద్రమ్మ, మరియమ్మ ఉన్నారు. నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు స్థానికంగానే నివాసం ఉంటున్నారు. మరియమ్మకు భర్త చనిపోవడంతో ఇద్దరు సంతానంతో తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిమందు పూరింట్లో ఓ భాగంలో నివసిస్తోంది. మరియదాసు కుటుంబం మరోభాగంలో ఉంటోంది. నిరంతరావు ఈ మధ్యకాలంలో తన భార్య పిచ్చమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో భార్య నిద్రలో ఉండగా.. అర్ధరాత్రి భర్త నిరంతరావు రోకలిబండ తీసుకుని తలపై గట్టిగా మోదడంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. అదే ఇంట్లో నిద్రిస్తున్న మనవడు ప్రశాంత్ భయంతో ఎదురుగా పూరింట్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పరుగుతీశాడు. వారు వచ్చి చూసేసరికి మంచంపై పిచ్చమ్మ రక్తపు మడుగులో మృతిచెంది ఉంది. అప్పుడే బయటకు వెళ్లిన నిరంతరావు నేరుగా పెదకాకాని పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను చంపానంటూ లొంగిపోయాడు. సోమవారం ఉదయం గుంటూరు అర్బన్ జిల్లా నార్త్ జోన్ (మంగళగిరి) డీఎస్పీ ఎం.మధుసూదనరావు, సీఐ కొకా శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
3 కోట్ల భూకుంభకోణం: రెవెన్యూ అధికారి అరెస్టు
పెదకాకాని భూ కుంభకోణం కేసులో రెవెన్యూ అధికారి చంద్రశేఖరరాజును పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పెదకాకాని తహసీల్దారుగా పనిచేసిన చంద్రశేఖరరాజును అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రశేఖరరాజును ఈ ఆక్రమణల కేసులోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆక్రమణలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. దాదాపు మూడుకోట్ల రూపాయల విలువైన అసైన్మెంట్ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసి, వాటిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
పెదకాకాని, న్యూస్‌లైన్: హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తూ విటులను నగ్నంగా ఫోటోలు తీసి.. వారిస్థాయిని బట్టి బ్లాక్మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకునే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన గోపు కృష్ణ అలియాస్ కృష్ణయ్య, పోకూరి లక్ష్మణాచారి అలియాస్ లక్ష్మణ్, గోపు ఉమలు ముఠాగా ఏర్పడి హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణ తేలిగ్గా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వ్యభిచార వృత్తిని ఎంచుకొని కొనసాగిస్తున్నాడు. మహిళలతో పరిచయం పెంచుకుని తనకు తెలిసిన విటుల వద్దకు పంపింస్తుంటాడు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడొకరు కృష్ణకు పరిచయమయ్యాడు. ఆ వైద్యునికి అమ్మాయి ఉందని చెప్పి రూ.20 వేలు తీసుకున్నాడు. కృష్ణ పెదకాకాని సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో ఉంటున్న తన రెండో భార్య ఉమ వద్దకు ఆ వైద్యుడ్ని పంపించాడు. ఇద్దరూ లోపల ఉన్న సమయంలో ముందస్తు పథకంలో భాగంగా కృష్ణ, లక్ష్మణాచారిలు తలుపుకొట్టి లోపలకు వెళ్లారు. నగ్నంగా ఉన్న ఇద్దరి ఫొటోలు తీసి.. నా భార్య వద్దకు ఎందుకు వచ్చావంటూ లక్ష్మణాచారి బెదిరింపులకు దిగాడు. నగ్నంగా ఉన్న ఫొటోలను నీ భార్యకు పంపిస్తామని ఆ వైద్యుడ్ని బ్లాక్మెయిల్ చేసి రెండు విడతలుగా రూ.2.30 లక్షలు వసూలు చేశారు. ఈ నెల ఒకటో తేదీ మళ్లీ ఆ వైద్యుడ్ని బెదిరించి రూ.22.70 లక్షలకు చెక్కులు రాయించుకున్నారు. దీంతో బాధిత వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం.. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.2.30 లక్షల నగదు, రూ.22.70లక్షలకు చెక్కులు, హుందాయ్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంతో చొరవచూపిన సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ ఏడీ కోటేశ్వరరావు, బెల్లంకొండ గురవయ్య, బుల్లిబాబు, కృష్ణ, శ్రీనులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ డి.సూర్యశ్రావణ్, సీఐ కె శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన కృష్ణపై ఇదే వ్యవహారంలో గుంటూరు, విజయవాడ, వినుకొండ పోలీసుస్టేషన్లలో పెండింగ్ కేసులు ఉన్నాయి. బాధిత వైద్యుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. -
వైఎస్ పథకాలు జగన్‌తోనే సాధ్యం
పెదకాకాని, న్యూస్‌లైన్ :రాష్ట్రాభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆలోచనలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమవుతాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. పెదకాకానిలో ప్రారంభమైన గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం ఆదివారం మూడో రోజుకు చేరింది. కార్యక్రమానికి అయోధ్యరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాతూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించి 2004 ఎన్నికలకు ముందు అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించారని గుర్తుచేశారు. రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా.. పార్టీ అధిష్టానం మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆయన కుటుంబానికి మన కుటుంబం అండగా వుండాలని తన తల్లిదండ్రులు కోరారని ఆళ్ల చెప్పారు. తన తమ్ముడు ఆర్కే తొలి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు దశరథరామిరెడ్డి, వీరరాఘవమ్మలు వృద్ధాప్యంలో ఉండి కూడా ‘మా గ్రామాన్ని మేం అభివృద్ధి చేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పేదల అభ్యున్నతి కోసం తపించే వైఎస్ జగన్ కుటుంబానికి ఆళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పెదకాకాని పంచాయతీ ఎన్నికల్లో అమ్మను భారీ మెజారిటీతో గెలిపించినవిధంగానే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటరమణ మాట్లాడుతూ పెదకాకానిలో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్ జగన్అధికారంలోకి రావడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. సమైక్యాంధ్రకు అం డగా ఉంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేవిధంగా గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. తొలుత పెదకాకాని సెంటర్లోని శ్రీ పేరంటాళ్ళమ్మ ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా పాతూరు చేరుకున్నారు. పాతూరులో ముస్లిం మైనార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం ప్రారంభించారు. సర్పంచి ఆళ్ళ వీరరాఘవమ్మ, మాజీ సర్పంచి ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షురాలు జొన్నల ఉషారాణి, వెనిగండ్ల సర్పంచి కాట్రోత్ తులసీబాయి, అగతవరప్పాడు సర్పంచి ప్రభాకర్, మాజీ ఎంపీపీ దోసపాటి నాగేశ్వరరావు, శివాలయం మాజీ చైర్మన్ కొండా సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
సువార్తతో శుభాశీస్సులు
పెదకాకాని, న్యూస్‌లైన్ :ఆత్మీయ అలంకారంతోనే ప్రతిఒక్కరూ పరలోకరాజ్యంలోకి ప్రవేశిస్తారని బైబిల్‌మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్ పేర్కొన్నారు. మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 76వ బైబిల్ మిషన్ మహాసభలు రెండవరోజు మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ దైవత్వం విడిచి ఏసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఉదయించారన్నారు. సకల జనులకు క్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం అందించేందుకే ఏసు శిలువ యాగం భరించారన్నారు. లోకరక్షకుడైన ఏసు మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. ఏసుప్రభువు సువార్తను బైబిల్‌మిషన్ అనే పల్లకీలో మోయడం ద్వారా లోకమంతటికీ శుభవార్త అందినట్లేనన్నారు. సుమారు వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రపంచ శాంతికోసం భక్తులు ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు.. బైబిల్‌మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ ఎన్.సత్యానందం, సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.ఏసురత్నం, రెవరెండ్ సీహెచ్ దేవదాసు, రెవరెండ్ డాక్టర్ ఎన్.షారోనుకుమార్లు వాక్యోపదేశం చేశారు. స్త్రీల సభల కన్వీనర్ జె.ప్రమీలాసెల్వరాజ్ బృందం స్తుతిగీతాలను ఆలపించారు. మహోత్సవాలకు హాజరైన భక్తులకు ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. వాలంటీర్లు బోజన పదార్థాల తయారు, వడ్డనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్టీసీ, రైల్వేశాఖల అధికారులు సభల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. నేటితో ముగియనున్న మహోత్సవాలు.. బైబిల్ మిషన్ మహోత్సవాలు బుధవారంతో ముగుస్తాయని కన్వీనర్ రెవరెండ్ జె.శ్యామ్యూల్ కిరణ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని ఆయన వివరించారు. పాల్గొన్న ప్రముఖులు.. సాక్షి, గుంటూరు: బైబిలు మిషన్ మహాసభల్లో మంగళవారం కేంద్రమంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవజనులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ మోదుగల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మేల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, రిజిస్ట్రార్ బాలస్వామిలు కూడా పాల్గొని ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు.